భోపాల్‌లో హైదరాబాద్‌ షర్బత్‌.. ‍క్యూ కడుతున్న జనం! | Hyderabads Famous Tahura Drink Became a Hit in Bhopal | Sakshi
Sakshi News home page

Madhya Pradesh: భోపాల్‌లో హైదరాబాద్‌ షర్బత్‌.. ‍క్యూ కడుతున్న జనం!

Published Sat, Mar 30 2024 8:34 AM | Last Updated on Sat, Mar 30 2024 11:44 AM

Hyderabads Famous Tahura Drink Became a Hit in Bhopal - Sakshi

వేసవిలో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి చల్లని ఐస్ క్రీం లేదా ఏదైనా  పానీయాన్ని తాగాలని ఎవరైనా అనుకుంటారు. హైదరాబాద్‌లో ఆదరణ పొందిన తహురా పానీయం ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోకి ‍ప్రవేశించింది. ముగ్గురు స్నేహితులు ఈ శీతల పానీయ విక్రయాలను భోపాల్‌లో  ప్రారంభించారు. 

హైదరాబాద్‌లో రంజాన్ సందర్భంగా ఈ పానీయానికి మంచి డిమాండ్‌ ఉంటుంది. అయితే వేసవి ఉపశమనానికి ఈ షర్బత్ మ్యాజిక్‌లా పనిచేస్తుందని పలువురు అంటుంటారు.  డ్రై ఫ్రూట్స్, పాలతో తయారు చేసే ఈ షర్బత్‌ను భోపాల్ ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ శీతలపానీయాల దుకాణం ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే ఈ షర్బత్‌కు మంచి డిమాండ్‌ ఏర్పడింది. 

భోపాల్‌లోని మోతీ మసీదు కూడలిలో తహురా పేరుతో ఒక దుకాణాన్ని ఈ ప్రాంతానికి చెందిన ఫరూక్ షేక్, జునైద్ అలీ షేక్, జైన్ ఖాన్ ప్రారంభించారు. మహారాష్ట్రంలోని పూణేలో వీరు ఈ షర్బత్‌ను రుచి చూశాక భోపాల్‌లో ఈ పానీయాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ షర్బత్‌ను ఫరూఖ్, అతని స్నేహితులు స్వయంగా తయారు చేస్తారు. వీరి దుకాణం సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. బాదం, పిస్తా, పాలతో తయారు చేసే ఈ పానీయంలో చక్కెరను అస్సలు ఉపయోగించరు. ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని చాలామంది చెబుతుంటారు. ఈ పానీయాన్ని తాగేందుకు జనం ‘తహురా’ దుకాణం ముందు క్యూ కడుతుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement