బాదం గింజలను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బాదం బలవర్ధకమైన ఆహారం. వీటిలో తియ్యగా, చేదుగా ఉండే రెండు రకాలు ఉంటాయి. సాధారణంగా తినుబండారాల కోసం తియ్యటి బాదంను వాడుతూ ఉంటారు. ఈ బాదం పప్పుతోనే బాదం పాలను కూడా తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా బాదం సాగవుతోందంటే దీని వినియోగం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని అంతగా ఇష్టపడని వారు కూడా తమ డైట్‌లో చేర్చుకుంటారు.
బాదంలో ఉండే పోషకాలు
►బాదంలో ఫైబర్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగు మోతాదుల్లో లభిస్తాయి.
►ఇందులో మాంసకృత్తులు కూడా ఎక్కువే.
►బాదంలో విటమిన్- ఇ పుష్కలం.
►పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు కూడా బాదం తినడం ద్వారా లభిస్తాయి.
ఒక ఔన్సు అంటే సుమారు 28 గ్రాముల బాదంలో ఉండే పోషకాలు
ఫైబర్- 3.5 గ్రా.
ప్రొటిన్ 6 గ్రా.
ఫ్యాట్- 14 గ్రా.
విటమిన్ ఈ- 37 శాతం
మాంగనీస్- 32 శాతం
మెగ్నీషియం- 20 శాతం
వీటితో పాటు కాపర్, విటమిన్ బీ2(రాబోఫ్లావిన్), ఫాస్పరస్ కూడా ఉంటాయి.
బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
►బాదం తింటే గుండె పనితీరు మెరుగవుతుంది.
►అలసిన శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది.
►రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచే గుణం బాదంలో ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు బాదం తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
►మెదడు పనితీరు చురుగ్గా ఉండేందుకు బాదం ఉపయోగపడుతుంది.
►బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి.
►కాన్సర్ ముప్పును నివారిస్తాయి. అయితే, చాలా మందికి బాదంను రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొట్టు తీసి తినడం అలవాటు. నిజానికి పొట్టులోనే యాంటీ ఆక్సిడెంట్లు ►ఉంటాయి. కాబట్టి ఇలా పొట్టు తీసి తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.
►బాదంలో విటమిన్–ఇ ఎక్కువగా ఉండటం వల్ల చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
►ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
►మంచి పెరుగు తింటే జీర్ణాశయానికి ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలు అంతకు తక్కువేమీ కాదు.
►బాదంలో ఉండే ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.
►బాదంలో మెగ్నీషియమ్ ఉంటుంది. రక్తపోటు నివారణకు ఇది బాగా ఉపయోగపడుతుంది.
►కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు బాదం తీసుకుంటే మంచిది.
►బాదంలో ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఊబకాయులు బరువు పెరగకుండా నియంత్రించుకోడానికి ఇది అనువైనది.
►నిజానికి బాదంను ఎప్పుడైనా తినవచ్చు.
►రాత్రి భోజనంలో వేటమాంసం తిన్న తర్వాత కొన్ని బాదం గింజలు తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
Comments
Please login to add a commentAdd a comment