
మృతిచెందిన శ్యామ్
- నివాళులర్పించిన మంత్రి, ఎస్పీ
ఖమ్మం క్రైం : ఆర్ అండ్ బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎస్కార్ట్ డ్రైవర్ హఠాన్మరణం పొందారు. విధి నిర్వహణలో ఉండగా ఆయన ఆకస్మిక గుండెపోటు రావడంతో కుప్పకూలి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి... జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న జే. శ్యాం (47) మంత్రి తుమ్మల ఎస్కార్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శనివారం మంత్రి పర్యటనలో భాగంగా విధులు నిర్వర్తిస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. 1990 బ్యాచ్‌కు చెందిన శ్యాంకు పోలీస్‌శాఖలో మంచి పేరుంది. విధుల నిర్వహణలో అధికారుల సూచనల మేరకు నడుచుకుంటారని సిబ్బంది తెలిపారు. ఆయన మృతదేహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా ఎస్పీ షానవాస్ ఖాసీం, ఓఎస్‌డీ భాస్కరన్, డీఎస్పీలు సురేష్‌కుమార్, సంజీవ్, పోలీస్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌లు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢసానుభూతి తెలియజేశారు.