telangana budjet
-
ఈ ఆర్థిక సంవత్సరంలో అంతంత మాత్రంగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు నెలల్లో అన్ని రకాల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, అప్పులు తెచ్చుకొనేందుకు ఆర్బీఐ అంగీకరించకపోవడంతో కాసులకు కటకట ఏర్పడినా ఆ తర్వాత రాబడులు క్రమంగా పుంజుకోవడంతో ప్రస్తుతానికి ఓ గాడిన పడిందని ‘కాగ్’ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం తొలి 5 నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ. 80 వేల కోట్లు చేరగా సెప్టెంబర్‌లో అప్పులు, ఆదాయం కలిపి మరో రూ. 15 వేల కోట్లు దాటి ఉంటుందని, మొత్తంగా రూ. లక్ష కోట్లు అటుఇటుగా తొలి 6 నెలల్లో ఖజానాకు చేరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థిరంగా పన్ను ఆదాయం.. కాగ్ లెక్కలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం స్థిరంగా వస్తోంది. ఏప్రిల్, మేలలో రూ. 9 వేల కోట్ల మార్కు దాటిన పన్నుల రెవెన్యూ ఆ తర్వాతి మూడు మాసాల్లో రూ. 10 వేల కోట్ల మార్కు దాటింది. పన్నేతర ఆదాయం ఎప్పటిలాగానే స్తబ్దుగా ఉండగా జూన్‌లో వచ్చిన రూ. 6 వేల కోట్లతో కొంత ఫరవాలేదనిపించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 40 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అందులో కేవలం 10 శాతం అంటే రూ. 4,011 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా పద్దు మాత్రం 34 శాతానికి చేరింది. ఈ పద్దు కింద 5 నెలల్లో రూ. 4,263 కోట్లు వచ్చాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద గతేడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం, ఖర్చు ఎక్కువగా ఉండగా అప్పులు మాత్రం గతేడాది కంటే తక్కువగానే ఉండటం గమనార్హం. అప్పులు రూ. 17 వేల కోట్ల పైమాటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్ల మేర అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా గత 5 నెలల్లో రూ. 17 వేల కోట్ల వరకు అప్పుల రూపంలో సమకూరాయి. ఇందులో తొలి రెండు నెలలు కనీసం రూ. 300 కోట్లు కూడా అప్పులు దాటలేదు. కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్ఆర్బీఎం చట్ట పరిధి విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మేలలో సెక్యూరిటీలు, బాండ్ల విక్రయానికి ఆర్బీఐ అంగీకరించలేదు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో జూన్‌లో రూ. 5,161 కోట్లు, జూలైలో రూ. 4,904.94 కోట్లు, ఆగస్టులో రూ. 7,501.56 కోట్ల రుణాలను ప్రభుత్వం తీసుకోగలిగింది. ఈ రుణ సర్దుబాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సంవత్సరం ముగిసేంతవరకు కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లేదంటే మాత్రం కాసులకు కటకట తప్పనట్టే! -
Hyderabad State Budget: హైదరాబాద్ రాష్ట్ర చివరి బడ్జెట్ ఎంతో తెలుసా?
మేకల కళ్యాణ్ చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వం 2022–23 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లపైనే. అంకెల్లో చెప్పాలంటే ఈ ఏడాది మార్చి 7న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. రూ.2,56,858.51 కోట్లు. మరి స్వాతంత్య్రం పొందిన తొలినాళ్లలో, ఉమ్మడి ఏపీగా ఏర్పడకముందు హైదరాబాద్ స్టేట్ బడ్జెట్ ఎంతో తెలుసా? 1955లో ప్రవేశపెట్టిన హైదరాబాద్ స్టేట్ చివరి బడ్జెట్ 1,78,27,464 రూపాయలు మాత్రమే. అంటే కనీసం 2 కోట్లు అయినా దాటలేదు. ఇప్పుడు రెండున్నర లక్షల కోట్లు దాటేసింది. 70 ఏళ్లలో బడ్జెట్ పద్దు లక్ష రెట్లకుపైగా పెరిగిందన్న మాట. మరి నాటి బడ్జెట్ విశేషాలు, నేటి బడ్జెట్‌తో పోల్చితే ఎలా ఉంటుందో చూద్దామా.. ►1955లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెవెన్యూ ఖర్చు రూ.1,25,63,804గా చూపెట్టారు. అదే ఇప్పుడు రెవెన్యూ పద్దు రూ.1,89,274 కోట్లు. అప్పటి బడ్జెట్లో మూల ధన వ్యయం కింద రూ.52,62,860 చూపెట్టారు. మరి ఇప్పుడు మూలధన వ్యయం రూ. 29,728 కోట్లు ►నాటి బడ్జెట్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ పేరుతో రూ.25.87 లక్షలు చూపెట్టారు. ఇప్పటి బడ్జెట్లో దానికి సరిసమానమైన పంచాయతీరాజ్ శాఖకు దాదాపు రూ.30 వేల కోట్లు కేటాయించారు. ►ఇప్పటి బడ్జెట్లో అన్నింటికన్నా తక్కువగా శాసనసభా వ్యవహారాలకు రూ.157 కోట్లు కేటాయిస్తే.. నాడు అన్నింటికన్నా తక్కువగా స్టాంపుల శాఖకు రూ. 3,910 మాత్రమే ఇచ్చారు. ►నాడు సివిల్ పనులకు రూ.9.51 లక్షలు కేటాయిస్తే.. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, రహదారులు, ఇతర శాఖల్లో సివిల్ పనులకు కేటాయింపులన్నీ కలిపితే ఏకంగా రూ. 40 వేల కోట్లు దాటుతాయని అంచనా. ►ఇప్పుడు ఒక్క సాగునీటి శాఖకే రూ.22,691 కోట్లు కేటాయించారు. అప్పటి బడ్జెట్లో సివిల్ పనుల కింద అన్నీ చూపెట్టారుగానీ ఇరిగేషన్ శాఖలో మూలధన వ్యయం కింద ఖర్చును కేవలం రూ.300గానే చూపారు. ►అప్పటి బడ్జెట్లో ప్రజారోగ్యానికి రూ.6 లక్షలు చూపెట్టగా.. ఇప్పుడు ప్రజారోగ్య విభాగమైన వైద్య, ఆరోగ్య శాఖకు రూ.11 వేల కోట్లకుపైగా బడ్జెట్ కేటాయించారు. ►అప్పట్లో విద్యకు రూ.5.34 లక్షలు కేటాయించగా.. ప్రస్తుతం విద్యాశాఖ పద్దు రూ.20 వేల కోట్లు దాటింది. ►నాటి బడ్జెట్లో ప్రత్యేకంగా రాజకీయ పింఛన్లు, ప్రాదేశిక పింఛన్ల కోసం దాదాపు రూ.5 లక్షలు చూపెట్టారు. ఇప్పుడా తరహా పింఛన్లు లేవు. ►ఇప్పుడు హోంశాఖ (పోలీసింగ్)కు రూ.9,315 కోట్ల మేర నిధులు ప్రతిపాదించగా.. 1955 హైదరాబాద్ రాష్ట్ర బడ్జెట్లో పోలీసింగ్‌కు కేవలం రూ.4.8లక్షలే.. ►అప్పట్లో వ్యవసాయంతోపాటు పశుసంవర్ధక, సహకార శాఖలకు ప్రత్యేక కేటాయింపులు చూపెట్టారు. వ్యవసాయం కంటే అనుబంధ రంగమైన పశుసంవర్థక శాఖకు ఎక్కువ నిధులు కేటాయించారు. వ్యవసాయానికి రూ.1,16,700, పశుసంవర్థకానికి రూ.1,30,274, సహకార శాఖకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చారు. ఇప్పటి బడ్జెట్లో వ్యవసాయం, సహకార శాఖలకు రూ.25 వేల కోట్ల వరకు కేటాయించగా.. పాడి పరిశ్రమ, మత్స్య శాఖలకు రూ.2,768 కోట్లు చూపారు. ►ఇక నాటి బడ్జెట్లో కరువు పద్దు కింద ప్రత్యేకంగా లక్ష రూపాయలు కేటాయించడం గమనార్హం. ►అప్పట్లోనూ అప్పులపై వడ్డీల చెల్లింపులు ఉండేవి. అప్పులకు వడ్డీల కింద 6,600 రూపాయలను చూపారు. ప్రస్తుత బడ్జెట్లో వడ్డీల కింద ఏకంగా రూ.18,911 కోట్లను చెల్లించాల్సి ఉన్నట్టు పేర్కొన్నారు. -
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్: కేటాయింపులు ఇవే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్‌ను మంత్రి హరీష్‌రావు, సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే మొదలైన సంగతి తెలిసిందే. దీంతో మంత్రి హరీష్‌రావు నేరుగా బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ 2022-223 బడ్జెట్‌కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ బడ్జెట్ 2022-2023 కేటాయింపులు.. ► దళిత బంధు పథకానికి ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు నిధులను భారీగా పెంచారు. గత వార్షిక బడ్జెట్లో వెయ్యి కోట్లను కేటాయించగా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం రూ. 17,700 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలు చేస్తోంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.17,700 కోట్లు కేటాయించడం జరిగింది. ► రెండోదశలో ఇతరప్రభుత్వపాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ మనఊరు-మనబడి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదనీ, వారు కూడా మిగతా ప్రపంచంతో సమానంగా ఎదగాలనీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది. ► రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదించింది. ► ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవి విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఈబడ్జెట్లో వంద కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ► రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వికారాబాద్, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2023 సంవత్సరంలోని రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ► ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలనీ, ఇందుకోసం డైట్ ఛార్జీలను రెట్టింపు (డబుల్) చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. టీ.బి.,క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను 56 రూపాయల నుంచి 112 రూపాయలకు పెంచాలనీ, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి 40 రూపాయల నుంచి 80 రూపాయలకు పెంచాలని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 43.5కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. ► హైదరాబాద్ లోని 18 మేజర్ ప్రభుత్వ హాస్పటళ్లలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలని ఈ బడ్జెట్లో నిర్ణయించడం జరిగింది. రెండు పూటలా వారికి ఈ భోజనం అందుతుంది. ప్రతీ రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనావేస్తోంది. దీని కోసం సంవత్సరానికి 38.66 కోట్లు ఖర్చవుతాయి. ► పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ. 338 కోట్లను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది. ► రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు 32 కోట్ల 50 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది (ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది) ► 2022-23 సంవత్సరంలో బడ్జెట్లో పామాయిల్ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందు కోసం ఈ ఏడాది బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ►వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్లో నిధులు కేటాయిస్తోంది. గత ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్ల రూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ఇలా రైత సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం. ఈ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తంగా 24254 కోట్ల రూపాయలు కేటాయించాం. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఈ ఏడాది 75 వేల లోపు రుణాలను కూడా మాఫీ చేయాలని నిర్ణయించింది. ►వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్లనుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా ఫించన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆసరా ఫించన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో 11728 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. ►సొంత జాగ కలిగినవారు తమ స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ బడ్జెట్లో అందుకు నిధులు కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి, సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. నియోజకవర్గానికి మూడువేల ఇండ్ల చొప్పున కేటాయిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం 12000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది. ► ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి 1000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయించింది. ► గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. అందులో భాగంగా 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7.3లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయించింది. ► రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. ► గీత కార్మికుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకుంది. ► బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈలోపాన్ని నివారించేందుకు, ‘కేసీఆర్ నూట్రీషియన్ కిట్’ అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయించింది. ఈ కిట్స్ ద్వారా ప్రతి సంవత్సరం లక్షా 25 వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది. ► హైదరాబాద్ చుట్టూ, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొరతను శాశ్వతంగా తీర్చేందుకు రూ.1200 కోట్లను ఈ వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించారు. ► దూప దీప నైవేధ్య పథకంలో హైదరాబాద్‌లోని దేవాలయాలను చేర్చాలన్న అర్చకుల కోరిక మేరకు ఈ ఏడాది 1736 దేవాలయాలను కొత్తగా ఈ పథకంలో చేరుస్తున్నారు. దూప దీప నైవేద్య పథకానికి రూ. 12.50 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ► రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ. 1542 కోట్లను ప్రభుత్వం ఈ వార్షిక బడ్జెట్లో కేటాయించింది. ► మెట్రో రైలును పాతబస్తీలో 5.5 కిలోమీటర్లకు అనుసంధానించేందుకు ఈ బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించింది. ► భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం ప్రవేశపెడుతున్నామని, మొదటి విడుతలో లక్ష మంది కార్మికులకు మోటార్ సైకిళ్లను ఇవ్వాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. విధివిదానాలు త్వరలో ప్రకటిస్తారు. ► రైతు బందు పథకం తరహాలో నేత కార్మికుల కోసం ఈ ఏడాది ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభించాలని నిర్ణయించింది. ► రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్టీఎస్డీఎఫ్ నిధుల నుంచి 1000 కోట్ల రూపాయలను కేటాయింపు. ► గిరిజన, ఆదివాసీ గ్రామ పంచాయతీలకు సొంత భవనాల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఈ ఏడాది 600 కోట్ల రూపాయలు కేటాయింపు. ► రాష్ట్ర వ్యాప్తంగా సొంత జాగల్లో ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాం. దీని కోసం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు ఇస్తాం. ఈ ఏడాది నాలుగు లక్షల ఇండ్లను నిర్మించనున్నాం. ఒక్కొక్క లబ్దిదారుడికి రూ.3 లక్షలను ప్రభుత్వం సహాయంగా అందిస్తుంది. రూ. 12వేల కోట్లను డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపు. ► కాళేశ్వరం టూరిజం సర్య్యూట్‌కు రూ. 750 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయింపు. ► అర్బన్ మిషన్ భగీరథకు ఈ బడ్జెట్లో రూ. 800 కోట్లు కేటాయింపు. ► ఎయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో రూ. 1500 కోట్లు కేటాయింపు. ► పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ. 2142 కోట్లు, పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద రూ. 190 కోట్లను బడ్జెట్లో కేటాయింపు. ► పావలా వడ్డీ స్కీంను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, చిన్న తరహా పరిశ్రమలను, మహిళలు ఏర్పాటు చేసి విధంగా ప్రోత్సహించడానికి రూ. 187 కోట్లు కేటాయింపు. ► హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచితంగా నీరందించే పథకానికి రూ. 300 కోట్లు కేటాయింపు. ► ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రూ. 1500 కోట్లు కేటాయింపు. తెలంగాణ బడ్జెట్ రూ.2,56,958.51 కోట్లు-- పలు ప్రధాన కేటాయింపులు చదవండి: తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ సభ్యుల సస్పెన్షన్ -
‘సాగునీటి’కి కోతే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్లో సాగునీటి శాఖకు మళ్లీ కోతపడే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, కేంద్ర కేటాయింపుల్లో తగ్గుదల నేపథ్యంలో ఈమారు సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019–20లో మినహా అంతకుముందు ఏడాదుల్లో వరుసగా రూ.25 వేల కోట్ల మేర కేటాయింపులు చేయగా, ఈ ఏడాది రూ.10 వేల కోట్లకు మించి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఎప్పటి మాదిరే రుణ సంస్థల నుంచి ప్రధాన ప్రాజెక్టులకు తీసుకుంటున్న రుణాల ద్వారానే మళ్లీ గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకే.. ఆర్థిక మాంద్యం దెబ్బతో గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో సాగునీటి శాఖకు కేవలం రూ.8,476.17 కోట్లకు తగ్గించింది. ఇందులో మేజర్ ఇరిగేషన్‌కు రూ.7,794.30 కోట్లు కేటాయించగా, మైనర్ ఇరిగేషన్‌కు రూ.642.30 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ పద్దు కింది కేటాయింపులను పక్కనపెడితే ప్రగతిపద్దు కింది కేటాయింపులు కేవలం రూ.6,500 కోట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా 2019–20 వార్షికంలో ఏప్రిల్ నుంచి ఇంతవరకు రూ.18 వేల కోట్ల మేర ఖర్చయింది. ఇందులో రూ.10 వేల కోట్ల మేర రుణాల ద్వారా చేసిన ఖర్చు కాగా, మిగతా రూ.8 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించారు. ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధిక నిధుల ఖర్చు జరిగింది. వచ్చే వార్షిక బడ్జెట్లో రూ.21 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి, మరో రూ.22 వేల కోట్లు రుణాల రూపేణా కేటాయించాలని సాగునీటి శాఖ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే కేంద్ర వాటా తగ్గడం, ఆర్థిక మాంద్యం ఛాయలు తగ్గకపోవడంతో ఈ ఏడాది సైతం బడ్జెట్లో కేటాయింపులు రూ.10 వేల కోట్లకు మించి ఉండవని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇందులోనూ మునుపటి మాదిరే కాళేశ్వరం, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకే అధికంగా కేటాయింపులు దక్కే అవకాశం ఉంది. పాలమూరు–రంగారెడ్డికి రూ.2 వేల కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు మరో రూ.2 వేల కోట్లు, దేవాదులకు రూ.600 కోట్లు, తుపాకులగూడెంకు రూ.300 కోట్లు కేటాయించే అవకాశాలున్నాయి. రాష్ట్ర బడ్జెట్ నిధులతో పాటే ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల ద్వారా గరిష్టంగా రూ.15 వేల కోట్ల మేర రుణాలతోనే ఈ ప్రాజెక్టులకు నిధుల లభ్యత పెంచనున్నారు. పాత ప్రాజెక్టులకు నిరాశే.. ఇక పాత ప్రాజెక్టులకు మాత్రం మళ్ళీ నిరాశ తప్పేలా లేదు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాతో పాటు ఎల్ఎల్బీసీ టన్నెల్‌తో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు నిధుల కోత తప్పదని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే కనిష్టంగా రూ.1,200 కోట్లు అవసరముంది. అయితే ఇప్పటికే సాగునీటి శాఖ పరిధిలో రూ.10 వేల కోట్ల మేర పెండింగ్ బిల్లులుండగా, ఇందులో ప్రధాన పనులకు సంబంధించి రూ.5,500 కోట్లున్నాయి. ప్రస్తుతం బడ్జెట్లో ప్రవేశపెట్టే నిధులు పనులకు సంబంధించిన పెండింగ్ పనులకే చెల్లిస్తే, మిగిలే నిధులు చాలా తక్కువ. ఇవీ ప్రాధాన్యత ప్రాజెక్టులకు ఖర్చుచేస్తే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కష్టతరంగా మారనుంది. -
ఏప్రిల్ దాకా ఆగాల్సిందేనా?
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం ఓటాన్ అకౌంట్లో ప్రజారవాణాపై మాత్రం ఎలాంటి ప్రస్తావన చేయలేదు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్ వంటి రవాణా సదుపాయాలకు ఏ మేరకు నిధులు కేటాయించనున్నారనే అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే గ్రేటర్ ఆర్టీసీ భారీ నష్టాలతో నడుస్తోంది. ఎంఎంటీఎస్ రెండో దశ కింద రైల్వే లైన్ల నిర్మాణంచేపట్టినప్పటికీ నిధుల కొరత కారణంగా కొత్త రైళ్ల కొనుగోళ్లకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రప్రభుత్వం నుంచి నిధులు అందితే తప్ప రెండో దశ రైళ్లు పట్టాలెక్కలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రజా రవాణా కోసం నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వచ్చే ఏప్రిల్ వరకు ఆగాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నగరంలో రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు, ప్రత్యేకించి పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడం నిరాశే మిగిల్చింది. గ్రేటర్ ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం నుంచి సాయంఅందకపోవడం పట్ల ఆర్టీసీ కార్మికులు, కార్మిక సంఘాలుతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ నష్టాలు రూ.372 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ రూ.602 కోట్ల నష్టాలను ఎదుర్కొంటుండగా, ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే రూ.372 కోట్ల మేర నష్టాలు ఉన్నాయి. గత భారీగా పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ వ్యయం ఆర్టీసీని కుంగదీస్తున్నాయి. గ్రేటర్లో ప్రతిరోజు 3,550 బస్సులు తిరుగుతున్నాయి. రోజుకు రూ.3.5 కోట్ల మేర ఆదాయం లభిస్తున్నప్పటికీ రూ.4.5 కోట్ల మేర రోజువారీ నిర్వహణ వ్యయం కారణంగా రోజుకు రూ.కోటి చొప్పున నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడం, భారీగా నిర్వహణ వ్యయం, విడిభాగాల కొనుగోళ్లు, తదితర కారణాల దృష్ట్యా నష్టాలు అనూహ్యంగా పెరిగాయి. లైన్లు ఉన్నా.. రైళ్లు లేవు.. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నగర శివార్లను కలుపుతూ రైల్వేలైన్లను ఏర్పాటు చేశారు. చాలా చోట్ల పనులు తుది దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పటి వరకు అందకపోవడంతో కొత్త రైళ్ల కొనుగోళ్లకు బ్రేక్ పడింది. సికింద్రాబాద్–బొల్లారం, పటాన్చెరు–తెల్లాపూర్ మార్గాల్లో ఇప్పటికిప్పుడు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ నిధుల కొరత సమస్యగా మారింది. సుమారు రూ.850 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మూడొంతుల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సి ఉంది. రూ.600 కోట్లకు పైగా రాష్ట్రం ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.300 కోట్ల వరకు మాత్రమే అందజేసినట్లు అధికారులు తెలిపారు. మరో రూ.300 కోట్ల వరకు రాష్ట్రం నుంచి అందాల్సి ఉంది. -
రైతుకు వెన్నుదన్ను
కరీంనగర్: శాసనసభలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్నెళ్ల కాలానికి ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది. 2019–20 సంవత్సరానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశాలకు కేటాయింపుల్లో దక్కిన సింహభాగం మినహా ప్రత్యేకించి ఏమి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు మినహా ఇతరరంగాలకు అంతగా నిధుల కేటాయింపు జరగలేదన్న చర్చ జరుగుతోంది. ప్రధానంగా సాగుతున్న ఐదు ప్రాజెక్టుల పనులను సత్వరమే పూర్తి చేసేందుకు నిధులలో వాటా పెంచినట్లు కనిపించినా.. అనుకున్న మేరకు నిధుల కేటాయింపు లేదనే విమర్శలు వినవస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాలు వేములవాడ, ధర్మపురి, కొండగట్టు పుణ్యక్షేత్రాలకు నిధుల కేటాయింపు జరగలేదు. ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న కరీంనగర్ మెడికల్ కళాశాల మంజూరుకు ఈసారి నిరాశే మిగిలింది. మత్స్య కళాశాల ముచ్చట కూడా లేదు. బడ్జెట్లో జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు, సమస్య ల పరిష్కారానికి కేటాయింపులు దక్కలేదని, కేవలం అంకెల గారడీగానే బడ్జెట్ ఉందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రస్తావిస్తుండగా.. అత్యుత్తమ బడ్జెట్ అని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈ బడ్జెట్‌పై వివిధ రాజకీయ పక్షాలు, వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతంలో ఆర్థికమంత్రిగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనుభవం ఉండడంతోపాటు సీనియర్ మంత్రి కావడంతో ఈసారి శాసనమండలిలో ఈటల రాజేందర్‌కు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. రాష్ట్ర బడ్జెట్లో సింహాభాగం నిధులు, నీటిపారుదల, వ్యవసాయం, సంక్షేమం, రోడ్ల భవనాల శాఖకు కేటాయింపులు జరిగాయి. సంక్షేమానికి పెద్దపీట ప్రభుత్వం సంక్షేమానికి బడ్జెట్లో పెద్దపీట వేసిం ది. గత ఎన్నికల్లో ఇచ్చిన హమీల మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మి కులు, బోధకాలు వ్యాధిగ్రస్తులు, నేత, గీత కార్మి కులు, ఎయిడ్స్బాధితులకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని వెయ్యి నుంచి రూ.2016కు పెంచింది. దీంతో ఉమ్మడి జిల్లాలో 1.60లక్షల మంది పింఛన్ అందుకోనున్నారు. దివ్యాంగులకు నెలకు రూ.రెండువేల నుంచి రూ.3116కు పింఛన్ పెంచడంతో 32 వేల మందికి లబ్ధి జరగనుంది. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా రూ.12,067 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.1,450 కోట్లు కేటాయించడంతో జిల్లాకు సగటున రూ.50కోట్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగ భృతి కింద రూ.1810 కోట్లు, ఎస్సీల ప్రగతికి రూ.16,581 కోట్లు, ఎస్టీల అభ్యున్నతికి రూ.9.827 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. రాష్ట్రం యూనిట్‌గా జిల్లాకు సగటున రూ.150 కోట్ల మేర ఒక్కో సంక్షేమ పథకానికి అందే అవకాశం ఉన్న పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డబుల్బెడ్రూం... డబుల్బెడ్రూం ఇల్లు కలగానే మారేలా ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 25,503 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తే ఇప్పటికి పూర్తయింది 413 ఇళ్లు మాత్రమే. నిర్మాణం ఎంత నత్తనడక సాగుతుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామంలో మినహా ఏ గ్రామంలోనూ రెండంకెల సంఖ్యకు మించలేదు. వీటికీ అరకొర నిధులు కేటాయించడంతో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కలగానే మిగిలే అవకాశం ఉంది. కలగానే కరీంనగర్లో మెడికల్ కళాశాల... సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వివిధ వ్యాధులతో బాధపడే వారిలో అత్యధికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నట్లు తేలింది. ఈ సర్వే తర్వాత సీఎం హోదాలో మొదటిసారి కరీంనగర్ వచ్చిన కేసీఆర్ కరీంనగర్‌కు ప్రభుత్వ వైద్యకళాశాల మంజూరు చేస్తామని ప్రకటించారు. అంతకుముందు రెండు బడ్జెట్లో తొమ్మిది వైద్యకళాశాలలను వివిధ జిల్లాలకు ప్రకటించిన ప్రభుత్వం.. ఈ బడ్జెట్లో కరీంనగర్‌కు మొండిచేయ్యి చూపిం ది. ఆరు పర్యాయాల బడ్జెట్లు పూర్తయినా రూ. వెయ్యి కోట్లతో కరీంనగర్‌కు సూపర్ స్పెషాలిటీ వైద్య కళాశాల కలగానే మిగిలింది. ఉమ్మడిజిల్లాతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతా ల ప్రజలకు కరీంనగర్ ఆసుపత్రి పెద్ద దిక్కుగా ఉంది. వైద్య కళాశాల మంజూరు చేయకపోవడం.. గత బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపి నిమ్స్‌స్థాయికి పెంచుతామని ప్రకటించినా ఇప్పటికీ ఆ హోదా దక్కలేదు. ఊసేలేని మత్స్య కళాశాల కరీంనగర్‌లోని ఉజ్వల పార్కు వద్ద మత్య్స పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా కళాశాల మంజూరు చేస్తున్నామని రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు బడ్జెట్లో మత్స్య కళాశాలకు మొండిచేయి చూపించింది. తాజా బడ్జెట్లో సైతం నిధుల ఊసే లేకపోవడం గమనార్హం. దీంతో మత్స్య కళాశాల ఏర్పాటు అనుమానమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
హామీలకు జై
సాక్షిప్రతినిధి, ఖమ్మం: బడ్జెట్లో వ్యవసాయ, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులను సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా కేటాయించారు. దీనిని అధికార పార్టీ నాయకులు సంక్షేమ బడ్జెట్‌గా పేర్కొంటుండగా.. ప్రతిపక్షాలు మాత్రం ఇది కేవలం ఎన్నికల బడ్జెట్ అని.. ప్రధాన రంగాలకు ఇందులో నిధులు కేటాయించలేదని, ఇంకా పూర్తిస్థాయి బడ్జెట్ కేటాయించకపోవడం ఏమిటంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఎన్నికల హామీలనే ప్రధానాంశాలుగా పేర్కొనడంతో జిల్లాలోని ప్రజలకు లబ్ధి చేకూరనున్నది. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో కొత్త పథకాలు ప్రవేశపెట్టేందుకు అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకే నిధులు కేటాయించడంతో జిల్లాలోని అర్హులైన లబ్ధిదారులకు మేలు జరగనున్నది. వ్యవసాయ, సంక్షేమ రంగాల కోసం నిధులు కేటాయించారు. వ్యవసాయ రంగంలో రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలకు బడ్జెట్లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన ఆసరా పింఛన్లకు కూడా నిధులను కేటాయించింది. దీంతో జిల్లాలోని రైతులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు లాభం చేకూరనున్నది. ప్రధానంగా కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కలగనున్నది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి వ్యక్తికి ఏడాదికి రూ.806 చొప్పున కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2019–20 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇటీవల మధ్యంతర నివేదిక ఇచ్చిందని బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఆర్థిక సంఘం సిఫార్సులకన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతోపాటు 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా రూ.8లక్షల నిధులు కేటాయించనున్నారు. వీటితోపాటు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులు, పన్నుల ద్వారా వచ్చే నిధులతో గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టనున్నది. అంకెల గారడీ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉంది. పూర్తిస్థాయిలో అన్ని వర్గాలకు న్యాయం జరగలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఈ బడ్జెట్‌తో అమలు జరిగే అవకాశం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న ప్రభుత్వం నేటికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సైతం ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూర్చలేదు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం వహిస్తూ నిధుల కేటాయింపు పూర్తిస్థాయిలో లేకపోవడంతో నాణ్యమైన విద్య అందే అవకాశం కనిపించడం లేదు. – పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లెక్కలతో మోసం.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. అలా చేయలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పి లెక్కల గారడీ చేశారు. ఒకేసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం అందుకు రూ.6వేల కోట్లు కేటాయించి మోసం చేశారు. వైద్యరంగానికి రూ.5వేల కోట్లు కేటాయించామని చెప్పిన కేసీఆర్ కంటి వెలుగు, ఈఎన్టీ వంటి పథకాలు కూడా ఇందులోనే ఉంటాయని చెప్పారు. రూ.27వేల కోట్లు లోటు ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ లోటును ప్రజలపై పన్నులు వేసి భర్తీ చేస్తారా? ఏ విధంగా భర్తీ చేస్తారో సీఎం వివరించాలి. – నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పుల్లోనే అభివృద్ధి.. రాష్ట్రం అప్పుల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. కేసీఆర్ చెప్పిన లెక్కల్లో అంతా డొల్లతనం కనిపిస్తోంది. పంట రుణాల కేటాయింపులు గతంలోనే బాగున్నాయి. నిరుద్యోగ భృతికి సంబంధించి బడ్జెట్లో స్పష్టత లేదు. ప్రాజెక్టులకు సరైన రీతిలో కేటాయింపులు జరగలేదు. బడ్జెట్‌ను చూస్తుంటే ఆర్థిక అరాచకత్వం ప్రబలే ప్రమాదం ఉంది. సంక్షేమ పథకాల అమలుపై స్పష్టత లేదు. విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారు. కేసీఆర్ అంకెల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు కేటాయింపులపై స్పష్టత లేదు. – బాగం హేమంతరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి అన్ని వర్గాలకు అన్యాయమే.. అతి సామాన్యుడికి వరాలు ఇచ్చినట్టున్నా.. బడ్జెట్ అన్ని వర్గాలకు అన్యాయం చేసేలా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ రంగానికి సరిపడా నిధులు కేటాయించలేదు. వ్యవసాయ రంగానికి కేటాయించిన బడ్జెట్లో ఏదైనా ఒక్క పథకానికే నిధులన్నీ సరిపోయేలా ఉన్నాయి. అతి సామాన్యుడిపై భారం తగ్గించేందుకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఎన్ని నిధులు కేటాయిస్తున్నామన్నది బడ్జెట్లో చెప్పలేదు. వ్యవసాయం, విద్య తదితర రంగాలు ఈ బడ్జెట్ వల్ల ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి. – లక్కినేని సుధీర్‌బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోసం చేసేందుకే.. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసే ప్రక్రియలో భాగంగానే ఈ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్రం రూ.22వేల కోట్లు ఇస్తుందని తెలిసి కూడా పూర్తి బడ్జెట్‌ను ఎందుకు ప్రవేశపెట్టలేదో అర్థం కావడం లేదు. ఏ ఒక్క గ్రామానికి గ్రాంట్ ఇవ్వలేదు. కొత్త గ్రామ పంచాయతీలకు కేటాయింపులు లేవు. మిషన్ భగీరథ కరెంట్ బిల్లులు ఎవరు కట్టాలి. పార్లమెంట్ ఎన్నికల కోసమే తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారు. – తుళ్లూరి బ్రహ్మయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అప్పుల ఊబిలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.50వేల కోట్ల రెవెన్యూ లోటు కనిపిస్తోంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యానికి నిదర్శనం. మిగులు రాష్ట్రం కాస్త అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లిక్కర్ అమ్మకాల వల్ల వచ్చే ఆదాయంపై ఆధారపడుతోంది. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలి. అయితే రెవెన్యూ లోటు ఉండడం వల్ల ప్రభుత్వం అభివృద్ధిపై నిధులు కేటాయించడం లేదు. బడ్జెట్లో ఖమ్మం జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేకపోయింది. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక, అభివృద్ధి వ్యతిరేక బడ్జెట్. – సన్నె ఉదయ్‌ప్రతాప్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికల బడ్జెట్.. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రజాకర్షక పథకాలతో ప్రవేశపెట్టారు. నిరుద్యోగ భృతి, పెన్షన్, రుణమా ఫీ వంటి ఎన్నికల హామీల నేపథ్యంలో కేటా యింపులు చేయడం సమంజసమైనప్పటికీ.. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, రైతాంగ సంక్షోభానికి కారణమైన వ్యవసాయరంగాన్ని ఆదుకోవడానికి, పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు బడ్జెట్లో పరిష్కార మార్గాలు చూపలేదు. నీటిపారుదల రంగానికి రూ.22వేల కోట్లు కేటాయించినా.. అనేక ప్రాజెక్టులకు లక్ష కోట్లకుపైగా ఖర్చు చేస్తున్న పరిస్థితి చూస్తుంటే వాస్తవ పరిస్థితికి తగినట్లుగా లేదు. మొత్తంమీద ఇది ఎన్నికల బడ్జెట్. – పోటు రంగారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటల
సాక్షి, హైదరాబాద్ : శాసనమండలిలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 5 సార్లు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఈటల.. తొలిసారి మండలిలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో బడ్జెట్‌ను సమర్పించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆరే ఆర్థిక శాఖ నిర్వహిస్తుండటంతో శాసనసభలో స్వయంగా ఆయనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఈటలకు మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. సుమారు 50 నిమిషాలపాటు బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని వినిపించిన ఈటల ప్రభుత్వ ప్రాధామ్యాలతోపాటు వివిధ శాఖల పద్దులను ప్రస్తావించారు. ఈటల ప్రసంగిస్తున్న సమయంలో ప్రభుత్వ సంక్షేమ, పథకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అధికార టీఆర్ఎస్ సభ్యులు హర్షం ప్రకటిస్తూ బల్లలు చరిచారు. బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆయన దగ్గరకు వెళ్లిన సభ్యులు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం ప్రసంగంలో కనిపించిందని అభినందించారు. 2018–19 సంవత్సరపు అనుబంధ వ్యయ అంచనాలను కూడా సభకు సమర్పించారు. -
పైరు.. పండుగ
శాసనసభలో శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన బడ్జెట్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రస్ఫుటంగా ప్రతిబింబించింది. ఆసరా పింఛన్లు మొదలుకుని రైతు రుణమాఫీ దాకా ప్రతి హామీని అమలు చేసి తీరుతామన్న ప్రతిన తాత్కాలిక బడ్జెట్లో కనిపించింది. రైతన్న కోసం సాగుకు వెన్ను దన్ను, ఆపన్నుల కోసం పింఛన్లు బడ్జెట్లో ప్రత్యేకంగా నిలిచాయి. వైద్య, ఆరోగ్య రంగానికి బడ్జెట్ కొంత నిరాశ కలిగించినా, ఇతర సంక్షేమ పథకాల విషయంలో సీఎం ఉదారంగా వ్యవహరించారు. అయితే, ఉద్యోగుల పదవీ విరమణ విషయంలో ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాష్ట్రం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతున్న తీరును బడ్జెట్ ఆవిష్కరించింది. గడిచిన రెండేళ్ల రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ వృద్ధిరేటు సాధించిన తీరు.. రాష్ట్ర భవిష్యత్ మరింత ఆశాజనకంగా ఉంటుందని వెల్లడించింది. ఈ ఏడాది జీఎస్డీపీ రూ.8,66,875 కోట్ల మేర ఉంటుందని సీఎం బడ్జెట్ ప్రసంగంలో అంచనా వేశారు. 2017–18లో రూ.1,81,102గా ఉన్న తలసరి ఆదాయం ఈ ఏడాది రూ.2,06,107కు చేరుకోనుందని అంచనా వేశారు. వృద్ధాప్యంలో ఉన్న పేదలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌కు రూ.1,450 కోట్లు కేటాయించారు. నిరుద్యోగ భృతి కోసం రూ.1,810 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీల సబ్‌ప్లాన్ చట్టాన్ని అమలు చేసి తీరుతామన్న సంకేతాలిచ్చారు. సాగుకు పండగేనన్న రీతిలో సీఎం ప్రతిపాదనలుఉన్నాయి. ‘రైతు బంధు’ కింద ఎకరానికి రూ.2 వేలు పెంచుతూ బడ్జెట్లో రూ.12 వేల కోట్లు ప్రతిపాదించారు. రూ.లక్ష లోపు పంట రుణమాఫీకి మొదటి విడతలో రూ.6వేల కోట్లు కేటాయించారు. వడ్డీ సహా ఈ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రైతు బీమాకు రూ.650 కోట్లు కేటాయించారు. కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యం మేరకు బడ్జెట్లో రూ.22,500 కోట్లు ప్రతిపాదించారు. మనం అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువుగా మారింది. గతంలో దేశమంతా గుజరాత్, కేరళ రాష్ట్రాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు దేశమంతా తెలంగాణవైపు చూస్తోంది. దీంతో హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. మేనిఫెస్టోలోని కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. చెప్పనివి ఎన్నో అమలుచేశాం. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోని కుటుంబమేదీ లేదనడం అతిశయోక్తి కాదు. – కేసీఆర్ శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మనసా, వాచా, కర్మేణా.. బంగారు తెలంగాణకు పునరంకితం ►ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా బడ్జెట్ రూపకల్పన ►బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలు సాకారం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న పథకాలతో ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా.. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మేణా పునరంకితమవుతామని ఆయన ప్రకటించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గానూ శుక్రవారం ఆయన శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ ప్రతిపాదిత వ్యయం రూ.1,82,017 కోట్లుగా పేర్కొన్న సీఎం అందులో ప్రగతి పద్దు అంచనా వ్యయం రూ.1,07,302 కోట్లు, నిర్వహణ పద్దు వ్యయం 74,715 కోట్లుగా ప్రతిపాదించారు. బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. దేశానికే ఆదర్శంగా.. 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఒక సఫల రాష్ట్రంగా, అభివృద్ధి పథంలో పయనిస్తోంది. స్వల్ప కాలంలోనే అనేక ప్రతికూలతలను అధిగమించి, సామాజిక, ఆర్థిక పునాదిని పటిష్టపరుచుకుంటూ దేశానికి ఆదర్శంగా నిలవడం అద్భుతం. రాష్ట్రం ఆవిర్భవించినపుడు ఎటుచేసినా వెనుకబాటుతనమే కనిపించింది. ఎటువైపు చూసినా సవాళ్లే స్వాగతం పలికాయి. సమైక్యపాలన తెచ్చిన దుష్పరిణామాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వేధించాయి. తీవ్రమైన కరెంటు కొరత, వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, చిన్నాభిన్నమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఎక్కడికక్కడే ఆగిపోయిన నీటిపారుదల ప్రాజెక్టులు, చెదిరిపోయిన చెరువులు, వరుస కరువులు, వలసపోయే ప్రజలు, గుక్కెడు నీళ్ల కోసం అలమటించే దౌర్భాగ్యంతో తెలంగాణ సామాజిక ముఖచిత్రం ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు పట్టుదలతో ప్రయత్నించాం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం సాగిన ప్రయాణంలో భగవంతుడి దీవెనలు, ప్రకృతి అనుకూలతలు, ప్రజల సహకారం లభించాయి. మొదటి నాలుగున్నరేళ్లలో తలపెట్టిన కార్యక్రమాలు అనుకున్న పంథాలో సాగి అద్భుత విజయాలు సాధించాం. అతితక్కువ సమయంలోనే అభివృద్ధి దిశగా అడుగులేశాం. వినూత్నమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా వచ్చే ఆనందం ప్రభుత్వ సంకల్పాన్ని బలోపేతం చేస్తుంది. శక్తిసామర్థ్యాలను ఇనుమడింపచేస్తుంది . రెండు రెట్ల కన్నా ఎక్కువ జీఎస్డీపీ వృద్ధి సమైక్యపాలన చివరి రెండేళ్లలో తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) వృద్ధిరేటు దేశసగటు కన్నా తక్కువ ఉండేది. ఆ రెండేళ్లలో దేశసగటు వృద్ధిరేటు 5.9% ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 4.2% మాత్రమే. అదే 2018–19లో వృద్ధిరేటు రెండురెట్ల కన్నా ఎక్కువగా 10.6% నమోదైంది. ప్రస్తుత ధరలలో జీఎస్డీపీ 2016–17లో 14.2% ఉంటే 2017–18లో 14.3%కు పెరిగింది. 2018–19లో 15% వృద్ధి సాధించనుంది. ఇది దేశ అభివృద్ధి రేటు 12.3% కన్నా ఎక్కువ. 2018–19లో జీఎస్డీపీ ప్రాథమిక రంగం 10.9% వృద్ధిరేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. విద్యుత్ పరిస్థితిలో మెరుగుదల, సాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపపిల్లల సరఫరా, రైతులకు పెట్టుబడి మద్దతు ద్వారా ఇది సాధ్యపడింది. పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లోనూ చెప్పుకోదగిన మెరుగుదల కనిపించింది. ఈ రంగాల్లో 14.9% వృద్ధిరేటు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. సేవారంగంలో 15.5% పెరుగుదల నమోదవుతుందని ఆశిస్తున్నాం. ఇక, తలసరిఆదాయం 2017–18లో రూ.1,81,102 ఉంటే 2018–19లో రూ.2,06,107కు చేరుకోనుంది. బాల్యవివాహాలు తగ్గాయ్ పేద తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కార్యక్రమాలను చేపట్టాం. ఈ పథకం పేదలకు ఆర్థిక అండనివ్వడంతో పాటు సామాజిక సంస్కరణకు దోహదపడింది. 18ఏళ్లు నిండిన వారే అర్హులనే నిబంధనతో బాల్యవివాహాలు గణనీయంగా తగ్గాయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.1,450 కోట్లు కేటాయిస్తున్నాం. నిరుద్యోగభృతి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.1,810 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్ కులాల ప్రగతినిధికి రూ.16,851 కోట్లు, షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి రూ.9,827 కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం 2,004 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. నేను దగ్గరుండి గమనించాను నా విద్యార్థి దశలో దుబ్బాకలో చేనేత, బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్నాను. బీడీలు చుట్టే తల్లులు అనుభవించే దుర్భర వేదనను దగ్గర్నుంచి గమనించాను. అందుకే వారి వేదనను తీర్చాలని ఎవరూ అడగకుండానే ప్రతినెలా రూ.1,000 జీవనభృతిని ప్రకటించాను. తోడులేని ఒంటరి స్త్రీ సమాజంలో పడే పాట్లు చెప్పనలవికాదు. వీరికి రూ.1,000 భృతి ఇవ్వడం కొండంత అండగా మారింది. ఆసరా పింఛన్లు అందుకుంటున్న వారంతా కేసీఆర్ మమ్మల్ని కాపాడుతున్న పెద్దకొడుకని, దేవుడిచ్చిన అన్న అని దీవించడం.. నా రాజకీయ జీవితానికి గొప్ప సార్థకతగా భావిస్తున్నాను. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఇదే నా హృదయానికి దగ్గరైన కార్యక్రమాలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, నేత, గీత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే పింఛన్‌ను నెలకు రూ.1,000 నుంచి రూ.2016కు పెంచుతున్నాం. దివ్యాంగుల పింఛన్‌ను రూ.3,016కు పెంచుతున్నాం. వృద్ధాప్య పింఛన్ కనీస వయసును 57 సంవత్సరాలకు తగ్గిస్తున్నాం. ఆసరా పింఛన్ల కోసం 12,067 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రేషన్‌తో పాటు హాస్టళ్లు, మధ్యాహ్న భోజనంలో ఇచ్చే సన్నబియ్యం సబ్సిడీ కోసం రూ.2,744 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణపైనే చర్చ మనం అనుసరిస్తున్న సమగ్ర ప్రగతి ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్రబిందువుగా మారింది. గతంలో దేశమంతా గుజరాత్, కేరళ రాష్ట్రాల అభివృద్ధి నమూనా గురించే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్‌పైనే చర్చ జరుగుతోంది. దీంతో హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. మేనిఫెస్టోలోని కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. చెప్పని ఎన్నో కార్యక్రమాలను అమలుచేశాం. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రగతి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందుకోని కుటుంబమేదీ రాష్ట్రంలో లేదనడం అతిశయోక్తి కాదు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రభుత్వంపై తమకున్న అచంచల విశ్వాసాన్ని చాటుకున్నారు. విద్యుత్ సంక్షోభం పరిష్కారం తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదో నెల నుంచే నాణ్యమైన విద్యుత్‌ను 24గంటల పాటు సరఫరా చేస్తున్నది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు 28వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా తలపెట్టిన కొత్త ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. భద్రాద్రి పవర్‌ప్లాంటు ఈ ఏడాది నుంచే ఉత్పత్తి ప్రారంభిస్తుంది. యాదాద్రి అల్ట్రామెగా పవర్‌ప్లాంటు నిర్మాణపనులు వేగంగా సాగుతున్నాయి. 5వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకుని 3,613 మెగావాట్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రం ఏర్పడే నాటికి 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు 16,503 మెగావాట్లకు చేర్చాం. మిషన్‌భగీరథ ద్వారా రాష్ట్రంలోని 19,750 జనావాసాల్లో ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీరిస్తున్నాం. ఏప్రిల్ నెలాఖరు కల్లా వందకు 100% పూర్తి చేసి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీళ్లిస్తాం. ఇప్పటివరకు 2,72,763 డబుల్బెడ్రూం ఇళ్లను మంజూరు చేశాం. కొత్తగా 3,150 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను సాధించాం. హైదరాబాద్ ఔటర్రింగురోడ్డు అవతల 340 కిలోమీటర్ల రీజనల్ రింగురోడ్డును నిర్మించాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామపంచాయతీలకు కచ్చితంగా బీటీ రోడ్లు వేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల హామీలకు కట్టుబడి.. వ్యవసాయరంగ సమస్యల పరిష్కారంలో దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచింది. మేం ప్రవేశపెట్టిన పథకాలను యావత్భారతం వేనోళ్ల కొనియాడుతోంది. పండిన పంటకు మద్దతు ధరను సాధించేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రైతుల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పబోతున్నాం. 2014 ఎన్నికల హామీకి కట్టుబడి 35.29లక్షల రైతుల రూ.16,124 కోట్ల రుణాలను మాఫీ చేశాం. తెలంగాణ ఏర్పడే నాటికి 4.17లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోదామును 22.50లక్షల టన్నుల సామర్థ్యానికి తెచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి 2018 డిసెంబర్11 నాటికి లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. రైతురుణమాఫీ కోసం రూ.6వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించడం గర్వకారణం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుబంధు సాయాన్ని పెంచుతున్నాం. ఇందుకోసం బడ్జెట్లో రూ.12,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. రైతుబీమాతో ఇప్పటివరకు 5,675 మంది రైతు కుటుంబాలకు రూ.283 కోట్ల సాయం అందించాం. ఈ బడ్జెట్లో రైతుబీమా కిస్తీ కోసం రూ.650 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం ఆ రికార్డులు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి వీలుగా కోర్‌బ్యాంకింగ్ తరహాలో ధరణి వెబ్సైట్ రూపొందించాం. క్రాప్కాలనీల్లో భాగంగా చిన్న, మధ్యతరహా, భారీ ఆహార శుద్ధి కేంద్రాలు నెలకొల్పుతాం. వీటి నిర్వహణలో ఐకేపీ ఉద్యోగులు, ఆదర్శ మహిళా సంఘాలను భాగస్వాములు చేయాలని సంకల్పిస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్లో రూ.20,107 కోట్లను వ్యవసాయశాఖకు ప్రతిపాదిస్తున్నాం. నాలుగేళ్లలో 90% పూర్తి గతంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి దశాబ్దాల కాలం పట్టేది. కానీ మేం నాలుగేళ్లలోనే 90% నిర్మాణపనులను పూర్తి చేశాం. అన్ని ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ, పరిపాలనాల అనుమతులొచ్చాయి. తెలంగాణ వరదాయని కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును కేంద్ర జలసంఘం, కేంద్ర ఆర్థిక సంఘం కొనియాడాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే రైతులకు నీరందివ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను ఈ ఐదేళ్లకాలంలో పూర్తిచేసి సస్యశ్యామలం చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ.22,500 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. పంచాయతీలకు ప్రత్యేక ప్రణాళిక సమైక్య పాలనలో తెలంగాణ సామాజిక జీవిక చెదిరిపోయింది. ఈ పరిస్థితిలో మార్పు కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. గొర్రెల పంపిణీ ద్వారా కురుమగొల్లలకు రూ.2,600 కోట్ల సంపద సమకూరింది. పెద్దసంఖ్యలో ఉన్న పవర్‌లూమ్‌లను ఆధునీకరిస్తున్నాం. వరంగల్‌లో భారీ టెక్స్‌టైల్‌పార్కు, సిరిసిల్లలో అపరెల్ పార్కు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సంచార జాతులను ఆదుకునేందుకు ఈ బడ్జెట్లో ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, మౌలికసదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడే ప్రజల జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పు సాధ్యమని నమ్ముతున్నాం. పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఆసుపత్రి సేవలను మెరుగుపరిచాం. మందుల కోనుగోలుకు ఏటా రూ.440 కోట్లు వెచ్చిస్తున్నాం. జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఐసీయూ కేంద్రాల సంఖ్య పెంచాం. ప్రతి 10వేల మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాం. కేసీఆర్ కిట్స్‌తో ఆసుపత్రుల్లో ప్రసవాలు 33 నుంచి 49%కు పెరిగాయి. తెలంగాణ ఏర్పడే నాటికి శిశుమరణాల రేటు ప్రతి వెయ్యి మందికి 39 ఉంటే అది ఇప్పుడు 28కి తగ్గింది. మాతృత్వ మరణాల రేటు కూడా 91 నుంచి 70కి తగ్గింది. కోటి 52లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50లక్షల మందికి కంటి అద్దాలిచ్చాం. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. వైద్యశాఖకు రూ.5,536 కోట్లు ప్రతిపాదిస్తున్నాం . విప్లవాత్మక సంస్కరణలు ప్రజలకు పాలన మరింత చేరువ చేసేందుకు జిల్లాలను 33కి, రెవెన్యూ డివిజన్లను 69కి, మండలాలను 584కు పెంచుకున్నాం. కొత్తగా 68 మున్సిపాలిటీలు, 4,383 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసుకున్నాం. కొత్తగా 7 పోలీస్ కమిషనరేట్లు, 44 సబ్డివిజన్లు, 29 సర్కిళ్లు, 102 పీఎస్‌లను ఏర్పాటు చేశాం. 1,177 తండాలను పంచాయతీలుగా మార్చాం. గ్రామాభ్యుదయం కోసం నూతన పంచాయతీరాజ్ చట్టానికి రూపకల్పన చేసుకున్నాం. రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,400 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.9,000 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే గ్రామాల అభివృద్ధికి ఎక్కువ నిధులివ్వాలన్న ఆలోచనతో కేంద్ర ఆర్థిక సంఘం ఇస్తున్న రూ.1,628 కోట్లకు అదనంగా మేం మరో రూ.1,628 కోట్లు గ్రామాలకు ఇస్తాం. దీంతో 500 జనాభా ఉన్న గ్రామానికి కూడా 8లక్షల వరకు నిధులొస్తాయి. ఇప్పటివరకు రూ.1.41 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడిన 8,419 పరిశ్రమలకు అనుమతులివ్వడంతో 8.58లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడింది. హైదరాబాద్‌లో త్వరలోనే అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం కానుంది. రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు అకౌంటెంట్ జనరల్ ధ్రువీకరించిన ప్రకారం 2017–18లో మొత్తం వ్యయం రూ.1,43,133 కోట్లు. రెవెన్యూ రాబడులు రూ.88.824 కోట్లు. రెవెన్యూ ఖర్చు 85,365 కోట్లు. మిగులు రూ.3,459 కోట్లు. మొత్తం వ్యయంలో మూలధన వ్యయం రూ.23,902 కోట్లు. సవరించిన అంచనాల ప్రకారం 2018–19 సంవత్సరానికి అంచనా వ్యయం రూ.1,61,857 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,19,027 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.28,053 కోట్లు. రెవెన్యూ ఖాతాలో మిగులు రూ.353 కోట్లు. ఇక, 2019–20 సంవత్సరానికి రెవెన్యూ రాబడుల ప్రతిపాదనలు రూ.94,776 కోట్లు. కేంద్ర ప్రతిపాదిత బదిలీలు రూ.22,835 కోట్లు. ప్రగతి పద్దు అంచనా వ్యయం రూ.1,07,302 కోట్లు. నిర్వహణ పద్దు అంచనా వ్యయం రూ.74,715 కోట్లు. మొత్తం ప్రతిపాదిత వ్యయం రూ.1,82,107 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు. మిగులు రూ.6,564 కోట్లు. ఆర్థికలోటు రూ.27,749 కోట్లు. అంచనావేసిన జీఎస్డీపీలో ఇది 2.81%. సుస్థిరమైన వృద్ధి మరే రాష్ట్రానికి సాధ్యంకాని రీతిలో రాష్ట్రం స్థిరమైన ఆదాయాభివృద్ధి రేటు సాధిస్తోంది. మొదటి నాలుగేళ్లలో 17.17% వార్షిక సగటువృద్ధి సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. మూలధన వ్యయశాతంలోనూ దేశంలోనే మనమే మొదటి స్థానంలో ఉన్నాం. 2016–17 సంవత్సరంలో మొత్తం వ్యయంలో మూలధన వ్యయం 28.2% ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి పదేళ్లలో మూలధన వ్యయం రూ.1,29,683 కోట్లయితే 10 జిల్లాలకు చేసిన వ్యయం రూ.54,052 కోట్ల రూపాయలే. కానీ, నాలుగున్నరేళ్లలో తెలంగాణలో రూ.1,68,913 కోట్ల మూలధన వ్యయం జరిగింది. కొత్త పథకాలు ప్రారంభం ‘రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తదేక దీక్షతో తపస్సు చేయడం వల్లే ప్రజలు గత ఎన్నికల్లో నిండు దీవెనలు అందించారు. రాబోయే కాలంలోనూ ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా వినూత్న పథకాలతో ముందుకెళతాం. పచ్చని పంటలతో తులతూగుతూ అన్ని వర్గాల ప్రజలు సమాన అభివృద్ధి ఫలాలు అందుకునేలా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మణా పునరంకితమవుతామని సవినయంగా ప్రకటిస్తున్నాను’అని కేసీఆర్ బడ్జెట్‌ను ప్రతిపాదనలు సభముందుంచారు. కొత్త పథకాలు ప్రారంభం ‘రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. తదేక దీక్షతో తపస్సు చేయడం వల్లే ప్రజలు గత ఎన్నికల్లో నిండు దీవెనలు అందించారు. రాబోయే కాలంలోనూ ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదికగా వినూత్న పథకాలతో ముందుకెళతాం. పచ్చని పంటలతో తులతూగుతూ అన్ని వర్గాల ప్రజలు సమాన అభివృద్ధి ఫలాలు అందుకునేలా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనసా, వాచా, కర్మణా పునరంకితమవుతామని సవినయంగా ప్రకటిస్తున్నాను’అని కేసీఆర్ బడ్జెట్‌ను ప్రతిపాదనలు సభముందుంచారు. ►రూ.1,07,302 కోట్లు 2019–20కి ప్రగతి పద్దు ►రూ.74,715 కోట్లు నిర్వహణ పద్దుకు కేటాయించింది ►రూ.6,564 కోట్లు రెవెన్యూ మిగులు ►రూ.27,749 కోట్లు ద్రవ్యలోటు ►రూ.1,74,453 కోట్లు 2018–19 ఆమోదించిన బడ్జెట్ ►రూ.1,61,857 కోట్లు సవరించిన అంచనా బడ్జెట్ -
బడ్జెట్ టైం
-
బడ్జెట్ కేటాయింపులపై హర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో తమ సామాజిక వర్గానికి తగినన్ని కేటాయింపులు జరపడం పట్ల తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక హర్షం వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్నివర్గాలకు సముచితంగా నిధులు కేటాయించారని ఐక్యవేదిక అధ్యక్షుడు లింగం నాయీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులకు బడ్జెట్ లో రూ.250 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం పాటుపడుతోందనడానికి ఈ బడ్జెట్ నిదర్శమని ప్రశంసించారు. నాయీబ్రాహ్మణుల సాధికారతకు తగినన్ని నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. తమకు కేటాయించిన నిధులను తగినవిధంగా ఖర్చుచేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో 20 శాతం కూడా ఖర్చు చేయలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈసారైనా నిధులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది నాయీబ్రాహ్మణులు ఉన్నారని, తమ జనాభాను దృష్టిలో పెట్టుకుని తాజా బడ్జెట్ లో రూ. 1000 కోట్లు కేటాయిస్తే బాగుండేదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాతినిథ్యం కల్పించాలి చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి లింగం నాయీ విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం కల్పించాలని కోరారు. నాయీబ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చేయూత అందించాలని విన్నవించారు. -
ప్రాధాన్యతలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాలను సమతుల్యం చేసుకుంటూనే ప్రాధాన్యతా రంగాలకు పెద్దపీట వేసేలా 2018–19 బడ్జెట్ అంచనాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అన్ని రంగాల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడేలా బడ్జెట్ పూర్తి సమతుల్యంతో ఉందన్నారు. రాష్ట్ర ఆదాయ వనరులు, అవసరాలు, ప్రభుత్వ లక్ష్యాలకు నడుమ సమన్వయాన్ని బడ్జెట్ కూర్పు సాధించిందన్నారు. వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడం సంతోషకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతుకు పెట్టుబడి మద్దతు పథకం, విద్యుత్ సబ్సిడీలకు అధిక నిధులు సమకూర్చడం ద్వారా తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధికి బడ్జెట్ అవకాశం కల్పించిందన్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం అమలు పరుస్తున్న కార్యక్రమాలు మరింత విజయవంతంగా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను సమర్థంగా అమలు పరిచేందుకు వార్షిక ఆర్థిక ప్రణాళికను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులను సీఎం అభినందించారు. -
అన్నదాతా సుఖీభవ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అన్నదాతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రైతుల కోసం కొత్తగా ప్రారంభించే రెండు పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. ఖరీఫ్, రబీలకు కలిపి ఎకరాకు రూ. 8 వేల చొప్పున అందజేసే ‘పెట్టుబడి’ పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయించింది. అందులో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ. 1,854 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 1,089.60 కోట్లు కేటాయింపులు చేసింది. ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు 72 లక్షల మంది రైతులకు 1.65 కోట్ల ఎకరాల భూమికి పెట్టుబడి పథకం కింద సీజన్‌కు రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. వచ్చే నెల 19 నుంచి పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తారు. రబీ సీజన్‌కు నవంబర్‌లో పెట్టుబడి సాయం అందజేస్తారు. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. చెక్కుల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారు. ఖరీఫ్‌లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేస్తారు. 1.65 కోట్ల ఎకరాలకు రైతులకు రూ. 6,600 కోట్లు అందజేస్తారు. ఇక మిగిలే రూ. 5,400 కోట్లు రబీలో రైతులకు ఇస్తారు. రబీలో పంట సాగు చేసే రైతులను గుర్తించి వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందజేస్తారు. రైతు బీమాకు రూ. 500 కోట్లు రైతుల కోసం కొత్త బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం పంటలు నష్టపోతేనే వాటి కింద రైతుకు బీమా పరిహారం ఇచ్చేవారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ. 6 లక్షలు ఇచ్చే అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకంలో అన్నదాతలు ఒకవేళ సాధారణ మరణం పొందినా, ఆత్మహత్యలు చేసుకున్నా, ప్రమాదంలో చనిపోయినా కూడా ఆయా రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఇందుకోసం బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 72 లక్షల మంది రైతుల తరపున ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లిస్తుంది. కాగా, కీలకమైన రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌కు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఇప్పటికే రూ. 200 కోట్లను మూలనిధి కింద విడుదల చేయడంతో బడ్జెట్లో కేటాయింపులేవీ చూపించలేదు. వ్యవసాయానికి రూ.9 వేల కోట్లు అదనం 2017–18 బడ్జెట్‌కంటే భారీగా పెరిగిన నిధులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం వ్యవసాయానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. 2017–18 బడ్జెట్లో రూ.6,498.15 కోట్లు కేటాయిస్తే, 2018–19 ప్రగతి బడ్జెట్లో రూ.15,511 కోట్లు కేటాయించింది. ఏకంగా రూ.9,013 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం. అందులో ఈసారి కొత్తగా ప్రవేశపెట్టబోయే ‘పెట్టుబడి’ పథకానికి రూ.12 వేల కోట్లు, రైతు బీమాకు రూ.500 కోట్లు కేటాయించారు. ఇవిగాక వ్యవసాయ యాంత్రీకరణకు 2017–18 బడ్జెట్లో రూ.336.80 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.522 కోట్లు కేటాయించారు. ఈసారి వరినాటు యంత్రాలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు పంచేందుకు సర్కారు సన్నద్ధం కావడంతో ఈ మేరకు నిధులు కేటాయించారు. ఇక పంటల బీమా పథకానికి గత బడ్జెట్లో రూ.343 కోట్లు కేటాయిస్తే, ఈసారి 500 కోట్లు కేటాయించారు. విత్తన సరఫరాకు గత బడ్జెట్లో రూ.138 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో రూ.178 కోట్లు కేటాయించారు. రైతు వేదికల కోసం రూ.158 కోట్లు కేటాయించారు. ఉద్యానశాఖకు 2017–18 బడ్జెట్లో రూ.207 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో రూ.376 కోట్లు కేటాయించడం గమనార్హం. అయితే వ్యవసాయ మార్కెటింగ్‌కు 2017–18 బడ్జెట్లో రూ. 457 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో కేవలం రూ.122 కోట్లు మాత్రమే కేటాయించారు. ఏకంగా రూ. 335 కోట్లు తగ్గించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా.. పెట్టుబడి పథకం, రైతు బీమా వంటి రెండు పథకాలు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అభినందనీయం. ఈ బడ్జెట్ పూర్తిగా రైతును రాజుగా చేసేదిలా ఉంది. ఈ రెండు పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఇక రైతు బీమా పథకం అనేది ఆయా కుటుంబాలకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. సన్న చిన్నకారు రైతులకు పెట్టుబడి పథకం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అనేకమంది రైతులు సాగు చేసేందుకు ముందుకు వస్తారు. – డాక్టర్ పిడిగం సైదయ్య, ఉద్యాన వర్సిటీ పెట్టుబడి పథకంపై అనుమానాలు పెట్టుబడి పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఖరీఫ్‌కు అందరికీ ఇచ్చినా, రబీలో సాగు చేసే రైతులకే ఇస్తారు. అప్పుడు ఇంత సొమ్ము అవసరంలేదు. ఇందులో ఏదో మతలబు ఉంది. రైతులను మభ్య పెట్టేందుకే సర్కారు పెట్టుబడి పథకానికి ఎక్కువ నిధులు కేటాయించినట్లు చూపిస్తుంది. – సారంపల్లి మల్లారెడ్డి,రైతు సంఘం జాతీయ నేత అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు కేసీఆర్‌పై జీవన్‌రెడ్డి మండిపాటు సాక్షి, హైదరాబాద్: తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు ముందు రూ.70 వేల కోట్ల అప్పు ఉండేదని, రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనలో అది మరో రూ.70 వేల కోట్లు పెరిగిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. అప్పుల రాష్ట్రంగా తెలంగాణను తయారు చేశారన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లపాటు ప్రధాని మోదీ పాట పాడిన సీఎం కేసీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారని విమర్శించారు. -
రాయితీలు పెరిగినా..‘విద్యుత్’ వాతే!
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారీ ఎత్తున విద్యుత్ చార్జీల పెంపు తప్పేటట్లు లేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలినాళ్లలో ఎదురైన తీవ్ర విద్యుత్ కొరతను అధి గమించి కోతల్లేని విద్యుత్ సరఫరాను అందిస్తుం డటం, గత జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టడం ద్వారా దేశంలో రాష్ట్రం పేరు మార్మోగిపోయింది. అయితే ఈ అవస రాల కోసం డిస్కంలు భారీ మొత్తంలో విద్యుత్ కొనుగోళ్లు జరుపుతుండటంతో వాటిపై తీవ్ర ఆర్థిక భారం పడింది. దీంతో కొన్నేళ్ల నుంచి తీవ్ర నష్టా లను ఎదుర్కొంటున్న డిస్కంల ఆర్థిక లోటు 2018–19 ముగిసే నాటికి రూ.9,970.98 కోట్లకు పెరగనుందని ఆయా సంస్థల యాజమన్యాలే ఇటీ వల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి నివేదించాయి. వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యుత్ చార్జీలనే 2018–19లో సైతం యథాతథంగా కొనసాగించాలని ప్రతిపాదిం చాయి. 2017–18లో డిస్కంలకు ప్రభుత్వం రూ.4,484.30 కోట్ల విద్యుత్ సబ్సిడీ కేటాయించగా, గురువారం ప్రవేశపెట్టిన 2018–19 బడ్జెట్లో రూ.5,650 కోట్లకు పెంచింది. అయినా, తీవ్ర నష్టాల నుంచి డిస్కంలు గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీలను సర్దుబాటు చేసినా రూ.4320.98 కోట్ల నష్టాలను మూటగట్టుకోనున్నాయి. ఈ నష్టాలను పూడ్చు కోవడానికి సాధారణ ఎన్నికల తర్వాత డిస్కంల యాజమాన్యాలు ట్రూ అప్ పేరుతో భారీగా విద్యుత్ చార్జీలు పెంచే అవకాశాలున్నాయి. ‘పెట్టుబడి’తో రైతుకు లబ్ధి.. పెట్టుబడి పథకానికి బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించారు. దీంతో రైతులు ప్రైవేటు అప్పులకు వెళ్లకుండా విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి వీలు కలుగనుంది. ఖరీఫ్, రబీల్లో ఎకరానికి రూ. 8 వేల చొప్పున రైతులకు అందజేస్తారు. ఈ పథకం రైతుల జీవితాల్లో వెలుగు నింపనుంది. రైతు బీమా పథకం వల్ల అన్నదాత ఏ కారణంతో చనిపోయినా రూ. 5 లక్షల బీమా అందనుంది. – పార్థసారథి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి కీలక రంగాలకు తగిన కేటాయింపులు 2018–19 బడ్జెట్ అసాధారణం. కీలక రంగాలకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరిగాయి. వ్యవసాయం కోసం రూ.12 వేల కోట్లు, రైతు లక్ష్మి కోసం రూ. 8 వేల కోట్లు కేటాయించడం ద్వారా ఆర్థికవృద్ధి గణనీయంగా పెరుగుతుంది. 2013–14లో 5.4 శాతం ఉన్న జీడీపీ 2016–17 ఆర్థిక సంవత్సరానికి 10.1కి, 2017–18 లో 10.4 శాతానికి పెరిగింది. జాతీయ జీడీపీ కేవలం 6.6 శాతం మాత్రమే ఉండగా తెలంగాణ జీడీపీ 10.4 శాతానికి పెరగడం వృద్ధికి నిదర్శనం. రైతుల సంక్షేమం కోసం ఆర్థిక మంత్రి ఈటల మరో విశిష్టమైన కేటాయింపులు చేశారు. రైతు బీమాకు రూ. 5 లక్షల బీమా వర్తింపజేయడం కోసం రూ. 500 కోట్లు కేటాయించడం, రైతు పనిముట్ల కోసం కూడా భారీగా నిధులు ఇవ్వడం సంతోషకరం. ఇప్పటిదాకా ప్రభుత్వం 13,934 ట్రాక్టర్లు, 31,274 పనిముట్లు, 26,179 స్ప్రేయర్లకు 50 నుంచి 95 శాతం సబ్సిడీ ఇచ్చింది. ఇక నుంచి రైస్ ట్రాన్స్ప్లాంటర్లను కూడా ఇస్తాం. కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ. 25 వేల కోట్లు, చేనేతకు రూ. 1,200 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. – మంత్రి కేటీఆర్ ట్వీట్ నిధుల కోత సరికాదు.. 2017–18 బడ్జెట్‌తో పోలిస్తే మార్కెటింగ్‌శాఖకు రూ. 336 కోట్ల మేరకు నిధులు తగ్గాయి. ఇలా నిధులు తగ్గించ డంలో ప్రభుత్వ ఆంతర్యమేంటో అంతు బట్టడంలేదు. పెట్టుబడికి, రైతు బీమాకు అదనపు నిధులు కేటాయిస్తే ఈ బడ్జెట్లో పెద్దగా చెప్పుకోదగిన మార్పుల్లేవు. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
‘సాగు’.. బాగు బాగు
తాజా బడ్జెట్లో సాగునీటి రంగానికి నిధుల ప్రవాహం కొనసాగింది. సాగునీటి కోసం ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని రెండేళ్ల కింద సీఎం కేసీఆర్ ప్రకటించిన మేరకు.. 2018–19 బడ్జెట్లోనూ రూ.25 వేల కోట్లు కేటాయించారు. ఇందులో ప్రగతి పద్దు కింద రూ.22,301.35 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.3,698.65 కోట్లు ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈసారి కూడా నిధుల్లో అగ్రతాంబూలం దక్కింది. పాలమూరు–రంగారెడ్డితోపాటు మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులకూ ప్రాధాన్యమిచ్చారు. సాగునీటి ప్రాజెక్టులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధుల సమీకరించనున్న దృష్ట్యా.. దేవాదుల ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా రూ.1,966 కోట్లు కేటాయించారు. కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే సీతారామ, తుపాకులగూడెం, ఇందిరమ్మ వరద కాల్వలకూ పూర్తిస్థాయి బడ్జెట్ ఇచ్చారు. – సాక్షి, హైదరాబాద్ రెండు ప్రాజెక్టులకు భారీగా.. ఈసారి సాగునీటి బడ్జెట్లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ.6,094 కోట్లు ఇచ్చారు. గతేడాది ఈ ప్రాజెక్టుకు కేటాయిం చిన నిధులతోపాటు కార్పొరేషన్ ద్వారా రూ.9 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. మొత్తంగా రూ.13 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. ఈ ఏడాది కూడా కార్పొరేషన్ రుణాలు కలిపి ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గతేడాది రూ.4 వేల కోట్లు కేటాయించగా.. ఈసారి రూ.3 వేల కోట్లు ఇచ్చారు. ముఖ్యంగా ఈసారి డిండి, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. చిన్న నీటి వనరులకు రూ.2,415 కోట్లు.. చిన్న నీటి వనరులకు ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ కాకతీయ కింద 7 వేల చెరువులను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో కేటాయింపులు పెంచారు. మొత్తంగా చిన్న నీటి వనరుల అభివృద్ధికి గతేడాది రూ.2 వేల కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది రూ.2,415 కోట్లు ఇచ్చారు. ఇందులో మిషన్ కాకతీయకు రూ.1,500 కోట్లు కేటాయించారు. గతేడాది మిషన్ కాకతీయకు రూ.1,243 కోట్లు కేటాయించగా.. రూ.1,233 కోట్లకు సవరించారు. భూగర్భ జల వనరుల అభివృద్ధికి రూ.77.50 కోట్లు ఇచ్చారు. ఇక చిన్న నీటి వనరుల అభివృద్ధి కోసం కేంద్ర పథకాలైన గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) నుంచి రూ.244 కోట్లు, సాగునీటి సత్వర ప్రాయోజిత పథకం (ఏఐబీపీ) కింద రూ.65 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. కేటాయింపులు ఘనం.. రుణాలే ఆధారం! వేగంగా ప్రాజెక్టులను పూర్తిచేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఎన్నడూ లేనంతగా గతేడాది సాగునీటికి రూ.26 వేల కోట్లకుపైగా కేటాయించింది. కానీ చివరికి వ్యయాన్ని రూ.20 వేల కోట్లకు సవరించింది. ఇందులో కార్పొరేషన్ల పేరిట రుణాలే ఎక్కువగా ఉన్నాయి. తక్షణ ఆయకట్టునిచ్చే ప్రాజెక్టుల కింద చేసిన ఖర్చు అంతంత మాత్రంగానే ఉండటం గమనార్హం. గతేడాది ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.13,107 కోట్లు ఖర్చుచేయగా.. అందులో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలే రూ.9,013 కోట్లు. అంటే ఈ రుణాలు తీసేస్తే.. రాష్ట్ర నిధుల్లోంచి జరిపిన కేటాయింపులు రూ.11 వేల కోట్లు మాత్రమే. ఈసారి సైతం దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నందున.. మళ్లీ రుణాలతోనే గట్టెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. - మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు గతేడాది రూ.1,720 కోట్లు కేటాయించినా.. చివరికి రూ.645.48 కోట్లకు సవరించారు. ముఖ్యంగా కల్వకుర్తికి బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించగా.. రూ.370 కోట్లే ఖర్చు చేశారు. ఈ ఏడాది తిరిగి రూ.500 కోట్లు కేటాయించారు. నెట్టెంపాడుకు గతేడాది రూ.235 కోట్లు కేటాయించినా.. రూ.70 కోట్లకు సవరించారు. - ప్రాణహిత ప్రాజెక్టుకు నిధులను రూ.775 కోట్ల నుంచి రూ.220 కోట్లకు.. డిండికి రూ.500 కోట్ల నుంచి రూ.260 కోట్లకు.. తుపాకులగూడేనికి రూ.505 కోట్లకుగాను రూ.120 కోట్లకు సవరించారు. - ప్రధాన ప్రాజెక్టు అయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.4 వేల కోట్లు కేటాయించినా.. చివరికి రూ.1,660 కోట్లకు తగ్గించారు. - కోయిల్‌సాగర్, భీమా, దిగువ పెన్‌గంగ, ఎల్లంపల్లి పరిధిలోనూ కేటా యింపులు భారీగా చూపినా నిధుల ఖర్చు అంతంత మాత్రంగానే ఉంది. - చాలా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, సహాయ పునరావాస సమస్యలు, కేంద్ర సంస్థల నుంచి అటవీ, పర్యావరణ అనుమతుల జాప్యం, కోర్టుల కేసుల కారణంగా ప్రాజెక్టుల పరిధిలో అనుకున్న నిధుల ఖర్చు జరగలేదు. -
వైద్య, ఆరోగ్య శాఖకు రూ.7,375 కోట్లు
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. గత ఏడాది కంటే ఈ సారి బడ్జెట్లో రూ.1,339 కోట్లు పెంచి, రూ.7,375.20 కోట్లు కేటాయించారు. సంక్షేమ పథకాల కోసం ప్రగతి పద్దు కింద రూ.3,852.49 కోట్లు, నిర్వహణ పద్దు కింద రూ.3,522.71 కోట్లు కేటాయించారు. వైద్య విద్యను మరింత బలోపేతం చేసేందుకు నల్లగొండ, సూర్యాపేటలో ప్రభుత్వ వైద్య కాలేజీలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. గర్భిణుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ ఆ మేరకు కేటాయింపులు జరిపింది. అయితే గత ఏడాదితో పోలిస్తే అమ్మ ఒడి (కేసీఆర్ కిట్) పథకానికి కేటాయింపులు స్వల్పంగా తగ్గాయి. గత బడ్జెట్లో రూ.605 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.560.50 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీకి పెంపు... ఆరోగ్యశ్రీకి ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. గత రెండేళ్లుగా బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. తాజా బడ్జెట్లో నిధుల పెంపు నేపథ్యంలో బకాయిల చెల్లింపు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత బడ్జెట్లో ఆరోగ్యశ్రీకి రూ.503.20 కోట్లు ఇవ్వగా, ఈ సారి రూ.699.44 కోట్లు కేటాయించింది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య, వైద్య సేవల కోసం రూ.300 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటికే ఈహెచ్ఎస్/జేహెచ్ఎస్ వైద్య సేవల బకాయిలు రూ.410 కోట్ల వరకు ఉన్నాయి. ఈ చెల్లింపులను జరపకపోవడంతో ఆస్పత్రులు కొన్నిసార్లు సేవలకు నిరాకరిస్తున్నాయి. ఊసులేని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు.. హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్లో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించినట్లు గత బడ్జెట్లో ప్రస్తావించారు. బ్యాంకు నుంచి రుణాలు పొంది నిధులను సమకూర్చనున్నట్లు చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయల వరకు రుణాలు పొందే అవకాశం కల్పించారు. ప్రస్తుత బడ్జెట్లో వీటిని ప్రస్తావించకపోవడం గమనార్హం. -
అదే జట్టు.. ఐదో బడ్జెట్టు
సాక్షి, హైదరాబాద్: వరుసగా అయిదోసారి రాష్ట్ర బడ్జెట్ తయారీలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు కీలక భూమిక నిర్వర్తించారు. తొలి రెండేళ్లు ఆర్థిక శాఖ కార్యదర్శి (ఐఎఫ్) హోదాలో బడ్జెట్ రూపకల్పన చేసిన రామకృష్ణారావు రెండేళ్లుగా అదే శాఖలో ముఖ్య కార్యదర్శిగా పదోన్నతి పొందారు. బడ్జెట్ తయారీలో ఆర్థిక శాఖతోపాటు కీలక పాత్ర పోషించే ప్రణాళిక శాఖకు సైతం ఆయనే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈసారి బడ్జెట్ తయారీలో రామకృష్ణారావు రేయింబవళ్లు శ్రమించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశంతో వరుసగా అయిదు బడ్జెట్ల తయారీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించటం విశేషం. సాధారణ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ కావటంతో, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రయత్నించటంతో పాటు ప్రభుత్వ పథకాలు, ప్రాధాన్యతలను సమపాళ్లలో పొందుపరిచేందుకు భారీగా కసరత్తు చేయాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సలహాదారులు జీఆర్ రెడ్డి, ఆర్థిక గణాంక శాఖ డైరెక్టర్ సుదర్శన్‌రెడ్డి బడ్జెట్‌తో పాటు సామాజిక ఆర్థిక సర్వేను తయారు చేయటంలో ప్రధాన భూమిక నిర్వహించారు. బడ్జెట్ తయారీలో ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యధిక సమయం వెచ్చించటంతో పాటు ప్రతి పద్దును స్వయంగా పరిశీలించారు. మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్ని శాఖలతో బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించటంతో పాటు అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ నుంచి ఇదే జట్టు వరుసగా బడ్జెట్ రూపకల్పన కసరత్తును నిర్వహించటం విశేషం. ఉపాధి కల్పన, కార్మికశాఖకు తక్కువే.. కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు కేటాయింపులు భారీగా తగ్గాయి. గతేడాది ఈ శాఖకు రూ. 625.58 కోట్లు కేటాయించగా... ఈసారి రూ. 596.32 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఇందులో నిర్వహణ పద్దు కింద రూ. 332.40 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 263.92 కోట్లు కేటాయించింది. ఈ శాఖ ప్రస్తుతం ఎంప్లాయిమెంట్ కార్డుల పునరుద్ధరణతో పాటు ఐటీఐ ప్రవేశాలు తదితరాల్లో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అదేవిధంగా పలు ఐటీఐలను కార్పొరేట్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుని ఉద్యోగావకాశాల కల్పనను వేగవంతం చేసింది. స్కిల్ డెవలప్మెంట్కు ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో కేటాయింపులు తగ్గడంతో ఆ శాఖ కార్యక్రమాలపై ప్రభావం పడనుంది. మహిళా, శిశు సంక్షేమానికి దక్కని ప్రాధాన్యత మహిళాభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి తాజా బడ్జెట్లో ప్రాధాన్యత అంతంత మాత్రంగానే దక్కింది. గతేడాది రూ. 1,731.50 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ. 1,798.82 కోట్లు ఇచ్చింది. కొత్త పథకాలు లేనప్పటికీ ప్రగతి పద్దు భారీగా పెరిగినా ఈ శాఖకు ప్రాధాన్యత దక్కలేదు. తాజా బడ్జెట్లో నిర్వహణ పద్దు కింద రూ. 859.43 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ. 939.39 కోట్ల చొప్పున ఇచ్చింది. ఈసారి బడ్జెట్లో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థకు రూ. 70.14కోట్లు కేటాయించింది. గతేడాది రూ.6 కోట్లు మాత్రమే ఇవ్వగా ఈసారి భారీగా పెంచడంతో మహిళలకు ఆర్థిక చేయూత కార్యక్రమాలకు ఊతమిచ్చినట్లయింది. పౌష్టికాహార పథకాలకు రూ. 240.95 కోట్లు, సబల కార్యక్రమానికి రూ. 34.68 కోట్లు, ఆరోగ్యలక్ష్మికి రూ. 153.79 కోట్లు కేటాయించింది. -
చీకట్లను చీల్చుకుంటూ..
‘ఎన్నో ప్రతికూల పరిస్థితులు, అస్పష్టతలు, అనుమానాలు, సవాళ్లు... ఇలాంటి తరుణంలో కొత్త రాష్ట్రంగా రూపుదిద్దుకున్న తెలంగాణ అనతికాలంలోనే ఎన్నో విషయాల్లో దేశంలోనే ఆదర్శంగా ఎదిగింది. ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పన, పాలనా సంస్కరణలు.. ఒక్కటేమిటి ఇలా ఎన్నో అంశాల్లో తెలంగాణ చూపిన బాటే అనుసరణీయమని ఇతర రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ విజయాలు తెలంగాణ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆత్మవిశ్వాసాన్ని ప్రజల్లో కలిగిస్తున్నాయి’ ‘ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల్లో మనకు జరిగిన అన్యాయాన్ని, రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దే దిశగా వినూత్న పథకాలు ప్రారంభించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలోకి తెచ్చాం. 45 నెలల స్వల్పకాలంలో ఎన్నో అద్భుతాలు ఆవిష్కరించాం. చీకటి నుంచి వెలుగులోకి, అపనమ్మకం నుంచి ఆత్మవిశ్వాసంలోకి, అణగారిన స్థితి నుంచి అభ్యున్నతిలోకి, వలస బతుకుల నుంచి వ్యవసాయ ప్రగతి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం’ సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఏర్పడకముందు అంతా చీకట్లే. సమైక్య పాలన చివరి రెండేళ్లలో తెలంగాణ ప్రాంత జీఎస్డీపీ వృద్ధి రేటు (4.2 శాతం) దేశ సగటు (5.9 శాతం) కన్నా తక్కువ. జీడీపీ వృద్ధి రేటు రాష్ట్రం ఏర్పడితే కాని పెరగలేదు.. 6.8 శాతం నుంచి ఇప్పుడు 10.4 శాతం దిశగా దూసుకెళ్తోంది’’అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు తయారీ రంగం, విద్యుత్, నీటిపారుదల.. ఇలా అన్నింటా నిస్తేజమే ఉందని చెప్పారు. మనకున్న వనరులు, అవసరాలను సరిగ్గా అంచనా వేసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగటం వల్లే రాష్ట్రం పురోగమిస్తోందని పేర్కొన్నారు. ఆ ప్రగతిని కళ్లారా చూస్తున్న ప్రజల నమ్మకాన్ని మరింత సుస్థిరం చేసే దిశగా కొత్త బడ్జెట్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పద్దులతోపాటు వివిధ రంగాల్లో రాష్ట్ర పురోగతిని వివరించారు. సమైక్య పాలనతో మొదలుపెట్టి ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్టెట్ కావటంతో గడచిన నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనా తీరును వివరిస్తూ ఈటల ప్రసంగ పాఠం మొదలైంది. రాష్ట్రాభివృద్ధిలో వ్యవసాయ రంగానిదే ప్రధాన భూమిక అని, సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడిందని పేర్కొన్నారు. రైతులకు తక్షణ తోడ్పాటు అందించేందుకు 35 లక్షల మందికి సంబంధించి రూ.16,124 కోట్ల రుణాలను ప్రభుత్వమే చెల్లించిందని గుర్తు చేశారు. చెరువులను పునరుద్ధరించటం ద్వారా సాగునీటి సమస్య పరిష్కరిస్తోందన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చి రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింద ని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు రెండు విడతల్లో ప్రతి రైతుకు రూ.8వేలు ప్రభుత్వమే అందిస్తోందన్నారు. ఈ పథకం కోసం బడ్జెట్లో రూ.12 వేల కోట్లను ప్రతిపాదించినట్టు వె ల్లడించారు. ఇలా ప్రభుత్వ వి ధానాలను వివరిస్తూ.. శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపులను చదివి వినిపించారు. పెట్టుబడి సాయం అందించాలంటే భూరికార్డులు సమగ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో 10,823 గ్రామాల్లో భూరికార్డులను పరిశీలించి మార్పులు చేసినట్టు చె ప్పారు. రాత్రింబవళ్లు కష్టపడి వంద రోజుల్లో ఈ తంతు పూర్తి చేశామన్నారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చేందుకు రైతు సమన్వయ సమి తి విధానాన్ని ప్రారంభించామని వివరించారు. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు రైతు బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని, రూ.5 లక్షల చొప్పున బీమా సదుపాయాన్ని కల్పించేందుకు రూ.500 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించామన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.522 కోట్లు, బిందు తుంపర సేద్యం కోసం రూ.127 కోట్లు, పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్‌ల కోసం రూ.120 కోట్లు, మార్కెటింగ్ సదుపాయాల మెరుగు, గోదాముల నిర్మాణం, కోల్డ్ స్టోరేజీల లింకేజీ... తదితరాల కోసం రూ.15780 కోట్లు ప్రతిపాదించామన్నారు. కోటి ఎకరాలకు నీరే లక్ష్యంగా.. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించటం లక్ష్యంగా సాగునీటి ప్రాజెక్టులను చేపట్టామని ఈటల వివరించారు. గోదావరి, కృష్ణా నదులపై 23 మేజర్, 13 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాకాలం పంట నాటికి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ‘‘రికార్డు సమయంలో భక్త రామ దాసు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొద్దినెలల్లోనే వాటర్ పంపింగ్ పాక్షికంగా ప్రారంభిస్తాం. రెండేళ్లలో రిజర్వాయర్లు, కాల్వలతో సహా పూర్తి చేస్తాం. రైతులకు వరప్రదాయిని అయిన మిషన్ కాకతీయను వేగంగా జరుపుతున్నాం. మొత్తంగా సాగునీటి రంగానికి రూ.25వేల కోట్లు ప్రతిపాదిస్తున్నాం’’అని తెలిపారు. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా తీర్చి దిద్దేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 3.20 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని, వాటిని అమ్ముకునేందుకు 31 హోల్‌సేల్ చేపల మార్కెట్లు, 200 రిటైల్ మార్కెట్లు నిర్మిస్తామని తెలిపారు. కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా చెప్పొచ్చన్నారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద వచ్చే సంవత్సర కాలంలో రూ.298 కోట్లు ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదు: ఈటల కొందరు అంటున్నట్టుగా ఇది ఎన్నికల బడ్జెట్ కాదని, రాష్ట్రాభివృద్ధి కోసం దూరదృష్టితో రూపొందించిన బడ్జెట్ అని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో కలిసి శాసనసభ కమిటీహాలులో గురువారం ఆయన మాట్లాడారు. ఉత్పాదక, సేవారంగంతోపాటు అన్ని వృత్తులు, వర్గాలకు తండ్రిలా అండగా ఉండే బడ్జెట్ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత అని, ఆసరా లేని పెద్దలకు పెద్ద దిక్కులాగా ప్రభుత్వం ఉందని చెప్పారు. ఏ రాష్ట్రానికైనా, కుటుంబానికైనా అప్పులు లేకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అప్పులు తెచ్చి ఆస్తులను, ఉత్పాదక వనరులను, సంపదను పెంచుతున్నామని వివరించారు. ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాలకు 26 శాతం నిధులను అదనంగా కేటాయించామన్నారు. డబుల్ ఇళ్లలో వేగం నిరుపేదలు కూడా సౌకర్యవంతమైన ఇళ్లలో జీవించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రెండు పడక గదుల ఇళ్ల పథకం వేగం పుంజుకుందని ఈటల చెప్పారు. ఇప్పటికే 9,522 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, 1,68,981 ఇళ్లు పురోగతిలో ఉన్నాయని, తాజా బడ్జెట్లో ఆ పథకానికి రూ.2,643 కోట్లు ప్రతిపాదించినట్టు వెల్లడించారు. ప్రజలకు ఎంతో అ వసరమైన వైద్య రంగానికి రూ.7,375 కోట్లు కేటాయించామన్నారు. 8,792 ఉపాధ్యాయ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించనున్నామని, వచ్చే విద్యాసంవత్సరంలో ఆ టీచర్లు స్కూళ్లల్లో ఉంటా రని పేర్కొన్నారు. రోడ్లు, వంతెన నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. యాదాద్రి తరహాలో భద్రాచలం, వేములవాడ, ధర్మపురి, బాసర దేవాలయాలను కూడా అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. చెణుకులు లేకుండా సాదాసీదాగా... గతంలో ఎప్పుడూ లేనంత సుదీర్ఘంగా ఈటల బడ్జెట్ ప్రసంగం సాగింది. దాదాపు గంటా ఇరవై నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గ చెణుకులు లేకుండా సాదాసీదాగా ముగిసింది. ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ బడ్జెట్‌కు రూపమిచ్చినట్టు తెలిపారు. వరుసగా ఐదుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, శాసనమండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దాదాపు గం టా పది నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. -
బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ హర్షం
సాక్షి, హైదరాబాద్ : 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంచనా అన్ని రంగాల అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా పూర్తి సమతుల్యతతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై కేసీఆర్ స్పందించారు. రాష్ట్ర ఆదాయ వనరులకు, అవసరాలకు, ప్రభుత్వ లక్ష్యాలకు నడుమ సమన్వయాన్ని బడ్జెట్ కూర్పు సాధించిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం, పంట పెట్టుబడి మద్దతు పథకం, విద్యుత్ సబ్సిడీలకు అధిక నిధులు సమకూర్చడం ద్వారా తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరింత విజయవంతంగా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు పరిచేందుకు వార్షిక ఆర్థిక ప్రణాళికను రూపొందించిన ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ని, ఆ శాఖ ఉన్నతాధికారులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు. -
అంకెల ఆట.. మాటల గారడీ
- వాస్తవ దూరంగా బడ్జెట్: జానారెడ్డి ఫైర్ సాక్షి, హైదరాబాద్: వాస్తవాలకు దూరంగా, ఆశల పల్లకిలో ఊరేగించినట్లుగా రాష్ట్ర బడ్జెట్ ఉందని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి విమర్శిం చారు. అంకెలతో ఆటలాడి, మాటలతో గారడీ చేస్తూ ప్రజలను భ్రమింపజేసేందుకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కష్టపడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బుధవారం అసెంబ్లీలో జానారెడ్డి తన శైలికి భిన్నం గా చలోక్తులు విసురుతూ ప్రసగించారు. తెలంగాణ సిద్ధిస్తే నూతన సంస్కృతి, సంప్రదాయాలు, కొత్త ఒరవడితో సాగుతూ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని ఆశించినా.. అందుకు భిన్నంగా పాలన సాగుతోందన్నారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ పాలనే కారణమన్న సంగతిని విస్మరించవద్దన్నారు. గోదావరి నుంచి 12 నియోజకవర్గాలకు నీరిస్తున్న ప్రధాన పైపులైన్ తీసుకొచ్చింది తామేనన్నారు. ‘‘మేం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానమే గొప్పనుకున్నాం. ఇప్పుడు మీరు మార్చారు కాబట్టి మేం చేసింది తప్పు అనడం సరికాదు. రేపు మీరు పోతే మీరు తెచ్చిన పాలసీ కూడా వేస్టేనా..?’’ అని ప్రశ్నించారు. సమైక్య పాలన లో తెలంగాణ ప్రాంత అభివృద్ధి, అవసరాలపై పోరాడామని చెప్పారు. గుజరాత్ కన్నా మిన్నగా... కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004-2014 వరకు జీఎస్డీపీ .. గుజరాత్ కన్నా తెలంగాణలోనే ఎక్కువ ఉందని జానా తెలిపారు. గుజరాత్లో జీఎస్డీపీ 9.76శాతం ఉంటే.. తెలంగాణలో 10.16శాతం ఉందన్నారు. తలసరి ఆదా యం కూడా కాంగ్రెస్ హయాంలోనే పెరిగింద న్నారు. 2004కు ముందు పేదరికం 24.6 శాతం ఉంటే 2014 నాటికి 20 శాతానికి తగ్గిం దన్నారు. 50:100గా ఉన్న అప్పులు, ఆస్తుల నిష్పత్తి కూడా కాంగ్రెస్ హయాంలోనే 100:101కి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1956-57లో 14.54లక్షల టన్నులు ఉంటే విడిపోయే నాటికి తెలంగాణలో 106 లక్షల టన్నులకు చేరిందన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ, సేవ తదితర రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి వల్లే ఇదంతా సాధ్యమైందని తెలిపారు. దేశంలో స్వాతంత్రం వచ్చేనాటికి 2,500మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉంటే 2014 నాటికి 3,85,000 మెగావాట్లకు పెంచిన ఘనత కాంగ్రెస్‌ది కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ వచ్చాయని, తద్వారా అభివృద్ధి జరిగిందని చెప్పారు. పేరుకే 51 శాతం ప్రణాళికా వ్యయం.. బడ్జెట్లో రూ. 1.30 లక్షల కోట్ల అంకెలు చూపి ప్రజలను మరోసారి మోసం చేశారని జానారెడ్డి విమర్శించారు. గత 2015-16 బడ్జెట్లో రూ.1.15 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి సవరించిన బడ్జెట్లో రూ.15 వేల కోట్లను తొలగించిన ప్రభుత్వం 2016-17 బడ్జెట్లో 30 శాతం ఎందుకు పెంచిందని ప్రశ్నించారు. 51 శాతం ప్రణాళిక వ్యయం పెట్టినట్లు చెబుతున్నా.. అందులో 31 శాతమే ఖర్చవుతుందన్నారు. ‘‘సమైక్య పాలనలో ప్రణాళిక వ్యయంలో రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని తీసేసినట్లు మాట్లాడారు. దీనిపై ఎవరు లెక్కలు తీశారు? రూ.1.30 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.97 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా రాబడి, ఖర్చులు చూపిస్తే నేను మళ్లీ ఇక్కడికి(అసెంబ్లీకి) రాను’’ అంటూ సవాల్ విసిరారు. ప్రణాళిక బడ్జెట్లో రూ.34 వేల కోట్ల నుంచి రూ.37 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని పేర్కొన్నారు. ఇందులో రూ. 25 వేల కోట్లు నీటిపారుదల రంగానికి వెళితే మిగతా రూ.10 వేల కోట్లు దేనికి వెచ్చిస్తారని ప్రశ్నించారు. రాబడి లేని వాటికి కేటాయింపులు చేసిన ఆర్థిక మంత్రి... కేటాయింపులు చేసిన వాటికి మంజూరు ఇవ్వడం లేదన్నారు. ఈ ఖర్చుల్ని బడ్జెట్లో ఎందుకు చూపలేదు? 2015-16 బడ్జెట్లో ఇప్పటి వరకు 60 శాతమే ఖర్చు చేశారని, మైనారిటీ సంక్షేమానికి రూ. 1,100 కోట్లు కేటాయించి రూ.300 కోట్లే ఖర్చు పెట్టారని జానారెడ్డి పేర్కొన్నారు. మార్చి 31లోగా ఖర్చు చేయాల్సినవి చాలా ఉన్నాయని, ఫిట్మెంట్ బకాయిలు రూ. 6 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.3,500 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అవసరాలకు త గ్గట్టు కరెంటు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, అందుకు మరో రూ.4 వేల కోట్ల వరకు వెచ్చించాలన్నారు. అయితే ఇవేవీ బడ్జెట్లో చూపించలేదన్నారు. కాగా ప్రతిపక్ష నేత ప్రసంగం సాగుతుండగానే.. రాష్ట్రపతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉందని, జానారెడ్డికి గురువారం సమయం ఇవ్వాలని సీఎం స్పీకర్‌కు సూచించారు. దీంతో జానారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు. -
సీఎం చేతిలో రూ.5,500 కోట్లు!?
- వచ్చే బడ్జెట్లో భారీగా స్పెషల్ డెవెలప్మెంట్ ఫండ్ - కలెక్టర్లకు, మంత్రులకు సైతం ప్రత్యేక నిధి - ఇప్పటికే అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది తెలంగాణ బడ్జెట్లో రూ.5500 కోట్లు ప్రత్యేక అభివృద్ధి నిధికి(ఎస్డీఎఫ్) కేటాయించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి తన విచక్షణాధికారం మేరకు వీటిని ఖర్చు చేసే వీలుంటుంది. ఇంత భారీ మొత్తంలో ఎస్డీఎఫ్కు నిధులు కేటాయించనుండటం మొదటిసారి కావటం ప్రాధాన్యంగా కనిపిస్తోంది. ఇదే నిధి నుంచి జిల్లా కలెక్టర్లకు రూ.10 కోట్లు, మంత్రులకు రూ.25 కోట్ల చొప్పున విడుదల చేస్తారు. వీటిని ప్రత్యేక అవసరాలు, అభివృద్ధి పనులు, కార్యక్రమాలు, ఆపన్నులకు చేయాతను అందించేందుకు వినియోగిస్తారు. గత ఏడాది అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక నిధి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దళితులకు వ్యవసాయానికి అవసరమయ్యే పెట్టుబడి విడుదల చేయటంతో పాటు, వివిధ సందర్భాల్లో ఎస్సీ ఎస్టీ బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రతి కలెక్టర్ వద్ద రూ.కోటి నిధి అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. వెంటనే ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున విడుదల చేశారు. ఈసారి బడ్జెట్లోనూ ఈ పంథాను కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. కలెక్టర్లతో పాటు మంత్రులకు సైతం ప్రత్యేక నిధి కేటాయించే ప్రతిపాదనలున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లినప్పుడు తమకు వచ్చే విజ్ఞప్తులు, చిన్న చిన్న పనులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు వీలుగా ఈ నిధి ఉపయోగిపడుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ పద్దును భారీ మొత్తంలో కేటాయించాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్లు, మంత్రులకు కేటాయించేందుకు రూ.500 కోట్లు వెచ్చించటంతో పాటు మిగతా రూ.5000 కోట్లను ముఖ్యమంత్రి తన వద్ద ఉంచుకొని, వివిధ నియోజకవర్గాల్లో తను ఇచ్చిన హామీలు, విచక్షణ మేరకు తీసుకునే నిర్ణయాలతో చేపట్టే పనులకు ఖర్చు చేస్తారు. ఇప్పటికే వివిధ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, అదనపు ఇళ్ల మంజూరు తదితర అంశాలకు సీఎం ప్రత్యేక నిధి నుంచి నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. -
సాగునీటికి 20వేల కోట్లు
- ప్రస్తుత బడ్జెట్లో ప్రాజెక్టులకు అంచనాలు సిద్ధం - నేడు సమీక్షించనున్న ఆర్థిక శాఖ - 2014-15లో నిధుల ఖర్చు అంతంత మాత్రమే - రూ.815.78 కోట్ల పనుల పెండింగ్.. నెలన్నరేగడువు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్లో సాగునీటి రంగానికి నిధుల వరద పారించినా, ఖర్చులో మాత్రం నీరసపడింది. క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యల కారణంగా భారీ, మధ్య తరహా ప్రాజెక్టు పనులు ముందుకు కదలక పోగా, భారీ ఆశలతో ప్రారంభించిన చెరువుల పునరుద్ధరణ పనులు పరిపాలనా అనుమతులు, టెండర్ అగ్రిమెంట్ల వద్దే ఉన్నాయి. ప్రణాళికా వ్యయం కింద కేటాయిం చిన రూ.6,500 కోట్లలో సగమే ఖర్చుకు నోచుకుంది. మిగతా నిధుల ఖర్చు ఈ నెలన్నర వ్యవధిలో చే యడం గగనమే. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చు చేయ ని నీటిపారుదల శాఖ వచ్చే ఏడాదికి బడ్జెట్లో రూ.20 వేల కోట్లు ప్రతిపాదించబోతోంది. రూ.815.78 కోట్ల పనులు పెండింగ్: 2014-15 వార్షిక బడ్జెట్లో సాగునీటి పారుదల రంగానికి రూ.9,356 కోట్లు కేటాయించారు. ఇందులో నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్న గణాం కాల మేరకు 33 భారీ మధ్యతరహా ప్రాజెక్టుల కింద రూ.2935.67కోట్ల పనులు జరగ్గా, మరో రూ.815.78 కోట్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. భూసేకరణ, నిర్వాసితులకు భూ పరిహారం, ఎస్కలేషన్ చెల్లింపులపై తేల్చడంలో జరిగిన జాప్యం కారణంగా ప్రాజెక్టుల పనులు మందకొడిగా సాగాయి. ఇంకా మొదలుకాని చెరువుల పనులు: చెరువుల పునరుద్ధరణకు బడ్జెట్లో సుమారు రూ.2016 కోట్ల కేటాయింపులు జరగ్గా ఇప్పటివరకు రూ.వెయ్యి కోట్లకు మాత్రమే పరిపాలనా అనుమతులు లభించాయి. మిగతావి ఆర్ధిక శాఖ వద్ద వేచిచూస్తున్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న చెరువుల్లో 300 వరకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లను పూర్తి చేసుకున్నా పనులు మాత్రం ఎక్కడా ప్రారంభం కాకపోవడంతో రూపాయీ ఖర్చు కానట్టే లెక్క. ఈ ఏడాది బడ్జెట్ అంచనా రూ.20 వేల కోట్లు: కాగా 2015-16 ఆర్థిక ఏడాదిలో నీటి పారుదల రంగానికి సుమారు రూ.20వేల కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. ఇందులో ప్రాణహిత చేవెళ్లకు సుమారు రూ.4వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు, మిగతా భారీ ప్రాజెక్టులకు రూ.10వేల కోట్ల అంచనాలను ప్రతిపాదించినట్లు తెలిసింది. బడ్జెట్ అంచనాలపై గురువారం మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ప్రతిపాదనల వివరాలను శుక్రవారం మంత్రి ఈటెల రాజేందర్‌తో జరిగే సమావేశంలో సమర్పించనున్నారు.