26న ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
Published Mon, Mar 23 2015 11:16 AM | Last Updated on Wed, Aug 15 2018 8:58 PM
తల్లాడ: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. తల్లాడలో ఆదివారం సరికొండ వీరంరాజు గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 26, 27, 28 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. 26న రాత్రికి సీఎం ఖమ్మం చేరుకుంటారని చెప్పారు. 27న ఉదయం ఖమ్మంలో సమస్యల పరిశీలన, మౌలిక వసతులు, ప్రధాన సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. 27వ తేదీనే భద్రాచలం చేరుకుని భద్రాచలం అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని వివరించారు. 28న సీతారాముల కల్యాణంలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. కల్యాణ ఘట్టం ముగిసిన తర్వాత మణుగూరులో భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారని, అనంతరం దుమ్ముగూడెం ఆన కట్ట పరిశీలిస్తారని తెలిపారు. గోదావరి జలాలను సంపూర్ణంగా వినిగియోగించుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలాన్ని టెంపుల్ టౌన్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. పర్ణశాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. నాలుగేళ్లలో భద్రాచలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పర్చనున్నట్లు వివరించారు. సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి, ఎంపీపీ సరికొండ లక్ష్మీపద్మావతి, జెడ్పీటీసీ మూకర ప్రసాద్, జక్కంపూడి కృష్ణమూర్తి పాల్గొన్నారు.
పల్లా గెలుపు ఖాయం...
దమ్మపేట: ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజవర్గం నుంచి టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు విద్యావంతులు, పట్టభద్రులకు కొత్త శక్తినిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. దమ్మపేటలో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ అపూర్వంగా 43శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని ప్రశంసించారు. మండల కేంద్రంలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లాలోనే మోడల్ పాఠశాలగా తయారు చేయాలని, నిధుల కోసం రాజీవ్ మిషన్ అధికారులతో మాట్లాడాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుకు సూచించారు. ఎస్‌ఎంసి చైర్మన్ సికె నాగార్జున మంత్రి తుమ్మలను కోరారు. దీనికి స్పందించిన మంత్రి అశ్వారావుపేట ఎంఎల్‌ఏ తాటి వెంకటేశ్వర్లుతో మాట్లాడారు. పాఠశాలలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తరగతి గదులు నిధుల నిర్మాణం నిధులలేమితో నిలిచిపోయాయని తెలిపారు. వెంటనే ఆయన ఎంఎల్‌ఏ తాటిని రాజీవ్ విద్యామిషన్ అధికారులతో మాట్లాడి నిధుల విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపిపి అల్లం వెంకమ్మ, జడ్పీటిసి దొడ్డాకుల సరోజని, ఉపసర్పంచ్ దారా మల్లిఖార్జునరావు, కో ఆప్షన్ సభ్యుడు ఎండి వలీపాష ఉన్నారు. సమావేశంలో సర్పంచ్ ఆంగోత్ బాలాజీ, ఆలపాటి రామచంద్రప్రసాద్, పానుగంటి సత్యం, సీకే నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement