చేపలు ఆరోగ్యానికి మంచిదే గానీ అతిగా తింటే మాత్రం ప్రమాదమే. అలా తినమని సాధారణంగా వైద్యులు కూడా సూచించరు. కానీ ఈ మహిళ మూడు నెలల పాటు చేపలు మాత్రమే తిని ఏకంగా 15 కిలోల బరువు తగ్గింది. అది చూసి వైద్యులే కంగుతిన్నారు.
వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకి చెందిన 62 ఏళ్ల జేన్ క్రమ్మెట్ బరువు 109 కిలోలు ఉండేది. నడవలేని స్థితిలో మంచానికే పరిమితమై ఉంది. వైద్యులు బరువు తగ్గేలా ఆహారాలు, పానీయాలపై పలు నిబంధనలు పాటించాలని సూచించారు. కానీ అలా చేసినా ఆమె బరువు పరంగా ఎలాంటి మార్పు కనిపించలేదు.
పైగా అలా మంచపైనే ఉండటంతో కాళ్లు బాగా వాచిపోయి, విపరీతమైన ఆకలితో బాధపడేది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసిన లాభం లేదని భావంచి స్నేహితుల సూచన మేరుకు వైద్యుడు బోజ్‌ని సంప్రదించింది. ఆయన ఆమెకు 'ఫిష్ ఫాస్ట్'ని సూచించారు. మూడు నెలల పాటు సార్డినెస్ అనే చేపలను మాత్రమే తినమని సూచించారు. ఇలా చేస్తే బరువు తగ్గుతారని అనడంతో జేన్ విస్తుపోయింది. ఏదో వింతగా ఉన్న ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఏమో..చూడాలని ట్రై చేసి చూసింది.
ఆయన చెప్పినట్లుగా మూడు నెలల పాటు సార్డిన్ చేపలు మాత్రమే తినడం ప్రారంభించింది. ఇలా చేసిన రెండు నెలల్లోనే మంచి మార్పు కనిపించింది. ఏకంగా ఆరు కిలోలు వరకు తగ్గింది. ఇక మూడు నెలలు పూర్తి అయ్యేటప్పటికీ ఏకంగా 15 కిలోల వరకు తగ్గిపోయింది. జోన్ ఇంత స్పీడ్‌గా బరువు తగ్గడం చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు.
ఇది ఒక రకమైన జిడ్డుకరమైన చేప. పైగా ఇందులో మంచి పోషక విలువలు ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నవారిని దీన్ని తినమని వైద్యులు సూచిస్తారు. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, విటమిన్ డి, క్యాల్షియం ఉంటాయి. ఇలా చేపలతో బరువు తగ్గడం అత్యంత అరుదు కదూ..!.
(చదవండి: వెన్ను నొప్పి కేన్సర్‌కు దారితీస్తుందా..?)
Comments
Please login to add a commentAdd a comment