బ్యూటిప్స్
బాదం పప్పును నానబెట్టి ఒలిచి హల్వాల్లో వేసుకుంటాం. ఆ పొట్టును పారేస్తుంటాం. ఆ పొట్టును ఒంటికి రుద్దుకుంటే శరీరం మెరుపు సంతరించుకుంటుంది. జుట్టురాలడం తగ్గాలంటే రోజూ పరగడుపున ఒక టే బుల్ స్పూన్ దోరగా వేయించిన నువ్వులు, చిన్న బెల్లం ముక్కతో కలిపి తినాలి. నువ్వులను దోరగా వేయించి చల్లార్చి డబ్బాలో నిల్వ చేసుకుంటే రోజూ వేయించుకునే బాధ తప్పుతుంది.
కాళ్ల పగుళ్లు తగ్గాలంటే అలొవెరా (కలబంద)ఆకు జిగురును రాయాలి. ఆకును విరిచి నేరుగా కాలికి రాసుకోవచ్చు లేదా మెత్తగా గ్రైండ్ చేసుకుని వాడుకోవచ్చు. గోళ్లు పెళుసుబారి విరుగుతుంటే, నిమ్మకాయ తొక్క రుద్దాలి. మోచేతి నలుపు పోవడానికి కూడా నిమ్మతొక్క బాగా పని చేస్తుంది.