త్వరలోనే వేరుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు
Published Sat, Nov 5 2016 11:52 PM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
ఆదోని : ఆదోని మార్కెట్ యార్డులో త్వరలోనే వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయిల్‌ఫెడ్ ఎండీ ఫణికిశోర్ తెలిపారు. శనివారం ఆయన ఆదోని మార్కెట్ యార్డులో వేరుశనగ దిగుబడులను పరిశీలించారు. ధరలు ఎలా ఉన్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. అయితే కొందరికి మాత్రమే ఆశించిన ధర లభిస్తోందని, చాలామంది క్వింటాలు రూ.4వేల లోపే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతి రాగానే క్వింటాలు మద్దతు ధర రూ.4220 కు కొనుగోలు చేస్తామని ఆయన రైతులకు తెలిపారు. ఆయన వెంట ఆయిల్ ఫెడ్ మేనేజర్ రమేష్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఆయన మార్కెట్ యార్డు అధికారులతో సమావేశమై వేరుశనగ దిగుబడి, ధరలపై చర్చించారు.
Advertisement
Advertisement