THUMMALA
-
హరీష్ రావు కామెంట్స్.. కంటతడి పెట్టిన మంత్రి తుమ్మల
-
ఖమ్మం జిల్లాలో భట్టి, పొంగులేటి, తుమ్మలకు కాంగ్రెస్ శ్రేణుల స్వాగతం
-
తెలంగాణను అడ్డుకొనే శక్తి ఏపీకి లేదు: తుమ్మల
ఖమ్మం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భక్త రామదాసు ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. భక్త రామదాసు ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించిన పట్టిసీమకు అనుమతి ఉందా అని ప్రశ్నించారు. ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో భక్తరామదాసు ప్రాజెక్టు ఆగదని, తెలంగాణకు రావలసిన 299 టీఎంసీలలోనే వాడుకుంటున్నామని చెప్పారు. ప్రాజెక్టులు ఆపే శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించుకుంటుందన్నారు. కృష్ణా జలాల్లో తమకు రావలసిన వాటా ఎలా తీసుకోవాలో తమకు తెలుసునని తుమ్మల స్పష్టం చేశారు. రైతుల విషయంలో అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి ఏపీకి సూచించారు. -
తుమ్మల.. నీకిది తగునా..
► టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి సత్తుపల్లి: సత్తుపల్లికి ఇవ్వాల్సిన నీటిని పాలేరుకు తరలించి.. రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి ప్రజల కడుపుకొట్టడం నీకు తగునా అని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రశ్నించారు. స్థానిక బస్టాండ్ రింగ్ సెంటర్లో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాలేరుకు నీళ్లు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని.. అయితే సత్తుపల్లి నీళ్లు ఇవ్వటం ఎంతవరకు న్యాయమన్నారు. నీ మిత్రుడు సండ్ర వెంకటవీరయ్యను అక్రమ కేసుల్లో ఇరికించి.. జైలుకు పంపిస్తుంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం అన్యాయమని అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేను, మంత్రిని చేసిన టీడీపీపై ఎందుకు అంత విషం చిమ్ముతున్నారని, ఉపకారం చేస్తే.. అపకారం చేయటం తగునా అని ప్రశ్నించారు. సత్తుపల్లి జిల్లా కావాలనే ప్రజల న్యాయమైన కోర్కెను పక్కనబెట్టి.. అల్లుడికో జిల్లా.. కొడుక్కో జిల్లా.. బిడ్డకో జిల్లా కానుకగా ఇచ్చి.. అర్హతలున్న సత్తుపల్లికి అన్యాయం చేశారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి బడ్జెట్లు ప్రవేశ పెట్టినా.. రూ.5లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎక్కడా పేదలకు ఉపయోగం జరగలేదని విమర్శించారు. టీఆర్ఎస్కు 2019 ఎన్నికల్లో రాజకీయ చావు తప్పదని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ దుర్మార్గాన్ని బయట పెడతారని.. : ఎల్.రమణ రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య కేసీఆర్ దుర్మార్గాన్ని, దోపిడీని బయట పెడతారని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను అసభ్య పదజాలంతో దూషించారని నిరూపిస్తే వారు రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు విశ్రమించేది లేదన్నారు. దొరల తరహాలో కేసీఆర్ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనపై గవర్నర్, రాష్ట్రపతిని కలుస్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. అసెంబ్లీలో లేకున్నా.. : ఎమ్మెల్యే సండ్ర గవర్నర్ ప్రసంగం సమయంలో అసెంబ్లీలో లేకున్నా తనను సస్పెండ్ చేశారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గతంలో ఇదే గవర్నర్‌పై మంత్రి హరీష్‌రావు దాడి చేసి.. ఇప్పుడు నీతులు వల్లించటం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను ప్రజలకు వివరిస్తామన్నారు. భారీ మోటార్ సైకిల్ ర్యాలీ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణకు స్వాగతం పలికేందుకు సత్తుపల్లిలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ సాగింది. గజమాలతో రేవంత్‌రెడ్డి, ఎల్.రమణ, సండ్ర వెంకటవీరయ్యను అభిమానులు సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి బ్రహ్మయ్య, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మెచ్చా నాగేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ(చిన్ని), టీఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుమంత్, డీసీసీబీ డైరెక్టర్ రాయల శేషగిరిరావు, మోటపోతుల నాగేశ్వరరావు, ఎస్కే.మదీనాపాషా పాల్గొన్నారు. -
వాటర్‌గ్రిడ్ పనుల్లో వేగం పెంచండి
► పదేళ్ల వరకు నిర్మాణ సంస్థలదే బాధ్యత ► వాటర్‌గ్రిడ్ రిజర్వాయర్ ► శంకుస్థానలో మంత్రి తుమ్మల దమ్మపేట: వచ్చే ఉగాది నాటికి శుద్ధి చేసిన గోదావరి జలాలను ఇంటింటికి ఉచితంగా సరఫరా చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం గండుగులపల్లి శివారులో దుర్గమ్మగట్టుపై మిషన్ భగీరథ(వాటర్‌గ్రిడ్)లో భాగంగా నిర్మాణం చేస్తోన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవిలతో కలసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. గండుగులపల్లి దుర్గమ్మగట్టు నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని అన్ని గ్రామాలకు గోదావరి జలాలను అందించేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు చెప్పారు. అందుకుగాను రెండు మండలాల్లో 182 మంచినీటి ట్యాంకులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.4500 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత పదేళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యతలను ఆయా సంస్థలే నిర్వహిస్తాయని తెలిపారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయా అధికారులకు సూచించారు. గుండాల, చర్లతో పాటు, భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలాల్లో చేపట్టిన రోడ్లు, వంతెనల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈ రవీందర్, డీఈ శివరామప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డీఈ షకిలాభేగం, డీసీసీబీ డైరక్టర్ ఆలపాటి రామచంద్రప్రసాద్, ఎంపీపీ అల్లం వెంకమ్మ, జెడ్పీటీసీ దొడ్డాకుల సరోజని, మార్కెట్ కమిటీ చైర్మన్ తానం లక్ష్మి, వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పానుగంటి సత్యం, పైడి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కేవీ సత్యానారాయణ, పోతినేని శ్రీరామవెంకటరావు తదితరులున్నారు. -
మంత్రులూ... శెభాష్
• రికార్డు సమయంలో ‘భక్త రామదాస’ పూర్తిపై సీఎం కేసీఆర్ హర్షం • రాష్ట్ర ప్రత్యేకత చాటారని మంత్రులు హరీశ్, తుమ్మల, అధికారులకు అభినందన • మిగతా ప్రాజెక్టులనూ వేగంగా పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో చేపట్టిన భక్త రామదాస ప్రాజెక్టును గడువుకన్నా ముందే పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. వేగంగా ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను చాటారని మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్రావు, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లను అభినందించారు. పాలేరు ఉప ఎన్నికలో అఖండ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన ప్రజలకు భక్త రామదాస ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి కృతజ్ఞతలు తెలపడం ఆనందంగా ఉందని సీఎం పేర్కొన్నారు. టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ అన్ని ప్రాజెక్టులనూ వేగంగా పూర్తి చేసి రుణం తీర్చుకుంటామని, ప్రజల నమ్మకం నిలబెట్టుకునేలా పనిచేస్తామని సీఎం ప్రకటించారు. చిత్తశుద్ధి, అంకితభావం ఉంటే ప్రాజెక్టులు అనుకున్న సమయంకంటే ముందే నిర్మించవచ్చని నిరూపించగలిగామన్నారు. ఈ ప్రాజెక్టును భక్త రామదాసు జయంతి రోజైన ఈ నెల 31న సీఎం ప్రారంభించనున్నారు. రెండున్నరేళ్లలో 19 లక్షల ఎకరాలకు నీరు రాష్ట్రం ఏర్పడ్డాక రెండున్నరేళ్లలో కొత్తగా 19 లక్షల ఎకరాల మేర నీరందించామని నీటిపారుదల శాఖ ప్రకటించింది. మేజర్, మీడియం ప్రాజెక్టుల కింద కొత్తగా 11 లక్షల ఎకరాల మేర నీరివ్వగా చెరువులు పునరుద్ధరణతో మరో ఏడున్నర లక్షలకుపైగా ఆయకట్టుకు నీరిచ్చామని తెలిపింది. మహబూబ్‌నగర్‌లోని కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసి ఇప్పటికే నాలుగున్నర లక్షల ఎకరాలకు నీరందించామని, మరో మూడున్నర లక్షల ఎకరాలకు వచ్చే ఏడాది నీరందిస్తామని పేర్కొంది. వచ్చే రెండు, మూడేళ్లలో అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, భక్త రామదాస ప్రాజెక్టు పూర్తి ఇచ్చిన విజయం... పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి కొత్త ఉత్సాహం ఇస్తుందని నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ పేర్కొన్నారు. మా సంస్థకు గొప్ప పేరు: మెగా డైరెక్టర్ కృష్ణారెడ్డి భక్త రామదాస ప్రాజెక్టును గడువుకంటే రెండు నెలల ముందే పూర్తి చేయడం తమ సంస్థకు గొప్ప పేరును తెచ్చిపెట్టిందని మెగా ఇంజనీరింగ్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారం వల్లే ప్రాజెక్టు పనుల పూర్తి సాధ్యమైందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 12 నెలల్లో పట్టిసీమ నిర్మించి రికార్డు సృష్టించామని, ఇప్పుడు రాష్ట్రంలో కేవలం 11 నెలల్లో భక్త రామదాసను నిర్మించి కొత్త రికార్డు నమోదు చేయగలిగామన్నారు. -
రోడ్ల నిర్మాణంలో సాంకేతిక విప్లవం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మెరుగైన రోడ్డు అనుసంధాన వ్యవస్థ ఉండేలా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం తోడుకాబోతోంది. ఇందుకు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు సహకరించబోతోంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాల అనుసంధానం, రాజధానితో వాటి జోడింపు, నదులు, వాగులు, వంకలపై వంతెనల నిర్మాణం భారీగా చేపడుతున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.12,500 కోట్ల వ్యయంగాగల పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపగా.. రూ.5 వేల కోట్ల పనులు మొదలయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ వేదికగా జరగబోయే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సులో ఈ ప్రాజెక్టుకు ఓ దిశానిర్దేశం లభించబోతోంది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా రోడ్ల నిర్మాణంలో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, ప్రమాద రహితంగా ఉండేలా కొత్త నమూనా ల రూపకల్పనలపై చర్చించి తెలంగాణ పనులకు సూచనలు ఇవ్వబోతోంది. మాదాపూర్‌లో హైటెక్స్ వేదికగా.. మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా ఈ నెల 15 నుంచి నాలుగు రోజుల పాటు జరగబోయే 77వ సదస్సులో దాదాపు మూడున్నర వేల మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఇందులో అన్ని రాష్ట్రాల రహదారుల శాఖ ఉన్నతాధికారుల తోపాటు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇంజనీర్లు, పర్యావరణవేత్తలు హాజరవు తున్నారు. కొత్త పద్ధతులపై అవగాహన కల్పించేందుకు విదేశీ ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. 17న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావులు పాల్గొంటారు. ఇదో గొప్ప అవకాశం: తుమ్మల తెలంగాణను రోడ్ నెట్‌వర్క్‌లో నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో ఈ సదస్సు నిర్వహించాల్సి రావటం ఓ గొప్ప అవకాశం. ప్రమాద రహితంగా, పర్యావరణ అనుకూల పద్ధతుల్లో రోడ్లు, వంతెనల నిర్మాణానికి కొత్త సూచనలు అందనున్నాయి. -
ఘనంగా ముగిసిన బాలోత్సవ్ వేడుకలు
-
బాల్యాన్ని చిదిమేయొద్దు
- బాలోత్సవ్ ముగింపు వేడుకల్లో మంత్రి కేటీఆర్ - బాలోత్సవ్ విశ్వవ్యాప్తం కావడానికి చర్యలు తీసుకుంటాం - దీనికి భవిష్యత్‌లో సీఎం కేసీఆర్ వస్తారు: తుమ్మల సాక్షి, కొత్తగూడెం: అలవిగాని కోరికలతో పసి హృదయాలపై ఒత్తిడితో కూడిన చదువుల భారం మోపవద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు. మానవీయత, నైతిక విలువలు పెంపొందించే సమాజం సృష్టిం చడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నాలుగు రోజులపాటు జరిగిన జాతీయస్థారుు బాలోత్సవ్ ఆదివారం ముగిసింది. ఉదయం నుంచి విద్యార్థులు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. రాత్రి జరిగిన ముగింపు సభలో మంత్రి మాట్లాడుతూ బాలోత్సవ్‌ను రాష్ట్ర, జాతీయ స్థారుులో మరింత మెరుగులు దిద్దుతూ నిర్వహించాలని, ఇందుకు అవసరమైతే ప్రభుత్వం బాధ్యత తీసుకుని బాలల వేడుకలను మరింత ప్రయోజనకరంగా నిర్వహించేందుకు తోడ్పడుతుందన్నారు. పసిమనసుల్లో చదువుల భారం పెరుగుతోందని, కళాత్మకత, సమాజం లోని అంశాలను తెలుసుకునే సమయం తగ్గిపోతోందని, పుస్తకాలతో కుస్తీపట్టడంతోపాటు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడే అంశాలపై తల్లిదండ్రులు దృష్టి సారిం చాలని కోరారు. తండ్రిగా తాను సైతం అదే బాటలో నడుస్తానని కేటీఆర్ వివరించారు. బాలల మనోవికాసానికి ఉపయోగపడే బాలోత్సవ్‌ను రెండున్నర దశాబ్దాలపాటు ఏకనాయకత్వం నిరాటంకంగా నిర్వహించడం చరిత్రాత్మక మని, ఈ అద్భుత ఘట్టానికి కారకులైన డాక్టర్ వాసిరెడ్డి రమేష్‌బాబును అభినందిస్తున్నామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ బాలోత్సవ్‌కు భవిష్యత్తులో సీఎం కేసీఆర్ హాజరవుతారన్నారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ నలుగురు తెలుగువాళ్లు ఉన్నచోట అనేక సంఘాలు ఏర్పడతాయన్న నానుడికి భిన్నంగా రెండున్నర దశాబ్దాలపాటు బాలల సేవలో తరిస్తూ బాలల మనోవికాసానికి అన్నీ తానై నిర్వహిస్తున్న కొత్తగూడెం బాలోత్సవ్ నిర్వాహకులు అభినందనీయులన్నారు. అమెరికా వంటి దేశాల్లో వక్తలు అమూల్యమైన సందేశమిస్తున్న సమయంలో తమ ఆనందాన్ని ఆమోదాన్ని ప్రకటించడానికి సభికులు నిల్చుని చప్పట్లు కొట్టి ప్రోత్సహించే సంప్రదాయం ఉందని, దీనిని స్టాండింగ్ ఒబేషన్ అంటారని, ఇదే ఒరవడి, సంప్రదాయం తెలుగు ప్రాంతాల్లో ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. తెలుగు వారికి ఆగ్రహం ప్రదర్శించడమే తెలుసునన్న భావన నుంచి.. నిల్చుని చప్పట్లు కొట్టే పద్ధతి పాటించి తెలుగువాళ్ల మనసేమిటో.. భావజాలమేమిటో ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. బాలోత్సవ్ విశ్వవ్యాప్తం కావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని, కార్యక్రమాలను సీఎం, పీఎంల దృష్టికి వెళ్లాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్యే జలగం వెంకటరావు మాట్లాడారు. సభలో వందేమాతరం శ్రీనివాస్ చదువుల భారంపై వినిపించిన గేయం ఆకట్టుకుంది. సభకు బాలోత్సవ్ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రమేశ్‌బాబు అధ్యక్షత వహించగా పరుచూరి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి, స్టార్ హాస్పిటల్ అధినేత గోపీచంద్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మున్సిపల్ చైర్పర్సన్ గీత తదితరులు పాల్గొన్నారు. -
రూ. 80 కోట్ల ప్రభుత్వ గ్యారంటీకి ఆయిల్‌ఫెడ్ ప్రయత్నాలు
అప్పారావుపేట ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ పరిస్థితిని సమీక్షించిన తుమ్మల సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో నిర్మాణంలో ఉన్న ఆరుుల్‌ఫాం ఫ్యాక్టరీకి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీనికి ప్రభుత్వం రూ. 80 కోట్లు గ్యారంటీ ఇస్తే బ్యాంకు నుంచి రుణం పొంది ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయవచ్చని ఆయిల్‌ఫెడ్ అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మంత్రి శనివారం ఆయిల్‌ఫెడ్ ఎండీ ఎం.వీరబ్రహ్మయ్య సహా పలువురు అధికారులతో చర్చించారు. ఈ విషయంపై తుమ్మల... సీఎంను కలిసేందుకు వెళ్లినట్లు తెలిసింది. వాస్తవంగా గతంలో ఆయిల్‌ఫెడ్ ఎండీగా వీరబ్రహ్మయ్య ఉన్నప్పుడు అప్పారావుపేటలో కొత్త ఫ్యాక్టరీకి ప్రతిపాదనలు తయారు చేశారు. అప్పట్లో ఆయిల్‌ఫెడ్ వద్ద రూ.60 కోట్ల వరకు నికర నిల్వలుండేవి. అయితే ఆ తరువాత వీరబ్రహ్మయ్య బదిలీ అవడం తదితర పరిణామాలతో నిల్వలన్నీ కరిగిపోయాయి. ఇటీవల మళ్లీ ఆయిల్‌ఫెడ్‌కు ఎండీగా అదనపు బాధ్యతలతో వీరబ్రహ్మయ్య వచ్చారు. ఆయనతో తుమ్మల తాజా సమీక్ష ప్రాధాన్యం సంతరిం చుకుంది. ఇదిలావుండగా కొత్తగూడెం జిల్లాలో కొత్తగా మరో 20 వేల ఎకరాల్లో ఆరుుల్‌ఫాం తోటలను సాగు చేయించాలని ఆ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమం తును మంత్రి తుమ్మల ఆదేశించారు. -
మంత్రి తుమ్మల ఎస్కార్ట్ డ్రైవర్ హఠాన్మరణం
నివాళులర్పించిన మంత్రి, ఎస్పీ ఖమ్మం క్రైం : ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎస్కార్ట్ డ్రైవర్ హఠాన్మరణం పొందారు. విధి నిర్వహణలో ఉండగా ఆయన ఆకస్మిక గుండెపోటు రావడంతో కుప్పకూలి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి... జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జే. శ్యాం (47) మంత్రి తుమ్మల ఎస్కార్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శనివారం మంత్రి పర్యటనలో భాగంగా విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. 1990 బ్యాచ్‌కు చెందిన శ్యాంకు పోలీస్‌శాఖలో మంచి పేరుంది. విధుల నిర్వహణలో అధికారుల సూచనల మేరకు నడుచుకుంటారని సిబ్బంది తెలిపారు. ఆయన మృతదేహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా ఎస్పీ షానవాస్ ఖాసీం, ఓఎస్డీ భాస్కరన్, డీఎస్పీలు సురేష్‌కుమార్, సంజీవ్, పోలీస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌లు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేశారు. -
ప్రపంచ దేశాల్లో తెలంగాణ నంబర్‌వన్
రహదారుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు రాష్ట్రంలో 2,600 కిలోమీటర్లు జాతీయరహదారులు రాజకీయాల కోసం కాంగ్రెస్ అరోపణలు నిజాంసాగర్ : రాష్ట్ర రహదారులను సుందరంగా తీర్చిదిద్ది రెండేళ్లల్లో ప్రపంచదేశాల్లోనే తెలంగాణ న ంబర్‌వన్ స్టేట్‌గా నిలుస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ్ అన్నారు. ఆరవై ఏళ్లపాటు సింగిల్ రోడ్లుగా 2,600 కిలోమీటర్లను తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ర హదారుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. మంజీరనదిపై రూ. 25 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు శనివారం ఉదయం నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో శిలాఫలకాన్ని మంత్రి అవిష్కరించారు. రైతులు పండించిన పంటల విక్రయాలకు రహదారులు ఎంతో అవసరమని, సీమాంధ్ర పాలనలో ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో రోడ్డు రవాణా వ్యవస్త భ్రష్టు పట్టిందన్నారు. రోడ్లపై కేజ్‌వీల్స్ తిర గకుండా ప్రజాప్రతినిధులు, ఆర్‌ఆండ్‌బీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పొరుగు రాష్ట్రాల్లో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లులేక ఏడారిగా మారిందన్నారు. గోదావరి నదిపై కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్ర శేఖర్‌రావ్ ప్రాజెక్టుల రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ సర్వే చేయించారన్నారు. కాం్రVð స్ నాయకులు రాజకీయాల కోసం ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. ప్రాణహిత, చేవేళ్ల, తుమ్మిడి హట్టి పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేదన్నారు. ఎంతకష్టమోచ్చినా, నష్టమోచ్చినా, తలతా కట్టు పెటైనా సరే తెలంగాణ రాష్ట్రానికి గోదావరి జలాలను తెచ్చి తీరుతా మన్నారు. అర్థంపర్థం లేకుండా ఆరోపణలు చే స్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను రైతులు భూస్థాపితం చేస్తారన్నారు. మేడిగడ్డ బ్యారేజీపై ఆరోపిస్తున్న ఉత్తమ్, జానారెడ్డిలు దమ్ముంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు.కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్,జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్ష
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ 15వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 27న ఖమ్మంలో జరిగే పార్టీ ప్లీనరీ, బహిరంగ సభల ఏర్పాట్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. అసెంబ్లీలోని తన చాంబ ర్లో ఆయన సోమవారం ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులతో భేటీ అయ్యారు. సభ నిర్వహణకయ్యే ఖర్చు, ప్రతినిధులు, బహిరంగ సభలు ఎక్కడ జరపాలి, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. పార్టీ ప్లీనరీ లోగా ఖమ్మం జిల్లాలో భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులపైనా చర్చకు వచ్చింది. ఖమ్మంలోని స్టేడియంలో బహిరంగ సభ, ఆ పక్కనే కాలేజీ మైదానంలో ప్రతి నిధుల సభకు ఏర్పాట్లు చేయాలన్న నిర్ణయం జరిగినట్లు చెబుతున్నారు. ఈ సమావేశం ముగియగానే కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక మండళ్ల నియామకానికి సంబంధించిన జాబితాలతో మంత్రి హరీశ్‌ను కలిశారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యే కనకయ్య, మదన్‌లాల్, వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్ తుమ్మలతో భేటీలో పాల్గొన్నారు. -
26న ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
తల్లాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. తల్లాడలో ఆదివారం సరికొండ వీరంరాజు గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. 26న రాత్రికి సీఎం ఖమ్మం చేరుకుంటారని చెప్పారు. 27న ఉదయం ఖమ్మంలో సమస్యల పరిశీలన, మౌలిక వసతులు, ప్రధాన సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 27వ తేదీనే భద్రాచలం చేరుకుని భద్రాచలం అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని వివరించారు. 28న సీతారాముల కల్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కల్యాణ ఘట్టం ముగిసిన తర్వాత మణుగూరులో భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారని, అనంతరం దుమ్ముగూడెం ఆన కట్ట పరిశీలిస్తారని తెలిపారు. గోదావరి జలాలను సంపూర్ణంగా వినిగియోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలాన్ని టెంపుల్ టౌన్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. పర్ణశాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. నాలుగేళ్లలో భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పర్చనున్నట్లు వివరించారు. సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి, ఎంపీపీ సరికొండ లక్ష్మీపద్మావతి, జెడ్పీటీసీ మూకర ప్రసాద్, జక్కంపూడి కృష్ణమూర్తి పాల్గొన్నారు. పల్లా గెలుపు ఖాయం... దమ్మపేట: ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజవర్గం నుంచి టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు విద్యావంతులు, పట్టభద్రులకు కొత్త శక్తినిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. దమ్మపేటలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అపూర్వంగా 43శాతం ఫిట్మెంట్ ఇచ్చారని ప్రశంసించారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లాలోనే మోడల్ పాఠశాలగా తయారు చేయాలని, నిధుల కోసం రాజీవ్ మిషన్ అధికారులతో మాట్లాడాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు సూచించారు. ఎస్ఎంసి చైర్మన్ సికె నాగార్జున మంత్రి తుమ్మలను కోరారు. దీనికి స్పందించిన మంత్రి అశ్వారావుపేట ఎంఎల్ఏ తాటి వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. పాఠశాలలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తరగతి గదులు నిధుల నిర్మాణం నిధులలేమితో నిలిచిపోయాయని తెలిపారు. వెంటనే ఆయన ఎంఎల్ఏ తాటిని రాజీవ్ విద్యామిషన్ అధికారులతో మాట్లాడి నిధుల విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపిపి అల్లం వెంకమ్మ, జడ్పీటిసి దొడ్డాకుల సరోజని, ఉపసర్పంచ్ దారా మల్లిఖార్జునరావు, కో ఆప్షన్ సభ్యుడు ఎండి వలీపాష ఉన్నారు. సమావేశంలో సర్పంచ్ ఆంగోత్ బాలాజీ, ఆలపాటి రామచంద్రప్రసాద్, పానుగంటి సత్యం, సీకే నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
తలసాని, తుమ్మల సహా ఆరుగురికి మంత్రి పదవులు
-
తలసాని, తుమ్మల సహా ఆరుగురికి మంత్రి పదవులు
హైదరాబాద్: టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన సనత్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావులకు మంత్రి పదవులు ఖరారయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆరుగురి పేర్లతో కొత్త మంత్రుల జాబితాను రాజ్‌భవన్‌కు పంపారు. శ్రీనివాస్ యాదవ్, తుమ్మలతో పాటు మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన చందూలాల్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. వీరి చేరికతో తెలంగాణ కేబినెట్లో మంత్రుల సంఖ్య 18కి చేరుకుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ మంత్రి వర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. కాగా తాజా విస్తరణలో మహిళలకు స్థానం దక్కలేదు. సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన అనుచరులు నిరసన చేపడుతున్నా జాబితాలో చోటు దక్కలేదు.