పగలే చోరీ | day time robbery | Sakshi
Sakshi News home page

పగలే చోరీ

Published Tue, Oct 25 2016 2:07 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

day time robbery

జంగారెడ్డిగూడెం : పట్టణంలోని ఓ ఇంట్లో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. స్థానిక లక్ష్మీనారాయణ థియేటర్‌ వెనుక ఉన్న లచ్చిరెడ్డి చెలకలో నివసిస్తున్న కొనకళ్ల హనుమంతు కుటుంబ సభ్యులు సోమవారం ఓ శుభకార్యానికి వెళ్లారు. వారు తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చే సరికి ఇంటి తలుపు తాళం పగులగొట్టి ఉంది. ఇంటి వెనుక వైపు ఉన్న తలుపు తాళం కూడా తెరిచి ఉంది. దీంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బీరువా తాళాలు తెరిచి ఉన్నాయి. అందులో ఉన్న రూ.56వేల నగదు, 4.50 కాసుల విలువైన చంద్రహారం, చెవిదుద్దులు కనిపించలేదు. బీరువా తాళాలు డ్రెస్సింగ్‌ టేబుల్‌ వద్ద ఉంచడంతో ఆ తాళాలతోనే దొంగలు బీరువా తెరిచినట్టు గుర్తించారు. బీరువాలోని వస్తువులు, దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి.  బీరువాలో ఉంచిన బంగారు వస్తువులు మాత్రమే దొంగిలించుకెళ్లిన దొంగలు రోల్డ్‌గోల్డ్‌ వస్తువులను మాత్రం అక్కడే వదిలి వెళ్లిపోయారు. తాళాలు పగులగొట్టి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు వెనుక తలుపుతీసి దాని నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారు. ఎస్సై ఎం.కేశవరావు, ఐడీ పార్టీ సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement