Almonds
-
‘మమ్రా’ బాదం గురించి తెలుసా? అంత స్పెషల్ ఏంటో?
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. బాదంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి, బాదంపప్పులో ఉండే పోషకాలు, విటమిన్లు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగ పడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సౌందర్యానికి, రోగ నిరోధకశక్తికి చాలా అవసరం. అయితే బాదం పప్పు రకాల గురించి తెలుసా? అవేంటో తెలుసుకుందామా.!మార్కెట్లో మమ్రా ,కాలిఫోర్నియా బాదంతో సహా వివిధ రకాల బాదంపప్పులు అందుబాటులో ఉన్నాయి. బట్ బాదం ,కార్మెల్ బాదం, నాన్పరెయిల్ బాదం,గుర్బండి బాదం,స్వీట్ బాదం,పీర్లెస్ బాదం, గ్రీన్ బాదం మార్కోనా బాదం ఇలా 14 రకాలు ఉన్నాయి. వవీటిల్లో మమ్రా ,కాలిఫోర్నియా ఆల్మండ్స్ అనే ప్రధానమైనవి. ఈ రెండూ రుచికరమైనవీ, పోషకాలతో నిండి ఉన్నవే. అయితే, ఈ రెండింటి మధ్య కొన్ని కీలకమైన తేడాలు ఉన్నాయి. మమ్రా బాదం: "రాయల్ బాదం" అని కూడా పిలుస్తారు, మమ్రా బాదం మధ్యప్రాచ్యానికి చెందినది మరియు కొన్ని శతాబ్దాల తరబడి సాగు చేయబడుతోంది. కాలిఫోర్నియా బాదం: ఇది అమెరికాకు చెందినది. కాలిఫోర్నియా బాదంపప్పును 19వ శతాబ్దంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో మొదటిసారిగా సాగు చేశారు. అనుకూలమైన వాతావరణం ,ఆధునిక వ్యవసాయ పద్ధతులు కాలిఫోర్నియాను ప్రపంచంలోనే అతిపెద్ద బాదం ఉత్పత్తిదారులలో ఒకటిగా మార్చాయి.రుచి, ఆకృతిలోనూ మమ్రా ,కాలిఫోర్నియా రకాలు మధ్య తేడాలున్నాయిమమ్రా బాదం మంచి సువాసనతో పెద్దగా ఉంటాయి. వీటిల్లో నూనె శాతం కూడా ఎక్కువే. మృదువుగా, విలక్షణమైన రుచితో ఎక్కువ క్రీమీగా ఉంటాయి కాలిఫోర్నియా బాదంపప్పులు చిన్నవిగా ఉంటాయి. నూనె శాతం తక్కువ . అందుకే రుచిలో కొంచెం తక్కువగా, క్రంచీగా ఉంటాయి. ప్రాసెసింగ్ పద్ధతులుమమ్రాం బాదంను చేతితో ప్రాసెస్ చేస్తారు. అందుకే ఇవిఎక్కువ నాణ్యంగా ఉంటాయి. సహజ రుచి ,ఆకృతిని పాడుకాకుండా ఉంటాయికాలిఫోర్నియా బాదం: సాధారణంగా ఆధునిక యంత్రాలను ఉపయోగించి ప్రాసెస్ చేస్తారు. కనుక కొద్దిగా రుచినీ ఆకృతిని కోల్పోతుంది. అయినప్పటికీ, ఇది ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి పెద్ద ఎత్తున ఉత్పత్తి అవుతోంది.పోషక విలువలుమమ్రా , కాలిఫోర్నియా బాదం రెండూ విటమిన్లు, ఖనిజాలు , ఆరోగ్యకరమైన కొవ్వులకుఅద్భుతమైన మూలాలు, కానీ కొన్ని తేడాలు ఉన్నాయి:మమ్రా బాదం పెద్దగా, నూనె కంటెంట్ ఎక్కువ గనుక పోషక-సాంద్రత కలిగి ఉంటాయి. మమ్రా బాదంతో పోలిస్తే కాలిఫోర్నియా బాదంలో పోషక సాంద్రత కొంచెం తక్కువ. ధరలుమమ్రా బాధం ధర కిలో సుమారు రూ. 4000కాలిఫోర్నియా బాదం ధర కిలో సుమారు రూ. 1100 -
హెల్త్ ఫ్యాక్ట్: నాన్‌వెజ్ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..?
మాంసాహారం తిన్న తర్వాత కొన్ని బాదం పలుకులు తినడం వల్ల ఓ ప్రయోజనం ఉంది. కొవ్వుల కారణంగా జరిగే అనర్థాల్ని తగ్గించడం ద్వారా అవి కరోనరీ గుండెజబ్బులనూ నివారిస్తాయి.బాదంలోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ఆ మాటకొస్తే మామూలు సమయాల్లో బాదం తినడం వల్ల కూడా చాలా మేలు కలుగుతుంది. వీటిలోని క్యాల్షియమ్ ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అంతేకాదు... ఆహారనాళాన్నీ ఆరోగ్యంగా ఉంచడం లో బాదం తోడ్పడుతుంది. గుండెకూ మేలు చేస్తుంది.ఇవి చదవండి: ‘ఆరుద్ర’ను చూస్తే అనువైన వరుడు.. -
బాదం పప్పులు మంచివని తినేస్తున్నారా?
శారీరకంగా మానసికంగా మంచి ప్రయోజనకారి ఈ బాదంపప్పులు. డ్రై ఫ్రూట్స్‌లో ది బెస్ట్ ఇవి. వీటిలో విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు అదుపులో ఉండటమే గాక మెదడుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గరిష్ట ప్రయోజనాలు పొందాలనుకుంటే మోతాదుకు మించకుండా తీసుకువాల్సిందే. ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అత్యంత పోషకమైన ఆహారాన్ని అధికంగా తీసుకుంటే మాత్రం సమస్యలు ఫేస్ చేయాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువల్ల వీటిని రోజుకు ఎన్ని బాదంపప్పులు తీసుకుంటే మంచిది? ఎలా తీసుకోవాలి? తదితర విశేషాలు తీసుకుందాం!. దుకాణాల్లో సులభంగా కొనుగోలు చేయగలిగేవి ఈ బాదంపప్పులు. అదీగాక మార్కెట్లో బాదం పప్పులు బాదం పాలు, నూనె లేదా పౌడర్ రూపంలో లభిస్తున్నాయి కూడా. ఇవి స్థూల పోషకాలతో పాటు అధిక పోషకాల ప్రోఫైల్‌ను కలిగి ఉన్నాయి. దీనిలో రాగి, మాంగనీస్, విటమిన్ బీ2 లేదా రెబోప్లావిన్న్లు ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని, నరాల వాపును తగ్గిస్తుంది. అయితే దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలనే దానిపై చాలామందికి స్పష్టత లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..అల్పాహారంగా బాధంపప్పు తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ రోజు క్యాలరీలను ఖర్చే చేసే దాన్నిబట్టి తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే.. క్యాలరీ నియంత్రింత ఆహారంలో భాగంగా తీసుకుంటేనే దీని ప్రయోజనాలన్నింటిని పొందగలరు. ముఖ్యంగా పెద్దలు ప్రతిరోజూ 20 నుంచి 23 బాదంపప్పులు తీసుకుంటే సరిపోతుంది. ప్రతీరోజూ 30 నుంచి 35 గ్రాములు బాదం తినడం వల్ల లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడమే గాక సెంట్రల్ అడిపోసిటీ లేదా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు రోజూకి 84 గ్రాముల బాదంపప్పును తక్కువ కేలరీల ఆహారంలో భాగంగా తీసుకుంటే సమర్థవంతంగా బరువు తగ్గినట్లు పరిశోధనలో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల విషయానికి వస్తే..పసిపిల్లలు (1-3 సంవత్సరాలు):రోజూకి 3-4 బాదంపప్పులు తీసుకుంటే మంచిది. పెద్ద పిల్లలైతే (వయసు 9-18 ఏళ్లు) రోజుకు ఎనిమిది నుంచి 10 బాదం పప్పులు తీసుకుంటే మంచిది. వీటిని ఆహారంగా తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిగణలోనికి తీసుకుని వైద్యుల సలహ మేరకు తీసుకుంటేనే మంచిది. అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు.. దాదాపు 100 గ్రాముల బాదంపప్పు మనకు 50 గ్రాముల కొవ్వును అందిస్తుంది. అందులో గణనీయంగా మోనోశాచురేట్ కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అలా డైలీ తీసుకుంటే మాత్రం కేలరీలు బర్న్ అవ్వక విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అధికంగా తీసుకుంటే శరీరంలో కొవ్వు నిల్వలు ఉండేందుకు దారితీస్తుంది కూడా. అధికంగా తీసుకున్నవారికి మలబద్దకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవ్వుతాయి. బాదంపప్పులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అధిక పీచు పదార్థం కూడా హానికరమే. దీనికి తగ్గటు అధికంగా నీరు తీసుకోకపోతే అజీర్తికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు. కొన్ని బాదంపప్పులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటే అతిసారం, బలహీనత, అస్పష్టమైన దృష్టి లోపం వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బాదంపప్పులు ఎక్కువ తిన్నవారికి శరీరంలో కాల్షియం ఆక్సలేట్లు ఎక్కువయ్యి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బాదంపప్పులో ఆక్సలేట్లు పుష్కలంగా ఉంటాయి. అవి అంత ఈజీగా శరీరంలో శోషించబడవు. (చదవండి: సూసైడ్ హెడేక్! నరకాన్ని తలిపించేంత భయానక 'తలనొప్పి'! తట్టుకోవడం ఎవరీ తరం కాదు!) -
Recipe: కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్.. నోరూరించే పన్నీర్ హల్వా తయారీ ఇలా
స్వీట్‌ను ఇష్టంగా తినేవారు ఇలా పనీర్ హల్వా ఇంట్లోనే తయారు చేసుకోండి. పనీర్ హల్వా తయారీకి కావలసినవి: ►పనీర్ తురుము – 500 గ్రాములు ►బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష – 30 గ్రాముల చొప్పున ►నెయ్యి – పావు కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) ►పాలు – 200 మిల్లీలీటర్లు ►కోవా – 200 గ్రాములు ►కుంకుమపువ్వు – 1/4 టీస్పూన్ ►బెల్లం కోరు – 100 గ్రాములు ►ఏలకుల పొడి – 1/4 టీస్పూన్ ►పిస్తా – గార్నిషింగ్ కోసం తయారీ: ►ముందుగా బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను 1 టేబుల్ స్పూన్ నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం సగం నెయ్యి వేసి.. పనీర్ తురుముని దోరగా వేయించాలి. అందులో పాలు పోసి.. గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ►పాలు దగ్గర పడగానే.. కోవా, కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి. ►అనంతరం బెల్లం కోరు, ఏలకుల పొడి వేసి.. తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడే సమయానికి మిగిలిన నెయ్యి కూడా వేసి కాసేపు.. గరిటెతో అటు ఇటు తిప్పి.. చివరిగా నేతిలో వేగిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేసి కలపాలి. ►సర్వ్ చేసుకునేముందు పిస్తా ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది పనీర్ హల్వా. ఇవి కూడా ట్రై చేయండి: Malpua Sweet Recipe: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పాలు.. మాల్ పువా తయారీ ఇలా Kova Rava Burfi Sweet Recipe: నోరూరించే కోవా రవ్వ బర్ఫీ తయారీ.. -
Health: రాత్రి నానపెట్టి కిస్మిస్లను పరగడుపున తింటే! అందులోని లైపేజ్ వల్ల
డెంగ్యూ, టైఫాయిడ్, ఇతర వైరల్ ఫీవర్ల బారిన పడిన వారు నీరసం తగ్గి త్వరగా కోలుకునేందుకు పోషకాహార నిపుణులు సూచిస్తోన్న ఆహార చిట్కాలు. రాగులు రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల రాగులతో చేసిన వంటకాలను అల్పాహారంగా తీసుకోవాలి. రాగులతో చేసిన దోశ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడడంతోపాటు, రాగుల్లో ఉన్న పాలీఫీనాల్స్ డయాబెటిక్ రోగుల్లో గ్లైసిమిక్ స్పందనలను తగ్గిస్తాయి. రాగుల్లో ఉన్న క్యాల్షియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రాగుల్లో అధికంగా ఉండే ఐరన్ జీవక్రియలను మెరుగు పరిచి ఎర్ర రక్తకణాలకు పోషకాలను అందిస్తుంది. అందువల్ల రాగి జావ, రాగి రొట్టెలు చాలా మంచిది. బెల్లం బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి అధికంగా ఉంటాయి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, ఈ, డీ, కే, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి భోజనం తరువాత తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడడమేగాక, ఎముకలు దృఢంగా తయారవుతాయి. బాదం, కిస్మిస్ బాదం పప్పులు, కిస్మిస్లను రాత్రి నానపెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి. నానపెట్టిన కిస్మిస్లు శరీరంలో లైపేజ్ ఎంజైమ్‌ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి. కిచిడి అదే విధంగా రాత్రి డిన్నర్లో కిచిడి తినాలి. దీనిలో పదిరకాల ఎమినో యాసిడ్స్ ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిది. చదవండి: రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
Health Tips: హై బీపీ ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే..
ప్రస్తుత కాలంలో జీవనశైలి మూలాన వస్తున్న సమస్యలలో బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్, ఎసిడిటీ, కడుపులో పుండ్లు వంటివి ముఖ్యమైనవి. వాటిలో అతి ముఖ్యమైనది బీపి. దీనికి వయసుతో కూడా సంబంధం ఉండటం లేదు. తక్కువ వయసు వారు కూడా హైబీపితో బాధపడుతున్నారు. రక్తపోటు పెరిగిపోవడం వల్ల ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంటుంది. బీపీని అదుపులో ఉంచుకోవాలంటే కొన్నిరకాల ఆహారాలను తీసుకోవడం ప్రయోజనకరం. అవేంటో తెలుసుకుందాం.. పల్లీలు, బాదం, జీడిపప్పు అధిక రక్తపోటును అదుపు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే వాటిని ఎలా తీసుకోవాలో చూద్దాం. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు నట్స్‌ను దూరం పెడుతుంటారు. వీటిని తింటే మరింత బరువు పెరిగిపోతామేమోననే అపోహతో. అయితే అది సరికాదు. ఎందుకంటే వేరుశెనగ, బాదం పప్పుల వల్ల బరువు పెరగరు. ఇవి మీ శరీర బరువు మరింత పెరగకుండా అడ్డుకుంటాయి కూడా. పల్లీలు పల్లీలు లేదా వేరుసెనగ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుప్పెడు వేరువెనగ గింజలు తినడం వల్ల వంటి పనితీరు బాగుంటుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య కూడా తొలగిపోతుంది. కొలెస్ట్రాల్ వంటి రోగాల ప్రమాదం తప్పుతుంది. ఎందుకంటే ఈ గింజలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేరుశెనగల్లో విటమిన్ బి3 పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజూ వేరుశెనగలను తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బీపీని పెంచే కారకాలలో కొలెస్ట్రాల్ ముందుంటుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటే రక్తపోటుకు కళ్లెం వేయడం సులభం అవుతుంది కాబట్టి రోజూ నానబెట్టిన పల్లీలు తీసుకోవడం మంచిది. బాదం పప్పు శరీరంలో ఉన్న అదనపు కొవ్వును తొలగించేందుకు బాదం పప్పులు ఎంతో సహాయపడతాయి. గుప్పెడు వేరుసెనగ గింజలను, నాలుగైదు బాదం పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున తింటే బీపీ, డయాబెటిస్ అదుపులో ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని, అధిక రక్తపోటునూ నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల శరీర బలం పెరుగుతుంది. జీడిపప్పులు జీడిపప్పులు తింటే బరువు పెరిగిపోతామని వీటిని ముట్టని వారు చాలా మందే ఉన్నారు. నిజానికి అది సరికాదు.. జీడిపప్పులు బరువును పెంచడానికి బదులుగా.. బరువును కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. శీతాకాలంలో 2 నుంచి 3 జీడిపప్పులను తినడం శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే శరీర శక్తిని కూడా పెంచుతుంది. వీటిలో పిస్తాపప్పు, ఇతర గింజల కంటే ఎక్కువ పోషకాలుంటాయి. ఇది రుచిగానే కాదు.. మన శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఈ గింజలు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక బరువు కూడా తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. జుట్టు, చర్మానికి ప్రయోజనకరం డ్రై ఫ్రూట్స్‌లో చాలావరకు విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ ఇ ,మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు, చర్మానికి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతాయి. సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పేననడంలో ఎలాంటి సందేహం లేదు. చాపకింద నీరులా గుండె కవాటాలను పూడ్చివేసి, గుండె పనితీరును మందగింపజేసే బీపీని అదుపులో ఉంచుకోకపోతే చాలా ప్రమాదం. అయితే అది మందుల ద్వారానే కాదు, నిత్యం ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చునంటున్నారు ఆహార నిపుణులు. వీటన్నింటితోపాటు కంటినిండా నిద్రపోవడం, నిత్యం వాకింగ్ చేయడం కూడా చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి. నోట్: కేవలం ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. పలు అధ్యయనాలు, ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించిన వివరాలు ఇవి. శరీర తత్త్వాన్ని బట్టి ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉండవచ్చు. ఏదేమైనా వైద్యులను సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన, చక్కటి పరిష్కారం దొరుకుతుంది. చదవండి: Diet Tips To Control Asthma: ఆస్తమా ఉందా? వీటిని దూరం పెట్టండి.. ఇవి తింటే మేలు! High Uric Acid Level: యూరిక్ యాసిడ్ మోతాదులు పెరిగితే అంతే సంగతులు! వీరికే ముప్పు ఎక్కువ! లక్షణాలివే! ఇలా చేస్తే.. -
నిద్ర లేచిన వెంటనే కాఫీలు, టీలు.. కుకీలు, బిస్కట్లు అస్సలు వద్దు!
ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలామంది టీ లేదా కాఫీలు తాగుతారు. అలాగే బిస్కెట్లు, కుకీలు తింటారు. కానీ ఇది సరైన ఫుడ్ కాదు. మీరు రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తినాల్సి ఉంటుంది. ఇవి శరీరంలోని అంతర్గత అవయవాలకు శక్తిని అందిస్తాయి. జీర్ణక్రియ సరిగ్గా జరిగేలా చూస్తాయి. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. ►ఉదయమే ఒక గ్లాసు నీరు తాగడంతో రోజు ప్రారంభించాలి. ►ఆ తర్వాత మనకు నచ్చిన ఏవైనా నానబెట్టిన గింజలు లేదా మొలకలు తీసుకోవాలి. ►వీటిని తీసుకోవడం వల్ల రోజు మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు. అలసట ఉండదు. ►ఇందుకోసం రాత్రిపూట వీటిని నీటిలో నానబెట్టాలి. ►ఉదయమే కొన్ని నీళ్ళు తాగి వీటిని తినాలి. ఎలాంటి గింజలు తినాలో తెలుసుకుందాం. ►బాదం, ఎండుద్రాక్ష, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలని రాత్రంతా నానబెట్టి ఉదయం తినాలి. ►అయితే అవిసె గింజలను ఎప్పుడూ విడిగా నానబెట్టడమే ఉత్తమం. ►వీటికి మరికొన్ని ఆహారాలని కలుపుకోవచ్చు. తేనె, వాల్నట్, మఖానా, జీడిపప్పు, జోడించుకొని తిని తర్వాత పాలు తాగితే శరీరం కొత్త శక్తిని పుంజుకుంటుంది. చదవండి: Cancer Prevention: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..! -
Health Tips: రోజూ కోడిగుడ్డు తిన్నారంటే..
కొంతమంది ఉడకబెట్టిన కోడిగుడ్డు తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారు దాని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదలరు. గుడ్డులోని తెల్లసొనను తినడం వల్ల అధిక రక్తపోటును నియంత్రించుకోవచ్చు. గుడ్డు తినడం అన్ని రకాల గుండె సమస్యలను దూరం చేస్తుంది. అందువల్ల మీరు రోజూ తినే ఆహారంలో గుడ్డును చేర్చుకోవడం చాలా మంచిది. మరిన్ని ఆరోగ్య చిట్కాలు మెడ నొప్పితో బాధపడుతున్నారా? నిద్ర లేచిన తర్వాత మీకు మెడ నొప్పిగా అనిపిస్తే.. నొప్పి ప్రభావిత ప్రాంతాల్లో ఐస్ ప్యాక్ లేదా చల్లని నీటిలో క్లాత్‌ను ముంచి నీళ్లు పిండేసి మెడమీద మెల్లగా అద్దాలి. అలా చేయడం వల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. దీంతో పాటు హీట్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు. మెడ నొప్పిగా ఉన్న వాళ్లు చేతులతో మెడను నెమ్మదిగా మసాజ్ చేయాలి. అలా చేయడం వల్ల కండరాలు సర్దుకొని నొప్పి తగ్గే అవకాశం ఉంది. మసాజ్ చేసే సమయంలో కొబ్బరి లేదా నువ్వుల నూనె ఉపయోగిస్తే మేలు. ఒకోసారి నిద్రలో కూడా మెడ పట్టేస్తుంటుంది. ఇందుకోసం మీరు రాత్రిళ్లు బోర్లా పడుకోకుండా ఉంటే చాలు. చుండ్రు పోవాలంటే.. బాదం నూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటే చుండ్రు పోతుంది. ఒక గిన్నెలో కొద్దిగా బాదం నూనెను తీసుకొని.. అందులో కాస్త నిమ్మ రసాన్ని మిక్స్ చేసి.. ఆ తర్వాత జుట్టుకు పట్టించాలి. ఇది మాడుకు పట్టేట్లుగా కొద్దిసేపు చేతులతో తలపై మృదువుగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత అవసరమైతే.. గంట తర్వాత లేదా మరుసటి రోజు షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. చదవండి: Beauty Tips: ముఖంపై మంగు మచ్చలు ఉంటే.. పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి.. -
బాదాం ఎలా తింటే మంచిది? పోషకాలు పుష్కలంగా లభించాలంటే?
ఈ మధ్యకాలంలో తృణ ధాన్యాలు, నట్స్ , డ్రైఫ్రూట్స్ వినియోగం బాగా పెరిగింది. ఒకపుడు ఖరీదైనవి మనకెందుకులే అని వదిలేసిన సామాన్యులు కూడా వాటిపై అవగాహన పెంచుకుంటున్నారు. పోషకాహారం లేక వ్యాధుల బారినపడే కంటే ముందే జాగ్రత్త పడాలని భావిస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి బాదాం. మరి బాదం పప్పులను ఎలా తీసుకుంటే మంచిది? నానబెట్టి తినడం వల్లే అదనపు ప్రయోజనాలుంటాయా? ఆల్మండ్లోని పోషకవిలువలు, ఆరోగ్యకర ప్రయోజనాలు తెలియాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం.. Health Benefits of Almonds: అద్భుతమైన పోషక విలువలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న పప్పు బాదం. బాదం ఒమేగా 3, విటమిన్ ఇ, ప్రొటీన్, పీచుతో నిండి ఉంటుంది. బరువు తగ్గడం నించీ రక్తపోటు అదుపులో ఉంచుకోడం వరకూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం నించీ కాన్సర్ ముప్పుని తగ్గించడం వరకూ బాదం చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే సూపర్ ఫుడ్ అని కూడా భావిస్తున్నారు. ఇందులో ఉన్న ప్రొటీన్ ఆకలిని నియంత్రిస్తుంది.దీంతో బరువు తగ్గడం కూడా తేలిక. మెగ్నీషియం వల్ల ఎముకలు బలపడతాయి, ఇంకా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. అంతేకాదు, రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. నానబెట్టిన బాదాం తింటేనే ఎక్కువ ప్రయోజనాలా అంటే మాత్రం అవుననే చెప్పాలి. (మీ గార్డెన్లో గులాబీలు విరగ బూయాలంటే?) ఏదైనా గింజని నానబెట్టి, మొలక వచ్చేలా చేసినపుడు వాటిల్లో కొవ్వు ప్రొటీన్‌గా మారుతుంది. అలాగే బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. నాన బెట్టి, పైన తోలు తీసి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రాత్రి నానబెట్టిన అయిదు లేదా ఆరు బాదం పప్పులను ఉదయాన్నే తింటే మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్ కాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. నానబెట్టిన బాదంపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే నానబెట్టిన బాదంనించి లిపేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదల అవుతుంది. ఇది అరుగుదలకీ, అనవసరమైన కొవ్వు కరగడానికీ ఉపయోగపడుతుంది. దీంతోపాటు గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంది. చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ చెప్పే బాదం గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాదంలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి వయసు కనపడనివ్వకుండా చేస్తుంది. బాదం పప్పులు పోషకాలలోనే కాదు, వంటకాలలో వాడుకోడానికి కూడా పనికొస్తాయి. బాదం ఒమేగా 3, విటమిన్ ఇ లాంటి పోషకాలతో సమృద్ధమైంది. బాదం తిన్నాక నిండుగా అనిపించి తొందరగా ఆకలి వేయదు. పాయసం మీద సన్నని పలుకులుగా చేసి చల్లినా, నూరి కుర్మా లో వాడినా, నానబెట్టి రుబ్బి బాదం పాలు తయారుచేసినా అందరూ ఇష్టపడతారు. బాదంలో అద్భుతమైన పోషక గుణాలు ఉన్నాయి. ఈ లాభాలన్నిటినీ పొందాలంటే వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం మన సొంతం అవుతుందని డైటీషియన్స్ చెబుతున్నారు. బాదం టీ ప్రయోజనాలు బాదం పప్పులు అధిక పోషకాహారాన్ని అందిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఉంటాయి. బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మెగ్నీషియం సరైన మొత్తంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదంపప్పును అనేక రకాలుగా తినవచ్చు. బాదం టీని కూడా తయారు చేసుకోవచ్చు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు చాలా ఆరోగ్యకరమైనది కూడా. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, మంటను తగ్గించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడం వంటి సామర్థ్యాలు బాదం టీ సొంతం. ఫైటోస్టెరాల్స్ లాంటి అనేక యాంటీఆక్సిడెంట్లు, అలాగే విటమిన్ ఇ చర్మంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గింస్తుంది. బాదం టీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. -
బాదాం పోషకాలు పుష్కలం
-
Health Tips: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా.. అయితే
బాదం గింజలను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బాదం బలవర్ధకమైన ఆహారం. వీటిలో తియ్యగా, చేదుగా ఉండే రెండు రకాలు ఉంటాయి. సాధారణంగా తినుబండారాల కోసం తియ్యటి బాదంను వాడుతూ ఉంటారు. ఈ బాదం పప్పుతోనే బాదం పాలను కూడా తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా బాదం సాగవుతోందంటే దీని వినియోగం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని అంతగా ఇష్టపడని వారు కూడా తమ డైట్లో చేర్చుకుంటారు. బాదంలో ఉండే పోషకాలు ►బాదంలో ఫైబర్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగు మోతాదుల్లో లభిస్తాయి. ►ఇందులో మాంసకృత్తులు కూడా ఎక్కువే. ►బాదంలో విటమిన్- ఇ పుష్కలం. ►పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు కూడా బాదం తినడం ద్వారా లభిస్తాయి. ఒక ఔన్సు అంటే సుమారు 28 గ్రాముల బాదంలో ఉండే పోషకాలు ఫైబర్- 3.5 గ్రా. ప్రొటిన్ 6 గ్రా. ఫ్యాట్- 14 గ్రా. విటమిన్ ఈ- 37 శాతం మాంగనీస్- 32 శాతం మెగ్నీషియం- 20 శాతం వీటితో పాటు కాపర్, విటమిన్ బీ2(రాబోఫ్లావిన్), ఫాస్పరస్ కూడా ఉంటాయి. బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►బాదం తింటే గుండె పనితీరు మెరుగవుతుంది. ►అలసిన శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది. ►రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచే గుణం బాదంలో ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు బాదం తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ►మెదడు పనితీరు చురుగ్గా ఉండేందుకు బాదం ఉపయోగపడుతుంది. ►బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. ►కాన్సర్ ముప్పును నివారిస్తాయి. అయితే, చాలా మందికి బాదంను రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొట్టు తీసి తినడం అలవాటు. నిజానికి పొట్టులోనే యాంటీ ఆక్సిడెంట్లు ►ఉంటాయి. కాబట్టి ఇలా పొట్టు తీసి తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ►బాదంలో విటమిన్–ఇ ఎక్కువగా ఉండటం వల్ల చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ►మంచి పెరుగు తింటే జీర్ణాశయానికి ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలు అంతకు తక్కువేమీ కాదు. ►బాదంలో ఉండే ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ►బాదంలో మెగ్నీషియమ్ ఉంటుంది. రక్తపోటు నివారణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ►కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు బాదం తీసుకుంటే మంచిది. ►బాదంలో ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఊబకాయులు బరువు పెరగకుండా నియంత్రించుకోడానికి ఇది అనువైనది. ►నిజానికి బాదంను ఎప్పుడైనా తినవచ్చు. ►రాత్రి భోజనంలో వేటమాంసం తిన్న తర్వాత కొన్ని బాదం గింజలు తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
Health Tips: కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు... బాదం, రాగి దోశ, బెల్లం, కిచిడి..
కోవిడ్ బారిన పడ్డవారు, ఇప్పుడిప్పుడే దానినుంచి కోలుకుంటున్న వారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఆహార చిట్కాలు... ►నాలుగైదు బాదం పప్పులు, పది కిస్మిస్లను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి. నానబెట్టిన కిస్మిస్లు శరీరంలో లైపేజ్ ఎంజైమ్‌ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి. బాదం పప్పు శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి. ►రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల రాగులతో చేసిన దోశ వంటి వాటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడడంతోపాటు వాటిలోని పాలీఫీనాల్స్ డయాబెటిక్ రోగులలో గ్లైసిమిక్ స్పందనలను తగ్గిస్తాయి. రాగుల్లోని క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రాగుల్లో అధికంగా ఉండే ఐరన్ జీవక్రియలను మెరుగు పరిచి ఎర్ర రక్తకణాలకు పోషకాలను అందిస్తుంది. ►బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి అధికంగా ఉంటాయి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ,ఇ, డి, కే, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడమేగాక, ఎముకలు గట్టిపడతాయి. ►రాత్రి పూట తీసుకునే ఆహారంలో కిచిడి ఉండాలి. దీనిలో పదిరకాల అమినో యాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిది. పలుచటి మజ్జిగ, సగ్గుజావ, రాగిజావ వంటివి తాగాలి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని సమస్థితితో ఉంచడమేగాక జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
Health Tips: పిల్లలకు గుడ్డు, పెరుగు, బాదం, వాల్నట్స్ ఎక్కువగా తినిపిస్తున్నారా..
Immunity Booster Foods For Kids: పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముఖ్యంగా కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలంటే... గుడ్డు కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2 (రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి. ఆకుకూరలు ఆకుకూరలు, మునగకాడలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటిలో ఫైబర్‌తోపాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి. పెరుగు పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు. పసుపు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ ఇచ్చే ఆహారంలో పసుపును చేర్చడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు. డ్రైఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించడం వల్ల మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్వీట్స్ వద్దు పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్‌జ్యూస్‌లు, చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. సరిపడా నిద్ర ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. ఉదయం ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
Weight Loss Tips: బాదం, చేపలు, చెర్రీలు తరచుగా తింటే!
Weight Loss Tips: బరువు పెరగడానికి ప్రధాన కారణం మన జీవనశైలి అని చెప్పవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో వేపుడు పదార్థాలు, మసాలాలు, స్వీట్లు, కరకరలాడే చిరుతిళ్లు తినాలని మనసు తహతహలాడుతుంది. మరి బరువు తగ్గాలనుకుంటే కరకరలాడే స్నాక్స్‌కు బదులు పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకుంటే బెటర్. కొందరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన స్వీట్లను తింటూ ఉంటారు. వీటిని తినడం వల్ల పొట్ల దగ్గర కొవ్వు అలాగే ఉండిపోతుంది. ఫైబర్: ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈజీగా కొవ్వు కరిగిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఫైబర్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రోజూ రెగ్యులర్‌గా ఫైబర్ ఫుడ్ తింటూ ఉండండి. యోగా: కొన్ని రకాల ఆసనాలు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తాయి. అలాంటి ఆసనాలను ఉదయం లేచిన వెంటనే వేస్తే చాలా మంచిది. నట్స్: బాదం లాంటి కొన్నిరకాల నట్స్‌ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయమే తింటే చాలా మంచిది. చేపలు: ఆహారంలో ఎక్కువగా చేపలుండేలా చూసుకోండి. వారానికొకసారైనా ఆహారంలో చేపలుండేలా చూసుకోవడం మంచిది. క్యాలీఫ్లవర్, బ్రకోలి, దోసకాయలాంటి వాటిని ఎక్కువగా తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది. క్యాల్షియం: పాలు, పాల సంబంధిత పదార్థాలని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది. చెర్రీలు: శరీరంలోని కొవ్వును తగ్గించడానికి చెర్రీలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది. సమయానికి నిద్ర పోవడం: సరైన సమయానికి నిద్రపోకుండా ఉంటే కూడా బాడీలో కొవ్వు పెరిగిపోతుంది. అందువల్ల రెగ్యులర్ గా సమయానికి నిద్రపోతూ ఉండండి. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
మాంసాహారం తింటున్నారా? ఆ తర్వాత ఇవి తినండి...
వాస్తవంగా బాదాం పలుకులను ఎప్పుడైనా తినవచ్చు. అయితే ముఖ్యంగా మనం డిన్నర్లో వేటమాంసం, రెడ్ మీట్ తిన్న తర్వాత కొన్ని బాదాం తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇక మామూలు సమయాల్లో తిన్నా వీటి వల్ల మనకు ఒనగూరే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో క్యాల్షియమ్ పాళ్లు ఎక్కువ. కాబట్టి బాదాంలోని పోషకాలు మన ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వైటమిన్–ఈ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలూ అంతకు తక్కువేమీ కాదు. శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్ఫ్లమేషన్ ఉంటే కూడా బాదాం తినడం మంచిది. అప్పుడు అందులోని ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. కొవ్వు పాళ్లు ఒకింత ఎక్కువగా ఉండే మాంసాహారం తర్వాత బాదాంలోని పోషకాలు కొవ్వుల దుష్ప్రభావాన్ని తగ్గించడం వల్ల బాదాం పలుకులు కరోనరీ గుండెజబ్బులనూ సమర్థంగా నివారిస్తాయి. చదవండి: అంతరిక్షంలో ఆతిథ్యం, ఎప్పటినుంచంటే.. ఈ ఫేమస్ యాడ్స్‌లో నటించిన సెలబ్రిటీలు వీళ్లే.. -
ప్రశాంతమైన నిద్రకు ఈ ఐదు తినండి!
మీరు తీసుకున్న ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అది హైప్రోటీన్ డైట్ అయినా అది నిద్రలేమికి దారితీస్తుందని చెబుతున్నారు నిద్రానిపుణులు. రాత్రి ఆహారానికి, నిద్రకు దగ్గరి సంబంధం ఉంటుందంటున్నారు శామీ మార్గో అనే ప్రముఖ స్లీప్ ఎక్స్పర్ట్. ఆమె ఇటీవలే ‘ద గుడ్ స్లీప్ గైడ్’ అనే పుస్తకం రాశారు. రాత్రివేళల్లో మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల అది నిద్రపై దుష్ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు శామీ మార్గో. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, ఆల్కహాల్, కాఫీ, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు... ఈ ఐదూ నిద్రను దూరం చేస్తాయనీ, అయితే... అరటిపండ్లు, బాదం (ఆల్మండ్స్), తేనె, ఓట్స్, గోరువెచ్చని పాలు... ఈ ఐదూ ప్రశాంతంగా నిద్రపట్టేలా చేసే మంచి ఆహారాలని పేర్కొన్నారు శామీ. తగ్గుతున్న అడవులూ... పెరుగుతున్న దోమలూ, వ్యాధులు! ప్రపంచవ్యాప్తంగా అడవులు తగ్గుతున్న కొద్దీ... అక్కడి వనాల్లో పెరగాల్సిన దోమలూ నగరాల్లోకి వచ్చేస్తున్నాయట. ఇటీవల అమెరికాలో జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో దోమలు అకస్మాత్తుగా, విపరీతంగా పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు అక్కడి పరిశోధకులు. దాంతో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కొన్ని దోమ జాతులు నీళ్లలో పెరిగినట్లుగానే మరికొన్ని దోమలు అడవుల్లోని ఆకుపచ్చ వనాల్లో మాత్రమే తమ జీవనచక్రాన్ని కొనసాగించాలి. కానీ అవి అడవుల నరికివేత విపరీతంగా సాగుతున్న నేపథ్యంలో ఆ అడవి దోమలు నగరాలకు వలస వస్తున్నాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు. ఈ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన మార్మ్ కిల్పాట్రిక్స్ తమ పరిశోధన వివరాలను వెల్లడిస్తూ గత ఐదు దశాబ్దాల్లో దోమల సంఖ్య పెరగాల్సిన దానికంటే పది రెట్లు అధికంగా పెరిగాయని పేర్కొంటున్నారు. ఫలితంగా జికా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికన్ గున్యా వంటి దోమ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులూ, వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని బెంబేలెత్తుతున్నారు. ఇది డిసీజ్ బర్డెన్ పెంచడంతో పాటు పర్యావరణాన్నీ మరింతగా దెబ్బతీసి మరిన్ని ఉత్పాతాలకు కారణమవుతుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. -
కండలు అమ్మాయిలకూ అందమే..
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సినిమా తారలు, టీవీ, సోషల్ మీడియా సెలబ్రిటీస్‌ని బ్రాండ్ అంబాసిడర్‌గా పెద్ద పెద్ద కంపెనీలు నియమించుకుంటూ ఉంటాయి. సాధారణంగా ఫిట్నెస్ ట్రైనర్స్‌కు ఈ అవకాశం దక్కడం అరుదు. ఈ నేపధ్యంలో సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్, హైదరాబాద్‌కు చెందిన కిరణ్ డెంబ్లా... కాలిఫోర్నియా ఆల్మండ్స్కు ప్రచారకర్తగా మారడం విశేషం. ఇటీవల తాప్సీ పన్ను, పూజా హెగ్డే తదితర హీరోయిన్ల మస్క్యులర్ ఫిజిక్ మెట్రో నగరాల్లో నివసించే యువతులకు బాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే కిరణ్ డెంబ్లాని సదరు సంస్థ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు కరోనా దెబ్బకు కుదేలైన హైదరాబాద్ ఫిట్నెస్ ఇండస్ట్రీకి, ట్రైనర్లకు కిరణ్ డెంబ్లా నియామకం కొంత ఊపిరిలూదిందని చెప్పొచ్చు. ఈ నేపధ్యంలో కాలిఫోర్నియా ఆల్మండ్స్ ఆధ్వర్యంలో నగరం కేంద్రంగా నిర్వహించిన వర్చువల్ సదస్సులో మహిళా బాడీ బిల్డర్, సిక్స్‌ప్యాక్ తో ఆకట్టుకునే కిరణ్ డెంబ్లా పాల్గొని యువతులకు స్ఫూర్తిని అందించారు. కండలు తిరిగిన శరీరం పురుషులకు మాత్రమే అందాన్నిస్తుందని అనుకోవడం సరైంది కాదని ఆమె స్పష్టం చేశారు.. అమ్మాయిలూ, మధ్య వయసు మహిళలు కూడా మస్క్యులర్ బాడీతో అందంగా ఉంటారన్నారు. అదంతా చూసే మైండ్‌లో ఉంటుదని ఆరోగ్యకరమైన చర్మం, కండరాలు ఎవరికైనా అవసరమే అన్నారామె. కరోనా తర్వాత వ్యక్తిగతంగా మాత్రమే కాదు కుటుంబమంతా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాల్సిన పరిస్థితులొచ్చాయన్న ఆమె.. వ్యాధినిరోధక శక్తి పెరిగేందుకు ప్రాణయామ వంటి శ్వాస కోస వ్యాయామాలు, విటమిన్ ఇ, జింక్, ఐరన్, వర్కవుట్‌కి ముందూ తర్వాత తగినంత ప్రొటీన్స్ కోసం ఆల్మండ్స్, ఎగ్ వైట్స్..వంటివి తీసుకోవాలని సూచించారు. మహిళలు జిమ్‌కి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే స్క్వాట్స్, సిటప్స్, లంజెస్, యాబ్స్, జంపింగ్ జాక్స్... చేసుకోవచ్చునని, కేవలం రెసిస్టెన్స్ బ్యాండ్‌తో కూడా బోలెడు వర్కవుట్లు చేయవచ్చునని కూడా ఆమె స్పష్టం చేశారు. చదవండి: స్టైలిష్‌గా కాబోయే అమ్మ .. -
బాదంకు భలే డిమాండ్!
సాక్షి సిటీబ్యూరో: బాదం పప్పు.. సామాన్యలకు అందని ద్రాక్ష అనే చెప్పొచ్చు. వాటి ధర ఆకాశంలో ఉండటమే ప్రధాన కారణం. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా బాదం వినియోగం విపరీతంగా పెరిగింది. ధనిక.. పేద అనే వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల ప్రజలు రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు బాదంను తమ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. కోవిడ్–19 కారణంగా బాదంకు డిమాండ్ పెరిగినా ధరలు మాత్రం తగ్గాయి. కరోనాకు ముందు ఎప్పుడో తప్ప బాదంను తినని ప్రజలు ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో చిరు తిండిగా లాగించేస్తున్నారు. మామూలు బాదంను కాకుండా వివిధ రకాల డిష్‌లను కూడా తయారు చేసుకొని ఆరగిస్తున్నారు. గతంలోఉప్మాలో లేదా ఇతర వంటకాల్లో కొద్దిగా బాదం వినియోగిస్తే ప్రస్తుతం బాదంను సా«ధ్యమైనన్ని ఎక్కువ రకాల వంటకాల్లో వినియోగిస్తున్నారు. పెరుగుతున్న విక్రయాలు గతంలో రంజాన్‌తోపాటు ఇతర పండుగలప్పుడు మాత్రమే బాదం పప్పు విక్రయాలు ఎక్కువగా ఉండేవి. కరోనా ప్రభావంతో సిటీజనులు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాదంను తెగ తినేస్తున్నారు. సాధారణ రోజుల్లో నెలకు 3–4 టన్నుల బాదం విక్రయాలు జరిగితే గడచిన రెండు నెలల్లోనే విక్రయాలు కాస్తా ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. కేవలం నెల రోజుల్లోనే కోట్ల రూపాయల మేర వ్యాపారం జరిగిందని వ్యాపార వర్గాల అంచనా. గతంలో నగర ప్రజలు కేవలం బేగంబజార్‌లోనే బాదం కొనుగోలు చేయడానికి వచ్చే వారు. ప్రస్తుతం కరోనా కారణంగా నగరంలోని దాదాపు అన్ని బస్తీ షాపుల్లోనూ బాదం పప్పు అందుబాటులో ఉంది. దీంతో జనం విరివిగా కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. క్యాలిఫోర్నియా బాదంకు ఎక్కువ డిమాండ్ జీడి పప్పు తప్ప ఇతర అన్ని రకాల డ్రైఫ్రూట్స్ విదేశాల నుంచే నగర మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. బాదం అమెరికా నుంచి దిగుమతి అయితే ఇతర డ్రైఫ్రూట్స్ అయిన పిస్తా, అక్రోట్, కిస్మిస్తో పాటు ఇతర డ్రైఫూట్స్ అష్ఘానిస్తాన్‌తోపాటు యూరప్ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. క్యాలిఫోర్నియా బాదంకు ఎక్కువ డిమాండ్ ఉందని, గతంలో బాదం పప్పు ధర కేజీ రూ. 950 మొదలుకొని రూ. 850 ఉండేది. ప్రస్తుతం కేజీ రూ. 750 నుంచి రూ. 650 వరకు ఉందని బేగంబజార్ కశ్మీర్‌హౌస్ నిర్వాహకులు రాజ్‌కుమార్ టండన్ చెబుతున్నారు -
వేడివేడి గుమ్మడి
ఇంట్లో గుమ్మడి నెలలో మహా అయితే ఒకసారి కనిపించొచ్చు. తెలిసిన ఒకటీ అరా కూరలు దానితో చేస్తుండవచ్చు. గుమ్మడి రుచిలో మేటి... పోషకాలకు సాటి... అంతేకాదు ప్రయత్నించి చూస్తే పదహారు రకాల కూరలు కూడా చేసి ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఎంచి ఎనిమిది ఇచ్చాం. మరో ఎనిమిది మీరు ట్రై చేయండి. గుమ్మడి రుచులతో కమ్మటి విందు చేసుకోండి. గుమ్మడి పాయసం కావలసినవి: గుమ్మడి కాయ తురుము – ఒక కప్పు; చిక్కటి పాలు – రెండున్నర కప్పులు; బాదం పప్పులు – 12; జీడిపప్పులు – 6; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; కిస్మిస్ – 10; బెల్లం తరుగు – 5 టేబుల్ స్పూన్లు; నెయ్యి – అర టీ స్పూను; పాల పొడి – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో ఒకటిన్నర కప్పుల పాలు పోసి కొద్దిగా కాగిన తరవాత, గుమ్మడికాయ తురుము జత చేసి ఉడికించాలి ►బాదం పప్పులు, జీడి పప్పులు, ఏలకుల పొడి జత చేసి కలియబెట్టి, సుమారు పావుగంట సేపు ఉడికించాలి (మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►గుమ్మడికాయ తురుము బాగా మెత్తపడిందనుకున్నాక దింపి, చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో కప్పుడు పాలు, పాల పొడి జత చేసి, సన్నటి మంట మీద కాచాక, మెత్తగా చేసిన గుమ్మడికాయ తరుగు జత చేసి, బాగా ఉడికించాలి ►మిశ్రమం బాగా ఉడికి, చిక్కబడ్డాక బెల్లం తరుగు వేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి ►బెల్లం కరిగేవరకు గరిటెతో కలుపుతుండాలి ∙కిస్మిస్ జత చేయాలి ►బాదం పప్పు తరుగుతో అలంకరించి, బౌల్స్‌లోకి తీసుకుని, అందించాలి. కేరళ గుమ్మడి పచ్చడి కావలసినవి: తీపి గుమ్మడి కాయ – 300 గ్రా.; పసుపు – అర టీ స్పూను; బెల్లం తరుగు – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; మసాలా కోసం: తాజా కొబ్బరి తురుము – అర కప్పు; పచ్చి మిర్చి – 1; అల్లం తురుము – 1 టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు పోపు కోసం: నూనె – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు. తయారీ: ►గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద కుకర్‌లో గుమ్మడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి, ఒక విజిల్ రాగానే దింపేసి, కుకర్ మీద చల్ల నీళ్లు పోసి, మూత తీసేయాలి ►గుమ్మడికాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►మసాలా కోసం తీసుకున్న పదార్థాలను మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేసి, బయటకు తీసి, గుమ్మడి కాయ ముక్కలకు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి, పచ్చడి మీద వేసి కలియబెట్టాలి ►ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఒడిషా గుమ్మడి సెనగపప్పు బంగాళ దుంప కూర కావలసినవి: పచ్చి సెనగ పప్పు – ఒక కప్పు (అర గంట సేపు నీళ్లలో నానబెట్టాలి); గుమ్మడి కాయ ముక్కలు – ఒక కప్పు; బంగాళ దుంప ముక్కలు – ఒక కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; జీలకర్ర – 4 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను; తాజా కొబ్బరి తురుము – రెండున్నర టేబుల్ స్పూన్లు; పంచదార – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర – ఒక కట్ట. తయారీ: ►స్టౌ మీద కుకర్‌లో సెనగ పప్పు, బంగాళ దుంప ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి, ఒక విజిల్ వచ్చాక దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి ►అల్లం తురుము జత చేసి బాగా కలపాలి ∙టొమాటో తరుగు జత చేసి ఉడికించాలి ►ఉడికించిన గుమ్మడికాయ మిశ్రమం జత చేసి బాగా కలియబెట్టాలి ►కొబ్బరి తురుము జత చేసి కొద్దిసేపు ఉడికించాలి ►జీలకర్ర పొడి, మిరప కారం, కొత్తిమీరలతో అలంకరించి దింపేయాలి ►పూరీ, అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. గోవా గుమ్మడి కూర కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; గరం మసాలా పొడి – ఒక టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; తాజా కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ముప్పావు కప్పు; ఉప్పు – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలిలో ముప్పావు కప్పు నీళ్లు పోసి మరిగాక గుమ్మడికాయ ముక్కలు వేసి ఉడికించాలి ►ఉల్లి తరుగు, మిరపకారం, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి ►చివరగా తాజా కొబ్బరి తురుము వేసి మరోమారు కలియబెట్టి, తడి పోయేంత వరకు ఉడికించి దింపేయాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. స్పైసీ గుమ్మడి కాయ కూర కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – అర కేజీ; టొమాటో ముక్కలు – ఒక కప్పు; గసగసాలు – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – కొద్దిగా తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక గసగసాలు వేసి రంగు మారే వరకు వేయించాలి ►వెల్లుల్లి తరుగు జతచేసి కొద్దిసేపు వేయించాలి ∙పసుపు, ధనియాల పొడి, గరం మసాలా జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో తరుగు, గుమ్మడికాయ ముక్కలు జత చేసి బాగా కలియబెట్టాలి ►ఉప్పు, మిరప కారం జత చేసి మరోమారు కలిపి మూత ఉంచాలి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు చిలకరించాలి) ►మధ్యమధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి ►కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి ►ఈ వంటకం భోజనంలోకి రుచిగా ఉంటుంది. గుమ్మడి రైతా కావలసినవి: గుమ్మడి కాయ తురుము – 200 గ్రా.; పెరుగు – 400 మి.లీ.; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; కొత్తిమీర – ఒక కట్ట; ఉప్పు – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు, గుమ్మడి తురుము వేసి ఉడికించి, నీళ్లు పిండేయాలి ►స్టౌ మీద మరో బాణలిలో నూనె వేసి కాగాక ఉడికించిన గుమ్మడి తురుము, ఉప్పు వేసి తడిపోయే వరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి, బాగా ఉడికిన తరవాత ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►ఒక పాత్రలో పెరుగు వేసి బాగా గిలకొట్టాలి ►ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర జత చేయాలి ►చివరగా గుమ్మడికాయ తురుము జత చేసి బాగా కలపాలి ►అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. ఉడిపి గుమ్మడి సాంబార్ కావలసినవి: కంది పప్పు – అర కప్పు (సుమారు రెండు గంటలు నానబెట్టాలి); పసుపు – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; సాంబార్ మసాలా కోసం; తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; ధనియాలు – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; కరివేపాకు – 3 రెమ్మలు. ఇంకా... నూనె – ఒక టేబుల్ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో ముక్కలు – ఒక కప్పు; మునగ కాడలు – 2 (ముక్కలు చేయాలి); గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; చింత పండు గుజ్జు – ఒక టేబుల్ స్పూను; బెల్లం తరుగు – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం –అర టీ స్పూను; ఉప్పు – తగినంత. పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఇంగువ – కొద్దిగా. తయారీ: ►కందిపప్పును సుమారు రెండు గంటల పాటు నానబెట్టాక, శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►మునగకాడ ముక్కలు, ఒక కప్పుడు నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు సన్నని మంట మీద ఉడికించాలి ►గుమ్మడి కాయ ముక్కలు, మిరప కారం జత చేసి మరి కాసేపు ఉడికించాలి ►ముక్కలన్నీ ఉడికిన తరవాత, టొమాటో తరుగు జత చేయాలి ►ఉడికించిన పప్పును మెత్తగా మెదిపి, ఉడుకుతున్న సాంబారుకు జత చేసి కలియబెట్టాలి ►చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం తరుగు, మసాలా ముద్ద జత చేసి మరోమారు బాగా కలిపి మరిగించి దింపేయాలి. చింతపండు గుమ్మడి కూర కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; జీలకర్ర – పావు టేబుల్ స్పూను; అల్లంవెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 2 ; ఉల్లి తరుగు – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; చింతపండు గుజ్జు – ఒక టేబుల్ స్పూను; బెల్లం తరుగు – అర టేబుల్ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►మిరప కారం, ధనియాల పొడి, పసుపు వేసి మరోమారు బాగా కలిపి, గుమ్మడికాయ ముక్కలు జత చేయాలి ►ఉప్పు, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ►ఐదు నిమిషాల తరవాత ముక్కలు బాగా ఉడికాయో లేదో చూసి, చింత పండు గుజ్జు జత చేయాలి ►బెల్లం తరుగు వేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి తడిపోయే వరకు ఉడికించాలి ►పరాఠా, అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. -
రోజూ ఇవి తింటే బరువెక్కరు!
ఊబకాయం వచ్చేస్తోందని బాధపడుతున్నా రా? అయితే రోజూ బాదం, జీడిపప్పు, వంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే సరి అంటోంది బ్రిటిష్ మెడికల్ జర్నల్. శుద్ధి చేసిన మాంసం, చిప్స్, ఫ్రై లలో సగం మోతాదును ఈ ఆరోగ్యకరమైన గింజలు, పప్పులతో భర్తీ చేసినా బరువు పెరగడం తగ్గుతారని పరిశోధకులు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. వీటిల్లో అసంతృప్త కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం ఎక్కువగా కేలరీలు మాత్రం తక్కువగా ఉండటం ఇందుకు కారణమని వివరిస్తున్నారు. మరీ ఎక్కువగా కాకపోయినా కనీసం 14 గ్రాముల గింజలు, పప్పులు అధికంగా తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయన్నది వీరి అంచనా. మొత్తం మూడు వర్గాల వారిని దీర్ఘ కాలం పాటు పరిశీలించిన తర్వాత ఈ అంచనాకొచ్చారు. సుమారు 51, 529 మంది (40–75 మధ్య వయస్కులు) పురుషులు, 1,21,700 మంది నర్సుల (35–55 మధ్య వయస్సు)తో పాటు సుమారు 1.16 లక్షల మంది యువ నర్సులపై ఇరవై ఏళ్ల పాటు బరువు, ఆహారం, వ్యాయామం వంటి వివరాలను సేకరించి మరీ ఈ అధ్యయనం చేశారు. నాలుగేళ్లకోసారి బరువును ప్రకటించడంతో పాటు అంతకు ముందు సంవత్సరంలో ఎంత తరచుగా గింజలు, పప్పులు తిన్నారో కూడా తెలిపేలా అధ్యయనం జరిగింది. పప్పులు, గింజల్లో దేని వాడకం ఎక్కువైనాసరే.. దీర్ఘకాలంలో బరువు పెరగడం తగ్గినట్లుగా తెలిసింది. -
ట్రంప్ వల్ల బాదంపప్పు రైతులకు నష్టాలు..
వాషింగ్టన్: భారత ఎగుమతులపై సుంకాల వడ్డింపుతో వాణిజ్య పోరుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కయ్యానికి కాలు దువ్వడాన్ని అమెరికన్ నేతలు తప్పు పడుతున్నారు. ప్రతిగా భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే బాదంపప్పు తదితర ఉత్పత్తులపై సుంకాలను విధించడంతో స్థానిక రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను ట్రంప్ నాశనం చేశారని కాలిఫోర్నియా సెనేటర్ డయానె ఫెయిన్ స్టెయిన్ విమర్శించారు. ప్రతీకారంగా భారత్ సుంకాలు పెంచడంతో కాలిఫోర్నియా బాదం, వాల్నట్ రైతులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. దీనితో భారత్‌కు 217 మిలియన్ డాలర్ల మేర అదనపు ఆదాయం లభించనుంది. అమెరికా నుంచి ఏటా 650 మిలియన్ డాలర్ల విలువైన పప్పులు భారత్‌కు దిగుమతవుతున్నాయి. -
పొడిబారిన చర్మం కోసం ప్యాక్స్..
టీ స్పూన్ తేనెలో అర టీ స్పూన్ క్యారట్ జ్యూస్ గాని నారింజ జ్యూస్ గాని కలపాలి. ఈ మూడింటినీ బాగా కలిపిన తరవాత పేస్ట్ చేసుకోవడానికి సరిపడా శనగ పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చర్మం మృదువవుతుంది. పొడి చర్మం వారు వారానికి ఒక్కసారి ఈ ప్యాక్‌ని వాడడం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. కోడిగుడ్డులోని పచ్చ సొనలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం నిగారిస్తుంది. -
అల్పాహారం మిస్సయితే..
లండన్ : ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వీలుకాని సందర్భాల్లో బాదం పప్పు తింటే మేలని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. టిఫిన్ తీసుకోకుండా ఉదయానే బాదం ఆహారంగా తీసుకున్న విద్యార్ధుల బ్లడ్ షుగర్ స్ధాయిలు మెరుగ్గా ఉన్నాయని పరిశోధన వెల్లడించింది. వర్సిటీ విద్యార్ధులపై తొలిసారిగా చేపట్టిన ఈ అథ్యయనం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని వారు బాదంను స్నాక్‌గా తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయని వెల్లడించిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ రుడీ ఓర్టిజ్ చెప్పారు. బాదంలో ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం ఉంటాయని గత పరిశోధనల్లో వెల్లడైంది. బాదంతో బీపీ, కొలెస్ర్టాల్ నియంత్రణలో ఉండటమే కాకుండా, ఇవి ఆకలిని తగ్గించి బరువు పెరిగేందుకూ ఉపకరిస్తాయి. ఆరోగ్యకర పోషకాలతో కూడిన బాదం అన్ని వయసుల వారికి స్మార్ట్ స్నాక్‌గా అథ్యయనం సూచించింది. తాజా అథ్యయన వివరాలు జర్నల్ న్యూట్రియంట్స్లో ప్రచురితమయ్యాయి. -
జిల్ జిల్ జిగర్‌ఠండా
జిగర్ ఠండా అనేది మదురై ప్రాంతంలో అందరినీ ఆకర్షిస్తున్న పానీయం. జిగర్ అంటే గుండె, ఠండా అంటే చల్లగా అని అర్థం. అంటే ఈ పానీయం తాగడం వల్ల గుండె చల్లగా ఉంటుంది అని అర్థం. కావలసినవి ఐస్‌క్రీమ్ కోసం; పాలు – 2 కప్పులు; కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు; పంచదార – అర కప్పు; తాజా క్రీమ్ – రెండ కప్పులు; తియ్యటి పాలకోవా – 200 గ్రా.; వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు; చిక్కటి తియ్యటి పాల కోసం; పాలు – 2 కప్పులు ; తియ్య కోవా – 250 గ్రా. జిగర్ కోసం: బాదం పిసిన్ – 3 టేబుల్ స్పూన్లు; నన్నారి సిరప్ –తగినంత తయారీ: ∙ఒక పాత్రలో పాలు పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పావు కప్పు చల్లటి పాలలో వెనిలా ఎసెన్స్, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙వేరే పాత్రలో పాలు, తియ్య కోవా వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద ఉంచిన పాలు మరుగుతుండగా, కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలను ఇందులో పోసి, ఉండకట్టకుండా ఉండేందుకు ఆపకుండా కలుపుతుండాలి ∙పాలు బాగా చిక్కబడుతుండగా, కోవా వేసిన పాలు పోసి మరోమారు కలపాలి ∙పంచదార జత చేసి మరోమారు కలిపి బాగా మరిగించి దింపి చల్లారనివ్వాలి ∙చల్లారాక క్రీము జత చేసి మళ్లీ బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ కంటెయినర్లోకి తీసుకుని మూత పెట్టి, డీప్ ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి ∙బయటకు తీసి పాత్రలోకి తిరగబోసి, బాగా కలిపి మళ్లీ ప్లాస్టిక్ కంటెయినర్లో పోసి, మరో గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టి తీసి, చెక్క గరిటెతో బాగా కలిపి, వేరే పాత్రలోకి తీసుకోవాలి ∙ఇలా చేయడం వల్ల మెత్తటి ఐస్‌క్రీమ్ తయారవుతుంది ∙ఇలా నాలుగైదుసార్లు, మొత్తం ఆరు గంటలు చేయడంతో మెత్తటి ఐస్‌క్రీమ్ తయారవుతుంది ∙బాదం పిసిన్ (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది)ను నీళ్లలో ముందురోజు రాత్రంతా నానబెట్టాలి ∙జిగురులా తయారవుతుంది ∙మరుసటి రోజు ఉదయం వడకట్టి, పైన మిగిలిన పదార్థం తీసి పక్కన ఉంచాలి ∙మరొక పాత్రలో పాలు పోసి మూడు వంతులకు తగ్గేవరకు మరిగించాలి ∙తియ్య కోవా జత చే సి బాగా కలిపి పక్కనుంచాలి ∙ఫ్రిజ్‌లో నుంచి ఐస్‌క్రీమ్, పాలు, బాదం పిసిన్ బయటకు తీయాలి ∙నన్నారి సిరప్‌ను కూడా తీసుకోవాలి ∙ఒకపాత్రలో తగినంత బాదం పిసిన్, కోవా పాలు, నన్నారి సిరప్ వేసి బాగా కలిపి గ్లాసులలో పోయాలి ∙ఐస్‌క్రీమ్ స్కూప్‌తో తీసి పైన వేసి అందించాలి. -
బాదమ్ బర్ఫీ
కావలసినవి: బాదంపప్పు – కప్పు; చక్కెర – 1 1/4 కప్పు; నెయ్యి – 1/4 కప్పు ( 6 టేబుల్ స్పూన్లు); పాలు – 1/4 కప్పు; పిస్తా – గార్నిష్‌కి సరిపడా. తయారీ: బాదంపప్పులను కొద్దిసేపు వేడినీళ్ళలో నానబెటì ్ట తరవాత పొట్టు తీయాలి. తరవాత దానిని పాలతో కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి. ఒక పాన్ తీసుకొని పంచదార, కొద్దిగా నీరు పోసి తీగ పాకం పట్టాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్‌ని పాకంలో వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలి. అది దగ్గరకి వస్తుండగా కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలపాలి. ఈలోగా ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలి. బాగా ఉడికి విడివిడిలాడుతుండగా దింపేయాలి. వెంటనే ప్లేట్ మీద కొద్దిగా మందంగా ఈ మిశ్రమాన్ని వేయాలి. అది గట్టిపడుతుండగా మీకు కావలసిన షేప్‌లో కట్ చేయాలి. చివరగా బాదం, పిస్తా పలుకులతో గార్నిష్ చేయాలి.