రూ. 80 కోట్ల ప్రభుత్వ గ్యారంటీకి ఆయిల్‌ఫెడ్ ప్రయత్నాలు
అప్పారావుపేట ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ పరిస్థితిని సమీక్షించిన తుమ్మల
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో నిర్మాణంలో ఉన్న ఆరుుల్‌ఫాం ఫ్యాక్టరీకి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీనికి ప్రభుత్వం రూ. 80 కోట్లు గ్యారంటీ ఇస్తే బ్యాంకు నుంచి రుణం పొంది ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయవచ్చని ఆయిల్‌ఫెడ్ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మంత్రి శనివారం ఆయిల్‌ఫెడ్ ఎండీ ఎం.వీరబ్రహ్మయ్య సహా పలువురు అధికారులతో చర్చించారు. ఈ విషయంపై తుమ్మల... సీఎంను కలిసేందుకు వెళ్లినట్లు తెలిసింది. వాస్తవంగా గతంలో ఆయిల్‌ఫెడ్ ఎండీగా వీరబ్రహ్మయ్య ఉన్నప్పుడు అప్పారావుపేటలో కొత్త ఫ్యాక్టరీకి ప్రతిపాదనలు తయారు చేశారు.
అప్పట్లో ఆయిల్‌ఫెడ్ వద్ద రూ.60 కోట్ల వరకు నికర నిల్వలుండేవి. అయితే ఆ తరువాత వీరబ్రహ్మయ్య బదిలీ అవడం తదితర పరిణామాలతో నిల్వలన్నీ కరిగిపోయాయి. ఇటీవల మళ్లీ ఆయిల్‌ఫెడ్‌కు ఎండీగా అదనపు బాధ్యతలతో వీరబ్రహ్మయ్య వచ్చారు. ఆయనతో తుమ్మల తాజా సమీక్ష ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఇదిలావుండగా కొత్తగూడెం జిల్లాలో కొత్తగా మరో 20 వేల ఎకరాల్లో ఆరుుల్‌ఫాం తోటలను సాగు చేయించాలని ఆ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమం తును మంత్రి తుమ్మల ఆదేశించారు.