సాగుకు పగటి పూటే విద్యుత్ సరఫరా
Published Thu, Jul 21 2016 12:28 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
హన్మకొండ : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కొంటె వెంకటనారాయణ తెలిపారు. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌ఫార్మర్లలో ఎలాంటి సమస్యలున్నా టోల్ ఫ్రీ నెంబర్లు 1912, 18004250028లకు సమాచారం అందించాలన్నారు.
వరంగల్ ములుగు రోడ్డులోని ఎన్పీడీసీఎల్ శిక్షణ కేంద్రంలో బుధవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంట్లో, కార్యాలయంలో మొక్కలు నాటి తెలంగాణను పచ్చలహారంగా మార్చాలని కోరారు. ఎన్పీడీసీఎల్ పరిధిలోని అయిదు జిల్లాల్లో 1.10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 81,519 మొక్కలు నాటామన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో విద్యుత్ భద్రత సూచనలు తెలిపే సూచిక బోర్డును ఏర్పాటు చేశామని, ఈ బోర్డుపై సంబంధిత లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్‌లు, ఏఈల ఫోన్ నెంబర్‌లు ఉంటాయని, వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా వారికి ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ అధికారులు బి.నర్సింగరావు, బి.వెంకటేశ్వర్‌రావు, సీజీఎంలు పి.సంధ్యారాణి, బి.అశోక్‌కుమార్, టి.సదర్‌లాల్, ఎన్.వి.వేణుగోపాల్, టి.మదుసూధన్, వి.మోహన్‌రావు, జీఎం తిరుమల్‌రావు, సివిల్ ఈఈ రవీందర్, వరంగల్ ఎస్‌ఈ శివరాం, డీఈఈలు శ్రీకాంత్, సామ్యానాయక్, శిక్షణ కేంద్రం ఇంచార్జి హార్జీ జాటోత్ పాల్గొన్నారు.
Advertisement