అలవిగాని కోరికలతో పసి హృదయాలపై ఒత్తిడితో కూడిన చదువుల భారం మోపవద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోరారు. మానవీయత, నైతిక విలువలు పెంపొందించే సమాజం సృష్టిం చడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నాలుగు రోజులపాటు జరిగిన జాతీయస్థారుు బాలోత్సవ్ ఆదివారం ముగిసింది. ఉదయం నుంచి విద్యార్థులు తమ ప్రదర్శనలతో హోరెత్తించారు. రాత్రి జరిగిన ముగింపు సభలో మంత్రి మాట్లాడుతూ బాలోత్సవ్‌ను రాష్ట్ర, జాతీయ స్థారుులో మరింత మెరుగులు దిద్దుతూ నిర్వహించాలని, ఇందుకు అవసరమైతే ప్రభుత్వం బాధ్యత తీసుకుని బాలల వేడుకలను మరింత ప్రయోజనకరంగా నిర్వహించేందుకు తోడ్పడుతుందన్నారు.