oil fed
-
ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 పామాయిల్ పరిశ్రమలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పామాయిల్ సాగుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని.. ఆయిల్ పామ్ సాగు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతాంగం ఆయిల్ పామ్ సాగువైపు మొగ్గుచూపేలా అధికార యంత్రాంగం దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 5 ఆయిల్ పామ్ పరిశ్రమలు నెలకొల్పే ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ. 1,050 కోట్లతో ఈ పరిశ్రమలను స్థాపించనున్నారు. తర్వాత రాష్ట్రంలోని 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేలా రూ. 4.07 కోట్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వాటిని తీర్చిదిద్దేందుకు అవసరమైన రెండో ఫైలుపై సంతకం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు తరచూ అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వీలుగా రైతు వేదికలను తీర్చిదిద్దుతామన్నారు. సహకార వ్యవస్థలో పారదర్శకమైన పాలన అందించేందుకు వివిధ విభాగాలను పూర్తిగా కంప్యూటరీకరణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా.. మంత్రి మూడో ఫైలుపై సంతకం చేశారు. ఈ సందర్భంగా గద్వాలకు చెందిన పట్టు పరిశ్రమశాఖ అధికారి జగన్నాథ్ కుమారుడు ఆశిష్ కుమార్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం కలి్పస్తూ నియామక పత్రం అందజేశారు. తర్వాత అధికారులతో తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున పామాయిల్ పరిశ్రమలను ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నెలకొల్పుతామన్నారు. పామాయిల్ సాగు విస్తరణకు ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల స్థాపన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పామాయిల్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుతో రైతులకు ఎళ్లవేళలా మార్కెట్ అందుబాటులోకి వస్తుందన్నారు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పామాయిల్ సాగుతో రైతులకు ఎకరాకు రూ. లక్ష వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే అంతరపంటలతో అదనపు ఆదా యం లభిస్తుందన్నారు. ఆయిల్ ఫెడ్ ఏటా 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు పెంచేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తుమ్మల తెలిపారు. -
ప్రజలకు ‘విజయ’ మరింత చేరువ కావాలి
రాజేంద్రనగర్ (హైదరాబాద్): నాణ్యతా ప్ర మాణాలతో కూడిన విజయ వంటనూనెలను ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించనున్న విజయ వంటనూనెల మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ కర్మాగారం నిర్మాణానికి మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తు తం శివరాంపల్లిలోని ప్యాకింగ్ కేంద్రం మూడు షిఫ్ట్‌లలో నడుస్తోందన్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 3.8 ఎకరాల భూమిని ఆయిల్ ఫెడ్ సంస్థకు కేటాయించామన్నారు. రాబోయే రోజుల్లో ఆధునాతన యంత్రాలతో పూర్తి మైగ్రేడ్ పద్ధతిలో ప్యాకింగ్ స్టేషన్‌ను నిర్మించి ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను అందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ సంస్థకు స్థలాన్ని కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా రు. రూ.25 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైన విజయ హైదరాబాద్ మెగా ప్యాకింగ్ కేంద్రం, కీసర తాగునీరు కర్మాగారాలను జనవరి 2024లోపు పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఎండీ, డైరెక్టర్ సురేందర్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణ పాల్గొన్నారు. -
ఆయిల్‌ఫెడ్‌కు 1.3 లక్షల ఎకరాలు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పాం సాగుకు నోటిఫై చేసిన ఏరియాలో 1.3 లక్షల ఎకరాలు ఆయిల్ ఫెడ్‌కు ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. మహబూబాబాద్ జిల్లాలో 50 వేల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 30 వేల ఎకరాలు, జనగామ జిల్లాలో 20 వేల ఎకరాలు, గద్వాల జిల్లాలో 20 వేలు, నారాయణపేట్ జిల్లాలో 10 వేల ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి త్వరలో ఒప్పందం చేసుకుంటామని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ నిర్మల తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాల్లో 8,24,162 ఎకరాలు ఆయిల్‌పాం సాగుకు అనువైన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. అందులో దాదాపు 8 లక్షల ఎకరాలను 13 కంపెనీల పరిధిలోకి తీసుకురావడం, ఆయిల్‌ఫెడ్‌కు 24,500 ఎకరాలు (2.97 శాతం) మాత్రమే కేటాయిస్తూ వ్యవసాయశాఖ ఇటీవల ఉత్తర్వులు ఇవ్వడం విదితమే. దీంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు తమకు మరికొంత కేటాయించాలని వ్యవసాయశాఖకు విన్నవించారు. ఇదిలావుంటే ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన దాంట్లో కొన్ని ప్రముఖ సంస్థలే ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో ఆయిల్‌ఫెడ్ కోరినట్లుగా నోటిఫై చేసిన ప్రాంతాల్లో కొంతమేరకు ఇచ్చారు. కొన్ని కంపెనీలు రాని ఏరియాలను ఇప్పటికే టెండర్లలో పాల్గొన్న సంస్థలకు ఇస్తామని ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. -
మీకిది సబబేనా సారూ!
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌ఫెడ్– సర్కారుకు మధ్య వివాదం తలెత్తింది. ఆయిల్‌పాం నోటిఫై ఏరియాను ప్రైవేటుకు ఇస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్కారుకే ఆయిల్‌ఫెడ్ లేఖ రాయడం సంచలనం రేపుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే సహకార సంస్థ... ప్రభుత్వ నిర్ణయాన్నే సవాల్ చేయడం గమనార్హం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయిల్‌ఫెడ్ చేతిలోనే ఉన్న ఆయిల్‌పాం సాగు, కొత్త ఏరియాల్లో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంతో వివాదం మొదలైంది. రాష్ట్రంలో కొత్తగా 25 జిల్లాల్లో 8,24,162 ఎకరాలు ఆయిల్‌పాం సాగుకు అనువైన ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అందులో దాదాపు 8 లక్షల ఎకరాలను 13 ప్రైవేటు కంపెనీల పరిధిలోకి తీసుకురావడం, ఆయిల్‌ఫెడ్‌కు కేవలం 24,500 ఎకరాలు (2.97 శాతం) కేటాయిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్థన్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీచేయడం... ఆయిల్‌ఫెడ్ అధికారులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. దీనిపై ఆయిల్‌ఫెడ్ నేరుగా ప్రభుత్వానికే లేఖాస్త్రం సంధించడం కలకలం రేపుతోంది. ఆయిల్‌ఫెడ్ అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 3.07 లక్షల ఎకరాలకు దరఖాస్తు చేస్తే ‘కేంద్రం 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలను నోటిఫై చేసింది. అందులో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో 99,985 ఎకరాలు, గద్వాల, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో 50 వేల ఎకరాలు, మంచిర్యాల, కొమురంభీం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో 1.57 లక్షల ఎకరాలు మాకు కేటాయించాలని కోరాం. మొత్తంగా 12 జిల్లాల్లో 3.07 లక్షల ఎకరాలు కోరుతూ ఉద్యానశాఖకు దరఖాస్తు చేశాం. కానీ ప్రభుత్వం 22 జిల్లాల్లోని 7,99,662 ఎకరాలను 13 ప్రైవేట్ కంపెనీలకు కేటాయించింది. ఆయిల్‌ఫెడ్‌కు మాత్రం కేవలం 24,500 ఎకరాలే ఇచ్చింది’అని ఆయిల్‌ఫెడ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. అందులో గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొత్తగా 20 వేల ఎకరాలు కేటాయించగా, ఇప్పటికే తమ పరిధిలోని కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 4,500 ఎకరాలు కేటాయించినట్లు పేర్కొంది. 1993 నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో 41,232 ఎకరాలు ఆయిల్‌ఫెడ్ పరిధిలో ఉందని, అందుకోసం రెండు అధునాతన ఫ్యాక్టరీలను నెలకొల్పామని పేర్కొంది. దీన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా, ఇప్పటికే తమ పరిధిలో ఉన్న ఆయిల్‌పాంను కూడా ప్రైవేటుకు కేటాయించడంపై విస్మయం వ్యక్తం చేసింది. కోట్లు ఖర్చుచేస్తే ప్రైవేటుకు ఇవ్వడమేంటి? ఈ ఏడాది జనవరిలో పూర్వ మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్టు కింద నర్సరీలు చేపేట్టేందుకు ఆయిల్‌ఫెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2020–21లో గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలో, మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోనూ ఆయిల్‌పాం నర్సరీని ఆయిల్‌ఫెడ్ నెలకొల్పింది. ఈ రెండింటి పరిధిలో 7 వేల ఎకరాలు కేటాయించారు. అందుకోసం ఆయిల్‌ఫెడ్ రూ. 6 కోట్లు కూడా కేటాయించింది. ఇంతటి కృషిచేస్తే గద్వాల, నారాయణపేట జిల్లాలను మినహా మిగిలిన ఏరియాలను ఆయిల్‌ఫెడ్‌కు బదులు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం ఏమాత్రం సమంజసం కాదని లేఖలో ఆయిల్‌ఫెడ్ పేర్కొంది. 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆయిల్‌ఫెడ్‌కు అన్యాయం జరిగిందని తెలిపింది. కాబట్టి ఇప్పటికైనా 15 శాతం ఆయిల్‌పాం నోటిఫై ఏరియాను తమకు కేటాయించాలని విన్నవించింది. నేను కూడా లేఖ రాస్తా: కంచర్ల రామకృష్ణారెడ్డి, ఛైర్మన్, ఆయిల్‌ఫెడ్ అనుకున్నంత ఏరియా ఆయిల్‌ఫెడ్‌కు రాలేదనేదే నా ఆవేదన. రైతులకు న్యాయం జరగాలంటే అన్ని ప్రాంతాల్లోనూ ఆయిల్‌ఫెడ్‌కు కొంతమేరకు ఆయిల్‌పాం సాగు పరిధిని పెంచాలి. ఈ విషయంపై ఇప్పటికే ఆయిల్‌ఫెడ్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేఖ రాసింది. నేను కూడా లేఖ రాస్తాను. అవసరమైతే సీఎంకు విన్నవిస్తాను. -
13 జిల్లాల్లో కొత్తగా ఆయిల్‌ఫాం యూనిట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఆయిల్‌ఫాం ప్రాసెసింగ్ యూనిట్లు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 13 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి గురువారం ఆయిల్‌ఫెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం ఆమోదం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములు గు, మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఈ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 24 జిల్లాల్లో కొత్తగా 7.73 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ఫాం సాగు చేయాలని సర్కా రు నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సమావేశ వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, ములుగు, జనగాం, మహబూబాబాద్, కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, కామారెడ్డి, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లో కొత్తగా అదనంగా ఆయిల్‌ఫాం సాగు చేయనున్నారు. ఈ విషయంపై రైతులను చైతన్యం చేస్తామని ఆయన తెలిపారు. ఆయిల్‌ఫెడ్ టర్నోవర్ రూ.554 కోట్లు.. ఆయిల్‌ఫెడ్ టర్నోవర్ గణనీయంగా పెరిగింది. గత ఆరేళ్లతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా రెండింతలకు మించి పెరిగినట్లు ఆయిల్‌ఫెడ్ వర్గాలు వెల్లడించాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.237.48 కోట్లు ఉండగా, 2019–20లో ఏకంగా రూ.554 కోట్లు పెరిగినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. -
ఆయిల్ ఫెడ్‌కు బీచుపల్లి ఫ్యాక్టరీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో తాళం పడిన గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికోసం తెలంగాణ ఆయిల్‌ఫెడ్ జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ)తో వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకుంది. ఆయిల్‌ఫెడ్ రూ.8 కోట్లు చెల్లించి స్వాధీ నం చేసుకోవాల్సి ఉండగా, ఇందులో రూ.2.11 కోట్లు బుధవారం ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే రూ.3 కోట్లు చెక్కుల రూపంలో చెల్లించారు. ఇంకా మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించేందుకు ఎన్డీడీబీతో ఆయిల్‌ఫెడ్ అవగాహన కుదుర్చుకుంది. వాస్తవానికి 2011లో ఈ బీచుపల్లి మిల్లు స్థలం, బిల్డింగ్స్, ప్లాంట్, ఇతర మిషనరీ విలువ రూ.2.37 కోట్లుగా ఉందని, ఇప్పుడు రూ.8 కోట్లకు సెటిల్మెంట్ చేసుకోవడంపై మతలబు ఏముందని టీఎస్ ఆయిల్‌ఫెడ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రశ్నించింది. అలాగే బీచుపల్లి ఫ్యాక్టరీ ఉమ్మడి ఆస్తిగా ఉంది. మొదట్లో ఏర్పాటు చేసిన నాడే ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందినదిగా నెలకొల్పారు. అయితే రాష్ట్రం విడిపోయిన తరువాత దాని విభజన జరగలేదు. విభజన జరగకుండానే ఎన్డీడీబీకి అప్పులు చెల్లించడం ద్వారా భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు వస్తాయని పలువురు పేర్కొంటున్నారు. 2003లో మూసివేత.. వేరుశనగ నుంచి నూనె తీసి విజయవర్ధనే ఆయిల్ ప్యాకెట్లతో పేరుగాంచిన ఈ మిల్లును 2003లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూసివేశారు. ఈ మిల్లును నమ్ముకుని పంటలు సాగు చేసిన రైతులు ఎంతోకాలం ఆందోళన చేశారు. ఎన్డీడీబీ ఆర్థిక సహకారంతో నిర్మించారు. ఈ ఫ్యాక్టరీని అప్పట్లోనే రూ.11.26 కోట్లతో నిర్మించారు. 2003లో మూతపడినా ఎన్డీడీబీ నుంచి తీసుకున్న అప్పును పూర్తిస్థాయిలో చెల్లించలేదు. దీంతో ఇప్పుడు దీనిని తెరవాలని, అప్పును చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫ్యాక్టరీని పునరుద్ధరించిన తరువాత మళ్లీ వేరుశనగ నూనెతోపాటు పామాయిల్ సహా ఇతరత్రా నూనెలను కూడా ఉత్పత్తి చేస్తామని ఆయిల్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత ఫ్యాక్టరీ యంత్రాలు బాగానే ఉన్నాయని, మరో రూ.కోటిన్నర ఖర్చు చేస్తే ఫ్యాక్టరీ పూర్తి స్థాయిలో నడుస్తుదని అంటున్నారు. ఇందుకోసం కొందరు ఉద్యోగులను కూడా తీసుకోనున్నారు. -
బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: గద్వాల జిల్లా బీచుపల్లి ఆయిల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. దీంతో 16 ఏళ్ల క్రితం మూతపడిన ప్రతిష్టాత్మకమైన ఫ్యాక్టరీ మళ్లీ జీవం పోసుకోనుంది. 2003లో ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు దాన్ని మూసి వేయగా, ఇప్పుడు పునరుద్ధరణ జరుగుతుండటంతో ఆయిల్‌ఫెడ్ వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఆ ఫ్యాక్టరీని అప్పట్లోనే రూ. 11.26 కోట్లతో నిర్మించారు. వేరుశనగ నూనె, కేక్ ఆయిల్ తయారు చేసేవారు. దాన్ని జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ) ఆర్థిక సహకారంతో నిర్మించారు. అయితే అది మూతపడినా ఎన్డీడీబీ నుంచి తీసుకున్న అప్పును పూర్తిస్థాయిలో చెల్లించలేదు. అయితే ఇప్పుడు దాన్ని తెరవాలంటే ఎన్డీడీబీకి తీసుకున్న అప్పును చెల్లించాల్సి ఉంది. ఒకేసారి చెల్లించేలా (వన్‌టైం సెటిల్మెంట్) ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకోవాలని ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. అయితే ఎన్డీడీబీ రూ. 7.5 కోట్లు కావాలని కోరుతుండగా, ఆయిల్‌ఫెడ్ మాత్రం రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్లతోనే సెటిల్ చేసుకోవాలని భావిస్తుంది. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ ఎండీ నిర్మల, సీనియర్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి మంగళవారం ఎన్డీడీబీ అధికారులతో సమావేశమయ్యారు. రోజుకు 200 మెట్రిక్ టన్నుల నూనె 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వేరుశనగ సాగుచేసే రైతులకు మరింత ఆదాయం సమకూర్చడం, రాష్ట్రంలో ప్రజలకు తక్కువ ధరకే వేరుశనగ నూనె అందించడం కోసం ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. వివిధ రకాల అడ్డంకులు అధిగమించి 1990లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ ఫ్యాక్టరీ పరిధిలో దాదాపు 135 మంది ఉద్యోగులు పనిచేశారు. రోజుకు 200 మెట్రిక్ టన్నుల వేరుశనగ నూనెసహా ఇతరత్రా నూనెలనూ ఉత్పత్తి చేసేవారు. ఎంతో దిగ్విజయంగా నడుస్తున్నప్పటికీ సంస్కరణల పేరుతో 2002లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఫ్యాక్టరీని మూసివేశారు. దాన్ని అక్రమంగా మూసివేశారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. అనేకమంది కార్మికులను తొలగించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి వీఆర్ఎస్ ఇచ్చి తీసేశారు. లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీని మూసివేయడంపై అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. ఫ్యాక్టరీని తెరిచాక మళ్లీ వేరుశనగ నూనెతో పాటు పామాయిల్, ఇతరత్రా నూనెలను కూడా ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ పాత ఫ్యాక్టరీ యంత్రాలు బాగానే ఉన్నాయని, మరో కోటిన్నర రూపాయలు ఖర్చు చేస్తే ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో నడు స్తుందని అంటున్నారు. అందుకోసం కొందరు ఉద్యోగులను కూడా తీసుకోనున్నారు. -
ఆయిల్‌ఫెడ్‌పై ‘ర్యాన్సమ్’ ఎటాక్
సాక్షి, సిటీబ్యూరో: రెండేళ్ల క్రితం ప్రపంచ దేశాలను వణికించిన ర్యాన్సమ్ వేర్ ఎటాక్ రాజధానిలో మరోసారి వెలుగు చూసింది. ఆయిల్ ఫెడ్గా పిలిచే తెలంగాణ నూనె గింజల ఉత్పతిదారుల సహకార సమాఖ్య (తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) టార్గెట్‌గా చేసుకున్న సైబర్ నేరగాళ్లు కంప్యూటర్లను స్తంభింపజేశారు. ఆన్లైన్ క్రిమినల్స్ డిమాండ్ చేసిన నాలుగు బిట్ కాయిన్లు (రూ.9,72,066) చెల్లించకపోతే సంస్థకు చెందిన డేటా క్రాష్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. భవిష్యత్‌లో ర్యాన్సమ్వేర్కు గురికాకుండా ఉండాలంటే మరికొంత చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శుక్రవారం ఫిర్యాదు అందుకున్న నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయిల్‌ఫెడ్ సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి నెలా లావాదేవీలకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తూ ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీ ఉండే సర్వర్‌ను ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. నాలుగు రోజుల క్రితం యథావిధిగా ఈ సంస్థ సిబ్బంది తమ దైనందిన విధుల్లో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా ర్యాన్సమ్వేర్ ఎటాక్ జరిగింది. ర్యాన్సమ్ వేర్ వైరస్‌లను సైబర్ నేరగాళ్లు ఈ–మెయిల్ రూపంలో పంపినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ర్యాన్సమ్వేర్ వైరస్ కంప్యూటర్లలోకి ప్రశించిన మరుక్షణం వాటిలో ఉన్న డేటా మొత్తం ఎన్‌క్రిప్ట్ అయిపోయి సిస్టమ్స్‌తో సర్వర్ సైతం లాక్ అయింది. ఆయిల్‌ఫెడ్‌లోని కంప్యూటర్లలోని డేటా ఎన్క్రిప్షన్ నాన్–సెమెట్రిక్ విధానంలో జరగడంతో ‘ప్రైవేట్ కీ’కు ట్రాక్ చేయడం ఐటీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ సంస్థలోని ఎవరికీ సాధ్యం కాలేదు. సైబర్ నేరగాళ్లు ఈ సంస్థ ఎన్క్రిప్టెడ్ డేటాను డీక్రిప్ట్ చేయడానికి నాలుగు బిట్ కాయిన్లు డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా రక్షణ కల్పించాలంటే మరికొంత ఇవ్వాలన్నారు. బిట్‌కాయిన్స్ కొనుగోలు, బదిలీ తదితరాలను గూగుల్ నుంచి తెలుసుకోవాలంటూ సందేశాన్నీ పంపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఎటాక్ ఎక్కడ నుంచి జరిగింది? సైబర్ నేరగాళ్ళు ఏ విధానంలో డబ్బు చెల్లించిమని చెప్పారు? తదితర అంశాలను సైబర్ కాప్స్ ఆరా తీస్తున్నారు. పటిష్టమైన వ్యవస్థ లేకుంటే ర్యాన్సమ్వేర్కు పరిష్కారం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సాధారణ వినియోగదారులకు డేటా అంత ప్రాముఖ్యం కాకపోయినా... ఇలాంటి ప్రభుత్వరంగ సంస్థలు, సాఫ్ట్వేర్ రంగం, ఉన్నతోద్యోగులు, బీపీఓ ఉద్యోగులకు ఇది ఎంతో కీలకమైంది. నేరగాళ్లు ఏ రెండు కంప్యూటర్లకూ ఒకే రకమైన ప్రైవేట్ కీ ఏర్పాటు చేయడని వివరిస్తున్నారు. దీంతో బాధితులుగా మారిన ప్రతి ఒక్కరూ వారు అడిగినంత చెల్లించాల్సి రావడమో, డేటా కోల్పోవడమో జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ తరహాలో నేరాలు చేసే వాళ్ళు బోగస్ సర్వీర్లు, ఐపీ అడ్రస్‌లు వినియోగిస్తుంటారు. దీంతో అలాంటి వారిని పట్టుకోవడం కష్టసాధ్యంగా మారుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అపరిచిత ఐడీ నుంచి వచ్చే ఈ–మెయిల్స్, అనుమానాస్పద యాడ్స్‌కు దూరంగా ఉండటం, కంప్యూటర్లో పటిష్టమైన వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవడమే దీనికి పరిష్కారంగా సూచిస్తున్నారు. -
ఆయిల్‌ఫెడ్‌లో రైతు ప్రాతినిధ్యం శూన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సంస్థ (టీఎస్–ఆయిల్‌ఫెడ్)లో సహకార వ్యవస్థ దెబ్బతిన్నది. నూనె గింజలు పండించే రైతు సొసైటీల ప్రాతినిధ్యం లేకుండానే ఆయిల్‌ఫెడ్ నడుస్తుండటం సహకార స్ఫూర్తికి విరుద్ధం. సొసైటీలకు ఎన్నికలు లేవు. చైర్మన్ల నియామకం లేదు. అధికారులదే హవా. ఆయిల్‌ఫెడ్ టర్నోవర్ దాదాపు రూ.300 కోట్లుంది. అందులో సుమారు రూ.100 కోట్ల డిపాజిట్లున్నాయి. కానీ, ఆ సొమ్మంతా అధికారుల చేతుల్లోనే ఉండటం విమర్శలకు తావిస్తోంది. 35 వేల మంది రైతుల వాటా సొమ్ము రూ.4 కోట్ల అతీగతీ లేదు. వారికి రావాల్సిన వాటా ఎటుపోతుందో తెలియడంలేదు. సొసైటీల కింద కోట్లాది రూపాయలతో గోదాములు నిర్మించి గాలికి వదిలేశారు. పామాయిల్ రైతులకు సేవ చేసే సంస్థగా ఆయిల్‌ఫెడ్ మిగిలిపోయింది. నూనె గింజల రైతులను దళారుల నుంచి ఆదుకోవడానికి దాదాపు 330 సొసైటీలను తెలంగాణలో ఏర్పాటు చేశారు. ఆ సొసైటీల ఆధారంగా ఆయిల్‌ఫెడ్‌ను నెలకొల్పారు. అవి రైతుల నుంచి వేరుశనగను మద్దతు ధరకు కొనుగోలు చేసి ప్రైవేటు ఫ్యాక్టరీల్లో నూనె ఉత్పత్తి చేసి వినియోగదారులకు అందజేసేవారు. తర్వాత బీచుపల్లిలో నూనె ఉత్పత్తి ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అప్పట్లోనే దాని సామర్థ్యం రోజుకు 100 టన్నులు. అక్కడ వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనె ఉత్పత్తి చేసేవారు. 8 ఏళ్లు నడిచాక దాన్ని మూసేశారు. ఫ్యాక్టరీ మూతపడటంతో సొసైటీలను నిర్వీర్యం చేశారు. దీంతో వేరుశనగ పండించే సొసైటీ సభ్యులకు కనీస మద్దతు ధర అందని పరిస్థితి నెలకొంది. రైతులకు అండగా ఉండాల్సిన ఆయిల్‌ఫెడ్ చేతులెత్తేస్తోంది. సొసైటీలు నిర్వీర్యం కావడంతో రాష్ట్రంలోని దాదాపు 200 గోదాములు నిరుపయోగంగా మారాయి. కొన్నింటిని అమ్మేశారు. నాడు ఉత్పత్తి... నేడు ప్యాకింగ్ బీచుపల్లిలో నూనె ఉత్పత్తి చేసి వినియోగదారులకు స్వచ్ఛమైన వేరుశనగ, పొద్దుతిరుగుడు నూనెలను విజయ బ్రాండ్ పేరుతో విక్రయించేవారు. బీచుపల్లి ఫ్యాక్టరీ నిలిచిపోయాక ఇప్పుడు బ్రోకర్ల నుంచి నూనెలను కొనుగోలు చేసి కేవలం ప్యాకింగ్ చేసే పరిస్థితికి ఆయిల్‌ఫెడ్ దిగజారింది. విజయ నూనెల నాణ్యతపైనా, తూకంపైనా అనేకసార్లు విమర్శలు వచ్చాయి. సొసైటీలను నిర్వీర్యం చేశారు.. నూనె గింజల ఉత్పత్తిదారుల సొసైటీలతోనే ఆయిల్ ఫెడ్ ఏర్పడింది. కానీ సహకార స్ఫూర్తికి విరుద్ధంగా సొసైటీలను నిర్వీర్యం చేసి రైతు ప్రాతినిధ్యం లేకుండా ఆయిల్‌ఫెడ్ నడుపుతున్నారు. ఖానాపూర్ గోదాములో చౌక దుకాణం నడుపుతున్నారు. –రుక్మారెడ్డి, ఖానాపూర్ సొసైటీ మాజీ అధ్యక్షులు, బిజినేపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా ఎన్నికలు లేకుండా చేశారు... నూనె గింజల ఉత్పత్తిదారులతో ఏర్పాటైన 330 సొసైటీలను నిర్వీర్యం చేసి ఆయిల్‌ఫెడ్‌ను నడపడం అప్రజాస్వామికం. ఆయిల్‌ఫెడ్‌లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సహకార సొమ్మును అధికారుల చేతుల్లో పెట్టడం దారుణం. – రావి నర్సింహారెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయిల్‌ఫెడ్ ఉద్యోగుల సంఘం -
ఆయిల్‌ఫెడ్‌లో 2.53 కోట్లు పక్కదారి
- లోకాయుక్త విచారణలో వెల్లడి... ఎండీకి తెలియకుండా ఇది జరగదు - ఒక కంపెనీకి అక్రమంగా క్రూడ్ ఆయిల్ సరఫరా చేసినట్లు ఆరోపణ - 33 చెక్‌లు బౌన్స్ అయినా సరఫరా చేయడంపై అక్రమాలు సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌ఫెడ్‌లో రూ.2.53 కోట్లు పక్కదారి పట్టినట్లు లోకాయుక్త విచారణలో తేలింది. అప్పటి ఎండీకి తెలియకుండా ఇది జరిగే అవకాశం లేదని, పలువురు ఉద్యోగులపై అభియోగాలు నిజమేనని తేల్చింది. ఆయిల్‌ఫెడ్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు ఆర్.నర్సింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త డైరెక్టర్ కె.నర్సింహారెడ్డి విచారణ చేపట్టారు. అనంతరం విచారణ నివేదికను లోకాయుక్త రిజిస్ట్రార్‌కు అందజేశారు. 2014 సెప్టెంబర్ 11 నుంచి అదే ఏడాది అక్టోబర్ 9 వరకు పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి 50 లారీల (528 టన్నులు) క్రూడాయిల్‌ను పలు దఫాలుగా ఒక ప్రైవేటు కంపెనీకి విక్రయించారు. ఆ మేరకు సంబంధిత కంపెనీ నుంచి విడతల వారీగా చెక్‌లు తీసుకున్నారు. కంపెనీ ఇచ్చిన మొదటి రెండు మూడు చెక్‌లు బౌన్స్ అయినా.. ఆ కంపెనీకే క్రూడాయిల్‌ను ఆయిల్‌ఫెడ్ సరఫరా చేసింది. చివరకు 33 చెక్‌లు ఇచ్చినా, అవీ బౌన్స్ అయ్యాయి. అలా రూ.2.53 కోట్ల విలువైన చెక్‌లు బౌన్స్ అయినట్లు నిర్ధారణయింది. ఈ చెక్‌ల బౌన్స్‌ల వెనుక, ఇప్పటివరకు ఆ సొమ్ము రికవరీ కాకపోవడంలో ఆయిల్‌ఫెడ్ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు లోకాయుక్త విచారణలో తేలింది. ఆ సమయంలో క్రూడాయిల్ సరఫరా కమిటీలో ఉన్న ఆయిల్‌ఫెడ్ సీనియర్ అధికారులు కె.వి.రంగారెడ్డి, ఎన్.ఎస్.ఎన్.మూర్తి, ఎం.తిరుపతిరెడ్డి, డి.అచ్యుతరావు బాధ్యులని ఉద్యోగుల సంఘం నేత లోకాయుక్తకు విన్నవించారు. అందులో కొందరు రిటైరయ్యారు. చెక్‌బౌన్స్ పేరుతో కోట్లల్లో జరిగిన అక్రమాలు అప్పటి ఎండీ వి.ఎన్.విష్ణుకు తెలియకుండా ఉండదని లోకాయుక్త పేర్కొంది. కాగా, పక్కదారి పట్టిన రూ.2.53 కోట్లు ఇప్పటివరకు సంబంధిత కంపెనీ నుంచి రికవరీ కాలేదని ఆయిల్‌ఫెడ్ ఎండీ వీరబ్రహ్మయ్య ‘సాక్షి’కి తెలిపారు. నాకు తెలియకుండానే జరిగింది: వి.ఎన్.విష్ణు, మాజీ ఎండీ, ఆయిల్‌ఫెడ్ క్రూడాయిల్ సరఫరా, చెక్‌లు బౌన్స్ కావడం నాకు తెలియకుండా కింది స్థాయిలో జరిగింది. ఆయిల్‌ఫెడ్ బోర్డు నిర్ణయాల ప్రకారం కింది స్థాయిలో సహజంగానే ఇలా జరిగిపోతుంటాయి. పైగా నా సంతకం కూడా ఎక్కడా లేదు. అక్రమాలు జరిగినట్లు నా దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించా. క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. -
మన వంటింట్లో మన వంట నూనె
సంక్షేమ హాస్టళ్లకు ‘విజయ’ పామాయిల్ తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆయిల్ ఫెడ్ విభాగం ‘విజయ’ పామాయిల్‌ను మన వంటింట్లో మన వంట నూనె నినాదంతో ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను అందిస్తామని పేర్కొంది. అంతేకాక అన్ని సంక్షేమ హాస్టళ్లలో ఈ బ్రాండ్ వినియోగించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపింది. అంగన్వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లలో విజయ నూనెలను మాత్రమే ఉపయోగించాలని రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ మార్కెటింగ్ మేనేజర్ రాజేశం మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అలాగే అన్ని రేషన్ దుకాణాల్లోనూ విజయ నూనెలను మాత్రమే విక్రయించాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండో యూనిట్లో పామాయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి వంటనూనెలను సరఫరా చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం డబుల్ ఫిల్టర్ల వేరుశనగ, రిఫైన్డ్ సన్ ఫ్లవర్, ఆర్బీడీ పామాయిల్, నువ్వుల, రైస్‌బ్రాండ్, కొబ్బరి నూనెలు వివిధ పరిమాణాల్లో విక్రయిస్తున్నామన్నారు. -
రూ. 80 కోట్ల ప్రభుత్వ గ్యారంటీకి ఆయిల్‌ఫెడ్ ప్రయత్నాలు
అప్పారావుపేట ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ పరిస్థితిని సమీక్షించిన తుమ్మల సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో నిర్మాణంలో ఉన్న ఆరుుల్‌ఫాం ఫ్యాక్టరీకి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీనికి ప్రభుత్వం రూ. 80 కోట్లు గ్యారంటీ ఇస్తే బ్యాంకు నుంచి రుణం పొంది ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయవచ్చని ఆయిల్‌ఫెడ్ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మంత్రి శనివారం ఆయిల్‌ఫెడ్ ఎండీ ఎం.వీరబ్రహ్మయ్య సహా పలువురు అధికారులతో చర్చించారు. ఈ విషయంపై తుమ్మల... సీఎంను కలిసేందుకు వెళ్లినట్లు తెలిసింది. వాస్తవంగా గతంలో ఆయిల్‌ఫెడ్ ఎండీగా వీరబ్రహ్మయ్య ఉన్నప్పుడు అప్పారావుపేటలో కొత్త ఫ్యాక్టరీకి ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పట్లో ఆయిల్‌ఫెడ్ వద్ద రూ.60 కోట్ల వరకు నికర నిల్వలుండేవి. అయితే ఆ తరువాత వీరబ్రహ్మయ్య బదిలీ అవడం తదితర పరిణామాలతో నిల్వలన్నీ కరిగిపోయాయి. ఇటీవల మళ్లీ ఆయిల్‌ఫెడ్‌కు ఎండీగా అదనపు బాధ్యతలతో వీరబ్రహ్మయ్య వచ్చారు. ఆయనతో తుమ్మల తాజా సమీక్ష ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఇదిలావుండగా కొత్తగూడెం జిల్లాలో కొత్తగా మరో 20 వేల ఎకరాల్లో ఆరుుల్‌ఫాం తోటలను సాగు చేయించాలని ఆ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమం తును మంత్రి తుమ్మల ఆదేశించారు. -
త్వరలోనే వేరుశనగ కొనుగోలు కేంద్రం ఏర్పాటు
ఆదోని : ఆదోని మార్కెట్ యార్డులో త్వరలోనే వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయిల్‌ఫెడ్ ఎండీ ఫణికిశోర్ తెలిపారు. శనివారం ఆయన ఆదోని మార్కెట్ యార్డులో వేరుశనగ దిగుబడులను పరిశీలించారు. ధరలు ఎలా ఉన్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. అయితే కొందరికి మాత్రమే ఆశించిన ధర లభిస్తోందని, చాలామంది క్వింటాలు రూ.4వేల లోపే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతి రాగానే క్వింటాలు మద్దతు ధర రూ.4220 కు కొనుగోలు చేస్తామని ఆయన రైతులకు తెలిపారు. ఆయన వెంట ఆయిల్ ఫెడ్ మేనేజర్ రమేష్ రెడ్డి ఉన్నారు. అనంతరం ఆయన మార్కెట్ యార్డు అధికారులతో సమావేశమై వేరుశనగ దిగుబడి, ధరలపై చర్చించారు. -
మలేసియా కంపెనీకి ‘దమ్మపేట’ టెండర్
♦ రూ. 52 కోట్లకు ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ టెండర్ ఖరారు.. సీఎం వద్దకు ఫైలు సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో ఆయిల్‌ఫాం క్రషింగ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల టెండర్‌ను మలేసియాకు చెందిన ప్రీ-యూనిక్ ఇంజనీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ఆయిల్‌ఫెడ్ నిర్వహించిన ఆన్లైన్ గ్లోబల్ టెండర్లలో ఆ కంపెనీ రూ. 52.19 కోట్లు కోట్‌చేసి టెండర్ దక్కించుకుందని ఆయిల్‌ఫెడ్ అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. భవనాలు సహా మొత్తం ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ. 80 కోట్ల మేరకు ఖర్చు కానుండగా.. అందులో మలేసియా కంపెనీ ఫ్యాక్టరీకి అవసరమైన అత్యాధునిక యంత్రాలను మాత్రమే సరఫరా చేయనుంది. టెండర్ వివరాలు, కంపెనీ ప్రత్యేకతలు తదితర వివరాలతో కూడిన ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు ఆయిల్‌ఫెడ్ పంపించింది. సీఎం ఆమోదముద్ర లభించగానే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని విధివిధానాలు ఖరారు చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తారని చెబుతున్నారు. పనులు ఏడాదిలోగా పూర్తి కావల్సి ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 35 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. ఈ తోటల ద్వారా వచ్చే ఆయిల్ ఫాం గెలల నుంచి పామాయిల్ తీసేందుకు తెలంగాణలో ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో మాత్రమే క్రషింగ్ ఫ్యాక్టరీ ఉంది. అయితే తెలంగాణలో పామాయిల్ తోటల విస్తీర్ణం రోజు రోజుకూ పెరుగుతుండడంతో గంటకు 15 టన్నుల క్రషింగ్ సామర్థ్యం మాత్రమే ఉన్న అశ్వారావుపేట ఫ్యాక్టరీపై అధిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో మరో క్రషింగ్ ఫ్యాక్టరీని దమ్మపేటలో ఏర్పాటు చేయాలని గతేడాది సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దమ్మపేటలో మలేషియాకు చెందిన ప్రీ-యూనిక్ ఇంజినీరింగ్ కంపెనీ అత్యాధునిక అత్యంత అధిక సామర్థ్యంతో యంత్రాలను ఏర్పాటు చేయనుంది. దాని సామర్థ్యం గంటకు 30 టన్నులు కాగా... రాబోయే రోజుల్లో పెరిగే అవసరాలకు అనుగుణంగా 60 టన్నుల వరకు ఆధునీకరించుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు. వచ్చే పదేళ్ల వరకు కూడా అక్కడి డిమాండ్ మేరకు ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. -
న(అ)మ్మకాన్ని వంచించారు!
ఆదోని: వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఇంటిల్లిపాది ఆరుగాలం చెమటోడ్చి వేరుశనగ పండించారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో దిగుబడులను ఇళ్లలో దాచిపెట్టుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ గిట్టుబాటు ధరకు దిగుబడులు కొనుగోలు చేస్తోందని చెప్పడంతో రైతులు ఎంతో సంబర పడ్డారు. మార్కెట్ ధర క్వింటాల్ రూ.2200 నుంచి రూ.3300 వరకు ఉండగా..అయిల్ ఫెడ్ క్వింటాల్‌కు రూ.నాలుగు వేలు చెల్లిస్తామని చెప్పడంతో ఈ ఏడాది జనవరిలో విక్రయించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా..ఇంతవరకు కొందరు రైతులకు డబ్బులు అందకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం పంట పెట్టుబడులకు చేతిలో డబ్బు లేక..బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామన్నారు.. అయిల్ ఫెడ్ అధికారులు జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్, ఆలూరు, కర్నూలు మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వ్యవ,ప్రయాసాలు కోర్చి రైతులు దిగుబడులను అమ్ముకున్నారు. పత్తికొండ యార్డులో ఏర్పడిన గందరగోళంతో కొనుగోళ్లు కొన్నాళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు నాలుగైదు రోజుల పాటు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించడంతో కొనుగోలులో నిర్లక్షం చేశారనే కారణంతో ఆయిల్ ఫెడ్ మేనేజరు ఎల్లారెడ్డి, పత్తికొండ కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ బ్రహ్మేశ్వరరెడ్డిపై అప్పట్లో ప్రభుత్వం సస్సెన్షన్ వేటు వేసింది. ఎట్టకేలకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఆయిల్ ఫెడ్ సంస్థ లక్షా 45 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. అధికారులు పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని చెప్పి కొనుగోలు చేసిన వేరు శనగకు సంబందించి రైతులకు రశీదులు ఇచ్చారు. చేతికి డబ్బులు అందగానే పంట సాగు కోసం చేసిన అప్పులు చెల్లించి ఆ తరువాత తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలని అన్నదాతలు ఆశించారు. పలువురు ఖరీఫ్ పంట పెట్టుబడికి ఇక దిగులుండదని బావించారు. అయితే చెప్పిన సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో రైతులకు తెలిసొచ్చి తెల్లబోయారు. గత జనవరిలో కొనుగోలు చేయగా పక్షం రోజుల్లో రైతులందరికీ బిల్లులు చెల్లించాలి. అయితే దాదాపు రెండు నెలల తరువాత బిల్లుల చెల్లింపులు ప్రారంభించారు. అప్పటికే మార్కెట్ యార్డుల చుట్టు ఎన్నో సార్లు తిరిగి వేసారి పోయారు. ఇంకా బిల్లులు అందని రైతులు వందల్లో ఉన్నారు. ఆదోనిలోనే దాదాపు 596 మందికి రూ.4.23 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆదోని,కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్ మార్కెట్ యార్డులలో కూడా చాలా మందికి బిల్లులు అందాల్సి ఉంది. అయితే ఆదోనిలో తప్ప మిగిలిన మార్కెట్ యార్డుల పరిధిలో బకాయిలు రూ.లక్షల్లో మాత్రమే ఉందని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. వేరు శనగ అమ్మి ఇప్పటికే దాదాపు ఆరు నెలలు అవుతోంది. స్థానికంగా ఆయిల్ ఫెడ్ అధికారులు ఎవ్వరు లేక పోవడంతో తమ బకాయిల కోసం ఎవరిని సంప్రదించాలో రైతులకు దిక్కు తోచడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయి దాదాపు పక్షం రోజులు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఇంకా ఎటు తేలలేదు. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామని బ్యాంకర్లు తెగేసి చెపుతున్నారు. ఇటు ఆయిల్ ఫెడ్ అధికారులు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో తెలీయక, అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తాము గుడ్డిగా నమ్మి చేతికి అందిన పంట దిగుబడులను అమ్ముకున్నామని, బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పేవారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అమ్ముకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో మకాం పెట్టిన ఆయిల్ ఫెడ్ అధికారి ఆదోని ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రం అధికారి నరేంద్రరెడ్డి తన మకాంను హైదరాబాదుకు మార్చారు. దీంతో బిల్లుల కోసం వచ్చిన రైతులకు సమాధానం చెప్పేందుకు స్థానికంగా ఎవ్వరు లేకుండా పోయారు. రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆయన హైదరాబాదులో ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్ర రెడ్డిని ‘సాక్షి’ఫోన్లో సంప్రదించగా బకాయి బిల్లులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకోడానికి తాను హైదరాబాదులో ఉన్నట్లు చెప్పారు. నిధులు మంజూరు కాగానే రైతులకు డబ్బులు చెల్లిస్తామని, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లో వేరు శనగ అమ్మిన రైతులందరికీ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు వెల్లడించారు. -
అడుక్కునేవాళ్లమా!
ఆయిల్‌ఫెడ్ అధికారుల అలసత్వంపై వేరుశనగ రైతుల మండిపాటు పెట్టుబడికి ఇబ్బందిగా ఉంది: 20 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడిని ఆయిల్‌ఫెడ్‌కు విక్రయించినా. నాలుగు నెలల నుంచి తిప్పుకుంటున్నారు. ఆదోనికి వచ్చిపోనీకనే సానా ఖర్చయింది. ఖరీఫ్ పంటలు వేసుకోనీక డబ్బుల్లేక ఇబ్బందయితాంది. అధికారులేమో అర్థం చేసుకోరు. ఇట్లయితే మా బతుకు ఎట్లా గడిచేది. - రామన్న, వలగొండ, ఆస్పరి మండలం ఆదోని రూరల్, న్యూస్‌లైన్: రైతుల జీవితాలతో ఆయిల్‌ఫెడ్ చెలగాటమాడుతోంది. ఖరీఫ్‌కు సన్నద్ధమవ్వాల్సిన సమయంలో బిల్లుల కోసం ఆ సంస్థ ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో రైతులంతా పొలం పనుల్లో బిజీ కాగా.. తాము మాత్రం ఆయిల్‌ఫెడ్‌ను నమ్ముకుని చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు. వేరుశనగ ధర ఒక్కసారిగా పడిపోవడంతో రబీలో ప్రభుత్వం ఆయిల్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లను చేపట్టింది. ఆ మేరకు గత జనవరి 8న స్థానిక మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటైంది. నాణ్యమైన వేరుశనగ ధర మార్కెట్లో రూ.3,300 కాగా ఆయిల్‌ఫెడ్ రూ.700 అధిక ధరతో కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఇటువైపు మొగ్గుచూపారు. జనవరి 31వ తేదీ వరకు రూ.4 వేల ధరతో 45,272 క్వింటాళ్ల వేరుశనగను అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకు రూ.18.45 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. మొత్తం 2,511 మంది రైతులు దిగుబడులు విక్రయించగా 2 వేల మందికి మాత్రమే చెల్లింపులు చేశారు. రైతులు బిల్లుల కోసం నాలుగు నెలలుగా ఆయిల్‌ఫెడ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పూర్తి స్థాయిలో చెల్లింపులు చేపట్టలేకపోతున్నారు. వచ్చిన డబ్బుతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుదామని భావిస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. దిగుబడులు వారి చేతిలో పెట్టి ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయిల్‌ఫెడ్ అధికారులు బస చేసిన పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది రైతులు చేరుకున్నారు. రూము ఎదుటే బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో కొందరి రైతులకు చెల్లింపులు చేసినా.. మరికొందరికి నిరాశే ఎదురైంది. -
కదంతొక్కిన ‘పామాయిల్’ కార్మికులు
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: ఆయిల్‌ఫెడ్ ప్రభుత్వరంగ సంస్థకు చెందిన అశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమలో జరిగిన అవకతవకలపై కార్మికులు కదంతొక్కారు. ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం ఆందోళన నిర్వహించారు. వారికి వైఎస్ఆర్సీపీ తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్షనేత తాటి వెంకటేశ్వర్లు అండగా నిలిచారు. కాంట్రాక్టు కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకున్న వారి నుంచి తిన్నదంతా క క్కిస్తానని కార్మికులకు మద్దతుగా ఫ్యాక్టరీ ఎదుట బైఠాయించారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు. అశ్వారావుపేటలో సమస్య పరిష్కారం కాకపోతే హైదరాబాదులోని ఆయిల్‌ఫెడ్ ప్రధాన కార్యాలయానికి కార్మికులకు తన సొంత ఖర్చులతో తీసుకెళ్లి ఆయిల్‌ఫెడ్ ఎండీతో మాట్లాడిస్తానన్నారు. కార్మికుల కష్టార్జితం నుంచి మినహాయించుకున్న ప్రావిడెంట్‌ఫండ్(పీఎఫ్) సొమ్మును అణా పైసతో సహా తిరిగి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తమ పీఎఫ్ సొమ్మును కాంట్రాక్టర్లు దోచుకున్నారని ఫ్యాక్టరీ మేనేజర్ చంద్రశేఖరరెడ్డికి కార్మికులు వారం రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. తమకు ఫీఎఫ్ డబ్బు ఒక్కపైస కూడా అందలేని ఆరోపించారు. ఇదే విషయాన్ని కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పీఎఫ్ కార్యాలయం నుంచి కార్మికులు సాధించిన కొన్ని కీలకపత్రాలను మేనేజర్ చంద్రశేఖరరెడ్డికి తాటి అందజేశారు. పీఎఫ్ సొమ్ము ఇప్పించాలని కోరారు. ఫోర్మన్ విల్సన్రాజుపై దాడి చేసిన పాతకాంట్రాక్టర్ కుమారుడు మధుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏడేళ్ల పీఎఫ్ చెల్లించాలి.. 2007లో అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభించినప్పటి నుంచి పనిచేసిన కార్మికులకు పీఎఫ్ సొమ్ము చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఫోర్మన్ దాడిచేసిన దుండగులను అరెస్ట్ చేయాలని, విల్సన్రాజుపై బనాయించిన కేసును ఎత్తివేయాలని ని నాదాలు చేశారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్టర్లు ఇచ్చినంత తీసుకుంటే ఉంచుతున్నారని, హక్కులపై ప్రశ్నిస్తే పనిలోనుంచి తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్ కుమారుడు మధుకు అనుకూలంగా ఉన్నవారే ఫ్యాక్టరీలో ఉద్యోగం చే యాలని, అతని మాట వినకున్నా, చెప్పిన ట్టు చేయకపోయినా, అధికారులను బదిలీ చేయిస్తాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే విల్సన్ రాజును రౌడీలతో కొట్టించాడని అన్నారు. కార్మికుల ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పాలో తెలియక మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి మౌనంగా ఉండిపోయారు. తిన్నదంతా కక్కిస్తా: ఎమ్మెల్యే తాటి కార్మికులు, విల్సన్‌రాజు సమస్యలను విన్న ఎమ్మెల్యే ఫ్యాక్టరీ మేనేజర్ చంద్రశేఖర్‌రెడ్డి, డివిజనల్ అధికారి రమేష్కుమార్రెడ్డిలపై ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోజుకూలీ చేసుకునే వారిని మీ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటూ పోతే ఊరుకునేదిలేదు. ఇంతకుముందు ఇక్కడ ఎవరున్నారో నాకు అనవసరం. ఈ ప్రజలు నన్ను నమ్మారు. నా ప్రజలను ఎవరు అన్యాయం చేసినా ఊరుకోను. కార్మికుల సొమ్ములు ఎవరెంత తిన్నారో అణాపైసాలతో సహా కక్కిస్తా.. కాంట్రాక్టర్లకు సహకరించిన అధికారులను వదిలిపెట్టేది లేదు. మీరు (మేనేజర్‌ను ఉద్దేశించి) ఎన్నిసార్లు సస్పెండ్ అయినా మళ్లీ అశ్వారావుపేటకే ఎందుకు వస్తున్నారు..? ఆయిల్‌ఫెడ్‌లో మీకు ఎక్కడా ఉద్యోగం లేదా..? దేశంలో ఎన్నో ప్రభుత్వ ఫ్యాక్టరీలు ఉండగా.. ఎప్పుడూ అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీనే ఎందుకు వార్తల్లోకెక్కుతుంది..? మీరు ఇక్కడ ఎందుకోసం ఉంటున్నారో నాకు తెలుసు.. అంతా కక్కిస్తా.. మీ వైఖరి మార్చుకోకుంటే చాలా ఇబ్బంది పడతారు. ప్రతి నెల కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేటపుడు పీఎఫ్ చెల్లింపును ఎందుకు పరిశీలిచడంలేదు. కార్మికులకు పీఎఫ్ సొమ్ము తిరిగి ఇప్పించేంత వరకు ఇక్కడే కూ ర్చుంటాను’ అంటూ తాటి ఫ్యాక్టరీ గేటు ఎదుట బైఠాయించారు. ఫ్యాక్టరీలో ఆయిల్ రికవరీని త క్కువగా చూపుతూ ప్రైవేటు కంపెనీలతో కు మ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి బాధ్యులపై చర్యలకు ప్రభుత్వాన్ని కోరతానన్నారు. రైతులు పండించే పామాయిల్ కు పూర్తి మద్దతు ధర సాధించడం తన లక్ష్యమన్నారు. హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం నుంచి ఏ కార్మికునికి ఎంత పీఎఫ్ సొమ్ము అం దాలో లెక్కలతో సహా నెల రోజులలోపు వివరం గా తెలియజేస్తామని మేనేజర్ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా అక్కడి వచ్చి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. నారాయణ వెంట ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సింగు నర్సింహరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఉన్నారు. సంఘీభావం తెలిపిన వారిలో జెడ్పీటీసీ అంకత మల్లికార్జునరావు, ఆయిల్‌ఫాం రైతు సంఘం రాష్ట్ర నాయకులు మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు జూపల్లి రమేష్‌బాబు, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్‌బాబు, టీడీపీ నాయకులు ఆలపాటి రామ్మోహనరావు, బండి పుల్లారావు, సీపీఎం నాయకులు బుడితి చిరంజీవి నాయుడు, టీఆర్ఎస్ నాయకులు కోటగిరి సీతారామస్వామి, జూపల్లి కోదండ వెంకటరమణారావు, చంటిబాబు ఉన్నారు. -
ధర తఖరారు
సాక్షి, అనంతపురం : గత ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వేరుశనగను ప్రభుత్వం మూడు నెలల కిందట క్వింటాలు రూ.4 వేలు ప్రకారం నాఫెడ్, ఆయిల్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ జూన్ మొదటి వారం నుంచి మొదలవుతుండటంతో వేరుశనగ వేసేందుకు రైతులు దుక్కి దున్ని సిద్ధమవుతున్నారు. సబ్సిడీ పేరుతో ప్రస్తుతం క్వింటాలు రూ.4,600 ప్రకారం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ ఆయిల్‌ఫెడ్, ఏపీ సీడ్స్, హాకా, మార్క్‌ఫెడ్ సంస్థలు మాత్రం ఆ ధర మేరకు పంపిణీ చేసేందుకు ఒప్పుకోవడం లేదు. క్వింటాలుకు మరో వెయ్యి రూపాయలు అదనంగా చెల్లిస్త్తే గానీ తాము సరఫరా చేయలేమని ఆయా సంస్థల అధికారులు తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో దాదాపు 23 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తారు. రెండు మూడేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడి సరిగా రాకపోవడంతో చాలా మంది రైతులు వేరుశనగను సాగు చేసేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది 18 నుంచి 20 లక్షల ఎకరాల వరకు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీటికి దాదాపు 10 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ అవసరమవుతుంది. అయితే ఈ ఏడాది 3.5 లక్షల క్వింటాళ్ల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో సబ్సిడీతో విత్తన వేరుశనగ కాయలు పంపిణీ చేసినా రైతుల వద్ద డబ్బులు లేక పెద్దగా నిలువ ఉంచుకోలేదు. ఈ ఏడాది మాత్రం విత్తన కాయలు కొనుగోలు చేసిన మూడు నాలుగు రోజుల తర్వాత సబ్సిడీ మొత్తం ఇస్తామని అధికారులు చెబుతుండటంతో రైతులు ఎవ్వరూ నమ్మడం లేదు.అధికారం ఇస్తే రైతులను ఆదుకుంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం సబ్సిడీ విత్తనం గురించి నోరు మెదపడం లేదు. రైతు క్వింటాలు రూ.4,600కు కొనుగోలు చేసిన తర్వాత 33 శాతం సబ్సిడీ చెల్లిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా విత్తన వేరుశనగ సేకరణ మొదలే కాలేదు. ఈ నెల 26 నాటికి కనీసం 50 వేల క్వింటాళ్ల మేరకు సేకరించి గోడౌన్లలో సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చినా ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయింది. మూడు నెలల కిందట రైతులు పండించిన వేరుశనగను నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ కంపెనీలు క్వింటాలు రూ.4 వేలు ప్రకారం కొనుగోలు చేసినా వాటిని శుద్ధి చేసి విత్తనం కోసం తిరిగి విక్రయించాలంటే కనీసం రూ.5,600 ధర చెల్లిస్తే తప్ప గిట్టుబాటు కాదని భీష్మించుకుని కూర్చున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా సంస్థలతో జిల్లా అధికారులు సంప్రదింపులు చేసే ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఈ సారి విత్తన వేరుశనగ అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాఫెడ్, ఆయిల్‌ఫెడ్ కంపెనీలు ఇటీవల రైతుల నుంచి కొనుగోలు చేసిన 1.42 లక్షల క్వింటాళ్ల వేరుశనగ గోడౌన్లలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదని ఆ కంపెనీలు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం 75 శాతం మంది రైతుల వద్ద విత్తన వేరుశనగ అందుబాటులో లేదు. అందరూ సబ్సిడీ విత్తనంపైనే ఆధారపడ్డారు. జిల్లాలో జూన్ 25లోపే వేరుశనగ వేస్తే అధిక దిగుబడులు వచ్చే పరిస్థితి ఉంది. ఆ తర్వాత సాగు చేసినా... వర్షాలు సకాలంలో వచ్చినా దిగుబడి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. వర్షాలు వస్తే సకాలంలో విత్తనం వేసేందుకు వీలుగా విత్తన వేరుశనగను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
మద్దతుకే లొల్లి..!
మహబూబ్‌నగర్ వ్యవసాయం,గద్వాల న్యూస్‌లైన్: ఈ ఏడాది వేరుశనగ పంటను సాగుచేసిన రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా త యారైంది. వర్షాలు సంమృద్దిగా కురవడంతో మంచిరోజులు వచ్చాయని రైతులు భావించారు. గత రబీలో ప ల్లీ పంటను వేసిన వారికి కాస్తో కూస్తో లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో ఈ ఏడాది కూడా అలాగే ఉంటుందనే భావనతో ఈ రబీలో 1.10 లక్షల హెక్టార్లలో వేరుశనగపంటను సాగు చేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పంటకు తెగుళ్లు సోకాయి. దిగుబడి సగానికి తగ్గిపోయింది. వాస్తవానికి చెట్టుకు 20 కాయల వరకూ వస్తే మంచి కాపుగా భావిస్తారు. కాన్నీ పలు ప్రాంతాల్లో మొక్కకు ఏడునుంచి 10 కాయలకు మించి లేవు. మరోవైపు మద్దతుధర రాక రైతులు తికమక పడుతున్నారు. ఈ స్థితిలో రైతుల నుండి పంటను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనాల్సి ఉంటుంది. అలా ఇప్పటివరకు వేరుశనగ కొనే ప్రయత్నం జరగలేదు. కొన్ని చోట్ల కేంద్రాలు తెరుస్తామని చెప్పినా ఇంకా అవి ప్రారంభం కాలేదు. దీంతో అన్నదాతలు తమకు తోచిన ధరకు ఇచ్చేస్తున్నారు. విత్తనానికి రూ.4,500..రైతు పంటకు మాత్రం రూ.2,500 ? రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ధరతో ఈ ఏడాది వేరుశనగ విత్తనాలను సరాఫరా చేసి క్వింటాకు రూ.4500 తీసుకుంది. ఇప్పుడు పంట ధర మాత్రం రూ. 2500 దాటడం లేదు.రైతులు తెచ్చిన పంట తడిగా ఉందని, నాపలు ఎక్కువగా ఉన్నాయంటూ కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు ధరను పెరగనివ్వడం లేదు. వేరుశనగకు ప్రభుత్వం రూ.4వేలు మద్దతు దరను నిర్ణయించింది.జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1.60 లక్షల క్వింటాళ్లను రైతుల నుండి వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతుల నుండి ఎక్కువగా రూ. 3000 వేల లోపే కొనుగోలు చేశారు.కాగా వచ్చిన దాంట్లో ఒక 10శాతం అధిక ధరలకు కొనుగోలు చేసినట్లు చూపించి మిగతా 90శాతం ఉత్పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ కర్షకులను నట్టేట ముంచుతున్నారు. తెగుళ్లతో తగ్గిన దిగుబడి గత నెలలో మంచు కురవడంతో వేరుశనగపంటకు తిక్కాకుమచ్చ తెగులు, లద్దెపురుగు ఆశించింది. ఇది దిగుబడిని దెబ్బతీసింది. వీటిని అదుపు చేసేందుకు రైతులు క్రిమిసంహారక మందులకోసం భారీగా పెట్టాల్సి వచ్చింది. ఆయిల్‌ఫెడ్,నాఫెడ్ సంస్థలు కొనుగోలు చేసేనా? మద్ధతు ధర సమస్య వచ్చినప్పుడు ఆయిల్‌ఫెడ్,నాఫెడ్ వంటివి ముందుకు రావాలి. ఇప్పటి వరకు ఈ సంస్థలతో కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించకుంటే నిరసన కార్యాక్రమాలు చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. కంట తడే... గద్వాల ప్రాంతంలో వేల రూపాయలు పెట్టుబడులుగా పెట్టి బోర్లు, బావులు, కాలువల కింద వేరుశనగ పంటను వేశారు. గత మూడు నెలల నుంచి వేరుశనగను విక్రయించేందుకు గద్వాల మార్కెట్ యార్డుకు తీసుకొస్తుండగా మార్కెట్లో వస్తున్న ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. యార్డుకు రోజూ దాదాపు 2 వేల బస్తాల వేరుశనగ వస్తోంది. నవంబర్ నెలలో రూ.3,500 నుంచి రూ.3,700 వరకు క్వింటాలుకు ధరలు వచ్చాయి. డిసెంబర్ నెలలో రూ,3,400 నుంచి రూ.3,500 వచ్చింది. జనవరి నెలలో సైతం రూ.3,600 నుంచి రూ. 3,800 వరకు వచ్చింది. జనవరిలో ఒక్క 24వ తేదీన ఒక లాట్‌కు అత్యధికంగా రూ.4,010 వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం వేరుశనగకు రూ.4 వేలు మద్దతు ధర ప్రకటించినా వ్యాపారులనుంచి ఆ ధర పలకడం లేదు. ఇక గద్వాల మార్కెట్లో వారం రోజుల క్రితం ప్రభుత్వం ఏపీ ఆయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే తేమ 8 శాతంగా, మట్టి, ధూళి క్వింటాలుకు కేవలం రెండు కేజీలు, నాపలు 4 శాతంగా ఉండాలని నిబంధన పెట్టారు. ఈ నిబంధన ప్రకారం రైతుల వేరుశనగ ఉండడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయినప్పటికీ రైతులు అక్కడ అమ్ముకునే పరిస్థితి లేదు. తిక్కఆకుమచ్చ తెగులు ముంచింది నేను మూడెకరాల్లో వేరుశనగ సాగుచేశాను.కాగా రాత్రి వాతావరణం చల్లగా ఉంటూ, ఆధికంగా మంచు కురవడంతో పంటకు తిక్క ఆకుమచ్చ తెగులు సోకింది.మందులకు రూ.10వేల ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దిగుబడి కూడా అంతంత మాత్రమే వచ్చే అవకాశం ఉంది.ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం చెల్లించాలి. - శేఖర్, వడ్డేమాన్ అప్పులు తీర్చే పరిస్థితే లేదు నేను 30 బస్తాల వేరుశనగ పంటను మహబూబ్‌నగర్ మార్కెట్‌యార్డుకు తీ సుకువచ్చాను.ధాన్యాంభాగాలేదని రూ. 2,400 వంతున చెల్లించారు. నేను ఈ పంట సాగు కోసం రూ.25వేల వరకు ఖర్చు చేశాను.కాగా ఇంత తక్కువ ధర చెల్లించడంతో చేసిన అప్పులు కూడా తీర్చే పరిస్థితి లేకుండా పోయింది. - మాణిక్యం...దౌల్తాబాద్ -
చేయి తడిపితేనే.. ‘పంట’
ఆదోని, న్యూస్‌లైన్: అరకొర దిగుబడులతో నష్టాలు మూటగట్టుకున్న వేరుశెనగ రైతులను కొంతైనా ఆదుకునే ఉద్దేశంతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కూడా దళారులు చేతివాటం చూపుతున్నారు. రైతుల పేరుతో ఉత్పత్తులను ఆయిల్ ఫెడ్‌కు తరలించి అక్కడి సిబ్బంది సహకారంతో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దారిన కాకుండా సొంతంగా ఉత్పత్తులు తీసుకెళ్లిన రైతులకు వద్ద నిరీక్షణ తప్పడం లేదు. వేరుశెనగకు గిట్టుబాటు లేకపోవడాన్ని దృష్టిలో ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించింది. ఆదోని, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే కేంద్రంలోని కొందరు సిబ్బందితో చేతులు కలిపి మాకింత, మీకింత ఒప్పందంతో దళారులు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. మామూళ్లు ఇచ్చిన వారికే ఫలితాలు ఆదోనిలో దళారీల సిఫారస్‌తో వచ్చిన వారి ఉత్పత్తుల కొనుగోళ్ల చురుగ్గా సాగిపోతున్నాయి. కొందరు కమీషన్ ఏజెంట్లు రైతులతో ఓ ధరకు మాట్లాడుకుని ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ కేంద్రానికి తరలిస్తున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకం, తహశీల్దారు ధృవీకరణ పత్రాలను రైతులే తెస్తున్నారు. రూ. 3400కులోపుగా మాట్లాడుకుని వెంటనే డబ్బులు ఇస్తున్నారు. తర్వాత వాటిని అయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు తరలించి అక్కడి సబ్బంది సహకారంతో రూ.4వేలకు అమ్ముకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న కేంద్రంలోని అనధికార సిబ్బందికి రూ.150 నుంచి రూ.200 వరకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఇలా ఆదివారం కొందరు ఏజెంట్లు 200 క్వింటాళ్ల వరకు ఆయిల్‌ఫెడ్ కేంద్రంలో అమ్మినట్లు తెలిసింది. రోజుల తరబడి నిరీక్షించినా... వేరుశనగసాగుతో మూట కట్టుకున్న నష్టాలను ఆయిల్ ఫెడ్ కేంద్రంలో అమ్ముకుని కొంతైనా పూడ్చుకుందామన్న ఆశతో వచ్చిన రైతులకు రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. వీఆర్ఓ, తహశీల్దారు ధృవీకరణ పత్రాల కోసం రెండు, మూడు రోజులు తిరగాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రంలో శాంపిల్స్ చూపించి తెచ్చే తేదీని నిర్ణయించేందుకు మరో రోజు పడుతోంది. తెచ్చిన తర్వాత మూడు రోజులకు కూడా అమ్మక ం కావడం లేదు. అదే దళారీల ద్వారా వెళ్తే సులువుగా కొనుగోళ్లు సాగిపోతున్నాయి. ఎందుకీ పరిస్థితి.. మార్కెట్లో క్వింటా ధర రూ. 3500 మించి పలుకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్దతుధర(రూ.4వేలు)తో 1.50 లక్షల క్వింటాళ్లు కొనుగోలు లక్ష్యంగా కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల చివరి వరకు మాత్రమే గడువు విధించడంతో రైతులు అమ్మకాలకు డిమాండ్ పెరిగింది. ఆదోనిలో సోమవారం వెయ్యి క్వింటాళ్ల వరకు రైతులు కొనుగోలుకు ఉంచినట్లు అంచనా.