సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారీ ఎత్తున విద్యుత్ చార్జీల పెంపు తప్పేటట్లు లేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలినాళ్లలో ఎదురైన తీవ్ర విద్యుత్ కొరతను అధి గమించి కోతల్లేని విద్యుత్ సరఫరాను అందిస్తుం డటం, గత జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టడం ద్వారా దేశంలో రాష్ట్రం పేరు మార్మోగిపోయింది. అయితే ఈ అవస రాల కోసం డిస్కంలు భారీ మొత్తంలో విద్యుత్ కొనుగోళ్లు జరుపుతుండటంతో వాటిపై తీవ్ర ఆర్థిక భారం పడింది. దీంతో కొన్నేళ్ల నుంచి తీవ్ర నష్టా లను ఎదుర్కొంటున్న డిస్కంల ఆర్థిక లోటు 2018–19 ముగిసే నాటికి రూ.9,970.98 కోట్లకు పెరగనుందని ఆయా సంస్థల యాజమన్యాలే ఇటీ వల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి నివేదించాయి. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యుత్ చార్జీలనే 2018–19లో సైతం యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదిం చాయి. 2017–18లో డిస్కంలకు ప్రభుత్వం రూ.4,484.30 కోట్ల విద్యుత్ సబ్సిడీ కేటాయించగా, గురువారం ప్రవేశపెట్టిన 2018–19 బడ్జెట్‌లో రూ.5,650 కోట్లకు పెంచింది. అయినా, తీవ్ర నష్టాల నుంచి డిస్కంలు గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీలను సర్దుబాటు చేసినా రూ.4320.98 కోట్ల నష్టాలను మూటగట్టుకోనున్నాయి. ఈ నష్టాలను పూడ్చు కోవడానికి సాధారణ ఎన్నికల తర్వాత డిస్కంల యాజమాన్యాలు ట్రూ అప్ పేరుతో భారీగా విద్యుత్ చార్జీలు పెంచే అవకాశాలున్నాయి.
‘పెట్టుబడి’తో రైతుకు లబ్ధి..
పెట్టుబడి పథకానికి బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించారు. దీంతో రైతులు ప్రైవేటు అప్పులకు వెళ్లకుండా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి వీలు కలుగనుంది. ఖరీఫ్, రబీల్లో ఎకరానికి రూ. 8 వేల చొప్పున రైతులకు అందజేస్తారు. ఈ పథకం రైతుల జీవితాల్లో వెలుగు నింపనుంది. రైతు బీమా పథకం
వల్ల అన్నదాత ఏ కారణంతో చనిపోయినా రూ. 5 లక్షల బీమా అందనుంది.
– పార్థసారథి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి
కీలక రంగాలకు తగిన కేటాయింపులు
2018–19 బడ్జెట్ అసాధారణం. కీలక రంగాలకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరిగాయి. వ్యవసాయం కోసం రూ.12 వేల కోట్లు, రైతు లక్ష్మి కోసం రూ. 8 వేల కోట్లు కేటాయించడం ద్వారా ఆర్థికవృద్ధి గణనీయంగా పెరుగుతుంది. 2013–14లో 5.4 శాతం ఉన్న జీడీపీ 2016–17 ఆర్థిక సంవత్సరానికి 10.1కి, 2017–18 లో 10.4 శాతానికి పెరిగింది. జాతీయ జీడీపీ కేవలం 6.6 శాతం మాత్రమే ఉండగా తెలంగాణ జీడీపీ 10.4 శాతానికి పెరగడం వృద్ధికి నిదర్శనం. రైతుల సంక్షేమం కోసం ఆర్థిక మంత్రి ఈటల మరో విశిష్టమైన కేటాయింపులు చేశారు.
రైతు బీమాకు రూ. 5 లక్షల బీమా వర్తింపజేయడం కోసం
రూ. 500 కోట్లు కేటాయించడం, రైతు పనిముట్ల కోసం కూడా భారీగా నిధులు ఇవ్వడం సంతోషకరం. ఇప్పటిదాకా ప్రభుత్వం 13,934 ట్రాక్టర్లు, 31,274 పనిముట్లు, 26,179 స్ప్రేయర్లకు 50 నుంచి 95 శాతం సబ్సిడీ ఇచ్చింది. ఇక నుంచి రైస్ ట్రాన్స్‌ప్లాంటర్లను కూడా ఇస్తాం. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ. 25 వేల కోట్లు, చేనేతకు
రూ. 1,200 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
– మంత్రి కేటీఆర్ ట్వీట్
నిధుల కోత సరికాదు..
2017–18 బడ్జెట్‌తో పోలిస్తే మార్కెటింగ్‌శాఖకు రూ. 336 కోట్ల మేరకు నిధులు తగ్గాయి. ఇలా నిధులు తగ్గించ డంలో ప్రభుత్వ ఆంతర్యమేంటో అంతు బట్టడంలేదు. పెట్టుబడికి, రైతు బీమాకు అదనపు నిధులు కేటాయిస్తే ఈ బడ్జెట్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పుల్లేవు.
– డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment