badam milk
-
ఈ వెరైటీ వంటకాలను.. ఎప్పుడైనా ట్రై చేశారా..!?
హనీ– మిల్క్ పౌడర్ కప్ కేక్..కావలసినవి..తేనె– 1 కప్పు;మిల్క్ పౌడర్– 1 కప్పు;మైదా పిండి– అర కప్పు;పంచదార– పావు కప్పు (పొడి చేసుకోవాలి, అభిరుచి బట్టి కాస్త పెంచుకోవచ్చు);నెయ్యి, కొబ్బరి కోరు– అర కప్పు చొప్పున;గుడ్లు– 4, చిక్కటి పాలు– 2 టేబుల్ స్పూన్లు;తినే సోడా, వెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్ చొప్పున;తయారీ..ముందుగా ఒక బౌల్లో గుడ్లు కొట్టి, పాలు పోసి క్రీమీగా అయ్యేలా బాగా గిలకొట్టుకోవాలి.ఆ మిశ్రమంలో తేనె, మైదా, మిల్క్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి. తర్వాత తినే సోడా, సగం నెయ్యి, వెనీలా ఎసెన్ ్స వేసుకుని బాగా కలుపుకోవాలి.ఈలోపు మిగిలిన నేతిలో కొబ్బరి కోరు, పంచదార పొడి వేసుకుని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మినీ కేక్ బౌల్స్ తీసుకుని, వాటికి నెయ్యి రాసి పెట్టుకోవాలి.తర్వాత వాటిలో కొద్దిగా గుడ్ల మిశ్రమం వేసుకుని మధ్యలో కొద్దిగా కొబ్బరికోరు మిశ్రమం నింపుకుని, మళ్లీ పైన గుడ్ల మిశ్రమాన్ని వేసుకుని నింపుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి.చల్లారాక క్రీమ్‌తో గార్నిష్ చేసుకుని, పైన గార్నిష్ కోసం.. కొద్దిగా తేనె పోసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఎగ్ – బాదం హల్వా..కావలసినవి..గుడ్లు– 8, బాదం పాలు– 1 కప్పు;కస్టర్డ్ మిల్క్– పావు కప్పు;పంచదార– 1 టేబుల్ స్పూన్ (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు);ఏలకుల పొడి– 1 టీ స్పూన్;నెయ్యి– 4 టేబుల్ స్పూన్లు;కుంకుమ పువ్వు– చిటికెడు;వెనీలా ఎసెన్ ్స– 1 టీ స్పూన్;బాదంపప్పు– 2 టేబుల్ స్పూన్లు (దోరగా నేతిలో వేయించాలి, అభిరుచిని బట్టి జీడిపప్పు, కిస్మిస్ వంటివి జోడించుకోవచ్చు);తయారీ..ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్లలోని పసుపు సొనను మాత్రమే తీసుకుని, బాగా గిలకొట్టాలి.అందులో కస్టర్డ్ మిల్క్, బాదం పాలు, పంచదార, ఏలకుల పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మరోసారి కలుపుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని, పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని, అందులో ఈ మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద ఉడికించుకోవాలి.మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మిశ్రమం సగానికి తగ్గుతున్నప్పుడు కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి.మళ్లీ మధ్యమధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కాస్త దగ్గర పడుతున్నప్పుడు వెనీలా ఎసెన్ ్స వేసుకుని మరోసారి కలపాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడుతున్న సమయంలో నేతిలో వేయించిన బాదం పప్పు వంటి వేసుకుని, కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్వీట్‌కార్న్ ఇడియాప్పం..కావలసినవి..స్వీట్ కార్న్ జ్యూస్ (వడకట్టుకోవాలి);బియ్యప్పిండి– 3 కప్పులు చొప్పున;జొన్న పిండి, ఓట్స్ పౌడర్– పావు కప్పు చొప్పున:జీలకర్ర పొడి– పావు టీ స్పూన్;చిక్కటి కొబ్బరి పాలు– పావు కప్పు;నీళ్లు– కొద్దిగా, నెయ్యి– 1 టీ స్పూన్;ఎల్లో ఫుడ్ కలర్– కొద్దిగా (అభిరుచి బట్టి);తయారీ..ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, జీలకర్ర పొడి, స్వీట్‌కార్న్ జ్యూస్, కొబ్బరి పాలు వేసుకుని కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుని, మరోసారి బాగా కలుపుకోవాలి.తర్వాత ఇడ్లీ పాన్ లేదా పెద్ద బౌల్‌కి బ్రష్‌తో నెయ్యి పూసుకోవాలి.అనంతరం మురుకుల మేకర్‌కి సన్నని హోల్స్ ఉండే ప్లేట్‌ని అమర్చి, అందులో ఈ మిశ్రమాన్ని సగానికి నింపుకుని, ఇడ్లీ పాన్ లో లేదా పెద్ద బౌల్లో నూడుల్స్‌లా ఒత్తుకుని ఆవిరిపై ఉడికించాలి.అభిరుచిని బట్టి ఆవాలు, కరివేపాకు, కొత్తిమీరలతో తాళింపు వేసి, కలుపుకుని.. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!? -
సమ్మర్లో చల్లటి బాదం పాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
అప్పుడే వేసవికాలం వచ్చేసిందా అన్నంతగా మార్చి నుంచి ఎండ దంచి కొడుతోంది. బయట సూర్యుడి భగ భగలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఎండకు చెమటలు పట్టేసి అలిసి సొమ్మసిల్లిపోతుంటా. ఈ కాలంలో ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలే తాగేందుకు ఇష్టపడతాం. అలా అని కూల్‌డ్రింక్‌లు తాగితే అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా వాటిలో అధికంగా చక్కెర పరిమాణం ఉంటుంది. అందువల్లో ఇంట్లోనే హెల్తీగా ఉండే బాదం పాలు చలచల్లగా చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ సమ్మర్లో మంచి దాహార్తిని తీర్చే బలవర్థకమైన పానీయం కూడా.రీ బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలంటే.. కావలసిన పదార్థాలు: బాదం పప్పులు- ఒక కప్పు (ఎక్కువ పరిమాణంలో కావాలి అంటే.. ఎక్కువ తీసుకోవచ్చు) జీడిపప్పు- ఒక కప్పు చక్కర – 100 గ్రాములు.. ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. యాలకుల పొడి -ఒక స్పూన్.. రుచి మరింతగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. పాలు – అర లీటర్..(ఒకవేళ ఎక్కువ పాలు కావాలనుకుంటే మరిన్ని ఎక్కువ తీసుకోవచ్చు) తయారీ విధానం.. బాదంపప్పులను, జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న తీయని పాలను వేడి చేసుకోవాలి. అలా వేడిగా ఉన్న పాలలో యాలకుల పొడి, చక్కర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పోటీ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని అందులో కలపాలి. అనంతరం చిన్న మంట మీద పది నుంచి 15 నిమిషాలు ఆ పాలను మరగనివ్వాలి. ఆ తర్వాత పాలను దింపి చల్లారపెట్టాలి. అనంతరం ఆ పాలను గ్లాసుల్లో పోసుకొని.. పైన సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, కిస్మిస్ మొక్కలు వేసి కొద్దిసేపు అలా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక అర్థగంట లేద గంట తర్వాత బయటకు తీస్తే చల్ల చల్లని బాదంపాలు సిద్ధంగా ఉంటాయి. అల వాటిని ఆస్వాదించుకుంటూ తాగొచ్చు. ఇలా పాలను రోజు పిల్లలకు తాగిస్తే ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు. బయట తాగే బాదం పాలకంటే.. ఇంట్లో తయారు చేసుకునే బాదంపాలే ఆరోగ్యానికి మంచిది కూడా. బాదం పాలలో మంచి ఫైబర్ ఉంటుంది. జీడిపప్పులో కావాల్సినన్ని మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొవ్వులు తగ్గిస్తాయి. బరువులు తగ్గించడంలో సహకరిస్తాయి. బాదంపప్పులను రోజు ఉదయం లేవగానే తింటే మెదడు పనితీరు బాగుంటుంది. బాదంలోని క్యాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. పిల్లలు ఏకాగ్రతను పెంచుతుంది. ఈ బాదంపాలు తాగేందుకు టేస్టీగా ఉండటంతో పిల్లలు కూడా భలే ఇష్టంగా తాగుతుంటారు. (చదవండి: నటి ఒలివియాకి బ్రెస్ట్ కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!) -
Health Tips: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా.. అయితే
బాదం గింజలను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బాదం బలవర్ధకమైన ఆహారం. వీటిలో తియ్యగా, చేదుగా ఉండే రెండు రకాలు ఉంటాయి. సాధారణంగా తినుబండారాల కోసం తియ్యటి బాదంను వాడుతూ ఉంటారు. ఈ బాదం పప్పుతోనే బాదం పాలను కూడా తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా బాదం సాగవుతోందంటే దీని వినియోగం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని అంతగా ఇష్టపడని వారు కూడా తమ డైట్లో చేర్చుకుంటారు. బాదంలో ఉండే పోషకాలు ►బాదంలో ఫైబర్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగు మోతాదుల్లో లభిస్తాయి. ►ఇందులో మాంసకృత్తులు కూడా ఎక్కువే. ►బాదంలో విటమిన్- ఇ పుష్కలం. ►పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు కూడా బాదం తినడం ద్వారా లభిస్తాయి. ఒక ఔన్సు అంటే సుమారు 28 గ్రాముల బాదంలో ఉండే పోషకాలు ఫైబర్- 3.5 గ్రా. ప్రొటిన్ 6 గ్రా. ఫ్యాట్- 14 గ్రా. విటమిన్ ఈ- 37 శాతం మాంగనీస్- 32 శాతం మెగ్నీషియం- 20 శాతం వీటితో పాటు కాపర్, విటమిన్ బీ2(రాబోఫ్లావిన్), ఫాస్పరస్ కూడా ఉంటాయి. బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►బాదం తింటే గుండె పనితీరు మెరుగవుతుంది. ►అలసిన శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది. ►రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచే గుణం బాదంలో ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు బాదం తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ►మెదడు పనితీరు చురుగ్గా ఉండేందుకు బాదం ఉపయోగపడుతుంది. ►బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. ►కాన్సర్ ముప్పును నివారిస్తాయి. అయితే, చాలా మందికి బాదంను రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొట్టు తీసి తినడం అలవాటు. నిజానికి పొట్టులోనే యాంటీ ఆక్సిడెంట్లు ►ఉంటాయి. కాబట్టి ఇలా పొట్టు తీసి తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ►బాదంలో విటమిన్–ఇ ఎక్కువగా ఉండటం వల్ల చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ►మంచి పెరుగు తింటే జీర్ణాశయానికి ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలు అంతకు తక్కువేమీ కాదు. ►బాదంలో ఉండే ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ►బాదంలో మెగ్నీషియమ్ ఉంటుంది. రక్తపోటు నివారణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ►కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు బాదం తీసుకుంటే మంచిది. ►బాదంలో ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఊబకాయులు బరువు పెరగకుండా నియంత్రించుకోడానికి ఇది అనువైనది. ►నిజానికి బాదంను ఎప్పుడైనా తినవచ్చు. ►రాత్రి భోజనంలో వేటమాంసం తిన్న తర్వాత కొన్ని బాదం గింజలు తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
మత్తు మందు కలిపిన బాదం పాలు ఇచ్చి దోపిడీ
కేరళ ఎక్స్‌ప్రెస్ రైలులో సంఘటన వరంగల్ జీఆర్పీలో బాధితుడి ఫిర్యాదు రైల్వేగేట్ : రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి మత్తు మందు కలిపిన బాదం పాలు ఇచ్చి అతడిని నిలువు దోపిడీ చేసిన సంఘటన కేరళ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం జరిగింది. వరంగల్ జీఆర్పీ ఎస్సై ఎస్. శ్రీనివాస్ కథనం ప్రకారం.. కరీంనగర్ పట్టణంలోని కట్టరాంపూర్‌కు చెందిన పారిపల్లి మనోహర్(42) ఈ నెల 9న ఢిల్లీ నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏ–2 కోచ్ 27వ బెర్త్‌లో వరంగల్‌కు వస్తున్నాడు. రైలు మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో భూపాల్ వరకు రాగానే ఇద్దరు వ్యక్తులు బోగీలోకి వచ్చారు. వారి చేతుల్లో వాటర్ బాటిల్, బాదం పాల బాటిల్ ఉన్నాయి. కొద్దిసేపటి తర్వాత ఆ ఇద్దరిలో ఒకరు వాటర్ తాగమని మనోహర్‌కు ఇవ్వగా తాగాడు. మరి కొద్దిసేపటికి మరొకరు తన వద్ద ఉన్న మత్తు మందు కలిపిన బాదం పాలు ఇచ్చాడు. అవి మనోహర్ తాగగానే వెంటనే మత్తులోకి జారుకున్నాడు. రైలు బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రామగుండం రైల్వేస్టేషన్ వద్దకు రాగానే మనోహర్‌కు మెలకువ వచ్చింది. ఇంతలో తన వద్ద ఉన్న వస్తువులను చూసుకోగా కనిపించలేదు. తన వద్ద ఉన్న ఒక తులం బంగారు గొలుసు, రెండు తులాల బంగారు రింగులు, రూ.14 వేల విలువ కలిగిన వివో ఫోన్, రూ.18 వేల విలువైన ల్యాప్‌టాప్, రూ.3 వేల విలువైన మూడు చీరెలను దొంగలు అపహరించినట్లు బాధితుడు రైలు వరంగల్‌లో ఆగినపుడు వరంగల్ జీఆర్పీలో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.