ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీగానీ, టీగానీ పడకపోతే కాలకృత్యాల దగ్గర్నించి ఏ పని కాదు చాలామందికి. ఖాళీ కడుపుతో ఇలాంటి వాటివల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. నిజానికి ఉదయం బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. తద్వారా రోజు చురుకుగా ఉండటానికికావాల్సిన పోషకాలు అందుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.
కాఫీ, టీ అయినా అదొక సెంటిమెంట్‌లాగా మనకి అలవాటు అయిపోయింది. కానీ మంచి ఆరోగ్యం కోసం మంచి డైట్ ,కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి.
టీ లేదా కాఫీ ఉదయం పూట టీ, కాఫీలు అలవాటు మానలేని వారు చక్కెరను బాగా తగ్గించేస్తే బెటర్. మధుమేహ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మానేయాలి.
తాజా పండ్లను, పళ్లతో చేసిన రసాన్ని తీసుకోవచ్చు. క్యారెట్, కీరా, యాపిల్, బీట్‌రూట్ లాంటివాటితో జ్యూస్ చేసుకోవచ్చు. అయితే ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ జోలికి వెళ్లవద్దు. వీటిల్లో ఫైబర్ ఉండదు,పైగా అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది.
జింజర్ టీ, హెర్బల్ టీ
పొద్దున్నే గోరు వెచ్చని నీళ్లు తాగాలి. అలాగే గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలుపు కోవచ్చు. ఇందులోని విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అల్లం, తులసి, పుదీనా ఆకులు, తేనెతో చేసిన హెర్బల్. జింజర్ టీతాగవచ్చు.
కొబ్బరి నీళ్లు: కొబ్బరి నీళ్లలో అవసరమైన పోషకాలు, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు లభిస్తాయి., అలాగే ఫ్రీ-రాడికల్‌తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. షుగర్ లెవల్స్‌ను బట్టి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
కాఫీ, టీలు రోజులో రెండుసార్లు తీసుకోవడం పెద్ద ప్రమాదం ఏమీకాదు. అయితే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తరువాత తీసుకుంటే మంచిది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు చక్కెర వాడకంలో జాగ్రత్త పడాలి.
తాగకూడనివి
- సోడా, కార్బోనేటేడ్ పానీయాలు వీటిల్లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ కలిసి ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలను కలిగిస్తుంది.
- ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక మొత్తంలో కెఫిన్, షుగర్ ఉంటాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. దీని కారణంగా రోజంతా శక్తి లేకపోవడం అలసటగా అనిపిస్తుంది. ఇది కాకుండా ఎనర్జీ డ్రింక్స్ గుండె వేగాన్ని, రక్తపోటును పెంచుతాయనేది గమనించాలి.
Comments
Please login to add a commentAdd a comment