Buttermilk
-
వేసవిలో మజ్జిగ తాగితే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
వేసవి కాలంలో ఎండల ప్రతాపాన్ని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మధ్యాహ్నం ఎండలో సాధారణంగా బయటికి రాకుండా ఉండటంమంచిది. అలాగే ఎక్కువ నీళ్లు తాగాలి. వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని పానీయాలను తీసుకోవాలి. ఈ విషయంలో మజ్జిగ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. పైగా కాస్త చవగా అందరికీ అందుబాటులో ఉండేది కూడా. వేసవిలో మజ్జిగ తాగడం వల్ల కలిగే లాభాలను ఓ సారి చూద్దాం! ► అద్భుతమైన ఆరోగ్య , సౌందర్య ప్రయోజనాల గని మజ్జిగ. వేసవిలో చల్లచల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. అధిక ఉష్ణంనుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. ► పల్చటి మజ్జిగలో నిమ్మకాయ,కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, కాస్తంత కొత్తమీర, పుదీనా కలుపుకుని తాగితే మరీ మంచిది. రుచికీ రుచీ తగులుతుంది. వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ► మజ్జిగ వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ► ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణసమస్యలు పోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. సౌందర్య పోషణలో ►చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. వేసవిలో వేధించే చెమట పొక్కుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ►మజ్జిగలో పెద్ద మొత్తంలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ (AHA) చర్మాన్ని మృదువుగా , ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది, చర్మంపై నల్ల మచ్చలు , టాన్డ్ ప్యాచ్‌లకు సహజ పరిష్కారంగా పనిచేస్తుంది. ► కాల్షియం లోపం ఉన్న వారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. ఫలితంగా ఎముకలు, దంతాలు ధృడంగా మారుతాయి. ► కాల్షియం, విటమిన్స్ , ఇతరపోషక విలువల కారణంగా మజ్జిక కొన్ని రకాల జబ్బులను నివారిస్తుంది. -
లోకేష్ యాత్ర లో మజ్జిగ ప్యాకెట్లు..ఎలా విసురుతున్నారో చూడండి
-
Health: వీళ్లు అస్సలు కాఫీ తాగకూడదు.. రోజూ మధ్యాహ్నం మజ్జిగ తాగితే!
డెయిలీ కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్–2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. అయితే కొందరు మాత్రం అస్సలు కాఫీ తాగకూడదు. వారు ఎవరు? కాఫీ ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం. వీరు కాఫీ తాగకూడదు ►గర్భవతులు లేదా తల్లిపాలు ఇస్తున్న వారు కాఫీకి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ►ఒకవేళ తాగినా, 200 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ►అలాగే పాలిచ్చే తల్లులు కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ►అందువల్ల వీరు పాలిచ్చే రోజుల్లో కాఫీ మానటం ఉత్తమం. ►మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలి. ►కొంతమంది వ్యక్తులలో కాఫీ ఆందోళనను తీవ్రతరం చేస్తుంది. అందువల్ల, తరచు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నవారు కాఫీ తాగడం మానేయాలి లేదా తగ్గించాలి. మజ్జిగ వల్ల కలిగే ఈ ఆరోగ్య లాభాలు తెలుసా? ►రోజూ మధ్యాహ్నం భోజనం తర్వాత గ్లాస్ మజ్జిగ తాగితే డీహైడ్రేషన్ దరి చేరదు. ►మజ్జిగ ప్రోబయోటిక్. అంటే ఇది మన జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ►మజ్జిగలో చిటికడు జీలకర్ర లేదా వాము పొడి కలిపి తాగితే జీర్ణసమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీలు ఉండవు. ►మజ్జిగ లో ఉండే అనేక ప్రోటీన్లు, మినరల్స్ మనశరీరానికి రోజూ అవసరమైన అనేక విధులు నిర్వర్తించేందుకు దోహదపడతాయి. ►కాల్షియం లోపం ఉన్నవారు రోజూ మజ్జిగ తాగడం మంచిది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చదవండి: Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకున్నారంటే! -
Sakshi Cartoon: మజ్జిగ పాకెట్ తాగి సడెన్‌గా అలా వేడెక్కి పోయారేంటి సార్!
మజ్జిగ పాకెట్ తాగి సడెన్‌గా అలా వేడెక్కి పోయారేంటి సార్! -
చల్లగా వుండండి
వేసవి తన చండప్రతాపం చూపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. బయటకు వెళ్తే వడదెబ్బ, డీ–హైడ్రేషన్ సమస్యలు వెన్నాడే పరిస్థితి. ఆహారాల పరంగా అందరూ చలువ పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ద్రవాహారాలైతే మజ్జిగ, కొబ్బరినీళ్ల వంటివీ, పండ్ల విషయానికి వస్తే కీర, పుచ్చకాయలు, కర్బూజ వంటివి మామూలే. ఇలా అందరికీ తెలిసిన సాధారణ చలవచేసే పదార్థాలే కాకుండా... మనం రోజూ తీసుకునే వాటితో పాటు, మరికొన్ని ప్రత్యేక ఆహారాల గురించి తెలుసుకుందాం. అలాగే వేసవితాపాన్ని సమర్థంగా ఎదుర్కోడానికి పనికి వచ్చే ఘనాహారాలేమిటి, వేటితో ఎలాంటి ప్రయోజనాలుంటాయన్న సంగతులతో పాటు... కొన్ని ఆహారాలపై ఉండే అపోహలూ, వాస్తవాలతోపాటు అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. చల్లబరిచే ఆహార ధాన్యాలివే... వరి: వరిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువనీ, అందుకే తినగానే తక్షణం శక్తి సమకూరుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది చలవ చేసే ఆహారమేనని చెప్పవచ్చు. పైగా చాలా తేలిగ్గా జీర్ణమవుతుంది. పొట్టుతీయని స్వాభావికమైన వరిలో విటమిన్–బి కాంప్లెక్స్ చాలా ఎక్కువ. స్వాభావికంగా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పాలిష్ చేయని వరి అన్నం, పోహా, ఇడ్లీ, దోస వంటివి ఈ వేసవిలో మనకు మేలు చేస్తాయి. బార్లీ: బాగా చలవ చేసే ఆరోగ్యకరమైన ఆహారాల్లో బార్లీ చాలా ముఖ్యమైనది. దీన్ని వేసవి ధాన్యం (సమ్మర్ సిరేల్) అని చెప్పడం అతిశయోక్తి కాదు. బార్లీలో ఫాస్ఫరస్ చాలా ఎక్కువ. దాంతో పాటు క్యాల్షియమ్, ఐరన్ పాళ్లూ అధికంగానే ఉంటాయి. బార్లీ అనేది అల్సర్, డయాబెటిక్ రోగులకు అమృతం లాంటిది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధిగ్రస్తులకు ఉపశమనం ఇస్తుంది. బార్లీ గింజలను ఉడికించి సలాడ్‌గా తీసుకోవచ్చు. అలాగే దీని పిండితో పూరీలు, చపాతీలను చేసుకోవడమే కాకుండా అట్లుగా కూడా వేసుకోవచ్చు. బార్లీ జావ చలవ పానియంగా పనిచేస్తుంది. కొంతమంది దీన్ని నిమ్మకాయ నీటితో కలుపుకొని కూడా తాగుతుంటారు. ఎలా తీసుకున్నా ఈ వేసవిలో బార్లీ చాలా మంచి ఆహారం. తృణధాన్యాలు (చిరుధాన్యాలు) ఇటీవల చిరుధాన్యాల (మిల్లెట్స్) వాడకం చాలా ఎక్కువగా పెరిగింది. ఆరోగ్య స్పృహ పెరగడంతో ఈమధ్య చాలామంది రాగులు, కొర్రలు, సజ్జలు, ఊదలు లాంటి చిరుధాన్యాలను చాలా మక్కువతో తమ ప్రధాన ఆహారంగానే తీసుకుంటున్నారు. కొంతమందిలో వీటిని వేసవిలో తీసుకోకూడదనే దురభిప్రాయం ఉంది. అయితే ఇది కేవలం అపోహ మాత్రమే. పైగా వేసవిలో వీటిని తీసుకోవడం వేసవిని ఎదుర్కోవడంతో పాటు... ఇంకా అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చాలామంది తృణధాన్యాలను ఇటీవల అన్నంలా వండుకుంటున్నారు కదా. దానికి బదులుగా వరి అన్నాన్ని గంజి కాచుకున్నట్లుగానే వేసవిలో వీటిని జావలాగా కాచుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం... చలవకు చలవ. అయితే వీటిని అలా వండే ముందుగా క్రితం రాత్రి నానబెట్టుకోవడం మరవద్దు. ఇక్కడ పేర్కొన్న విధంగా సజ్జలతో చేయదగిన కొన్ని రకాల రెసిపీలలాగే మిగతా తృణ(చిరు)ధాన్యాలతోనూ దాదాపు అలాంటివే చేసుకోవచ్చు. ఉదాహరణకు సజ్జలను నీళ్లలో బాగా నానబెట్టి, లస్సీ తయారు చేసుకున్న తర్వాత వాటిని... ఆ పానీయంతో కలుపుకొని బాజ్రా లస్సీలా చేసుకోవచ్చు. ఇది వేసవిని ఎదుర్కొనేందుకు చాలా సమర్థమైన పానీయం. ఇందులో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉండటంతోపాటు ఐరన్, ఫాస్ఫరస్, క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటాయి. వీటితోపాటు పీచు పదార్థాలూ ఎక్కువే. పైగా తృణధాన్యాలన్నింటిలోనూ పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి అవి వేసవిలో సులభంగా జీర్ణమైపోయి ఒంటిని తేలిగ్గా ఉంచుతాయి. పప్పుదినుసులు (దాల్స్) పప్పుధాన్యాల్లో పెసర్లు, సాగో లాంటి పప్పులు ఒంటిని చల్లబరచడంలో కీలక భూమిక వహిస్తాయి. పెసర్లు/పెసలు: వీటిలో చాలారకాల ఖనిజలవణాలు ఎక్కువ. వేసవిలో మనం చెమట రూపంలో కోల్పోయే పోషకాలు ఖనిజ లవణాలే ప్రధానం. వాటిని భర్తీ చేయడానికి ద్రవాలతో పాటు వాటిని తీసుకుంటూ ఉండాలి. ద్రవాలతోపాటు ఖనిజలవణాలు తగ్గడాన్నే డీ–హైడ్రేషన్ అంటారు. వేసవిలో ఈ ప్రమాదం చాలా ఎక్కువ. పెసర్లలో క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఖనిజాలు చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు... పెసలు చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. అందుకే వీటిని ఎన్నో రకాలైన రెసిపీలుగా చేసుకొని... వైవిధ్యమైన వంటకాలుగా తీసుకోవచ్చు. ఆకుపచ్చటి ఆకుకూరలు, కొన్ని కాయగూరలతో కలిపి, పైన కాస్తంత ఆలివ్‌నూనెను డ్రెస్సింగ్‌గా వేసుకొని సలాడ్‌గా తీసుకోవచ్చు. సలాడ్‌లో టొమాటోలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరప... లాంటి వాటితో కలిపి తీసుకుంటే అవన్నీ ఖనిజలవణాలనూ పుష్కలంగా సమకూర్చుతాయి. అంతేకాదు... ఇక్కడ సలాడ్‌లో పేర్కొన్న పదార్థాలన్నీ చలవచేసేవే. ఇక వంటకాల్లో పెసరట్టు అందరూ చాలా ఇష్టంగానూ, విస్తృతంగా తినే రూపం. పెసర్లతో ఉప్మా, కిచిడీ కూడా చేసుకోవచ్చు. నిజానికి కాస్తంత జావజావగా ఉప్మా, కిచిడీ లాంటి రెసిపీలను ఆయుర్వేదంలో స్నిగ్ధవంటకాలుగా చెబుతుంటారు. పెసర్లు కాలేయం పనితీరునూ మెరుగుపరుస్తాయి. శనగలు: దేశంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మించిపోయే చాలా వేడిప్రదేశాల్లో శనగలను ఒక ప్రధానాహారంగా ఉపయోగిస్తుంటారు. ఇందులో ఐరన్, మెగ్నీషియమ్, క్యాల్షియమ్ లాంటి లవణాలు చాలా ఎక్కువ. వీటిని చాట్ రూపంలో చాట్భండార్లలోనూ, కొన్ని చోట్ల ఇళ్లలోనూ చేసుకుంటూ ఉంటారు. ఇక టొమాటోలు, ఉల్లిముక్కలు, పచ్చిమిరపకాయలతో పాటు కొన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలతో కలిపి చెనా సలాడ్స్‌గా కూడా తింటుంటారు. శనగలు కూడా వేసవిలో చలవపదార్థంగా ఉపయోగపడ టంతో పాటు ఖనిజలవణాలను పుష్కలంగా ఒంటికి అందిస్తాయి. వేసవి కూరలు కాకరకాయ: కేవలం వంటకాలలో కూరగా ఉపయోగపడటంతో పాటు డయాబెటిస్ నివారణ, నియంత్రణలలో దీనికి ఉన్న ప్రాధాన్యం అందరికీ తెలిసిందే. వేసవిలో ఒక మనిషి కోల్పోయే దాదాపు అన్ని రకాల ఖనిజలవణాలన్నీ కాకరకాయలోనే ఉన్నాయంటే అది అతిశయోక్తి కాదు. అందుకే దీన్ని అనేక రకాల వైద్యప్రక్రియల్లో ఔషధంగా కూడా ఉపయోగిస్తుంటారు. కాకరకాయ కూరను వేసవిలో ఎక్కువగా వండుకోవడం చాలా మంచిది. చలవచేయడంతో పాటు ఇది సాధారణ వ్యాధినిరోధకతను పెంచి వేసవిలో వచ్చే చాలా రకాల జబ్బులను నివారిస్తుంది. చర్మం పేలడం, చర్మంపై పగుళ్లను నిరోధిస్తుంది. వేడిమికి ట్యాన్కావడాన్నించి కూడా కాకర మన ఒంటిని కాపాడుతుంది. గోరుచిక్కుడు: ఈ వేసవిలో తేలిగ్గా జీర్ణం కావడంతో పాటు, ఒంట్లో అవసరమైన అన్ని ఖనిజలవణాలనూ భర్తీ చేస్తుంది. దీనిలో ఉన్న గ్లైకోన్యూట్రియెంట్స్ రక్తంలో చక్కెరపాళ్లను నియంత్రిస్తాయి. దాంతో గోరు చిక్కుళ్లు వేసవిలో డయాబెటిస్ రోగులకు మంచి రక్షణ ఇస్తాయి. ఇందులోని క్యాల్షియమ్, ఫాస్ఫరస్ ఎముకల్లోకి తేలిగ్గా ఇంకుతాయి. పైగా ఇందులో ఉన్న పొటాషియమ్, ఫోలేట్ పోషకాలు గుండెకు మేలు చేస్తాయి. ఇందులో పోటాషియమ్ పుష్కలంగా ఉన్నందున ఇవి రక్తపోటునూ (హైబీపీని) అదుపు చేస్తాయి. మెదడు ప్రశాంతంగా ఉంచగల అద్భుతమైన ఆహారం ఇది. వేసవిలో ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్నందున సులువుగా జీర్ణమై, ఉక్కపోతతో కూడిన వాతావరణంలో శరీరం చాలా తేలిగ్గా ఉండేందుకు ఇవి ఉపకరిస్తాయి. తోటకూర (అమరాంత్ గ్రీన్స్) : వేసవిలో తోటకూర తినడం చాలా మంచిది. ఇందులోని ప్రోటీన్లు, ఫోలేట్ వంటి విటిమిన్లు, ఖనిజలవణాలు ఒంటిలోని మినరల్ రిసోర్సెస్‌ను భర్తీ చేయడంతో పాటు గుండెజబ్బులు, గుండెపోటు, పక్షవాతం, అనేక రకాల క్యాన్సర్లు, డయాబెటిస్‌ను నివారిస్తాయి. పుట్టగొడుగులు: పూర్తిగా శాకాహారాన్ని మాత్రమే తీసుకునే వేగన్లకు పుట్టగొడుగులు మంచి ప్రోటీన్ వనరుగా చెప్పవచ్చు. ఇందులో నీటిపాళ్లు చాలా ఎక్కువ. పుట్టగొడుగుల్లో దాదాపు 92% నీళ్లే ఉంటాయి. కాబట్టి వేసవిలో అనేక రెసిపీలుగా వీటిని చేసుకొని తినడం అన్ని విధాలా మేలు చేస్తుంది. వేసవి... కొన్ని ఆహారాల పట్ల అపోహలు గుడ్లు: సాధారణంగా గుడ్లు వేడి చేస్తాయనే దురభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అందుకే వేసవిలో దీన్ని వాడకాన్ని తగ్గిస్తారు. అయితే గుడ్లు వేడి చేస్తాయనేది పూర్తిగా అపోహ మాత్రమే. గుడ్లలో దాదాపు 75% నీళ్లే ఉంటాయి. పైగా ఇందులో ఖనిజాలు లవణాలూ అన్నీ ఎక్కువే. అందుకే ఇవి చలవ చేయడంతో పాటు ఒళ్లు కోల్పోయే నీటినీ భర్తీ చేస్తాయి. వేసవిలో గుడ్లను మంచి బ్రేక్‌ఫాస్ట్‌గా పరిగణించవచ్చు. పాలు: చాలామందిలో వేసవిలో పాలను అంతగా తీసుకోకూడదనీ, పెరుగుగా తోడుపెట్టి... దాన్ని కూడా మజ్జిగగా మార్చే తీసుకోవాలని అంటుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ చాలామంచిదే. ఎండాకాలంలో దాని వాడకం కూడా ఎక్కువే. కానీ వేసవిలో పాలు కూడా మంచి ఆహారమే. నిజానికి పాలలో నీటిపాళ్లే చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు మనం కోల్పోయే ఖనిజలవణాలూ ఉంటాయి. అంటే పాలు తాగడం అంటే నీటినీ, ఖనిజలవణాలనూ ఏకకాలంలో భర్తీ చేయడమేనన్నమాట. అందుకే వేసవిలో ఉదయం, రాత్రి వేళల్లో పాలు తాగడం చాలా మేలు చేస్తుంది. సూప్‌లు అన్ని రకాల సూప్‌లలోనూ దాదాపు 98 శాతం నీళ్లే ఉంటాయి. మిగతా సూప్‌లలో ఉపయోగించే మిగతా ఆకుకూరలు, కాయగూరల్లోంచి సూప్‌లోకి లవణాలు పుష్కలంగా ఊరి, అవి తేలిగ్గా ఒంటపడతాయి. అందుకే వేసవిలో అన్ని రకాల సూప్‌లు తీసుకోవడం మేలు చేస్తుంది. మొక్కజొన్న, దోసకాయ, టోమాటో, ఆలూ (బంగాళదుంప), చిలగడదుంప (మోరంగడ్డ), గ్రీన్‌పీస్, జ్యూషీనీ, అవకాడో, బీట్రూట్, పుదీనా, కొత్తిమీర, బ్రాకలీ, పుట్టగొడుగులు (మష్రూమ్స్)... ఇలా దాదాపు అన్ని రకాల ఆకుకూరలు/కాయగూరలతో సూప్‌లు తయారుచేసుకోవచ్చు. అవన్నీ వేసవిలో ఖనిజలవణాలను చాలా వేగంగా ఒంటికి సమకూర్చుతాయి. పిల్లలకు జావ రూపంలో ఈ వేసవిలో పిల్లలు ఆరుబయట ఎండల్లో ఎక్కువగా ఆడుకుంటూ ఉంటారు. దాంతో వారు చాలా వేగంగా నీళ్లనూ, లవణాలను కోల్పోతుంటారు. పైగా ఈ సీజన్లో ఘనాహారం తీసుకోవడం ఒకింత కష్టంగా ఉంటుంది. అందుకే జావ రూపంలోనూ లేదా పలచటి ఉప్మా (పారిజ్) రూపంలో రెసిపీలను తీసుకోవడం వల్ల ఒంటికి నీళ్లూ, లవణాలూ తక్షణం సమకూరతాయి. ఇలా జావరూపంలో తీసుకునేందుకు రాగులు మేలైన ఆహారం. ఇలా జావ/పారిజ్ రూపంలో తీసుకునేందుకు నూకలూ మంచివే. అయితే ఆర్గానిక్ మార్గంలో పండించిన పొట్టుతీయని వరినూక, గోధుమనూక చాలా మేలు చేస్తాయి. వీటిలో పీచుపదార్థాలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలకూ, వృద్ధులకూ ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి. దాంతో వేసవిలో ఒళ్లు చాలా తేలిగ్గా ఉంటుంది. పానీయాలు... సాధారణంగా వేసవిలో నిమ్మకాయరసాన్ని తీసుకొని అందులో కాస్తంత పంచదారతో చేసుకునే పానీయం చాలా త్వరగా చేసుకోవచ్చు. పైగా చాలా చవగ్గా కూడా తయారవుతుంది. అలాగే దానికంటే కాస్త ఖరీదే అయినా బత్తాయిరసం, ఆరెంజ్ జ్యూస్, ద్రాక్షపానియాలూ అందరికీ అందుబాటులో ఉండేవే. అయితే దీనితోపాటు వేసవిని సమర్థంగా ఎదుర్కొనే పానీయమే సారస్పరిల్లా. దీన్ని ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. సారస్పరిల్లా: ఇది భూమి కింద పెరిగే ఒక రకం వేరు. దీన్నే చాలామంది చాలా చోట్ల వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. కొందరు సుగంధ అనీ, మరికొందరు మారేడు అనీ, ఇంకొందరు నన్నారి అని దీన్ని పిలుస్తారు. దీని వేర్లతో ఎసెన్స్ తీసుకొని లేదా ఆ వేర్ల పౌడర్‌ను ఉపయోగించి, ఒక గ్లాసులో కాస్తంత ఎసెన్స్ తీసుకొని, అందులో నీళ్లు లేదా సోడా కలపాలి. ఒక టీస్పూన్ నిమ్మరసం, కాస్తంత చక్కెరతో చాలా పరిమళ భరితమైన వేసవి పానీయం తయారవుతుంది. ఇది చలవచేస్తుందీ, ఆరోగ్యానికీ మేలూ చేస్తుంది. ఇవీ కాకుండా ఈ వేసవిలో మామిడిపండ్లు విరివిగా లభిస్తాయి కాబట్టి... ఆమ్‌పన్నా అనేది సీజనల్ డ్రింక్‌గా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవేగాక ఖస్ షర్బత్, వెలగపండు షర్బత్, రోజ్ షర్బత్‌లు చాలా మంచివి. ఇక వేసవిలో చెరుకురసాన్ని తాగడానికి చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఇందులో కల్తీనీళ్లనుంచి తయారు చేసే ఐస్ కలపడం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి చెరుకురసాన్ని ఎలాంటి ఇతర పదార్థాలతో కలపకుండా తాజాగా తీసుకోవడం చాలా మేలు. ఇక ఇవేగాక... పుచ్చకాయ – ఇందులో 80 శాతం కంటె అధికంగా నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. గ్రిల్డ్ వెజిటబుల్స్ – ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి కూరలను ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినటం మంచిది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వేసవిలో ఎండలో తిరగటం వల్ల కలిగే చర్మవ్యాధులనుంచి రక్షిస్తాయి. వెజిటబుల్ చీజ్ సలాడ్స్ – తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన అనేక రకాల కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు. కొవ్వుపదార్థాలు తక్కువగా ఉండే పానీయాలు – వేసవి రాగానే సాధారణంగా ... తియ్యగా, చిక్కగా ఉండే కాఫీ, టీ, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోవటం చూస్తుంటాం. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటివల్ల తాత్కాలికంగా దాహం నుంచి ఉపశమనం లభిస్తుందే కాని, అవి ఆకలిని తీర్చలేవు. అందువల్ల – మజ్జిగ, లస్సీ వంటివి తీసుకోవాలి. పండ్లతో తయారయిన డెజర్ట్స్ – చిక్కగా, మందంగా ఉండే డెజర్ట్స్‌ను వేసవిలో తీసుకోకపోవడమే మంచిది. వీటికి బదులుగా పండ్లతో తయారు చేసిన డెజర్ట్స్‌ని తీసుకోవాలి. తక్కువ కొవ్వు ఉన్న తాజా పండ్లతో కూడిన పెరుగు, ఫ్రూట్ కస్టర్డ్ వంటివి తీసుకోవటం మంచిది. ఇవి శరీరానికి కావలసిన ప్రోటీన్లు, క్యాల్షియంలను అందిస్తాయి. వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల పండ్లు, బెర్రీలు తీసుకోవాలి. వేసవిలో లభించే ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి. ఇవి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. చల్లని కుకుంబర్ – దోస వంటివి సహజంగానే చల్లగా ఉంటాయి. తాజాగా ఉన్న చల్లని దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోను, కూరలలో వాడుకోవాలి. మామిడి – కేవలం వేసవిలో మాత్రమే లభిస్తాయి. ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి. వేడి చేస్తాయనే అభిప్రాయం ఉన్నా సీజనల్ ఫ్రూట్‌గా చాలా మంచి ఆరోగ్యాన్నిస్తుంది. బెర్రీలు (స్ట్రాబెర్రీలు)– ఇవి చాలా రుచిగా ఉంటాయి. వేసవిలో ఈ చిన్న చిన్న పళ్లను తినటం మంచిది. అంతేకాక వీటిని పెరుగులోనూ, ఐస్‌క్రీంలాంటి వాటిలోను వాడవచ్చు. పనీర్ – ఇందులో ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువ. వాల్నట్స్ – వేసవిలో తీసుకునే ఆహారంలో కొద్దిగా ఆక్రోట్లు (వాల్నట్) , చేపలు తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే ఒమేగా – 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అయితే వేయించిన చేపల కంటె ఉడకబెట్టిన లేదా గ్రిల్డ్ చేపలు మంచిది. ఓట్లు – ఇందులో ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే తీసుకోవటం మంచిది. ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్‌పెపర్... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. నీరు – దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు. పెద్దలకు ►బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి వేసవి మంచి సమయం. పద్ధతి ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటే, బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. నేరుగా ఎండలోకి వెళ్లి వ్యాయామం చేయటం ఈ కాలంలో మంచిది కాదు. ►తాజాపండ్లు, కూరలు తీసుకోవాలి. తర్బూజా, పుచ్చకాయ వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి. ►మజ్జిగను ఎక్కువగా తాగుతుండాలి. ►తాజాగా ఉండే పండ్లరసాలు తీసుకోవటం మంచిది. ►క్యారట్లు, బీట్రూట్లను రసం రూపంలో తీసుకుంటే మంచిది. ఈ కాలంలో దొరికే తాజాగా ఉండే ఆకుపచ్చ రంగు కూరల వాడకం చాలా మంచిది. ►మధ్యాహ్నం, రాత్రివేళలో తీసుకునే భోజనంలో తప్పనిసరిగా తాజా పచ్చికూరలు, మొలకెత్తిన ధాన్యం ఉండేలా చూసుకోవాలి. ►ఆల్కహాల్ మానేయాలి. ఇక కెఫిన్ ఉంటే కాఫీలవంటి వాటిని కూడా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే అవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. పీచుపదార్థాలు (ఫైబర్) పేగు సంబంధిత సమస్యలు వయసుపెరిగే కొద్దీ ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా మలబద్ధకం అధికమవుతుంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తగినంత పీచుపదార్థాలు తీసుకోవటం అవసరం. వీటిని తీసుకోవటం మంచిది... ►పొద్దున్నే అల్పాహారంగా తృణధాన్యాలు లేదా ఓట్లు ►హోల్గ్రెయిన్తో చేసిన బ్రెడ్ ►గోధుమ పాస్తా లేదా బ్రౌన్ రైస్ ►బీన్స్ లేదా ఆ జాతికి చెందిన గింజలు తీసుకోకూడని ఆహారాలు ►వేసవిలో ఉప్పును సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇది డీహైడ్రేషన్‌ను కలిగిస్తుంది. దాహాన్ని పెంచుతుంది. ►ఈ సీజన్లో కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలి. అలాగే ఆయిల్స్ ఉపయోగాల్సి కూడా వీలైనంతగా తగ్గించాలి. ►కాఫీ, టీ, కూల్‌డ్రింక్స్‌లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. అందుకే అవి డీహైడ్రేషన్ కలిగిస్తాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండాలి. ►రెడ్‌మీట్ వంటి మాంసాహారం నుంచి దూరంగా ఉండటం ఈ సీజన్లోనే కాదు... ఏ సీజన్లో అయినా మంచిదే. ►ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్ల వంటి వాటికి దూరంగా ఉండాలి. ►చక్కెర ఎక్కువగా ఉండే అన్ని రకాల పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. పిల్లలకు... ►వేసవిలో పిల్లలు ఇంట్లో గడుపుతుంటారు. ప్రయాణాలు చేస్తుంటారు. లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉంటారు. విపరీతంగా ఆడుతూండటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటిశాతం తగ్గిపోతుంటుంది. అందువల్ల పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి. ►పాల ఉత్పత్తులు – లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రొటీన్లను, క్యాల్షియమ్‌ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి. అయితే ఇందులో చక్కర పరిమితంగానే వాడాలి. ►తాజా పండ్లు, చల్లగా ఉండే పండ్ల రసాలు వంటివి కూడా పిల్లల శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడతాయి. ►పిజ్జాలు, శాండ్విచ్ వంటివి పనీర్, తాజాకూరగాయలతో తీసుకుంటే పరవాలేదు కాని, ఎక్కువగా చీజ్ ఉపయోగించినవి మాత్రం మంచిది కాదు. ►గ్రిల్డ్ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు. ►ఇంట్లో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు. వృద్ధులకు ►వయసు మీద పడే కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. సమతుల ఆహారం తీసుకుంటే మాత్రం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమయిన బరువుతో ఉండటానికి క్రమపద్ధతిలో తీసుకునే ఆహారం మంచిది. అందుకే వీరు తీసుకునే ఆహారంలో. ►గంజిలాంటి కార్బోహైడ్రేట్లు అంటే గోధుమ, బ్రౌన్ రైస్, బంగాళదుంపలు, తృణధాన్యాలు . ►ప్రొటీన్లు, కొవ్వు తక్కువగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు, పప్పు. ►ఆహారంలో ఐదువంతుల భాగం పండ్లు, కూరలు లేదా పండ్లరసాలు. ►తగినంత ఉప్పు (వృద్ధులు రోజుకి ఆరుగ్రాముల ఉప్పు కంటె ఎక్కువ తీసుకోకూడదు). ►ఈ సీజన్లో డీహైడ్రేషన్ ఎక్కువ కాబట్టి లవణాలను భర్తీ చేసేలా పొటాషియమ్, సోడియమ్ ఎక్కువగా ఉండే అన్ని రకాల పండ్లు తీసుకోవాలి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ , యశోద హాస్పిటల్స్,మలక్‌పేట, హైదరాబాద్ -
మజ్జిగ అమ్ముతున్న ‘చిట్టిబాబు’..?
సాక్షి, హైదరాబాద్ : గ్లాసు మజ్జిగ మహా అయితే ఎంత ఉంటుంది రూ.10 లేదా రూ.20 మరీ ఏ స్టార్ హోటల్లోనే అయితే ఓ వంద రూపాయలు ఉంటుంది. అంతే కానీ ఓ గ్లాసు మజ్జిగ కోసం వేల రూపాయలు ఖర్చుపెట్టే వారిని ఎక్కడా చూసి ఉండకపోవచ్చు. ఒక్క మజ్జిగనే కాదు ఐస్‌క్రీమ్, సోడా ఖరీదు కూడా దాదాపు ఇంతే. అయినా జనాలు ఎగబడి మరి కొన్నారు. ఏంటాబ్బ వాటి ప్రత్యేకత అని ఆలోచిస్తున్నారా...! ఇక్కడ మజ్జిగ, సోడా వీటికి పెద్ద ప్రత్యేకత ఏమి లేదు కాని వాటిని అమ్మే వ్యక్తి మాత్రం చాలా ప్రత్యేకం. ఆయనే మెగా ‘పవర్ స్టార్ రామ్ చరణ్’. రామ్ చరణ్ మజ్జిగ అమ్ముతున్నాడంటే అదేదో షూటింగ్ కోసం అనుకుంటే పొరబడినట్లే. ఓ 60 మంది చిన్నారులను ఆదుకోవడానికి రామ్ చరణ్ ఇలా మజ్జిగ అమ్మే వ్యక్తిగా మారారు. ఇదంతా కూడా ఓ ప్రముఖ తెలుగు టీవీ చానల్లో ప్రసారమవుతున్న లక్ష్మీ మంచు ‘మేము సైతం’ కార్యక్రమం కోసం. లక్ష్మీ మంచు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం ద్వారా నిస్సహాయులకు చేయుతనివ్వడం కోసం టాలీవుడ్ తారలు మేముసైతం అంటూ ముందుకు వస్తున్నారు. ఆపన్నులను ఆదుకోవడం కోసం సామాన్యులుగా మారి ఓ రోజంతా కష్టపడి పని చేసి వారి కోసం డబ్బు సంపాదిస్తున్నారు. మేము సైతం మొదటి సీజన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో రెండో సీజన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం మొదటి సీజన్లో డా. మోహన్ బాబు, అలీ, రానా, రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు ఇంకా అనేక మంది తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రసారమవుతున్న రెండో సీజన్లో ఇప్పటి వరకూ జయప్రద, నివేదా థామస్, కీర్తి సురేష్‌లు పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి లిస్టులోకి రామ్ చరణ్ కూడా చేరారు. 60 మంది చిన్నారులకు ఆశ్రయం ఇస్తున్న ఓ శరణాలయాన్ని ఆదుకోవడానికి ‘చిట్టిబాబు’ ఇలా మజ్జిగ అమ్మే వ్యక్తి అవతారం ఎత్తారు. ఈ విషయం గురించి లక్ష్మీ మంచు ‘నా ప్రియ స్నేహితుడు రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు. 60మంది చిన్నారులను ఆదుకోవడానికి ‘మేము సైతం’ కార్యక్రమానికి వచ్చింనందుకు ధన్యవాదాలు. ఈ సీజన్లో ఇది బెస్ట్ ఎపిసోడ్ అవుతుంది. దీన్ని వీక్షించేందుకు ప్రేక్షకులతో పాటు నేను చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాం.’ అంటూ తన ట్విటర్లో పోస్టు చేశారు. -
బ్యూటిప్స్
మూడు టేబుల్ స్పూన్ల గోరింటాకు పొడిలో బాగా పండిన అరటి పండు ఒకటి, పావు కప్పు పుల్లటి మజ్జిగను తీసుకుని బాగా కలపాలి. ముందుగా గోరింటాకులో మజ్జిగ పోస్తే పొడి నాని మెత్తబడుతుంది. అందులో అరటిపండును మిక్సీలో బ్లెండ్ చేసి కలపాలి. అవసరమైతే మజ్జిగ మోతాదును పెంచుకోవచ్చు లేదా కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది కేశాలను ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది, పొడిబారకుండా కాపాడుతుంది. -
ముఖానికి మజ్జిగ పట్టుంచండి!
ఆనందం మజ్జిగ తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. మజ్జిగ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. అయితే మజ్జిగ ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేస్తుంది. మజ్జిగను కురులకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత కడిగేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మజ్జిగను చర్మానికి రాసుకుని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గడంతోపాటు చర్మం కూడా మృదువుగా మెరిసిపోతుంది. ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి. -
మజ్జిగ... మన ప్రోబయాటిక్ మందు!
గుడ్‌ఫుడ్ మన జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. అవి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ మనకు మేలు చేస్తుంటాయి. అందుకే వాటిని ‘ప్రో–బయోటిక్’ అని వ్యవహరిస్తుంటారు. మన సంప్రదాయంలో మనకు తెలియకుండానే ప్రో–బయాటిక్స్‌ను తీసుకునే ఆహార అలవాట్లు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఉదాహరణకు ఇడ్లీ, దోసె పిండిని రాత్రి కలుపుకుంటాం. ఆ మర్నాడు చేసుకుంటాం. వేసవిలో చాలా మంది మజ్జిగ విరివిగా వాడతారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనూ భోజనం తర్వాత పెరుగు/మజ్జిగ వాడే అలవాటు ఎప్పటి నుంచో ఉన్న విషయం మనకు తెలిసిందే. మజ్జిగను తాగినప్పుడు మనకు మేలు చేసే అనేకానేక సూక్ష్మజీవులను మన కడుపులోకి తీసుకుంటామన్నమాట. అలా మనకు ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని కడుపులోకి చేర్చుకుంటాం. -
మజ్జిగ ముచ్చటేది బాబు !!
► ముందుకు రాని నిర్వాహకులు ► ఎండలో అవస్థలు పడుతున్న వేతనదారులు ► పట్టించుకోని అధికారులు ఉపాధి హామీ పథకం వేతనదారులు మండుటెండలో మాడిపోతున్నారు. ఎండనుంచి ఉపశమనం కోసం ప్రవేశపెట్టిన మజ్జిగ పథకం వీరి దరి చేరలేదు. పనుల్లో ఉన్న వారందరికీ మజ్జిగను సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ..ఇది కొద్దిమందికే పరిమితమైంది. ప్రధానంగా మజ్జిగను సరఫరా చేసేందుకు నిర్వాహకులు ముందుకు రావడం లేదు. అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం: ఉపాధి పనులు చేస్తున్న వేతనదారులకు మజ్జిగను సరఫరా చేయాలనే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్రంలో తీరేటట్టులేదు. రాష్ట్రంలో లక్షలాది మంది పనులకు వెళ్తున్నప్పటికీ కొద్దిచోట్ల మాత్రమే ఇది అమలవుతోంది. ఒక్కో వేతనదారుకి పని సమయంలో గ్లాసు మజ్జిగ అందజేయాలన్నది ప్రభుత్వం ఉద్దేశమైనప్పటికీ.. అనేక కారణాలతో ఇది ముందుకు సాగడం లేదు. గ్లాసు మజ్జిగను మూడు రూపాయలకు వేతనదారుకి అందజేయాలి. ఈ డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. గ్లాసుడు మజ్జిగ కచ్చితంగా 100 మిల్లీలీటర్లు ఉండాలి. తయారీకి కావాల్సిన పాలు సేకరించి, వాటిని తోడుపెట్టి, నీళ్లు, మిరపాకాయలు, అల్లం, కరివేపాకు వంటివి కలిపిన మజ్జిగను రోజూ ఉదయాన్నే ఉపాధి పనుల వద్దకు బాధ్యులు చేరవేయాలి. ఈ బాధ్యతలను ప్రభుత్వం మహిళా స్వయం సంఘాలకు అప్పజెప్పారు. ఈ విధానం చేయడంలో ఇబ్బందులు ఉండడం, మూడు రూపాయల ధర గిట్టుబాటు ఉండదని భావించిన సంఘ సభ్యులు మజ్జిగ తయారీకి ముందుకు రావడం లేదు. ఫలితంగా ఉపాధి వేతనదారులకు మజ్జిగ ముచ్చటే తీరని పరిస్థితి నెలకొంది. 142 గ్రామాలకే పరిమితం శ్రీకాకుళం జిల్లాలో 1101 గ్రామ పంచాయతీలు ఉండగా.. సుమారు 5.62 లక్షల మంది వేతనదారులు ఉన్నారు. ప్రస్తుతం 953 పంచాయతీల్లో సుమారు 2.24 లక్షల మంది ‘ఉపాధి’ పనులు పనిచేస్తున్నారు. తీవ్రమైన ఎండలో పనులు చేస్తున్న వీరికి మజ్జిగ సరఫరా కావడం లేదు. కేవలం 142 పంచాయతీలకు మాత్రమే పరిమితమైంది. మిగిలిన 811 పంచాయతీల్లో అమలు కానప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వేతనదారుల నుంచి వస్తున్నారు. ఎప్పుడిస్తారో.. మజ్జిగన్నారు. రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వడం లేదు. కనీసం ఉపాధి పని ప్రాంతంలో మంచినీరు దొరకడం లేదు. ఇంటి నుంచే సీసాలతో నీరు తెచ్చుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితిల్లో కాకుండా తరువాత ఇచ్చినా ప్రయోజనం ఉండదు. ఎప్పుడు మజ్జిక పథకం ప్రారంభిస్తారో తెలీదు. - గంగు ఎర్రమ్మ, వేతనదారు, గూడేం నీళ్లు సైతం అందుబాటులో లేవు ఉపాధి పని దగ్గర కనీసం నీరు కూడా అందుబాటులో ఉండడం లేదు. దాహం వేస్తే నీటి కోసం ఇబ్బంది పడుతున్నాం. విశ్రాంతి తీసుకోవడానికి నీడ కూడా ఉండడం లేదు. మజ్జిగ మాటను అధికారులు మరిచిపోయారు. - రాములమ్మ, వేతనదారు, తమ్మినాయుడుపేట, ఎచ్చెర్ల మండలం -
మజ్జిగకు రూ.3 కోట్లు విడుదల
ఒంగోలు : ఎండ తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో చలివేంద్రాల ఏర్పాటుకు జిల్లాకు రూ. 3 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటి ద్వారా మజ్జిగ, మంచినీళ్లతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచనుంది. ఈ నిధులతో మండలాలవారీగా ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటింగ్ అధికారులకు ఏర్పాటు బాధ్యతలను అప్పగించారు. అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటింగ్ అధికారులు తమ నియోజకవర్గ పరిధిలోని మండల అధికారుల ద్వారా గ్రామాల వారీగా సమాచారాన్ని సేకరించాలని ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వపరంగా, పంచాయతీల పరంగా, స్వచ్ఛంద సంస్థల పరంగా 1063 చలివేంద్రాలు నడుస్తున్నాయి, తొలి విడతగా ముఖ్యమైన ప్రాంతాల్లో 156 తాటాకు పందిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అంగన్వాడీ కేంద్రాలతోపాటు ప్రజలు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో గుమికూడి ఉంటారో గుర్తించి అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చలివేంద్రాల వద్ద మజ్జిగ ప్యాకెట్లతోపాటు మంచినీళ్లు ఇవ్వనున్నారు. లక్షా 13 వేల 700 ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా చలివేంద్రాల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. ఎండ తీవ్రతకు గురైనవారికి వెంటనే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కలిపిన నీటిని తాగించడం ద్వారా కొంతమేర ఉపశమనం పొందుతారని ప్రభుత్వం భావిస్తోంది. ప్రచారానికే ప్రాధాన్యం ఈ చలివేంద్రాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చలివేంద్రాల వద్ద పెద్దఎత్తున హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని జిల్లా కేంద్రానికి ఆదేశాలు అందాయి. జిల్లాలో 2400 హోర్డింగ్‌లు ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. వాటితోపాటు 3 లక్షల 24 వేల 740 కరపత్రాలను ముద్రించి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. -
ఖైదీలకు గ్లాస్ చల్లటి మజ్జిగ
వేసవి తాపం నుంచి సేదతీరేందుకు చర్లపల్లి జైల్లో ఖైదీలకు మజ్జిగ పంపిణీ చేయాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈ పధకం సోమవారం అధికారులు ప్రారంభించారు. ప్రతీ ఖైదీకి 50 ఎంఎల్ చొప్పున మజ్జిగ అందించనున్నారు. వేసవి ముగిసే వరకు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
మజ్జిగ లేదు.. నీళ్లు లేవు
►ఉపాధి కూలీలకు తీరని దాహం ► మజ్జిగ సరఫరాకు ముందుకు రాని పొదుపు సంఘాల మహిళలు ► గ్లాస్ మజ్జిగకు రూ.3 ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం ► భగ్గుమంటున్న పాల ధరలు బండిఆత్మకూరు: ఉపాధి కూలీలను వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగించేందుకు మజ్జిగను సరఫరా చేయాలన్న ప్రభుత్వ ఆశయానికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. పొదుపు సంఘాల మహిళలు తమకు గిట్టుబాటు కాదని చేతులెత్తేశారు. దీంతో ఉపాధి కూలీలకు మజ్జిగను ఎలా సరఫరా చేయాలో తెలియక ఎంపీడీఓ కార్యాలయం అధికారులు, ఉపాధి పథకం అధికారులు తలలు పట్టుకున్నారు. ఉపాధి కూలీలకు మజ్జిగను సరఫరా చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాబినెట్లో తీర్మానించారు. ఇందుకు అనుగుణంగా మండల పరిషత్ అధికారులకు ఉత్తర్వులు అందాయి. మండలంలోని 19 గ్రామ పంచాయతీల్లో దాదాపు 2వేల మందికి పైగా ఉపాధి కూలీలు ఉన్నారు. దీంతో ప్రభుత్వం వీరికి ఒక గ్లాస్ మజ్జిగను ఒక ఉపాధి కూలీకి సరఫరా చేసేందుకు రూ.3 చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి ఇటీవల ఏపీఓ శ్రీకళ ఆధ్వర్యంలో ఐకేపీ సిబ్బందిచే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వివిధ గ్రామైక్య సంఘాల లీడర్లు, సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. దీంతో ఏపీఓ సిబ్బంది ప్రభుత్వం నుంచి వచ్చిన మజ్జిగ పథకం గురించి వివరించారు. ఒక్కొక్క సభ్యురాలు 50 నుంచి 100 మంది ఉపాధి కూలీలకు మజ్జిగను సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఒక్క గ్లాస్‌కు కేవలం రూ.3 మాత్రమే చెల్లిస్తామని చెప్పారు. దీంతో పొదుపు సంఘాల మహిళలు తాము ఇంత తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యం కాదని చేతులెత్త్తేశారు. ఎందుకు గిట్టుబాటు కాదంటే.. ప్రస్తుతం మార్కెట్లో లీటరు రూ.50, లీటరు పాలతో 20 గ్లాస్‌ల మజ్జిగ తయారవుతోంది. 20 గాస్ల్‌ల మజ్జిగ సరఫరా చేసేందుకు రూ.60 ఖర్చు ఉంది. ఇందుకు అదనంగా రూ.10 మాత్రం మిగులుతుంది. ఇలా 50 మందికి సరఫరా చేస్తే ప్రభుత్వం నుంచి ఒక్కో గ్లాస్‌కు (100ఎంఎల్)రూ.3 వస్తే రూ.150 చెల్లిస్తారు. అయితే ఇందులో పెట్టుబడిగా రెండున్నరల లీటర్ల పాలకు రూ.125 ఖర్చు అవుతుంది. దీంతో పెట్టుబడి పోను కేవలం రూ.25మాత్రమే వస్తుంది. గ్లాస్‌కు రూ.5 ఇవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మజ్జిగను ఉపాధి కూలీలకు సరఫరా చేయాలంటే కనీసం గ్లాస్‌కు రూ.5 ఇవ్వాలి. ఇదే విషయమై ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులకు తెలియజేశాం. అధికారులు, ప్రభుత్వం ఆ ధర ఇస్తేనే సరఫరా చేస్తాం. - లక్ష్మి, ఈర్నపాడు . పొదుపు మహిళలు ఒప్పుకోవడం లేదు ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనను తమ సంఘాల్లోని సభ్యులకు వివరించాం. అయితే మహిళా సభ్యులు ఇంత తక్కువ ధరకు సరఫరా చేయలేమని చెబుతున్నారు. పాలు, కుండలు, గ్లాస్లు కొని మజ్జిగను తయారు చేసి మహిళలే ఉపాధి కూలీల వద్దకు తీసుకెళ్లి పంపిణీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదని, రేటు పెంచాలని కోరుతున్నారు. - నూర్జహాన్, ఏ.కోడూరు ఐక్యసంఘం లీడర్ -
మజ్జిగే... మరింత రుచిగా!
ఫుడ్ n బ్యూటీ కావాల్సినవి: ఒక కప్పు పెరుగు (చిలకాలి), రెండు వెల్లుల్లిరేకలు, రెండు టీస్పూన్ల నిమ్మరసం, రుచికోసం మిరియాల పొడి, ఉప్పు, పుదీనా ఆకులు, మూడు గ్లాసుల నీళ్లు తయారీ విధానం: పెనంలో ఏదైనా ఆయిల్ వేసి వెల్లుల్లి రేకలను ఒక మోస్తరుగా వేయించాలి. దించిన తర్వాత వాటిని చేత్తో చిదమాలి. అందులో నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. ఈ మిశ్రమాన్ని మజ్జిగలో వేసి కలపాలి. కాసేపు ఫ్రిజ్‌లో చల్లబరిచి సర్వ్ చేసే ముందు పుదీనా ఆకులు వేసుకోవాలి. పోషక విలువలు: ఒక గ్లాసు గార్లిక్ బటర్మిల్క్తో 85 క్యాలరీల శక్తి, ఒక గ్రాము ప్రొటీన్, కొవ్వు ఒక గ్రాము, 375 మిల్లీ గ్రాముల సోడియం లభిస్తాయి. -
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దాం
8 నుంచి అప్పలాయగుంటలో బ్రహ్మోత్సవాలు అధికారులతో సమీక్షించిన జేఈవో పోలా భాస్కర్ తిరుచానూరు, న్యూస్‌లైన్ : వడమాల పేట మండలం అప్పలాయగుంటలో వె లసిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేద్దామని టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ పిలుపునిచ్చారు. జూన్ 8 నుంచి 16వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం ఆలయ ప్రాంగణంలో ఆయన వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. జూన్ 11న నిర్వహించే కల్యాణోత్సవం సందర్భంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లావ్యాప్తంగా 15 ప్రముఖ ఆలయాల నుంచి స్వామికి వస్త్రాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 12న జరిగే గరుడసేవకు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీకాసులహారాన్ని శోభాయాత్రగా తీసుకురానున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులను అందించాలని ఆదేశించారు. జూన్ 4 నుంచి తిరుపతి పరిసర గ్రామాలకు ప్రచార రథాలను పంపి బ్రహ్మోత్సవాలకు భక్తులను ఆహ్వానించాలని కోరారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తిభావం వెల్లివిరిసేలా ధార్మికోపన్యాసాలు, హరికథలు, జానపద కళారూపాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతి నుంచి ప్రతి అరగంటకో బస్సు నడపాలని, గరుడసేవ, రథోత్సవం రోజుల్లో వీటి సంఖ్యను పెంచాలని ఆర్టీసీ అధికారులను కోరారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేయాలని ఆదేశించా రు. పారిశుద్ధ్య నిర్వహణ చక్కగా ఉండాలని, మొబైల్ మరుగుదొడ్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమీక్ష సమావేశంలో స్థానిక ఆలయాల స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, డీపీపీ ప్రత్యేకాధకారి రఘునాథ్, ఎస్టేట్ అధికారి దేవేందర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో బాలాజీ, ఎస్వీ గోశాల డెరైక్టర్ హరినాథరెడ్డి, శ్రీనివాస వాఙ్మయ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్, ఏఈవో నాగరత్న, ఆలయ ప్రధానార్చకులు సూర్యకుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు.