కాలనీవాసులకు చిక్కిన చోరుడు
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం దుండుగులు హల్‌చల్ చేశారు. ఇంటికి వేసిన తాళాలను పగులగొట్టి ఇంట్లోకి చొరబడిన వారు భారీ ఎత్తున సొత్తు ఎత్తుకెళ్లారు. పారిపోతున్న దుండగులను కాలనీవాసు లు వెంబడించారు.
కిలోమీటర్ దాటి మరో కాలనీ మీదుగా పారిపోతున్న దుండగులను అక్కడి ప్రజలు వెంబడించి ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జిల్లా పోలీసు కా ర్యాలయానికి కూతవేటు దూరంలో దుండగులు అలజడి సృష్టించ డం పట్టణంలో కలకలం రేపింది.
పట్టణంలోని అడ్లూర్ రోడ్డులో ఉన్న భవానీనగర్ కాలనీకి చెం దిన వ్యాపారి కుంబా ల నర్సింలు, ఆయన భా ర్య విజయ ఇంటికి తాళం వేసి వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటి వెనుక భాగం నుంచి చొరబడిన దుండగులు ఇంట్లోని కప్ బో ర్డులు, లాకర్లను పగులగొట్టి ఇంట్లో దాచిన రూ.6.30 లక్షల నగదు, 34 తులాల బంగారు నగలను అపహరించుకుపోయారు.
అదే సమయంలో ఎదురింటికి చెందిన మహిళలు గమ నించి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశా రు. అక్కడికి ఇద్దరు యువకులు చేరుకుని పట్టుకునే ప్రయత్నం చేయగా దుండగులు పారిపోయారు. వారిని కొంతదూరం వరకు వెంబడించారు.
రైలు పట్టాలు దాటిన దుండగులు స్నేహపురికాలనీ వైపు పారిపోగా, ఆ కాలనీ వాసులు అప్రమత్తమై వారిని వెంబడించగా ఒకరు చిక్కారు. మరొకరు పారిపోయారు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
పోలీసుల అదుపులో దుండగుడు..
చోరీకి పాల్పడి పారిపోతున్న ఓ దుండగుడిని స్నేహపురి కాలనీవాసులు పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకు ని విచారిస్తున్నారు. వీరు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment