warmer
-
వెచ్చదనమే కాదు.. వేసవిలో చల్లగానూ ఉంచే దుప్పటి గురించి తెలుసా?
సాధారణంగా చలికాలంలో దుప్పట్లు అవసరమవుతాయి. వేసవిలో ఏసీ గదుల్లో గడిపేవాళ్లు తప్ప మరెవరూ దుప్పట్లు వాడరు. అయితే ఏడాది పొడవునా వాడగలిగే దుప్పటిని అమెరికన్ కంపెనీ తయారు చేసింది. ‘హిలు’ బ్రాండ్ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఈ దుప్పటి సాదాసీదా దుప్పటి కాదు, ఇది ‘థర్మో రెగ్యులేటింగ్ బ్లాంకెట్’. పూర్తి గ్రాఫీన్ ఫైబర్‌తో అడాప్టెస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన ఈ దుప్పటి శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా పనిచేస్తుంది. చలికాలంలో శరీరాన్ని వెచ్చగాను, వేసవిలో చల్లగాను ఉంచుతుంది. ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. చూడటానికి ఇది చాలా భారీగానే కనిపించినా, తేలికగా ఉంటుంది. పదేళ్ల వారంటీతో వివిధ సైజుల్లో లభించే ‘హిలు’ బ్లాంకెట్స్ 175 డాలర్లు (రూ.14,465) మొదలుకొని 550 డాలర్ల (రూ.45,464) వరకు వివిధ ధరల్లో దొరుకుతాయి. ప్రస్తుతం ఇవి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. (ఇదీ చదవండి: ఎగిరే ఏసీ! ఇల్లంతా తిరిగేస్తుంది.. సూపర్ గ్యాడ్జెట్) -
121 ఏళ్లలో ఐదవ వెచ్చని సంవత్సరం
న్యూఢిల్లీ: గత 121 సంవత్సరాల (1901) నుంచి చూస్తే 2021 సంవత్సరం ఐదవ వెచ్చని సంవత్సరంగా రికార్డులకెక్కింది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన వార్షిక వాతావరణ నివేదికలో స్పష్టం చేసింది. అంతకంటే ముందు 2009, 2010, 2016, 2017లు మొదటి నాలుగు వెచ్చని సంవత్సరాలుగా నిలిచాయి. 2021లో సగటు గాలి ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.44 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉందని వాతవరణ శాఖ నివేదిక పేర్కొంది. 2016లోసగటు గాలి ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.71 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉండగా.. 2009లో 0.55 డిగ్రీల సెల్సియస్.. 2017లో 0.54 డిగ్రీల సెల్సియస్.. 2010లో 0.53 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు తెలిపింది. కాగా 1901 నుంచి 2022 వరకు గత 121 సంవత్సరాలలో సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.63°C పెరిగింది. వెచ్చని శీతాకాలం. రుతుపవనాల అనంతర కాలంలో వెచ్చగా ఉండే ఉష్ణోగ్రత దీనికి దోహదపడింది. గత సంవత్సరం జనవరి, ఫిబ్రవరి శీతాకాల నెలలలో సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.78 డిగ్రీల సెల్సియస్, అక్టోబర్ -డిసెంబర్ మధ్య, సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.42°C ఎక్కువగా ఉంది. చదవండి: పిల్లలకు థర్డ్‌వేవ్ ఎక్కువ ప్రమాదకరం.. వైద్యులేమంటున్నారంటే.. అలాగే గత సంవత్సరం దేశంలో అధిక వర్షపాతం నమోదైంది. ఇది దాని దీర్ఘ-కాల సగటు(లాంగ్ పీరియడ్ యావరేజ్)లో 105%ఎక్కువ. నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాధారణ వర్షపాతం ఎల్పీఏలో 99% ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాల కాలంలో ఎల్పీఏలో 171% వర్షపాతం నమోదైంది.ఇది 1901 నుండి అత్యధికంగా నమోదైంది. ఇక గతేడాది విపరీత వాతావరణ పరిస్థితుల కారణంగా భారతదేశంలో 1,750 మంది మరణించారు. ఉరుములు, మెరుపులతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కనీసం 780 మంది మరణించారు. 2021లో ఐదు తుఫానులు వచ్చాయి. అరేబియా సముద్రం మీదుగా తౌక్టే (మే 14-19), బంగాళాఖాతం మీదుగా యాస్ (మే 23-28); అరేబియా సముద్రం మీదుగా షాహీన్ (సెప్టెంబర్ 29-అక్టోబర్ 4); బంగాళాఖాతం మీదుగా గులాబ్ (సెప్టెంబర్ 24-28) మరియు ఇటీవల, బంగాళాఖాతం మీదుగా జవాద్ (డిసెంబర్ 2-6). వీటితో అత్యంత వినాశకరమైనది తౌక్డే, ఇది మే 17న సౌరాష్ట్ర తీరప్రాంతాన్ని కుదిపేసింది. వీటి వల్ల కనీసం 144 మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: ‘కోటి రూపాయలు ఇవ్వకపోతే ఏసీబీతో దాడి చేయిస్తా’ -
ఆసియా, మధ్యప్రాచ్యాల్లో వేగం తక్కువే..
బోస్టన్: వెచ్చటి వాతావరణం... గాలిలో తేమశాతం అధికంగా ఉండటం! ప్రాణాంతక కరోనా వైరస్‌ను అడ్డుకునే ఆయుధాలని తేల్చారు బోస్టన్లోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. చైనాలోని వూహాన్ నగరంలో గత ఏడాది డిసెంబరులో గుర్తించింది మొదలు.. ఈ నెల 22వ తేదీ వరకూ వివిధ దేశాలకు విస్తరించిన తీరు.. ఆయా దేశాల్లోని ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతాలను అంచనా వేయడం ద్వారా ఖాసీమ్ బుఖారీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాకు వచ్చింది. ‘ఎస్ఎస్ఆర్ఎన్ రిపాసిటరీ’జర్నల్‌లో ఈ అధ్యయనం తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. మార్చి 22వ తేదీ వరకూ ఉన్న కరోనా కేసులన్నింటిలో 90 శాతం కేసులు ఉష్ణోగ్రతలు మూడు నుంచి 17 డిగ్రీ సెల్సియస్‌లు ఉన్న ప్రాంతాల్లోనే సంభవించాయని ఈ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు.. ఈ ప్రాంతాల్లో గాల్లో తేమశాతం ప్రతి ఘనపు మీటర్ గాలిలో నాలుగు నుంచి తొమ్మిది గ్రాముల వరకూ ఉందని వీరు చెప్పారు. జనవరి నుంచి మార్చి నెల మొదటి వరకూ సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీ సెల్సియస్, గాల్లో తేమశాతం ఘనపు మీటర్‌కు తొమ్మిది గ్రాములు ఉన్న ప్రాంతాల్లో కేవలం ఆరు శాతం కేసులే ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ లెక్క ప్రకారం ఆసియా దేశాల్లో రుతుపవనాల్లాంటి వాతావరణం ఏర్పడితే వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశముంది. ఈ రకమైన వాతావరణంలో గాల్లో తేమశాతం ఘనపుమీటర్కు 10 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఈ వైరస్ వేగంగా వ్యాపించదని వీరు అంచనా కట్టారు. ‘ చల్లని ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు ఉంటే.. వెచ్చటి వాతావరణమున్న దక్షిణ రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. దక్షిణ ప్రాంతానితో పోలిస్తే ఉత్తరాన రెట్టింపు కేసులు ఉన్నాయి’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసియా, మధ్యప్రాచ్యాల్లో వేగం తక్కువే.. చైనా, యూరప్ దేశాలు, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల మాదిరిగా క్వారంటైన్ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టకపోయినా పలు ఆసియాదేశాల్లో, మధ్యప్రాచ్య, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. భారత్, పాకిస్తాన్, ఇండోనేసియా వంటి దేశాల్లో పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కేసులు కనపడటం లేదని కొంతమంది వాదిస్తున్నారని.. అయితే ఈ దేశాల్లో ఉండే వాతావరణమే ఉండే సింగపూర్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేసినా కేసులు తక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారు. కాబట్టి తగినన్ని పరీక్షలు చేయడం అన్నది సమస్య కాదని స్పష్టం చేశారు. ఇతర అంశాల కంటే కదలికలను నియంత్రించడం, క్వారంటైన్ పాటించడం ద్వారా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేయవచ్చునని తెలిపారు. అయితే, వైరస్ ఎలా మార్పు చెందుతోంది? పరిణమిస్తోంది? పునరుత్పత్తి వేగం వంటి అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే భిన్నమైన అంచనాలు రావచ్చునని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. -
ఇంక్యుబేటర్లు, వార్మర్లు ఉన్నా.. సేవలు మాత్రం సున్నా
తణుకు, న్యూస్‌లైన్ : సుబ్బారావు భార్య లలితమ్మకు నెలలు నిండకుండానే బిడ్డ పుట్టాడు. వెంకట్రావు చెల్లెలు దుర్గమ్మ బిడ్డ తగిన బరువు లేదు. వాళ్లిద్దరూ తణుకు ఏరియూ ఆసుపత్రిలో పురుడు పోసుకున్నారు. ఆ శిశువుల్ని ఇంక్యుబేటర్స్‌లో పెట్టాలన్నారు. ఇందుకోసం ఆ ఆసుపత్రికి రెండు ఇంక్యుబేటర్లను ప్రభుత్వం సమకూర్చింది. ప్రసాద్, పద్మ దంపతుల బిడ్డకు కామెర్లు సోకారుు. వెంటనే వార్మర్లో పెట్టకపోతే బిడ్డ దక్కే పరిస్థితి ఉండదని డాక్టర్లు చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో ఇందుకోసం 8 వార్మర్లు ఉన్నారుు. కానీ.. వాటిని వినియోగించే నిపుణులు లేరు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది హెచ్చరించారు. ఆ ముగ్గురూ తమ బిడ్డల్ని తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీశారు. బిడ్డను ఇంక్యుబేటర్‌లో పెట్టాలన్నా.. వార్మర్లో ఉంచాలన్నా రోజుకు రూ.రెండు వేలు ఖర్చవుతుందని, బిడ్డను కనీసం మూడు నాలుగు రోజులపాటు వాటిలో ఉంచాలని వైద్యులు చెప్పారు. అప్పు తెచ్చిన సొమ్ములో రూ.500 సుబ్బారావు వద్ద మిగిలాయి. వెంకట్రావు దగ్గర రూ.200 ఉండగా, ప్రసాద్ వద్ద ఆటో ఖర్చుల కోసం తెచ్చుకున్న రూ.60 మాత్రమే ఉన్నారుు. ఏంచేయూలో ఆ ముగ్గురికీ తోచలేదు. తల తాకట్టు పెట్టరుునా డబ్బు తెస్తామని.. ఏదో రకంగా తమ బిడ్డలను బతికించాలని వైద్యుల కాళ్లావేళ్లా పడ్డారు. వారు సరేననడంతో ఆ ముగ్గురూ అప్పు కోసం తలో దిక్కుకు వెళ్లారు. తణుకు ఏరియూ ఆసుపత్రిలో రోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నారుు. ప్రభుత్వం లక్షలాది రూపాయలను వెచ్చించి ఇంక్యుబేటర్లు, వార్మర్లను సమకూర్చినా చంటి బిడ్డలకు అక్కరకు రావడం లేదు. ఈ ఆసుపత్రికి తణుకు పరిసర ప్రాంతాల్లోని సుమారు 100 గ్రామాలకు చెందిన పేదలు వైద్యం కోసం వస్తుంటారు. సిద్ధాంతం, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంతోపాటు తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, గర్భిణుల సంఖ్య కూడా అధికమే. సత్వర వైద్య సేవలందిస్తారని ఈ ఆసుపత్రికి పేరుంది. ఇక్కడి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదుసార్లు ఉత్తమ సేవా పురస్కారాలను ఈ ఆసుపత్రికి అందించింది. అరుునా.. ఇంక్యుబేటర్, వార్మర్ సేవలు ఇక్కడ అందటం లేదు. ఈ ఆసుపత్రిలో నెలకు సగటున 300నుంచి 350 మంది శిశువులు జన్మిస్తుంటారు. గతంలో చంటిపిల్లల వైద్యుడు ఉన్నా, అత్యవసర వైద్య పరికరాలు ఉండేవి కావు. ఇప్పుడు వైద్యపరికరాలతోపాటు పిల్లల వైద్యుడిని సమకూర్చినా చిన్నారులకు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. ఫలితంగా చంటిపిల్లలకు అత్యవసర వైద్యం అవసరమైతే పేదలు వేలాది రూపాయలు అప్పుచేసి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగెట్టాల్సి వస్తోంది. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.వీరాస్వామిని వివరణ కోరగా.. చంటిపిల్లల వైద్య అత్యవసర పరికరాల విభాగంలో నిపుణుల్ని నియమించాల్సి ఉందన్నారు. అవసరమైన చర్యలు తీసుకుని నెల రోజుల్లో చంటి పిల్లల విభాగంలో అత్యవసర వైద్య సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.