అప్పుడే వేసవికాలం వచ్చేసిందా అన్నంతగా మార్చి నుంచి ఎండ దంచి కొడుతోంది. బయట సూర్యుడి భగ భగలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఎండకు చెమటలు పట్టేసి అలిసి సొమ్మసిల్లిపోతుంటా. ఈ కాలంలో ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలే తాగేందుకు ఇష్టపడతాం. అలా అని కూల్‌డ్రింక్‌లు తాగితే అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా వాటిలో అధికంగా చక్కెర పరిమాణం ఉంటుంది. అందువల్లో ఇంట్లోనే హెల్తీగా ఉండే బాదం పాలు చలచల్లగా చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ సమ్మర్‌లో మంచి దాహార్తిని తీర్చే బలవర్థకమైన పానీయం కూడా.రీ బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలంటే..
కావలసిన పదార్థాలు:
బాదం పప్పులు- ఒక కప్పు (ఎక్కువ పరిమాణంలో కావాలి అంటే.. ఎక్కువ తీసుకోవచ్చు)
జీడిపప్పు- ఒక కప్పు
చక్కర – 100 గ్రాములు.. ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు.
యాలకుల పొడి -ఒక స్పూన్.. రుచి మరింతగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు.
పాలు – అర లీటర్..(ఒకవేళ ఎక్కువ పాలు కావాలనుకుంటే మరిన్ని ఎక్కువ తీసుకోవచ్చు)
తయారీ విధానం..
బాదంపప్పులను, జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న తీయని పాలను వేడి చేసుకోవాలి. అలా వేడిగా ఉన్న పాలలో యాలకుల పొడి, చక్కర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పోటీ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని అందులో కలపాలి. అనంతరం చిన్న మంట మీద పది నుంచి 15 నిమిషాలు ఆ పాలను మరగనివ్వాలి. ఆ తర్వాత పాలను దింపి చల్లారపెట్టాలి. అనంతరం ఆ పాలను గ్లాసుల్లో పోసుకొని.. పైన సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, కిస్మిస్ మొక్కలు వేసి కొద్దిసేపు అలా ఫ్రిజ్లో పెట్టాలి. ఒక అర్థగంట లేద గంట తర్వాత బయటకు తీస్తే చల్ల చల్లని బాదంపాలు సిద్ధంగా ఉంటాయి. అల వాటిని ఆస్వాదించుకుంటూ తాగొచ్చు. ఇలా పాలను రోజు పిల్లలకు తాగిస్తే ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు. బయట తాగే బాదం పాలకంటే.. ఇంట్లో తయారు చేసుకునే బాదంపాలే ఆరోగ్యానికి మంచిది కూడా.
బాదం పాలలో మంచి ఫైబర్ ఉంటుంది. జీడిపప్పులో కావాల్సినన్ని మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొవ్వులు తగ్గిస్తాయి. బరువులు తగ్గించడంలో సహకరిస్తాయి. బాదంపప్పులను రోజు ఉదయం లేవగానే తింటే మెదడు పనితీరు బాగుంటుంది. బాదంలోని క్యాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. పిల్లలు ఏకాగ్రతను పెంచుతుంది. ఈ బాదంపాలు తాగేందుకు టేస్టీగా ఉండటంతో పిల్లలు కూడా భలే ఇష్టంగా తాగుతుంటారు.
(చదవండి: నటి ఒలివియాకి బ్రెస్ట్ కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!)
Comments
Please login to add a commentAdd a comment