సాధారణంగా చలికాలంలో దుప్పట్లు అవసరమవుతాయి. వేసవిలో ఏసీ గదుల్లో గడిపేవాళ్లు తప్ప మరెవరూ దుప్పట్లు వాడరు. అయితే ఏడాది పొడవునా వాడగలిగే దుప్పటిని అమెరికన్ కంపెనీ తయారు చేసింది. ‘హిలు’ బ్రాండ్ పేరుతో ఇటీవల మార్కెట్‌లోకి విడుదలైన ఈ దుప్పటి సాదాసీదా దుప్పటి కాదు, ఇది ‘థర్మో రెగ్యులేటింగ్ బ్లాంకెట్’.
పూర్తి గ్రాఫీన్ ఫైబర్‌తో అడాప్టెస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఈ దుప్పటి శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంచుతుంది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. చూడటానికి ఇది చాలా భారీగానే కనిపించినా, తేలికగా ఉంటుంది.
పదేళ్ల వారంటీతో వివిధ సైజుల్లో లభించే ‘హిలు’ బ్లాంకెట్స్ 175 డాలర్లు (రూ.14,465) మొదలుకొని 550 డాలర్ల (రూ.45,464) వరకు వివిధ ధరల్లో దొరుకుతాయి. ప్రస్తుతం ఇవి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి.
(ఇదీ చదవండి: ఎగిరే ఏసీ! ఇల్లంతా తిరిగేస్తుంది.. సూపర్ గ్యాడ్జెట్)
Comments
Please login to add a commentAdd a comment