సమ్మర్‌లో ఈ రైస్‌ తింటే..లాభాలే..లాభాలు! | Health Benefits of Eating Fermented Curd Rice in summer | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో ఈ రైస్‌ తింటే..లాభాలే..లాభాలు!

Published Sat, Mar 30 2024 1:46 PM | Last Updated on Sat, Mar 30 2024 6:27 PM

Health Benefits of Eating Fermented Curd Rice in summer - Sakshi

వేసవి ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎండల్ని తట్టుకునేలా మన జీవన శైలి, ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే. ముఖ్యంగా మన శరీరానికి  చల్లదనాన్ని, పోషకాలు అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి వాటిలో ప్రధానమైంది ఫర్మెంటెడ్‌ రైస్‌, లేదా పులియ బెట్టిన పెరుగున్నం.  దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి  ప్రయోజనాలు లభిస్తాయో ఒకసారి చూద్దాం.! 

పులియబెట్టినపెరుగన్నంతో ప్రయోజనాలు 
వేసవిలో పెరుగు అన్నం లేదా రాత్రంతా  పెరుగులో పులియబెట్టిన  అన్నం  తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.  పెరుగులో విటమిన్ సితో పాటు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి 

పెరుగు అన్నంలోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తాయి. గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది ప్రయోజన కరంగా ఉంటుంది. 

కడుపులో చికాకు, అజీర్ణం లాంటి సమస్యలనుంచి ఉపశమనం కలుగుతుంది. కడుపులో కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఇది త్వరగా, సౌకర్యవంతంగా జీర్ణమవుతుంది.

కాల్షియం, బీ12 విటమిన్ డీ, ప్రోటీన్‌తో సహా అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఎదుగుతున్న పిల్లల్లో బలమైన ఎముకలు ,దంతాలకు కాల్షియం  చాలా అవసరం. పిల్లలు ఇది  అలవాటు చేస్తే విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది.

ఈ పెరుగు  అన్నం ఎలా చేసుకోవాలి
ప్రోబయాటిక్ పెరుగు అన్నం చేయడం చాలా సులభం. వండిన అన్నాన్ని కొంచెం వేడిగా ఉండగానే ఒక గిన్నె (మట్టి పాత్ర అయితే ఇంకా మంచిది) లోకి  తీసుకోవాలి. ఇందులో పాలు పోసి తోడు పెట్టాలి. ఇష్టం ఉన్నవాళ్లు ఇందులో ఉల్లిపాయ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు వేసి  బాగా  కలిపి మూత పెట్టి  రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయానికి అదనపు పోషకాలతో చక్కగా పులిసి ఉంటుంది. దీన్ని తాలింపు వేసుకొని, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని తినవచ్చు. 

టిప్‌:  పచ్చిమిర్చి వేయకుండా  నల్లద్రాక్ష, అరటిపండు ముక్కలు, దానిమ్మ గింజలు  లాంటివి వేసి చక్కగా గార్నిష్‌ చేసి ఇస్లే. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాదు బోలెడన్ని పోషకాలు కూడా లభిస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement