Digestive tract
-
అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?
నా వయసు 40 ఏళ్లు. ఇటీవల కొంతకాలంగా నాకు కడుపులో విపరీతమైన మంట, నొప్పి వస్తున్నాయి. తిన్నది జీర్ణం కావడంలేదు. కడుపు ఉబ్బరంతోనూ బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయం అవుతుందా? జీర్ణకోశంలో ఉండే మ్యూకస్ పొరకు వచ్చే ఇన్ఫ్లమేషన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. కారణాలు: అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ►తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ►పెయిన్ కిల్లర్స్ వాడటం ►క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ►శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ►ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: ►కడుపునొప్పి, మంట ►కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ►అజీర్ణం, వికారం, రక్తపు వాంతులు ►ఆకలి తగ్గిపోవడం ►కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు : ►సమయానికి ఆహారం తీసుకోవాలి ►పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ►ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
కాబోయే మాతృమూర్తులూ... బరువు పెరగకండి!
పరిపరిశోధన తల్లి కావాలనుకునే మహిళలు తమ బరువు పెరగకుండా చూసుకోవడం మేలని సూచిస్తున్నారు స్వీడన్‌కు చెందిన పరిశోధకులు. మాతృమూర్తులు కావాలనుకునే వారు తాము ఉండాల్సినంత బరువే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.ఎందుకంటే.. ఉండాల్సిన దానికంటే ఎక్కువగా బరువు ఉండే మహిళలకు పుట్టే పిల్లల్లో 3.5 శాతం మందికి కొన్ని రకాలైన పుట్టుకతో వచ్చే సమస్యలు రావచ్చని వారు హెచ్చరిస్తున్నారు. బీఎమ్ఐ ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉండే మహిళలకు పుట్టే పిల్లల్లో పుట్టుకతోనే గుండెజబ్బులతో పాటు కాళ్లు చేతుల్లో అవకరాలు, జీర్ణవ్యవస్థ పూర్తిగా రూపొందకపోవడంతోపాటు కొన్ని రకాల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు. దాదాపు 12 లక్షల మంది మహిళలను అధ్యయనం చేసిన స్వీడన్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయన ఫలితాలు బీఎంజే అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మజ్జిగ... మన ప్రోబయాటిక్ మందు!
గుడ్‌ఫుడ్ మన జీర్ణవ్యవస్థలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. అవి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తూ మనకు మేలు చేస్తుంటాయి. అందుకే వాటిని ‘ప్రో–బయోటిక్’ అని వ్యవహరిస్తుంటారు. మన సంప్రదాయంలో మనకు తెలియకుండానే ప్రో–బయాటిక్స్‌ను తీసుకునే ఆహార అలవాట్లు ఎప్పట్నుంచో ఉన్నాయి. ఉదాహరణకు ఇడ్లీ, దోసె పిండిని రాత్రి కలుపుకుంటాం. ఆ మర్నాడు చేసుకుంటాం. వేసవిలో చాలా మంది మజ్జిగ విరివిగా వాడతారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోనూ భోజనం తర్వాత పెరుగు/మజ్జిగ వాడే అలవాటు ఎప్పటి నుంచో ఉన్న విషయం మనకు తెలిసిందే. మజ్జిగను తాగినప్పుడు మనకు మేలు చేసే అనేకానేక సూక్ష్మజీవులను మన కడుపులోకి తీసుకుంటామన్నమాట. అలా మనకు ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని కడుపులోకి చేర్చుకుంటాం. -
ఫ్యాట్ టు ఫిట్
యోగా అధోముఖ సావాసన వేరియంట్–1 ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ధనురాసనానికి, శలభాసనానికి రెసిపిరేటరీగా చేసే ఆసనాల క్రమంలో చేయడం జరుగుతుంది. చేసే విధానం: కుర్చీ సీటు ఆర్మ్స్ మధ్యలో నుంచి కుడి కాలును, ఎడమ కాలుని పోనించి కుర్చీ చివరి భాగానికి సీటును తీసుకువెళ్ళి సౌకర్యవంతంగా ముందుకు వంగాలి. రెండు అరిచేతులను నేల మీద ఉంచి ఆ సపోర్ట్‌తో సీటుని ఇంకా లోపలికు నెట్టి, పొట్ట భాగం కుర్చీ అంచుకి ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకోవాలి. చేతులు రెండూ శరీరం పక్కన ఉంచి 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ అరిచేతులు నేల మీద ఉంచాలి. వేరియంట్ –2 శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ పక్కలకు 180 డిగ్రీల కోణంలో ఉంచాలి. 3 లేదా 5 శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి అరిచేతులు నేలమీద ఉంచాలి. విశ్రాంతస్థితిలో 5 శ్వాసలు. వేరియంట్ –3 శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందుకు స్ట్రెచ్ చేసి కాళ్ళకు సమాంతరంగా రెండు చేతులూ ఉంచి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ తిరిగి అరిచేతులు నేలమీద ఉంచాలి. తిరిగి విశ్రాంతస్థితిలో 5 శ్వాసలు తీసుకోవాలి. పై విధంగా మూడు వేరియేషన్స్ ఒకదాని తరువాత ఒకటి క్రమ పద్ధతిలో 5 లేదా 10 సార్లు రిపీట్ చేయవచ్చు. చేతులు శరీరానికి దగ్గరగా ఉంచినప్పుడు కిందపొట్టలో ఉన్న కొవ్వు కరగడానికి, శరీరానికి 180 డిగ్రీల కోణంలో పక్కలకు స్ట్రెచ్ చేసి ఉంచినప్పుడు మధ్య పొట్టలో ఉన్న కొవ్వు కరగడానికి ముందుకు వంచినప్పుడు పై పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. ఫలితం బాగా ఉండడానికి ఈ ఆసనాలను ఉదయం సాయంత్రం కనీసం 15 నిమిషాల పాటు చేయడం చాలా ముఖ్యం. కాళ్లు రెండు కూడా బాగా స్ట్రెచ్ చేసి ఉంచినందువల్ల కాళ్ళలో కొవ్వు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని నేలమీద పడుకుని చేసేదానికన్నా కుర్చీలో బోర్లా పడుకుని చేసినప్పుడు పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువగా కరిగే అవకాశం ఉంటుంది. స్ట్రెచ్ అయ్యే కండరాలు: లాటిస్సిమస్ డోర్సి, పెక్టరాలిస్ మేజర్, మైనర్, ఎక్సటర్నల్ ఆబ్లిక్, ఇంటర్నల్ ఆబ్లిక్, రెక్టస్, ట్రాన్స్వర్సిస్ అబ్డామినస్ కండరాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. ఉపయోగాలు: జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు, లివర్, పాంక్రియాస్ గ్రంధులు ఉత్తేజిపంబడటానికీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగం. జాగ్రత్తలు: హై బిపి, బ్యాక్ పెయిన్, మైగ్రెయిన్, పెప్టిక్ అల్సర్లు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. పొట్టకు గుండెకు సంబంధించిన శస్త్రచకిత్స జరిగినవారు 6 నెలల వరకూ ఈ ఆసనాలు చేయరాదు. గర్భిణీస్త్రీలు అస్సలు చేయకూడదు. - ఎ.ఎల్.వి కుమార్ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ మోడల్: రీనా సమన్వయం: సత్యబాబు