CHAGING
-
పెళ్లి కోసం నడి రోడ్డులో వధూవరుల ఛేజింగ్.. వీడియో వైరల్
పాట్నా: కొన్ని పెళ్లిళ్లు సినిమా కథకు ఏమాత్రం తీసిపోవు. డ్రామా, సస్పెన్స్, విషాదం వంటి అన్ని అంశాలు అందులో కనిపిస్తాయి. అలాంటి వివాహమే ఒకటి బిహార్‌లోని నవాడా ప్రాంతంలో జరిగింది. భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో పెళ్లి వద్దు బాబోయ్ అంటూ పరారైన ఓ వరుడిని వధువు వెంబడించి పట్టుకుంది. వరుడి వెంట వధువులు పరుగులు పెడుతున్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే? ఇరువురికి మూడు నెలల క్రితం వివాహం నిశ్చయించారు. వరుడి కుటుంబానికి రూ.50వేల కట్నం, ఓ బైక్ ఇచ్చారు. అయితే, వివాహ ముహూర్తం నిర్ణయించటంలో వరుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో యువకుడి ఇంటికి వెళ్లగా అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో శివంగిలా మారిన వధువు.. అతడిని వెంబడించింది. తగ్గేదేలే అంటూ ఛేజింగ్ చేసి మరీ పట్టుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయినా.. ఒప్పుకోకపోవటంతో పోలీస్ స్టేషన్‌కు చేరింది వ్యవహారం. ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరకు వధువును పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు యువకుడు. దీంతో ఆ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ఓ గుడిలో ఇద్దరికి వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. एक शादी ऐसा भी जब शादी करने से भाग रहा था लड़का, तब लड़की ने उसे खुद पकड़कर रचाई शादी मामला #बिहार के #नवादा का है। लड़की ने कहा कि पैसा और बाइक लेकर शादी करने से भाग रहा था लड़का#ExclusivePost#xclusivepost pic.twitter.com/LSpch8Sp5a — Exclusive Post (@xclusivepost) August 28, 2022 ఇదీ చదవండి: రైల్వే ట్రాక్ దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్.. తునాతునకలైన బైక్! -
సినీ ఫక్కీలో కార్లు, బైక్‌లతో ఛేజింగ్.. తుపాకులతో బెదిరించి రూ.కోట్లు లూటీ
ముంబై: డబ్బులు తీసుకెళ్తున్న వాహనాన్ని ఛేజింగ్ చేసి దొంగలు లూటీ చేసే దృశ్యాలు చాలా సినిమాల్లో చూశాం. అయితే, నిజ జీవితంలోనూ అలాంటి సంఘటనే జరిగింది. సినిమాను తలదన్నేలా ఛేజింగ్‌లు, కాల్పులు ఇందులో హైలైట్. నగదుతో కారులో వెళ్తున్న ఇద్దరు బాధితులను చితకబాది రూ.3.6కోట్లు కొట్టేశారు కొందరు దుండగులు. సినిమా స్టైల్ జరిగిన ఈ దోపిడి మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. రూ.3కోట్ల 60 లక్షల నగదుతో భవేశ్ కుమార్ పటేల్, విజయ్ భాయ్ అనే ఇద్దరు వ్యక్తులు పుణె-సోలాపూర్ హైవేపై వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఓ ముఠా ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని వారి వెంటపడింది. స్పీడ్ బ్రేకర్ వద్ద వారి కారును నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో వచ్చి ఆపేందుకు ప్రయత్నించగా స్పీడ్ పెంచారు. దీంతో రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలపై డబ్బుతో వెళ్తున్న వారి కారును కొన్ని కిలోమీటర్ల పాటు ఛేజ్ చేశారు దుండగులు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన వారు కారుపై కాల్పులు చేపట్టారు. ఆ తర్వాత కారును ఇందాపుర్ సమీపంలో ఆపి బాధితులను చితకబాదారు. నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే, భవేశ్ కుమార్ పటేల్, విజయ్‌భాయ్ అంత డబ్బును కారులో ఎందుకు తరలిస్తున్నారనే విషయం తెలియలేదని, అది హవాలా రాకెట్‌కు సంబంధించినదై ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. పెళ్లి.. కిడ్నాప్.. ఛేజింగ్.. -
మగువ ఆశ చూపి.. హత్య
కల్వకుర్తి టౌన్: మగువపై మోజు ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకునేలా చేసింది. గతేడాది నవంబర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం సుద్దకల్ బ్రిడ్జి కింద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను సీఐ సురేందర్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివసించే పత్తి రామదాసు(76) కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన భార్య గతేడాది జనవరిలో కన్నుమూసింది. అయితే, రామదాసుకు ఆడవారిపై మోజు ఉండగా వృద్ధాప్యంలో ఆలనాపాలనా, ఇంటి పనులు చూసుకునేందుకు ఓ మహిళను ఎంచుకోవాలని ఆలోచించాడు. తన ఇంట్లో వడ్రంగి పనులు చేసిన కపిలవాయి శ్రీరాములుతో మనసులో మాట చెప్పాడు. దుర్బుద్ధితో ఆలోచించిన శ్రీరాములు వద్ద నుంచి డబ్బు కొట్టేయాలని పథకం పన్నాడు. కల్వకుర్తిలో ఓ మహిళ ఉందని చెప్పాడు. అబిడ్స్‌లో ఉన్న జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రామదాసుతో రూ.2 లక్షలు డ్రా చేయించాడు. అనంతరం ఎంజీబీఎస్‌లో బస్సు ఎక్కి కల్వకుర్తికి చేరుకున్నారు. ఆటోలో నాగర్‌కర్నూల్ రోడ్డులో ఉన్న సుద్దకల్ గ్రామంలోని బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి మద్యం తాగించాడు. కొద్దిసేపటి తర్వాత వెనుక నుంచి వచ్చి రామదాసు తల, ముఖంపై గట్టిగా కొట్టడంతో చనిపోయాడు. రూ.2 లక్షలు తీసుకున్న శ్రీరాములు హైదరాబాద్ వెళ్లిపోయాడు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రామదాసు సెల్‌ఫోన్ కాల్ డేటా కోసం ఆరా తీయగా శ్రీరాములు పేరు తెరపైకి వచ్చింది. కానీ అప్పటికే శ్రీరాములు సెల్‌ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉంది. తాజాగా శ్రీరాములు తన కూతురు వివాహ పత్రికలు పంచడానికి కల్వకుర్తికి రావటం.. సెల్‌ఫోన్ ఆన్ చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. రామదాసును హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. -
ఏలూరులో కిరాతకం
ఏలూరు అర్బ¯ŒS : ఏలూరు నగరంలో హత్యా సంస్కృతి పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ మూడు హత్యలు జరిగాయి. న్యాయవాది రాయల్, రౌడీషీటర్ పెద్ద కృష్ణ హత్యోదంతాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మరో వ్యక్తిని దుండగులు వేట కత్తులతో వెంటాడి నరికి చంపారు. దీంతో స్థానికులు భీతిల్లారు. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఈ దుర్ఘటన జరగడం కలకలంరేపింది. స్థానిక ఐదో డివిజ¯ŒS లంబాడిపేట ఏసుపాదపురం కాలనీకి చెందిన పొట్నూరి లక్ష్మణరావు (34) వృతిరీత్యా వడ్రంగి. ఆదివారం మధ్యాహ్నం ఆయన సైకిల్‌పై స్థానిక పవర్‌పేట బడేటివారి వీధిలోని టింబర్ డిపోకు వెళ్తుండగా, అక్కడ సెంటర్లో చేతుల్లో కత్తులతో కాపుకాసిన ముగ్గురు దుండగులు లక్ష్మణరావు కళ్లల్లో ఒక్కసారిగా కారం చల్లారు. దీంతో కిందపడిపోయిన లక్ష్మణరావు దుండగులు తనను చంపడానికే వచ్చారని పసిగట్టి ప్రాణభయంతో పాత బస్టాండ్ సెంటర్లోని ఆం««ధ్రా బ్యాంకు రోడ్డులోకి పరుగుతీశాడు. వేట కత్తులతో ఆయనను తరుముకుంటూ వెళ్లిన ఇద్దరు దుండగులు ఆ దారిన పోయేవారు చూస్తుండగానే విచక్షణా రహితంగా నరికారు. తాము వచ్చిన స్కూటీపైనే పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మణరావు రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మరణించాడు. దీనిపై సమాచారం అందుకున్న టూ టౌ¯ŒS సీఐ ఉడతా బంగార్రాజు ఎస్ఐ ఎస్.ఎస్.ఆర్.గంగాధర్, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలానికి సమీపంలో ఓ దుకాణం ముందు భాగంలో సీసీ కెమెరా ఉండడంతో దానిలో హత్య దృశ్యాలు రికార్డయి ఉంటాయని భావించి ఆ సీసీ కెమేరా ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆ దృశ్యాలను సేకరించారు. స్థానికుల సమాచారం మేరకు మృతుని బంధువులను రప్పించి వారితో మాట్లాడి హత్యకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు హత్యకు వివాహేతర సంబంధం కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. హంతకులెవరు ? లక్ష్మణరావు హత్యకు కారణాలేమై ఉంటాయి? సాధారణ వ్యక్తిని అత్యంత కిరాతకంగా వేట కత్తులతో వెంటాడి చంపారంటే ఇది కిరాయి హంతకుల పనా? లేక పాత కక్షలతో చంపి ఉంటారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కొంతమేర పురోగతి సాధించారు. హతునితో సన్నిహితంగా మెలిగే స్థానిక గజ్జలవారి సెంటర్లో శివ బార్ వద్ద పా¯ŒSషాపు నిర్వహించే శ్రీను అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని మృతుని చెల్లెలు ధర్మవరపు మేరి సీఐ బంగార్రాజుకు ఫిర్యాదు చేశారు. నిందితుడు శ్రీను తన అన్నతో తరచూ గొడవలు పడేవాడని ఇటీవల జరిగిన గొడవలో శ్రీను ఇంటికి వచ్చి తన అన్నను చంపుతానని బెదిరించాడని పేర్కొన్నారు. హంతకులను 24 గంటల్లో అరెస్ట్ చేస్తాం :ఎస్పీ భాస్కర్‌భూషణ్ హంతకులను 24 నాలుగు గంటల్లోగా అరెస్ట్ చేస్తామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ స్పష్టం చేశారు. నగరంలో హత్య జరిగిన విషయంపై సమాచారం అందుకున్న ఎస్పీ ఏలూరు ఆసుపత్రికి వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ హంతకులను సాధ్యమైనంత త్వరలో అరెస్ట్ చేసి వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.