పీటీఎస్: చిత్తూరు జిల్లాలో పట్టపగలే దొంగతనం జరిగింది. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండల కేంద్రంలోని పత్తంవంద్లపల్లె గ్రామంలో నాగరాజు ఇంట్లో గురువారం మధ్యాహ్నం చోరీ జరిగింది. రూ.లక్ష నగదు, 40 గ్రాముల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగులు కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.