ప్రతీకాత్మక చిత్రం
డెయిలీ కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్–2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. అయితే కొందరు మాత్రం అస్సలు కాఫీ తాగకూడదు. వారు ఎవరు? కాఫీ ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం.
వీరు కాఫీ తాగకూడదు
►గర్భవతులు లేదా తల్లిపాలు ఇస్తున్న వారు కాఫీకి దూరంగా ఉండటం శ్రేయస్కరం.
►ఒకవేళ తాగినా, 200 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు.
►అలాగే పాలిచ్చే తల్లులు కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.
►అందువల్ల వీరు పాలిచ్చే రోజుల్లో కాఫీ మానటం ఉత్తమం.
►మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలి.
►కొంతమంది వ్యక్తులలో కాఫీ ఆందోళనను తీవ్రతరం చేస్తుంది. అందువల్ల, తరచు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నవారు కాఫీ తాగడం మానేయాలి లేదా తగ్గించాలి.
మజ్జిగ వల్ల కలిగే ఈ ఆరోగ్య లాభాలు తెలుసా?
►రోజూ మధ్యాహ్నం భోజనం తర్వాత గ్లాస్ మజ్జిగ తాగితే డీహైడ్రేషన్ దరి చేరదు.
►మజ్జిగ ప్రోబయోటిక్. అంటే ఇది మన జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బాక్టీరియాకు మేలు చేస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
►మజ్జిగలో చిటికడు జీలకర్ర లేదా వాము పొడి కలిపి తాగితే జీర్ణసమస్యలు ఉండవు. మలబద్దకం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీలు ఉండవు.
►మజ్జిగ లో ఉండే అనేక ప్రోటీన్లు, మినరల్స్ మనశరీరానికి రోజూ అవసరమైన అనేక విధులు నిర్వర్తించేందుకు దోహదపడతాయి.
►కాల్షియం లోపం ఉన్నవారు రోజూ మజ్జిగ తాగడం మంచిది. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
చదవండి: Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకున్నారంటే!
Comments
Please login to add a commentAdd a comment