సుష్టిగా తిన్నాక పటిపూట కాస్త నిద్ర మంచిదే
కానీ శృతిమించితే మాత్రం, తిప్పలు తప్పవు
గుండెపోటు, డిప్రెషన్, ఊబకాయం
పగటిపూట అన్నం తిన్నవెంటనే కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు. అందులోనూ వేసవి వచ్చిందంటే కాసేపైనా నిద్రపోవాల్సిందే. అయితే ఇది మన ఆరోగ్యానికి అసలు మంచిదా? కాదా? ఎంతసేపు కునుకు తీస్తే మంచిది?
పగటిపూట నిద్రపోవడం కొంతవరకూ మంచిదే. పని నుంచి కొంచెం విశ్రాంతి తీసుకోవడంతో అలసట దూర మవుతుంది. ప్రశాంతంగా, కొత్త ఉత్సాహంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది.అందుకనే దీన్ని పవర్ న్యాప్ అని అంటారు. మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు.
పగటి నిద్ర పనికి చేటు అన్నట్టు ఆరోగ్యానికి కూడా ముప్పే. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇదిరాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ గతంలో చేసిన అధ్యయనం చెబుతోంది.
అంతేకాదు మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందట. కొలెస్ట్రాల్ స్థాయిలలో ఆటంకాలు ఎక్కువ నిద్రను కోల్పోయే రూపంలో కూడా గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది.
వీరికి మినహాయింపు
ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు గరిష్ఠంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చట. మిగిలినవారు గరిష్ఠంగా 10 నిమిషాల నుంచి అరగంట లోపు మాత్రమే పడుకోవాలి.
పగటి నిద్ర నష్టాలు
♦ ఊబకాయం
♦ రాత్రి నిద్రకు భంగం, బాడీ బయలాజికల్ సైకిల్ దెబ్బతింటుంది
♦ రాత్రి నిత్ర లేకపోతే అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆందోళన లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.
♦ డిప్రెషన్
Comments
Please login to add a commentAdd a comment