ground nut
-
సమ్మర్లో చల్లటి బాదం పాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
అప్పుడే వేసవికాలం వచ్చేసిందా అన్నంతగా మార్చి నుంచి ఎండ దంచి కొడుతోంది. బయట సూర్యుడి భగ భగలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఎండకు చెమటలు పట్టేసి అలిసి సొమ్మసిల్లిపోతుంటా. ఈ కాలంలో ఎక్కువగా చల్లగా ఉండే పానీయాలే తాగేందుకు ఇష్టపడతాం. అలా అని కూల్‌డ్రింక్‌లు తాగితే అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా వాటిలో అధికంగా చక్కెర పరిమాణం ఉంటుంది. అందువల్లో ఇంట్లోనే హెల్తీగా ఉండే బాదం పాలు చలచల్లగా చేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ సమ్మర్లో మంచి దాహార్తిని తీర్చే బలవర్థకమైన పానీయం కూడా.రీ బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలంటే.. కావలసిన పదార్థాలు: బాదం పప్పులు- ఒక కప్పు (ఎక్కువ పరిమాణంలో కావాలి అంటే.. ఎక్కువ తీసుకోవచ్చు) జీడిపప్పు- ఒక కప్పు చక్కర – 100 గ్రాములు.. ఎక్కువ తీపి కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. యాలకుల పొడి -ఒక స్పూన్.. రుచి మరింతగా కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. పాలు – అర లీటర్..(ఒకవేళ ఎక్కువ పాలు కావాలనుకుంటే మరిన్ని ఎక్కువ తీసుకోవచ్చు) తయారీ విధానం.. బాదంపప్పులను, జీడిపప్పులను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న తీయని పాలను వేడి చేసుకోవాలి. అలా వేడిగా ఉన్న పాలలో యాలకుల పొడి, చక్కర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పోటీ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని అందులో కలపాలి. అనంతరం చిన్న మంట మీద పది నుంచి 15 నిమిషాలు ఆ పాలను మరగనివ్వాలి. ఆ తర్వాత పాలను దింపి చల్లారపెట్టాలి. అనంతరం ఆ పాలను గ్లాసుల్లో పోసుకొని.. పైన సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, కిస్మిస్ మొక్కలు వేసి కొద్దిసేపు అలా ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక అర్థగంట లేద గంట తర్వాత బయటకు తీస్తే చల్ల చల్లని బాదంపాలు సిద్ధంగా ఉంటాయి. అల వాటిని ఆస్వాదించుకుంటూ తాగొచ్చు. ఇలా పాలను రోజు పిల్లలకు తాగిస్తే ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు. బయట తాగే బాదం పాలకంటే.. ఇంట్లో తయారు చేసుకునే బాదంపాలే ఆరోగ్యానికి మంచిది కూడా. బాదం పాలలో మంచి ఫైబర్ ఉంటుంది. జీడిపప్పులో కావాల్సినన్ని మంచి కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొవ్వులు తగ్గిస్తాయి. బరువులు తగ్గించడంలో సహకరిస్తాయి. బాదంపప్పులను రోజు ఉదయం లేవగానే తింటే మెదడు పనితీరు బాగుంటుంది. బాదంలోని క్యాల్షియం ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది. పిల్లలు ఏకాగ్రతను పెంచుతుంది. ఈ బాదంపాలు తాగేందుకు టేస్టీగా ఉండటంతో పిల్లలు కూడా భలే ఇష్టంగా తాగుతుంటారు. (చదవండి: నటి ఒలివియాకి బ్రెస్ట్ కేన్సర్! ఏకంగా నాలుగు సర్జరీలు..!) -
దున్నకుండానే మొక్కజొన్న, వేరుశనగ! తక్కువ శ్రమ.. ఖర్చు ఆదా
దుక్కి దున్నకుండానే మొక్కజొన్న సాగు(జీరో టిల్లేజి) పద్ధతి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇటీవల చాలా ప్రాచుర్యం పొందింది. దీనికి ఏకైక కారణం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ అందుబాటులోకి తెచ్చిన ‘డబుల్ వీల్ మార్క్ర్’ (రెండు చక్రాలతో రంధ్రాలు వేసే పరికరం). సార్వా(ఖరీఫ్)లో వరి సాగు చేసిన భూముల్లో దుక్కి దున్నకుండా ఈ పరికరంతో రైతులు సులభంగా నేలపై రంధ్రాలు చేసి విత్తనాలు వేసుకుంటున్నారు. వరి కోసిన తర్వాత తక్కువ సమయంలోనే మొక్కజొన్న విత్తుకోవడానికి ఈ పరికరం రైతులకు ఎంతో ఉపయోగ పడుతోంది. నాలుగేళ్ల క్రితం ఈ పరికరం తొలుత అందుబాటులోకి వచ్చింది. సార్వా వరి తర్వాత మొక్కజొన్న పంటను వరుసగా మూడు దఫాలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారు. వరుసల మధ్య దూరం తగ్గించుకునే చిన్న మార్పు చేసుకొని దుక్కిలేని పద్ధతిలో వేరుశెనగ విత్తుకోవడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషిస్తున్నారు. మొక్కజొన్నతో పాటు వేరుశనగ మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం, వరుసల మధ్య 60 సెం.మీ.ల దూరంలో డబుల్ వీల్ మార్కర్‌తో రంధ్రాలు చేసి దుక్కి చేయకుండానే మొక్కజొన్న విత్తుకోవచ్చు. అదేవిధంగా వేరుశనగ విత్తుకోవడానికి మార్కర్‌లో స్వల్ప మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం, వరుసల మధ్య 40 సెం.మీ.ల దూరంలో వేరుశనగ విత్తుకోవాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గత రబీలో వరి కోసిన 48,146 ఎకరాల్లో దున్నకుండా డబుల్ వీల్ మార్కర్‌తో మొక్కజొన్నను సాగు చేశారు. 18 మండలాల్లో సుమారు 25 లక్షల వ్యంతో మండలానికి 40 చొప్పున 720 పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తెలిపింది. ఈ పరికరాలన్నీ ఎల్. సత్యనారాయణ తయారు చేసి ఇచ్చినవే. సమాన దూరంలో విత్తనాలు నాటడం వలన గాలి, వెలుతురు ధారాళంగా సోకి, పంటలకు పురుగులు, తెగుళ్ల బెడద తక్కువగా ఉంది. చేను ఏపుగా పెరిగి సాధారణ పద్ధతిలో కంటే జీరోటిల్లేజ్ పద్ధతిలో మేలైన దిగుబడులు నమోదు అవుతుండటం విశేషం. మహిళలు ఉపయోగించడానికి డబుల్ వీల్ మార్క్ర్ అనువుగా ఉండటం మరో విశేషం. మహిళా రైతులకు, ముఖ్యంగా చిన్న, సన్నకారు ఒంటరి మహిళా రైతులకు ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగకరంగా ఉంది. నెల కాలం కలిసి వస్తుంది! తొలకరి వరి చేను కోసిన తరువాత పొలంలో వరి కొయ్యకాళ్లలో దుక్కి దున్నకుండానే పదును చూసుకుని డబుల్ వీల్ మార్కర్‌ను నడిపి మొక్కజొన్న విత్తనాలు నేరుగా విత్తుకోవాలి. ఈ విధానంలో రైతులకు దుక్కి ఖర్చులు ఆదా అవ్వటమే కాకుండా నెల రోజుల పంట కాలం కలిసి వస్తుంది. మొక్కజొన్న సాగు ప్రారంభమైన తొలినాళ్లలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో రైతులకు కొయ్యతో గాని, కొయ్యతో చేసిన పెగ్ మార్కర్ అనే పరికరంతో గాని వరి మాగాణిల్లో నేరుగా రంధ్రాలు చేసి మొక్క జొన్న విత్తనాలు విత్తేవారు. పెగ్ మార్కర్ పరికరాన్ని ఉపయోగించేటప్పుడు ఎక్కువ శ్రమ, ఎక్కువ సమయం వృథా అవుతుండేది. మగ కూలీలు మాత్రమే పెగ్ మార్కర్‌ను ఉపయోగించేవారు. 2016 నుంచి ప్రయోగాలు కూలీల ఖర్చు, శ్రమ తగ్గించుకుంటూ మొక్కజొన్న, వేరుశెనగ పంటలను దుక్కి దున్నకుండా నేరుగా ఎలా విత్తుకోవాలనే అంశంపై డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధి హరిబాబు (84999 28483) 2016 నుంచి అనేక ప్రయోగాలు చేసి ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. తొలుత ఒక చక్రం ఉన్న మార్కర్‌ను, తర్వాత ఐదు చక్రాల మార్క్ర్లను డిజైన్ చేసి రైతులకు అందించారు. వీటితో సరైన ఫలితాలు రాకపోవడంతో డబుల్ వీల్ మార్క్ర్ను డిజైన్ చేశారు. ఇది రైతులకు ఉపయోగకరంగా ఉండటంతో మంచి స్పందన వచ్చింది. ఆముదాలవలసలోని ఏరువాక కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల సూచనల మేరకు ఉక్కుతో రెండు చక్రాల మార్కర్ (డబుల్ వీల్ మార్కర్) పరికరం దిద్దుకుంది. తుది రూపుదిద్దిన సత్యనారాయణ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ రూపొందించిన డబుల్ వీల్ మార్కెర్కు రైతు లంకలపల్లి సత్యనారాయణ (83741 02313) మార్పులు చేసి బరువు తగ్గించి 2019లో తుది రూపుదిద్దారు. సత్యనారాయణ వ్యవసాయం చేస్తూనే వెల్డర్‌గా పనిచేస్తున్నారు. ఆ అనుభవంతో సులభంగా ఒక వ్యక్తి తన పొలానికి భుజాన వేసుకొని తీసుకుని వెళ్లేందుకు వీలుగా డబుల్ వీల్ మార్కర్ పరికరాన్ని మార్చారు. మొదట తన పొలంలో ఉపయోగించి సంతృప్తి చెందిన తర్వాత, తానే తయారు చేసి రూ. 2,900కు ఇతర రైతులకు అందిస్తున్నారు. 2021 రబీ నాటికి రణస్థలం మండలంలో రైతులకు 85 డబుల్ వీల్ మార్కర్లను ఇచ్చారు. ఆ తర్వాత రైతుల్లో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. – గంగి నాగరాజు, సాక్షి, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా -
జయమ్మ విజయం.. కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు..
‘‘ఒక చోటే ఉంటున్నాం. చేసిన పనే చేస్తున్నాం. ఎదుగూ బొదుగు లేకుండా.. గానుగెద్దు జీవితంలా గడిపేస్తున్నాం..’’ అని చాలా మందిలో ఒక అసంతృప్తి ఉంటుంది. ఆరుపదుల వయసు దాటిన జయమ్మ జీవితంకూడా గతంలో ఇదే విధంగా ఉండేది. కానీ, గానుగ చక్రం పట్టుకొని ఆరుపదుల వయసులో విజయం వైపుగా అడుగులు వేస్తోంది జయమ్మ. చదువు లేకపోయినా, వయసు కుదరకపోయినా నవతరానికీ స్ఫూర్తిగా నిలుస్తున్న కోట్ల జయమ్మ స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్ మండలం, జక్లపల్లి గ్రామం. గానుగ నూనె వ్యాపారాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది. ఆరోగ్యదాయిని పేరుతో ప్రాచీనకాలం గానుగ నూనె ప్రాచుర్యాన్ని ఎల్లలు దాటేలా చేస్తోంది. జయమ్మది వ్యసాయ కుటుంబం. భర్త పిల్లలతో కలిసి పొలం పనులు చేసుకోవడంతో పాటు పాల ఉత్పత్తిని కొనసాగించేది. జయమ్మ నాలుగేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్‌బారిన పడింది. జబ్బు నుండి కోలుకునే క్రమంలో తనకు కలిగిన ఆలోచనను అమలులో పెట్టిన విధానం గురించి జయమ్మ ఇలా చెబుతుంది.. ‘‘పట్నంలో క్యాన్సర్‌కి చికిత్స చేయించుకున్నాను. డాక్టర్లు పదిసార్లు్ల కీమోథెరఫీ చేయాలన్నారు. ఈ సమయంలో ఓ డాక్టర్ గానుగ నూనె వాడమని, ఆహారంలో మార్పులు కూడా చేసుకోమని చెప్పాడు. దీంతో మహబూబ్‌నగర్‌లో కరెంట్ గానుగ నుండి వంట నూనెలు తెచ్చి వాడుకునేవాళ్లం. అప్పుడే వచ్చింది ఆలోచన మేమే గానుగను ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని. కరెంట్‌తో నడిచేది కాకుండా ఎద్దులతో తిరిగే కట్టె గానుగ గురించి వెతికాం. మైసూరులో ఉందని తెలిసి, అక్కడికెళ్లి చూశాం. అలా మూడేళ్ల క్రితం ఎద్దుల కట్టె గానుగను ఏర్పాటు చేసి, నూనె తీయడం ప్రారంభించాం. పల్లి, కొబ్బర, ఆవిసె, కుసుమ, నువ్వులతో నూనె తీయడం ప్రారంభించాం. ఏడాది పాటు శిక్షణ... గానుగ ఏర్పాటు చేసిన తర్వాత పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం వాళ్లు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో, నేను చేస్తున్న పని వివరించాను. ఎలాగైనా అందరికీ మంచి గానుగ నూనె అందించాలి అని చెప్పాను. ఏడాది పాటు నెలకు కొన్ని రోజుల చొప్పున మార్కెటింగ్ గురించి కూడా శిక్షణ ఇచ్చారు. అప్పటి వరకు మా చుట్టుపక్కల వారికే గానుగ నూనె అమ్మేదాన్ని. శిక్షణ తర్వాత మరో ఐదు గానుగలను ఏర్పాటు చేశాను. 15 లక్షల రూపాయల పెట్టుబడితో షెడ్డు నిర్మించి కట్టెగానుగలను ఏర్పాటు చేసి నూనె ఉత్పత్తి పెంచాను. ఇతర రాష్ట్రాల నుంచి... వివిధ రకాల నూనెలను గానుగ ద్వారా తీసేందుకు అవసరమైన ముడి సరుకులకు ఒరిస్సా, కర్ణాటక నుంచి కూడా తెప్పిస్తాను. ప్రతి నెల ఆరు టన్నుల పల్లీలు, రెండు టన్నుల కొబ్బరి, మూడు టన్నుల కుసుమ, రెండు టన్నుల నువ్వులు తీసుకుంటున్నాను. వీటిలో గడ్డి నువ్వులు ఒరిస్సా నుండి, కుసుమ, కొబ్బరి కర్ణాటక నుండి, పల్లీలు, నువ్వులు మహబూబ్‌నగర్ నుండి దిగుమతి చేసుకుని నూనె తీస్తున్నాను’ అని వివరించింది జయమ్మ. కార్యక్రమాల ఏర్పాటు... గానుగలను ఏర్పాటు చేసిన తర్వాత 4 సార్లు 170 మందికి గానుగ నూనె తయారీపై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది జయమ్మ. వారందరికీ వసతి, భోజన సదుపాయాలను కల్పించింది. ఆరోగ్యదాయిని పేరుతో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎనిమిది గానుగలను ఏర్పాటు చేసేందుకు సహకరించింది. దీంతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడ ఆరోగ్యదాయిని పేరుతో చేపడుతోంది. పాఠశాలకు వాటర్ ఫిల్టర్, పుస్తకాలు, కరెంటు సౌకర్యం కల్పించడం వంటివి కూడ చేపడుతూ జయమ్మ ఆదర్శంగా నిలుస్తుంది. ‘మరో నాలుగు గానుగలు ఏర్పాటు చేసి అమెరికాకు కూడా ఇక్కడి నూనెలు ఎగుమతి చేస్తా. కల్తీ నూనెలకు అడ్డుకట్ట వేసి స్వచ్చమైన నూనెను అందిచడమే లక్ష్యం’ అంటూ గానుగల నిర్వహణ చూడటంలో మునిగిపోయింది జయమ్మ. విదేశాలకు ఎగుమతి ‘ఇప్పుడు మా ఊరు జక్లపల్లి నుండి కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు కూడా ఎగమతి అవుతుంది. హైద్రాబాద్‌లోని ఓ సంస్థ సహకారంతో దుబాయ్, సింగపూర్, మలేషియాలకూ పంపుతున్నాం. మూడు నెలలకొకసారి దాదాపు 4 వేల లీటర్ల నూనెను ఎగుమతి చేస్తున్నాం. గానుగ తీసిన పిప్పిని పశువుల దాణాగా వాడుతున్నాం. పశువుల దాణాకు ఇక్కడ మంచి గిరాకీ ఉంది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు కొరియర్ ద్వారా స్వచ్ఛమైన కల్తీలేని నూనెను పంపుతున్నాం. మా కుటుంబ సభ్యులతో పాటు మరో 15 మంది ఈ నూనె వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు’ అని వివరించింది జయమ్మ. చేతి నిండా పని గానుగ ఏర్పాటైనప్పటి నుండి ఇక్కడ పనిచేస్తున్నా. అంతకు ముందు వ్యవసాయ పనులకు వెళ్లేదాన్ని. కొన్నాళ్లు పని ఉండేది. కొన్నాళ్లు ఖాళీగా ఉండేదాన్ని. ఈ గానుగలు వచ్చాక చేతి నిండా పని దొరుకుతుంది. పని కోసం వెదుకులాడే అవసరం లేకుండా పోయింది. – లక్ష్మి, జక్లపల్లి – బోయిని గోపాల్, గండీడ్, మహబూబ్‌నగర్, సాక్షి -
త్వరలోనే వేరుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు
ఆదోని : ఆదోని మార్కెట్ యార్డులో త్వరలోనే వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయిల్‌ఫెడ్ ఎండీ ఫణికిశోర్ తెలిపారు. శనివారం ఆయన ఆదోని మార్కెట్ యార్డులో వేరుశనగ దిగుబడులను పరిశీలించారు. ధరలు ఎలా ఉన్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. అయితే కొందరికి మాత్రమే ఆశించిన ధర లభిస్తోందని, చాలామంది క్వింటాలు రూ.4వేల లోపే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతి రాగానే క్వింటాలు మద్దతు ధర రూ.4220 కు కొనుగోలు చేస్తామని ఆయన రైతులకు తెలిపారు. ఆయన వెంట ఆయిల్ ఫెడ్ మేనేజర్ రమేష్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఆయన మార్కెట్ యార్డు అధికారులతో సమావేశమై వేరుశనగ దిగుబడి, ధరలపై చర్చించారు. -
వేరుశనగ రైతుల ఆందోళన
సూర్యాపేట : ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగ పంటకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మద్దతు ధర అందని ద్రాక్షగా మారింది. నియోజకవర్గంలోని పలు మండలాలతో పాటు నూతనకల్, మునగాల, తుంగతుర్తి ప్రాంతాలకు చెందిన రైతులు రెండు రోజుల క్రితం వ్యవసాయ మార్కెట్‌కు వేరుశనగ కాయను విక్రయించేందుకు తెచ్చారు. రైతులకు వ్యవసాయ మార్కెట్లో తక్కువ ధరకు కోట్ చేస్తున్నారు. క్వింటా వేరు శనగకాయను రూ. 1100లకు మార్కెట్ ఖరీదుదారులు ఖరీదు చేస్తున్నారు. ఇంత తక్కువ ధరకు ఖరీదు చేయడంతో పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రైతులు వారు తెచ్చిన వేరుశనగ వద్ద ఆందోళనకు దిగారు. మార్కెట్లో వేరుశనగ కాయను కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి రైతులు వచ్చి ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ అధికారులు మాత్రం మద్దతు ధర ఇవ్వకుండా మాయచేస్తున్నారని మండిపడ్డారు. వేరుశనగ వర్షానికి తడిసిందనే సాకుతో పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శని, ఆదివారం సెలవు దినంగా ప్రకటించడంతో తాము తెచ్చిన వేరు శనగకాయను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర ప్రకటించడం లేదు – అయోధ్యరాములు, గట్టికల్, రైతు వేరు శనగకాయకు మద్దతు ధర ఇవ్వడం లేదు. రెండు రోజుల క్రితం పంటను మార్కెట్‌కు తీసుకొచ్చాను. వర్షం వస్తున్నా మార్కెట్లోనే తలదాచుకుంటున్నాను. అయినా మార్కెట్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఖరీదుదారులు వారి ఇష్టానుసారంగా ధరలు పెడతామంటున్నారు. పెట్టుబడులు వెళ్లేటట్టు లేదు – గుగులోత్ జామిరి, కందగంట్లతండా, మహిళా రైతు వేరుశనగ పంటకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాం. ఎంతో ఆశతో మద్దతు ధర వస్తుందని ఎదురు చూశా. కానీ సూర్యాపేట మార్కెట్లో వేరు శనగ కాయ విక్రయిద్దామని వస్తే మద్దతు ధర పెట్టడం లేదు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదు. వేరు శనగ కాయ తీసుకొచ్చి మూడు రోజులు అవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రైతులు ఆరబెట్టిన కాయను తీసుకురావాలి – వెంకటేశం, మార్కెట్ సెక్రటరీ, సూర్యాపేట. మార్కెట్‌కు వేరుశనగకాయను తీసుకువచ్చే రైతులు ఆరబెట్టి తీసుకురావాలి. వేరుశనగ కాయ తడిసి ఉన్నట్లైతే మద్దతు ధర రాదు. భారీ వర్షాల సూచనతోనే మార్కెట్‌కు శనివారం సెలవు ప్రకటించాం. రైతులు ఎవరూ ఎలాంటి ధాన్యాన్ని తీసుకురావద్దు. -
ముందుస్తు ముంచింది!
వేరుశనగ రైతుకు అపార నష్టం – లక్ష హెక్టార్లలో ఎండిన పైర్లు – పూర్తిగా దెబ్బతిన్న కొర్ర, మొక్కజొన్న – అప్పుల ఊబిలో రైతులు – రెయిన్గన్లు హడావుడికే.. – ఉపయోగం లేని ప్రస్తుత వర్షాలు కర్నూలు(అగ్రికల్చర్): ముందస్తు వర్షం వేరుశనగ రైతును నిండా ముంచేసింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ విడత జిల్లాలోనే వేరుశనగ సాగు అధికంగా ఉంది. జూన్, జూలై నెలల్లో మురిపించిన వర్షాలు ఆగస్టు నెలలో ముఖం చాటేయడంతో రైతుల పాలిట శాపంగా మారింది. సెప్టెంబర్ నెలలో 12వ తేదీ వరకు చినుకు జాడ కరువైంది. ఆగస్టు సాధారణ వర్షపాతం 135 మి.మీ., ఉండగా.. 79.8 మి.మీ., మాత్రమే నమోదయింది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 కాగా.. ఇప్పటి వరకు 90.4 మి.మీ., వర్షం కురిసింది. ఏకంగా 40 రోజుల పాటు వర్షం లేకపోవడం.. ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. ఆగస్టు మొదటి నుంచి సెప్టెంబర్ 10 వరకు కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో వర్షాలు లేకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నెలలో గత నాలుగు రోజులుగా వర్షాలు కురిసినా వేరుశనగ, కొర్ర, మొక్కజొన్నకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆగస్టు మొదటి వారంలో వేరుశనగలో పూత వస్తుంది. ఆగస్టు నెల చివరికి ఊడలు దిగి కాయలు ఏర్పడతాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో పూత రాకపోవడం.. వచ్చినా ఎండలకు రాలిపోయింది. అక్కడక్కడ ఊడలు దిగినా.. ఆ తర్వాత తేమ శాతం పడిపోవడంతో ఊడలకు కాయలు రాక రైతులకు నష్టం మిగిలింది. లక్ష హెక్టార్లలో దెబ్బతిన్న వేరుశనగ జిల్లాల్లో వేరుశనగ సాధారణ సాగు 1,04,237 హెక్టార్లు కాగా.. 1,15,627 హెక్లార్లలో సాగయింది. ఇందులో లక్ష హెక్టార్లకు పైగా వేరుశనగ వర్షాభావం వల్ల దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులే చెబుతున్నారు. దెబ్బతిన్న నల్లరేగడి నేలల్లో వేసిన వేరుశనగను దున్నేసి రబీలో శనగ సాగుకు సిద్ధవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా వేరుశనగ దెబ్బతినడంతో రైతులు నట్టేట మునిగారు. ఎకరాకు కనీసం ఒక బస్తా కూడా.. అంటే 42 కిలోలు కూడా వచ్చే పరిస్థితి లేదంటే రైతులు ఏ స్థాయిలో నష్టపోయారో తెలుస్తోంది. మిగిలిన పంటలదీ అదే పరిస్థితి ప్రధానంగా వేరుశనగ కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో సాగయింది. నష్టపోయిన రైతుల కన్నీటి గాథలు వర్ణనాతీతం. అదేవిధంగా కొర్ర, మొక్కజొన్న పంటలు కూడా పూర్తిగా దెబ్బతిని పనికి రాకుండాపోయాయి. కీలకమైన సమయంలో వర్షాలు లేకపోవడంతో 10,444 హెక్టార్లలో కొర్ర.. 25,932 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు పొట్టదశలోనే ఎండలకు ఎండిపోయాయి. వచ్చిన కంకుల్లో ఒక్క గింజ కూడా కనిపించని పరిస్థితి. రెయిన్గన్ల పేరిట హడావుడి ప్రభుత్వం రెయిన్గన్ల పేరిట గత నెల నుంచి హడావుడి చేస్తోంది. జిల్లాలోని ఆలూరు మండలం అరికెరలో రెయిన్గన్లతో ఎండుతున్న పంటలను తడిపే ప్రక్రియను ఇటీవల ముఖ్యమంత్రి కూడా పరిశీలించారు. అయితే ఈ ప్రక్రియ దారుణంగా విఫలమైంది. తమకు రెయిన్గన్లు వద్దు.. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే చాలని రైతులు వేడుకుంటున్నారు. రెయిన్గన్ల పేరిట రైతులను మభ్యపెట్టడం, ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హెక్టారుకు రూ.40వేల పెట్టుబడి నేలపాలు వేరుశనగ సాగులో ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ బాడుగలు తదతర ఖర్చులు కలిపి హెక్టారుకు సగటున రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. హెక్టారుకు కనీసం 12 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడి వస్తే రైతులకు పెట్టుబడి దక్కి రూ.10 వేల వరకు మిగులు ఉంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల రోజులకు పైగా వర్షాలు లేకపోవడంతో ఎండలకు లక్ష హెక్టార్లలో వేరుశనగ మాడి పోయింది. అంటే పెట్టిన పెటుబడి మొత్తం నేల పాలయింది. అంటే రైతులు పెట్టిన పెట్టుబడులు రూ.400 కోట్లు మట్టి పాలయ్యాయి. కొర్రకు హెక్టారుకు రూ.20వేలు, మొక్కజొన్నకు రూ.25వేలు ప్రకారం పెట్టుబడి పెట్టగా.. ఇదంతా మట్టిలో కలిసిపోయింది. -
ఇన్పుట్ సబ్సిడీ ఔట్!
– మదనపల్లె డివిజన్లో 10వేల మంది రైతులకు మొండిచేయి – ఆన్లైన్లో వివరాలు అంగీకరించకపోవడమే అసలు కారణం – రైతుల కొంపముంచిన సాంకేతిక సమస్యలు – మూడుతరాలకు ముందు చనిపోయినవారి పేర్లతో జాబితా – డెత్ కేసులకు ఇన్పుట్ సబ్సిడీ రాదన్న అధికారులు – నిత్యం బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ రైతులు పలమనేరు: మదనపల్లె డివిజన్లో గత ఏడాది వేరుశనగ సాగుచేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రూ. 10కోట్లకు పైగా వెనక్కిపోనుంది. పదివేల మంది రైతులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదుచేసేందుకు వీలుకాకపోవడమే ఇందుకు కారణం. గతంలో మతిచెందినవారి పేరిటే చాలావరకు పాసుపుస్తకాలున్నాయి. రెవెన్యూశాఖ పంట సాగుదారుకు బదులు 1బి ఆధారంగా జాబితాను తయారుచేయడంతో ప్రస్తుతం రైతులకు పంట నష్టపరిహారం అందని పరిస్థితి తలెత్తింది. డెత్ కేసులకు సంబంధించి పరిహారం రాదని అధికారులు చెబుతున్నారు. వివిధ సాంకేతిక కారణాలతో ప్రభుత్వం రైతుల నోట్లో మట్టికొట్టింది. జిల్లాలో గతేడాది వేరుశనగను పండించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం హెక్టారుకు రూ.10వేలు న ష్టపరిహారంగా ఇచ్చేందుకు అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో రూ. 90 కోట్లకు పైగా ఇందుకు మంజూరు చేశామని తెలిపింది. సంబందిత రెవెన్యూ గ్రామాల వీఆర్వోల నుంచి వ్యవసాయశాఖ వివరాలను సేకరించింది. ఇందులోని రైతులను సంబంధిత బ్యాంకులో వ్యక్తిగతఖాతాలను తెరవాలని సూచించారు. దీంతోపాటు రైతుల ఆధార్‌కార్డులను బ్యాంకు ఖాతా, భూమి టైటిల్‌దారు, అనుభవదారు వివరాలు మ్యాచయితే నేరుగాఖాతాలోకే పరిహారం అందుతుందని తెలిపారు. కానీ ఇప్పుడు పలు కారణాలను సాకుచూపు వెబ్సైట్లో అప్లోడ్ కాలేదని రైతులకు పరిహారం చెల్లించడం లేదు. ఇదిగో సాక్ష్యం.... పలమనేరు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబందించి 29,287 మంది రైతులు,14,916 హెక్టార్లలో వేరుశనగ పండించి నష్టపోయారు. వీరికి రూ.11.89 కోట్లను మంజూరు చేసింది. సాంకేతిక కారణాలతో ఆన్లైన్లో నమోదుకాని రైతులు దాదాపు రెండువేల మంది ఉన్నారు. వీరికి అందాల్సిన రూ.2 కోట్లు ప్రభుత్వం నుంచి బ్యాంకులకు విడుదలకాలేదు. మదన పల్లె డివిజన్లో రూ.10 కోట్లు వెనక్కే.... డివిజన్ పరిధిలోని పలమనేరు,కుప్పం,పుంగనూరు, మదనపల్లె, తంబ్ళపల్లె నియోజకవర్గాల్లో దాదాపు పదివేల మంది రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదు. దీంతో రూ.10 కోట్లు వెనక్కిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే గడువు మించింది కాబట్టి ఈ నిధులను ప్రభుత్వానికి జమ చేయనున్నట్టు వ్యవసాయశాఖ చెబుతోంది. ఆన్లైన్లో తలెత్తిన ఇబ్బందులు ఇవి.... –చనిపోయిన వారిపేరిట పాసుపుస్తకాలుండటం –టైటిల్, ఎంజాయ్మెంటు ఒక్కటిగా లేనివారు –ఆధార్, బ్యాంకు ఖాతా సరిపోక .. –రెవెన్యూ వెబ్‌లో ఎంట్రీకపోవడం.. – మీసేవ అడంగుల్ సైట్లో అధికారుల తప్పిదాలు –ఇక్కడ భూములున్న కర్ణాటక సరిహద్దు రైతులు –సాగుచేసి మైగ్రేషనయిన రైతులు వివరాలు లేక – కౌలు రైతుగా ఎంట్రీలు లేనివారు – అర్హతలున్నప్పటికీ వీర్వోలు జాబితాలో పేరులేనివారు ఇలా రకరకాల కారణాలతో ఆన్లైన్లో వివరాలు అంగీకరించలేదు. దీంతో సంబందిత రైతులకు పరిహారం అందకుండా పోయింది. ఆన్లైన్లో ఎంట్రీకాకపోతే ఏమీ చేయలేం..... సాంకేతిక పరమైన కారణాలతో పరిహారం రానిమాట నిజమే. క్షేత్ర స్థాయిలోవారు పంటను సాగుచేసినా రకరకాల కారణాలతో కంప్యూటర్లో ఆన్లైన్ కావడం లేదు. ముఖ్యంగా డెత్ కేసుల్లో పరిహారం రానట్టే. ఇక్కడ జరుగుతున్న సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలిపాం. విశ్వనాథ రెడ్డి, సహాయసంచాలకులు, పలమనేరు డివిజన్ రైతులతో చెలగాటమాడుతోంది... అర్హులైన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీని అందజస్తామన్న సర్కారు ఇప్పుడు టెక్నికల్ సమస్యల పేరిట రైతులను నట్టేనముంచేసింది. రెవిన్యూశాఖ చేసిన తప్పిదాలకు రైతులను బాధ్యులను చేయడం సమంజమా.. దీనిపై పోరాటానికి దిగుతాం. ఉమాపతి, ఏపీ రైతుసంఘ నాయకులు, పలమనేరు -
వరుణార్పణం..
నిండా ముంచిన వర్షం.. నీట మునిగిన వేరుశనగ పంట ఎకరాకు రూ .50 వేలు పెట్టుబడి 10 శాతం కూడా చేతికి రాని పరిస్థితి ప్రభుత్వం ఆదుకోవాలని వినతులు రేపల్లె : ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతి కందే తరుణంలో వర్షార్పణమవడంతో రైతులకు కన్నీటిని మిగిల్చింది. రెక్కల కష్టం వృధాగా మారి నష్టాలను మిగిల్చాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఖరీప్ సాగుకు సిద్ధపడుతున్న రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంటే, మరోవైపు వేసవిలో వేరుశనగ సాగు చేసిన రైతులకు విషాదాన్ని మిగిల్చింది. నియోజకవర్గంలోని చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెం, తుమ్మలపాలెం, కావూరు గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో వేసవిలో వేరుశనగ సాగు చేశారు. రెండేళ్లుగా ఖరీప్‌లో వరి సాగు ఆగస్టు చివరి మాసంలో ప్రారంభమవుతుండటంతో ఈ ప్రాంత రైతులు మే నెలలో వేరుశనగ సాగుకు శ్రీకారం చుట్టారు. అప్పుడు సాగు చేసిన పంట ప్రస్తుతం చేతికందే సమయంలో ఉంది. ఈ తరుణంలో రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు రాంబోట్లవారిపాలెం పంచాయతీ పరిధిలో సుమారు 200 ఎకరాల పంట నీటమునగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 20 రోజుల్లో కోతకు వస్తున్న సమయంలో కురిసిన వర్షాలకు మళ్లలో నీళ్లు చేరి కుళ్లిపోయే దశకు చేరుకున్నది. పంటను రక్షించుకునేందుకు రైతుల ప్రయత్నాలు.. వర్షాలకు కుళ్లిపోతున్న పంటను రక్షించుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నీటిలో నానుతున్న వేరుశనగను పెకలించి వాహనాల్లో ఒడ్డుకు చేర్చి బాగున్న కాయలను వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కనీసం 10వ శాతం కూడా చేతికందని పరిస్థితి నెలకొనడంతో రైతులు దిగాలు పడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. -
వేరుశనగ పంట రైతులకు న్యాయం చేయండి: వైఎస్ అవినాష్
న్యూఢిల్లీ: వేరుశనగ పంట నష్ట పోయిన రైతులకు న్యాయం చేయాలని ఎండీ జోసఫ్ కు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వినతి చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర వ్యవసాయ బీమాకంపెనీ ఎండీ జోసఫ్‌తో అవినాష్ రెడ్డి చర్చించారు. వైఎస్ అవినాష్ రెడ్డి సూచనకు ఎండీ జోసఫ్ సానుకూలంగా స్పంధించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని బీమా కంపెనీ ఎండీ జోసఫ్ హామీ ఇచ్చారని వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వేరుశనగ పంట కారణంగా జిల్లాలోని పలు రైతులు నష్టాలకు గురయ్యారు. -
దళారుల దందా!
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : మార్కెట్ మాయాజాలంతో రైతన్న కుదేలయ్యాడు. పెట్టుబడులు కూడా రాకుండా దళారులు అడ్డుకుంటున్నారు. అన్నదాత బలహీనతను పొలంలోనే సొమ్ము చేసుకుంటున్నారు. ఏతల నాడు ధరలు కోతల నాటికి కనుచూపు మేరలో కూడా కనిపించడంలేదు. జిల్లాలో రబీ సీజన్లో రైతులు పండించిన పలు రకాల పంటలకు నేడు గిట్టుబాటు ధరలు లేవు. వేరుశనగ.. రబీ సీజన్లో 3327 హెక్టార్లలో వేరుశనగా సాగు చేశారు. తీరప్రాంతంలో ఎక్కువగా సాగువుతోంది. విత్తనాలు, ఎరువులు, దుక్కి, కలుపు, కూలీ అన్నీ కలిపి ఎకరాకు రూ.25 వేలకుపైగా ఖర్చు పెట్టారు. క్వింటాకు 30 నుంచి 40 బస్తాలలోపే పండింది. విత్తన కొనుగోలు సమయంలో వేరుశనగ అధిక ధర పలికింది. పంట చేతికొచ్చే సమయానికి ఆ ధర లేక రైతులు దిగాలు పడ్డారు. బస్తా రూ. 900 నుంచి రూ.1200 వరకు మత్రామే పలుకుతోంది. రేటు పెరగకుండా దళారులు అడ్డుకుంటూ రైతును నట్టేట ముంచుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక రైతులు పొలాల్లోనే ఎంతోకొంతకుపంట తెగనమ్ముకుంటున్నారు. కౌలు రైతు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. చివరకు కౌలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నాడు. మిర్చి.. 7694 హెక్టార్లలో మిర్చి వేశారు. ఈ పంట పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా సాగవుతోంది. కందుకూరు ప్రాంతంలో కొండమూరువారిపాలెంలో దాదాపు 250 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. క్వింటా రూ.8 వేలు ఉన్న ధర ప్రస్తుతం రూ.7,300లకు పడిపోయింది. ఎకరాకు రూ.లక్షా 50 వేల వరకు ఖర్చు అవుతోంది. దళారుల మాయజాలంతో ధరలు తగ్గిపోయాయి. పెట్టిన పెట్టుబడులు రాక రైతులు విలవిల్లాడుతున్నారు. పత్తి.. జిల్లావ్యాప్తంగా రబీలో 807 హెక్టార్లలో పత్తి సాగైంది. ఖరీఫ్‌లో 53,508 హెక్టార్లలో సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఎకరాకు రూ.21,550 వరకు పెట్టుబడి పెట్టారు. కౌలు 15 వేలు చెల్లించారు. మొత్తం రూ.36,550 వరకు ఖర్చు పెట్టారు. ప్రభుత్వం క్వింటాకు దాదాపు రూ.4వేల ధర నిర్ణయించింది. అంత వరకూ బాగానే ఉన్నా రంగుమారిందన్న సాకు చూపి మార్కెట్లో దళారులు రూ.3,200 కొనుగోలు చేసి రైతులను నట్టేట ముంచుతున్నారు. దీనికి తోడు మూడు నుంచి ఐదు క్వింటాళ్ల వరకు దిగుబడి కూడా తగ్గింది. తీసిన పత్తి కూలీలకే సరిపోలేదని రైతన్న వాపోతున్నాడు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు ప్రారంభించకుండా చోద్యం చూస్తోంది. గతేడాది అక్టోబర్‌లో కురిసిన వర్షాలకు పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ఈ మొత్తం నేపథ్యంలో పత్తి సాగు చేయాలంటేనే రైతులు జంకుతున్నారు. ‘శనగ’ లేదు శీతల గిడ్డంగుల్లో 14.5 లక్షల క్వింటాళ్ల శనగలు మూడేళ్లుగా మూలుగుతున్నాయి. మళ్లీ కొత్తవి వచ్చాయి. గత నెల ఒంగోలు వ్యవసాయ మార్కెట్లో కేంద్రాన్ని ఏర్పాటు చేసి తొలిరోజు కేవలం 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గతంలో రూ.7,500 పలికిన ధర నేడు రూ.3,700 కూడా పలకని పరిస్థితి ఉంది. మద్దతు ధర పేరుతో ప్రభుత్వం మూడు వేల వంద రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తోంది. అదీ అన్ని సక్రమంగా ఉంటేనే. లేకుంటే నిబంధనల పేరుతో కోత విధిస్తారు. అమ్మిన శనగలకు డబ్బుల కోసం రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ ఇంకా చెప్పులరిగేలా తిరుగుతున్నారు. రైతన్నల వర్రీ జిల్లాలో వరి 80289 హెక్టార్లలో సాగైంది. ధాన్యం చేలో ఉండగానే దళారులు రంగంలోకి దిగారు. బీపీటీలు, 1001, సన్నాల రకం వడ్లను దళారులు రూ.900 నుంచి రూ.1000 కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కొత్తపట్నం ప్రాంతంలో అసలు ధర రూ.1200 వరకు ఉన్నా మిల్లర్లు దళారులను రంగంలోకి దించి కేవలం రూ.900 అడగటం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయకట్టు పరిధి దర్శి, త్రిపురాంతకం, కురిచేడు, ముండ్లమూరు ఏరియల్లో ఎకరాకు 50 నుంచి 60 బస్తాల వరకు పండే అవకాశం ఉంది. ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చు అవుతోంది. చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో దిక్కుతోచని రైతు.. పొలంలోనే పంట తెగనమ్ముతున్నాడు. కౌలు రైతుల శ్రమ వృథా అవుతోంది. అటు పెరిగిన ఖర్చులు, ఇటు మార్కెట్ దళారుల మాయజాలం దెబ్బకు రైతన్న కుదేలవుతున్నాడు. ఇవీ.. అంతే పొగాకు, ఉల్లి, టమోట పంటలకూ కూడ గిట్టుబా టు ధర రాకుండా దళారులు అడ్డుకుంటూ రైతన్న శ్రమను దోచుకుంటున్నారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోందని అన్నదాత వాపోతున్నాడు.