day time
-
సుదీర్ఘ రాత్రికి కారణమేమిటి?
ఈ ఏడాది డిసెంబర్ 21కి ఓ ప్రత్యేకత ఉంది. పగటి సమయం 8 గంటలూ, రాత్రి సమయం 16 గంటలూ ఉంటుందని అంటున్నారు. కానీ, పదమూడున్నర గంటలే ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.సాధారణంగా ప్రతిరోజూ మనకు 12 గంటల పగలు 12 గంటలు రాత్రి సమయం ఉంటుంది. అయితే రుతువులను బట్టి, భూమిపై ఉన్న ప్రాంతాన్ని బట్టి పగలు – రాత్రుల సమయంలో ఎక్కువ తక్కువలూ ఉంటాయి. భూమి ఇరుసు 23.4ని కోణంలో వంగి ఉండటం వలన సూర్యుని నుండి వెలువడే సూర్యకాంతి భూమిపైన సమానంగా కాకుండా వివిధ కాలాలలో వివిధ రీతుల్లో పడుతుంది. ఫలితంగా రాత్రి–పగలు సమయాల్లో ఒక్కోసారి ఎక్కువ తేడాలు వస్తాయి. దీన్నే ‘ఆయనాతం’ అంటారు.సంవత్సరంలో రెండుసార్లు అయనాతం ఏర్పడుతుంది. మొదటిది వేసవి కాలపు ఆయనాతం కాగా, రెండవది శీతాకాలపు ఆయనాతం. శీతాకాలపు ఆయనాతం డిసెంబర్ 19–23 తేదీల మధ్యలో ఏదో ఒక రోజు ఏర్పడుతుంది. ఈరోజు మనం చూసేది శీతాకాలపు అయనా తాన్నే. ఇదే సమయంలో ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉంటుంది. శీతకాల ఆయనాతంతో భూమి ఉత్తరాయణం ప్రారంభిస్తుంది. అంటే... సూర్యుడు ఉత్తర దిశ వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. అదే క్రమంలో జనవరి నుండి పగలు సమయం క్రమంగా పెరుగుతూ రాత్రి సమయం క్రమంగా తగ్గుతుంది.చదవండి: పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!అయనాతం వంటి వాటిని ఆసరా చేసుకుని కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తామంటూ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసే అవకాశం ఉంది. గ్రహణం ఏర్పడడం, ఆయనాతం ఏర్పడడం, నెలలో ఒకసారి పౌర్ణమి, ఒకసారి అమావాస్య ఏర్పడడం... ఇవన్నీ ప్రకృతిలో చోటు చేసుకునే సహజ ప్రకియలు. శాస్త్రీయ సమాచారాన్ని అర్థం చేసుకుని మోసగాళ్ల పాలబడకుండా జాగ్రత్తగా ఉండాలి. మూఢనమ్మకాలను నిర్మూలించి శాస్త్రీయ సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.– చార్వాక, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్ -
సుష్టిగా తిన్నాక ‘కునుకు’ మంచిదే, కానీ ఈ డేంజర్ కూడా ..!
పగటిపూట అన్నం తిన్నవెంటనే కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు. అందులోనూ వేసవి వచ్చిందంటే కాసేపైనా నిద్రపోవాల్సిందే. అయితే ఇది మన ఆరోగ్యానికి అసలు మంచిదా? కాదా? ఎంతసేపు కునుకు తీస్తే మంచిది? పగటిపూట నిద్రపోవడం కొంతవరకూ మంచిదే. పని నుంచి కొంచెం విశ్రాంతి తీసుకోవడంతో అలసట దూర మవుతుంది. ప్రశాంతంగా, కొత్త ఉత్సాహంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది.అందుకనే దీన్ని పవర్ న్యాప్ అని అంటారు. మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు. పగటి నిద్ర పనికి చేటు అన్నట్టు ఆరోగ్యానికి కూడా ముప్పే. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇదిరాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ గతంలో చేసిన అధ్యయనం చెబుతోంది. అంతేకాదు మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందట. కొలెస్ట్రాల్ స్థాయిలలో ఆటంకాలు ఎక్కువ నిద్రను కోల్పోయే రూపంలో కూడా గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది. వీరికి మినహాయింపు ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు గరిష్ఠంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చట. మిగిలినవారు గరిష్ఠంగా 10 నిమిషాల నుంచి అరగంట లోపు మాత్రమే పడుకోవాలి. పగటి నిద్ర నష్టాలు ♦ ఊబకాయం ♦ రాత్రి నిద్రకు భంగం, బాడీ బయలాజికల్ సైకిల్ దెబ్బతింటుంది ♦ రాత్రి నిత్ర లేకపోతే అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆందోళన లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం. ♦ డిప్రెషన్ -
పగటిపూట 20% తక్కువ.. రాత్రిపూట 20% ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో త్వరలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రానుంది. పగటిపూట వినియోగం తక్కువగా ఉండే సమయంలో విద్యుత్ వాడుకుంటే చార్జీలు 20 శాతం వరకు తగ్గుతాయి. రాత్రిపూట వినియోగం అధికంగా ఉండే సమయంలో విద్యుత్ ఉపయోగించుకుంటే చార్జీలను 20 శాతం మేర పెంచుతారు. ఈ మేరకు టైమ్ ఆఫ్ ద డే(టీఓడీ) టారిఫ్ పేరిట కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త టారిఫ్‌ను అమలు చేయడం వల్ల పీక్ సమయాల్లో గ్రిడ్‌పై భారంతోపాటు విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని తెలియజేసింది. ఈ నూతన విధానం 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొదట వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు అమల్లోకి వస్తుందని ప్రకటించింది. సంవత్సరం తర్వాత.. అంటే 2025 ఏప్రిల్ 1 నుంచి వ్యవసాయ రంగం మినహా మిగతా అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు ఈ నిబంధనలను వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, నూతన టారిఫ్ విధానంతో వినియోగదారులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ అభిప్రాయపడ్డారు. లైట్లు, ఫ్యాన్లు, ఏసీల వినియోగం రాత్రిపూటే ఎక్కువ కాబట్టి వినియోగదారులపై భారం పడుతుందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
అతిగా పగటి కలలు.. కలిగే నష్టాలేంటో తెలుసా?
లండన్: పగటి కలలు.. ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం. మనసుకు ఉల్లాసం కలిగించడంతోపాటు విసుగు, ఒంటరితనం నుంచి ఉపశమనం కల్పిస్తాయి. మనసులో మెదిలే ప్రతికూల భావాల నుంచి బయటపడడానికి కలలను ఆశ్రయిస్తుంటారు. అంతేకాదు.. పగటి కలలతో మనుషుల్లో సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుందని గతంలో పరిశోధనల్లో తేలింది. పేదవాడు క్షణాల్లో ధనవంతుడిగా మారిపోవడం పగటి కలల్లోనే సాధ్యం. అయితే, ఇలాంటి కలలు ఒక పరిమితి వరకు అయితే ఫర్వాలేదు. మితిమీరితే అనర్థాలు తప్పవని యూకే సైంటిస్టులు చెబుతున్నారు. మేల్కొని ఉన్నప్పుడు సగం సమయం కలల్లోనే గడిపితే వాటిని మితిమీరిన పగటికలలు అంటారు. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇలా జరగొచ్చు.అయితే.. ఇలాంటి వాటితో పలు మానసిక రుగ్మతలు తలెత్తుతాయట. ఆందోళన, కుంగుబాటు, అబ్సెసివ్ కంపల్సన్ డిజార్డర్(ఓసీడీ) వంటి ముప్పు ఎదురవుతుందని సైంటిస్టులు గుర్తించారు. జనాభాలో 18 ఏళ్లు దాటిన వారిలో 2.5 శాతం మంది మితిమీరిన కలలతో ఇబ్బందులు పడుతున్నట్లు తేలింది. మాల్ అడాప్టివ్ డే డ్రీమింగ్(ఫాంటసీ డిజార్డర్) అనేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తోందట. ఇజ్రాయెల్ హైఫా యూనివర్సిటీకి చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ ఎలి సోమర్.. బ్రిటన్ సహాకారంతో నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా ఈ డిజార్డర్‌ను తెర మీదకు తీసుకొచ్చారు. అంటే.. ఇలాంటి కలల ద్వారా సానుకూలత కంటే.. ప్రతికూల ధోరణే మనిషిలో పెరిగిపోతుందన్నమాట. ధ్యానం ద్వారా పగటి కలలను నియంత్రించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. -
వ్యవసాయ బోర్లకు పగటిపూటే విద్యుత్
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు రైతన్నల కోరిక నెరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం ఫీడర్లలో గురువారంనుంచి వ్యవసాయ బోర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా మొదలైంది. ఏపీ తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని క్షేత్రస్థాయి అధికారులు విద్యుత్ సరఫరాను దగ్గరుండి పరిశీలించారు. ఫీడర్లలో పరిస్థితి, సాంకేతిక సమస్యలను, ట్రాన్స్ఫార్మర్లపై పడే లోడ్‌ను రికార్డు చేశారు. ఎప్పటికప్పుడు వివరాలను విజయవాడలోని విద్యుత్ ఉన్నతాధికారులకు అందజేశారు. అన్ని జిల్లాల్లో విజయవంతం... అన్ని జిల్లాల్లోనూ విజయవంతంగా 9 గంటల విద్యుత్ అందించినట్టు డిస్కమ్‌ల సీఎండీలు తెలిపారు. చెప్పుకోదగ్గ రీతిలో పెద్దగా సాంకేతిక సమస్యలేమీ రాలేదని, సిబ్బంది కూడా అప్రమత్తంగా వ్యవహరించారని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,663 విద్యుత్ ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహావసరాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. వీటిల్లో 3,854 ఫీడర్లలో నిరాటంకంగా పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమని అధికారులు భావించారు. ఈ ఫీడర్ల పరిధిలో వారం రోజులుగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే, మిగిలిన 2809 (40 శాతం) ఫీడర్లను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగా 9 గంటల నిరంతర సరఫరా సాధ్యం కాదని ముందే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫీడర్ల బలోపేతానికి సర్కార్ రూ.1,700 కోట్లను మంజూరు చేస్తున్నట్టు వెల్లడింది. వీటిల్లో కూడా మార్చి చివరి వారానికి పూర్తిస్థాయిలో పగటి 9 గంటల విద్యుత్ అందించాలని నిర్ణయించారు. భూగర్భ జలాలు అడుగంటిన చోట రెండు విడతలు! తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ సరఫరా వల్ల కొన్ని ప్రాంతాల్లో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో ఏకబిగిన తొమ్మిది గంటలు బోరు నడిచే పరిస్థితి లేదని, ఈ కారణంగా రెండు విడతలుగా విద్యుత్ ఇవ్వాలన్న రైతుల విజ్ఞప్తిని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అవసరమైతే పగటి పూటే రెండు విడతలుగా అందించేందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించారని ఎస్పీడీసీఎల్ ఇన్ఛార్జ్ సీఎండీ వివరించారు. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది గమనించిన తర్వాత ఏ ప్రాంతంలో విద్యుత్ విడతలవారీగా ఎలా ఇవ్వాలనే విషయాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపుతామన్నారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అవసరాలకు కేవలం 7 గంటలే విద్యుత్ సరఫరా జరిగింది. అదీ కూడా చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి సరఫరావల్ల అనేకమంది రైతులు విద్యుదాఘాతంతో చనిపోయారు. అనేక ఇబ్బందులూ పడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా పలు ప్రాంతాల్లో రైతులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జగన్ అప్పట్లోనే పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. యాక్షన్ ప్లాన్ సిద్ధం వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్రంలో మొత్తం 6,663 విద్యుత్ ఫీడర్లు ఉన్నాయి. వీటిద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహ అవసరాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వీటిలో 3,854 ఫీడర్లకు పగటి పూట 9 గంటలు విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉంది. మిగిలిన 2,809 ఫీడర్లను 9 గంటల విద్యుత్ ఇచ్చే సామర్థ్యానికి పెంచేందుకు విద్యుత్ శాఖ తేదీలను ప్రకటించింది. డిస్కమ్‌ల వారీగా.. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) పరిధిలోని తొమ్మిది జిల్లాల్లో 2,214 ఫీడర్ల సామర్థ్యం పెంచాల్సి ఉంది. జూలై 15నుంచి మొదలయ్యే ఈ ప్రక్రియను మార్చి 2020 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఏలూరు, రాజమండ్రి జిల్లాల్లో 595 ఫీడర్లున్నాయి. వీటిని జూన్ 30నుంచి మొదలు పెట్టి, డిసెంబర్ 31. 2019 నాటికి సామర్థ్యం పెంచి, 9 గంటల విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
డిసెంబర్ 1 నుంచి వాణిజ్య డ్రోన్లు
న్యూఢిల్లీ: భారత్‌లో డ్రోన్ల వాణిజ్య వినియోగానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయం, ఆరోగ్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా సహాయక చర్యల్లో డ్రోన్లను వినియోగించేలా వీటిని రూపొందించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం డ్రోన్ల వాడకానికి సంబంధించిన నిబంధనలను ఢిల్లీలో ఆవిష్కరించారు. ప్రస్తుతానికి వ్యవసాయ, ఆరోగ్యం, ప్రకృతి విపత్తుల సందర్భంగా డ్రోన్ల వినియోగంపై మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. 2018, డిసెంబర్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయన్నారు. డ్రోన్ల ద్వారా మనుషుల రవాణాతో పాటు మందులు, ఆహారం, ఇతర వస్తువులను డెలివరీ చేయడాన్ని ఇందులో చేర్చలేదని పేర్కొన్నారు. పగటిపూటే వినియోగం: తాజా మార్గదర్శకాల ప్రకారం పౌర అవసరాల కోసం వాడే డ్రోన్లను కేవలం పగటిపూట మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గరిష్టంగా ఈ డ్రోన్లు 450 మీటర్లు ఎత్తుకు వెళ్లేందుకు మాత్రమే వీలుంది. వీటిని వివాహ వేడుకల చిత్రీకరణలో వాడుకోవచ్చు. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు విమానాశ్రయాలు, తీరప్రాంతాలు, రాష్ట్ర సచివాలయాలు, సైనిక కేంద్రాలు, ఢిల్లీలోని విజయ్‌చౌక్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగించడానికి వీల్లేదు. కేంద్ర నిఘా సంస్థలతో పాటు జాతీయ సాంకేతిక, పరిశోధన సంస్థ వాడుతున్న నానో డ్రోన్లు మినహా అన్ని నానో డ్రోన్లను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి. వీటికి ప్రభుత్వం విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీచేస్తుంది. డ్రోన్ల వినియోగం కోసం తప్పు డు పత్రాలు సమర్పించినా, నిబంధనలు ఉల్లంఘించినా.. లైసెన్సులను సస్పెండ్ లేదా రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేస్తారు. అనుమతి లేకుంటే టేకాఫ్ కాదు.. ‘డిజిటల్ స్కై’ ప్లాట్‌ఫామ్ ద్వారా డ్రోన్ల రిజిస్ట్రేషన్‌తో పాటు టేకాఫ్‌కు అధికారులు అనుమతులు జారీచేస్తారు. ఈ యాప్ స్థానిక పోలీస్‌స్టేషన్‌తో అనుసంధానమై ఉంటుంది. డ్రోన్లను వాడటానికి ముందు వీటిని వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా డ్రోన్లను టేకాఫ్ చేయాలంటే తొలుత మొబైల్ యాప్ ద్వారా అనుమతి కోరాలి. అప్పుడు ఎయిర్‌ట్రాఫిక్‌ను బట్టి అనుమతి ఇవ్వడం లేదా నిరాకరించడం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ప్రజా భద్రత దృష్ట్యా అనుమతి లేకుండా డ్రోన్ల టేకాఫ్‌ను నిరోధించేలా కొత్త విధానంలో నిబంధనలు చేర్చారు. దీనిప్రకారం డిజిటల్ అనుమతులు రాకుండా డ్రోన్ల ను టేకాఫ్ చేసేందుకు వీలుకాదు. కేవలం 50 అడుగుల ఎత్తుకు వెళ్లగల నానో డ్రోన్ల(250 గ్రాముల బరువు)కు పోలీసు అనుమతులు అవసరం లేదు. వ్యవసాయం, ఆరోగ్యం సహా 23 విభాగాల్లో డ్రోన్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
పగటి నేరగాడు అరెస్ట్
పెంటపాడు : తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దొంగతనాలకు పాల్పడే నేరగాడిని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ ఎన్.రాజశేఖర్ అరెస్ట్ చేశారు. పెంటపాడు పోలీస్‌స్టేషన్ వద్ద బుధవారం సీఐ రాజశేఖర్ ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు. జంగారెడ్డిగూడేనికి చెందిన కంబాపు వెంకటరమణ 2009 నుంచి పలు ప్రదేశాల్లో నేరాలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతడిపై ద్వారకాతిరుమల, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం తదితర స్టేషన్లలో కేసులు ఉన్నాయి. గతేడాది నల్లజర్లలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఇంట్లో పట్టపగలే తాళాలు పగులకొట్టి బీరువాలోని బంగారు, వెండి వస్తువులను అపహరించాడు. 2014లో ద్వారకాతిరుమలలో దొరసానిపాడులో కూడా అదే తరహాలో చోరీ చేశాడు. ఈ రెండు కేసులకు సంబంధించి దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటరమణను నిందితుడిగా గుర్తించారు. అతడి వేలిముద్రల ఆధారంగా బుధవారం నల్లజర్ల ఎస్సై వి.చంద్రశేఖర్ సహకారంతో అరెస్ట్ చేశారు. అతడి నుంచి బంగారు గొలుసు, చెవి దుద్దులు, చెవి లోలాకులు, బంగారు చైను, బ్రాస్లెట్లు సుమారు 6 కాసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సహకరించిన సిబ్బంది శంకర్, మురళీలను సీఐ అభినందించారు. సీఐ మాట్లాడుతూ వేసవి సెలవుల దృష్ట్యా తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో ప్రజలు ఇంటికి తాళాలు వేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ముందస్తుగా సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలన్నారు. -
పగటి నిద్రతో ముంచుకొచ్చే అల్జీమర్స్
లండన్ : పగటిపూట కునికిపాట్లు భవిష్యత్‌లో అల్జీమర్స్ వ్యాధి చుట్టుముట్టేందుకు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరించింది. పదవీవిరమణ చేసిన 300 మందిపై చేసిన అథ్యయనంలో పగటిపూట నిద్రించిన వారి మెదడులో అల్జీమర్‌కు దారితీసే కారకాలు ప్రేరేపితమయ్యాయని వెల్లడైంది. దీంతో రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టని వారు పగటిపూట కునికిపాట్లతో సతమతమైతే అల్జీమర్ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. వృద్ధులు పగలు అతిగా నిద్రించడం మంచిది కాదని అథ్యయనం చేపట్టిన మయో క్లినిక్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. 2009 నుంచి 2016 వరకూ 70 ఏళ్లు పైబడిన దాదాపు 300 మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు పగటిపూట వారు నిద్రించే సమయాన్ని విశ్లేషించారు. వారి బ్రెయిన్ స్కాన్స్‌ను పరిశీలించగా పగటిపూట నిద్రించని వారితో పోలిస్తే బాగా నిద్రపోయిన వారి మెదడులో అల్జీమర్స్ కారకాలు పెరిగాయని స్పష్టం చేశారు. జామా న్యూరాలజీ జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. -
భద్రం బిడ్డో.. మాయదారి ఎండ కాటేస్తోంది!
ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మధ్యాహ్ననికి ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో వేసవి బడులకు హాజరైన విద్యార్థులు ఇళ్లకు చేరడం ప్రాణాంతకమవుతోంది. మండుటెండలో చిన్నారులు వడదెబ్బ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ పిల్లలకు కొందరు స్వయంగా గొడుగులు పట్టి వెంట నడుస్తుండగా, మరికొందరు పిల్లల చేతికి గొడుగులు అప్పగించి తాము మండుటెండలో ఉసూరుమంటూ ఇళ్లకు చేరుతున్నారు. ఎండ వేడి తాళలేక వెంట తీసుకెళ్లిన వాటర్ బాటిల్లోని నీటిని తలపై పోసుకుని చిన్నారులు సేదతీరుతున్నారు. ఎండల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో సెలవులు ఎప్పుడు వస్తాయా అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
స్థిరంగా పగటి ఉష్ణోగ్రతలు
అనంతపురం అగ్రికల్చర్ : పగటి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదవుతుండటంతో జిల్లాలో వేసవితాపం కొనసాగుతోంది. శుక్రవారం పామిడి, పుట్టపర్తి, శింగనమల, చెన్నేకొత్తపల్లి మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కొత్తచెరువు, రాయదుర్గం, కనగానపల్లి, తనకల్లు, కంబదూరు మండలాల్లో 39 డిగ్రీలు ఉండగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీలుగా కొనసాగింది. జిల్లా అంతటా 16 నుంచి 21 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 66 నుంచి 82, మధ్యాహ్నం 10 నుంచి 18 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
ఏలూరులో కిరాతకం
ఏలూరు అర్బ¯ŒS : ఏలూరు నగరంలో హత్యా సంస్కృతి పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ మూడు హత్యలు జరిగాయి. న్యాయవాది రాయల్, రౌడీషీటర్ పెద్ద కృష్ణ హత్యోదంతాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మరో వ్యక్తిని దుండగులు వేట కత్తులతో వెంటాడి నరికి చంపారు. దీంతో స్థానికులు భీతిల్లారు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఈ దుర్ఘటన జరగడం కలకలంరేపింది. స్థానిక ఐదో డివిజ¯ŒS లంబాడిపేట ఏసుపాదపురం కాలనీకి చెందిన పొట్నూరి లక్ష్మణరావు (34) వృతిరీత్యా వడ్రంగి. ఆదివారం మధ్యాహ్నం ఆయన సైకిల్‌పై స్థానిక పవర్‌పేట బడేటివారి వీధిలోని టింబర్ డిపోకు వెళ్తుండగా, అక్కడ సెంటర్లో చేతుల్లో కత్తులతో కాపుకాసిన ముగ్గురు దుండగులు లక్ష్మణరావు కళ్లల్లో ఒక్కసారిగా కారం చల్లారు. దీంతో కిందపడిపోయిన లక్ష్మణరావు దుండగులు తనను చంపడానికే వచ్చారని పసిగట్టి ప్రాణభయంతో పాత బస్టాండ్ సెంటర్లోని ఆం««ధ్రా బ్యాంకు రోడ్డులోకి పరుగుతీశాడు. వేట కత్తులతో ఆయనను తరుముకుంటూ వెళ్లిన ఇద్దరు దుండగులు ఆ దారిన పోయేవారు చూస్తుండగానే విచక్షణా రహితంగా నరికారు. తాము వచ్చిన స్కూటీపైనే పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మణరావు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న టూ టౌ¯ŒS సీఐ ఉడతా బంగార్రాజు ఎస్ఐ ఎస్.ఎస్.ఆర్.గంగాధర్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలానికి సమీపంలో ఓ దుకాణం ముందు భాగంలో సీసీ కెమెరా ఉండడంతో దానిలో హత్య దృశ్యాలు రికార్డయి ఉంటాయని భావించి ఆ సీసీ కెమేరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆ దృశ్యాలను సేకరించారు. స్థానికుల సమాచారం మేరకు మృతుని బంధువులను రప్పించి వారితో మాట్లాడి హత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు హత్యకు వివాహేతర సంబంధం కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. హంతకులెవరు ? లక్ష్మణరావు హత్యకు కారణాలేమై ఉంటాయి? సాధారణ వ్యక్తిని అత్యంత కిరాతకంగా వేట కత్తులతో వెంటాడి చంపారంటే ఇది కిరాయి హంతకుల పనా? లేక పాత కక్షలతో చంపి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొంతమేర పురోగతి సాధించారు. హతునితో సన్నిహితంగా మెలిగే స్థానిక గజ్జలవారి సెంటర్లో శివ బార్ వద్ద పా¯ŒSషాపు నిర్వహించే శ్రీను అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని మృతుని చెల్లెలు ధర్మవరపు మేరి సీఐ బంగార్రాజుకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శ్రీను తన అన్నతో తరచూ గొడవలు పడేవాడని ఇటీవల జరిగిన గొడవలో శ్రీను ఇంటికి వచ్చి తన అన్నను చంపుతానని బెదిరించాడని పేర్కొన్నారు. హంతకులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తాం :ఎస్పీ భాస్కర్‌భూషణ్ హంతకులను 24 నాలుగు గంటల్లోగా అరెస్ట్ చేస్తామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పష్టం చేశారు. నగరంలో హత్య జరిగిన విషయంపై సమాచారం అందుకున్న ఎస్పీ ఏలూరు ఆసుపత్రికి వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ హంతకులను సాధ్యమైనంత త్వరలో అరెస్ట్ చేసి వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కిరాణా వ్యాపారి ఇంట్లో పగలే చోరీ
దేవరపల్లి : దేవరపల్లిలో బుధవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. రూ.80వేల నగదు, పదికాసుల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బస్టాండ్‌కు సమీపంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వెనుకవైపున గల కిరాణా వ్యాపారి కొత్త శేఖర్, లక్ష్మి దంపతుల ఇల్లు ఉంది. వారు ఉదయమే ఇంటికి తాళం వేసి కిరాణా దుకాణానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉన్నాయి. అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా, బెడ్రూంలోని బీరువాలో పెట్టిన రూ.80వేలు, పది కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఇంటి వెనుక తలుపులు కూడా తీసి ఉన్నాయి. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కొవ్వూరు సీఐ ఎం.సుబ్బారావు, ఎస్ఐ చిన్నం ఆంజనేయులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వేలిముద్రల నిపుణుల బృందం సీఐ కె.నరసింహమూర్తి, సిబ్బంది ఆధారాలు సేకరించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య దొంగతనం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. -
పగలే చోరీ
జంగారెడ్డిగూడెం : పట్టణంలోని ఓ ఇంట్లో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. స్థానిక లక్ష్మీనారాయణ థియేటర్ వెనుక ఉన్న లచ్చిరెడ్డి చెలకలో నివసిస్తున్న కొనకళ్ల హనుమంతు కుటుంబ సభ్యులు సోమవారం ఓ శుభకార్యానికి వెళ్లారు. వారు తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చే సరికి ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉంది. ఇంటి వెనుక వైపు ఉన్న తలుపు తాళం కూడా తెరిచి ఉంది. దీంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువా తాళాలు తెరిచి ఉన్నాయి. అందులో ఉన్న రూ.56వేల నగదు, 4.50 కాసుల విలువైన చంద్రహారం, చెవిదుద్దులు కనిపించలేదు. బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ వద్ద ఉంచడంతో ఆ తాళాలతోనే దొంగలు బీరువా తెరిచినట్టు గుర్తించారు. బీరువాలోని వస్తువులు, దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉంచిన బంగారు వస్తువులు మాత్రమే దొంగిలించుకెళ్లిన దొంగలు రోల్డ్‌గోల్డ్ వస్తువులను మాత్రం అక్కడే వదిలి వెళ్లిపోయారు. తాళాలు పగులగొట్టి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు వెనుక తలుపుతీసి దాని నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారు. ఎస్సై ఎం.కేశవరావు, ఐడీ పార్టీ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
పగలే చోరీ
జంగారెడ్డిగూడెం : పట్టణంలోని ఓ ఇంట్లో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. స్థానిక లక్ష్మీనారాయణ థియేటర్ వెనుక ఉన్న లచ్చిరెడ్డి చెలకలో నివసిస్తున్న కొనకళ్ల హనుమంతు కుటుంబ సభ్యులు సోమవారం ఓ శుభకార్యానికి వెళ్లారు. వారు తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చే సరికి ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉంది. ఇంటి వెనుక వైపు ఉన్న తలుపు తాళం కూడా తెరిచి ఉంది. దీంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువా తాళాలు తెరిచి ఉన్నాయి. అందులో ఉన్న రూ.56వేల నగదు, 4.50 కాసుల విలువైన చంద్రహారం, చెవిదుద్దులు కనిపించలేదు. బీరువా తాళాలు డ్రెస్సింగ్ టేబుల్ వద్ద ఉంచడంతో ఆ తాళాలతోనే దొంగలు బీరువా తెరిచినట్టు గుర్తించారు. బీరువాలోని వస్తువులు, దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో ఉంచిన బంగారు వస్తువులు మాత్రమే దొంగిలించుకెళ్లిన దొంగలు రోల్డ్‌గోల్డ్ వస్తువులను మాత్రం అక్కడే వదిలి వెళ్లిపోయారు. తాళాలు పగులగొట్టి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు వెనుక తలుపుతీసి దాని నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారు. ఎస్సై ఎం.కేశవరావు, ఐడీ పార్టీ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
సాగుకు పగటి పూటే విద్యుత్ సరఫరా
హన్మకొండ : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కొంటె వెంకటనారాయణ తెలిపారు. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్ఫార్మర్లలో ఎలాంటి సమస్యలున్నా టోల్ ఫ్రీ నెంబర్లు 1912, 18004250028లకు సమాచారం అందించాలన్నారు. వరంగల్ ములుగు రోడ్డులోని ఎన్పీడీసీఎల్ శిక్షణ కేంద్రంలో బుధవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో, కార్యాలయంలో మొక్కలు నాటి తెలంగాణను పచ్చలహారంగా మార్చాలని కోరారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని అయిదు జిల్లాల్లో 1.10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 81,519 మొక్కలు నాటామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో విద్యుత్ భద్రత సూచనలు తెలిపే సూచిక బోర్డును ఏర్పాటు చేశామని, ఈ బోర్డుపై సంబంధిత లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్లు, ఏఈల ఫోన్ నెంబర్లు ఉంటాయని, వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా వారికి ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ అధికారులు బి.నర్సింగరావు, బి.వెంకటేశ్వర్రావు, సీజీఎంలు పి.సంధ్యారాణి, బి.అశోక్‌కుమార్, టి.సదర్లాల్, ఎన్.వి.వేణుగోపాల్, టి.మదుసూధన్, వి.మోహన్‌రావు, జీఎం తిరుమల్‌రావు, సివిల్ ఈఈ రవీందర్, వరంగల్ ఎస్ఈ శివరాం, డీఈఈలు శ్రీకాంత్, సామ్యానాయక్, శిక్షణ కేంద్రం ఇంచార్జి హార్జీ జాటోత్ పాల్గొన్నారు. -
పట్ట పగలే చోరీ
పీటీఎస్: చిత్తూరు జిల్లాలో పట్టపగలే దొంగతనం జరిగింది. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండల కేంద్రంలోని పత్తంవంద్లపల్లె గ్రామంలో నాగరాజు ఇంట్లో గురువారం మధ్యాహ్నం చోరీ జరిగింది. రూ.లక్ష నగదు, 40 గ్రాముల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగులు కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విజయనగరంలో పట్టపగలు చోరీ
విజయనగరం :ఇంట్లో ఎవరూలేని సమయం చూసి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన సంఘటన విజయనగరంలోని సీఎస్ఆర్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రాయూనివర్సిటీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ధర్మాన రామారావు ఇంటికి తాళం వేసి ఎప్పటిలాగే విధులకు వెళ్లారు. కాగా ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దుండగులు 8 తులాల బంగారం, అరకిలో వెండి సామాగ్రిని ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన లెక్చరర్ దొంగతనం విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.