వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?  | do you these benefits with Buttermilk in summer | Sakshi
Sakshi News home page

వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా? 

Published Sat, Apr 13 2024 1:56 PM | Last Updated on Sat, Apr 13 2024 3:18 PM

do you these benefits with Buttermilk in summer - Sakshi

వేసవి కాలంలో ఎండల ప్రతాపాన్ని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మధ్యాహ్నం ఎండలో సాధారణంగా బయటికి రాకుండా ఉండటంమంచిది. అలాగే  ఎక్కువ నీళ్లు తాగాలి.  వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని  పానీయాలను తీసుకోవాలి.  ఈ విషయంలో మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా  కాస్త చవగా అందరికీ అందుబాటులో ఉండేది కూడా.

వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూద్దాం!

అద్భుతమైన ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాల గని  మజ్జిగ. వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.  అధిక ఉష్ణంనుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు.
► పల్చటి మజ్జిగలో  నిమ్మకాయ,కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కాస్తంత కొత్తమీర, పుదీనా  కలుపుకుని తాగితే మరీ మంచిది. రుచికీ రుచీ తగులుతుంది.  వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు.
► మజ్జిగ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలతో  చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
► ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.  జీర్ణసమస్యలు పోతాయి.  రక్త సరఫరా మెరుగుపడుతుంది. 

 సౌందర్య పోషణలో
చర్మం కూడా  కాంతివంతంగా మారుతుంది.  వేసవిలో వేధించే చెమట పొక్కుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
మజ్జిగలో పెద్ద మొత్తంలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ (AHA) చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది, చర్మంపై నల్ల మచ్చలు , టాన్డ్ ప్యాచ్‌లకు సహజ పరిష్కారంగా పనిచేస్తుంది.
► కాల్షియం లోపం ఉన్న వారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు ధృడంగా మారుతాయి.
►  కాల్షియం, విటమిన్స్‌ , ఇతరపోషక విలువల  కారణంగా మజ్జిక  కొన్ని రకాల జబ్బులను నివారిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement