వెంకటరమణ అరెస్టును చూపుతున్న సీఐ రాజశేఖర్, నల్లజర్ల ఎస్సై చంద్రశేఖర్
పెంటపాడు : తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దొంగతనాలకు పాల్పడే నేరగాడిని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ ఎన్.రాజశేఖర్ అరెస్ట్ చేశారు. పెంటపాడు పోలీస్‌స్టేషన్ వద్ద బుధవారం సీఐ రాజశేఖర్ ఆ వివరాలను విలేకరులకు వెల్లడించారు.
జంగారెడ్డిగూడేనికి చెందిన కంబాపు వెంకటరమణ 2009 నుంచి పలు ప్రదేశాల్లో నేరాలు చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇతడిపై ద్వారకాతిరుమల, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం తదితర స్టేషన్లలో కేసులు ఉన్నాయి.
గతేడాది నల్లజర్లలో విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న ఇంట్లో పట్టపగలే తాళాలు పగులకొట్టి బీరువాలోని బంగారు, వెండి వస్తువులను అపహరించాడు. 2014లో ద్వారకాతిరుమలలో దొరసానిపాడులో కూడా అదే తరహాలో చోరీ చేశాడు.
ఈ రెండు కేసులకు సంబంధించి దర్యాప్తు చేసిన పోలీసులు వెంకటరమణను నిందితుడిగా గుర్తించారు. అతడి వేలిముద్రల ఆధారంగా బుధవారం నల్లజర్ల ఎస్సై వి.చంద్రశేఖర్ సహకారంతో అరెస్ట్ చేశారు. అతడి నుంచి బంగారు గొలుసు, చెవి దుద్దులు, చెవి లోలాకులు, బంగారు చైను, బ్రాస్‌లెట్‌లు సుమారు 6 కాసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో సహకరించిన సిబ్బంది శంకర్, మురళీలను సీఐ అభినందించారు. సీఐ మాట్లాడుతూ వేసవి సెలవుల దృష్ట్యా తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలో ప్రజలు ఇంటికి తాళాలు వేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు ముందస్తుగా సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment