భారతదేశంలోని ప్రజల ప్రధాన ఆహారంలో అన్నం ఒకటి. చాలా మంది అన్నంలో రకరకాల కూరలు, పచ్చళ్లు, వెజ్, నాన్‌వెజ్‌లలో నచ్చిన ఆధరువులు కలుపుకుని తినడానికి ఇష్టపడతారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనితోపాటు ఇందులో ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి.
ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో చాలామంది రాత్రిపూట అన్నం తినడం మానేస్తున్నారు. దీంతో అన్నం తినాలా వద్దా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది.
బియ్యంలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇది మనం మన రోజు వారీ పనులను సులభంగా చేసుకునేందుకు అవసరం అయ్యే శక్తిని అందిస్తుంది. అన్నం సులభంగా జీర్ణమవుతుంది.
పొట్టకి, జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు పోషకాలు అందుతాయి. ఇది తన పనితీరును సాఫీగా నిర్వహిస్తుంది. ప్రతిదానికి దాని ప్రయోజనాలతో పాటు కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. మీరు బరువును తగ్గించుకోవాలనుకుంటే మాత్రం రాత్రిపూట అన్నం తినకండి. దాని బదులు బ్రౌన్ రైస్ బెటర్. దీనివల్ల పిండి పదార్థాలకు బదులుగా ఫైబర్ లభిస్తుంది. దీంతో ఆహారం నుంచి ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ పొందవచ్చు.
చదవండి👉🏾 Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం!
చదవండి👉🏾High Vitamin D Rich Foods: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. వీటిలో విటమిన్- డి పుష్కలం!
Comments
Please login to add a commentAdd a comment