Weight Loss Tips: బరువు పెరగడానికి ప్రధాన కారణం మన జీవనశైలి అని చెప్పవచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో వేపుడు పదార్థాలు, మసాలాలు, స్వీట్లు, కరకరలాడే చిరుతిళ్లు తినాలని మనసు తహతహలాడుతుంది. మరి బరువు తగ్గాలనుకుంటే కరకరలాడే స్నాక్స్‌కు బదులు పోషకాలు ఉండే తాజా ఆహారాలను తీసుకుంటే బెటర్.
కొందరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన స్వీట్లను తింటూ ఉంటారు. వీటిని తినడం వల్ల పొట్ల దగ్గర కొవ్వు అలాగే ఉండిపోతుంది.
ఫైబర్: ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈజీగా కొవ్వు కరిగిపోతుంది. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఫైబర్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రోజూ రెగ్యులర్‌గా ఫైబర్ ఫుడ్ తింటూ ఉండండి.
యోగా: కొన్ని రకాల ఆసనాలు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తాయి. అలాంటి ఆసనాలను ఉదయం లేచిన వెంటనే వేస్తే చాలా మంచిది.
నట్స్: బాదం లాంటి కొన్నిరకాల నట్స్‌ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయమే తింటే చాలా మంచిది.
చేపలు: ఆహారంలో ఎక్కువగా చేపలుండేలా చూసుకోండి. వారానికొకసారైనా ఆహారంలో చేపలుండేలా చూసుకోవడం మంచిది. క్యాలీఫ్లవర్, బ్రకోలి, దోసకాయలాంటి వాటిని ఎక్కువగా తినడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు క్రమంగా తగ్గిపోతుంది.
క్యాల్షియం: పాలు, పాల సంబంధిత పదార్థాలని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది.
చెర్రీలు: శరీరంలోని కొవ్వును తగ్గించడానికి చెర్రీలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
సమయానికి నిద్ర పోవడం: సరైన సమయానికి నిద్రపోకుండా ఉంటే కూడా బాడీలో కొవ్వు పెరిగిపోతుంది. అందువల్ల రెగ్యులర్ గా సమయానికి నిద్రపోతూ ఉండండి.
చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే..
Comments
Please login to add a commentAdd a comment