Cool
-
బ్యాక్ ప్యాక్ కూలర్ బ్యాగు
కూల్‌డ్రింక్స్ వంటివి చల్లగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. ఆరుబ యట పిక్నిక్లకు వెళ్లేటప్పుడు ఇవన్నీ చల్లగా దొరకాలంటే కుదిరే పని కాదు. వాటి కోసం పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను లేదా ఐస్‌మేకర్లను తీసుకుపోవాల్సి ఉంటుంది. అయితే, పిక్నిక్ లకు వెళ్లేటప్పుడు ఈ సంచి వెంట ఉంటే చాలు. పోర్టబుల్ రిఫ్రిజిరేటర్లను, ఐస్మేక ర్లను మోసుకుపోనవసరం ఉండదు. ముందుగానే ఇంట్లోని ఫ్రిజ్‌లో చల్లబరచిన పానీయాల సీసాలు,క్యాన్లను ఇందులో పడేసుకుని తీసుకుపోతే చాలు. ఇందులో భద్రపరచిన సీసాలు, క్యాన్లు ఇరవైనాలుగు గంటలసేపు ఏమాత్రం చల్లదనం కోల్పోకుండా, అప్పుడే ఫ్రిజ్‌లోంచి బయటకు తీసిన ట్లుగా ఉంటాయి. కట్టుదిట్టమైన ఇన్సులేష న్‌తో రూపొందించిన ఈ బ్యాగ్ లోపల ఎంత చల్లని వస్తువులను ఉంచినా, బయటకు ఏమాత్రం నీరు చిమ్మదు. కెనడియన్ స్టార్టప్ కంపెనీ ‘కూలీ’ పేరుతో ఈ బ్యాక్‌ప్యాక్ కూలర్ బ్యాగును ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఇదీ చదవండి: వోయేజర్–1 పునరుత్థానం! 43 ఏళ్ల తర్వాత నాసాకు సందేశం -
క్రికెట్లో కృత్రిమ మేధ.. ఐస్ కూల్‌గా ఐపీఎల్ (ఫోటోలు)
-
భోపాల్‌లో హైదరాబాద్ షర్బత్.. క్యూ కడుతున్న జనం!
వేసవిలో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి చల్లని ఐస్ క్రీం లేదా ఏదైనా పానీయాన్ని తాగాలని ఎవరైనా అనుకుంటారు. హైదరాబాద్‌లో ఆదరణ పొందిన తహురా పానీయం ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోకి ప్రవేశించింది. ముగ్గురు స్నేహితులు ఈ శీతల పానీయ విక్రయాలను భోపాల్‌లో ప్రారంభించారు. హైదరాబాద్‌లో రంజాన్ సందర్భంగా ఈ పానీయానికి మంచి డిమాండ్ ఉంటుంది. అయితే వేసవి ఉపశమనానికి ఈ షర్బత్ మ్యాజిక్‌లా పనిచేస్తుందని పలువురు అంటుంటారు. డ్రై ఫ్రూట్స్, పాలతో తయారు చేసే ఈ షర్బత్‌ను భోపాల్ ప్రజలు ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఈ శీతలపానీయాల దుకాణం ప్రారంభించిన నాలుగైదు రోజుల్లోనే ఈ షర్బత్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. భోపాల్‌లోని మోతీ మసీదు కూడలిలో తహురా పేరుతో ఒక దుకాణాన్ని ఈ ప్రాంతానికి చెందిన ఫరూక్ షేక్, జునైద్ అలీ షేక్, జైన్ ఖాన్ ప్రారంభించారు. మహారాష్ట్రంలోని పూణేలో వీరు ఈ షర్బత్‌ను రుచి చూశాక భోపాల్‌లో ఈ పానీయాన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ షర్బత్‌ను ఫరూఖ్, అతని స్నేహితులు స్వయంగా తయారు చేస్తారు. వీరి దుకాణం సాయంత్రం 5 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. బాదం, పిస్తా, పాలతో తయారు చేసే ఈ పానీయంలో చక్కెరను అస్సలు ఉపయోగించరు. ఇది వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని చాలామంది చెబుతుంటారు. ఈ పానీయాన్ని తాగేందుకు జనం ‘తహురా’ దుకాణం ముందు క్యూ కడుతుంటారు. -
వేసవి కాలంలో చలవ చేయాలంటే ఈ పప్పులు ఉత్తమం
ఎండలు ముదురుతున్నాయి. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు చెమటలు విసిగిస్తాయి. దీంతో శ్రద్ధగా వంట చేయాలంటే చాలా కష్టం. ఎంత తొందరగా పని ముగించుకుని వంటింట్లోంచి బైటపడదామా అని పిస్తుంది. అందుకే దీని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే చమటరూపంలో ఎక్కువ నీరు పోవడం వల్ల, దాహంఎక్కువ కావడం వల్ల, శరీరం తొందరగా వేడెక్కుతుంది. మరి శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచడంతోపాటు పోషకాలు అందించే కొన్ని పప్పులు గురించి తెలుసుకుందామా! వేసవి కాలంలో మనం తీసుకునే ఆహారం పై కూడా శ్రద్ధ పెట్టాలి. పెసరపప్పు, శనగ పప్పు, మినపప్పు, సోయా, బఠానీ లాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. పెసరపప్పు మిగిలిన అన్ని పప్పులతో పోలిస్తే కొద్దిగా భిన్నంగా ఉంటుది. ఎక్కువ చలవ చేస్తుంది. పెసరపప్పు: వేసవికాలంలో ముందుగా గుర్తొచ్చేది పెసరప్పు చేసుకొనే పెసరకట్టు. తేలిగ్గా జీర్ణం అయ్యేలా.. అల్లం, పచ్చిమర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలతో.. కమ్మ కమ్మగా ఉండేలా దీన్ని చేసుకోవచ్చు. అలాగే పెసర పప్పు-మెంతికూర, బీరకాయ-పెసరపప్పు, పొట్లకాయ-పెసరపప్పు ఇలా రకరకాల కాంబినేషన్స్‌లో దీన్ని తీసుకోవచ్చు. ఈ పప్పులో ప్రోటీన్, విటమిన్ ఎ, బి, సి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం, ఐరన్, కాపర్, మెగ్నీషియం లభిస్తాయి. ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.అలాగే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాయధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వేసవిలో పెసరపప్పు చలవచేస్తుందని గర్భధారణ సమయంలో కూడా దీన్ని భేషుగ్గా తినవచ్చని ఆహార నిపుణులు చెబుతారు.. మినపప్పు: ఇది వేసవిలో చల్లదనాన్ని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ ,ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మంచి ఐరన్ లభిస్తుంది. కడుపు, చర్మానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పోపులు, పచ్చళ్లలో వాడటంతోపాటు, ఇడ్లీ, దోస, వడ లాంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. సోయాబీన్: వేసవిలో సోయాబీన్ పప్పు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా స్థిరంగా ఉంటుంది. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, శక్తి, కాల్షియం, పొటాషియం అందుతాయి. మినపప్పు ఆహారంలో చేర్చుకుంటే రక్తపోటు ,కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. ఎముకలు ధృఢంగా ఉంటాయి. శనగ పప్పు: ఇదిజీర్ణం కావడం కష్టమని, శరీరంలో వేడి పెంచుతుందని వేసవిలో చాలా మంది దీన్ని తినరు. కానీ వేసవిలో ఈ పప్పు తింటే మేలు జరుగుతుంది. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం , కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల వేసవిలో కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. నానపెట్టిన శనగలని అల్పాహారంగా చేసి పిల్లలకి పెడితే చాలా మంచిది. అయితే తిన్న తర్వాత ఎక్కువ నీరు త్రాగాలి. నోట్. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టు పప్పుల్లో కూడా కల్లీ ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కల్తీని జాగ్రత్తగా గమనిస్తూ శ్రేష్ఠమైన పప్పులను ఎంచుకోవాలి. -
ఊరట: వచ్చే నెల నుంచి కూరగాయల రేట్లు తగ్గుముఖం
న్యూఢిల్లీ: కొత్త పంటలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటమే ఆందోళనకర అంశంగా మారిందని ఆయన చెప్పారు. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టమైన 7.44 శాతం స్థాయికి ఎగిసిన నేపథ్యంలో ప్రభుత్వ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూరగాయల రేట్ల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఎగియడం తాత్కాలికమేనని, ధరలు వేగంగా దిగి వచ్చే అవకాశం ఉందని అధికారి వివరించారు. వర్షపాతం 6 శాతం తక్కువగా నమోదు కావడం వల్ల ఖరీఫ్ సీజన్‌పై పెద్దగా ప్రభావం చూపబోదని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచమంతటా ధరలు పెరిగిపోయాయని, భారత్ కూడా ఇందుకు మినహాయింపు కాదని ఆయన చెప్పారు. అయితే, ధరలను తక్కువ స్థాయిలో ఉంచేందుకు సరళతర వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటం వల్ల భారత్ కాస్త మెరుగైన స్థితిలో ఉందన్నారు. అటు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు యోచనేదీ ప్రభుత్వానికి లేదని అధికారి తెలిపారు. మరోవైపు, క్రూడాయిల్ రేట్లు ఇటీవలి కాలంలో పెరుగుతుండటం కాస్త ఆందోళనకర అంశమే అయినప్పటికీ.. చమురు మార్కెటింగ్ కంపెనీల కోణంలో ప్రస్తుతానికైతే భరించగలిగే స్థాయిలోనే ఉన్నాయని ఆయన వివరించారు. ముడిచమురు రేట్లు 80-90 డాలర్ల మధ్య వరకూ ఉంటే ఫర్వాలేదని, 90 డాలర్లు దాటితేనే ద్రవ్యోల్బణం, ఇతరత్రా అంశాలపై ప్రభావం పడగలదని పేర్కొన్నారు. -
చల్లటి నీళ్లు కావాలా నాయనా.? కొన'కుండ' ఉండలేరు మరి!
కురబలకోట : మట్టి కుండలు అనాదిగా వాడుకలో ఉన్నాయి. అల్యూమినియం, స్టీలు, ఇతర పాత్రల ప్రవేశంతో వీటికి ఆదరణ తగ్గింది. ఆధునిక (మెటల్) వంట పాత్రల వాడకం ద్వారా రోగాలు కూడా మనిషిని చుట్టుముట్టాయి. దీంతో మళ్లీ జనం ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు వంటకు, తాగునీళ్లకు కుండలను ఆదరిస్తున్నారు. మట్టివి తిరిగి జన జీవన స్రవంతిలో కన్పిస్తున్నాయి. తీరెను తాపం, కలిగించెన్ ఉపశమనం వేసవిలో మట్టి కుండల్లో నీళ్లు తాగడం హాయి హాయిగా.. కూల్ కూల్‌గా అన్పిస్తుంది. వేసవి తాపాన్ని తీరుస్తాయి. దీంతో ఈ నీళ్లు మనస్సుకు హాయిని, శరీరానికి ఉపశమనాన్ని కల్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఎండల సీజన్. ఒక పక్క ఉక్క పోత, మరో వైపు మండుటెండలు. ఇలాంటి పరిస్థితుల్లో మట్టి కుండ అనగానే ఎవ్వరికై నా చల్లని నీళ్లు గుర్తుకు వస్తాయి. చలివేంద్రాలు అంటే కూడా మట్టి కుండలే కన్పిస్తాయి. ఈ కుండల్లో నీళ్లు తాగితే వేసవి తాపం తీరుతుంది. ఆల్కలీన్ లక్షణాలు నీటిలోని పీహెచ్ స్థాయుల్ని సమతుల్యం చేస్తాయని చెబుతారు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కుండ నీళ్ల వల్ల వక్రియ మెరుగపడి పొట్టకు ఇబ్బంది లేకుండా చేస్తాయన్న పేరుంది. అంతేగాకుండా ఖనిజాలు, లవణాలు కూడా అందుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మట్టి కుండల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సదుం, మదనపల్లె దగ్గర సీటీఎం, ఈడిగపల్లె, కాండ్లమడుగు, కుమ్మరపల్లె తదితర ప్రాంతాల్లో వీటిని అమ్ముతున్నారు. రోడ్ల పక్కన స్టాల్స్‌లో వీటిని విక్రయిస్తున్నారు. ఉక్క పోత ఎక్కువగా ఉండడం ఎండలు మండుతుండడంతో వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. మట్టి కుండ అంటనే చల్లదనానికి మారుపేరు. దీంతో చలివేంద్రాలలో ఎక్కడ చూసినా మట్టి కుండలే కన్పిస్తాయి. మట్టి కుండలకు పెట్టింది పేరు మట్టి కుండలు, బొమ్మలు అంటేనే ఎవ్వరికై నా తొలుత గుర్తుకు వచ్చేది కురబలకోట మండలంలోని అంగళ్లు, కంటేవారిపల్లె, ఆ తర్వాత పలమనేరులోని ఘంటావూరు. వీటికి ఇవి ప్రసిద్ధి. ఇక్కడ సీఎఫ్‌సీ సెంటర్లు, ఆధునిక మిషన్లు ఉండడంతో వీటి తయారీలో హస్త కళాకారులు ఆరితేరారు. కుండలు, కడవలు రూ.120 నుంచి రూ. 300 చొప్పున అమ్ముతున్నారు. మగ్గులు రూ.150 నుంచి రూ.250, వాటర్ బాటిళ్లు రూ.150 నుంచి రూ.200, పెరుగు, మజ్జిగ కుండలు రూ.50 నుంచి రూ.70 చొప్పున విక్రయిస్తున్నట్లు హస్తకళాకారులు వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు సరఫరా కుండల తయారీ వెనుక కుమ్మరుల కృషి ప్రశంసనీయం. వేసవి వస్తే వీటికి తరగని డిమాండ్ ఉంటుంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫారా అవుతున్నాయి. వీటిలో నీళ్లు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. మూడు నెలలు వేసవి సీజన్ ఉంటుంది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రూ.2 కోట్ల దాకా ఈ కుండల అమ్మకం ద్వారా లావాదేవీలు జరుగుతాయి. – కష్ణమూర్తి, టెర్రకోట హస్తకళాకారుల సలహాదారు ఫ్రిజ్‌లున్నా వీటిపైనే మక్కువ నగర, పట్టణ వాసులు సై తం ఫ్రిజ్‌లు ఉన్నా మట్టి కుండల వైపే చూస్తున్నా రు. వీటిలో నీళ్లు సహజంగా చల్లబడతాయి. ఆరోగ్యానికి శ్రేయస్కరమని ని పుణులు చెబుతారు. మనిషి నాగరిగత నేర్చుకు న్న తర్వాత మొదటి వంట చేసింది మట్టి పాత్రల్లోనే అని చెబుతారు. ఇవి ఇళ్లలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరో వైపు పర్యావరణ ప్రేమికు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – శ్రీనివాసులు, హస్తకళాకారుల సంఘ నాయకులు, కురబలకోట మండలం కుండ నీరు శ్రేయస్కరం కుండ, కడవల్లోని నీరు ఎంతో మంచిది. ఇప్పటికీ పేదవాడి ప్రిడ్జ్‌గా పిలుస్తారు. సాధారణంగా మనిషి శరీరం ఆమ్లస్వభావం కల్గి ఉంటుంది. మట్టి ఆల్కలీన్. కుండనీళ్లు తాగినప్పుడు శరీర ఆమ్ల స్వభావంతో చర్య జరుపుతుంది. సరైన పీహెచ్‌కు దోహదపడుతుంది. భూమి వివిధ ఖనిజ లవణాల సహజ గని. దీని నుంచి వచ్చిన మట్టితో చేసే కుండలు, సామగ్రి ఆరోగ్య ప్రయోజనాలను కల్గిస్తుంది. – బి.పద్మనాభరెడ్డి, పవర్ వాటర్ టెక్ నిర్వాహకులు, గుంతవారిపల్లె -
భావి తరాల కోసం ‘కూల్ రూఫ్’
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో కూల్‌రూఫ్ పాలసీ అమలుకు శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభా వాన్ని నివాస గృహాలు, వాణిజ్య కార్యాలయాలపై తగ్గించేందుకు తీసుకొచ్చిన ‘తెలంగాణ కూల్‌రూఫ్ విధానం 2023–28’ను మంత్రి కేటీఆర్ సోమవారం పురపాలక శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 600 చదరపు గజాలకుపైగా విస్తీర్ణంలో నిర్మించే అపార్ట్మెంట్లు, ఇతర వాణిజ్య సముదాయాల్లో కూల్ రూఫ్ పాలసీని తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు. కూల్‌రూఫ్ పాలసీ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేలా నిబంధనలను మారుస్తామన్నారు. 600 గజాల్లోపు విస్తీర్ణంలో నిర్మించుకొనే ఇళ్లకు కూల్‌రూఫ్ విధానాన్ని ఆప్షన్‌గా ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లపై కూల్‌రూఫ్ విధానం అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు మొదలైన వాటిని ఈ విధానం ద్వారానే నిర్మించనున్నట్లు వివరించారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే... రాష్ట్రంలో దాదాపు 50 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తోందని, దేశంలోనే మూడవ అతిపెద్ద పట్టణీకరణ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కూల్‌రూఫ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 2030 నాటికి హైదరాబాద్‌లో 200 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం జీహెచ్ఎంసీ పరిధిలో 5 చదరపు కిలోమీటర్ల మేర, ఇతర పట్టణాల్లో 2.5 కిలోమీటర్ల మేర కూల్ రూఫ్‌ను అమలు చేస్తామన్నారు. పట్టణాల్లో వేడిని తగ్గించాలి.. పట్టణాల్లో జరిగే నిర్మాణాల వల్ల ఉత్పన్నమవుతున్న వేడిని ఎదుర్కోవడానికి వాతావరణ అనుకూలౖమెన శీతలీకరణ పరిష్కారాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాతకాలంలో పెంకుటిళ్లు, డంగు సున్నం, మట్టి గోడలు వేడిని ఆపాయని... ప్రస్తుతం భవన నిర్మాణాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్న ఇనుము, స్టీల్, ఇతర ఖనిజాలతో వేడి పెరిగిందన్నారు. భవిష్యత్ వాతావరణ సవాళ్లను పరిష్కరించే దిశలో రూఫ్ కూలింగ్ పాలసీ తప్పనిసరని చెప్పారు. పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది.. కూల్‌రూఫ్ విధానం అమలు కోసం చదరపు మీటర్‌కు రూ. 300 మాత్రమే ఖర్చవుతుందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ విధానం వల్ల ఏసీ ఖర్చులు, కరెంట్ బిల్లులు తగ్గే అవకాశం ఉన్నందున పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందన్నారు. తన ఇంటి మీద కూల్ రూఫింగ్ కోసం పెయింటింగ్ చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. కూల్ రూఫ్ కోసం ముందుకొచ్చే వారికి శిక్షణ అందించేందుకు పురపాలక శాఖ సిద్ధంగా ఉందన్నారు. త్వరలో ‘మన నగరం’అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు చెప్పిన మంత్రి కేటీఆర్... దీనిలో భాగంగా భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి వాటిని కూల్ రూఫింగ్కు దోహదపడే సామగ్రిగా మార్చి ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మి, కూల్‌రూఫ్ నిపుణులు, ప్రొఫెసర్ విశాల్ గార్గ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యూయార్క్ లక్ష్యంకన్నా మిన్నగా... విదేశాల్లోకన్నా అధిక విస్తీర్ణంలో తెలంగాణలో కూల్‌రూఫ్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ కూల్‌రూఫ్ నిర్దేశిత లక్ష్యం 10 లక్షల చదరపు అడుగులు లేదా 0.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అయితే కేవలం హైదరాబాద్, ఔటర్ రింగ్‌రోడ్డు కింద 1,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉందని, ఔటర్ లోపల 20 శాతం ప్రాంతాన్ని కూల్ రూఫింగ్ కిందకు తీసుకురానున్నట్లు చెప్పారు. -
వెచ్చదనమే కాదు.. వేసవిలో చల్లగానూ ఉంచే దుప్పటి గురించి తెలుసా?
సాధారణంగా చలికాలంలో దుప్పట్లు అవసరమవుతాయి. వేసవిలో ఏసీ గదుల్లో గడిపేవాళ్లు తప్ప మరెవరూ దుప్పట్లు వాడరు. అయితే ఏడాది పొడవునా వాడగలిగే దుప్పటిని అమెరికన్ కంపెనీ తయారు చేసింది. ‘హిలు’ బ్రాండ్ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ దుప్పటి సాదాసీదా దుప్పటి కాదు, ఇది ‘థర్మో రెగ్యులేటింగ్ బ్లాంకెట్’. పూర్తి గ్రాఫీన్ ఫైబర్‌తో అడాప్టెస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఈ దుప్పటి శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంచుతుంది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. చూడటానికి ఇది చాలా భారీగానే కనిపించినా, తేలికగా ఉంటుంది. పదేళ్ల వారంటీతో వివిధ సైజుల్లో లభించే ‘హిలు’ బ్లాంకెట్స్ 175 డాలర్లు (రూ.14,465) మొదలుకొని 550 డాలర్ల (రూ.45,464) వరకు వివిధ ధరల్లో దొరుకుతాయి. ప్రస్తుతం ఇవి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎగిరే ఏసీ! ఇల్లంతా తిరిగేస్తుంది.. సూపర్ గ్యాడ్జెట్) -
వైరల్ వీడియో: పూల్ క్లీనర్‌కు సహాయం చేస్తున్న చిన్న సముద్రపు ఒట్టర్
-
ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంతో తెలుసా?
మనం కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు తగ్గితేనే గజగజ వణికిపోతాం. మరి ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? అది ఎక్కడుంది? అనే విషయాలేంటో చూద్దాం! – సాక్షి, సెంట్రల్ డెస్క్ మైనస్ 60 డిగ్రీలు.. అంటార్కిటికా అత్యంత చల్లగా ఉండే ఖండం అని అందరికీ తెలిసిందే. అక్కడ జనాభా ఉండదు. అక్కడికి కేవలం కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనల నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. ఇదికాకుండా ప్రపంచంలో అత్యంత చల్లగా ఉండే ప్రదేశం ఏంటంటే.. రష్యాలో సైబీరియాలోని యాకుత్స్క్ నగరం. తక్కువ జనాభా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. ఇక్కడి జనాభా 3,36,200. వీరిలో ఎక్కువ మంది అల్రోసా అనే కంపెనీ నిర్వహించే వజ్రాల గనిలో పనిచేస్తుంటారు. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీలు. అయితే అంతకంటే ఎక్కువ చలిని కూడా తాము అనుభవించినట్లు స్థానికులు చెబుతారు. అయితే ఉష్ణోగ్రతను కొలిచేందుకు వినియోగించే థర్మామీటర్లో మైనస్ 63 డిగ్రీలే గరిష్టంగా చూపుతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నా ఇది చూపలేదు. ఇంకోటి కూడా ఉంది.. యాకుత్స్క్ నగరం అత్యంత శీతల ప్రాంతమైనప్పటికీ దీనికంటే ఎక్కువ చలి ఉన్న ప్రాంతం ఇంకోటి ఉంది. అదేంటంటే ఒమికోన్. అది కూడా రష్యాలోనే ఉంది. అక్కడ జనాభా 500లోపే. ఇక్కడ 1924లో ఉష్ణోగ్రత మైనస్ 71.2 డిగ్రీలు నమోదైంది. అయితే, ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. యాకుత్స్స్, ఒమికోన్ ప్రాంతాలు దగ్గర దగ్గరగా ఉండవు. రెండింటి మధ్య దూరం 928 కిలోమీటర్లు. ఒకచోటి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాలంటే 21 గంటలకు పైనే పడుతుంది. ఎక్కువగా చల్లగా ఎందుకంటే..? సైబీరియాలో అత్యంత చలి ఎందుకు ఉంటుంది.. అంటే ఇది అత్యంత ఎత్తులో ఉండటంతోపాటు ల్యాండ్మాస్ పెద్దఎత్తున ఉంటుందని పెన్సిల్వేనియాలోని మిల్లెర్స్విల్లే యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెక్స్ డికారియా చెప్పారు. సాధారణంగా మహాసముద్రాల్లో కంటే కూడా భూమి త్వరగా వేడెక్కుతుంది..అంతే వేగంగా చల్లగా మారిపోతుంది. అందుకే భూ ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు అత్యంత ఎక్కువగా, తక్కువగా నమోదవుతుంటాయి. అదే సైబీరియా విషయానికొస్తే.. మంచు కీలక పాత్ర పోషిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడిని ఈ మంచు అంతరిక్షంలోకి వెనక్కి పంపుతుంది. అందువల్ల సైబీరియాలో అత్యంత చల్లగా ఉంటుందని చెబుతారు. సాధారణంగా ఎక్కువ ఎత్తులో ఉండే ప్రాంతంలో పీడనం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ గాలి స్థిరంగా ఉంటుంది. దీనికితోడు తక్కువ తేమ శాతం ఉండటంతోపాటు ఆకాశం కూడా నిర్మలంగా ఉంటుంది. దీంతో భూఉపరితలం చాలా చల్లగా ఉంటుందని అంటారు అలెక్స్ డికారియా. తక్కువ తేమశాతం, నిర్మలమైన ఆకాశం వల్ల భూమి నుంచి వచ్చే రేడియేషన్ వాతావరణంలో పైభాగానికి చేరి తద్వారా అంతరిక్షంలోకి వెళ్తుంది. దీని ఫలితంగా భూఉపరితలం చల్లగా ఉంటుంది. సైబీరియా చాలా సురక్షితమైన ప్రాంతమని చెబుతారు స్థానికులు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఉగ్రవాద దాడులు ఉండవు. విపత్తులు కూడా ఉండవు. దీనికితోడు వాతావరణ కాలుష్యం బెడద అసలే ఉండదు. -
సరికొత్త టెక్నాలజీతో హైయర్ అత్యాధునిక ఏసీ
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ హైయర్ సెల్ఫ్ క్లీన్‌కూల్ టెక్నాలజీతో కూడిన ఏసీని భారత మార్కెట్లో విడుదల చేసింది. అన్ని కాలాల్లోనూ అనుకూలమైన ఏసీ ఉత్పత్తిగా కంపెనీ పేర్కొంది. 1.5 టన్ కెపాసీటీతో కూడిన ఈ హాట్ అండ్ కోల్డ్ 3 స్టార్ ఏసీ.. ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్ టెక్నాలజీతో ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఏసీ తనంతట తానే శుభ్రం చేసుకోవడంతోపాటు, గదిలో ఉష్ణోగ్రతను తగినట్టు కూలింగ్‌ను మార్చుకోవడం చేస్తుందని, 65 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుందని తెలిపింది. 60 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఏసీ పనిచేస్తుందని ప్రకటించింది. మైక్రో డస్ట్ ఫిల్టర్‌తో కూడిన ఈ కొత్త క్లీన్‌కూల్ ఏసీ గాలి నుండి దుమ్ము, బ్యాక్టీరియా వైరస్‌ను తొలగిస్తుంది. తద్వారా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం నుండి వినియోగదారులను రక్షిస్తుందని కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా, బెస్ట్-ఇన్-క్లాస్ మోటారు, ఆప్టిమైజ్డ్ ఫ్యాన్ ఎయిర్ డక్ట్‌తో అమర్చబడి ఉంటుందనీ, ఇది 15 మీటర్ల వరకు గాలిని వీచేలా చేస్తుందని పేర్కొంది. ఈ ప్రత్యేక ఫీచర్ గదిలోని అన్ని మూలలను చాలా వేగంగా చల్లబరుస్తుందని చెప్పింది. -
కిటికీలతో కరెంటు.. చల్లదనం
ఇంటి కిటికీలు మీక్కావాల్సిన విద్యుత్తును తయారు చేయడంతోపాటు ఇల్లంతా చల్లగా ఉంచితే ఎలా ఉంటుంది? అబ్బో అద్భుతంగా ఉంటుంది అంటున్నారా? అయితే మీ ఆశలు త్వరలోనే తీరనున్నాయి. చైనా శాస్త్రవేత్తలు కొందరు సూర్యరశ్మిలోని కొన్ని రకాల కాంతులను అడ్డుకునే, పారదర్శకమైన సోలార్ సెల్స్‌ను తయారు చేయడం దీనికి కారణం. సూర్యరశ్మిలో అతినీల లోహిత, పరారుణ కాంతి కూడా ఉంటుందని మనకు తెలుసు అయితే ఇవన్నీ విద్యుదుత్పత్తికి పనికి రావు. ఈ రకమైన కాంతిని మళ్లీ వాతావరణంలోకి పంపించేస్తే ఇంటిలోపల ఉష్ణోగ్రత ఎక్కువ కాదు. చైనా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకమైన ప్లాస్టిక్‌లాంటి పదార్థాన్ని తయారు చేశారు. ఇది అటు సూర్యుడి తాపం లోనికి చొరబడకుండా అడ్డుకుంటూనే.. ఇంకోవైపు నిర్దిష్ట తరంగదైర్ఘ్యమున్న కాంతి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రత్యేక ప్లాస్టిక్‌తో తయారైన కిటికీలు, సోలార్ ప్యానెల్స్‌ను వాడటం ద్వారా ఇళ్లలో విద్యుత్తు ఖర్చును సగానికి తగ్గించుకోవచ్చునని అంచనా. ప్రస్తుతానికి ప్లాస్టిక్ సోలార్ సెల్స్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గణనీయమైన మార్పులు వచ్చేందుకు అవకాశముందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హిన్ లాప్ యిప్ చెప్పారు. చౌకగా తయారు చేసుకోగలగడం, విస్తృత వాడకానికి అవకాశం ఉండటం ఈ ప్లాస్టిక్ సోలార్స్ సెల్స్ సానుకూల అంశాలని వివరించారు. -
చల్లగాలి కోసం.. బుల్లి యంత్రం!
ఇప్పుడంటే చలికాలం. ఇంకో నాలుగు నెలలు పోనివ్వండి.. ఫ్యానెక్కడ? ఏసీ పనిచేస్తోందా? కూలర్‌లోకి ఐస్ ఎప్పుడేద్దాం? అని నానా హైరానా పడిపోతాం. వేసవి తాపం అలాంటిది మరి. ఇప్పుడు పై ఫొటో చూడండి. ఈ బుల్లి యంత్రం మీ దగ్గరుంటే ఉక్కపోత అస్సలు ఉండదు. పైగా ఎంత వేడి వాతావరణంలో తిరిగినా ఒళ్లు మాత్రం చల్లగానే ఉంటుంది. పేరు ‘బ్లో’. ఏం మాయ చేస్తుంది ఈ యంత్రం అంటున్నారా? చాలా సింపుల్. మోటార్ కార్లలో సువాసనలు వెదజల్లేందుకు వాడే డిఫ్యూజర్లా ఉంటుంది ఇది. మోటార్ పనిచేసేందుకు ఓ రీఛార్జబుల్ బ్యాటరీ కూడా ఉంటుంది. కార్లలో మాదిరిగానే డిఫ్యూజర్‌లో పిప్పర్మెంట్ నూనెను వాడారనుకోండి. సహజంగానే చల్లదనాన్ని ఇచ్చే పిప్పర్మెంట్ నూనెకు గాలి కలిసి ఒళ్లంత చల్లగా అయిపోతుందన్నమాట. షర్ట్ కు తగిలించుకోగలగడం, రీఛార్జిబుల్ బ్యాటరీ ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని వాడుకోవచ్చు. బయటి ఉష్ణోగ్రత కంటే కనీసం ఆరు డిగ్రీలు తక్కువ చేస్తుంది ఈ యంత్రం. ముగ్గురు యువకుల ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ బుల్లి ఏసీ యంత్రం ప్రస్తుతానికి మార్కెట్లోకి రాలేదు. అయితే వాణిజ్యస్థాయి అభివృద్ధికి 5000 డాలర్లు కావాలని కిక్‌స్టార్టర్‌లో పిలుపునిచ్చారు. ఆ వెంటనే దాదాపు రెండు లక్షల డాలర్లు వచ్చిపడటం, ఈ ఉత్పత్తిపై అందరి ఆసక్తి ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
ఏఈ పరీక్ష ప్రశాంతం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఆది వారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేం ద్రం లోని ఎస్ఎస్బీఎన్ జూనియర్, డిగ్రీ కళాశాల, కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్‌్ట్స కళాశాల, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగింది. మొత్తం 2264 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2049 మంది హాజరయ్యారు. జేసీలక్ష్మీకాంతం ఎస్ఎస్బీఎ¯ŒS జూనియర్, డిగ్రీ కళాశాలల్లోని కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల ప్రక్రియను పరిశీలించారు. -
చలించరా..?
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో చలి తీవ్రత పెరిగి మామూలు జనమే ఇక్కట్లు పడుతుండగా..ప్రభుత్వ ఆస్పత్రుల్లోని రోగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రాత్రి పూట చలితో వణికే పరిస్థితి ఉన్నా కప్పుకోవడానికి సరైన దుప్పట్లు లేక రోగులు, వారి సహాయకులు నానా పాట్లు పడుతున్నారు. నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, సుల్తాన్‌బజార్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, కింగ్‌కోఠి, పేట్లబురుజు, నిమ్స్, ఫీవర్, ఈఎన్ టీ, ఛాతి, సరిజినిదేవి కంటి ఆస్పత్రి, మానసిక చికిత్సలయాల్లో చికిత్స పొందుతున్న వృద్ధులు, శిశువులు, బాలింతలు, గర్భిణులు, ఇతర రోగులు చలికి విలవిల్లాడుతున్నారు. అసలే అనారోగ్యం..ఆపై చలేస్తే కప్పుకునేందుకు దుప్పటి కూడా లేకపోవడంతో వారు బతికుండగానే నరకం చూస్తున్నారు. ఒక వైపు పడుకునేందుకు పడకల్లేక పోగా, ఉన్న పడకలపై చిరిగిన పరుపులు..మాసిపోయిన దుప్పట్లే దర్శనమిస్తున్నాయి. ఆస్పత్రుల ఆవరణలో ఏర్పాటు చేసిన నైట్‌షెల్టర్సలో కనీస సదుపాయాలు లేక రోగికి సహాయంగా వచ్చిన వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. రోగులకు ఇవ్వకుండా బీరువాలోనే... ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఏ మంచంపై చూసినా పూర్తిగా మాసిపోయి, చిరిగిపోయిన పరుపులే దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వీటిని శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. గత్యంతరం లేక వీటిని కప్పుకున్న రోగులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆస్పత్రిలో డెంగీ, మలేరియా దోమలు స్వైర విహారం చేస్తుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. గాంధీలో ఇటీవల రెండు రంగుల దుప్పట్లు అందజేసినప్పటికీ.. వాటిని రోగులకు ఇవ్వకుండా బీరువాల్లోనే భద్రపరుస్తున్నారు. ఇక నిలోఫర్ నవజాత శిశువుల ఆస్పత్రిలో పడుకునేందుకు మంచాలే కాదు, రాత్రి చలేస్తే కప్పుకునేందుకు దుప్పట్లు కూడా లేక శిశువులు గజగజ వణుకుతున్నారు. సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, కింగ్‌కోఠి, మలక్‌పేట్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో బాలింతలు, గర్భిణుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. టెండర్ దాటని కొనుగోళ్లు ఆస్పత్రుల్లో నమోదవుతున్న ఇన్ఫెక్షన్రేటును తగ్గించి రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ భావించింది. రోజుకో రంగు చొప్పున వారానికి ఏడు రంగుల దుప్పట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు దేశంలోని 19 ప్రధాన ఆస్పత్రుల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పైలెట్ ప్రాజెక్ట్‌గా గాంధీ జనరల్ ఆస్పత్రిని ఎంపిక చేసింది. నెల రోజుల క్రితం 303 పడకలకు రెండు రంగుల దుప్పట్లను సరఫరా చేసింది. తొలుత రోజుకో కలర్ చొప్పున ఏడు రంగుల దుప్పట్లను సరఫరా చేయాలని భావించి..చివరకు అది సాధ్యపడక పోవడంతో తెలుపు, గులాబీ, బ్లూ, స్కై బ్లూ రంగులకు కుదించింది. తెలుపు, గులాబి రంగు దుప్పట్లను సాధారణ పడకలపై, బ్లూ, స్కై బ్లూ దుప్పట్లను ఐసీయూ, డాక్టర్లు, నర్సులకు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 20 వేల పడకలు ఉండగా, వీటిలో నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎ¯ŒSజే క్యాన్సర్, సరోజినీదేవి వంటి బోధనాసుపత్రుల్లోనే 8,374 పడకలున్నాయి. మొత్తం లక్ష దుప్పట్లు అవసరం కాగా 40 వేలు తెలుపు, 40 వేలు గులాబీ, 10 వేలు స్కై బ్లూ, మరో 10 వేలు నీలి రంగు దుప్పట్లు కొనుగోలు చేస్తుంది. ఇందు కోసం ఇప్పటికే ఆసక్తిగల కంపెనీల నుంచి టెండర్ ఆహ్వానించగా ఏడు కంపెనీలు పాల్గొన్నాయి. అయితే కేటాయింపు అంశం ఇంకా ఫైనల్ కాలేదు. -
బిజినెస్ తగ్గిపోయి సిమ్లా కళ తప్పింది
-
స్వల్పంగా పెరిగిన చలి
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉత్తర, దక్షిణ దిశల నుంచి వీస్తున్న శీతల గాలులు సిటీజన్లను గజగజలాడిస్తున్నాయి. గురువారం గరిష్టంగా 31.6 డిగ్రీలు, కనిష్టంగా 17.8 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 34 శాతంగా నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మేఘాల ఉధృతి తగ్గడంతో రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోతున్నాయన్నారు. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయన్నారు. కాగా, తెల్లవారుఝామున, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరగడంతో సిటీజన్లు స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించి బయటికి వెళ్లాల్సి వస్తోంది. -
చలించని హృదయాలు
అనంతపురం సర్వజనాస్పత్రి ఆవరణలో ఓ అభాగ్యురాలు అచేతనంగా పడి ఉంది. సోమవారం నుంచి చిన్నపాటి వర్షం వస్తోంది. ఓ వైపు‘చలి’గాలి వణికిస్తోంది. మరోవైపు దోమల మోత. ఆమెకు ఒంట్లో శక్తిలేదు. నా అన్నవారు దరిదాపులో కనిపించలేదు. పల(కని)కరించే వారు లేరు. చీరకొంగును నెత్తిన వేసుకొని, నేలపైనే నీరసించి పడుకుంది. అటుగా వైద్యులు తిరుగుతున్నారు. ఎంతో మంది రోగులు, వారి బంధువులు వచ్చిపోతున్నారు.. ‘అయో’ అంటున్నారేగానీ మంగళవారం రాత్రి వరకూ ఆ అభాగ్యురాలిని ఎవరూ పట్టించుకోలేదు. – వీరేష్, సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
చైనా ఉత్పత్తులకు మళ్లీ ఆదరణ!
బీజింగ్ : కొన్నేళ్ల క్రితం వరకూ 'మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తులకు అసలు ఆదరణ ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుతం వాటికి డిమాండ్ పెరుగుతోందట. చైనాలోనే కాదు.. విదేశాల్లో సైతం వీటికి గిరాకీ ఎక్కువగానే ఉందట. ఈ ఉత్పత్తులు చౌకగా లభ్యం కావడంతో పాటు, నాణ్యతలోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుండటంతో ఆదరణ కోల్పోయిన తన మార్కెట్ కు తానే ఓ గౌరవాన్ని సంపాదించుకుందట. 2011 వరకూ 70 శాతం స్మార్ట్ ఫోన్లు చైనాలో అమ్ముడుపోతే, అవన్నీ శామ్ సంగ్, యాపిల్, నోకియా ఫోన్లే. కనీసం వారి ఉత్పత్తులను ఆ దేశస్తులే కొనలేనంతగా ఆదరణ కోల్పోయారు. తమ ఉత్పత్తుల్లో అసలు నాణ్యత ఉండదని ఆ దేశ ప్రజలే ఒప్పుకొన్నారు. అలాంటి చైనా ఉత్పత్తులను ఐదేళ్ల తర్వాత చూస్తే... ప్రస్తుతం వాటి చరిత్ర మారిపోయిందట. చైనాలో స్వదేశీ స్మార్ట్ ఫోన్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందట. ప్రస్తుతం చైనాలో టాప్-10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో 8 చైనావే ఉన్నాయట. అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకొని తన ఉత్పత్తుల్లో నాణ్యత పెంచుకోవడంతో వీటికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. 'మేడ్ ఇన్ చైనా' గౌరవాన్ని, ప్రతిష్టను మార్చడంలో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా సహకరించాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో 'మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తులు మళ్లీ మార్కెట్లకి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
చలి.. చంపేస్తోంది!
-
కరెంటు లేకున్నా కూల్ కూల్!
భలే బుర్ర రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫ్రిజ్. ఒకప్పుడు అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే వాడగలిగేవాళ్లు. ఆర్థిక సరళీకరణల తర్వాత మధ్యతరగతి ఇళ్లలో ఇప్పుడు ఫ్రిజ్జులు కనిపిస్తున్నా, పేదలకు మాత్రం ఇదింకా అపురూపమైన వస్తువే. ఫ్రిజ్జంటే మాటలా..? కొనాలంటే బోలెడు సొమ్ము ఉండాలి. అప్పో సొప్పో చేసి కొన్నా... దానికి నిత్యం విద్యుత్తు అందుతూనే ఉండాలి. ఫలితంగా కరెంటు బిల్లు పెరుగు తుంది. ఖర్మ కాలి అది గానీ పాడైతే, దానికి మరమ్మతు చేయడం కూడా భారీ ఖర్చుతో కూడుకున్న పనే. ఇవన్నీ తట్టుకోవడం సామాన్యులకు భారమే! అందుకే ఫ్రిజ్ ఇప్పటికీ కొన్ని వర్గాల వారికి అందుబాటులో లేదు. అయితే, ఇలాంటి బెడదలేవీ లేకుండా, అసలు విద్యుత్తుతోనే పనిలేని ఫ్రిజ్‌కు రూపకల్పన చేశాడు మన్సుఖ్భాయ్ ప్రజాపతి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన ఈ ఇంజినీర్ ... విద్యుత్తు ఏమాత్రం అవసరం లేని ఫ్రిజ్‌ను రూపొందించాడు. ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిజ్ అని పేరు పెట్టి, మార్కెట్లోకి తెచ్చాడు మన్సుఖ్. ఈ ఫ్రిజ్‌కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి. జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి. బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిజ్‌ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్‌లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు దాదాపు మూడువేలు... అంతే! -
సలి కోటు...
మెట్రో కథలు సలిగా ఉందా సిన్నీ అంది. వాడేం మాట్లాడలేదు. తల్లికి తెలియకూడదు అని అనుకున్నాడేమో లోపల ఉన్న వొణుకును అణచుకోవడానికి చూశాడు. కాని బక్కగా ఉన్న పక్కటెముకలు కొంచెం అదిరాయి. ఏడేళ్ల పిల్లవాడు. సన్నగా బలహీనంగా అయిదేళ్ల పిల్లవాడిలా కనిపిస్తున్నాడు. సలిగా ఉందా నాయనా అని మళ్లీ కొంచెం దగ్గరికి జరిగి మొత్తం శరీరాన్ని ఒంటికి కరుచుకుని ఒంట్లో ఉన్న వేడి ఇవ్వడానికి చూసింది. కళ్లు మూసుకుని ఉన్నాడు. పెదాలు కొంచెం ఎండిపోయి ఉన్నాయి. గాలి ఒదులుతుంటే ముక్కు నుంచి వేడిగా వచ్చి తగులుతూ ఉంది. బయట లారీలు చాలా వేగంగా అప్పుడొకటి అప్పుడొక్కటి వెళుతున్న రొద తప్ప చీమ చిటుక్కుమనడం లేదు. కాంట్రాక్టర్‌కి స్థలం చూపవయ్యా అంటే ఇదే చూపించాడు. మైదానం. ఇక్కడ పాలిథిన్ షీట్లను కట్టుకుని ఇంకో వారం రోజులు ఉండాలి. పది రోజుల కేబుల్ వర్క్ పనికి ఇంత అని ఇస్తాడు. తీసుకొని ఊరికి వెళ్లిపోవడమే. పనుంటే మళ్లీ రావాలి. ఇంతకు ముందు ఈ పని తెలియదు. పొలం పనులకు వెళ్లేది. మొగుడు కూడా వెళ్లేవాడు. కాని రానురాను పనులు తగ్గాయి. జగానంతా రొయ్యలూ సేపలే తింటున్నట్టున్నారు... నేల కానరాకుండా తవ్వి నీళ్లు నింపి మురికి సేత్తున్నారు... రొయ్యలే కావాలంటే గోదారి లేదా... అంతలావు సవుద్రం లేదా అన్నాడు మొగుడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా వచ్చే కూలి పోయింది. ఉనికీ పోయింది. అదీ కోపం. ఎవరో ఈ పని చెప్పారు. సిటీలో పని. అక్కడితో పోలిస్తే మూడింతలు కూలి. మూడేళ్లుగా ఇందులో దిగారు. కుటుంబాలతో సహా ఎక్కడకు రమ్మంటే అక్కడకు దిగిపోవడం. చూపించిన చోట ఉండిపోవడం. గుంతలు తవ్వి కేబుల్ పరిచి వెళ్లిపోవడం. పోయినసారి కంటే ఈసారి ఈ స్థలం నయంగానే ఉందనిపించింది. పోయినసారి ఉప్పల్ దగ్గర ఏదో పాడుబడ్డ స్థలం చూపించారు. సరే ఏదో ఒకటి అది దిగితే రెండు రోజులు బాగానే ఉంది. మూడోరోజు తెల్లారి పక్క పాలిథిన్ గుడిసె నుంచి ఒకటే ఏడుపు. మూడేళ్ల పిల్లవాణ్ణి పాము కరిచి పోయింది. రాత్రి ఎప్పుడు దూరిందో. తల్లి ఏడుస్తుంటే తండ్రి కూడా గుండెలు బాదుకున్నాడు. ఇంకో గంటకి తండ్రి కూడా పోయాడు. ఇద్దరిని కరిచిపోయింది ఆ మాయదారి పాము. అందుకే ఈసారి జాగ్రత్తగా చూసి మరీ మొగుడి చేత పాలిథిన్ షీట్లు గట్టిగా కట్టించింది. వెతికి వెతికి ఇటుకరాళ్లు తెచ్చి అంచులు లేవకుండా బరువుతో బంధించింది. వస్తూ వస్తూ సుబ్రహ్మణ్య స్వామి పటం తెచ్చుకోవడం కూడా మర్చిపోలేదు. కాని ఈసారి చలి పాములా బుస కొడుతుందని మాత్రం ఊహించలేదు. ఈ టైమ్‌లో ఆ పక్కంతా సలంట కదయ్యా అంది బయల్దేరే ముందు. ఎహె... ఏం సలి. పోదాం పదా. నాలుగు డబ్బులొస్తే పండక్కి పనికొస్తాయి అన్నాడు. ఆ మాట నిజమే. సంక్రాంతి ఇంకో రెండు మూడు వారాల్లో ఉంది. డబ్బులొస్తే పండక్కి నిజంగానే అక్కర కొస్తాయి. బయల్దేరింది. తీరా ఇక్కడికొచ్చాక ఈ చలి దాక్షారామం, రామచంద్రాపురం చలిలా లేదు. అసలు ఇలాంటి చలి ఎరగదు. ఇలాంటి చలికి ఏం కప్పుకోవాలో తెలియదు. ఒకవేళ తెలిసినా అలాంటి ఒక్క గుడ్డముక్క కూడా లేదు. నేల మీద రెండు చాపలు పరిచింది. ఒకదాని మీద మొగుడు స్వాధీనం లేకుండా పడి నిద్ర పోతున్నాడు. ఎనిమిది నుంచి నాలుగు దాకా పని చేసి వచ్చాక పెందలాణ్ణే కొంచెం తిని తినేముందు ఒళ్లు నొప్పులకు కాసింత తాగి పడుకుంటాడు. ఇక పిడుగులు పడినా లేవడు. ఒంటి మీద ఉండేది పెద్ద చెడ్డీ చొక్కానే. కాని సలి అనే మాటే అనడు. అంత మొద్దయిపోయాడు. కాని పిల్లవాడు? మళ్లీ ఒణికాడు. సలిగా ఉందా బంగారూ కప్పిన పాత చీరనే మళ్లీ కప్పుతూ ఇంకా దగ్గరకు జరిగింది. మూమూలుగా అయితే ఐద్రాబాదు వస్తున్నారంటే పిల్లలందరికీ హుషారు. పోయిన వేసవిలో వచ్చినప్పుడు బాగా ఆడుకున్నారు. ఉదయాన్నే మగవాళ్లంతా పనికి పోతారు. ఆడవాళ్లు వంటలో పడతారు. అదిలించేవాళ్లు ఒక్కరూ ఉండరు. ఇక చెట్ల కింద మట్టిలో పుల్లలేరుకుంటూ గోలీలాడుకుంటూ వాళ్లిష్టం. అలా అనుకునే ఈసారి వచ్చారు. రెండు రోజులు గడిచే సరికి మెత్తగా అయిపోయారు. ప్రతి పిల్లదీ పిల్లవాడు తెల్లారాక గుడిసె నుంచి బయటికొచ్చి ఎండలో మజ్జుగా కూచోవడమే. రాత్రంతా చలి వాళ్ల గొంతు పిసికిందని వాళ్లకేం తెలుసు? ఒణకడం ఆపలేదు. తెల్లారి మోపెడ్ డాక్టర్ని పంపించేసి తప్పు చేశానా అనిపించింది. అమా... ఒళ్లెచ్చగా ఉందిమా అని అంటుండగానే మోపెడ్ డాక్టర్ వచ్చాడు. ఇలా కూలి పనుల కోసం వచ్చి దిగేవాళ్ల గుడిసెల చుట్టూ తిరుగుతూ వాళ్లకు మందూ మాకూ ఇస్తుంటాడట. ఆర్ఎంపి అయి ఉండాలి. చూపిస్తే ఇది చలిజ్వరము ఇంజెక్షన్ చేయాలి నూటేబై అవుతుంది అన్నాడు. యాబై ఇస్తాను ఏం చేస్తావో చేయి అంది. ఎగాదిగా చూసి వెళ్లి పోయాడు. కాస్త వేడివేడి అన్నం రెండు ముద్దలు తినిపించింది. ఎండలో కూచోబెట్టింది. బజారుకు నడుచుకుంటూ వెళ్లి మాత్ర తెచ్చి మింగించింది. తగ్గుతుందిలే అనుకుంది. తగ్గలేదు. నిన్న ఒంటి నిండుగా స్వెటర్ వేసుకొని మంకీ క్యాప్ పెట్టుకుని చేతిలో పొన్నుకర్రతో ఆ దారిన వాకింగ్‌కు వెళుతున్న ఒక పెద్దాయన ఆ తెల్లారి పూట అంత చలిలో ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా గుడిసెల బయట మందకొడిగా తిరుగుతున్న పిల్లలను చూసి ఇంతకు మించి చోద్యముందా అన్నట్టుగా ఆగిపోయాడు. రాత్రి ఎంత చలి కొట్టిందో తెలుసు. ఇంత చలిలో ఈ పిల్లల్నేసుకొని ఎలా ఉన్నారమ్మా? ఏం చేస్తాం సామీ. రాత. ఆయన వాకింగ్ మానేసి వెనక్కు వెళ్లిపోయి గంట తర్వాత తెచ్చాడు. ఇంట్లోవి తెచ్చాడో వాళ్లనూ వీళ్లనూ అడిగి తెచ్చాడో పిల్లల బట్టలు కొన్ని ఒకటి రెండు దుప్పట్లు ఇంకేవో మగవాళ్ల బట్టలు తెచ్చాడు. కాని పిల్లలకు మాత్రం చేతిలో ఉన్న మూడు నాలుగు స్వెటర్లే కనిపించాయి. పరిగెత్తుకుంటూ వెళ్లి చొక్కాలు చడ్డీలు ఇస్తుంటే కాదని స్వెటర్ల కోసం వెంట బడ్డారు. గబగబా పంపించింది. పో సిన్నీ... నువ్వు కూడా తెచ్చుకోపో. అందరూ మూగారు. అయ్యా... సలికోటు.... నాక్కావాలి సలికోటు.... నాకు... నాకు.... అయ్యా... ఒక్క సలికోటు... ఉన్నవి అయిపోయాయి. ఒక కనకాంబరం రంగు చొక్కా మాత్రం దక్కింది. కొంచెం లూజుగా ఉన్నా అందులో అందంగా ఉన్నాడు. ముద్దు పెట్టుకుంది. జవాబు చెప్పడని తెలిసినా మళ్లీ అడిగింది... సలిగా ఉందా సిన్నీ... బయట చీకటి చలిలా ఉంది. చలి చీకటిలా ఉంది. బాగా పెరిగిందో ఏమో తిరిగే లారీలు కూడా ఎక్కడివక్కడ ఆగిపోయినట్టున్నాయి. ఎప్పుడోగాని రొద వినిపించడం లేదు. అమా... అన్నాడు. సెప్పు సిన్నీ..... అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. ఒణుకుతున్నాడు. మొగుడివైపు చూసింది. ఇద్దో... నిన్నే.... కదిలితే కదా. గురక పెడుతున్నాడు. ఒణుకు పెరిగింది. లేచి ట్రంకుపెట్టెలో ఉన్న ఒకటి అరా గుడ్డల్ని కూడా వాడికి చుట్టింది. ఎన్ని చుడితే మాత్రం ఏం లాభం. పైన ఉన్నది ఒక పలుచటి పాలిథిన్ షీట్. కాని ఆకాశం కింద పడుకున్నట్టే. ఊ.. ఊ... మూలుగుతూ ఉన్నాడు. సిన్నీ... సిన్నీ.... నేల జిల్లుమంటోంది. చాప జిల్లుమంటోంది. చుట్టబెట్టిన గుడ్డముక్కలు జిల్లుమంటున్నాయి. సిన్నీ... బంగారూ.... ఏం చేయాలో తోచక వెచ్చగా ఉన్న బుగ్గల మీద వెర్రిగా ముద్దుల మీద ముద్దులు కురిపించింది. బయట ఆకాశం మీద అతి శీతలంగా ఉన్న గండభేరుండం ఒకటి ఎగురుతూ ఉంది. అది ఇవాళ తన బిడ్డను ముక్కున కరుచుకుపోనుంది. కుదరదు. తన కంఠంలో ప్రాణం ఉండగా కుదరదు. ఏం మిగిలి ఉందో తెలుసు. దానిని విప్పేసింది. పిల్లాడి ఒంటి నిండా చుట్టేసింది. తిను... నన్ను తినవే... నగ్నంగా ఉన్న ఒంటిని చూసుకుంటూ చలిని దెప్పి పొడిచింది. ఇప్పుడు తన బిడ్డకు తనే సలికోటు. మోకాళ్ల మీద ఒంగి అటోకాలు ఇటో కాలు వేసి మొత్తంగా మీదకు వాలుతూ ఒక గొడుగులాగా దుప్పటిలాగా కప్పులాగా వెచ్చటి రగ్గులాగా మీదకు వాలిపోయింది. తెల్లారింది. మరో గంటలో చాలా న్యూస్చానళ్లకు మంచి మేత దొరికింది. జనం తండోపతండాలుగా వచ్చారు. లీడర్లు వచ్చారు. ఎన్.జి.ఓలు వచ్చారు. నిజంగా మామూలు మనుషులు కూడా ఇళ్లల్లో ఉన్న స్వెటర్లు రగ్గులు తెచ్చి ఆ గుడిసెలన్నీ నింపేశారు. పిల్లవాడికి వైద్యం అందింది. ఎవరో పూలపూల సలికోటు కూడా అందించారు. కాని- ప్రాణమున్న సలికోటును మాత్రం ఎవ్వరూ తెచ్చివ్వలేకపోయారు. - మహమ్మద్ ఖదీర్‌బాబు -
వేసవిలో చల్లచల్లగా..
వరంగల్: వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఒక్కరూ ఆశ్రయించేది నీటినే. అలాంటిది చిన్న పిల్లలకు స్విమ్మింగ్‌పూల్ కనిపిస్తే ఊరుకుంటారా! హాయిగా నీళ్లలో ఆటలాడుకుంటూ ఈ ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా వేసవి వేడిమి నుంచి చిన్నారులు సేద తీరుతున్న సమయంలో సాక్షి కెమరా క్లిక్ మనిపించింది. -
చలిపులి.. వణికిస్తోంది!!
-
తెలుగు రాష్ట్రాలను.. చలి వణికిస్తోందీ!