గ్రీన్ టీ, బ్లాక్ టీ, నిమ్మ టీ వంటి ఎన్నో రకాల చాయ్‌లు గురించి విన్నాం. కానీ ఇదేంటి 'నెయ్యి టీ' అని అనుకోకుండి. ఎందుకంటే పోషకాహార నిపుణులు వారంలో కనీసం రెండుసార్లు ఈ టీని తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతున్నారు. మన దైనందిన జీవితంలో దీన్ని భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు. అదెలాగో సవివరంగా చూద్దాం..
'నెయ్యి టీ' అనేది కొత్తగా వచ్చిన వంటకం ఏం కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగించేవారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అంతేగాదు చరక సంహితలో రోజువారీ వినియోగానికి అవసరమైన 11 ప్రధాన ఆహారాలలో దీన్ని ఒకటిగా చెప్పారు ఆయుర్వేద నిపుణులు. దీన్ని సాధారణ టీ మాదిరిగానే చేసుకుంటారు. అయితే చివర్లో ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే అదే నెయ్యి టీ. ఇది తాగేందుకు టేస్టీగానే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందట.
అదెలా అంటే..?
తక్షణ ఎనర్జీని పొందిన ఫీల్ లభిస్తుందట. అందువల్ల చిరుతిండులు తినాలనే కోరికన నివారించడమే కాకుండా ఎక్కువసేపు శక్తిమంతంగా ఉండొచ్చు.
ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది. ఎక్కువ శ్రమ లేకుండా శీఘ్ర శక్తిని పొందడంలో సహాయపడుతుంది.
మలబద్ధకం, జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను సులభతరం చేస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
ప్రకాశవంతంమైన చర్మాన్ని పొందొచ్చట. క్రమం తప్పకుండా తాగితే చర్మానికి మంచి పోషణను అందిస్తుందట. ఇందులో ఉండే విటమిన్లు, ఏ, డీ, ఈ, కేలు చర్మాన్ని హైడ్రేట్ చేసి, పునరుజ్జీవింప చేస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. బ్లడ్ షుగర్‌కి చెక్ పెడుతుంది.
అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ఈ పానీయాన్ని కనీసం వారానికి రెండుసార్లు అయినా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో తీసుకోవడం మంచిదని అన్నారు. ముఖ్యంగా వ్యాయమాలు చేసేవాళ్లకు ఈ టీ మరింత మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.
(చదవండి: రెడ్‌లైట్ థెరపీ అంటే ఏంటీ..? నటి సమంత బ్యూటీ సీక్రెట్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment