భద్రం బిడ్డో.. మాయదారి ఎండ కాటేస్తోంది!
ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మధ్యాహ్ననికి ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో వేసవి బడులకు హాజరైన విద్యార్థులు ఇళ్లకు చేరడం ప్రాణాంతకమవుతోంది. మండుటెండలో చిన్నారులు వడదెబ్బ బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ పిల్లలకు కొందరు స్వయంగా గొడుగులు పట్టి వెంట నడుస్తుండగా, మరికొందరు పిల్లల చేతికి గొడుగులు అప్పగించి తాము మండుటెండలో ఉసూరుమంటూ ఇళ్లకు చేరుతున్నారు.
ఎండ వేడి తాళలేక వెంట తీసుకెళ్లిన వాటర్ బాటిల్‌లోని నీటిని తలపై పోసుకుని చిన్నారులు సేదతీరుతున్నారు. ఎండల ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో సెలవులు ఎప్పుడు వస్తాయా అంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.
- సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం