
చలించని హృదయాలు
అనంతపురం సర్వజనాస్పత్రి ఆవరణలో ఓ అభాగ్యురాలు అచేతనంగా పడి ఉంది. సోమవారం నుంచి చిన్నపాటి వర్షం వస్తోంది. ఓ వైపు‘చలి’గాలి వణికిస్తోంది. మరోవైపు దోమల మోత. ఆమెకు ఒంట్లో శక్తిలేదు. నా అన్నవారు దరిదాపులో కనిపించలేదు. పల(కని)కరించే వారు లేరు. చీరకొంగును నెత్తిన వేసుకొని, నేలపైనే నీరసించి పడుకుంది. అటుగా వైద్యులు తిరుగుతున్నారు. ఎంతో మంది రోగులు, వారి బంధువులు వచ్చిపోతున్నారు.. ‘అయో’ అంటున్నారేగానీ మంగళవారం రాత్రి వరకూ ఆ అభాగ్యురాలిని ఎవరూ పట్టించుకోలేదు.
– వీరేష్, సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం