మజ్జిగ... మన ప్రోబయాటిక్ మందు!
గుడ్‌ఫుడ్
మన జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. అవి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ మనకు మేలు చేస్తుంటాయి. అందుకే వాటిని ‘ప్రో–బయోటిక్’ అని వ్యవహరిస్తుంటారు. మన సంప్రదాయంలో మనకు తెలియకుండానే ప్రో–బయాటిక్స్‌ను తీసుకునే ఆహార అలవాట్లు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఉదాహరణకు ఇడ్లీ, దోసె పిండిని రాత్రి కలుపుకుంటాం.
ఆ మర్నాడు చేసుకుంటాం. వేసవిలో చాలా మంది మజ్జిగ విరివిగా వాడతారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనూ భోజనం తర్వాత పెరుగు/మజ్జిగ వాడే అలవాటు ఎప్పటి నుంచో ఉన్న విషయం మనకు తెలిసిందే. మజ్జిగను తాగినప్పుడు మనకు మేలు చేసే అనేకానేక సూక్ష్మజీవులను మన కడుపులోకి తీసుకుంటామన్నమాట. అలా మనకు ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని కడుపులోకి చేర్చుకుంటాం.