ఏలూరులో కిరాతకం
ఏలూరులో కిరాతకం
Published Mon, Nov 28 2016 1:58 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
ఏలూరు అర్బ¯ŒS : ఏలూరు నగరంలో హత్యా సంస్కృతి పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ మూడు హత్యలు జరిగాయి. న్యాయవాది రాయల్, రౌడీషీటర్ పెద్ద కృష్ణ హత్యోదంతాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మరో వ్యక్తిని దుండగులు వేట కత్తులతో వెంటాడి నరికి చంపారు. దీంతో స్థానికులు భీతిల్లారు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఈ దుర్ఘటన జరగడం కలకలంరేపింది.
స్థానిక ఐదో డివిజ¯ŒS లంబాడిపేట ఏసుపాదపురం కాలనీకి చెందిన పొట్నూరి లక్ష్మణరావు (34) వృతిరీత్యా వడ్రంగి. ఆదివారం మధ్యాహ్నం ఆయన సైకిల్‌పై స్థానిక పవర్‌పేట బడేటివారి వీధిలోని టింబర్ డిపోకు వెళ్తుండగా, అక్కడ సెంటర్‌లో చేతుల్లో కత్తులతో కాపుకాసిన ముగ్గురు దుండగులు లక్ష్మణరావు కళ్లల్లో ఒక్కసారిగా కారం చల్లారు. దీంతో కిందపడిపోయిన లక్ష్మణరావు దుండగులు తనను చంపడానికే వచ్చారని పసిగట్టి ప్రాణభయంతో పాత బస్టాండ్ సెంటర్‌లోని ఆం««ధ్రా బ్యాంకు రోడ్డులోకి పరుగుతీశాడు. వేట కత్తులతో ఆయనను తరుముకుంటూ వెళ్లిన ఇద్దరు దుండగులు ఆ దారిన పోయేవారు చూస్తుండగానే విచక్షణా రహితంగా నరికారు. తాము వచ్చిన స్కూటీపైనే పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మణరావు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న టూ టౌ¯ŒS సీఐ ఉడతా బంగార్రాజు ఎస్‌ఐ ఎస్.ఎస్.ఆర్.గంగాధర్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలానికి సమీపంలో ఓ దుకాణం ముందు భాగంలో సీసీ కెమెరా ఉండడంతో దానిలో హత్య దృశ్యాలు రికార్డయి ఉంటాయని భావించి ఆ సీసీ కెమేరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆ దృశ్యాలను సేకరించారు. స్థానికుల సమాచారం మేరకు మృతుని బంధువులను రప్పించి వారితో మాట్లాడి హత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు హత్యకు వివాహేతర సంబంధం కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.
హంతకులెవరు ?
లక్ష్మణరావు హత్యకు కారణాలేమై ఉంటాయి? సాధారణ వ్యక్తిని అత్యంత కిరాతకంగా వేట కత్తులతో వెంటాడి చంపారంటే ఇది కిరాయి హంతకుల పనా? లేక పాత కక్షలతో చంపి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొంతమేర పురోగతి సాధించారు. హతునితో సన్నిహితంగా మెలిగే స్థానిక గజ్జలవారి సెంటర్‌లో శివ బార్ వద్ద పా¯ŒSషాపు నిర్వహించే శ్రీను అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని మృతుని చెల్లెలు ధర్మవరపు మేరి సీఐ బంగార్రాజుకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శ్రీను తన అన్నతో తరచూ గొడవలు పడేవాడని ఇటీవల జరిగిన గొడవలో శ్రీను ఇంటికి వచ్చి తన అన్నను చంపుతానని బెదిరించాడని పేర్కొన్నారు.
హంతకులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తాం :ఎస్పీ భాస్కర్‌భూషణ్
హంతకులను 24 నాలుగు గంటల్లోగా అరెస్ట్ చేస్తామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పష్టం చేశారు. నగరంలో హత్య జరిగిన విషయంపై సమాచారం అందుకున్న ఎస్పీ ఏలూరు ఆసుపత్రికి వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ హంతకులను సాధ్యమైనంత త్వరలో అరెస్ట్ చేసి వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Advertisement
Advertisement