Carbohydrates
-
మన ఫుడ్ అంతా కార్బోహైడ్రేట్స్ మయమా? అదే సుగర్‌కి కారణమా?
పెద్ద పెద్ద ఆహార నిపుణులని పిలవబడేవాళ్ళందరూ భారతీయ ఆహారంలో ప్రొటీన్లు లేవు, పిండిపదార్థాలే ఎక్కువ ఇవే మధుమేహానికి కారణం అని ఊదరగొట్టి భయపెడుతుంటారు. అది నిజం కాదు అంటూ ట్విటర్ ద్వారా కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రముఖ వైద్యులు శ్రీకాంత్ మిరియాల. ఆ వివరాలు మీకోసం యథాతథంగా . డా. శ్రీకాంత మిర్యాల ట్విటర్లో షేర్ చేసిన వివరాలు ►ప్రొటీన్లు అనేవి మన శరీర నిర్మాణానికే కాకుండా దేహంలో ఎన్నో జీవక్రియలు చేస్తుంటాయి. ఈ ప్రొటీన్లు ఉన్నపళంగా ఆహారంలోనివి మన ఒంట్లోకి చేరుకోవు, చేరుకున్నా అవి మన ప్రోటీన్లు కావు కాబట్టి దానికి మన దేహం వాటికి ప్రతిచర్య చూపిస్తుందే కానీ వాడుకోవు దాన్ని. ► ప్రొటీన్లు అనేవి అమైనో ఆమ్లాలతో తయారవుతాయి, ఇవేంటంటే గోడలో ఇటుకల్లా ఒక్కో అమైనో ఆమ్లం ఇంకో దాంతో జతచేరి అలా పొడవైన గొలుసులు ఏర్పడి, అ గొలుసులు మడతపడి గట్టి లేదా మెత్తటి ప్రొటీన్లు తయారవుతాయి. బాక్టీరియా, మొక్కలు, జంతువులు, మనిషి ఎవరైనా ఇదే పద్ధతి. ఇప్పుడు మనం ఈ ప్రోటీన్లని తిన్నప్పుడు మన జీర్ణాశయం వాటిని ముక్కలు చేసి, పేగుల్లో ఆ ప్రోటీన్లు జీర్ణం అయ్యి అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి. ఇలా విడుదలైనవాటిని మనశరీరం శోషించుకుని వాడుకుని మనకి కావలసిన ప్రొటీన్లని తయారుచేసుకుంటుంది. ► మొత్తంగా ఈ అమైనో ఆమ్లాలు ఇరవై ఉంటాయి. వీటిలో తొమ్మిది మాత్రమే ఆవశ్యకమైనవి. అంటే మిగతా 11 మనదేహం తయారుచేసుకుంటుంది. ఆ తొమ్మిది మాత్రం ఆహారంలోంచి తీసుకోవాలి. ► భారతీయ ఆహారం చాలా వైవిధ్యమైనది. ఇందులో మనకి కావాల్సిన అన్ని పోషకాలుంటాయి. కాకపోతే అవి తినే మోతాదు సరిచూసుకోవాలి. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయాధారిత జనాభా కాబట్టి పనిచేసేందుకు చాలా శక్తి అవసరం అందుకోసం పిండిపదార్థాలు ఎక్కువ తీసుకునేవాళ్లు. ఇప్పుడు దాదాపు 30-40% జనాభా పట్టణాల్లో నగరాల్లో ఉంటున్నారు. వీరి రోజువారీ పనిలో శ్రమ వ్యవసాయమంత ఉండదు కానీ పాత మోతాదులోనే అన్నం, గోధుమలు తినడం వలన శక్తి ఖర్చవక ఊబకాయం వస్తోంది. ► పూర్వం నూనె ఖరీదైంది అందువలన భారతీయ వంటకాల్లో దాని వాడకం తక్కువ, కానీ ఇప్పుడు మెల్లిగా నూనె వాడకం ఎక్కువయ్యి ఉడికించిన కూరల బదులు వేపుళ్లు, అలాగే నూనెలో మునిగితేలి వేయించిన పిండి పదార్థాలు ఎక్కువయ్యాయి. ఐది కూడా ఊబకాయానికి దారి తీస్తోంది. ► కాబట్టి పాత పద్ధతిలో సమతుల్య ఆహారం తింటూ వ్యాయామం ద్వారా ఎక్కువ శ్రమ చెయ్యగలిగితే భారతీయ ఆహారం, అది యే రాష్ట్రానిదైనా మంచిదే. -
నీరసంగా అనిపిస్తోందా..? ఇవి లాగించండి, తక్షణమే శక్తి వస్తుంది..!
కొన్ని సార్లు వీపరీతంగా ఆకలి అనిపిస్తుంది. తక్షణం శక్తి కావాలనిపిస్తుంది. తినగానే వెంటనే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు ఏవి? ఆహారంలో ఏ ఏ రకాలు ఉంటాయి? ఏవి తింటే మంచిది? వాటి గురించి తెలుసుకోండి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తి రావడానికి ప్రాథమిక మూలం. పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా మరియు అన్నం వంటి ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల వీలైనంత త్వరగా శక్తిని పొందవచ్చు. ప్రోటీన్లు: శరీర కణజాలాల పెరుగుదల మరియు మరమ్మత్తులకు ప్రోటీన్లు చాలా అవసరం. గుడ్లు, గింజలు, చీజ్ మరియు లీన్ మీట్ వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల స్థిరమైన శక్తిని శరీరానికి లభించవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు: గింజలు, అవకాడోలు మరియు చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తిని అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు: కాఫీ, టీ మరియు చాక్లెట్ వంటి కెఫీన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా తాత్కాలిక శక్తిని అందిస్తాయి. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంత వరకు మేలు చేస్తాయన్న ఆలోచనను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు: కణాలకు ఆక్సిజన్‌ను చేరవేసే హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ అవసరం. బచ్చలికూర, కాయధాన్యాలు, రెడ్ మీట్ మరియు టోఫు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాలు అలసటను నివారించడంలో మరియు శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలు తక్షణ శక్తిని అందించగలవని గమనించడం ముఖ్యం. శక్తి స్థాయిలను నిర్వహించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తినడం మాత్రమే. అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్ ఫుడ్ లాంటివి వీలైనంత వరకు తినకూడదు. దీని వల్ల చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. -డా.నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
మధుమేహ (షుగర్) బాధితులకు తీపి కబురు!
సాక్షి, హైదరాబాద్: మధుమేహ (షుగర్) బాధితులకు తీపి కబురు! ఒకసారి టైప్–2 డయాబెటిస్ బారినపడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందేనన్న భావన నిజం కాదని.. మధుమేహం నుంచి పూర్తిగా బయటపడొచ్చని భారతీయ వైద్య పరిశోధన సంస్థ (ఐసీఎంఆర్)– ఇండియా డయాబెటిస్ చేపట్టిన తాజా అధ్యయనం వెల్లడించింది. నిత్యం తీసుకొనే ఆహారంలో కార్బోహైడ్రేట్లను సగం శాతానికిపైగా తగ్గించుకోవడం, అదే సమయంలో ప్రొటీన్ల శాతాన్ని పెంచుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే మధుమేహం బారిన పడబోయే దశ (ప్రీ డయాబెటిక్)లో ఉన్న వారు సైతం షుగర్ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చని వివరించింది. ఈ మేరకు ‘డయాబెటిస్ కేర్’ జర్నల్‌లో పత్రం ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా దేశవ్యాప్తంగా 18,090 మంది పెద్దల ఆహారపు అలవాట్లకు సంబంధించిన డైట్ చార్ట్‌ను ఐసీఎంఆర్ రూపొందించింది. దాని ద్వారా డయాబెటిస్‌ను రివర్స్ చేయవచ్చని నిర్ధారణ అయింది. 2045 నాటికి 13.5 కోట్ల మందికి.. దేశంలో మధుమేహ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఐసీఎంఆర్ అధ్యయనం తెలిపింది. ప్రస్తుతం 7.40 కోట్ల మంది షుగర్ బాధితులు ఉండగా మరో 8 కోట్ల మంది ప్రీడయాబెటిక్ దశలో ఉన్నట్లు పేర్కొంది. 2045 నాటికి దేశంలో 13.50 కోట్ల మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉంటారని ఐసీఎంఆర్ అంచనా వేసింది. కార్బోహైడ్రేట్ల వినియోగం చాలా ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణమంది. ఈ 7 అలవాట్లతో షుగర్‌కు చెక్... ►ఆహారంలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే కూరగాయలు, ఫైబర్, ప్రొటీన్, మంచి ఫ్యాట్లను ఒక నిర్ణీత కాలం వరకు తీసుకోవాలి. అలాగే ఆహార పరిమాణాన్ని తగ్గించాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవద్దు, స్వీట్స్ మానేయాలి. గుడ్ ఫ్యాట్స్, గోధుమతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవాలి. చికెన్, ఫిష్, ఎగ్ వంటివి తీసుకోవాలి. ►నిత్యం 45 నిమిషాలపాటు వాకింగ్ తప్పనిసరి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ►ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకోసం ప్రాణాయామ, మెడిటేషన్ చేయాలి. ►రాత్రిపూట కనీసం 6–7 గంటలపాటు నిద్ర పోవాలి. ►రోజూ శరీర బరువును బట్టి 3–3.5 లీటర్ల నీరు తాగాలి. (కిడ్నీ సమస్యలున్నవారు మినహాయింపు). ►స్మోకింగ్‌ను తప్పనిసరిగా ఆపేయాలి. సిగరెట్‌లోని నికోటిన్ అనేది షుగర్‌ను పెంచుతుంది. ►విటమిన్ డీ తక్కువైనా షుగర్ లెవల్స్ పెరుగుతాయి. విటమిన్ డీ వాడటం వల్ల దీన్ని నియంత్రించవచ్చు. కార్బ్స్ తగ్గిస్తే.. సాధారణంగా భారతీయులు తీసుకొనే ఆహారంలోని క్యాలరీలలో 60 నుంచి 75 శాతం వరకు కార్బోహైడ్రేట్ల రూపంలో ఉంటోందని... 10 శాతం మాత్రమే ప్రొటీన్లను కలిగి ఉంటోందని ఐసీఎంఆర్ అధ్యయనం పేర్కొంది. అందువల్ల మధుమేహం నుంచి పూర్తిగా బయటపడాలంటే కార్బోహైడ్రేట్లను 55 శాతానికి తగ్గించుకోవాలని సూచించింది. అలాగే ప్రొటీన్లను 20 శాతానికి పెంచుకోవాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేసింది. అదే ఫలితాలను సాధించడానికి మహిళలు తమ కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని పురుషుల కంటే 2 శాతం ఎక్కువగా తగ్గించుకోవాలని సూచించింది. వృద్ధులు ఒక శాతం ఎక్కువగా కార్బోహైడ్రేట్లు తీసుకోవడాన్ని తగ్గించుకోవాలని తెలిపింది. ప్రోటీన్ల వినియోగాన్ని యువకులు ఒక శాతం ఎక్కువగా పెంచుకోవాలని స్పష్టం చేసింది. ప్రీ–డయాబెటిస్ దశ నుంచి ఉపశమనం కోసం ఆహారంలో 50 నుంచి 56 శాతం కార్బోహైడ్రేట్లు, 18 నుంచి 20 శాతం ప్రొటీన్లు, 21 నుంచి 27 శాతం మంచి కొవ్వు, 3 నుంచి 5 శాతం డైటరీ ఫైబర్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. – డాక్టర్ సాయి ప్రత్యూష, ఎంబీబీఎస్, ఎంఎస్ లైఫ్‌స్టైల్ మెడిసిన్ (యూఎస్), ఆస్పిన్ హెల్త్ క్లినిక్, హైదరాబాద్ -
గణేశ్ చతుర్థి: కుడుము..ఆరోగ్యకరము
వినాయక చతుర్థి వచ్చిందంటే చాలు ప్రతీ ఇంటిలో తొమ్మిది రోజుల పండగే. వినాయక చవితి అంటే పండగే కాదు., ఆరోగ్య జీవనాన్ని ప్రతిబింభించే సంస్కృతి కూడా..! చవితి రోజున దాదాపు 15 రకాల వనమూలికలతో పూజను చేయడం ఆనవాయితీ. అంతేకాదు గణేషునికి ప్రసాదంగా అందించే కుడుములు, ఉండ్రాళ్లు కూడా ఆరోగ్య ప్రధాయిని. విభిన్న ప్రాంతాలకు, సంస్కృతులకు చెందిన కుడుములు ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటాయని న్యూట్రీషనర్స్, ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ కుడుములు విభిన్న పేర్లతో విభిన్న రాకాలుగా ఉన్నప్పటికీ కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుములను ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. కొంకణ్‌లో బయట రవ్వ కోటింగ్ ఇచ్చి తయారు చేసేవి ములిక్గా ప్రసిద్ది, మోదక్గా పేర్కొనే సంప్రదాయ కుడుములను అరటిపళ్లతో తయారు చేస్తారు. అలాగే కేరళలో మినప్పప్పు, స్పైసెస్తో సాల్టీ స్టీమ్డ్ వెర్షన్‌గా ఉప్పు కొజుకత్తై పేరిట వండి సమర్పిస్తారు. తెలంగాణాలో ఉండ్రాళ్లు, చలివిడి, వడపప్పు వంటి రకాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. హోమ్‌ఫుడ్స్ విక్రయించే చోట ప్రతి సంవత్సరం ఈ ఉండ్రాళ్లలో విభిన్న వెర్షన్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ బాదములు, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా జత చేస్తున్నారు. గోల్డ్‌డ్రాప్ సేల్స్, మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా మాట్లాడుతూ ‘‘బాల గణేషుని కథలో మోదక్ (కుడుములు) పట్ల ఆయన అభిరుచిని గురించి ప్రతి ఇంటిలోనూ, ప్రతి సంవత్సరం కథల రూపంలో చెబుతూనే ఉంటారు. అందువల్లే అవి వయసులకు అతీతంగా ఆకట్టుకుంటున్నాయి ’’ అని అన్నారు. పుష్కలంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్... సాధారణంగా కుడుములను బియ్యం పిండి, శకగపప్పు, మినప్పప్పుతో తయారు చేస్తారు. ఈ మిశ్రమంతో శరీరానికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా అందుతాయి. ఈ కుడుముల్లోని కొబ్బరి–బెల్లం చూర్ణం అధిక మొత్తంలో కాల్షియంను అందిస్తాయి. కుడుములను స్వీట్, హాట్ రెండు రకాలుగానూ చేసుకోవచ్చు. బియ్యపు పిండితో పాటు మిల్లెట్స్, రాగి పిండితో చేసిన కుడుములు అధిక విటమిన్లు, ఫైబర్ అందిస్తాయి. వీటికి చూర్ణంలో భాగంగా కొత్తిమీర, ఆకుకూరలు, కరివేపాకు పొడి, ముద్దగా చేసిన ఆకుకూరపప్పు, డ్రై కర్రీలను వాడుకోవచ్చు. ఈ కుడుములను పిండితో చేస్తాం కాబట్టి కొద్ది రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి మూడు రోజుల వరకు తినవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్రాచుర్యం పొందుతున్న మోమోస్ ఓ రకంగా కుడుముల లా తయారైనవే. అయితే వాటికన్నా ఇవి ఆరోగ్యకరం. మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతున్న ఆరోగ్య నియమాలు ఎంతో విశిష్టమైనవి. ప్రతీ పండుగకు విభిన్నమైన ఆహార పదార్థాలు, ప్రసాదాలు ఉంటాయి. శరీరానికి అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందడానికి ఈ తయారీ విధానం ఉపయోడపడుతుంది. అంతేకాకుండా కొత్త రుచులను అందిస్తాయి. చిన్న పిల్లలు, పెద్దవారు ఎవరైనా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. –జానకి,న్యూట్రీషనిస్ట్ -
Health Tips: రాత్రిపూట అన్నం తినొచ్చా? తినకూడదా?
భారతదేశంలోని ప్రజల ప్రధాన ఆహారంలో అన్నం ఒకటి. చాలా మంది అన్నంలో రకరకాల కూరలు, పచ్చళ్లు, వెజ్, నాన్‌వెజ్‌లలో నచ్చిన ఆధరువులు కలుపుకుని తినడానికి ఇష్టపడతారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనితోపాటు ఇందులో ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో చాలామంది రాత్రిపూట అన్నం తినడం మానేస్తున్నారు. దీంతో అన్నం తినాలా వద్దా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. బియ్యంలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది మనం మన రోజు వారీ పనులను సులభంగా చేసుకునేందుకు అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది. అన్నం సులభంగా జీర్ణమవుతుంది. పొట్టకి, జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు అందుతాయి. ఇది తన పనితీరును సాఫీగా నిర్వహిస్తుంది. ప్రతిదానికి దాని ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. మీరు బరువును తగ్గించుకోవాలనుకుంటే మాత్రం రాత్రిపూట అన్నం తినకండి. దాని బదులు బ్రౌన్ రైస్ బెటర్. దీనివల్ల పిండి పదార్థాలకు బదులుగా ఫైబర్ లభిస్తుంది. దీంతో ఆహారం నుంచి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ పొందవచ్చు. చదవండి👉🏾 Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! చదవండి👉🏾High Vitamin D Rich Foods: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. వీటిలో విటమిన్- డి పుష్కలం! -
ఆలూ తింటే వెయిట్ పెరుగుతామా?
-
Health Tips: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా.. అయితే
బాదం గింజలను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బాదం బలవర్ధకమైన ఆహారం. వీటిలో తియ్యగా, చేదుగా ఉండే రెండు రకాలు ఉంటాయి. సాధారణంగా తినుబండారాల కోసం తియ్యటి బాదంను వాడుతూ ఉంటారు. ఈ బాదం పప్పుతోనే బాదం పాలను కూడా తయారు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా బాదం సాగవుతోందంటే దీని వినియోగం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వాటిని అంతగా ఇష్టపడని వారు కూడా తమ డైట్లో చేర్చుకుంటారు. బాదంలో ఉండే పోషకాలు ►బాదంలో ఫైబర్, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగు మోతాదుల్లో లభిస్తాయి. ►ఇందులో మాంసకృత్తులు కూడా ఎక్కువే. ►బాదంలో విటమిన్- ఇ పుష్కలం. ►పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు కూడా బాదం తినడం ద్వారా లభిస్తాయి. ఒక ఔన్సు అంటే సుమారు 28 గ్రాముల బాదంలో ఉండే పోషకాలు ఫైబర్- 3.5 గ్రా. ప్రొటిన్ 6 గ్రా. ఫ్యాట్- 14 గ్రా. విటమిన్ ఈ- 37 శాతం మాంగనీస్- 32 శాతం మెగ్నీషియం- 20 శాతం వీటితో పాటు కాపర్, విటమిన్ బీ2(రాబోఫ్లావిన్), ఫాస్పరస్ కూడా ఉంటాయి. బాదం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ►బాదం తింటే గుండె పనితీరు మెరుగవుతుంది. ►అలసిన శరీరానికి తక్షణశక్తిని అందిస్తుంది. ►రక్తంలో ఇన్సులిన్ శాతాన్ని పెంచే గుణం బాదంలో ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు బాదం తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ►మెదడు పనితీరు చురుగ్గా ఉండేందుకు బాదం ఉపయోగపడుతుంది. ►బాదంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. ►కాన్సర్ ముప్పును నివారిస్తాయి. అయితే, చాలా మందికి బాదంను రాత్రంతా నీళ్లలో నానబెట్టి పొట్టు తీసి తినడం అలవాటు. నిజానికి పొట్టులోనే యాంటీ ఆక్సిడెంట్లు ►ఉంటాయి. కాబట్టి ఇలా పొట్టు తీసి తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ►బాదంలో విటమిన్–ఇ ఎక్కువగా ఉండటం వల్ల చెడుకొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ►మంచి పెరుగు తింటే జీర్ణాశయానికి ఎంత మేలు చేస్తుందో, బాదం చేసే మేలు అంతకు తక్కువేమీ కాదు. ►బాదంలో ఉండే ఒమెగా–3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ►బాదంలో మెగ్నీషియమ్ ఉంటుంది. రక్తపోటు నివారణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ►కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వాళ్లు బాదం తీసుకుంటే మంచిది. ►బాదంలో ఆకలిని తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఊబకాయులు బరువు పెరగకుండా నియంత్రించుకోడానికి ఇది అనువైనది. ►నిజానికి బాదంను ఎప్పుడైనా తినవచ్చు. ►రాత్రి భోజనంలో వేటమాంసం తిన్న తర్వాత కొన్ని బాదం గింజలు తినడం మంచిది. ఎందుకంటే ఇవి కొవ్వు అత్యధికంగా ఉండే పదార్థాల వల్ల గుండెకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
బ్రౌన్ రైస్, వైల్డ్ రైస్.. 40 వేల రకాల బియ్యాలు.. హాయిగా అన్నమే తిందాం!
Health Tips: బ్రౌన్ రైస్, హోల్ గ్రైన్ బాసుమతి రైస్, స్టీమ్డ్ బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్, వైల్డ్ రైస్... ఇన్ని రకాల బియ్యాలున్నాయా! అని ఆశ్చర్యపోవద్దు. ప్రపంచవ్యాప్తంగా నలభై వేల రకాల బియ్యాలున్నాయి. వీటన్నింటికి తోడుగా డయాబెటిస్ వ్యాధిగ్రస్థుల కోసం శాస్త్రవేత్తలు శోధించి, అనేక ప్రయోగాలు చేసి మరో కొత్త రకం బియ్యాన్ని పండించారు. అదే ‘లో గ్లైసిమిక్ వైట్ రైస్’. ‘తెల్లటి అన్నం తినకపోతే భోజనం చేసినట్లే ఉండదు, ఈ డయాబెటిస్ పాలిట పడి మంచి అన్నం కూడా తినలేకపోతున్నాను’ అని ఆవేదన చెందేవాళ్లకు ఈ బియ్యం మంచి పరిష్కారం. ఈ బియ్యం సగ్గుబియ్యం కొద్దిగా పొడవుగా సాగినట్లు ఉండి, ముత్యాలు రాశిపోసినట్లు ఉంటాయి. అయితే వీటి ధర కొంచెం ఎక్కువే. కేజీ నూటపాతిక వరకు ఉంటోంది. లభ్యత విరివిగా లేదు. ఎందుకంటే రైతులకు ఈ వంగడం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదింకా. సరదాగా తెలుసుకుందాం! బ్లాక్‌రైస్ ఈశాన్య రాష్ట్రాల్లో పండుతుంది. ఇప్పుడు మన దగ్గర కొందరు రైతులు ప్రయోగాత్మకంగా కొద్ది మోతాదులో పండిస్తున్నారు. ఈ బియ్యంతో వండిన అన్నం కొంచెం వగరుగా ఉంటుంది. వైల్డ్రైస్ అనే పదమే విచిత్రంగా ఉంది కదూ! నిజమే, ఇది ఎవరూ నారు పోసి నీరు పెట్టి పండించే పంట కాదు. నేటివ్ అమెరికన్లు నదుల తీరాన, కాలువల తీరాన సేకరించే బియ్యం. హోల్ బాసుమతి బియ్యం నగరాల్లో దొరుకుతోంది. ఇక బ్రౌన్‌రైస్, స్టీమ్డ్ బ్రౌన్ రైస్, రెడ్ రైస్లయితే చిన్న పట్టణాల్లో కూడా విరివిగా లభిస్తాయి. వీటిలో ఏవీ పొట్టు తీసినవి కాదు, కాబట్టి ఈ అన్నాలన్నీ ఆరోగ్యానికి మంచిదే. ప్రకృతి బియ్యం గింజలో మెత్తటి గంజిపొడిలాంటి పదార్థంతోపాటు దానిని నెమ్మదిగా జీర్ణం చేయించడానికి పీచును కూడా పై పొరగా కలిపి ఇచ్చింది. మనం రుచికి బానిసలమై ఆరోగ్యకరమైన పోషకాలు నిండిన పై పొరను తొలగించి తినడంతోనే ఈ సమస్యలన్నీ. ఇవి కూడా మంచివే! శాస్త్రవేత్తలు రూపొందించిన ‘లో గ్లైసిమిక్ వైట్ రైస్’ అందుబాటులో లేనప్పుడు మనం పైన చెప్పుకున్న బియ్యాల్లో దేనినైనా వండుకుని హాయిగా అన్నం తినవచ్చు. బ్రౌన్‌రైస్‌కి పైన ఉండే పోషకాలు, పీచుతో కూడిన పొరను తీసేసి బియ్యాన్ని తెల్లబరుస్తారు. అవే డబుల్ పాలిష్డ్ రైస్. ఆ బియ్యంలో కేవలం గంజిపొడిలాంటి భాగం మాత్రమే మిగులుతుంది. డబుల్ పాలిష్ చేసిన ఆ బియ్యంతో వండిన అన్నం తిన్నప్పుడు కార్బోహైడ్రేట్లు, కేలరీలు పెద్ద మొత్తంలో దేహానికి అందుతాయి. చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు అన్నం తినడం మంచిది కాదని చెబుతారు డాక్టర్లు. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
వారెవ్వా! కార్బన్‌డయాక్సైడ్‌తో పిండిపదార్థం..
బ్రెడ్డు ముక్క మొదలు.. కాగితం ముక్క వరకూ దేనినైనా పిండిపదార్థం లేకుండా తయారు చేయడం అసాధ్యం. పిండి పదార్థం తయారీకి బోలెడంత నీరు, భూమి అవసరం. కానీ, ఇవేవీ లేకుండా.. కేవలం కాలుష్య కారక కార్బన్డయాక్సైడ్ అనే వాయువునే పిండిపదార్థంగా మార్చగలిగితే? చైనా శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మారుస్తుంటాయి. ఈ ప్రక్రియలో దాదాపు 60 వరకూ జీవరసాయనిక చర్యలు జరుగుతుంటాయి. ఇంతకంటే సులువుగా పిండిపదార్థాన్ని ఉత్పత్తి చేసేందుకు ఉన్న మార్గాలపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు కిరణజన్య సంయోగప్రక్రియ కంటే ఎన్నోరెట్లు వేగంగా కృత్రిమ పద్ధతుల్లో కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చడంలో విజయం సాధించారు. సేంద్రియ ఉత్ప్రేరకం సాయంతో కార్బన్‌డయాక్సైడ్‌ను మెథనాల్‌గా, ఆ తరువాత కృత్రిమ ఎంజైమ్‌ల సాయంతో చక్కెరలుగా మార్చడం, వీటి నుంచి పిండిపదార్థం తయారు చేయడం ఈ ప్రక్రియ సారాంశం. మొక్కజొన్న కంటే 8.5 రెట్లు ఎక్కువ పిండి పదార్థాన్ని తయారు చేయగలగడం కొత్త పద్ధతి ప్రత్యేకత. పిండిపదార్థాన్ని ఇలా కొత్తపద్ధతిలో తయారు చేసుకుంటే పర్యావరణానికి నష్టం చేకూరుస్తున్న కీటకనాశినులు, ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, పిండిపదార్థం కోసం ఉపయోగిస్తున్న పంటభూమిని కూడా ఇతర అవసరాలకు వాడవచ్చని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త చీ టావో తెలిపారు. చదవండి: గుండెను గడ్డ కట్టించి, నిల్వచేశారు! -
Mushrooms: పుట్టగొడుగులు తిన్నారంటే..
Mushrooms Health Benefits In Telugu: పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజ పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. పుట్టగొడుగుల్లో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ ఉండడం వల్ల యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేయడమేగాక, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలోని కొన్ని రకాల ఎంజైమ్‌లు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచడానికి తోడ్పడతాయి. దీంతో గుండె సంబంధ సమస్యలు రావు. ►పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి ఖనిజపోషకాలు, విటమిన్లు, పీచు పదార్ధాలు, కార్బొహైడ్రేట్స్ అందుతాయి. ఇవన్నీ శరీరానికి అందడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ►ఆహారంలో పుట్టగొడుగుల్ని చేర్చుకోవడం వల్ల ఉదర సమస్యలు, అజీర్ణం, మలబద్దకం సమస్యలు దరిచేరవు. ►ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఎదరుకాదు. చదవండి: Health Tips: బరువును అదుపులో ఉంచే మిరియాలు -
డయాబెటిస్ కారణంగా వరికి బదులు గోధుమలు తింటున్నారా?
ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో డయాబెటిస్ పేషెంట్స్ తప్పక ఉంటున్నారు. వీళ్లలో చాలామంది తమ రాత్రి భోజనంలో వరి అన్నం తినే బదులు గోధుమ రొట్టెలను తింటుండటం చాలా ఇళ్లలో చూస్తున్నాం.ఒక పిండి పదార్ధాన్ని (కార్బోహైడ్రేట్స్‌ను) తీసుకున్నప్పుడు అందులోంచి వెలువడే చక్కెర, దాని వల్ల శరీరానికి సమకూరే శక్తిని గ్లైసీమిక్ ఇండెక్స్ అనే కొలతలో చెబుతారు. నిజానికి వరి అన్నం, గోధుమ రొట్టె... ఈ రెండింటి గ్లైసీమిక్ ఇండెక్స్ ఒక్కటే. అంటే వరిలోనూ, గోధుమలోనూ ఉండే కార్బోహైడ్రేట్ల నుంచి వెలువడే చక్కెరపాళ్లు దాదాపుగా ఒకటే. అంటే నిజానికి ఏది తిన్నా పర్లేదన్నమాట.కానీ ఇక్కడో తిరకాసు ఉంది. మనం అన్నం తినే సమయంలో కూర చాలా రుచిగా ఉంటే మనకు తెలియకుండానే నాలుగు ముద్దలు ఎక్కువ తినేస్తాం. కానీ రొట్టెలు తింటున్నామనుకోండి. ఎన్ని తింటున్నామంటూ మనకో కొలత తెలుస్తుంది. అందుకే మనం తినే ఆహారం పరిమితి మించదు. దాంతో రక్తంలో గ్లూకోజ్ పెరగదు. అంతేగానీ... రాత్రివేళ పరిమితిగా అన్నం తిన్నా, లేక రొట్టె తిన్నా ఒక్కటే.మళ్లీ ఇక్కడ ఒక మెలిక ఉంది... పైన చెప్పిన ప్రకారం గోధుమలు తినడం వల్ల డయాబెటిస్ వారికి ఏలాంటి అదనపు ప్రయోజనమూ చేకూరదని చెప్పడం కూడా పూర్తిగా సరికాదు. ఎందుకంటే... అరకప్పు తెల్లగోధుమలో 1.3 గ్రాముల పీచు ఉంటుంది. అదే అరకప్పు పొట్టుతీయని గోధుమలో 6.4 గ్రాముల పీచు ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు పొట్టుతీయని గోధుమ తింటే... రక్తంలోకి గ్లూకోజ్ ఇంకిపోవడం అన్నది చాలా చాలా నెమ్మదిగా జరుగుతుంది. అంటే పొట్టు తీయని గోధుమ వల్ల రెండు రకాల ప్రయోజనాలన్నమాట. మొదటిది రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల కావడం, రెండోది జీర్ణక్రియ సక్రమంగా జరగడంతో పాటు మలబద్ధకం నివారితం కావడం. ఈ రెండు కారణాలను పరిగణనలోకి తీసుకుంటే వరితో పోలిస్తే గోధుమ ఒకింత మంచిదనే చెప్పుకోవచ్చు. గోధుమలో వివిధ అంశాల తీరుతెన్నులివి... ►ఒక కప్పు గోధుమల్లో ►క్యాలరీలు... 407 ►కొవ్వులు 2.24 గ్రా. ►కార్బోహైడ్రేట్లు 87.08 గ్రా. ►ప్రోటీన్లు 16.44 గ్రా. గోధుమలో పోషకాలివి : ఇక గోధుమలలో మంచి చెప్పుకున్నట్లుగా కార్బోహైడ్రేట్లతో (పిండిపదార్థాలతో) పాటు ప్రోటీన్లు, పీచుపదార్థాలు, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఒక ఇందులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అయితే మనం చాలా సందర్భాల్లో గోధుమ మీద పైపొరను తొలగించి వాడుతుంటారు. దాన్నే వైట్ వీట్గా పేర్కొంటారు. అదే పొట్టు తొలగించని గోధుమను హోల్‌వీట్ అంటారు. హోల్వీట్లోనే పీచు పదార్థాలు ఎక్కువ అని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యపరమైన ప్రయోజనాలివి : పొట్టు తీయని గోధుమల్లో పీచు (డయటరీ ఫైబర్) ఎక్కువ కాబట్టి జీర్ణప్రక్రియ సాఫీగా జరుగుతుంది. దీనికి తోడు పొట్టు తీయని గోధుమలతో రొట్టెలు తినేవారిలో విరేచనం సాఫీగా జరిగి మలబద్ధకం నివారితమవుతుంది. పీచు తీయని గోధుమ వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో గుండెజబ్బులు నివారితమవుతాయి. దాంతో స్థూలకాయం కూడా తగ్గుతుంది. ఈ విషయం కొలరాడో స్టేట్ యూనివర్సిటీ అధ్యయనాల్లో అధికారికంగా నిరూపితమైంది. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఒక పూట గోధుమలు తినడం మంచిదే. అలాగని గోధుమలు ఇష్టం లేనివారు వరి అన్నమే తినదలచుకుంటే మాత్రం కూర రుచిగా ఉన్నా లేకున్నా తమ రాత్రి భోజనం పరిమితికి మించకుండా చూసుకోవాలనే జాగ్రత్త తీసుకోవాల్సిందే. -
డయాబెటిస్ అంటున్నారు...ఎలాంటి ఆహారంతీసుకోవాలి?
నా వయసు 38 ఏళ్లు. ఇటీవలే జనరల్ హెల్త్ పరీక్ష చేయించుకుంటే డయాబెటిస్ ఉన్నట్లు వచ్చింది. నేను ఎలాంటి ఆహారం తీసుకోవాలో దయచేసి సూచించండి. డయాబెటిస్ కనుగొన్న తర్వాత డాక్టర్ సూచించిన మందులతో పాటు వారి వారి వ్యక్తిగత బరువు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆహారనిపుణులు వారికి వ్యక్తిగతంగా ఆహారపు నిబంధనలు (డైట్ చార్ట్) సూచిస్తారు. అయితే ఈ కింద పేర్కొన్నవి డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన సాధారణ ఆహార నిబంధనలు మాత్రమే. పిండిపదార్థాల విషయానికి వస్తే అవి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ (పంచదార) పాళ్లు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ రోగులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలను తీసుకోవాల్సి వస్తే... ముడిబియ్యం, దంపుడు బియ్యం లాంటి పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవడం వల్ల పీచు పదార్థాలు (ఫైబర్) శరీరానికి ఎక్కువగా అందుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడానికి ఈ పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. బెండకాయ, వంకాయ, టొమాటో, గుమ్మడికాయ వంటి కాయగూరలు, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుపచ్చని ఆకుకూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్)లోనూ, బొప్పాయి, జామపండు వంటి పండ్లు, సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ల విషయానికి వస్తే ఇవి శరీర కణాలను మరమ్మతు చేయడానికి అవసరం. ప్రోటీన్లు. గ్లూకోజ్ పాళ్లు పెరగకుండా చూసే అమైనో ఆమ్లాలను అందిచడంలోనూ దోహదపడతాయి. పాలు, పాల ఉత్పాదనలు, పప్పులు, బీన్స్ వంటివి వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ. మాంసాహారం ద్వారా కూడా ప్రోటీన్లు అందుతాయి. అంతే మాంసాహారం వల్ల కొవ్వు పాళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మాంసాహారం తీసుకునే సమయంలో వేటమాంసం, రెడ్ మీట్‌కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటివి తీసుకోవడం మంచిది. ఇక కొవ్వుల విషయానికి వస్తే మన శరీర జీవక్రియలకు కొవ్వులు అవసరమైనందున వాటిని పూర్తిగా మానేయడం సరికాదు. డయాబెటిస్ ఉన్నవారు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసహారం, నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, వనస్పతి, పామోలిన్ వంటివి తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశం ఎక్కువ. కాబట్టి డయాటెటిస్ ఉన్నవారు గుండె జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా భావించి ఆమేరకు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇలాంటి కొవ్వు లేదా నూనె పదార్థాలు తీసుకోవడం సరికాదు. ఇక నూనెల విషయానికి వస్తే పాలీ అన్‌శాచ్యురేటెడ్ నూనెలైన (ప్యూఫా) పొద్దుతిరుగుడు, కుసుమ నూనెలనూ ఉదయం వేళల్లోనూ... ఇక మోనో అన్‌శ్యాచ్యురేటెడ్ నూనెలైన (మ్యూఫా) నువ్వుల నూనె, సోయానూనె, ఆలివ్ ఆయిల్స్‌ను సాయంత్రం వేళల్లో ఉపయోగించడం మంచిది. ఇలా వీలు కాకపోతే ఒక నెలంతా ప్యూఫా, మరో నెలంతా మ్యూఫా నూనెలను మార్చి మార్చి ఉపయోగించడం వల్ల మధుమేహం ఉన్నవారికే గాక అందరికీ మంచిది. గుండె, శరీరానికి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. ఒక పరిమితి మించకుండా కొవ్వు పదార్థాలు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు 50 గ్రాములకు మించి నూనె ఉపయోగించకూడదు. అంటే నెలకు 450 గ్రాములు అన్నమాట. కొండగుర్తుగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు నెలకు అర్ధలీటరుకు మించకుండా నూనె వాడటం శ్రేయస్కరం. డయాబెటిస్ రోగులు నేరుగా తీసుకోకూడని పదార్థాలు: ►పంచదార / వాటితో తయారు చేసిన తీపి పదార్థాలు ►తేనె ►జామ్స్ / జెల్లీస్ ►కేకులు / పేస్ట్రీలు ►పళ్లరసాలు ∙మద్యం ►(పండ్లను పండ్లరసాల రూపంలో తీసుకోవడం కంటే నారింజ, కమలాపండు, జామ, పుచ్చకాయ, బొప్పాయి వంటి పండ్లను కొరికి తినడం మంచిది). డయాబెటిస్ ఉన్నవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ►మొలకెత్తిన గింజలు తీసుకోవడం మధుమేహరోగుల ఆరోగ్యానికి మంచిది. ►నేల కింద పండే దుంపలు (ఆలు, చిలగడ, కంద వంటి దుంపలు) డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. నేల కింద పండే వాటన్నింటి నుంచి దూరంగా ఉండాలని డయాబెటిస్ రోగులు గుర్తుంచుకోవాలి. అయితే ఈ నిబంధన నుంచి ముల్లంగికి మినహాయింపు ఉంది. డయాబెటిస్ రోగులు ముల్లంగిని తీసుకోవచ్చు. ►ఈ ఆహారంతోపాటు వ్యాయామం చేస్తూ బరువు పెరగకుండా జాగ్రత్త పడితే డయాబెటిస్ దుష్ప్రభావాలనుంచి దూరంగా ఉండవచ్చు. బార్డర్‌లైన్ అంటున్నారు...డయాబెటిస్ వచ్చినట్టేనా? నేను ఇటీవలే రక్తపరీక్ష చేయించుకుంటే నాకు డయాబెటిస్ బార్డర్‌లైన్‌లో ఉందన్నారు. అంటే నాకు డయాబెటిస్ వచ్చినట్లేనా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. మీరు పరగడుపున రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 100 కంటే తక్కువ ఉండటం; భోజనం చేశాక రక్తపరీక్షలో ఆ విలువ 140 కంటే తక్కువ ఉండటం జరిగితే మీకు డయాబెటిస్ లేదని అర్థం. ఒకవేళ మీరు పరగడుపున చేయించిన పరీక్షలో రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 125 కంటే ఎక్కువగానూ, భోజనం చేసిన తర్వాత చేసిన రక్తపరీక్షలో ఆ విలువ 200 కంటే ఎక్కువగానూ, హెచ్‌బీఏ1సీ అనే పరీక్షలో వచ్చిన విలువ 6.5 శాతం కంటే ఎక్కువగానూ ఉంటే మీకు డయాబెటిస్ ఉన్నట్లు లెక్క. ఇంకా చెప్పాలంటే... హెచ్‌బీఏ1సి విలువ 5.6 నుంచి 6.5 వరకు ఉన్నా లేదా పరగడుపున చేయించిన రక్తపరీక్షలో చక్కెర 100 నుంచి 125 ఉన్నా, భోజనం చేశాక రక్తంలో చక్కెర 140 నుంచి 200 లోపు ఉన్నా దాన్ని బార్డర్‌లైన్ డయాబెటిస్ అంటారు. అంటే పరీక్షల్లో ఈ రీడింగ్స్ వస్తే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ అన్నమాట. ఇలాంటివారు రోజూ కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయడం, తాము తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా తీసుకోవడం, స్థూలకాయం లేకుండా చూసుకోవడం చేస్తుంటే చాలాకాలం పాటు డయాబెటిస్ దరిచేరకుండా కాపాడుకోవచ్చు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ రాకుండా కాపాడుకునే అవకాశం ఇంకా ఉందని అర్థం. డయాబెటిస్ ఉంది... విహారయాత్రకు సూచనలు చెప్పండి నేను గత ఆరేళ్లనుంచి డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఈసారి వేసవి సెలవల్లో ఎటైనా విహారయాత్రకు వెళ్దామనుకుంటున్నాను. ప్రయాణంలో నా చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోడానికి ఏవైనా సూచనలు చెప్పండి. డయాబెటిస్ అనేది క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ ఉండాల్సిన దీర్ఘకాలిక సమస్య. అంతమాత్రాన ఇది ఉన్నవారు విహారయాత్రలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం మానుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి... ►మీరు వెళ్లబోయే ప్రదేశం ఏమిటో, అక్కడికి చేరడానికి ఎంత సమయం పడుతుందో మీ డాక్టర్‌కు చెప్పండి ►మీ డయాబెటిస్ మందులతో పాటు ఒకవేళ మీకు ప్రయాణం సమయంలో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాల సమస్య వస్తే తీసుకోవాల్సిన మందుల ప్రిస్క్రిప్షన్‌ను ఇవ్వమని కోరండి ►మీరు మీ గమ్యస్థానాన్ని చేరగానే ఒకసారి మీ చక్కెర పాళ్లు పరీక్షించుకోండి. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే చేరాల్సిన ఆసుపత్రినీ, లేదా వైద్యసహాయం అందించే చోటును ముందే ఎంపిక చేసుకుని పెట్టుకోండి. ►మీరు ఇన్సులిన్ మీద ఉంటే ఇన్సులిన్‌ను లేదా నోటి ద్వారా తీసుకునే మందులైతే వాటిని మీతో పాటే ఉంచుకోండి. మీ ఇన్సులిన్ మరీ ఎక్కువ వేడి ఉండే చోట లేకుండా చూసుకోండి మీరు కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు ఆహారం తీసుకునేలా ఏర్పాటు చేసుకోండి ►అకస్మాత్తుగా రక్తంలో చక్కెర తగ్గే పరిస్థితి (హైపోగ్లైసీమియా) ఏర్పడితే తీసుకోడానికి కొన్ని చాక్లెట్లు కూడా మీతో ఉంచుకోండి. షుగర్ తగ్గినా ప్రమాదమా? మా అమ్మగారి వయసు 68 ఏళ్లు. చాలా ఏళ్లుగా ఆమె డయాబెటిస్తో బాధపడుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా టాబ్లెట్లు తీసుకుంటారు. ఒకరోజు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. అక్కడ డాక్టర్లు ఆమెను పరీక్షించి రక్తంలో షుగర్ పాళ్లు తగ్గాయని చెప్పారు. షుగర్ పెరిగితే కదా ప్రమాదం. ఇలా షుగర్ తగ్గడం వల్ల కూడా ప్రమాదాలు ఉంటాయా? ఒక్కోసారి పెద్దవయసు వాళ్లు తాము తినాల్సిన ఆహారం తినరు. దాంతో వారి రక్తంలోని చక్కెరపాళ్లు తగ్గుతాయి. అలా తగ్గడాన్ని వైద్యపరిభాషలో హైపోగ్లైసీమియా అంటారు. దీనివల్ల వృద్ధులైన రోగుల్లో వణుకు, చెమటలు పట్టడం వంటి లక్షణాలకు బదులుగా నరాలకు సంబంధించిన లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంటే నిద్రమత్తుగా ఉన్నట్లుండటం, నిస్సత్తువ, భ్రాంతులు, అయోమయం వంటివి అన్నమాట. ఆ వయసువారికి మత్తుగా జోగుతుండటం వల్ల పడిపోయి ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలి. ఇలా రక్తంలోని చక్కెరపాళ్లు తగ్గకుండా ఉండటం కోసం తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినాలి. రోజూ సరైన వేళకు ఆహారం తీసుకుంటూ ఉండాలి. తెల్లజుట్టు రాకుండా నిరోధించడం సాధ్యమే! జుట్టుకు రంగు వేసుకొని.. వేసుకొని విసిగిపోయారా? ఇక ఆ రంగులకు, బ్రష్‌లకు ప్యాకప్ చెప్పేయొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అందరినీ వేధిస్తున్న తెల్లజుట్టు బెంగ ఇక అక్కర్లేదట. జుట్టు తెల్లబడటానికి కారణమైన జన్యువును కనుగొన్నామని.. ఇది మరింత విప్లవాత్మక మార్పులకు దారితీయనుందని లండన్ పరిశోధకులు చెబుతున్నారు. ఐఆర్ఎఫ్ 4 అనే జన్యువు వల్లే జుట్టు రంగు మారుతోందని గుర్తించారు. మెలనిన్‌ను నియంత్రిస్తున్న ఈ జన్యువే జుట్టును కూడా తెల్లబరుస్తోందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ ఆవిష్కరణతో జట్టు తెల్లబడటాన్ని నిరోధించడం భవిష్యత్తులో సాధ్యమే అంటున్నారు. జుట్టు రంగు, సాంద్రత, ఆకారాన్ని ప్రభావితం చేసే జన్యువులను గుర్తించేందుకు లాటిన్ అమెరికా చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు ఆరువేల మందిపై ఈ పరిశోధన సాగింది. జుట్టు తొందరగా తెల్లబడటానికి కేవలం జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ పరిస్థితులు కాకుండా.. మనిషిలోని జన్యువే ప్రధాన పాత్ర పోషిస్తోందని లండన్ శాస్త్రవేత్తలు తేల్చారు.బట్టతల రావడానికి, జుట్టు రంగును మార్చే జన్యువులను ఇప్పటికే గుర్తించినా, మానవుల్లో జుట్టు తెల్లగా మారడానికి కారణమైన జన్యువును గుర్తించడం ఇదే ప్రథమమని, చాలా కీలకమైందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (యూసీఎల్) కు చెందిన డాక్టర్ కౌస్తుభ్ అధికారి చెప్పారు. ఇది ఇంతకు ముందెన్నడూ జరగని పరిశోధన అని పేర్కొన్నారు. ఇది కాస్మోటింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందంటున్నారు. మానవ వృద్ధాప్య జీవశాస్త్రం అంశాల పరిశోధనలో తమ అధ్యయనం మంచి పరిణామమని ప్రొఫెసర్ ఆండ్రెస్ రూయిజ్– లినారెస్ చెప్పారు. గడ్డం దగ్గర జుట్టు మందం, కనుబొమ్మల మందాన్ని, వైవిధ్యాన్ని నియంత్రించే జన్యువులను కూడా తమ పరిశోధనలో గుర్తించినట్టు తెలిపారు. అయితే. రసాయనాలు కలిసిన రంగుల గాఢతను జుట్టు భరిస్తుందో లేదోనని ఆలోచించడం లేదు. ఇలా చేసే ముందు సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మసమస్యలు ఎదురు అవుతాయి. అందువలన చాలా వరకూ ఇలాంటి పద్ధతులకు దూరంగా ఉంటే మంచిది అంటున్నారు వారు. డాక్టర్ ఎల్. సునందిని సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, యాస్టర్ ప్రైమ్ హాస్పిటల్, హైదరాబాద్ -
కీటోతో గుండెజబ్బుల ప్రమాదం...!
ఈమధ్య కాలంలో పిండిపదార్థాలు తక్కువగా.. కొవ్వులెక్కువగా ఉండే ఆహారం తినడం ప్రాచుర్యం పొందుతున్న విషయం మనకు తెలుసు. అయితే ఈ కీటో డైట్‌తో గుండెజబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని హెచ్చరిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. ఆహారం ద్వారా అందే శక్తిలో 45 శాతం కంటే తక్కువ పిండి పదార్థాల నుంచి వస్తూంటే ఆర్టియల్ ఫైబ్రేషన్ గుండెజబ్బు వచ్చే అవకాశాలు 18 శాతం ఎక్కువని తాము అధ్యయన పూర్వకంగా తెలుసుకున్నట్లు వీరు చెబుతున్నారు. ఆర్టియల్ ఫైబ్రేషన్ ఉన్న వారిలో గుండెపై కవాటాలు సంకోచ, వ్యాకోచాలు ఏకరీతిగా ఉండవు. ఫలితంగా అక్కడి నరాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రేట్ల స్థానంలో ఏ రకమైన కొవ్వులను చేర్చినా ఫలితాలు ఇలాగే ఉంటాయని సున్ యట్ సేన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త షియడాంగ్ ఝాంగ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. మరోవైపు అమెరికాకు చెందిన నార్త్‌వెల్ హెల్త్ శాస్త్రవేత్తలు కూడా కీటో ఆహారంపై జరిగిన అధ్యయనంలోనూ ఇదేరకమైన ఫలితాలు వచ్చాయి. దాదాపు 14 వేల మంది వివరాలను సేకరించి ఈ అధ్యయనం చేశారు. ఆర్టియల్ ఫైబ్రేషన్ వ్యాధి లక్షణాలు లేని వీరందరినీ 22 ఏళ్లపాటు పరిశీలించగా 1900 మంది వ్యాధిబారిన పడ్డారు. వాళ్లు తినే ఆహారాన్ని పరిశీలించినప్పుడు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి.. కొవ్వులు ఎక్కువగా ఉన్న వారికి ఈ గుండెజబ్బు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. -
కొవ్వు పదార్థాలు తినొచ్చా?
గర్భిణులు కొవ్వు పదార్థాలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని చదివాను. ఇది ఎంత వరకు నిజం? ఏయే పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుందనే విషయం మీద నాకు పెద్దగా అవగాహనలేదు. కాస్త వివరంగా తెలియజేయగలరు. – జి.మయూరి, నెల్లిమర్ల గర్భిణీగా ఉన్న సమయంలో సాధారణంగా తీసుకునే ఆహారం కంటే 300 క్యాలరీల ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. అధిక క్యాలరీలు తల్లిలో మార్పులకు, బిడ్డ పెరుగుదలకు ఉపయోగపడతాయి. తల్లి ఆహారంలో 50 శాతం కార్బోహైడ్రేట్లు, 25 శాతం ప్రొటీన్లు, 25 శాతం కొవ్వు ఉంటే, బిడ్డ పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారంలో కొవ్వు బిడ్డలోని నాడీ వ్యవస్థ, కళ్లు ఏర్పడటానికి, హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. తల్లి మరీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బిడ్డలోని కాలేయం(లివర్) కణాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధకుల అంచనా. దానివల్ల బిడ్డలో రోగనిరోధకశక్తి తగ్గడం, ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బిడ్డ అధిక బరువు, తర్వాతి కాలంలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల, కొంతమంది పిల్లల్లో మెదడు ఎదుగుదలపై ప్రభావం పడి, వారిలో ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు అని పరిశోధకుల విశ్లేషణ. జంక్ఫుడ్స్, వేపుడ్లు, గుడ్లు, మాంసం, చీజ్, బటర్, డ్రై ఫ్రూట్స్, నూనె వస్తువులు, కొన్ని రకాల చేపలు, వంటి ఆహారంలో కొవ్వు అధికంగా ఉంటుంది. వీటిలో పాలు, పెరుగు, గుడ్లు, కొద్దిగా మాంసం, డ్రై ఫ్రూట్స్ వంటివి మితంగా తీసుకోవడం మంచిది. అంతేకాని అసలు తీసుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే బిడ్డ ఎదుగుదలకు 25 శాతం ఆహారంలో కొవ్వు ఉండాలి. మా కజిన్ చాలా చురుకైన అమ్మాయి. ప్రస్తుతం తను ప్రెగ్నెంట్. కారణం తెలియదుగానీ తన స్వభావానికి విరుద్దంగా మూడీగా ఉంటోంది. ఒంటరితనాన్ని ఇష్టపడుతోంది. దీన్ని ప్రెనెటెల్ డిప్రెషన్ అంటారని, సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం కాదని కొందరంటున్నారు. మరికొందరేమో దీని వల్ల పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వగలరు. – పి.సంతోషి, మచిలీపట్నం కొంతమంది గర్భం దాల్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులతో, హార్మోన్లలో మార్పులతో డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. దీన్నే ప్రెనెటెల్ డిప్రెషన్ అంటారు. మొదటి మూడునెలలు వికారం, వాంతులు, నీరసం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలతో ఆందోళన చెందడం జరుగుతుంది. అలాగే, శారీరక మార్పులు, బరువు పెరగడం, ఆయాసం, ఓపిక లేకపోవడం, నడుం నొప్పులు, వంటి ఇబ్బందులు, కొందరిలో ఆర్థిక పరిస్థితులు, కొందరిలో భర్తకి తనమీద శ్రద్ధ తగ్గుతుందేమోనని ఆందోళన వంటి అనేక కారణాల వల్ల కొంతమంది గర్భిణీలు ప్రెనెటెల్ డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. కొందరిలో వాళ్లు వీళ్లు చెప్పిన మాటలు వినడం, వేరే వాళ్లకు వారి గర్భంలో వచ్చిన సమస్యలు వినడం, ఇంటర్నెట్ ఎక్కువగా వాడటం, అందులో ఉన్న కాంప్లికేషన్స్ తమకూ వస్తాయేమోని ఆందోళన, బిడ్డకి ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయం, బిడ్డని ఎలా చూసుకోవాలి, వంటి ఆలోచనలు, భయాలతో కూడా కొందరు డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. దీనివల్ల వీరు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, డల్‌గా ఉండటం, ఒంటరిగా ఉండటం, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోవడం, ఏడుపు రావడం, వంటి అనేక లక్షణాలు ఏర్పడుతుంటాయి. దీనివల్ల బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలో కూడా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి చికిత్సలో భాగంగా కౌన్సిలింగ్, కుటుంబ సభ్యుల సహకారం, భర్త ప్రేమగా తనతో మాట్లాడటం, సమయం కేటాయించడం, బయటకు తీసుకువెళ్లడం వంటివి చెయ్యడం వల్ల వీరు చాలావరకు డిప్రెషన్ నుంచి బయటపడతారు. అలాగే యోగా, మెడిటేషన్, నడక వంటివి చెయ్యడం వల్ల చాలావరకు డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. ఇన్ని విధాల ప్రయత్నించినా, ఉపశమనం లేనప్పుడు యాంటి డిప్రెసంట్స్ మందులు డాక్టర్ పర్యవేక్షణలో అతి తక్కువ డోస్‌లో కొద్దిగా రిస్క్ తీసుకుని వాడవచ్చు. నా వయసు 33. ముప్ఫై దాటాక పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఏడు నెలలకే గర్భం దాల్చాను. స్కానింగ్‌లో ఫెయింట్ ఫీటల్ అని రావడంతో అబార్షన్ చేశారు. మళ్లీ ఆరు నెలలకు గర్భం దాల్చాను. అప్పుడూ అంతే. రెండో అబార్షన్ తర్వాతి నుంచి కడుపులో నొప్పి వస్తోంది. మరో డాక్టర్ని కలిస్తే అబార్షన్ చేసినప్పుడు గర్భసంచికి గీత పడింది అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నాకు ఆరోగ్యకరమైన గర్భం ఎందుకు రావడం లేదు? నాకు బిడ్డ కావాలి. సలహా ఇవ్వండి.– రత్నం, అడ్డతీగల గర్భం గర్భసంచిలో మొదలయ్యి అందులో పిండం ఏర్పడుతుంది. ఆరు వారాలకు దాని గుండె కొట్టుకో వడం మొదలవుతుంది. కొందరికి హార్మోన్ల అసమ తుల్యత లేదా జన్యుపరమైన కారణాల వల్ల పిండం సరిగ్గా ఏర్పడదు. గర్భంలో పిండం పెరగదు. దీనినే ఆ జీజజ్టి ౖఠ్చిఝ అంటారు. కొందరిలో పిండం ఏర్పడు తుంది కానీ గుండె కొట్టుకోదు. లేదా కొన్నిరోజుల తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కొన్నిసార్లు అండం నాణ్యత సరిగ్గా లేకపోయినా, తల్లిదండ్రుల్లో జన్యు సమస్యలు ఉన్నా కూడా పిండం పెరగకపోవచ్చు. థైరాయిడ్‌తో పాటు ఇతరత్రా హార్మోన్ల సమస్య, అధిక బరువు, పీసీఓ, మధుమేహం, రక్తంలో యాంటీ ఫాస్పాలిపిడ్ యాంటిబాడీస్ వంటివి ఉన్నా కూడా మొదటి మూడు నెలల్లో పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు అవుతుంటాయి. అబార్షన్ చేసేటప్పుడు కొన్నిసార్లు గర్భసంచికి చిల్లుపడే అవకాశం ఉంటుంది. మీరు గీత పడింది అన్నదానికర్థం ఇదే అనుకుంటు న్నాను. అలాంటివి మెల్లగా మానిపోతాయి. కాకపోతే మళ్లీ వెంటనే గర్భం దాల్చకుండా కొన్ని నెలలు ఆగితే మంచిది. కొంతమందికి 30, 35 యేళ్లు దాటిన తర్వాత అండాల నాణ్యత తగ్గడం వల్ల కూడా పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు జరుగుతుంటాయి. బరువు ఎక్కు వుంటే తగ్గడానికి ట్రై చేయండి. రెండుసార్లు అబార్షన్ తప్పలేదు కాబట్టి మీలో ఇంకేమైనా సమస్యలున్నా యేమో తెలుసుకోవడం మంచిది. కాబట్టి ఇఆ్క, ఉ ఖ, ౖఎఖీఖీ, ఊ ఏ, ఖీ ఏ, అ్కఅ, ట. అ్కఖీఖీ పరీక్షలతో పాటు షుగర్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ టెస్టులు కూడా చేయించుకోండి. ఏదైనా తేడా ఉంటే ముందు నుంచే చికిత్స తీసుకుంటూ గర్భం కోసం ప్రయత్నించండి. అవసరమైతే భార్యాభర్తలిద్దరూ ఓ్చటy్టౌypజీnజ అనే జన్యుపరీక్ష చేయించుకుని, ఏవైనా జన్యు సమస్యలుంటే కౌన్సెలింగ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే గర్భం దాల్చ డానికి మూడు నెలల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున తీసుకోండి. - డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
పరి పరిశోధన
మూలకణాలతో క్యాన్సర్లకు వ్యాక్సిన్! ప్రాణాంతకమైన క్యాన్సర్‌పై పోరులో మనిషి కీలకమైన విజయం సాధించాడు. శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలతో రొమ్ము, ఊపిరితిత్తుల, చర్మ కేన్సర్లను అడ్డుకోగల వ్యాక్సిన్‌ను స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అంతేకాదు.. క్యాన్సర్ మళ్లీమళ్లీ తిరగబెట్టకుండా ఈ వ్యాక్సిన్ నిరోధించగలదని పశువులపై జరిపిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగు రోజుల వయసున్న పిండంలో ఉండే కణాలను పిండ మూల కణాలుగా చెబుతారు. ఎదిగిన తరువాత కొన్ని అవయవాల్లో అతితక్కువ మోతాదులో ఉండేవి ఇన్డ్యూస్డ్ ప్లూరీ పోటెంట్ స్టెమ్‌సెల్స్ అంటారు. స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు దాదాపు 75 ఎలుకల్లోకి ఈ ప్లూరీ పోటెంట్ మూలకణాలను ఎక్కించారు. రేడియోధార్మికత సాయంతో ఈ కణాలను చైతన్యరహితం చేసిన తరువాత శరీరంలోకి ఎక్కించినప్పటికీ రోగ నిరోధక వ్యవస్థ దీనికి స్పందించింది. నాలుగు వారాల్లో దీని ప్రభావం కనిపించడం మొదలైంది. దాదాపు 70 శాతం ఎలుకల్లో రొమ్ము కేన్సర్ కణాలను శరీరం తిరస్కరించగా.. మిగిలిన వాటిల్లో కణితుల సైజు బాగా తగ్గిపోయింది. ప్లూరీపోటెంట్ స్టెమ్‌సెల్స్‌కు, కేన్సర్కణాలకు సారూప్యతల కారణంగా రోగ నిరోధకవ్యవస్థ పూర్తిస్థాయిలో చైతన్యవంతమై కేన్సర్ కణాలపై దాడులు మొదలుపెట్టిందని శాస్త్రవేత్తల అంచనా. ప్లూరీ పోటెంట్ స్టెమ్సెల్స్లోకి మరిన్ని ఎక్కువ యాంటీజెన్లను జొప్పించి వ్యాక్సిన్‌ను తయారు చేస్తే రోగ నిరోధక వ్యవస్థలోని టి–కణాలు మరింత ఎక్కువ ప్రభావం చూపుతాయని.. తద్వారా క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. సౌరశక్తితో రికార్డు! సూర్యుడి నుంచి భూమ్మీదకు వచ్చే శక్తి మొత్తాన్ని ఒడిసిపట్టుకోగలిగితే పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ల అవసరం అస్సలు ఉండదన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ స్థాయిలో శక్తిని విద్యుత్తుగా మార్చేందుకు తగిన టెక్నాలజీ, పదార్థాలు మనకు అందుబాటులో లేవంతే! అయితే... ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో హానెర్జీ అనే కంపెనీ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. అత్యంత పలుచగా ఉంటూనే పడిన సూర్యకాంతిలో 25.1 శాతాన్ని విద్యుత్తుగా మార్చే కొత్త తరం సోలార్ ప్యానెల్స్‌ను ఈ కంపెనీ అభివృద్ధి చేసింది. డ్రోన్లు మొదలుకొని అనేక ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు బ్యాటరీల అవసరమే లేకుండా చేయగల పరిణామం ఇది. గాలియం ఆర్సనైడ్ పదార్థంతో తయారైన ఈ కొత్త ప్యానెల్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇదేరకం సోలార్‌ప్యానెల్స్ కంటే రెండు రెట్లు ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేయడం విశేషం. పలుచగా ఉండటం.. కావాల్సిన విధంగా మడత పెట్టేందుకు అనువుగా ఉండటం తదితర కారణాల వల్ల ఈ హానెర్జీ ప్యానెల్స్‌ను బ్యాక్‌ప్యాక్‌లు మొదలుకొని బస్సు, కార్లపైకప్పుల వరకూ ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకుని విద్యుత్తు పొందవచ్చునని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. నిజానికి హానెర్జీ యూరోపియన్ కారు తయారీ సంస్థలతో ఈ రకమైన ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటోంది. అతుక్కుంటాయి.. వివరాలిస్తాయి! ఐసీయూలో ఉన్న రోగిని మీరెప్పుడైనా చూశారా? ఒళ్లంతా కప్పేసిన తీగలు, సెలైన్, ఇతర గొట్టాలతో కనిపిస్తారు వారు. అత్యవసర పరిస్థితుల్లో శరీరం తాలూకూ స్పందనలన్నింటినీ గుర్తించేందుకు ఈమాత్రం ఏర్పాట్లు అవసరం. ఇకపై మాత్రం కాదు. ఎందుకంటారా? ఫొటోలో కనిపిస్తోందే.. అలాంటి స్టిక్కర్లతోనే గుండెకొట్టుకునే వేగం మొదలుకొని రకరకాల వివరాలను సేకరించేందుకు నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జాన్ ఎ.రోజర్స్ వినూత్నమైన టెక్నాలజీలను సిద్ధం చేస్తున్నారు. శరీరం కదలికలకు తగ్గట్టుగా కదులుతూనే వివరాలు సేకరించగల ఈ వినూత్నమైన వేరబుల్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఐసీయూలో మాత్రమే కాదు.. దీర్ఘకాలికవ్యాధి తరువాత కోలుకునే క్రమంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది. కండరాల కదలికలు, గుండె పనితీరు, నిద్ర తాలూకూ నాణ్యత వంటి అనే విషయాలను వైద్యులకు తెలియజేయగలవు ఈ స్టిక్కర్లు. గొంతు వద్ద అతికించుకునే స్టిక్కర్... రోగులు ఆహారాన్ని సక్రమంగా మింగ గలుగుతున్నారా, లేదా? అతడి స్వరపేటిక ఎలా పనిచేస్తోంది? వంటి అంశాలను కూడా గుర్తించగల సెన్సర్లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగించే మైక్రోఫోన్ల కంటే ఇవి చాలా మెరుగైన ఫలితాలిస్తాయని రోజర్స్ అంటున్నారు. రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత కూడా వీటిని వాడుతూ ఉండవచ్చునని, ఎప్పటికప్పుడు వివరాలు డాక్టర్ల కంప్యూటర్లు లేదా స్మార్ట్ఫోన్లలో నమోదవుతూ ఉంటాయని వివరించారు. కాలేయ వ్యాధికి కార్బోహైడ్రేట్లు తక్కువ ఉన్న ఆహారం మేలు! కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవలి కాలంలో అనేక పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలోనూ ఈ రకమైన ఆహారం ఎంతో మేలు చేస్తుందని గుర్తించారు కేటీహెచ్ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ శాస్త్రవేత్తలు. మద్యంతో సంబంధం లేని రకమైన ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్న కొందరు ఊబకాయులకు రెండు వారాల పాటు తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం అందించినప్పుడు వారి జీవక్రియలతోపాటు కడుపు/పేవుల్లోని బ్యాక్టీరియాలోనూ తేడాలు కనిపించాయని ఈ రెండు పరిణామాలు కాలేయంలోని కొవ్వు తగ్గేందుకూ దోహదపడ్డాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త మార్డినోగీ తెలిపారు. కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం శరీరంలో ప్రమాదకరమైన హెపాటిక్ కొవ్వుల ఉత్పత్తి ప్రక్రియపై ప్రభావం చూపిందని, బి విటమిన్ల మోతాదుతోపాటు ఫోలిక్ యాసిడ్లను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఎక్కువైందని వివరించారు. ఈ రకమైన ఆహారం బరువు తగ్గేందుకు, గుండెజబ్బుకు దారితీసే ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని చెప్పారు. అయితే శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న వారు ఆహారపు అలవాట్లను మార్చుకునే ముందు వైద్యులను సంప్రదించడం మేలని సూచించారు. పరిశోధన వివరాలు సెల్ మెటబాలిజం తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
డిన్నర్‌కు ముందు ఇవి తీసుకుంటే మేలు
లండన్ : కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని ఉదయం కాకుండా సాయంత్రం తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. డిన్నర్‌కు ముందు కార్బోహైడ్రేట్స్‌ను తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయని తేల్చారు. బ్రేక్‌ఫాస్ట్‌తో పోలిస్తే సాయంత్రం వీటిని తీసుకోవడమే మంచిదని చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ భారీగా తీసుకుని లంచ్, డిన్నర్లను మితాహారంతో ముగిస్తే మేలనే సూచనలకు విరుద్ధంగా యూనివర్సిటీ ఆఫ్ సర్రే పరిశోధకులతో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ మైఖేల్ మోస్లే కార్బోహైడ్రేట్లను సాయంత్రం తీసుకోవాలని సూచించారు.పాస్తా, బ్రెడ్ వంటి ఆహారాన్ని ఉదయం అల్పాహారంగా తీసుకునే బదులు రాత్రి వేళల్లో తీసుకుంటే మంచిదని మోస్లే పేర్కొన్నారు. కార్బోహైడ్రేట్లను రోజు ప్రారంభమయ్యే సమయంలో తీసుకుంటే అవి విడుదల చేసే గ్లూకోజ్‌ను కరిగించేందుకు ఎక్కువ సమయం ఉంటుందని ఉదయాన్నే వీటిని తీసుకోవాలని గతంలో నిపుణులు సూచించేవారు. బీబీసీలో ప్రసారమైన తాజా అథ్యయనం కార్బోహైడ్రేట్స్‌ను ఉదయంతో పోలిస్తే సాయంత్రం తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనూహ్యంగా పెరగడం లేదని వెల్లడించింది. అయితే కార్బోహైడ్రేట్లను మితంగా తీసకుంటూ ప్రతి మీల్లో వాటిని ఎక్కువగా చొప్పించకుండా చూసుకోవాలని డాక్టర్ మోస్లే సూచించారు. -
హెల్త్ టిప్స్
రోజులో మూడుసార్లు హెవీగా తినడానికి బదులు రోజుకి ఐదారుసార్లు కొద్దికొద్దిగా తినడం మంచిది. ప్రతి భోజనానికి మధ్యలో రెండు మూడు గంటలు విరామం ఇవ్వాలి. దీని వల్ల మెటబాలిజం వేగవంత మవు తుంది. తద్వారా ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. ఆహారంలో 65 నుంచి 70 శాతం కార్బోహైడ్రేట్స్, 15 నుంచి 20 శాతం ప్రొటీన్స్, 10 నుంచి 15 శాతం ఫాట్స్ ఉండేలా చూసుకోవాలి. తినేటప్పుడు బాగా నములుతూ మెల్లిగా తినాలి. ఇలా చేయడం వల్ల దేహానికి తగినంత ఆహారం కడుపులో చేరగానే మెదడు నుంచి ఇక చాలనే సంకేతాలు జారీ అవుతాయి. ఆహారం పరిమాణం తగ్గుతుంది. -
హెల్త్ టిప్స్
పండ్లలో రారాజైన మామిడి వేసవిలో మన ఇంట విడిది చేస్తుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని పంచే ఔషధ గుణాలెన్నో మామిడిలో ఉన్నాయి. మామిడిపండులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో, కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయి. పిండి పదార్థాలు, కొవ్వు తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగరు. రోజుకో మామిడిపండు తింటే వేసవి తాపం, నీరసం తగ్గడమే కాకుండా అజీర్తి సమస్యలు దరిచేరవు. ఇందులో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), ఇ, సెలీనియం ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు. దీనిలో అధికమోతాదులో ఐరన్ ఉంటుంది కనుక గర్భిణులు మామిడిపండును రోజూ తీసుకోవాలి. దీని వల్ల రక్త హీనత తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. -
నువ్వూ...నేనూ...నూనె...!
పురుషులందు పుణ్యపురుషుల్లాగే నూనెల్లో మంచినూనెలు వేరు. ఉప్పు కప్పురమ్ము లాగే అమాయకంగా కనిపించే కొవ్వులూ ఉన్నాయి. టేస్టు కోసమే చూసుకుంటే... ఫ్రయ్ లోంచి పొయ్యిలోకి దూకేసినట్లు అనుకుంటారు చాలా వుంది. రోస్ట్లతో ఎందుకీ రొష్టు అనుకొని హేస్టీ నిర్ణయంతో నూనె వస్తువులనే ముట్టరు కొందరు. అసలు నూనె వాడకపోవడం మంచిదేనా? కానే కాదు. శరీరానికి నూనె అవసరం. అవసరమైనంత నూనెను తీసుకుంటూనే ఆరోగ్యం కాపాడుకునే వూర్గాలు ఉన్నాయా? ఉన్నాయి. కాకపోతే మోతాదు మించనివ్వకూడదంతే. ఆ మోతాదేమిటో, నూనె వాడినా కొవ్వు చేరకుండా జాగ్రత్తలెలాగో తెలుసుకునేందుకే ఈ కథనం... నారు పెరగడానికి నీరు ఎలాగో, కూరా, నారా, చారూలో రుచి పెరగడానికి నూనె అలాగ. తాలింపు నుంచి వేయింపు వరకు తన ప్రాధాన్యం చూపుతుంది. కిచిడీ నుంచి పచ్చడి వరకూ మటన్ నుంచి చికెన్ వరకు కిచెన్‌ను శాసిస్తుంది. అయితేనేం... నూనెకు నిత్యం నీలాపనిందలు. కమ్మదనాన్ని పెంచినా కోప్పడేవారే ఎక్కువ... జబ్బులన్నింటికీ కారణం అదేనంటూ. మనిషి బతకడానికి ఆహారంలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఖనిజాలూ, విటమిన్లతో పాటూ కొవ్వులూ కావాల్సిందే. మిగతావాటన్నింటికీ బోల్డ్డంత గౌరవం ఒక్క నూనెలకు తప్ప. వుహా అదొక్కటే ఆరోగ్యాన్ని పాడుచేసేట్లు అవవూనాలూ, ఆడిపోసుకోవడాలు. అది నిజమేనా? నూనెను నిరసించాల్సిందేనా? ఆరోగ్యం చెడిపోనివిధంగా నూనెల్ని ఉపయోగించుకోలేవూ?... తప్పక ఉపయోగించుకోవచ్చు. శరీరంలో కొవ్వులు పెరక్కుండా కాపాడుకోవచ్చు. అవసరం కూడా... శరీర నిర్వహణకు అన్ని పోషకాలూ అవసరమైన పాళ్లలో కావాలి. అదే సమతులాహారం. ఓ ఆరోగ్యకరమైన వ్యక్తి తన ఆహారంలో 55% కార్బోహైడ్రేట్లు, 25%ప్రోటీన్లు, 20% కొవ్వులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమతౌల్యంలో ఏది లోపించినా అది మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతుంది. అందుకే శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు సవుకూరేందుకు నూనెలు తీసుకొని తీరాల్సిందే. కాకపోతే అవసరమైన మోతాదుకు మించనివ్వకూడదు. పైగా అవి 20% కావాలంటే వాటి ప్రాధాన్యం ఎంతో గుర్తించి తీరాల్సిందే. నూనెల రకాలివి... శరీరానికి కొవ్వులను సవుకూర్చే నూనెలు 3 రకాలు. శాచురేటెడ్: సాధారణంగా ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఘనరూపంలో ఉంటాయి. తెల్లగా అవూయికంగా కనిపిస్తుంటాయి. అయితే కనిపించేంత అవూయికం కావవి. టేస్టీగా ఉన్నా కాస్తంత ఖతర్నాకే. అవే... నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, పామోలిన్ ఆయిల్. (వాటితోపాటు పత్తిగింజల నుంచి తీసే నూనె కూడా శాచురేటెడ్ ఆయిలే. ఇది చాలా చవక కాబట్టి ఎక్కువ వుంది వాడుతుంటారు.) హైడ్రోజనేటెడ్: నెయ్యిలాంటి స్వాభావిక పదార్థాలను కృత్రివుంగా తయారు చేయడం కోసం ఈ ప్రక్రియ ద్వారా నూనెలు చేస్తారు. ఉదాహరణకు డాల్డా, వూర్జరిన్ వంటివి. (చిప్స్ వంటివి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే హైడ్రోజనేటెడ్ ఆయిల్స్‌లో వేయిస్తారు. పదార్థాలకు ఎక్కువ షెల్ఫ్‌లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి). అన్‌శాచురేటెడ్: ఇందులో వుళ్లీ రెండు రకాలు ఉన్నాయి. మెుదటివి పాలీ అన్‌శాచురేటెడ్ నూనెలు. సంక్షిప్తంగా ‘ప్యూఫా’ అంటారు. ఇవి పొద్దుతిరుగుడు నూనె, కుసువు నూనె (సాఫ్ ఫ్లవర్ ఆయిల్) వంటివి. రెండో రకం నూనెలు మోనో అన్‌శాచురేటెడ్ ఆయిల్స్. సంక్షిప్తంగా ‘వు్యూఫా’ అంటారు. నువ#్వల నూనె, సోయాబీన్ నూనె, ఆలివ్ ఆయిల్... (వీటన్నింటిలోనూ ఆలివ్ ఆయిల్ వుంచిదంటారు నిపుణులు) ఇవన్నీ వు్యూఫా ఆయిల్స్. నిజంగానే ప్రమాదమా..?: కానే కాదు. పైగా వుుందుగా చెప్పినట్లు శరీరంలోని కీలక అవయవాల పరిరక్షణకు అవసరం కూడా. వునలోని కాలేయం కొన్ని కొవ్వులను తయారుచేస్తుంది. అందులో కొలెస్ట్రాల్ ఒకటి. కానీ ఈ ప్యూఫా, మన శరీరంలో తయారుకావలి. కాబట్టి శరీరానికి అవసరమైనవాటిగా ఈ నూనెల్ని ఆహారంలో తీసుకోక తప్పదు. ఇవి తీసుకోక తప్పదు కాబట్టే వీటిని ‘ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్’ అని కూడా అంటారు. పైగా విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ... వంటి కొన్ని విటమిన్లు శరీరంలోకి అబ్జార్బ్ కావాలంటే నూనెలు తీసుకోక తప్పదు. వాటిని ‘ఎసెన్షియల్’ అంటున్నావుంటే అవెంత అవసరమైనవో తెలియడం లేదూ! ఇక చేపల నుంచి అందే నూనెల్లో, అవిసె గింజల నూనెలో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటితో సుదీర్ఘకాలం ఆరోగ్యంతో పాటు వయసు కనపడకపోవడం వంటి సుగుణాలు ఉంటాయి. అందుకే వూంసాహారం తినేవారైతే వారానికి కనీసం వుూడు, నాలుగు రోజులు చేపలను సిఫార్సు చేస్తుంటారు ఆహారనిపుణులు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి... ఇలా! నూనెలు ఎక్కువగా తీసుకుంటే అవి కొవ్గా వూరి రక్తనాళాల్లో పేరుకుపోతాయన్న విషయం తెలిసిందే. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో ఈ కవ్వు పేరుకుని గుండె కండరానికి రక్తం సరఫరా కాకపోతే గుండెపోటు వచ్చే ప్రవూదం ఉంటుంది. రక్తపోటూ పెరుగుతుంది. ఇలాంటి ప్రవూదాలెన్నో ఉన్నాయి. అయితే మరోపక్క అవి అత్యవసరం కూడా. మరెలా? అందుకే ప్యూఫా, లను ఒకదానిపై ఒకటి నిఘా ఉంచేలా చేస్తే సరి అంటున్నారు నిపుణులు. శరీర అవయవాలన్నింట్లోనూ వీవీఐపీ గుండె. అంతటి వీఐపీకి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను ఉంచితే సరి. ‘ప్యూఫా, మ్యూఫా’ నూనెలు రెంటినీ తీసుకుంటే వీవీఐపీ లాంటి గుండెకు రక్షణగా ఉంటాయవి. ప్యూఫా (పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) నూనెలైన పొద్దుతిరుగుడు లేదా కుసుమ నూనెలను ఓ పూట తీసుకోవాలి. వురో పూట వు్యూఫా (మోనో అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) నూనెలైన ఆలివ్ లేదా వేరుసెనగ నూనెలను తీసుకోవాలి. షిఫ్ట్ డ్యూటీల్లో ప్యూఫా, మ్యూఫా: ఈ ప్యూఫా, మ్యూఫాలను ఉదయం ఒక వెరైటీ నూనె ఉపయోగిస్తే, సాయంత్రం మరోటి ఉపయోగించాలి. అలా కాకపోతే ఒక నెలంతా ప్యూఫా ఉపయోగిస్తే, వురో నెలలో వు్యూఫా వాడాలన్నవూట. అంటే... ఒకనెల పొద్దుతిరుగుడు నూనె తీసుకుంటే మరో నెల వేరుశెనగ నూనె వాడాలి. దాంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది. ఇలా ఉదయం, సాయంత్రం, ఓ నెల అదీ, వురో నెల ఇదీ అంటూ పూట షిఫ్టుల్లోగానీ, నెల, నెలా షిఫ్టుల్లోగానీ ఈ ప్యూఫా, మ్యూఫాలను ఉపయోగిస్తే వీవీఐపీ అయిన గుండె థిలాసా అన్న భరోసా మీ సొంతం. రౌడీ బాబాయిలతో రవ్వంత జాగ్రత్త... ఎలాగూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా అని హృదయాన్ని రఫ్ ఆడించే రౌడీలను లోనికి పంపడం సరికాదు కదా. అలాగే ఆరోగ్యం కోసం ప్యూఫా, మ్యూఫా తీసుకుంటున్న ధీమాతో నెయ్యీ, వెన్న, మీగడలను తీసుకోవద్దు. గుండెకు హాని చేసే రౌడీబాబాయిలివి. బంధం విషయంలో బాబాయిల్లా – రుచి విషయంలో శాచురేటెడ్ ఆయిల్స్ అయిన నెయ్యి, వెన్న, మీగడలు కమ్మగా ఉంటాయి. మెత్తగా ఉంటూనే గుండెలు కోసే టైపు అవి. నిజానికి ప్యూఫా నూనెలు శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బ్యారికేడ్లా అడ్డుకుంటాయి. రక్తనాళాలనుంచి కొలెస్ట్రా్టల్ కవ్వును శుభ్రం అయ్యేలా చేస్తుంటాయి. అయితే ప్యూఫా ఎలాగూ కొలెస్ట్రాల్‌ను బయటకు పంపేస్తుంది కదా అని నెయ్యి, వెన్న, మీగడలు తీసుకుంటుంటే... ప్యూఫా నూనెలు కొలెస్ట్రాల్ శుభ్రపరిచే వేగం కంటే శాచురేటెడ్ కొవ్వుల వల్ల శరీరంలో పేరుకుపోయే కొవ్వు ఎక్కువ. పరిమితి ఎంత...? నూనెలు ఎక్కువైనా ప్రమాదం. అందుకే మోతాదు మించనివ్వకూడదు. మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల సంఖ్యను బట్టి మీరు ఉపయోగించే నూనె ఎక్కువా? తక్కువా అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. తల ఒక్కంటికి నెలకు 500 ఎంఎల్ నూనె వాడితే మంచిది. అంటే... ఐదుగురు సభ్యులున్న ఇంట్లో నెలకు రెండున్నర లీటర్ల నూనె సరైన వినియోగం అన్నమాట. ఇవీ ప్రమాదాలు...: ఆహార పదార్థాలను బాగా ఫ్రై చేసి ఉపయోగించేందుకు నూనెలు వాడుతుంటారు. నిజానికి బాగా ఫ్రై చేయడం వల్ల ఆహారంలోని పోషకాలు వెళ్లిపోతాయి. దాంతో ప్రయోజనం లేదు. పైగా ఆలివ్ ఆయిల్ వంటి నూనెల్లోని రసాయన బంధాలు వేడి చేయడం వల్ల త్వరగా విడిపోతుంటాయి. అందుకే ఆలివ్ ఆయిల్‌తో డీప్ ఫ్రైస్ చేసుకోవద్దు. మరోవూట... ప్యూఫా, వు్యూఫాలను విడివిడిగానూ వాడుకోవాలి. రెండూ ఉపయోగిస్తే మంచిది కదాని రెండూ కలిపి ఉపయోగించవద్దు. ఎందుకంటే... వేడిచేసే సవుయంలో వాటి వాటి స్మోకింగ్ పాయింట్స్ వేర్వేరుగా ఉంటాయి. అందుకే దేనికదే వాడాలి. ఓసారి ఫ్రై చేయడం కోసం కాచిన నూనెను వురోవూరు ఉపయోగించకూడదు. మెుదటిసారి కాచిన నూనె వురోవూరు ఉపయోగిస్తే అది క్యాన్సర్ కారకం (కార్సినోజెనిక్) అవ#తుంది. కాబట్టి వాటిని పారేయడమే వుంచిది. కత్తికి రెండువైపులా పదునులాగే నూనెల విషయంలోనూ అంతే. కత్తిలాగే నూనె కూడా నిత్యావసరమే. అందుకే విచక్షణతో, జాగ్రత్తతో వాడుకుంటే అదెంతో రుచే కాదు... ఆరోగ్యం కూడా. ఎలాగూ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు కదా అని గుండెను రఫ్ ఆడించే రౌడీలను లోనికి పంపడం సరికాదు కదా. అలాగే ఆరోగ్యం కోసం ప్యూఫా, మ్యూఫా తీసుకుంటున్న ధీమాతో నెయ్యి, వెన్న, మీగడలను తీసుకోవద్దు. గుండెకు హాని చేసే రౌడీబాబాయిలివి. – యాసీన్, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఓట్స్ ముస్లీ
హెల్దీ ట్రీట్ కావలసినవి: ఓట్స్ – 1 కప్పు నీరు – 2 కప్పులు ఆపిల్ – 1 నిమ్మరసం – 2 టీ స్పూన్లు కిస్మిస్ – 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు – 1 టేబుల్ స్పూన్ పాలు – 1 కప్పు తేనె – 2 టీ స్పూన్లు తయారి: 1. రాత్రి ఓట్స్‌ని నీళ్ళలో నానబెట్టాలి. 2. ఉదయాన ఆపిల్ పై తొక్క తీసి ముక్కలుగా కట్‌చేసి, ముక్కలకు బాగా అంటేలా నిమ్మరసం వేసి కలపాలి. 3. తర్వాత ఇందులో కిస్మిస్, వేరుశనగపప్పు, మెత్తగా అయిన ఓట్స్ వేసి కలపాలి. 4. పాలు పోసిన తర్వాత పైన తేనె వేసి పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వాలి. నోట్: పిల్లలకు సరైన పోషకాహారం అందించాడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఓట్స్‌లో కొవ్వుపదార్థాలు ఉండవు. కార్బోహైడ్రేట్లు, కాల్షియం, విటమిన్లు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉన్న ఈ అల్పాహారం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. ఈవెనింగ్ స్నాక్‌గాను తీసుకోవచ్చు. ద్రాక్ష, స్ట్రాబెర్రీ, అరటిపండ్లనే కాదు పాలు కూడా ఇష్టప్రకారం వాడుకోవచ్చు. -
కార్బోరన్
జీవితాన్ని పరుగులు తీయించే కార్బోహైడ్రేట్స్ జీవితం పరుగెత్తాలంటే శక్తి కావాలి. రోజంతా ఇంటిపని చేయాలంటే శక్తి కావాలి. ఆఫీస్‌లో దౌడు తీయాలంటే శక్తి కావాలి. పరుగులు తీసే పిల్లల కోసం... పరుగెత్తుతున్న ఆశల కోసం... అంతెందుకు... పరుగెడుతున్న బస్సు పట్టుకోవడం కోసం... శక్తి కావాలి. జీవితాన్ని పరుగులు తీయించే శక్తి కావాలి. ఆ శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్ మంచిదా? కాదా..? మనిషి చక్కగా పనిచేయడానికి కావాల్సిన మూడు సూక్ష్మపోషకాల్లో కార్బోహైడ్రేట్స్ ఒకటి. (మిగిలిన రెండు.. ప్రొటీన్స్, ఫ్యాట్స్). ఒక వాహనం నడవడానికి పెట్రోల్ ఎంత అవసరమో మన శరీరం అనే బండి నడవడానికీ కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు)అనే ఇంధనం అంతే అవసరం. మనం తీసుకున్న ఆహారాన్ని మన నోరు, కడుపు, పేగుల్లోని ఎంజైమ్‌లు చక్కెర్లుగా మారుస్తాయి. తర్వాత ఇవి గ్లూకోజ్‌గా మారుతాయి. రక్తప్రసారం ద్వారా ఇది మన శరీరానికి కావల్సిన శక్తినిస్తుంది. శ్వాస తీసుకోవడం దగ్గర్నుంచి మనం చేసే శారీరక వ్యాయామాల వరకు ఏ పని చేయాలన్నా గ్లూకోజ్ అనే శక్తి కావాల్సిందే. ఈ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ వల్ల రావాల్సిందే. శరీరానికి కావల్సిన ఎనర్జీ కాక, మెదడు కావాల్సిన శక్తిని అందించే పనీ ఇదే చేస్తుంది. మెదడు సక్రమంగా తన విధులు నిర్వర్తించాలంటే రక్తంలో తగు మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉండాల్సిందే. కావల్సినన్ని కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే వీక్ అవుతారు. నీరసంగా ఉంటుంది. డ్రౌజీగా అనిపిస్తుంది. తలనొప్పి వస్తుంది, మలబద్దకంతో బాధపడ్తారు (ఫైబర్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకపోతే). డయేరియా బారిన పడ్తారు. అంతేకాదు చిన్న చిన్న పనులూ కష్టంగా తోస్తాయి. ఏకాగ్రత నిలవదు. పిండి పదార్థాలే కదా అని కొట్టిపారేసి శరీరానికి అందివ్వకపోతే పిండిలా మారిపోతామన్నమాట. కార్బోహైడ్రేట్స్... రకాలు షుగర్, స్టార్చ్, ఫైబర్.. అనే మూడు రకాల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. నిత్యం మన ఆహారంలో ఈ మూడు రాకాలూ ఉండాల్సిందే. మోతాదు మించకుండా వీటిని ఆరగించాల్సిందే! షుగర్‌ను సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు. స్టార్చ్, ఫైబర్‌ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌గా పిలుస్తారు. సింపుల్ కార్బోహైడ్రేట్స్ సింపుల్ షుగర్స్ లేదా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఒకటి, రెండు చక్కెర పరమాణువులను మాత్రమే కలిగి ఉంటాయి. కాబట్టి సింపుల్ కార్బోహైడ్రేట్స్ నోరు, కడుపు, పేగుల్లోని ఎంజైముల ద్వారా వెంటనే జీర్ణమై గ్లూకోజ్‌గా మారుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. దీనివల్ల తక్షణ శక్తి తప్ప ఇంకెలాంటి పోషకాలూ శరీరానికి అందవు. దాంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అధిక బరువుకూ కారణమవుతాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్‌కి ఉదాహరణ..పాలిష్డ్ ధాన్యాలు, పంచదార, పాలు, బ్రెడ్, కుకీస్, కేక్ వంటివి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్.. స్టార్చ్, ఫైబర్ (పీచు పదార్థం) అనే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎన్నో చక్కెర పరమాణువుల సమ్మిళితం. కాబట్టి వెంటనే జీర్ణం కావు. నెమ్మదిగా జీర్ణమవుతాయి. అందుకని ఇవి గ్లూకోజ్‌లా మారడానికీ టైమ్ పడుతుంది. దీంతో రక్తంలో చక్కెర వేగంగా కాక నెమ్మదిగా ఓ క్రమపద్ధతిలో విడుదల అవుతుంది. చక్కెర నెమ్మదిగా విడుదలవడమే ఆరోగ్యానికి మేలు. అంతేకాదు స్లో డెజైషనే దీర్ఘకాల శక్తినిస్తుంది. ఆకలిని ఆలస్యం చేస్తూ బరువునూ కంట్రోల్లో ఉంచుతుంది. తద్వారా చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ పడుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లోని స్టార్చీ ఫుడ్‌కి ఉదాహరణ.. బఠాణీలు, బీన్స్, మొక్కజొన్నలు, పాస్తా, బియ్యం, బంగాళదుంపలు, ఇంకా ఇతర ధాన్యాలు. ఇవి మనిషికి కావల్సిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను అందిస్తాయి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌లో ఫైబర్ ఫుడ్‌కి ఉదాహరణ.. పొట్టు ధాన్యాలు (బ్రౌన్ రైస్, హోల్ వీట్గ్రైన్స్ వంటివేవైనా), ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు, బ్రకోలి(కాలిఫ్లవర్ లాంటిదే గ్రీన్‌కలర్‌లో ఉంటుంది), కాలిఫ్లవర్, టమాటాలు, ఉల్లి,వెల్లుల్లి, మిరియాలు, మామిడి, కివి, దానిమ్మ వంటి ముదురు రంగులో ఉన్న పళ్లు. ఈ ఫైబర్ ఫుడ్ మలబద్దకాన్ని నివారిస్తుంది. కొలొన్, కడుపు, పేగులకు వచ్చే కాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది. అదే సమయంలో కార్డియోవ్యాస్క్యులర్ జబ్బులనూ దూరంగా ఉంచుతుంది. కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్స్ ...ఈ మూడు సూక్ష్మ పోషకాలు అని చెప్పుకున్నాం కదా. ఈ మూడూ తగు పాళ్లలో ఉంటేనే ఆరోగ్యం. ఏ రెండు ఎక్కువై ఒకటి తక్కువైనా కష్టమే. ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే క్యాన్సర్, ఒబేసిటీకి దారితీస్తాయి. అలాగే కార్బోహైడ్రేట్స్ సాయం లేనిదే ప్రొటీన్స్ రక్తంలో ప్రయాణం చేయలేవు. అంతేకాదు ఒంట్లో తగినన్ని కార్బోహైడ్రేట్స్ లేనప్పుడు శరీరం తనకు కావల్సిన శక్తిని ప్రొటీన్స్ నుంచే తీసుకుంటుంది. పొట్టు ధాన్యాలన్నీ కేవలం ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్‌నే కాదు, పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌నీ కలిగి ఉంటాయి. పచ్చని కూరగాయలు, పళ్లు వీటికి చక్కటి ఉదాహరణ. ఎవరికి ఎంత మోతాదులో కార్బోహైడ్రేట్స్.. సాధారణంగా ఏ కార్బోహైడ్రేట్స్ అయినా గ్రాముకి నాలుగు కేలరీల శక్తినిస్తాయి. పోషకవిలువలున్న ఆహార పదార్థాల నుంచి కార్బోహైడ్రేట్స్‌ని తీసుకుంటే మరీ మంచిది. శక్తితో పాటు ఆరోగ్యమూ చేకూరుతుంది. ఎవరు ఎంతెంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అనేది వాళ్ల వాళ్ల వయసు, ఎత్తు దానికి తగ్గ బరువు (వెయిట్ మానేజ్మెంట్), శారీరక శ్రమను బట్టి ఉంటుంది. డేంజరస్ లో కార్బోహైడ్రేట్స్ డైట్ చాలా డేంజరస్ డైట్. శరీరానికి కార్బోహైడ్రేట్స్ అందకపోతే శరీరంలో తగు మోతాదులో కొవ్వు తయారవదు. ఇది కెటోసిస్కి దారితీస్తుంది. కెటోసిస్ అధిక మోతాదులో యూరిక్‌యాసిడ్, హైపర్యురిసేమియాను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి, ఇతర కిడ్నీ వ్యాధులు, గౌట్, రక్తపోటు, గుండె జబ్బులు, కొలొన్ క్యాన్సర్ వంటి ప్రమాదాలనూ తెచ్చి పెడుతుంది. ఎక్కువైతే.. గ్లూకోజ్‌గా మారిన కార్బోహైడ్రేట్స్.. శరీరానికి కావల్సిన శక్తినిచ్చి మిగిలినది గ్లైకోజెన్‌గా లివర్, కండరాల్లో నిల్వ ఉంటుంది. ఇంకా మిగిలినది కొవ్వుగా మారి అడిపోజ్ టిష్యూగానిల్వవుతుంది. అన్రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇవి చాలా మంచివి. ఎందుకంటే వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. ఇవి కూరగాయలు, పళ్లు మొదలైన వాటిల్లో ఉంటాయి. ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్‌ను నివారిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండె, ఎముకలను పటిష్టపరుస్తాయి. పిల్లలు: పిల్లల శక్తికి ప్రధాన కారకాలు కార్బోహైడ్రేట్సే. అందుకే పిల్లలకు ప్రతి రోజూ రకరకాల కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం ఇవ్వాలి. ఏదైనా ఆనారోగ్య సమస్య ఉండి డాక్టర్ సూచిస్తే తప్ప పిల్లలకు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం ఇవ్వకూడదు. రెండేళ్ల పైబడ్డ పిల్లలందరికీ ప్రతి రోజు కనీసం 130 గ్రాముల కార్బోహైడ్రేట్స్నివ్వాలి. అయితే ఇదీ పిల్లలు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారన్నదానిబట్టే ఉంటుంది. ఉదాహరణకు రెండేళ్ల పిల్లాడు 12 వందల కేలరీలు తీసుకుంటుంటే ఆ పిల్లాడికి 135 నుంచి 195 గ్రాములు కార్బోహైడ్రేట్స్ అవసరమవుతాయి. ఆరేళ్ల పాప... 16 వందల కేలరీలు తీసుకుంటుంటే గనక ప్రతి రోజు ఆ అమ్మాయికి 180 నుంచి 260 గ్రాముల కార్బోహైడ్రేట్స్ కావాలి. స్త్రీలు వయసు తీసుకోవాల్సిన కార్బోహైడ్రేట్స్ 20 పైబడ్డవాళ్లు 45 నుంచి 65 గ్రాములు టీనేజర్స్ 225 నుంచి 325 గ్రాములు (ఇందులో 25 గ్రా. ఫైబర్ కచ్చితంగా ఉండాలి) పురుషులు 20 పైబడ్డవాళ్లు 180 నుంచి 270 గ్రాములు టీనేజర్స్ 225 నుంచి 325 గ్రాములు (ఇందులో 38 గ్రా. ఫైబర్ కచ్చితంగా ఉండాలి. -
డయాబెటిస్ కౌన్సెలింగ్
మా పెద్దమ్మకు 67 ఏళ్లు. ఆమె చాలా కాలంగా డయాబెటిస్ టాబ్లెట్లు తీసుకుంటున్నారు. ఒకరోజు స్పృహతప్పి పడిపోతే హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. డాక్టర్లు ఆమెకు రక్తంలో షుగర్ పాళ్లు తగ్గాయని చెప్పారు. షుగర్ రోగులలో రక్తంలో చక్కెర పాళ్లు అధికంగా ఉంటాయి కదా? ఇలా షుగర్ తగ్గడం కూడా జరుగుతుందా? - సుధీర్, కర్నూల్ వృద్ధులలో తాము వాడాల్సిన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో చక్కెరను నియంత్రించే మాత్రలు వాడినప్పుడు ఒక్కోసారి వాళ్ల రక్తంలో చక్కెర పాళ్లు గణనీయంగా పడిపోవచ్చు. ఈ కండిషన్‌ను హైపోగ్లైసీమియా అంటారు. దీనివల్ల మత్తుగా ఉన్నట్లుండటం, బలహీనత, భ్రాంతులు, అయోమయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల వల్ల వృద్ధులు పడిపోతే ఎముకలు విరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో వారిని తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలి. డయాబెటిస్ రోగులను మామిడి, అరటి, సపోటా వంటి పండ్లు తినవద్దంటారు. నాకు ఇటీవలే డయబెటిస్ వచ్చింది. నేనెప్పటికీ ఆ పండ్లు తినకూడదా? - జగన్నాథరావు, అనకాపల్లి మామిడి, అరటి, సపోటా వంటి పండ్లలో చక్కెర పాళ్లు అధికంగా ఉంటాయి. అంతమాత్రాన డయాబెటిస్ ఉన్నవారు ఆ పండ్లు తినకూడదనేది అపోహ మాత్రమే. మనం తినే పిండిపదార్థాల వల్ల రక్తంలోకి చక్కెర వస్తుంది. దానితోపాటు చక్కెర ఎక్కువగా ఉండే ఆ పండ్లు తింటే రక్తంలో చక్కెరపాళ్లు మరింత పెరుగుతాయనే ఆందోళనతో కొందరు అలాంటి సలహా ఇస్తారు. కాబట్టి మనం తీసుకునే పిండిపదార్థాలను అంటే అన్నం, చపాతీ వంటి వాటిని కొంత తగ్గించుకొని.. ఆ మేరకు ఈ పండ్లను తీసుకుని మన జిహ్వను తృప్తిపరచుకోవచ్చు. సగం అరటిపండు 83 గ్రాముల మామిడి 190 గ్రాముల పుచ్చకాయ ముక్కలు 180 గ్రాముల స్ట్రాబెర్రీ 80 గ్రాముల సపోటా 124 గ్రాముల పైనాపిల్ ముక్కలు... ఇవన్నీ 15 గ్రాముల కార్బోహైడ్రేట్లకు సమానం. ఆయా పండ్లను ఏ పరిమాణంలో తీసుకుంటే అవి 15 గ్రాములవుతాయో తెలిసింది కదా! దీన్నిబట్టి ఏ పండునూ పూర్తిగా వదిలేయకుండా... అవి తినాలనిపించినప్పుడు మనం ఆహారంగా తీసుకునే కార్బోహైడ్రేట్లను తగ్గించి, పైన పేర్కొన్న మోతాదులో ఆస్వాదించండి. డాక్టర్ రాహుల్ అగర్వాల్ సీనియర్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, సన్‌షైన్ హాస్పిటల్స్, మాధాపూర్, హైదరాబాద్ -
రసాయనికంగా సబ్బులు అనేవి..?
1. కార్బోహైడ్రేట్లు అనేవి? 1) మాంసకృత్తులు 2) పిండి పదార్థాలు 3) కొవ్వులు 4) విటమిన్లు 2. మానవ శరీరంలో ఉండే మాంసకృత్తులు? 1) కార్బోహైడ్రేట్లు 2) లిపిడ్లు 3) ప్రోటీన్లు 4) విటమిన్లు 3. సాధారణ కార్బొహైడ్రేట్ల నిర్మాణంలో ఉండని మూలకమేది? 1) హైడ్రోజన్ 2) కార్బన్ 3) ఆక్సిజన్ 4) నైట్రోజన్ 4. {పోటీన్ల నిర్మాణంలో అవసరమైన మూలకాలేవి? 1) హైడ్రోజన్, కార్బన్ మాత్రమే 2) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మాత్రమే 3) కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ మాత్రమే 4) కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ 5. కిందివాటిలో ప్రోటీన్లు ప్రధానంగా లేని పదార్థం ఏది? 1) గోళ్లు 2) వెంట్రుకలు 3) మాంసం 4) బియ్యం 6. టేబుల్ షుగర్ రసాయన నామం? 1) సుక్రోజ్ 2) గ్లూకోజ్ 3) ఫ్రక్టోజ్ 4) మాల్టోజ్ 7. పాలలోని చక్కెర ఏది? 1) గ్లూకోజ్ 2) సుక్రోజ్ 3) ఫ్రక్టోజ్ 4) లాక్టోజ్ 8. తేనెలో ఉండే కార్బొహైడ్రేట్? 1) ఫ్రక్టోజ్ 2) గ్లూకోజ్ 3) లాక్టోజ్ 4) మాల్టోజ్ 9. మొలాసిస్ నుంచి ఆల్కహాల్ తయారు చేసే ప్రక్రియ? 1) డయాలసిస్ 2) కిణ్వప్రక్రియ (ఫెర్మెంటేషన్) 3) కిరణజన్యసంయోగక్రియ (ఫొటోసింథసిస్) 4) లాక్టైజేషన్ 10. {పోటీన్లలో ఉండే ప్రత్యేక బంధం ’–CO–NH–’ ను ఏమంటారు? 1) ఎస్టర్ బంధం 2) ఈథర్ బంధం 3) ఎమైడ్ బంధం 4) పాలిఎమైడ్ 11. పాలిఎమైడ్‌లు అనేవి? 1) లిపిడ్లు 2) ప్రోటీన్లు 3) కార్బోహైడ్రేట్లు 4) విటమిన్లు 12. హీమోగ్లోబిన్‌లో ప్రధానంగా ఉండేవి? 1) లిపిడ్ కణాలు 2) ప్రోటీన్ కణాలు 3) కార్బోహైడ్రేట్లు 4) విటమిన్లు 13. గుండెజబ్బులకు ప్రధాన కారణమైన కొలె స్టిరాల్ అనేది ఒక? 1) లిపిడ్ 2) విటమిన్ 3) చక్కెర 4) ప్రోటీన్ 14. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యాధిగ్రస్థుల చికిత్సకు సంబంధించిన ప్రక్రియ? 1) ఫెర్మెంటేషన్ 2) లాక్టేషన్ 3) డయాలసిస్ 4) ఆస్మాసిస్ 15. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ల ఆహా రంలో ఏవి తక్కువ మోతాదులో ఉండాలి? 1) ప్రోటీన్లు 2) లిపిడ్లు 3) విటమిన్లు 4) కొర్బోహైడ్రేట్లు 16. నూనెలను ‘డాల్డా’ లాంటి కొవ్వులుగా మా ర్చే ప్రక్రియ? 1) హైడ్రోజనీకరణం 2) హైడ్రాలిసిస్ 3) ఎస్టరిఫికేషన్ 4) ఫెర్మెంటేషన్ 17. సబ్బుల పరిశ్రమల్లో సహ ఉత్పన్నం ఏది? 1) గ్లిజరాల్ 2) గ్లైకాల్ 3) ఇథైల్ ఆల్కహాల్ 4) అసిటోన్ 18. సోడియం హైడ్రాక్సైడ్ లాంటి క్షారంతో వేటిని మరిగిస్తే సపోనిఫికేషన్ జరిగి సబ్బు ఏర్పడుతుంది? 1) నూనెలు (లిపిడ్లు) 2) కార్బోహైడ్రేట్లు 3) ప్రోటీన్లు 4) ఆల్కహాల్‌లు 19. మాయిశ్చరైజింగ్ సోప్‌లలో ఉండేది? 1) ఇథైల్ ఆల్కహాల్ 2) గ్లిజరాల్ 3) మిథైల్ ఆల్కహాల్ 4) ఆస్కార్బికామ్లం 20. నిమ్మజాతి పండ్లలో ఉండే విటమిన్-సికి మరో పేరు? 1) ఎ 2) బి 3) సి 4) డి 21. మొలకెత్తిన ధాన్యాల్లో అభివృద్ధి చెందే ప్రధాన విటమిన్ ఏది? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 22. నీటిలో కరిగే విటమిన్లేవి? 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) సి, డి మాత్రమే 4) అన్ని విటమిన్లు నీటిలో కరుగుతాయి 23. ఆవుపాలు పసుపురంగులో ఉండటానికి కారణమైన విటమిన్? 1) పిరిడాక్సిన్ (B6) 2) రైబోఫ్లోవిన్ (B2) 3) థయమిన్ (B1) 4)సైనకోబాలమిన్ (B12) 24. ఏ విటమిన్ లోపిస్తే వ్యంధ్యత్వం వస్తుంది? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 25. కోబాల్ట్ లోహ అయాన్ ఉండే విటమిన్ ఏది? 1) B1 2) B2 3) B12 4) B6 26. జతపరచండి. విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఎ) B1 1) రికెట్స్ బి) B12 2) స్కర్వీ సి) C 3) రేచీకటి డి) D 4) బెరిబెరి 5) రక్తహీనత ఎ బి సి డి 1) 1 2 3 4 2) 2 3 4 5 3) 4 5 2 1 4) 5 4 1 2 27. గర్భిణీలకు ఇచ్చే విటమిన్ ఏది? 1) థయమిన్ 2) పిరిడాక్సిన్ 3) ఫోలికామ్లం 4) రైబోఫ్లోవిన్ 28. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే ఏ విటమిన్ లోపిస్తుంది? 1) బి 2) సి 3) ఎ 4) డి 29. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే హార్మోన్ ఏది? 1) ఇన్సులిన్ 2) ఈస్ట్రోజన్ 3) ప్రొజెస్టిరాన్ 4) ఏదీకాదు 30. ఎదుగుదలకు దోహదం చేసే హార్మోన్ ఏది? 1) ఇన్సులిన్ 2) థైరాక్సిన్ 3) ఈస్ట్రోజన్ 4) ప్రొజెస్టిరాన్ 31. అత్యల్ప ఆల్కహాల్ ఉండేది? 1) వైన్ 2) బీర్ 3) వోడ్కా 4) విస్కీ 32. వాహనాలు నడవడానికి పెట్రోల్‌తో పాటు దేన్ని కలుపుతున్నారు? 1) ఇథనాల్ 2) మిథనాల్ 3) గ్లిజరాల్ 4) గ్లైకాల్ 33. రసాయనికంగా సబ్బులు అనేవి? 1) ఫాటీ ఆమ్లాల సోడియం లేదా పొటాషియం లవణాలు 2) ఫాటీ ఆమ్లాల సల్ఫోనేట్ లవణాలు 3) గ్లిజరాల్, బై కార్బొనేట్ల మిశ్రమాలు 4) ఏదీకాదు 34. కిందివాటిలో ఏవి డిటర్జెంట్లు? ఎ. ఆల్కైల్ బెంజీన్ సల్ఫొనేట్లు బి. భార ఆల్కహాల్‌ల సల్ఫోనేట్ లవణాలు సి. భార ఫాటీ ఆమ్లాల సోడియం లవణాలు 1) ఎ, బి మాత్రమే 2) బి, సి మాత్రమే 3) ఎ, సి మాత్రమే 4) ఎ, బి, సి 35. కార్ రేడియేటర్లలో శీతలీకారిణి (యాంటీ- ఫ్రీజ్)గా దేన్ని ఉపయోగిస్తారు? 1) టెట్రాఇథైల్ లెడ్ 2) ఇథిలీన్ గ్లైకాల్ 3) గ్లిజరాల్ 4) ఇథైల్ ఆల్కహాల్ 36. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే ఇథనాల్‌కు తాగడానికి పనికిరాకుండా ఉండటానికి కలిపే పదార్థం? 1) మిథనాల్ 2) ఎసిటోన్ 3) బెంజీన్ 4) క్లోరోఫాం 37. గాయాలు త్వరగా మానడానికి అవసర మైన విటమిన్ ఏది? 1) ఎ 2) బి 3) సి 4) డి 38. కెఫీన్ అనే డ్రగ్ ఎందులో ఉంటుంది? 1) కాఫీ 2) టీ 3) కోలా శీతల పానీయాలు 4) పైవన్నీ 39. సిగరెట్లో ఉండే డ్రగ్ ఏది? 1) కెఫీన్ 2) టేనిన్ 3) నికోటిన్ 4) వెనిలా 40. సొరచేప కాలేయం నుంచి తీసే నూనె ద్వారా లభించే విటమిన్? 1) ఎ 2) బి 3) సి 4) ఇ 41. ఆల్కహాల్ అధికంగా సేవించే వారిలో ఏ అవయవం పాడవుతుంది? 1) ఊపిరితిత్తులు 2) కాలేయం 3) కిడ్నీ 4) మూత్రనాళం 42. నూనెల హైడ్రోజనీకరణం గురించి సరికాని వాక్యం ఏది? 1) నూనెల హైడ్రోజనీకరణంలో ూజీ లో హాన్ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు 2) నూనెలను హైడ్రోజనీకరణం చేస్తే కొవ్వులు లభిస్తాయి 3) ఈ ప్రక్రియ వల్ల రుచి, వాసన పెరు గుతాయి 4) నూనెల హైడ్రోజనీకరణం వల్ల వచ్చే కొ వ్వులు తక్కువ కాలం నిల్వ ఉంటాయి 43. కఠిన జలంలోనూ డిటర్జెంటులు బాగా ఉపయోగపడటానికి కారణమేమిటి? 1) అవి నీటిలోని అయాన్లను తొలగిస్తాయి 2) అవి కఠినజల అయాన్లతో చర్య నొందవు 3) అవి కఠినజల అయాన్లతో చర్య నొందినప్పటికీ అవక్షేపించవు 4) అవి కఠినజల అయాన్లతో చర్యనొంది అవక్షేపిస్తాయి 44. రక్తం త్వరగా గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్? 1) ఎ 2) బి 3) సి 4) కె 45. ఏ విటమిన్ లోపం వల్ల మగవారిలో బీజాభివృద్ధి సరిగా లేకపోవడం, స్త్రీలలో త రచూ గర్భస్రావం లాంటివి కలుగుతాయి? 1) ఇ 2) బి 3) సి 4) డి 46. సూర్యరశ్మి సమక్షంలో శరీరంలో తయా రయ్యే విటమిన్? 1) ఎ 2) బి 3) ఇ 4) డి 47. కిందివాటిలో సరికాని జత ఏది? 1) కార్బోహైడ్రేటులు - శక్తి 2) ప్రోటీన్లు - పెరుగుదల 3) విటమిన్లు - వ్యాధి నిరోధకత 4) కొవ్వులు - పెరుగుదల 48. మూత్రపిండాలు సరిగా పనిచేయనివారి మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కని పించేది? 1) చక్కెర 2) క్రియాటినిన్ 3) ప్రోటీన్ 4) కొవ్వు 49. పండ్లలో చక్కెర ఏ రూపంలో ఉంటుంది? 1) సుక్రోస్ 2) గ్లూకోజ్ 3) ఫ్రక్టోజ్ 4) లాక్టోస్ 50. ముతక బియ్యం (పాలీష్ చేయని బియ్యం) ఉపయోగించి చేసే ఇడ్లీలో పుష్కలంగా లభించే విటమిన్ ఏది? 1) అ 2) ఆ12 3) ఇ 4) ఉ 51. డయాబెటీస్ వ్యాధిగ్రస్థుల మూత్రంలో ఎక్కువ పరిమాణంలో కనిపించే షుగర్ ఏది? 1) సుక్రోజ్ 2) ఫ్రక్టోజ్ 3) గ్లూకోజ్ 4) లాక్టోజ్ సమాధానాలు 1) 2 2) 3 3) 4 4) 4 5) 4 6) 1 7) 4 8) 1 9) 2 10) 3 11) 2 12) 2 13) 1 14) 3 15) 1 16) 1 17) 1 18) 1 19) 2 20) 3 21) 4 22) 2 23) 2 24) 4 25) 3 26) 3 27) 3 28) 1 29) 1 30) 2 31) 2 32) 1 33) 1 34) 1 35) 2 36) 1 37) 3 38) 4 39) 3 40) 1 41) 2 42) 4 43) 3 44) 4 45) 1 46) 4 47) 4 48) 2 49) 3 50) 2 51) 3 -
ఆ ‘శక్తి’కీ ఓ లెక్కుంది!
90 నిమిషాల పాటు విశ్రాంతి లేకుండా పరిగెడుతూనే ఉండాలి.... ప్రత్యర్థి ఆటగాళ్లు కావాలని కాళ్లు అడ్డుపెట్టి పడేసినా లేచి బంతిని అందుకోవాలి. నిజానికి ఫుట్‌బాల్ మైదానంలో ఉన్నంతసేపు ఆటగాళ్లు మొరటుగా, బండల్లా కనిపిస్తారు. మరి వాళ్లకి అంత శక్తి ఎలా వస్తుంది? అంటే... దీనికీ ఓ లెక్కుంది. ఎంత పడితే అంత... ఎలా పడితే అలా తింటామంటే కుదరదు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలంటే కచ్చితంగా ఓ లెక్క ప్రకారం తినాల్సిందే. ఫుట్‌బాల్‌లో రాణించాలంటే శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడంతోపాటు అది తనకు అడ్డంకి కాకుండా కూడా చూసుకోవాల్సివుంటుంది. వేగం, చురుకుదనం కోల్పోకుండా నియంత్రించుకోవాల్సివుంటుంది. మైదానంలో చివరి నిమిషం దాకా పోరాడగలగాలంటే అందుకు తగ్గట్లుగానే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ విషయంలో ఆటగాళ్లు అత్యంత శ్రద్ధతో ఉంటారు. డైటీషియన్ల సూచనలకు అనుగుణంగా నడచుకుంటూ.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు ఎక్కువగా లభించే ఆహారం తీసుకుంటుంటారు. అయితే వీరి ఆహారంలో అత్యధికంగా 55 నుంచి 60 శాతం కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. శరీర బరువుకు తగినట్లుగా.. మ్యాచ్ ఆడే రోజైనా, సాధనలో పాల్గొనేందుకైనా ఫుట్‌బాల్ ఆటగాళ్లు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లను వారి శరీర బరువుకు తగినట్లుగా సమతుల్యంగా తీసుకుంటుంటారు. ఇందుకు ప్రతి పౌండ్ శరీర బరువుకు 2.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభించేలా ఆహారం తీసుకుంటారు. కఠోర సాధనలో పాల్గొనాల్సిన సందర్భంలో గరిష్టంగా 4 గ్రాముల వరకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్పాహారంగా తీసుకునే తృణ ధాన్యాలు, వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్లలో ఈ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా లభిస్తాయి. వీటితోపాటు స్పోర్ట్స్, సాఫ్ట్ డ్రింక్స్‌లోనూ, చక్కెర, జామ్, తేనె వంటి తీపి పదార్థాల్లోనూ పళ్లు, పళ్ల రసాల వంటి వాటిలోనూ ఇవి సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఆటగాళ్లు ఇలాంటి పదార్థాలతో కూడిన ఆహారాన్నే ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇక పౌండ్ శరీర బరువుకు రోజుకు 0.7 నుంచి 0.8 గ్రాముల ప్రొటీన్లు, 0.45 గ్రాముల కొవ్వు పదార్థాలు లభించే ఆహార పదార్థాలు తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్.. ఫుట్‌బాల్ క్రీడాకారుల ఆహార నియమాలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి భోజనం దాకా పూర్తిగా వారి డైటీషియన్ల సూచనల మేరకు ఉంటాయి. మ్యాచ్ ఆడాల్సిన రోజు బరిలోకి దిగేందుకు రెండు గంటల ముందే అల్పాహారం చేస్తారు. వేయించిన కేక్‌లు, ఎగ్ శాండ్విచ్లు, ఉడికించిన గుడ్లు, చక్కెర కలిపిన గోధుమలు వంటి పదార్థాలతోపాటు ద్రాక్ష, అరటి, యాపిల్, నారింజ వంటి పండ్లు, గ్లాసు పాలు తీసుకుంటారు. అయితే అన్నింట్లోనూ కొవ్వు శాతం ఎక్కువ లేకుండా జాగ్రత్త పడతారు. తేలికైన లంచ్ మ్యాచ్‌లో ఆడాల్సివున్నా, శిక్షణలో పాల్గొనాల్సివున్నా అతిగా భోజనం చేయడం అడ్డంకిగా మారే అవకాశం ఉన్నందున తేలికైన లంచ్ మాత్రమే తీసుకుంటారు. అయితే ఇదే సమయంలో తగినంత శక్తి కూడా అవసరమైనందున కొద్దిమోతాదులో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన భోజనానికి ప్రాధాన్యత ఇస్తారు. కూరగాయలతోపాటు బీన్స్, బీట్స్, క్యారెట్ వంటి వాటితో చేసిన సలాడ్లు తీసుకుంటారు. శాండ్విచ్లు వెజిటబుల్ సూప్‌లు, మాంసంతోగానీ, మాంసం లేకుండా గానీ పాస్తాలు, ఉడికించిన మాంసం భుజిస్తారు. ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో భోజనం చేయాల్సివస్తే.. గ్రిల్డ్ చికెన్ శాండ్విచ్లు, రోస్ట్ బీఫ్ శాండ్విచ్లు, బేక్ చేసిన ఆలుగడ్డలు, సలాడ్ బార్స్ వంటివి తీసుకుంటారు. రాత్రి భోజనం పుష్టిగా... మ్యాచ్‌లో ఆడి అలసిపోయిన శరీరానికి తిరిగి శక్తినిచ్చే విధంగా రాత్రిభోజనం ఉంటుంది. ఉడికించిన లేదా బేక్ చేసిన మాంసం, నత్తలతో కూడిన టమాటో సాస్, చికెన్ వంటి మాంసాహారం తీసుకుంటారు. నూనెలు ఎక్కువగా లేని కూరగాయలతో కూడిన ఆహార పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తారు. లంచ్‌కు రాత్రి భోజనానికి మధ్య స్నాక్స్ తీసుకుంటారు. వీటిలో ఎండిన రోస్టెడ్ నట్స్, బ్రెడ్, తాజా పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా ఉంటాయి. -
ఆట...ఆహారం...ఆనందం...
మీ అబ్బాయి ఆటలో మేటి కావాలనుకుంటున్నారా... అయితే అందుకు ప్రతిభ ఒక్కటే సరిపోదు. ఓనమాలు నేర్చిన నాటినుంచి అగ్రస్థాయికి చేరే వరకు అతని ఆరోగ్యం, ఫిట్నెస్ ఎంతో కీలకం. మరి అందుకోసం తల్లిదండ్రులుగా మీరేం చేస్తున్నారు? ఒక క్రీడాకారుడిగా అతనికి ఎలాంటి ఆహారం అవసరమో గుర్తించారా? అందరిలాగే మీవాడూ పిజ్జాలు, బర్గర్లతోనే సరిపెట్టుకుంటున్నాడా? అలా అయితే మీ అబ్బాయి ఆటగాడిగా ఎదిగేందుకు ఇవన్నీ అడ్డంకిగా మారవచ్చు. మరి ఒక చిన్నారిని ఆటగాడిగా తీర్చిదిద్దడంలో ఎలాంటి ఆహారం అవసరమో మీకు తెలుసా..? మైదానానికి కుర్రాడు పరుగెడుతుంటే అతని చేతిలో ఓ ఆపిల్ లేదా పెద్ద సైజ్ అరటి పండు, సమయం ఉంటే కొవ్వు తీసిన ఓ గ్లాస్ పాలు.. ఏదో ఒకటి ఇవ్వండి. మీ కుర్రాడు ఎంత హుషారుగా గ్రౌండ్‌కు వెళ్లాడో... అంతే హుషారుగా ఇంటికి వస్తాడు. అదెలాగంటే మీరు ఇచ్చే ఆ మూడు పదార్థాల్లో లెక్కకు మించిన పోషకాలు, కార్బోహైడ్రేట్స్, ఖనిజ లవణాలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి కుర్రాడు ఆడుకోవడానికి కావాల్సిన శక్తిని నిరంతరంగా అందిస్తాయి. సాధారణ మనిషి, క్రీడాకారుడు తీసుకునే డైట్‌కు పెద్దగా తేడా ఉండదు. అయితే కండరాల పునరుత్తేజానికి, కణజాలాల పెరుగుదలకు అవసరమైన కార్బోహైడ్రేట్స్‌ను ఎప్పుడు ఎలా ఏ రూపంలో ఎక్కువ తీసుకోవాలో చూద్దాం... - హరిప్రసాద్ చిలుక (సాక్షి స్పోర్ట్స్) అథ్లెట్ల డైట్ ఇది.... అథ్లెట్లు తీసుకునే సమతులిత ఆహారంలో కార్బోహైడ్రేట్స్దే సింహభాగం. మొత్తం పదార్థంలో 55 శాతం కార్బోహైడ్రేట్స్, 12 నుంచి 15 శాతం ప్రొటీన్స్, 30 శాతం కంటే తక్కువగా కొవ్వులు ఉండేలా చూసుకుంటారు. అయితే శరీర బరువు, ఎక్సర్సైజ్ చేసే సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది అటూ ఇటుగా కొంచెం మారవచ్చు. సాధారణంగా గంటన్నర పాటు ఎక్సర్సైజ్ చేసే అథ్లెట్‌కు 65 నుంచి 70 శాతం కార్బోహైడ్రేట్స్ అవసరం. ధాన్యపు గింజలు, తృణ ధాన్యాలు, ఆకు పచ్చని కూరగాయలు, పండ్లు, వెన్న తీసిన పాలు మంచి శక్తి పోషకాలుగా ఉపయోగపడతాయి. కొవ్వు పదార్థాలు ఉండే బిస్కట్లు, కేక్‌లు, బ్రెడ్స్, చిప్స్, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఇలా పని చేస్తాయి శరీరానికి కావాల్సిన ప్రాథమిక శక్తిని అందిస్తాయి. అంతేగాకుండా జీర్ణక్రియలో సులువుగా విచ్చిన్నం చెంది గ్లూకోజ్ (చక్కెర)గా మారతాయి. ఈ గ్లూకోజ్ తర్వాతి దశల్లో గ్లైకోజన్‌గా మారి కండరాల్లో నిలువ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసే సమయంలో ఇది శరీర భాగాలకు నిరంతరం సరఫరా అవుతుంది. గ్లైకోజన్ నిలువలు పెరగాలంటే కార్బోహైడ్రేట్స్‌ను అధికంగా తీసుకోవాలి. గ్లైకోజన్ నిలువలు తగ్గిపోతే కండర కణజాలాలు చిరిగిపోవడం, ప్రొటీన్ పొర దెబ్బతినడం జరుగుతుంది. ఫలితం అనారోగ్యం, ఇన్ఫెక్షన్స్. ఎక్సర్సైజ్ తర్వాత కోలుకోవడానికి కూడా ఈ కార్బోహైడ్రేట్స్ చాలా కీలకం. తృణ ధాన్యాలు, బ్రెడ్స్లాంటి నాన్ రిఫైన్డ్ పదార్థాలు తీసుకుంటే స్వల్ప శక్తి అందుతుంది. అదే వైట్ బ్రెడ్, జామ్స్, కొన్ని రకాల మిఠాయిల వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే పూర్తి మొత్తంలో శక్తి అందుతుంది. ఎక్సర్సైజ్కు ముందు ఎక్సర్సైజ్కు మూడు నాలుగు గంటల ముందు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న మీల్‌ను తీసుకోవడం మంచి ఆలోచన. గంటా, రెండు గంటల ముందు స్నాక్స్ తీసుకోవడం మంచిది. తృణ ధాన్యాలతో కూడిన స్నాక్స్, తక్కువ ఫ్యాట్స్ గల పాలు, సలాడ్స్, పెరుగు, టొమాటోతో చేసిన పాస్తా, తక్కువ ప్రొటీన్స్ కలిగిన బ్రేక్ ఫాస్ట్, క్రీమ్డ్ రైస్‌ను తీసుకోవాలి. ఒకవేళ అధిక కొవ్వులు, ప్రొటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అజీర్ణం సమస్య తలెత్తుంది. ఎక్సర్సైజ్ చేసే సమయంలో... కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది. ప్రస్తుత పరిశోధనల ప్రకారం 30 నుంచి 60 గ్రాములు సరిపోతాయి. స్పోర్ట్స్ జెల్లీస్, స్పోర్ట్స్ బార్స్, వైట్బ్రెడ్ శాండ్విచ్లు తీసుకోవాలి. అయితే ఇది నిర్ణీత మోతాదును మించకూడదు. నాలుగు గంటల పాటు ఎక్సర్సైజ్ చేస్తే ప్రతి గంటకు 90 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌ను తీసుకోవాలి. ఎక్సర్సైజ్ తర్వాత..... ఎక్సర్సైజ్ తర్వాత శరీరం అలసటకు గురవుతుంది. కాబట్టి వేగంగా గ్లైకోజన్ అందాలి. ఇందుకోసం కార్బోహై డ్రేట్స్, ఫ్లూయిడ్స్‌ను ఎక్కువగా తీసుకుంటే కండరాలు తొందరగా పునరుత్తేజం అవుతాయి. మొదట కొద్దిగా తీసుకొని ఆ తర్వాత మోతాదును పెంచాలి. మీల్స్ తీసుకునే వరకు కొనసాగించాలి. స్పోర్ట్స్ డ్రింక్స్, జ్యూస్, తృణ ధాన్యాలు, లో ఫ్యాట్ ప్లేవర్డ్ మిల్క్, శాండ్విచ్, పాస్తా, పెరుగును తీసుకోవచ్చు. డీహైడ్రేషన్ కాకూడదు... ఇక డీహైడ్రేషన్ సమస్య రాకుండా స్పోర్ట్స్ డ్రింక్స్, పండ్ల రసాలు, నీరు తీసుకోవడం మంచి చాయిస్. అయితే ఒక లీటర్ నీటిలో 30 మిల్లీ మోల్స్ సోడియం ఉండేలా స్పోర్ట్స్ డ్రింక్‌ను తయారు చేసుకొని తాగితే మంచిది. కొంత మంది సాల్ట్ ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. ఇది మంచిది కాదు. కండరాలు చీరుకుపోయే అవకాశం ఉంటుంది. అమైనో ఆమ్లాలు, సప్లిమెంట్లు... అధికంగా ప్రొటీన్స్, ప్రత్యేకంగా తయారు చేసిన అమైనో ఆమ్లాలు కలిగిన సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదు. వీటిని తీసుకోవడం ఖర్చుతో కూడుకున్నది. మూత్ర పిండాల పని తీరుపై దెబ్బపడుతుంది. తీసుకునే ఆహారంలో ప్రొటీన్స్ సమతూకంగా ఉంటే చాలు. ఓ ప్రణాళికబద్ధమైన సమతులిత ఆహారం తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు వాటంతట అవే అందుతాయి. శరీరంలో తక్కువ స్థాయిలో ఉండటం, లేదా తీసుకునే ఆహారంలో అసలు లేకపోతే వీటిని బయటి నుంచి తీసుకోవాలి. తేడాలుంటాయి! సాధారణ మనిషికి ప్రతి రోజు దాదాపు 2000 క్యాలరీల శక్తి అవసరం. అయితే జెండర్, వయసు, ఎత్తు, బరువులాంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. 2000 క్యాలరీల శక్తి అవసరమైన వ్యక్తికి ప్రతిరోజూ సుమారుగా 250 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 56 గ్రాముల ప్రొటీన్స్ అవసరం. మటన్, చికెన్‌లలో కార్బోహైడ్రేట్స్ లేకపోయినా శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రా చికెన్ లేదా మటన్‌లో 25 గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. 219, 294 క్యాలరీల శక్తి లభిస్తుంది. చిరిగిపోయిన కణజాలాలు తొందరగా అతుక్కోవడానికి చికెన్ బాగా ఉపయోగపడుతుంది. అయితే వేపుడు లేకుండా గ్రిల్డ్ చేసిన చికెన్‌ను తీసుకోవాలి.