పరిపరిశోధన
తల్లి కావాలనుకునే మహిళలు తమ బరువు పెరగకుండా చూసుకోవడం మేలని సూచిస్తున్నారు స్వీడన్‌కు చెందిన పరిశోధకులు. మాతృమూర్తులు కావాలనుకునే వారు తాము ఉండాల్సినంత బరువే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.ఎందుకంటే.. ఉండాల్సిన దానికంటే ఎక్కువగా బరువు ఉండే మహిళలకు పుట్టే పిల్లల్లో 3.5 శాతం మందికి కొన్ని రకాలైన పుట్టుకతో వచ్చే సమస్యలు రావచ్చని వారు హెచ్చరిస్తున్నారు.
బీఎమ్‌ఐ ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉండే మహిళలకు పుట్టే పిల్లల్లో పుట్టుకతోనే గుండెజబ్బులతో పాటు కాళ్లు చేతుల్లో అవకరాలు, జీర్ణవ్యవస్థ పూర్తిగా రూపొందకపోవడంతోపాటు కొన్ని రకాల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు. దాదాపు 12 లక్షల మంది మహిళలను అధ్యయనం చేసిన స్వీడన్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయన ఫలితాలు బీఎంజే అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
కాబోయే మాతృమూర్తులూ... బరువు పెరగకండి!
Published Tue, Jul 4 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM
Advertisement
Advertisement