రాజేంద్రనగర్ (హైదరాబాద్): నాణ్యతా ప్ర మాణాలతో కూడిన విజయ వంటనూనెలను ప్రజలకు మరింత చేరువ చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో నిర్మించనున్న విజయ వంటనూనెల మెగా ఆయిల్ ప్యాకింగ్ స్టేషన్ కర్మాగారం నిర్మాణానికి మంత్రి నిరంజన్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తు తం శివరాంపల్లిలోని ప్యాకింగ్ కేంద్రం మూడు షిఫ్ట్‌లలో నడుస్తోందన్నారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 3.8 ఎకరాల భూమిని ఆయిల్ ఫెడ్ సంస్థకు కేటాయించామన్నారు. రాబోయే రోజుల్లో ఆధునాతన యంత్రాలతో పూర్తి మైగ్రేడ్ పద్ధతిలో ప్యాకింగ్ స్టేషన్‌ను నిర్మించి ప్రజలకు నాణ్యమైన వంట నూనెలను అందిస్తుందని ఆశిస్తున్నామన్నారు.
రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆయిల్ ఫెడ్ సంస్థకు స్థలాన్ని కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నా రు. రూ.25 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనమైన విజయ హైదరాబాద్ మెగా ప్యాకింగ్ కేంద్రం, కీసర తాగునీరు కర్మాగారాలను జనవరి 2024లోపు పూర్తి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఎండీ, డైరెక్టర్ సురేందర్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటరమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment