Mushrooms Health Benefits In Telugu: పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజ పోషకాలు, విటమిన్‌లు పుష్కలంగా అందుతాయి. పుట్టగొడుగుల్లో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ ఉండడం వల్ల యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేయడమేగాక, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలోని కొన్ని రకాల ఎంజైమ్‌లు కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచడానికి తోడ్పడతాయి. దీంతో గుండె సంబంధ సమస్యలు రావు.
►పుట్టగొడుగులు తినడం వల్ల శరీరానికి ఖనిజపోషకాలు, విటమిన్‌లు, పీచు పదార్ధాలు, కార్బొహైడ్రేట్స్ అందుతాయి. ఇవన్నీ శరీరానికి అందడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
►ఆహారంలో పుట్టగొడుగుల్ని చేర్చుకోవడం వల్ల ఉదర సమస్యలు, అజీర్ణం, మలబద్దకం సమస్యలు దరిచేరవు.
►ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఎదరుకాదు.
చదవండి: Health Tips: బరువును అదుపులో ఉంచే మిరియాలు
Comments
Please login to add a commentAdd a comment