Heart disease
-
అదిలోనే అలర్ట్ అవ్వండి
సాక్షి, హైదరాబాద్: చిన్నపిల్లల్లో గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలతో పాటు యుక్త వయసు వారు కూడా హఠాత్ గుండెపోటుతో మరణిస్తున్నారు. ముఖ్యంగా అప్పటివరకు ఆడుకుంటూ సందడి చేసిన ఐదు, పదేళ్ల లోపు పిల్లలు హఠాత్తుగా కుప్ప కూలిపోతున్నారు. క్షణాల్లోనే మృత్యువాత పడుతున్నారు. గుండెపోటు వల్ల తమ బిడ్డలు మరణించారని తెలుసుకుంటున్న తల్లిదండ్రులు, బంధువులు విస్తుపోతున్నారు. తమకెందుకీ శాపం అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. రాష్ట్రంలో సైతం ఇటీవలి కాలంలో పెరుగుతున్న ఈ తరహా మరణాలపై ఆందోళన వ్యక్తమవుతోంది.అయితే అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగానే వారు మరణించినప్పటికీ, పుట్టినప్పటి నుంచే..జన్యుపరమైన కారణాలు, ఇతరత్రా కారణాలతో గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు వారిలో ఉంటాయని, వాటిని గుర్తించడం ద్వారా, గుర్తించిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా ఉండటం ద్వారా ఈ ప్రాణాంతక ముప్పును తప్పించవచ్చని వైద్య నిపుణులు సూచిçస్తున్నారు. ముందుగానే ఆయా జబ్బులతో ముడిపడిన చిన్న చిన్న లక్షణాలను గుర్తించి సరైన వైద్యం చేయిస్తే ప్రమాదం ఉండదని చెబుతున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులలోనే పరీక్షలు, వైద్యం చేయించాల్సిన పనిలేదని, పేద కుటుంబాల వారు నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ‘పీడియాట్రిక్ ఐసీయూ’, ఇతర రూపాల్లో ఉత్తమ సేవలు పొందవచ్చునని వివరిస్తున్నారు.ఇటీవలే బ్రిటన్‌కు చెందిన నిపుణులైన వైద్యుల బృందం పేద పిల్లలకు ఆపరేషన్లు చేయడంతో పాటు ఇతర రూపాల్లో వైద్య సేవలు అందించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఈ అంశంపై, హృద్రోగ సంబంధిత సమస్యలపై.. నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ హెడ్ డాక్టర్ అమరేష్ రావు మాలెంపాటì, æఉస్మానియా మెడికల్ కాలేజీ కార్డియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హరీ‹Ùలు తమ అభిప్రాయాలు, సూచనలను ‘సాక్షి’తో పంచుకున్నారు.⇒ ఇటీవల ఖమ్మం జిల్లాలో అప్పటివరకు తల్లిదండ్రులతో కలిసి ఆట పాటలతో సందడి చేసిన ప్రహర్షిక అనే నాలుగేళ్ల చిన్నారి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది.⇒ మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఏడో తరగతి చదువుతున్న నివృతి హఠాత్తుగా గుండెపోటుకు గురై మరణించింది. ⇒ జగిత్యాల జిల్లాలో సంజీవ్ అనే యువకుడు పెళ్లి బారాత్‌లో నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు.గమనించడం ముఖ్యం గుండె జబ్బుకు సంబంధించి లక్షణాలను ముందే గమనించవచ్చు. వారి శరీరరంగు ముఖ్యంగా పెదవు లు, చేతులు నీలం రంగులోకి మారుతుంటే జాగ్రత్తపడాలి. ఏడుస్తూ మారాం చేస్తున్నపుడు ఏదైనా మార్పు కనిపించినా, కొంచెం సేపే ఆటలు ఆడినా ఎక్కువగా ఆయాసపడుతున్నా, పాలు తాగుతున్న సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతు న్నా, చెమటలు పడుతున్నా, పాలు వదిలేయడం వంటివి చేస్తున్నా తేలిగ్గా తీసుకోకూడదు. సాధారణంగా పసిపిల్లలుగా ఉన్నపుడే 3,4 పర్యాయాలు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు సోకుతాయి.అంతకు మించిన సంఖ్యలో అంటే నెలనెలకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయంటే తల్లిదండ్రులు అలర్ట్ కావాలి. వయసుకు తగ్గట్టుగా బరువు పెరగకపోవడం, ఏడాది వయసు పూర్తయ్యేలోగా తొలి అడుగు వేయకపోవడం లాంటివి బాగా ఆలస్యమైతే ఏదైనా సమస్య ఉండొచ్చునని భావించాలి. ఇలాంటి లక్షణాలు కని్పస్తే వారికి కచ్చితంగా గుండెజబ్బు ఉందని కానీ వస్తుందని కానీ చెప్పలేం. వీటిని కేవలం కొన్ని సూచికలుగానే పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తపడాలి.తగిన పరీక్షలు, వైద్యం చేయించాలి. పిల్లల్లో చిన్నప్పుడే గుండెలో చిన్న రంధ్రం బయటపడినా, వారు పెద్దయ్యేటప్పటికి అది పూడుకుపోతుందని కొందరు తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే దీనికి సంబంధించిన లక్షణాలు క్రమంగా తగ్గొచ్చుకానీ సమస్య అలాగే ఉండే అవకాశాలున్నాయి. అందువల్ల వైద్యులను సంప్రదించాలి. మొన్నీమధ్యే ఏడేళ్ల పిల్లవాడికి నిమ్స్‌లో కాంప్లికేటెడ్ ‘రాస్ ప్రొసీజర్’తో విజయవంతంగా సర్జరీ చేశాం. – డాక్టర్ అమరేష్ రావు మామెంపాటి, కార్డియో థొరాసిక్ సర్జరీ హెడ్ , నిమ్స్, హైదరాబాద్గర్భస్థ శిశువులో సమస్యను కూడా గుర్తించవచ్చు హఠాత్ గుండెపోటును చాలా మటుకు నివారించే అవకాశాలున్నాయి. గుండెకు చిల్లులున్నా గుండెపోటుకు గురికాకుండా జాగ్రత్త పడవచ్చు. శస్త్రచికిత్సలతో వాటిని ఆపొచ్చు. చిన్నపిల్లల్లో రక్తనాళాలు ఉండాల్సిన స్థితిలో సవ్యంగా లేకుండా తేడాగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలుంటాయి. ఏదైనా అంశంపై వారు భావోద్వేగానికి గురైనా, ఎగ్జైట్మెంట్ పెరిగినా వారి గుండె కదలికల్లో మార్పులు సంభవిస్తాయి. ఎక్కువగా ఆయాసపడుతున్నా, తరచుగా మూర్ఛ (ఫిట్స్) పోవడం జరుగుతున్నా గుండె సమస్యలున్నట్టుగా అనుమానించాలి.మైకాండ్రియా సెల్స్‌లో పొటాíÙయం, కాల్షియం, సోడియం సమతూకం దెబ్బతింటే రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చి కుప్పకూలే అవకాశాలుంటాయి. పుట్టినప్పటి నుంచే గుండె పనితీరుకు సంబంధించి ఏవైనా లోపాలుంటే ప్రాథమికంగా ఈసీజీ, 2 డీ ఎకో పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు. ప్రస్తుతం వైద్య చికిత్సలో అధునాతన సౌకర్యాలు అందుబాటులోకి వచి్చనందున గుండె సమస్యలున్న చిన్నారులకు తగిన చికిత్స అందించేందుకు అవకాశం ఉంది. గర్భస్త శిశువుగా ఉన్నపుడు కూడా గుండె సంబంధిత సమస్యలను గుర్తించి సరిచేయవచ్చు. బిడ్డ పుట్టాక ఫాలో అప్ చేయడం ద్వారా కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. – డాక్టర్ హరీష్ తంగెళ్లపల్లి, డీఎం కార్డియాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, హైదరాబాద్ -
ప్రియురాలి తల్లి కోసం చోరీలు!
బొమ్మనహళ్లి: ప్రియురాలి తల్లికి వైద్య ఖర్చుల కోసం ప్రియుడు చోరీలకు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ఖాకీలకు దొరికాడు. ఈ సంఘటన బెంగళూరుఽ దక్షిణలోని జిగణి పరిధిలో జరిగింది. గదగ్ జిల్లాలోని లక్ష్మేశ్వర్ తాలూకాలోని మల్లూరు గ్రామానికి చెందిన సయ్యద్ అలీ బాలాసాహెబ్ నదాఫ్ (25) నిందితుడు. ఇతడు డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసేవాడు. నదాఫ్ ప్రియురాలి తల్లికి గుండె జబ్బు ఉంది. ఆమె వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. దీంతో ప్రియురాలి అభ్యర్థన మేరకు నదాఫ్ డబ్బు కోసం దొంగతనాలు మొదలు పెట్టాడు. ఆగస్టులో జిగణిలో రత్నమ్మ అనే మహిళ నడిచి వెళ్తుండగా బుల్లెట్ బైక్‌లో వచ్చి గొలుసును లాక్కెళ్లాడు. మరో మహిళ మెడలో తాళి బొట్టును ఎత్తుకెళ్లాడు. ఈ చోరీలు సీసీ కెమెరాలలో రికార్డు కాగా, జిగణి పోలీసులు విచారణ జరిపి వీర ప్రేమికున్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 8 లక్షల విలువ చేసే 3 బంగారం చైన్లు, 2 బైకులు, ఒక మొబైల్ ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. -
గుండె జారిపోతోంది!
సాక్షి, అమరావతి: దేశంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో గుండె జబ్బుల సంబంధిత ఇన్సూ్యరెన్స్ క్లెయిమ్‌లు దాదాపు రెట్టింపవడమే ఇందుకు నిదర్శనం. కాలుష్యం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులకు ప్రధాన కారణం. పాలసీ బజార్ సంస్థ అధ్యయన నివేదిక ప్రకారం 2019–20లో దేశవ్యాప్తంగా నమోదైన ఆరోగ్య బీమా నమోదైన క్లెయిమ్‌లలో గుండె చికిత్సల క్లెయిమ్‌ల వాటా దాదాపు 12 శాతం. ఇవి 2023–24లో 20 శాతం వరకు పెరిగాయి. గుండె జబ్బుల చికిత్స ఖర్చులు సైతం 47 నుంచి 53 శాతం మేర పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఒక్కో క్లెయిమ్ 2019–20లో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఉంటే.. 2023–24లో రూ. 12 – 15 లక్షలకు పెరిగినట్లు తెలిపింది. యువతలో పెరుగుతున్న జబ్బులు కొద్ది సంవత్సరాలుగా యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేని జీవన శైలి ఇందుకు కారణమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 2020లో 40 ఏళ్ల లోపు యువతకు సంబంధించిన గుండె వ్యాధుల క్లెయిమ్‌లు 10–12 శాతం నమోదు కాగా, 2022–23లో 15–18 శాతంగా నమోదైంది. గుండె జబ్బులకు సంబంధించిన మొత్తం క్లెయిమ్‌లలో 60–70 శాతం పురుషులు, 30–40 శాతం మహిళలు ఉన్నట్టు తేలింది.ప్రాంతాల వారీగా అత్యధికంగా గుండె చికిత్సల క్లెయిమ్లుఉత్తర భారతదేశం (ఢిల్లీ, పంజాబ్, హర్యానా) 20- 25%పశ్చిమ భారతదేశం (మహారాష్ట్ర, గుజరాత్) 15- 18%దక్షిణ భారతదేశం (తమిళనాడు, కర్ణాటక) 15-20%తూర్పు భారతదేశం (పశ్చిమ బెంగాల్) 10- 12%(కోల్‌కతా వంటి నగరాల్లో గుండె జబ్బుల రేట్లు గణనీయంగా ఉంటున్నాయి. అయినప్పటికీ బీమా పాలసీదారులు తక్కువగా ఉండటంతో తక్కువ నమోదైంది) -
విస్తరిస్తున్న స్టెంట్ మార్కెట్
దేశంలో హృద్రోగ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. పట్టుమని పాతికేళ్లు కూడా నిండకుండానే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడుతున్నాయి. 1990లో కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధి (సీవీడీ) కేసులు 25.7 మిలియన్లు ఉండగా.. 2023 నాటికి అవి 64 మిలియన్లకు పెరిగినట్లు అంచనా. ఇలా గుండె జబ్బులు ఎక్కువవుతుండడంతో కరోనరీ స్టెంట్ చికిత్సకు డిమాండ్ పెరుగుతోంది. భారత్‌లో కరోనరీ డ్రగ్–ఎలుటింగ్ స్టెంట్ మార్కెట్ 2024 నుంచి 2033 వరకూ నాలుగు శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) సాధిస్తుందని ప్రముఖ డేటా అనలిటిక్స్ సంస్థ గ్లోబల్ డేటా అంచనా వేసింది. ఈ సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో 2024లో ఆసియా పసిఫిక్ మార్కెట్లో భారత్ దాదాపు 32 శాతం వాటా కలిగి ఉందని వెల్లడించింది. గత ఏడాది స్టెంట్ మార్కెట్ పరిమాణం 1,303.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది. - సాక్షి, అమరావతి32.4 శాతం మరణాలు..ఇక రాష్ట్రంలో 3.8 మిలియన్ల మంది గుండె సీవీడీ బాధితులున్నారు. అంటే మొత్తం వ్యాధులలో 17 శాతం. అంతేకాక.. ఏటా సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం మరణాలకు సీవీడీ కారణంగా ఉంటోందని వైద్యశాఖ చెబుతోంది. గుండెపోటుకు సంబంధించిన అత్యంత ప్రాణాంతకమైన ఎస్టీ–ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (స్టెమీ) నుంచి ప్రజలను రక్షించడం గత ప్రభుత్వంలో కీలక అడుగువేశారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో స్టెమీ కార్యక్రమానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం రాష్ట్రంలో గుండెపోటు బారినపడిన వారికి గోల్డెన్ హవర్లోనే చికిత్సలు అందిస్తోంది. గడిచిన ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలో గుండె జబ్బులకు చికిత్సలు పెరుగుదల ఇలా..» 2019- 2023,797» 2020- 2124,24» 2021- 2236,724» 2022- 2366,333» 2023- 2471,474 -
టేస్టీ టేస్టీగానే తింటూ..గుండెను ఆరోగ్యంగా ఉంచుకుందాం ఇలా..!
గుండెకు బలం పెంచేందుకూ... టేస్టీ టేస్టీగానే తింటూ, గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పదార్థాలను తీసుకోవచ్చు. అవేంటో సవివరంగా తెలుసుకుందాం..!.టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. ∙బచ్చలి, ΄ాలకూర లాంటి ఆకుకూరలన్నీ గుండెకు మంచి బలాన్నిస్తాయి. విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల వంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్లీ పైనుంచి చక్కెర కలుపుకోకూడదు. దానిమ్మ గుండెకెంతో మేలు చేస్తుంది. యాపిల్ పండ్లు కూడా గుండెకు మంచివే. బాదంపప్పు, అక్రోటు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినవచ్చు. వాటిలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల వంటి బెర్రీజాతి పండ్లు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. చేపల్లో గుండెకు మేలు చేసే ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ çసమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అన్ని చేపలూ గుండె మేలు చేస్తాయి. అయితే సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు... అందునా సాల్మన్ఫిష్ తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది పరిమితంగా తినే డార్క్ చాక్లెట్లతో గుండెకు మేలు జరుగుతుంది. వాటితో హైబీపీ, రక్తం గట్టకట్టుకు΄ోయే రిస్క్‌లు తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీలతో గుండెకు మేలు చేకూరదు. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం గుండెకు మేలు చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. -
వెల్లుల్లిని కాల్చి తింటే ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదలరు!
వంటకాల్లో విరివిగా వాడే వెల్లుల్లితో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్నాయి. సుగంధ ద్రవ్యంగానూ, వెజ్, నాన్‌వెజ్ కూరల్లోనూ, పచ్చళ్లల్లోనూ వాడుకుంటాం. అలాగే పచ్చి వెల్లుల్లిని వేడి వేడి అన్నంలో ముందు ముద్దలో తీసుకోవడం కూడా పెద్దవాళ్లకి అలవాటు. అంతేకాదు కాల్చిన వెల్లుల్లిని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం! వెల్లుల్లిని కాల్చినప్పుడు రుచి పెరగడంతోపాటు, దాంట్లోని ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయట. విటమిన్ B6, విటమిన్ సీ, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్ మూలకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులోని అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.ప్రతిరోజు ఆహారంలో వెల్లుల్లి చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం గుండెకు బలాన్నిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.రక్త ప్రసరణను మెరుగుపర్చి, రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. వెల్లుల్లిలోని క్వెర్సెటిన్ , కెంప్ఫెరోల్ వంటి సమ్మేళనాలే దీనికి కారణం.వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కారకాలు బీపీని తగ్గించడంలో సాయపడతాయి.షుగర్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి పనిచేస్తుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది సున్నాగా ఉంటుంది. శరీరంలో ఉన్న ఇన్సూలిన్స్ స్థాయిలను రెగ్యులేట్ చేయడంలో ఉపయోగపడుతుంది.కాల్చిన వెల్లుల్లి కొన్ని రకాల కేన్సర్ల బారినుంచి రక్షిస్తుంది. కడుపు కేన్సర్, పెద్దప్రేగు కేన్సర్ , పేగు కేన్సర్ , రొమ్ము కేన్సర్ , ప్రోస్టేట్ కేన్సర్ల నివారణలో సాయపడుతుంది. డయాలిల్ సల్ఫైడ్ , అల్లైల్ సిస్టీన్ సల్ఫాక్సైడ్ వంటి సమ్మేళనాలను కలిగి ఉండడమే దీనికి కారణం. పురుషుల్లో లైంగిక పటుత్వానికి కూడా వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.బాలింతల్లో పాలు సమృద్ధిగా రావడానికి కూడా వెల్లుల్లిని వాడతారు. -
జూలియట్ మళ్లీ ఆడుకుంది!
న్యూఢిల్లీ: హుషారుగా గెంతుతూ చలాకీగా తిరుగుతూ తమ కుటుంబంలో భాగమైపోయిన ఏడేళ్ల శునకం గుండె జబ్బుతో బాధపడటం చూసి ఆ కుటుంబం అల్లాడిపోయింది. ఎలాగైనా అది మళ్లీ హుషారుగా తిరిగితే చాలు అని మనసులోనే మొక్కుకున్నారు. వారి బాధను అధునాతన చికిత్సవిధానంతో పోగొట్టారు ఢిల్లీలోని ఒక మూగజీవాల వైద్యుడు. రెండేళ్ల క్రితం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఒక నూతన వైద్యవిధానంతో డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్యబృందం ఆ శునకానికి కొత్త జీవితం ప్రసాదించింది. ఏమిటీ సమస్య? ఏడేళ్ల బీగల్ జాతి శునకం జూలియట్ రెండేళ్లుగా మైట్రల్ వాల్వ్ సమస్యతో బాధపడుతోంది. గుండెలో ఎడమ ఎగువ కరి్ణక నుంచి జఠరికకు వెళ్లాల్సిన రక్తం తిరిగి కరి్ణకలోకి లీక్ అవుతోంది. దీంతో గుండె కొద్దికొద్దిగా కుంచించుకుపోయి, ఊపిరితిత్తుల్లో నీరు చేరి మృత్యువు ఒడికి చేరే ప్రమాదముంది. దీంతో విషయం తెల్సుకున్న ఢిల్లీలోని ఈస్ట్ కైలాశ్ ప్రాంతంలోని మ్యాక్స్ పెట్జ్ ఆస్పత్రిలోని డాక్టర్ భానుదేవ్ శర్మ నేతృత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ చేసేందుకు ముందుకొచి్చంది. చిన్న జీవాలకు గుండె ఆపరేషన్లు చేయడంలో శర్మ నిష్ణాతునిగా పేరొందారు. ‘‘ అమెరికాలోని కొలర్యాడో స్టేట్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితమే ఈ కొత్త ఆపరేషన్ విధానం అమల్లోకి వచి్చంది. ట్రాన్స్క్యాథటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్(టీఈఈఆర్) విధానంలో మే 30న జూలియట్‌కు గుండె ఆపరేషన్ చేశాం. ఓపెన్ హార్ట్ సర్జరీలాగా దీనికి పెద్ద కోత అక్కర్లేదు. చాలా చిన్న కోత సరిపోతుంది. గుండె ఊపిరితిత్తుల బైపాస్ మెషీన్‌తో పని ఉండదు. గుండె కొట్టుకుంటుండగానే ఆపరేషన్ చేసేయొచ్చు. ఛాతీ వద్ద అత్యల్ప రంధ్రం చేసి మెషీన్‌ను పంపి గుండె కవాటం ద్వారాన్ని సరిచేస్తాం’’ అని శర్మ వివరించారు. ఆపరేషన్ చేసి రెండు రోజులకే జూలియట్‌ను డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగా ఆటుకుంటూ కుటుంబంలో మళ్లీ సంతోషాన్ని నింపింది. ఈ తరహాలో 80 శాతం మరణాలు భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా శునకాలు ఎదుర్కొంటున్న హృద్రోగ సమస్యల్లో ఈ తరహావే 80 శాతం ఉండటం గమనార్హం.శునకాల మరణాలకు ప్రధాన కారణాల్లో ఈ సమస్య కూడా ఒకటి. ఆసియా ఖండంలో శునకాలకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ఆ వెటర్నరీ ఆస్పత్రి తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసిన రెండో ప్రైవేట్ వైద్య బృందం వీళ్లదేనని ఆస్పత్రి పేర్కొంది. -
కొలెస్ట్రాల్ ఎంత అవసరం? ఎంతకు మించరాదు?
ఆధునిక కాలంలో మనం అనుసరించే జీవనశైలి వల్ల, తినే ఆహారం వల్ల రకరకాల జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ హెచ్చుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్థాలతోపాటు కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువ ఉండటమూ ఒక కారణం. ఇంతకూ కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమేనా? ఇది ఎంత ఉండాలి, ఎంతకంటే ఎక్కువ ఉంటే ప్రమాదం అనే విషయాల గురించి తెలుసుకుందాం.శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్డిఎల్ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి.హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ దీనినే మంచి కొలెస్ట్రాల్ అని అంటారు. హెచ్‌డిఎల్ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం అవుతుంది. హెచ్‌డిఎల్ స్థాయి తక్కువగా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె΄ోటుకు బలమైన కారణం ఎల్డిఎల్ పెరగడం కన్నా హెచ్‌డిఎల్ తగ్గడమే. హెచ్‌డిఎల్ పురుషుల్లో 40 ఎంజి/ డిఎల్, మహిళల్లో 50 ఎంజి/డిఎల్ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో΄ాటు హెచ్‌డీఎల్ స్ధాయిని కూడా పెంచుకునే వీలుంది.ఇక ధనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరు చేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది. ఇక చివరిగా ఉసిరి. ఇది కొలెస్ట్రాల్ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పోందవచ్చని కూడా చెబుతున్నారు.మాంసాహారం పూర్తిగా మానేయాలి. శాకాహారంలో వేపుడు కూరలు తినరాదు. వీటి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది మన శరీర నిర్మాణానికి అవసరం.చెడు కొలెస్ట్రాల్ ఉంటే..?శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. మరి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి?అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మేలు చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్డీఎల్ అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా/అదుపులో ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మరి మన వంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి ఏం తినాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా?చెడు కొవ్వు తగ్గడానికి...ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి ∙ఎల్డీఎల్ అనే చెడు కొవ్వులు.. డెసిలీటర్కు 70 మిల్లీ గ్రాములకు మించకూడదు మధుమేహం ఉన్నవాళ్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకోవడం తప్పనిసరి. అ΄ోహలను పక్కనపెట్టి వైద్యుల సూచనలను తప్పక ΄ాటించాలి ∙మంచి కొలెస్ట్రాల్ . డెసిలీటర్కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి ∙ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి ∙తిండిని అదుపులో ఉంచుకోవాలి. వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. అలాగే పళ్ళు, పచ్చి కూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోసకాయలు, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్ లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే మంచిది.పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటి బెల్లం, బెల్లం లేదా తేనె కొద్ది మోతాదులో తీసుకోండి.రోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోండి. ఇలా 30 రోజులు చేయండి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ్ర΄ాణాయామం చేయాలి. -
కొత్తిమీరతో అద్భుత ప్రయోజనాలు, వారికి తప్ప
వంటల్లో విరివిగా ఉపయోగించే మంచి హెర్బ్ కొత్తిమీర. అలాగే పురాతన కాలంనుంచీ వాడుకలో ఉన్నదిధనియాలు. ధనియాలు, కొత్తిమీర వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బరువు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుంది. కొత్తిమీర వినియోగంతో వచ్చే లాభాలు, బరువు తగ్గడానికి పని చేసే ఒక మంచి చిట్కా గురించి తెలుసుకుందాం. మీకు తెలుసా?కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొత్తిమీరను ఆహారంలో చేర్చుకోవాలని అమ్మమ్మల నుంచి విన్నాం. కొత్తిమీర ఆకులలో ముఖ్యమైన నూనెలు యాంటీమైక్రోబయల్, ఫంగల్ లక్షణాలను కలిగి ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇంకా విటమిన్ ఏ సీ, కెరోటినాయిడ్లు, పుష్కలం. ఈ పోషకాలతో పాటు డైటరీ ఫైబర్, ఐరన్, మాంగనీస్, కాల్షియం, విటమిన్ కె, ఫాస్పరస్ మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. ఇంకా చాలా సంతృప్త కొవ్వు, 11 ముఖ్యమైన నూనెలు లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.కొత్తిమీర ఆరోగ్య ప్రయోజనాలుకొన్ని అధ్యయనాల ఆధారంగా, కొత్తిమీర ఆకులను తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళల సమస్యలు తగ్తుతాయి. విటమిన్ ఏ, సీ, ఈవిటమిన్ ఇ కారణంగా కళ్లకు చాలా మంచిది. కొత్తిమీర రోజువారీ వినియోగిస్తే వయసు కారణంగా వచ్చే మచ్చలకు మంచి చిట్కా. రోగనిరోధక శక్తికి మద్దతు ఇస్తుంది. ఐరన్ తీసుకోవడంలో బాడీగా బాగా సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయికొత్తిమీరలోని ఆకుపచ్చ రంగు యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. కొత్తిమీర కలిపిన నీటిని రోజూ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తికి మేలు జరుగుతుంది. ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. కొత్తిమీర గ్లైసెమిక్ ఇండెక్స్ 33 మాత్రమే. ఇది చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి కొత్తిమీర శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ మొత్తాన్ని పెంచుతుంది. బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటే కొత్తిమీర నీళ్లు తాగకండి. ఇది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.చెడు కొలెస్ట్రాల్నేటి జీవనశైలిలో, ప్రతి మూడవ వ్యక్తి అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. కొత్తిమీర ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,హెచ్‌డిఎల్ (మంచి) కొలెస్ట్రాల్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.ఎముకల ఆరోగ్యానికి కొత్తిమీర ఆకులు కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు పుష్కలం కొత్తిమీరలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫంక్షన్ ఆర్థరైటిస్ సంబంధిత నొప్పి నుండి ఎముకలను రక్షిస్తుంది.గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోకొత్తిమీరలో మంచి ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కడుపు నొప్పి, విరేచనాలు, ప్రేగు కదలికలు, గ్యాస్ లేదా వికారం వంటి వివిధ జీర్ణ సమస్యలకు కూడా పని చేస్తుంది. చర్మ ఆరోగ్యంఐరన్, విటమిన్ ఇ , విటమిన్ ఎ యొక్క పవర్‌హౌస్‌గా ఉండటం వల్ల ఇది చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కొత్తిమీర అదనపు నూనెను పీల్చుకునే సామర్థ్యం కారణంగా జిడ్డు చర్మానికి నివారణగా కూడా పనిచేస్తుంది. యాంటీమైక్రోబయల్, యాంటిసెప్టిక్ ,యాంటీ ఫంగల్ ఏజెంట్ చర్మాన్ని చల్లబరుస్తుంది.గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందిశరీరంలోని అదనపు నీరు, సోడియంను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బరువు తగ్గాలంటే అంతేకాదు అధిక బరువుతో బాధపడే వారికి కొత్తిమీర నీరు మంచి వైద్యం అని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీరలోని పీచు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో సహాయ పడుతుంది. కొత్తిమీరలోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడంలో సహాయ పడతాయి. థైరాయిడ్ సమస్యలకు సహజ నివారణగా పనిచేస్తుంది. కొత్తిమీర ఆకులు, కాండం యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. దీన్ని ఉదయాన్నే పరగడుపున తాగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలలో ఉండే థైమోల్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.జాగ్రత్తలుకొత్తిమీర, ధనియా వాటర్ రక్తపోటును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. లోబీపీ ఉన్నవారు అపమ్రత్తంగా ఉండాలి. దీనిని హైపోగ్లైసీమియా అని కూడా పిలుస్తారు. దీని వల్ల ఆందోళన, దడ, చెమట , ఆకలిలాంటి సమస్యలొస్తాయి. ఏదైనా మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. -
జంక్‌ఫుడ్.. 32 ఆరోగ్య సమస్యలు!
జంక్ ఫుడ్ తింటే అనారోగ్యం...!! ఊబకాయం వస్తుంది... గుండెజబ్బులకు.. మరెన్నో ఇతర వ్యాధులకూ కారణమవుతుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కానీ... మొత్తం ఎన్ని సమస్యలకు జంక్ ఫుడ్ కారణమవుతుందన్నది మాత్రం ఇప్పటివరకూ తెలియలేదు. తాజా అధ్యయనం ఈ కొరతనూ తీర్చేసింది!జంక్ ఫుడ్‌తో అక్షరాలా... 30 రకాల శారీరక, మానసిక సమస్యలు వస్తాయి అంటోంది ఈ అధ్యయనం. వివరాలేమిటో చూసేద్దామా...??? ఆరోగ్యంగా ఉండాలంటే వీలైనంత వరకూ జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, సమతుల ఆహారం తీసుకోవాలని వైద్యులు, నిపుణుల చెబుతూంటారు. బాగా శుద్ధి చేసి ప్యాకెట్లలో నింపి అందించే తిండి పదార్థాలను జంక్‌ఫుడ్ అని పిలుస్తూంటాం మనం. బేకరీ పదార్థాలు, చిరుతిళ్లు, తీపి కలిగినవి, కార్బొనేటెడ్ పానీయాలు (కోలా డ్రింక్స్), చక్కెర కలిపిన కార్న్‌ఫ్లేక్స్ వంటివి, రెడీ టు ఈట్ పదార్థాలు.. ఇలా జంక్ ఫుడ్ జాబితా చాలా పొడవుగానే ఉంటుంది. సౌకర్యం కోసమో.. తీపిపై ఉండే ఆకర్శణ కారణంగానో కొన్ని దశాబ్దాలుగా మనిషి ఈ జంక్‌ఫుడ్‌కు బాగా దగ్గరయ్యాడు. ఆరోగ్య సమస్యలూ అంతే స్థాయిలో మనకు పెరుగుతూ పోయాయి. ఈ సమస్య గురించి చాలామందికి తెలిసినప్పటికీ పూర్తిస్థాయి అవగాహన తక్కువ మందికే ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు కొందరు జంక్‌ఫుడ్‌తో వచ్చే ఆరోగ్య సమస్యలను స్థూల స్థాయిలో అర్థం చేసుకునేందుకు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. ఇప్పటికే జరిగిన దాదాపు 45 మెటా అనాలసిస్ (అధ్యయనాల) వివరాలను సేకరించి విశ్లేషించారు. ఈ మెటా అనాలసిస్లన్నీ గత మూడేళ్లలో ప్రఖ్యాత పరిశోధన జర్నళ్లలో ప్రచురితమైనవే. ఈ పద్ధతి కారణంగా దాదాపు కోటి మంది జంక్‌ఫుడ్ అలవాట్లు, వారికి వచ్చిన ఆరోగ్య సమస్యల వివరాలు తెలిశాయి. జంక్‌ఫుడ్‌కు ఆరోగ్య సమస్యకు ఉన్న సంబంధానికి చూపిన సాక్ష్యాలను కూడా నిశితంగా విశ్లేషించారు. మూడు వర్గాలుగా విభజించారు. ఎక్కువ అవకాశం ఉండటం, ఓ మోస్తరు.. సాక్ష్యాలు లేకపోవడం అన్నమాట. మొత్తమ్మీద చూస్తే జంక్‌ఫుడ్ ఎంత ఎక్కువ తింటున్న వారికి రాగల ఆరోగ్య సమస్యలు కనీసం 32 వరకూ ఉన్నట్లు స్పష్టమైంది. కేన్సర్, మరణం, మానసిక, ఊపిరితిత్తుల, గుండె, జీర్ణకోశ, జీవక్రియల సంబంధిత ఆరోగ్య సమస్యలన్నింటికీ జంక్‌ఫుడ్‌కు సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇంకా... గుండెజబ్బులతో మరణించే అవకాశం 50 శాతం ఎక్కువ.-యాంగ్జైటీ తదితర మానసిక సమస్యలు వచ్చేందుకు 48 నుంచి 53 శాతం అవకాశం. టైప్-2 మధుమేహం బారిన పడేందుకు కనీసం 12 శాతం అవకాశం. ఏ కారణం చేతనైనా మరణం సంభవించేందుకు 21 శాతం వరకూ అధిక అవకాశాలు ఉన్నాయి. ఊబకాయం, నిద్రలేమి, గుండె జబ్బులతో మరణం వంటివాటికి 40 నుంచి 60 శాతం అవకాశాలున్నట్లు స్పష్టమైంది. ఉబ్బసం, జీర్ణకోశ సమస్యలు, కొన్ని రకాల కేన్సర్లు, మంచి కొలెస్ట్రాల్ మోతాదు తక్కువగా ఉండటం వంటి ఆరోగ్య సమస్యలకు జంక్‌ఫుడ్‌కు మధ్య సంబంధానికి సాక్ష్యాలు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తేల్చింది. -
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
అమెరికాలో అలా .. ఆసియాలో ఇలా?
సాక్షి, హైదరాబాద్: మధుమేహంతో పాటు గుండెజబ్బులు, మానసిక ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా భారత్ ఇతర ఆసియా దేశాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. కానీ వ్యాధి సోకడం, లక్షణాల వంటివి ప్రాంతాన్ని బట్టి మారిపోతున్నాయి. మధుమేహాన్ని తీసుకుంటే టైప్ 2 మధుమేహం అమెరికా లాంటి దేశాల్లో ఊబకాయం ఉన్నవారిలో కన్పిస్తుంది. కానీ భారత్‌లాంటి కొన్ని దేశాల్లో బక్కపలుచగా ఉన్నప్పటికీ దీనిబారిన పడుతున్నారు. అందరిలోనూ జన్యువులు ఒకే రకంగా ఉన్నప్పటికీ జన్యువుల పైభాగంలో వాతావరణం, సూక్ష్మ పోషకాల లోపం వల్ల చోటు చేసుకుంటున్న కొన్ని మార్పుల కారణంగా ఈ తేడాలు చోటు చేసుకుంటున్నట్లు తేలింది. మరోవైపు వీటి కోసం తయారు చేసిన ఔషధాలు ఒక ప్రాంతంలో పనిచేస్తే మరొక ప్రాంతంలో పని చేయడం లేదు. మధుమేహంతో పాటు గుండె జబ్బులు, మానసిక సమస్యలకు పైన పేర్కొన్న తేడాలు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు, అందరికీ సమర్ధంగా ఉపయోగపడే మందులు కనిపెట్టేలా, మానవజాతి ఆరోగ్యాన్ని పరిరక్షించేలా ఓ మహా ప్రయత్నం మొదలైంది. భారత్ సహా నాలుగు దేశాల్లోని 13 వేల మంది నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధి ముప్పును తగ్గించే ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. డైవర్స్ ఎపిజెనిటిక్, ఎపిడిమియాలజీ పార్ట్ నర్షిప్ (డీప్) అని పిలుస్తున్న ఈ అంతర్జాతీయ ప్రాజెక్టులో ఇరవై పరిశోధక బృందాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇరవై సంస్థలు భాగస్వాములు కానున్నాయి. ఇప్పటివరకు ‘యూరప్’ సమాచారమే ఆధారం ప్రజారోగ్యం విషయంలో ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలకు అత్యధికంగా యూరోపియన్ మూలాలున్న మానవుల నుంచి సేకరించిన సమాచారమే ఆధారం. అంటే ఆరోగ్య సమస్యల పరిశోధనల్లో ఇతర ప్రాంతాల వారి భాగస్వామ్యం చాలా తక్కువన్నమాట. అంతేకాకుండా జన్యుపరమైన, వాతావరణ సంబంధిత వైవిధ్యతను కూడా ఇప్పటివరకూ పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కొంచెం వివరంగా చెప్పాలంటే మన జన్యువులు, మనం ఉన్న వాతావరణం ప్రభావం.. మనకొచ్చే వ్యాధులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పటివరకూ స్పష్టంగా తెలియదన్నమాట. కాగా ‘డీప్’ప్రాజెక్టు ఈ లోటును భర్తీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల ఖర్చుతో ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. సీసీఎంబీ నేతృత్వంలో యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్,, ఎంఆర్సీ యూనిట్, ద గాంబియాలు ఇందులో పాల్గొననున్నాయి. అధ్యయనంలో భాగంగా కొన్ని వ్యాధులు కొన్ని ప్రాంతాల వారికి లేదా సమూహాలకు మాత్రమే ఎందుకు వస్తాయన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దీనిద్వారా ఒక ప్రాంత ప్రజల కోసం తయారు చేసిన మందులు ఇతర ప్రాంతాల వారికీ సమర్థంగా ఉపయోగపడతాయా? లేదా? అన్నది స్పష్టమవుతుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త ఆర్.గిరిరాజ్ ఛాందక్ తెలిపారు. సీసీఎంబీ ఎప్పుడో చెప్పింది... హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) చాలాకాలంగా భారతీయుల జన్యు నిర్మాణంలోని తేడాలు.. టైప్–1, టైప్–2 మధుమేహం, క్లోమగ్రంథి వ్యాధులపై వాటి ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోంది. విటమిన్ బీ–12, ఫొలేట్ తదితర సూక్ష్మ పోషకాలు, పర్యావరణాలు.. వ్యాధులు సోకేందుకు ఉన్న అవకాశాలపై ప్రభావం చూపుతున్నట్లు కూడా సీసీఎంబీ నిరూపించింది. పర్యావరణం నుంచి అందే సంకేతాల ఆధారంగా డీఎన్ఏలో వచ్చే కొన్ని రకాల మార్పులు మనిషి ఆరోగ్యం, వ్యాధులకు కారణమవుతున్నట్టుగా కూడా సీసీఎంబీ ప్రయోగాత్మకంగా రుజువు చేసింది. అంటే ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలన్నీ యూరోపియన్లపై ఆధారపడి జరిగినవి కావడంతో వారికి పనిచేసే మందులు, చికిత్స పద్ధతులు కచ్చితంగా మనకూ పనిచేస్తాయన్న గ్యారెంటీ లేదన్నమాట. అలాగే మనకు పనిచేసే మందులు బ్రిటిష్ వారికి లేదా అమెరికన్లను అక్కరకు వస్తాయా? అన్నది కూడా ప్రశ్నార్థకమే అన్నమాట. భారతీయులకూ భాగస్వామ్యం జన్యువులు – జన్యువులకు మధ్య, జన్యువులకు పర్యావరణానికి మధ్య జరుగుతున్న కార్యకలాపాలు అర్థం చేసుకునేందుకు మధుమేహం, గుండెజబ్బుల వంటి అసాంక్రమిక వ్యాధులకూ వీటికి ఉన్న సంబంధాలను అర్థం చేసుకునేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టులో భారతీయులను కూడా చేర్చుకోవడం ఎంతో ఆసక్తికరమైన అంశం. – డాక్టర్ ఆర్.గిరిరాజ్ ఛాందక్, ‘డీప్’ప్రాజెక్ట్ హెడ్ -
ఆ తిండితో మానసికంగానూ ముప్పే!
సాక్షి, హైదరాబాద్: అ్రల్టా–ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్) (ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) తరచుగా తీసుకోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలకు దోహదం చేస్తుందని గతంలో చేసిన అధ్యయనాలు తేల్చాయి. అయితే వీటి వల్ల మానసిక సామర్థ్యం సైతం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజుకు పలుమార్లు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారు.. ఈ ఆహారాలను అరుదుగా లేదా ఎప్పుడూ తీసుకోని వారితో పోలిస్తే మానసిక ఆరోగ్యంతో బాధపడే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని మన దేశానికి చెందిన 30 వేల మంది వ్యక్తులను భాగస్వాముల్ని చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక శ్రేయస్సును అధ్యయనం చేసే అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్‌లో ఈ అధ్యయనం ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అధ్యయన ఫలితాలతో ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు. డిప్రెషనే కాదు అంతకు మించి.. ‘ఈ తరహా ఆహారానికి ఉన్న మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని, దీని అధిక వినియోగం వల్ల డిప్రెషన్ మాత్రమే కాదు అంతకు మించిన మానసిక ఆరోగ్య క్షీణత సంభవిస్తున్నట్టుగా గమనించాం..’అని సేపియ¯న్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిస్ట్ తారా త్యాగరాజన్ చెబుతున్నారు. వీటి వినియోగం వల్ల కలిగే మానసిక సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 18–24 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతిరోజూ అలాంటి ఆహారాన్ని తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. యూపీఎఫ్ అంటే ఏమిటి? యూపీఎఫ్‌ను సరైన విధంగా నిర్వచించడం కొంతవరకు కష్టమే. అయితే సగటు గృహాలలో తయారు కాని, ఇంటి వంటగదికి ఆవల ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలను యూపీఎఫ్‌గా తారా త్యాగరాజన్ నిర్వచిస్తున్నారు. ఎరేటెడ్ డ్రింక్స్ (కొన్నిరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, ప్యాక్ చేసిన చిప్స్, స్నాక్స్, మిఠాయిలు ఈ కోవలోకి వస్తాయి. దీర్ఘకాలం మన్నేందుకు గాను సాల్ట్, సుగర్, ఫ్యాట్ వంటివి అధికంగా కలిపేవి ప్రాసెస్డ్ ఫుడ్ కాగా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్లు ఇతరత్రా కూడా జత కలుస్తాయి. రెడీ టూ ఈట్ మీల్స్, తీపి పానీయాలు వంటివన్నీ వీటిలో భాగమే. పెరుగుతున్న వినియోగం మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో యూపీఎఫ్ కూడా ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్‌తో కలిసి గత ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక వీటి వినియోగం ఎంతలా ఉందో స్పష్టం చేసింది. కోవిడ్ సందర్భంగా 2020లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత అంతకు ముందుకన్నా రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఈ విజృంభణ ఇలాగే కొనసాగితే 2032 కల్లా పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న రకరకాల ఆరోగ్య సమస్యలతో మన దేశం కూడా సతమతమవడం తథ్యమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పాఠశాలల్లో నిషేధించాలి గత నెలలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సంస్థలు సంయుక్తంగా.. మన దేశంలో యూపీఎఫ్‌ల వినియోగం–ప్రభావంపై నిర్వహించిన పరిశోధన పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థలు రూపొందించిన నివేదిక.. అన్ని రకాల జంక్ ఫుడ్స్, కుకీస్, చాకొలెట్స్, కన్ఫెక్షనరీ, హెల్త్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా వంటి ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరింది. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి విక్రయాలను నిషేధించాలని, ఈ ఉత్పత్తులపై భారీ జీఎస్టీని విధించాలని కూడా నివేదిక సూచించింది. -
ఆ తిండితో మానసికంగానూ ముప్పే!
సాక్షి, హైదరాబాద్: అల్ట్రా–ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్) (ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం) తరచుగా తీసుకోవడం ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు తదితర సమస్యలకు దోహదం చేస్తుందని గతంలో చేసిన అధ్యయనాలు తేల్చాయి. అయితే వీటి వల్ల మానసిక సామర్ధ్యం సైతం గణనీయంగా తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజుకు పలుమార్లు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినే వారు.. ఈ ఆహారాలను అరుదుగా లేదా ఎప్పుడూ తీసుకోని వారితో పోలిస్తే మానసిక ఆరోగ్యంతో బాధపడే అవకాశం దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని మన దేశానికి చెందిన 30 వేల మంది వ్యక్తులను భాగస్వాముల్ని చేసిన ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మానసిక శ్రేయస్సును అధ్యయనం చేసే అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ సేపియన్ ల్యాబ్స్ గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్‌లో ఈ అధ్యయనం ఒక భాగం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది నుంచి వచ్చిన ప్రతిస్పందనలు, అధ్యయన ఫలితాలతో ఇటీవల ఒక నివేదిక విడుదల చేశారు. యూపీఎఫ్ అంటే ఏమిటి? యూపీఎఫ్‌ను సరైన విధంగా నిర్వచించడం కొంతవరకు కష్టమే. అయితే సగటు గృహాలలో తయారు కాని, ఇంటి వంటగదికి ఆవల ప్రాసెసింగ్ చేసిన ఆహార పదార్థాలను యూపీఎఫ్‌గా తారా త్యాగరాజన్ నిర్వచిస్తున్నారు. ఎరేటెడ్ డ్రింక్స్ (కొన్నిరకాల శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్, ప్యాక్ చేసిన చిప్స్, స్నాక్స్, మిఠాయిలు ఈ కోవలోకి వస్తాయి. దీర్ఘకాలం మన్నేందుకు గాను సాల్ట్, సుగర్, ఫ్యాట్ వంటివి అధికంగా కలిపేవి ప్రాసెస్డ్ ఫుడ్ కాగా, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్లు ఇతరత్రా కూడా జత కలుస్తాయి. రెడీ టూ ఈట్ మీల్స్, తీపి పానీయాలు వంటివన్నీ వీటిలో భాగమే. నానాటికీ పెరుగుతున్న వినియోగం మన దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో యూపీఎఫ్ కూడా ఉంది. ఇండియ¯న్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్‌తో కలిసి గత ఆగస్టులో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదిక వీటి వినియోగం ఎంతలా ఉందో స్పష్టం చేసింది. కోవిడ్ సందర్భంగా 2020లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ఆ తర్వాత అంతకు ముందుకన్నా రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయని ఈ నివేదిక తేల్చింది. ఈ విజృంభణ ఇలాగే కొనసాగితే 2032 కల్లా పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న రకరకాల ఆరోగ్య సమస్యలతో మన దేశం కూడా సతమతమవడం తథ్యమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. డిప్రెషనే కాదు అంతకు మించి.. ‘ఈ తరహా ఆహారానికి ఉన్న మన ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం ఉందని, దీని అధిక వినియోగం వల్ల డిప్రెషన్ మాత్రమే కాదు అంతకు మించిన మానసిక ఆరోగ్య క్షీణత సంభవిస్తున్నట్టుగా గమనించాం..’అని సేపియన్ ల్యాబ్స్ వ్యవస్థాపకురాలు, చీఫ్ సైంటిస్ట్ తారా త్యాగరాజన్ చెబుతున్నారు. వీటి వినియోగం వల్ల కలిగే మానసిక సమస్యల్లో మానసిక వేదన, నిస్సత్తువ, ఆకలి మందగింపు వంటివి సంభవించే అవకాశం ఉందని అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా 18–24 సంవత్సరాల వయస్సు గల యువతలో ఇది బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే వారు 45 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలతో పోలిస్తే ప్రతిరోజూ అలాంటి ఆహారాన్ని తీసుకునే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. పన్నులు విధించాలి..పాఠశాలల్లో నిషేధించాలి గత నెలలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్, న్యూట్రిషన్ అడ్వకసీ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సంస్థలు సంయుక్తంగా.. మన దేశంలో యూపీఎఫ్‌ల వినియోగం–ప్రభావంపై నిర్వహించిన పరిశోధన పలు హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంస్థలు రూపొందించిన నివేదిక.. అన్ని రకాల జంక్ ఫుడ్స్, ప్రీ ప్యాకేజ్డ్ బెవరేజెస్, జ్యూసెస్, బేకరీ ఉత్పత్తులు, కుకీస్, చాకొలెట్స్, కన్ఫెక్షనరీ, హెల్త్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, పిజ్జా వంటి ఉత్పత్తులపై వార్నింగ్ లేబుల్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరడం గమనార్హం. కాగా వీటి వినియోగాన్ని నియంత్రించేలా, నిరుత్సాహ పరిచేలా పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో వీటి విక్రయాలను నిషేధించాలని, ఈ ఉత్పత్తులపై భారీ జీఎస్టీని విధించాలని కూడా నివేదిక సూచించింది. -
గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు!
నెల రోజుల క్రితం కదిరికి చెందిన డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు ఇంట్లో కుప్పకూలి పోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే హార్ట్ఎటాక్ అని తేలింది. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడమేమిటని వైద్యులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వారం రోజుల క్రితం అనంతపురానికి చెందిన 33 ఏళ్ల ఐటీ ఉద్యోగి గుండె నొప్పిగా ఉందని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఇంతలోనే సమస్య తీవ్రమైంది. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కారణమేమంటే తీవ్రమైన గుండె పోటు అని వైద్యులు చెప్పారు. ఎందుకిలా? నేడు వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో హృదయం గురించి సవివరంగా తెలుసుకుందాం! సాక్షి ప్రతినిధి, అనంతపురం: జీవన శైలి మార్పులు, ఆహార సమతుల్యత పాటించకపోవడం వెరసి గుండెకు పెనుముప్పు తెచ్చిపెడుతున్నాయి. గుండె జబ్బు ఒక్కసారే వచ్చి పడేది కాదు. అంతకుముందు ఎన్నో సంకేతాలు చిట్టి గుండె నుంచి వస్తూ ఉంటాయి. జాగ్రత్త పడమని సూచిస్తుంటాయి. అయితే, వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం చేటు తెస్తోంది. చివరికి ప్రాణాలూ తోడేస్తోంది. ఒక్క అనంతపురం రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 3 వేల పైగా జబ్బులకు రూ. 450 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే, అందులో రూ.129 కోట్లు పైగా గుండెజబ్బులకే కేటాయించడం చూస్తే పరిస్థితి తీవ్రతను అంచనా వేయచ్చు. ప్రభుత్వాలు సైతం ఏటా సెప్టంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం ఏర్పాటు చేసి గుండె గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా యత్నం చేస్తోంది కూడా. ఈ ఏడాది థీమ్ "హృదయాన్ని ఉపయోగించండి గుండె గురించి తెలుసుకోండి". అనే నినాదంతో మరింతగా ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోంది కూడా. పల్లెలకూ పాకిన మాయదారి జబ్బు.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా గుండెపోటు కేసులు వచ్చేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ జీవనశైలి జబ్బులు ఎగబాకడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రతి పది మందిలో ఒకరు గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ కార్డియాలజీ సొసైటీ ఇటీవల హెచ్చరించింది. జాగ్రత్తలు పాటించడంలో కనబరిచే నిర్లక్ష్యమే శాపమవుతోందని స్పష్టం చేసింది. యువకుల్లోనూ.. ఒకప్పుడు 55 ఏళ్లు దాటితేగానీ గుండె సంబంధిత జబ్బులొచ్చేవి కావు. కానీ నేడు 35 ఏళ్లకే గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి. గుండెపోటును సైలెంట్ కిల్లర్‌గా వైద్యులు అభివర్ణిస్తున్నారు. గుండె పోటుకు రకరకాల కారణాలు చుట్టుముడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు వంటివి కూడా ఆజ్యం పోస్తున్నట్టు హృద్రోగ నిపుణులు పేర్కొంటున్నారు. గుండె జబ్బులకు ప్రధాన కారణం.. పొగాకు, ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవడం అధిక రక్తపోటు ఉంటే, నియంత్రణలో ఉంచుకోలేకపోవడం చెడు కొలె్రస్టాల్ అంటే ఎల్డీఎల్ (లో డెన్సిటీ లిపిడ్స్) ఉండటం శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ నూనెల (ట్రైగ్లిజరాయిడ్స్) శాతం వయసుకు, ఎత్తుకు మించి బరువు(ఊబకాయం) మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడంలో నిర్లక్ష్యం కుటుంబ చరిత్ర ప్రభావం కాపాడుకోవాలి ఇలా రోజూ 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం. కొవ్వులున్న ఆహారం తగ్గించి పీచు ఆహారం ఎక్కువగా తీసుకోవడం (కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, చిరు ధాన్యాలు) బరువును అదుపులో ఉంచుకోవడం. ఒత్తిడి తగ్గించుకోవడం ఆరుమాసాలకోసారి 2డీ ఎకో వంటివి చేయించడం చెడు కొలెస్ట్రాల్‌ను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించడం బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవడం వ్యాయామమే శ్రీరామరక్ష గుండెజబ్బుల రాకుండా ఉండాలంటే రోజూ 40 నిముషాల నడక లేదా జాగింగ్, స్విమ్మింగ్ చేయాలి. కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు. రోజుకు 3 గ్రాములకు మించి ఉప్పు, నెలకు 500 మిల్లీ లీటర్ల మించి ఆయిల్ వాడకూడదు. ముఖ్యంగా పదే పదే మరిగించిన నూనెతో చేసినవి తింటే గుండెకు ఎక్కువ ముప్పు ఉంటుంది. పొగతాగడం, మద్యం అనేవి ఎప్పుడూ గుండెకు శత్రువులే. –డాక్టర్ వంశీకృష్ణ, హృద్రోగ నిపుణులు, అనంతపురం ఉచితంగా కార్పొరేట్ స్థాయి వెద్యం ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు వారికీ గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. జంక్ ఫుడ్, మద్యం, ధూమపానంతోనే సమస్యలు తెచ్చుకుంటున్నారు. సూపర్ స్పెషాలిటీలో కార్పొరేట్ స్థాయిలో హృద్రోగులకు సేవలు అందిస్తున్నాం. అటువంటి శస్త్రచికిత్సలు ప్రైవేట్‌గా చేసుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. ఇప్పటి వరకూ దాదాపు 400 వరకు ఆంజియోప్లాస్టీ,యాంజోగ్రామ్ ఆపరేషన్లు విజయవంతంగా చేశాం. – డాక్టర్ సుభాష్‌చంద్రబోస్, కార్డియాలజిస్టు (చదవండి: జ్వరం వస్తే చాలు!.. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? అలా వాడితే..) -
ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మృతి
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో డెంగీతో నలుగురు మరణించారని ఆ జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అయితే వారు గుండె జబ్బులు, ఊపి రితిత్తుల సమస్యలు, జాండిస్, సికిల్ సెల్ అనీమి యా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు న్నట్టు వివరించారు. రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారు లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రజా రోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, డీసీహెచ్‌లు, టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా వైద్యాధికారులు డెంగీ మరణాలపై మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లోనే 10 మంది మరణించారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి జిల్లాలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని వెల్లడించారు. జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు... రాష్ట్రంలో అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పిల్లల జ్వరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్న అంశాలను మంత్రి వివరించారు. డెంగీ కేసులు పెరుగుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఫీవర్ కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదన్నారు. జ్వర బాధి తుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమో దు చేయాలని, ఆ డేటా ఆధారంగా డీఎంహెచ్ వోలు హైరిస్క్ ఏరియాలను గుర్తించి జాగ్రత్త చర్య లు చేపట్టాలన్నారు. జిల్లాల్లో 24 గంటల కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు సమాచారం అందించాలని చెప్పారు. మీడియా సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మలేరియా విభాగం అడిషనల్ డైరెక్టర్‌ను కొత్తగూడెం పంపి, అక్కడి పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. -
గుండెకు నిబ్బరం! రూపాయి ఖర్చు లేకుండా చికిత్స.. బైపాస్ సర్జరీ కూడా..
సాక్షి, అమరావతి: గుండె జబ్బుల బారిన పడ్డ పేద, మధ్యతరగతి కుటుంబాలకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కొండంత అండగా నిలుస్తోంది. చేతి నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. మన రాష్ట్రంతోపాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం హృద్రోగ బాధితులకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత వైద్యసేవలు అందుతున్నాయి. 1.71 లక్షల మందికి వైద్యం 2019 నుంచి 1,71,829 మంది గుండె సంబంధిత జబ్బుల బాధితులు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందారు. బైపాస్ సర్జరీలు, స్టెంట్లు..యాంజియోగ్రామ్, గుండె మార్పిడి సహా వివిధ చికిత్సలను పథకం కింద ఉచితంగా నిర్వహిస్తున్నారు. హృద్రోగ బాధితులకు వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.695.15 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఆర్థిక సాయాన్ని కూడా అందించింది. నాలుగేళ్లలో 40 లక్షల మందికి ఉచిత వైద్యం కేవలం హృద్రోగ చికిత్సలే కాకుండా పలు రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంది. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ మేలు చేకూరుతోంది. పొరుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందుతోంది. వైద్యం పొందిన అనంతరం చిరునవ్వుతో ఇంటికి తిరిగొస్తున్నారు. గత సర్కారు హయాంలో పేదలకు ఏదైనా పెద్ద జబ్బు చేస్తే తల తాకట్టు పెట్టడం మినహా గత్యంతరం లేని దుస్థితి. దేవుడిపై భారం వేసి రోజులు లెక్కపెట్టుకోవాల్సిన దయనీయ పరిస్థితులు నాడు నెలకొన్నాయి. ఈ అవస్థలకు తెరదించుతూ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లను 3,257కి పెంచి ఉచిత వైద్య సేవలను సీఎం జగన్ అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీకి గత సర్కారు బకాయిపెట్టిన రూ.630 కోట్లను చెల్లించడంతోపాటు ప్రభుత్వ వైద్య రంగాన్ని అన్ని సదుపాయాలతో బలోపేతం చేశారు. దీంతో సగటున రోజుకు 3,300 మంది నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కోసం గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఏకంగా రూ.9,025 కోట్లు ఖర్చు చేయగా దాదాపు 40 లక్షల మంది వైద్య సేవలు పొందారు. రూపాయి ఖర్చు లేకుండా బైపాస్ రక్త నాళాలు దెబ్బతినడంతో బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. నిరుపేద కుటుంబం కావడంతో నాకు అంత స్థోమత లేదు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా సర్జరీ చేశారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా. ప్రభుత్వం చేసిన మేలు ఈ జన్మలో మరువలేను. – దొంతాల రాఘవయ్య, మామడూరు, నెల్లూరు జిల్లా ఆపద్బాంధవిలా ఆదుకుంది గుండె రక్తనాళాలు దెబ్బ తినడంతో బైపాస్ సర్జరీ చేయాలని వైద్యులు నిర్థారించారు. ఆ సమయంలో ఆరోగ్యశ్రీ ఆపద్బాంధవిలా ఆదుకుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గత నెల 26న సర్జరీ జరిగింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యా. కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. సీఎం జగన్ ప్రభుత్వం చేసిన మేలును ఈ జన్మకు మరువలేను. – కొరివి కిశోర్, గుంటూరు పెద్ద జబ్బులకు సైతం.. గుండె, కాలేయం, కిడ్నీ, క్యాన్సర్ సంబంధిత పెద్ద జబ్బులకు సైతం చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో ఉన్నాయి. ప్రొసీజర్ల సంఖ్య భారీగా పెరిగాయి. వైద్యం కోసం ప్రజలు ఆర్థికంగా చితికిపోకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. – హరేంధిరప్రసాద్, సీఈవో, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ద్వారా హృద్రోగ చికిత్సలు ఇలా సంవత్సరం రోగులు ప్రొసీజర్లు వ్యయం రూ.కోట్లలో 2019–2020 23,797 24,027 79.69 2020–2021 24,243 24,599 77.06 2021–2022 36,725 37,646 116.09 2022–2023 65,813 85,558 301.82 2023–2024 21,251 32,208 120.49 (ఇప్పటి వరకూ) మొత్తం 1,71,829 2,04,038 695.15 అన్నదాతకు ప్రాణదాత వ్యవసాయదారుడైన చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన కృష్ణారెడ్డి హృద్రోగం బారిన పడటంతో ఆ కుటుంబానికి గుండె ఆగినంత పనైంది! గుండె మార్పిడి శస్త్ర చికిత్స ఖర్చును భరించే స్థోమత లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్ చేస్తారని స్థానిక ఏఎన్ఎం చెప్పడంతో 2021 ఏప్రిల్‌లో బెంగళూరులోని నెట్వర్క్ ఆస్పత్రిని సంప్రదించారు. మైసూర్లో బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి గుండెను కృష్ణారెడ్డికి అమర్చి ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.11 లక్షలు చెల్లించి ఆ కుటుంబ పెద్దకు రాష్ట్ర ప్రభుత్వం పునర్జన్మ ప్రసాదించింది. ‘నేను ఇవాళ ప్రాణాలతో ఉన్నానంటే ఆరోగ్యశ్రీనే కారణం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద డబ్బులు కూడా అందచేశారు’ అని కృష్ణారెడ్డి చేతులు జోడించి చెబుతున్నారు. -
డయాబెటిస్ ఉన్నవాళ్లు గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
-
Hyd: చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు కోసం రోటరీ క్లబ్.. మోటార్ ఫెస్ట్..
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ రోటరీ క్లబ్ గొప్ప కార్యం తలపెట్టింది. హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించే దిశగా ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇండియన్ నేషనల్ ఆటోక్రాస్ చాంపియన్‌షిప్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను హైదరాబాద్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో గోల్ఫ్‌కోర్స్ ట్రాక్ ఏర్పాటుకు వినియోగించనుంది. అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారుల ఆపరేషన్ నిమిత్తం థియేటర్ నిర్మాణానికి ఉపయోగించనుంది. సిద్ధిపేట పట్టణంలోని సత్య సాయి ఆస్పత్రిలో ఈ మేరకు ఆపరేషన్ థియేటర్ నిర్మాణానికి వచ్చిన నిధులను ఖర్చు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ నిర్మాణానికి దాదాపు 7.5 కోట్ల భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా. కాగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరుగనున్న ఆటోక్రాష్ చాంపియన్‌షిప్‌లో టాప్ రేసర్లు పాల్గొననున్నారు. జూన్ 2-4 వరకు ఈ ఈవెంట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపే క్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్ రేసింగ్ ఈవెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు తరలివచ్చి రేసింగ్ ఈవెంట్‌ను ఆస్వాదించాలని కోరారు. చదవండి: ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు -
షూటింగ్లో పాల్గొనడం సంతోషం
‘‘ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ‘ఆర్య 3’ షూటింగ్ కోసం జైపూర్‌కు వచ్చాను. తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు నటి సుష్మితాసేన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన సుష్మితాసేన్కు ఓ మేజర్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి షూటింగ్స్‌కు కాస్త దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు కోలుకుని షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘ఆర్య’ వెబ్ సిరీస్‌లోని మూడో సీజన్ కోసం సుష్మితాసేన్ ప్రస్తుతం జైపూర్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. సుష్మితాసేన్ టైటిల్ రోల్ చేస్తున్న ‘ఆర్య 3’ వెబ్ సిరీస్‌కు రామ్‌మద్వానీ, సందీప్ మోది దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ రిలీజ్ డేట్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇక సుష్మితాసేన్ ‘తాలి’ అనే మరో వెబ్‌సిరీస్‌లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో తన పాత్ర డబ్బింగ్‌ని గత నెలలో పూర్తి చేశారామె. -
లక్షణాలు కనపడకుండానే గుండెజబ్బు రావచ్చా? కారణాలేంటి?
కార్డియోమయోపతీ అనేది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో చాలామందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించకపో వచ్చు. అందుకే చాలామందిలో ఇది ఆలస్యంగా బయటపడటం, కొందరిలో ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకోవడం కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ఇది వంశపారపర్యంగా కనిపించవచ్చు. గుర్తించడం, చికిత్స అందించడంలో ఆలస్యం జరిగితే ప్రమాదకరంగా కూడా మారవచ్చు. లక్షణాలు: ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ముదురుతూ పో వడం వల్ల మొదట్లో లక్షణాలు కనిపించవు. అటు తర్వాత కూడా క్రమక్రమంగా లక్షణాలు బయటపడుతుంటాయి. కానీ ఇంకొందరిలో మాత్రం సమస్య నిర్ధారణకు ముందునుంచే లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. ♦ శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, తరచూ శ్వాస అందక విపరీతమైన ఆయాసం వస్తుండటం ♦ విపరీతమైన అలసట, ♦ పొట్ట – చీలమండ వాపు, కొంతమందిలో కాళ్లవాపు ♦ అరుదుగా ఒక్కోసారి స్పృహ తప్పవచ్చు. రకాలు : కార్డియోమయోపతిలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి డయలేటెడ్ కార్డియోమయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వంశపారంపర్యంగా వచ్చే హైపర్ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. పైగా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతిలో గుండె కండరాలు, గోడలు మందంగా మారడమన్నది రోగులందరిలోనూ ఒకేలా ఉండదు. ఈ తరహా కేసులు మొత్తం కార్డియోమయోపతిలో నాలుగు శాతం వరకు ఉంటాయి. వంశపారంపర్యంగానే వచ్చే మరో రకమైన రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. ఈ తరహా కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి. కారణాలు: ♦ మద్యం అలవాటు ♦ వైరల్ ఇన్ఫెక్షన్లు ♦ నియంత్రణలో లేని అధిక రక్తపో టు (హైబీపీ), ♦గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు దీనికి కారణమవుతాయి. అయితే అనువంశీకంగా (వంశపారంపర్యంగా) కొన్ని కుటుంబాల్లో కనిపించే కార్డియోమయోపతికి మాత్రం జన్యువుల్లో మార్పు (మ్యుటేషన్)లే కారణం. అలాంటప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉన్నట్లయితే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స ఎలాగంటే... ♦కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కాకుండా... పరిస్థితి తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తారు. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. ♦ అధిక రక్తపో టు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. ♦ గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్ అమర్చుతారు. దాన్ని అమర్చడం ద్వారా గుండెస్పందనలు సజావుగా, లయబద్ధంగా జరిగేలా చూస్తారు. గుండెకొట్టుకోవడంలో ఇంకా ఏవైనా లోటుపాట్లు ప్రాణానికి ప్రమాదం తెచ్చేలా ఉంటే... వాటిని సరిచేసి ప్రాణాల్ని కాపాడటం కోసం ఐసీడీ పరికరాన్ని అమర్చుతారు. ♦ హైపో ట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతిలో... అది ఏ రకమైనప్పటికీ చికిత్సలో ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పేషెంట్ పరిస్థితి విషమించకుండా చూడటమే ప్రధానం. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల ,సీనియర్ కార్డియో థొరాసిక్ సర్జన్ -
రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగితే.. ప్రమాదం ఎక్కువే.. లక్షణాలేంటి? చికిత్స ఉందా?
సాధారణంగా ఇతర అవయవాలకు వచ్చే ఇన్ఫెక్షన్ తెలుసుగానీ... రక్తానికి వచ్చే ఇన్ఫెక్షన్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇక్కడ ఓ కీలకం దాగి ఉంది. మిగతా అవయవాలకు ఇన్ఫెక్షన్ సోకితే... మెల్లగా పాకుతూ అంత త్వరగా ప్రమాదం రాకపోవచ్చు. కానీ రక్తానికి ఇన్ఫెక్షన్ గనక సోకితే అది అన్ని అవయవాలకూ, కణాలకూ వెళ్తూ ఆహారాన్నీ, ఆక్సిజన్‌ను తీసుకెళ్తూ వెళ్తూ ఇన్ఫెక్షన్ను కూడా దేహమంతటికీ వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఇది కాస్త ప్రమాదకరమైన పరిస్థితి. రక్తానికి ఇన్ఫెక్షన్ కలిగించే ఈ కండిషన్‌ను 'సెప్టిసీమియా’ అని పిలుస్తారు. దీనిపై అవగాహన కోసం ఈ కథనం. మామూలుగా ఏదైనా భాగానికి ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ వస్తే దాన్ని వాడుకగా ‘సెప్టిక్’ అయిందని అంటారు. రక్తానికి ఇన్ఫెక్షన్ వచ్చి అది దేహాన్నంతటినీ విషపూరితం చేసే కండిషన్‌ను ‘సెప్సిస్’ లేదా ‘సెప్టిసీమియా’ అంటారు. దీని గురించి కొన్ని వివరాలివి... సెప్టిసీమియాకు కారణాలు బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ఏవైనా పరాన్నజీవులతో పాటు మరికొన్ని అంశాలు కూడా సెప్టిసీమియాకు దారితీయవచ్చు. చాలాకాలంగా ఆల్కహాల్‌కు తీసుకుంటూ ఉండటం, దీర్ఘకాలంగా అదుపులేకుండా డయాబెటిస్ బారిన పడటం, తగిన పోషకాహారం తీసుకోకపోవడం, కొన్ని రకాల మందుల్ని దీర్ఘకాలికంగా వాడటం, రోగనిరోధక వ్యవస్థను మందకొడిగా చేసే ఇమ్యునోసప్రెసెంట్స్ వాడుతుండటం, కొన్ని రకాల యాంటీబయాటిక్ మందులను విచక్షణరహితంగా వాడటం సెప్టిసీమియాకు దారితీయవచ్చు. కొన్ని ఇన్ఫెక్షన్లలో సెస్టిసీమియా ముప్పు మరీ ఎక్కువ... ♦ గుండెజబ్బులు వచ్చి చికిత్స పొందని సందర్భాల్లో ♦ ఊపిరితిత్తుల జబ్బులు వచ్చిన వాళ్లలో దాదాపు సగం మందిలో కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ప్రధానంగా నిమోనియా వచ్చినప్పుడు ఇది మరీ ఎక్కువ. ♦ ఏదైనా కారణంతో పొట్ట (అబ్డామిన్)లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాదాపు మూడోవంతు కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ♦ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిన సందర్భాల్లో దాదాపు 11 శాతం కేసుల్లో అది సెప్టిసీమియాకు దారితీయవచ్చు. ముఖ్యంగా పైలోనెఫ్రైటిస్ అనే కిడ్నీ వ్యాధి వచ్చిన వారిలో లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వారిలో అది సెప్టిసీమియా ముప్పు తెచ్చిపెట్టవచ్చు. ♦ మెదడు తాలూకు ఇన్ఫెక్షన్స్ కూడా సెప్టిసీమియాగా మారవచ్చు. ♦ ఎముకలు, కీళ్లకు ఇన్ఫెక్షన్ సోకితే చాలా కొద్దిమందిలో (2% మందిలో) అది సెప్టిసీమియాగా మారే అవకాశముంది. నిర్ధారణ పరీక్షలు రక్త పరీక్ష, మూత్రపరీక్షలతో పాటు ఎక్స్–రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్ వంటి రేడియాలజికల్ పరీక్షలతో సెప్టిసీమియా ఉనికి, తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ పరీక్షల ఆధారంగా తర్వాత చేయాల్సిన చికిత్సనూ నిర్ణయిస్తారు. నివారణ బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వంటి సూక్ష్మజీవుల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవడం ద్వారా చాలావరకు సెప్టిసీమియా నుంచి రక్షించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం, తాగేనీరు, పీల్చే గాలి కూడా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. అలాగే మరికొన్ని అంశాలూ సెప్సిస్ నుంచి కాపాడతాయి. అవి... ♦ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ♦ నీటిని కాచి, చల్లార్చి లేదా ఫిల్టర్ అయిన నీటినే తాగాలి. ♦ వంటకాల్ని వేడివేడిగా ఉండగానే తినేయాలి. బయటి ఫుడ్‌కు (వీలైనంతవరకు) దూరంగా ఉండాలి. ♦ కూరగాయలను, ఆకుకూరలను శుభ్రంగా కడిగాకే వంటకు ఉపక్రమించాలి. తొక్క ఒలిచి తినే పండ్లు మినహా మిగతా వాటిని కడిగే తినాలి. ♦ తినడానికి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ♦ మల, మూత్ర విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. ♦ గాయాలను, పుండ్లను నేరుగా చేతితో ముట్టుకోకూడదు. వాటిని ముట్టుకోవాల్సి వస్తే చేతులకు గ్లౌవ్స్ వేసుకోని, సేవలందించాలి. ♦తుమ్ముతూ, దగ్గుతూ ఉండేవారి నుంచి, ముక్కు నుంచి స్రావాలు వస్తున్నవారి నుంచి, జ్వరంతో బాధపడుతున్నవారి నుంచి దూరంగా ఉండాలి. వాళ్లతో మాట్లాడాల్సి వస్తే ఫేస్‌మాస్క్ ధరించాలి. ♦ చెప్పులు, బూట్లు వంటి పాదరక్షల్ని బయటే విడవాలి. ♦ పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦ డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. డాక్టర్ల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. లక్షణాలు ♦ చలితో వచ్చే జ్వరం ( ఫీవర్ విత్ చిల్స్) ♦ ఊపిరి అందకపోవడం (బ్రెత్‌లెస్‌నెస్) ♦ గుండె వేగంగా కొట్టుకోవడం (ర్యాపిడ్ హార్ట్‌బీట్) ♦ అయోమయం / మూర్ఛ (ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ / సీజర్స్) ♦ మూత్రం పరిమాణం బాగా తగ్గడం ♦ దేహంలోని చాలా చోట్ల నుంచి రక్తస్రావం ♦ పొట్టలో నొప్పి / వాంతులు / నీళ్ల విరేచనాలు ♦ కామెర్లు (జాండీస్). చికిత్స సెప్టిసీమియా రోగులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స చేయాల్సి ఉంటుంది. చికిత్సలో భాగంగా డాక్టర్లు ఈ కింది ప్రొసీజర్స్ చేస్తారు. ♦ రక్తనాళం ద్వారా ద్రవపదార్థాలు అందజేయడం (ఇంట్రావీనస్ ఫ్లుయిడ్స్) ♦రక్తనాళం ద్వారా యాంటీబయాటిక్స్ (ఇంట్రావీనస్ యాంటీబయాటిక్స్) ♦ రక్తపోటు అకస్మాత్తుగా పెరగడాన్ని నివారించే మందులతో సపోర్ట్ ♦ ఆక్సిజెన్ తీసుకోలేకపోతున్న రోగికి కృత్రిమ శ్వాస ఇవ్వడం, వెంటిలేటర్‌తో శ్వాస అందించడం ♦ కిడ్నీ రోగుల్లో డయాలసిస్ ♦ అవసరమైన సందర్భాల్లో రక్తమార్పిడి లేదా రక్తంలోని కొన్ని అంశాలు తగ్గితే కోల్పోయిన వాటిని తిరిగి భర్తీ చేయడం (బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ లేదా బ్లడ్ ప్రోడక్ట్స్‌ను ఎక్కించడం) ♦ పేషెంట్‌కు ఇవ్వాల్సిన ఆహారాన్ని కూడా రక్తనాళం ద్వారానే అందిస్తారు. (ఇంట్రావీనస్ న్యూట్రిషనల్ సపోర్ట్). - డాక్టర్ ఆరతి బెల్లారి ,సీనియర్ ఫిజీషియన్ -
ఆరోగ్యశ్రీ, మహేశ్‌బాబు ఫౌండేషన్ల సహకారంతో.. చిన్నారులకు పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడ తూర్పు): గుండె జబ్బులతో బాధపడుతున్న 20 మంది చిన్నారులకు పునర్జన్మ లభించింది. ఆంధ్ర హాస్పిటల్లో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, మహేశ్‌బాబు, వసుధ, మదర్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ల సహకారంలో బ్రిటన్‌కు చెందిన వైద్యుల బృందం ఉచితంగా వారికి శస్త్రచికిత్సలు నిర్వహించింది. దీనికి సంబంధించిన వివరాలను ఆంధ్ర హాస్పిటల్ చిల్డ్రన్స్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకట రామారావు గురువారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. బ్రిటన్ వైద్యులు డాక్టర్ మహ్మద్ నిస్సార్, డాక్టర్ రమేశ్‌కుమార్, బ్రోచు, చెల్సీ, రాచెల్, ఆయులీష్‌తో పాటు ఆంధ్రా హాస్పిటల్ వైద్యులు దిలీప్, కె.విక్రమ్‌లు.. ఐదు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 20 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేశారని చెప్పారు. ఇప్పటివరకు తమ హాస్పిటల్లో 3 వేల మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు చేసినట్లు చెప్పారు. బ్రిటన్‌కు చెందిన హీలింగ్ లిటిల్‌హార్ట్స్, యూకే చారిటీస్ సౌజన్యంతో ఇప్పటివరకు 25 సార్లు శిబిరాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో బ్రిటన్ వైద్యుల బృందం, ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు జె.శ్రీమన్నారాయణ, డాక్టర్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. -
Health: క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు... మామోగ్రామ్‌తో..
Health Tips- Mammogram- Heart Disease: నలభై ఏళ్లు దాటాక మహిళలకు రొమ్ముక్యాన్సర్ ముప్పును ముందే తెలుసుకునేందుకు మామోగ్రామ్ చేయించుకొమ్మని డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. కుటుంబ ఆరోగ్య చరిత్రను బట్టి రిస్క్ ఉన్న చాలామంది ఇటీవల డాక్టర్ల సిఫార్సుతో ఏడాదికో లేదా రెండేళ్లకో ఈ పరీక్ష చేయించుకోవడం పరిపాటి అయ్యింది. ఇక కొద్దిరోజుల్లోనే మామోగ్రామ్ చేయించుకుంటే రొమ్ముక్యాన్సర్ ముప్పుతో పాటు... గుండెజబ్బుల ముప్పు అందునా ప్రత్యేకంగా గుండెకు రక్తం చేరవేసే రక్తనాళాలు బిరుసుగా మారే అథెరో స్క్లిరోసిస్ కార్డియో వాస్క్యులార్ డిసీజ్ గురించి కూడా తెలిసిపోయే అవకాశం రానుంది. ఫలితంగా కేవలం ఒకే పరీక్షతో రెండు మూడు రకాల సమస్యల గుట్టుమట్లు తెలిసిపోనున్నాయి. ఆ వివరాలివి... మన దేశంలో ప్రతి వేయి మంది మహిళల్లో ఇద్దరికి క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. అయితే ప్రతి వందమందిలో 11 మందికి రొమ్ముల్లోని రక్తనాళాలు సైతం గట్టిగా బిరుసుబారిపోయి బ్రెస్ట్ ఆర్టీరియల్ క్యాల్సిఫికేషన్ జరిగే అవకాశముంది. అలాగే రొమ్ముల్లోని రక్తనాళాలతో పాటు ఇతర రక్తనాళాల్లోనూ క్యాల్షియమ్ చేరడంవల్ల, అవి ఫ్లెక్సిబుల్‌గా కాకుండా గట్టిగా, బిరుసుగా మారే అవకాశాలుంటాయి. ఇలా జరగడం వల్ల ‘కార్డియో వాస్క్యులార్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుండెకు రక్తాన్ని చేరవేసే కరోనరీ ఆర్టరీల్లో ఈ పరిణామం చోటు చేసుకుంటే అవి బిరుసెక్కిపోయి గుండెకు సరిగా రక్తం అందనందున ‘గుండెపోటు’ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇలా రక్తనాళాలు బిరుసుబారడాన్ని ‘అథెరోస్లి్కరోటిక్ కార్డియో వాస్కులార్ డిసీజ్’ అని కూడా అంటారు. రెండు జబ్బుల గురించి తెలిసేది ఇందుకే/ఇలాగే... మామోగ్రామ్‌తో రొమ్ముక్యాన్సర్ ఎలాగూ తెలుస్తుంది. దాంతోపాటు గుండెజబ్బుల ముప్పు ఎలా తెలుస్తుందో తెలియాలంటే రక్తనాళాల గురించి కాస్త అవగాహన అవసరం. రక్తనాళం ఎటుపడితే అటు ఒంగిపోయేలా చాలా మృదువుగా, సరళంగా ఉంటుంది. రక్తప్రవాహానికి వీలుగా రక్తనాళం అలలు అలలుగా కదులుతుంటుంది. మణికట్టు దగ్గర నాడి పట్టుకుని చూసినప్పుడు తెలిసే విషయం నిజానికి అలలు అలలుగా కదిలే రక్తనాళమే. దీన్నే ‘పల్స్’గా మనం చెప్పుకుంటాం. రక్తనాళం ఇలా మృదువుగా ఉండితీరాలి. అప్పుడే రక్తప్రవాహంలోని ఒడిదుడుకులకు తట్టుకోవడం, ఒక్కోసారి రక్తప్రవాహ వేగం పెరిగినా చాలావరకు తట్టుకోవడం జరుగుతుంది. ఈ రక్తనాళం మూడు పొరలతో నిర్మితమై ఉంటుంది. రక్తం ప్రవహించే లోపలి పొరను ‘ఇంటిమా’ అనీ, మధ్యపొరను ‘మీడియా’ అనీ, బయటి పొరను ‘అడ్వంటీషియా’ అని అంటారు. రక్తం ప్రవహించే సమయంలో జరిగే ప్రమాదాల వల్ల అప్పుడప్పుడూ ‘ఇంటిమా’ దెబ్బతింటుంది. కానీ మన శరీరంలో ఏ భాగమైనా దెబ్బతింటే దాన్ని రిపేరు చేసుకునే శక్తి దేహానికి ఉంటుంది. ఈ క్రమంలో ఇలా రిపేర్ జరిగే సమయంలో ఒకవేళ ఇంటిమాలోని దెబ్బతిన్న భాగం కొవ్వులతో (లైపిడ్స్తో) రిపేర్ అయితే అక్కడ క్రమంగా కొవ్వు పాచిలా పేరుకుపోయి, ఉండలాగా మారి రక్తప్రవాహానికి అడ్డుపడవచ్చు. ఒకవేళ పీచు కణాలతో రిపేర్ జరిగితే, అక్కడ సన్నబారి పోవచ్చు. ఇలా సన్నబడిపోవడాన్ని ‘స్టెనోసిస్’ అంటారు. ఒకవేళ రిపేర్ సమయంలో ఆ భాగంలో క్యాల్షియమ్ పేరుకుపోతే... మృదువుగా ఉండాల్సిన రక్తనాళం గట్టిగా బిరుసెక్కి ఎటూ వంగని గట్టి పైప్‌లా మారుతుంది. వీటిల్లో ఏది జరిగినా రక్తప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అలా వచ్చే రక్తనాళాల సమస్యనే అథెరోస్కి›్లరోసిన్ అంటారు. ఒకవేళ ఇవి గుండెకు రక్తాన్ని అందించే కరొనరీ ఆర్టరీలో జరిగితే... గుండెకండరానికి పోషకాలు, ఆక్సిజన్ అందక గుండెపోటు వస్తుంది. మామోగ్రామ్తోనే గుండె, రక్తనాళాల పరీక్షలిలా... మామోగ్రామ్ సహాయంతో రొమ్ములోని రక్తనాళాల్లో క్యాల్షియమ్ చేరడాన్ని (బ్రెస్ట్ ఆర్టీరియల్ క్యాల్సిఫికేషన్) కూడా గుర్తించవచ్చు. నిజానికి... రొమ్ము కండరాల్లోని రక్తనాళాలతో పాటు గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో జరిగే క్యాల్సిఫికేషన్ను అంచనా వేసేందుకు అవకాశముందా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరిగాయి. దానివల్ల రేడియేషన్‌కు గురికాకుండా ఉండటంతో పాటు, కేవలం ఒక పరీక్షకు అయ్యే ఖర్చుతోనే రెండుమూడు అంశాలను తెలుసుకునే అవకాశం ఉందంటూ వైద్యశాస్త్రవేత్తలు, అధ్యయనవేత్తలు ఈ ప్రయత్నాలు చేశారు. మామోగ్రామ్ నిర్వహించినప్పుడు ఆ పరీక్ష తాలూకు స్కోర్స్తోనే... రాబోయే ముప్పు ఏదీ లేదు అనీ, హానికరం కాని గడ్డలు రావచ్చనీ, క్యాన్సర్ ముప్పు ఉందనీ.. ఇలా అంచనా వేస్తుంటారు. అయితే అదే పరీక్షతో వచ్చే క్యాల్షియం స్కోర్ ఆధారంగా కొన్ని దేశాల్లో గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లోని క్యాల్సిఫికేషన్ను సైతం తెలుసు కున్నారు. రక్తనాళాలు గట్టిబారడం వల్ల వచ్చే కార్డియోవాస్క్యులార్ డిసీజ్, అథెరో స్క్లిరోటిక్ కార్డియోవాస్క్యులార్ డిసీజ్‌తో పాటు గుండెపోటుకు గల అవకాశాలనూ లెక్కగట్టారు. ఈ లెక్కల ద్వారా ఇప్పటికే స్వీడన్లో ఒక్క మామోగ్రామ్ పరీక్షతోనే ఇటు రొమ్ముక్యాన్సర్ ముప్పునూ, అటు కార్డియో వాస్క్యులార్ జబ్బు / గుండెపోటు ముప్పునూ తెలుసుకోగలుగుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యక్తులూ, మరెన్నో దేశాల ప్రజల్లో అందరికీ సరిపోయేలాంటి ప్రామాణికత ఇంకా సాధించనందున ఈ పరీక్షలు అన్ని దేశాల్లోనూ జరగడం లేదు. కానీ ప్రామాణికతలు రూపొందించడం కోసం విరివిగా ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఇవి నేడో, రేపో సాకారం కానున్నాయి కూడా. ఇదే జరిగితే... కేవలం మరికొద్ది రోజుల్లోనే మన దేశంలోనూ కేవలం మామోగ్రామ్ అనే ఒక్క పరీక్షతోనే రొమ్ముక్యాన్సర్ ముప్పులూ, రక్తనాళాల ఆరోగ్య పరిస్థితి, గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల ఆరోగ్యం, గుండెపోటుకు గల రిస్క్... ఇవన్నీ తెలిసిపోనున్నాయి. రక్తనాళం ఆరోగ్యాన్ని తెలుసుకునే పరీక్షలివి... కెరోటిడ్ డాప్లర్ అనే పరీక్షతో దేహంలోని రక్తనాళాల పరిస్థితిని, ఇంటిమా తాలూకు ఆరోగ్యాన్ని పరోక్షంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. మూత్రపిండాల వంటి అతి సున్నితమైన, దేహంలో చాలా లోపలికి ఉండే కీలక అవయవాల రక్తనాళాల కండిషన్‌ను నేరుగా తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. అందుకే మెడకు ఇరువైపులా ఉండే ‘కెరోటిడ్’ రక్తనాళాలను పరీక్షించడం ద్వారా లోపలి కీలక అవయవాల్లోని రక్తనాళాల ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు. అలాగే ఇక గుండెకు రక్తాన్ని అందించే నాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు యాంజియోగ్రామ్... ఇందులోనూ రేడియేషన్ వల్ల తెలుసుకునే సీటీ యాంజియో వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అటు కెరోటిడ్ డాప్లర్గానీ లేదా సీటీ యాంజియో వంటి పరీక్షలను తరచూ చేయించడానికి అంతగా అవకాశం ఉండదు. కానీ మహిళల విషయానికి వస్తే వారిలో మామోగ్రామ్ పరీక్ష మాత్రం తరచూ చేయించుకునేందుకు వారికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌కూ, గుండెజబ్బులకూ ఒకేలాంటి రిస్క్ ఫ్యాక్టర్లు... కొన్ని ఒకేలాంటి రిస్క్‌ఫ్యాక్టర్లు ఇటు క్యాన్సర్‌కూ, అటు గుండెజబ్బులకూ కారణమవుతాయి. ఉదా: పెరిగే వయసు, స్థూలకాయం, హైబీపీ, అదుపులో లేని డయాబెటిస్ లాంటివి... ఇటు క్యాన్సర్‌నూ, అటు గుండెజబ్బులనూ తెచ్చిపెట్టవచ్చు. పెరిగే వయసు లాంటి మన ప్రమేయం లేని వాటిని మినహాయించి, మిగతా అంశాలను నివారించడం లేదా అదుపులో పెట్టుకోవడం వల్ల క్యాన్సర్‌నూ, గుండెపోటునూ, రక్తనాళాల సమస్యలనూ నివారించుకోవచ్చు. మిగతా సమస్యలెలా ఉన్నా రెండో దశ దాటిపోతే క్యాన్సర్ ప్రాణాంతకంగా మారే అవకాశముంది. ఒకవేళ అది రొమ్ముక్యాన్సర్ అయితే దాన్ని మొదటి లేదా రెండో దశలో తెలుసుకుంటే దాన్ని సమూలంగా నయం చేసుకునే వైద్యపరిజ్ఞానం ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. అందుకే కుటుంబంలో రొమ్ముక్యాన్సర్ చరిత్ర ఉండటం, అందునా తల్లి లేదా తల్లిగారి అక్కచెల్లెళ్లలో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం, బీఆర్సీఏ వంటి జన్యుపరీక్షల్లో క్యాన్సర్ ముప్పు ఉన్నట్లు తేలడం వంటివి జరిగితే... నిర్దిష్ట సమయాల్లో మామోగ్రామ్ పరీక్ష చేయించుకొమ్మంటూ డాక్టర్లు ఇచ్చే సలహా మేరకు మహిళలు తరచూ ఆ పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. -డాక్టర్ సురేశ్ ఏవీఎస్, సీనియర్ మెడికల్ , ఆంకాలజిస్ట్ చదవండి: What Is Varicose Veins: పిక్క భాగంలో రక్తనాళాలు ఉబ్బి నీలం, ఎరుపు రంగులో కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేస్తే దుర్వాసన లేకుండా బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోండిలా! లేదంటే అతిథులు యాక్ అంటూ పారిపోతారు మరి.. -
భారతీయుల్లో స్వతహాగా గుండెజబ్బులు ఎక్కువే : వైద్యులు
-
మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్.. 4 రోజులు తిరక్కముందే
కాకినాడ సిటీ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి అభ్యర్థించి 4 రోజులు తిరక్కముందే ఆర్థిక సహాయం మంజూరు కావడంతో ఆ పేద దంపతుల ఆనందానికి అవధుల్లేవు. కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన చీమల సునీత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. గుండెలో రంధ్రం ఉండటంతో జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి. సునీత భర్త కూలి పనులు చేస్తుంటారు. మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితి. చదవండి: మురిసిన మానవత్వం గత నెల 29న కాపు నేస్తం కార్యక్రమానికి వచ్చిన సీఎంను ఈ పేద దంపతులు కలిసి తమ పరిస్థితిని వివరించారు. వారి పరిస్థితి అర్థం చేసుకున్న సీఎం వైఎస్ జగన్ చలించిపోయారు. వెంటనే వారిని ఆదుకునే బాధ్యతను కలెక్టరు కృతికా శుక్లాకు అప్పగించారు. మరుసటి రోజే కలెక్టర్ కృతికా శుక్లా ఆ దంపతులను తన వద్దకు పిలిపించుకున్నారు. సాయం అందాక కలెక్టర్ కృతికా శుక్లాను కలసి కృతజ్ఞతలు తెలుపుతున్న సునీత కుటుంబం వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రూ.10 వేలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. దీంతో భార్యాభర్తలిద్దరు తమ ఇద్దరు పిల్లలతో కలిసి మంగళవారం సాయంత్రం కలెక్టర్ కృతికా శుక్లాను కలిశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. -
సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్
లక్డీకాపూల్: సంచలనం సృష్టించిన నల్లగొండ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ బారీ గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. గుండె నొప్పి రావడంతో ఆయనను గత నెల 22వ తేదీన నల్లగొండ జైలు అధికారులు చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ సాయి సతీష్ అతని ఆరోగ్య పరిస్థితిని విచారించిన నేపథ్యంలో మూడు వాల్వులు బ్లాక్ అయినట్టు గుర్తించారు. దీంతో ఆయనను నిమ్స్‌లోని కార్డియోథొరాసిక్ విభాగానికి తరలించారు. ప్రస్తుతం అబ్దుల్ బారీకి సీటీ సర్జన్ డాక్టర్ అమరేష్‌రావు మాలెంపాటి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. గుండెకు సంబంధించి మూడు వాల్వులు బ్లాక్ అయినట్టు గుర్తించారు. అతనికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందన్నారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన బైపాస్ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. (చదవండి: మహిళ పట్ల అసభ్య ప్రవర్తన) -
తొలి క్యాథ్‌ల్యాబ్ ఖమ్మంలో..
సాక్షి, హైదరాబాద్: గుండె జబ్బులకు చికిత్స అందించే అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్ సౌకర్యం మొదటిసారిగా జిల్లాల్లో ఏర్పాటు కానుంది. శుక్రవారం ఖమ్మంలో క్యాథ్‌ల్యాబ్‌ను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో నెలకొల్పనున్న తొలి క్యాథ్‌ల్యాబ్ ఇదే. త్వరలో సిద్దిపేట, మహబూబ్‌నగర్ బోధనాసుపత్రులకు రానుంది. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్, గాంధీల్లోనే ఈ సేవలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది సిద్దిపేటలో, 2024లో మహబూబ్‌నగర్ బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కోదానికి రూ.7 కోట్లు ఖర్చు కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తాజాగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి నివేదించింది. క్యాథ్‌ల్యాబ్‌ల్లో గుండె జబ్బుల పరీక్షలు, చికిత్సకు సంబంధించిన అత్యాధునిక సౌకర్యాలుంటాయి. -
Health Tips: పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటున్నారా.. అయితే..
పొన్నగంటి కూర మంచి పోషక విలువలు గలిగినది. ఇది అతి సులభంగా, అతి తొందరగా పెరిగే ఆకు కూర. దీనికి విత్తనాలు వుండవు. ఇది కేవలం కాండం ద్వారానే అభివృద్ధి చెందుతుంది. పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి. ►పోషక విలువలు... పొన్నగంటి కూరలో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ లకు మంచి మూలం. ►ఇంకా విటమిన్ ‘ఎ’, ‘బి6’, ’సి’, ఫొలేట్, రిబోఫ్లావిన్’, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా లభిస్తాయి. ►జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్ పొన్నగంటి కూరలో పుష్కలంగా ఉంటుంది. ►పురాతన గ్రంథాలు, ఆయుర్వేద వైద్యనిపుణులు చెప్పిన దాని ప్రకారం పొన్నగంటి కూరను నలభై ఎనిమిది రోజులపాటు తింటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. చర్మకాంతి పెరుగుతుంది. ►పొన్నగంటి కూరను ఉడికించి, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని, అదే కందిపప్పు, నెయ్యితో కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారనీ ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ►శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును కట్ చేసి.. పెసరపప్పు, చిన్న ఉల్లి పాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే రక్త శుద్ధి జరుగుతుంది. ►ఎక్కువ ఎండల్లో తిరిగి పనిచేసే వారికి, గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు వస్తాయి. కంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటి సమస్యలు ఎదురైతే.. పొన్నగంటి ఆకుతో తాలింపు చేసుకుని తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. ►ఇంకా ఈ ఆకుకూర నోటి దుర్వాసనను పోగొడుతుంది. ►గుండెకు, మెదడుకు బలాన్నిస్తుంది. ►ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. ►దీనిలో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ►గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. చదవండి: Sankranti Special Recipes: నోరూరించే అరిశెలు.. కరకరలాడే సకినాలు.. నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్.. కాబట్టి Radish Health Benefits: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే.. -
Gongura: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు గోంగూరను తిన్నారంటే...
Health Benefits Of Gongura Leaves: ఆంధ్రమాతగా... శాకంబరీ వర ప్రసాదంగా పేరొందిన గోంగూరను తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే గోంగూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. గోంగూరలోని పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది. వారానికి ఒక్కసారైనా గోంగూరతో పప్పు లేదా పచ్చడి చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తరచూ గోంగూరను తినడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... ►గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. ►రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, చక్కెర శాతాన్ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ►గోంగూరలో విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9 తో పాటు సి విటమిన్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్ ఎ వల్ల కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ►బీకాంప్లెక్స్, సి విటమిన్లతో దంత సమస్యలు దూరంగా ఉంటాయి. దీనిలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముకలు పటిష్టంగా ఉంటాయి. చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..! ►అలాగే ఫోలిక్ యాసిడ్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులను నివారించడానికి గోంగూర ఉపయోగ పడుతుంది. ►దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు ఏదో ఒక రూపంలో గోంగూరను తీసుకుంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది. ►రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూరను తీసుకోవాలి. అలాగే గోగుపూలను దంచి రసాన్ని తీసుకుని వడపోసి తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ►కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల అలెర్జీలు వస్తుంటాయి. అటువంటి వాటిలో గోంగూర కూడా ఒకటి. కాబట్టి శరీరానికి సరిపడని వారు మినహా మిగిలిన అందరూ నిరభ్యంతరంగా గోంగూరను తీసుకోవచ్చు. చదవండి: Health Tips: జీలకర్రను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగుతున్నారా.. అయితే -
రోజూ కనీసం ఒక ఆపిల్ తినాలా.. మరి ఆ పేషంట్ల సంగతేంటి?!
Benefits Of Eating Apple: పోషకాహారాన్ని తీసుకోవడం ద్వారా మధుమేహం, మానసిక, గుండె సమస్యలను నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదని ఎన్నాళ్లుగానో వింటున్నాం. పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజలవణాలు ఆపిల్స్‌లో పుష్కలంగా ఉండడం వల్లే ఈ మాట వాడుకలో ఉంది. ►గుండె సంబంధిత సమస్యల ముప్పుని తగ్గించుకోవాలంటే రోజూ కనీసం ఒక ఆపిల్ తినాలి. దీనిలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. ►అంతేగాక రక్తపీడనాన్ని అదుపులో ఉంచడానికి తోడ్పడి హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఆపిల్ నివారిస్తుంది. ►మధుమేహం ఉన్నవారు ఏ పండ్లు తినాలి? ఏవి తినకూడదు అని తర్జనభర్జన పడుతుంటారు. ఇటువంటి వారు ఆపిల్స్‌ను నిరభ్యంతరంగా తినవచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ►మధుమేహం ఉన్నవాళ్లు ఆపిల్ తినడం వల్ల టైప్–2 డయాబెటీస్ ఏడు శాతం తగ్గుతుంది. ►ఆపిల్ తినడం వల్ల మానసిక సమస్యలు దరిచేరవు. ఆపిల్‌లో ఉన్న క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మానసిక సమస్యలు రానివ్వదు. ►అందుకే రోజూ ఆపిల్స్ తినేవాళ్లలో ఆల్జీమర్స్, డిమెన్షియా(మతిమరుపు) వచ్చే అవకాశాలు తక్కువ. -
పారాలింపిక్స్ కాంస్య పతక విజేతకు ఛాతీ నొప్పి
Paralympic Bronze Medallist Sharad Kumar Diagnosed With Heart Swelling: ఇటీవల ముగిసిన టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల హై జంప్‌లో కాంస్య పతకం సాధించిన శరద్ కుమార్‌కు ఛాతీలో నొప్పి రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించే క్రమంలో అతను గుండె వాపు సమస్యతో బాధ పడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని శరద్ కుమార్ స్వయంగా మీడియాకు వెల్లడించాడు. కాగా, పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఇటీవలే శరద్ కుమార్ పేరును ఈ ఏడాది మేజర్ ధాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సిపార్సు చేసింది. శరద్‌తో పాటు టోక్యో పారాలింపిక్స్ పతక విజేతలు ప్రమోద్ భగత్(బ్యాడ్మింటన్), మనీశ్ నర్వాల్(షూటింగ్), సుందర్ సింగ్ గుర్జార్(జావెలిన్ త్రో)ల పేర్లను కూడా పీసీఐ ఖేల్‌రత్న అవార్డులకు రెకమెండ్ చేసింది. చదవండి: ఆర్నెళ్ల క్రితమే 'ఆ' సలహా ఇచ్చాడు.. అయినా పట్టించుకోని కోహ్లి..! -
కోవిడ్ ఎప్పుడు అంతమవుతుందో తెలుసా? మరి ఇవి తెలుసుకోండి
కోవిడ్ పాండమిక్ వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇప్పటివరకు కోవిడ్ ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు అనే విషయం పూర్తిగా తెలియటం లేదు. అయితే ఈ కోవిడ్ అనేక కొత్త విపత్తులకు దారి తీయవచ్చనేది మాత్రం ప్రస్ఫుటం. ఇందులో ప్రమాదకరమైనవి డయాబెటిస్, గుండె జబ్బుల పెనుముప్పులు. ఇవి ఎందుకు రాబోతున్నాయి, వీటిని నివారించటం ఎలా అనే విషయాలపై అవగాహన కోసమే ఈ కథనం. డయాబెటిక్ ముప్పు పెరగడమెందుకు? ఇప్పటికే మన దేశాన్ని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారు. అంటే మధుమేహంలో ప్రపంచ రాజధాని అన్న (అప)కీర్తి మనదే. భారతదేశంలో 7.7 కోట్లకు పైగా డయాబెటిక్ రోగులు ఉన్నారని అంచనా. గణాంకాల ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అత్యధికమైన సంఖ్య. అంతేకాదు... ఇక్కడ సుమారు 50 శాతం మందికి షుగర్ జబ్బు ఉన్నప్పటికీ ఆ విషయం నిర్ధారణ కాకుండా ఉంటారని అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో ఇది సుమారు 60 శాతం కావచ్చు. కోవిడ్ వచ్చినవాళ్లల్లో అనేకమందికి హాస్పిటల్లో చేరిన సందర్భంలో షుగర్ బయటపడింది. అయితే వీళ్లకి కోవిడ్ వల్ల షుగర్ వచ్చిందా లేక డయాబెటిస్ ఉన్నా ఆ విషయం తెలియక కోవిడ్ వచ్చినప్పుడు బయట పడిందా అన్నది స్పష్టంగా తెలియలేదు. ఇంతకుముందు చాలా రకాల వైరల్ న్యుమోనియాలలో షుగర్ కొత్తగా రావడం డాక్టర్లకు తెలిసిన విషయమే. సార్స్ – 1 లో కూడా డయాబెటిస్ కొత్తగా రావటం గమనించారు. కోవిడ్ –19 లోనూ మధుమేహం కొత్తగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకుల అంచనా. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిగా సార్స్ సీవోవీ–2 వైరస్ శరీరంలో ప్రవేశించడానికి ఉపయోగించుకునే ఏసీఈ–2 రిసెప్టార్లు ప్యాంక్రియాస్లోనూ ఉంటాయి. కాబట్టి ఊపిరితిత్తులను పాడు చేసినట్లుగానే ఈ వైరస్ ప్యాంక్రియాస్‌ను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. కోవిడ్ –19 రావటం అనేది శరీరానికి ఒక స్ట్రెస్. ఇన్ఫెక్షన్తో కూడిన ఈ ఒత్తిడి వల్ల మధుమేహం రావడం అనేది ఇప్పటికే తెలిసిన అంశం. ఇవి మాత్రమే కాకుండా కోవిడ్ – 19 చికిత్సకోసం స్టెరాయిడ్స్ వాడటం కొన్నిసార్లు అవసరం. వాటితో రక్తంలో షుగరు పెరగవచ్చు. చాలామందికి స్టెరాయిడ్స్ ఆపేసిన తర్వాత షుగర్ నార్మల్‌కి వచ్చేస్తుంది. కొంతమందికి మాత్రం స్టెరాయిడ్స్ ఆపేశాక కూడా షుగర్ అధికంగానే ఉంటుంది. డయాబెటిస్ కి దోహదం చేస్తున్న కోవిడ్ ఇన్–అప్రాప్రియేట్ బిహేవియర్ మనం కరోనా నివారణకు కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ పాటించాలన్న విషయం తెలిసిందే. అంటే.. కోవిడ్ జాగ్రత్తలతో పాటు మంచి పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం లాంటివి కూడా కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్లోకి వస్తాయి. ఈ సందర్భంగా కొన్ని అనవసరమైన జాగ్రత్తలూ, మరికొన్ని అజాగ్రత్తల వల్ల షుగర్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ అవుతుంది. కోవిడ్ సాకుతో వ్యాయామం చేయటం పూర్తిగా ఆగిపోయింది. బలమైన ఆహారం తీసుకుంటే కోవిడ్ ని ఎదుర్కోవడానికి శరీరంలో మంచి శక్తి వస్తుందని చెప్పటంతో... కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవడం మొదలైంది. ఇలాంటి ఆహారంతో ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఏమేరకు ఉందో తెలియకపోయినా, బరువు పెరగటం జరుగుతోంది. దాంతో కోవిడ్ రిస్క్ తగ్గకపోగా ఊబకాయంతో వచ్చే రెండు అనర్థాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది కోవిడ్ –19 వల్ల కలిగే ప్రమాదపు అవకాశాలు పెరగడం, రెండోది బరువు పెరిగిన కారణంగా షుగర్ జబ్బుకి దగ్గరవడం. గుండెజబ్బుల పెనుముప్పు కోవిడ్ జబ్బుకి మన రెస్పాన్స్ వల్ల రాబోతున్న మరొక సమస్య గుండెజబ్బుల అనర్థం. గుండె జబ్బుల చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్లే వాళ్ల సంఖ్య కోవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో తక్కువగానే ఉన్నప్పటికీ, కేసులు తగ్గిపోయే సమయానికి గుండెజబ్బులతో ఆస్పత్రికి వెళ్లే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనికి అనేక కారణాలున్నాయి. మొదటిగా కోవిడ్‌లో షుగర్ పెరగటం, వ్యాయామం తగ్గడం, ఊబకాయం బాగా పెరిగిపోవడం... వంటి అంశాలన్నీ గుండె జబ్బులకి కూడా దోహదం చేస్తున్నాయి. మానసిక ఒత్తిడి పెరగటం కోవిడ్ పాండమిక్ వల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయాయి. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, దుకాణాలు మూత పడటం, శ్రమించినా ఉపాధి పొందే అవకాశాలు సన్నగిల్లడంతో ప్రజలు విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. ఆర్థికంగానూ, మానసికంగానూ, సామాజికంగానూ ఒక అభద్రతా భావం ప్రజల్లో నిండిపోయింది. ప్రతిరోజూ బంధువులను, తెలిసినవాళ్ళ లోనూ దుర్వార్తలు వినాల్సి రావటం, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల లోనూ భయోత్పాతాలు కలిగించే వార్తలు ఎక్కువగా వెలువడటంతోనూ భవిష్యత్తు పట్ల ఒక తెలియని భయం నెలకొంది. ఇక కోవిడ్ బారినపడి హాస్పటల్లో చేరాల్సి వచ్చిన వాళ్ల పరిస్థితి మరీ దయనీయం. భౌతిక దూరం సామాజిక దూరంగా మారిపోవడంతో ఒంటరితనం అందరినీ కలచివేసింది. చెక్ అప్లు తగ్గడం కోవిడ్ సందర్భంగా హాస్పిటల్ కి వెళ్లడానికి ప్రజల్లో విపరీతమైన భయం ఏర్పడింది. దాంతో క్రమం తప్పకుండా చేయించుకునే పరీక్షలు దాదాపు అందరూ వాయిదా వేశారు. దీనివల్ల చాలామందిలో బీపీ పెరిగిపోవడం, షుగర్ నియంత్రణలో లేకపోవడం సాధారణమైంది. దురలవాట్లు పెరగడం లాక్డౌన్ నిబంధనలు సడలించగానే మద్యం అలవాటు మళ్లీ బాగా పెరిగిపోయింది. మద్యం వల్ల రక్తపోటు పెరగడం, దానివల్ల గుండె మీద ఒత్తిడి పెరగడం కూడా జరుగుతుంది. దీంతోపాటు క్రమబద్ధమైన పరీక్షలూ, వైద్య పర్యవేక్షణ లేకపోవడంతో మద్యం, పొగతో కలిగే అనర్ధాలు బయటపడటం లేదు. గుండె జబ్బులు వచ్చిన వాళ్లు ఎక్కువగా మృత్యువాత పడటం గుండె జబ్బు వచ్చిన తర్వాత కూడా ఆ విషయం తెలియకుండా ఆస్పత్రికి వెళ్ళడానికి భయపడి, ఇంటి దగ్గరే వైద్యం తీసుకోవడానికి ప్రయత్నం చేసి, సమయం బాగా మించిపోయాక... అప్పుడు ఆస్పత్రికి వెళ్ళేవాళ్లు చాలామంది ఉన్నారు. గుండె జబ్బు వచ్చిన మొదటి ఆరు గంటల లోపులో సరైన వైద్యం అందక పోతే ప్రాణానికి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ పాండమిక్‌లో ఈ విధమైన ఆలస్యం వల్ల అనేక మందికి గుండె పూర్తిగా పాడైపోవడం జరిగింది. ఒకసారి గుండె పంపింగ్ బలహీనం అయిపోయిన తర్వాత ఎంత అత్యాధునికమైన వైద్యం అందించినప్పటికీ సాధారణంగా గుండె మళ్లీ పూర్వ స్థితికి వచ్చే అవకాశం ఉండదు. గుండె పంపింగ్ బలహీనంగా ఉన్న వాళ్లకి ప్రాణహాని జరిగే అవకాశం నిత్యం పొంచి ఉంటుంది. ప్రస్తుతం బయటకు సునామీలా కనపడుతున్న కోవిడ్ పాండమిక్ గురించే అందరూ ఆలోచిస్తున్నారు. కానీ అదే సమయంలో చాప కింద నీరులా కమ్ముకు వస్తున్న మధుమేహం, గుండె జబ్బుల్ని ముందే గుర్తించి, నివారించడానికి చర్యలు చేపట్టకపోతే రానున్న రోజులో భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఆ అనర్థాలను నివారించుకునే అవకాశమూ ఇంకా ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం కరోనా గాలిలో వ్యాప్తి చెందుతుంది అన్న భయంతో బయట నడవడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఆరు బయట ప్రాంతాల్లోనూ మైదానాల్లోనూ నడిచేటప్పుడు కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఇంటి బయటకి వెళ్ళటానికి అవకాశం లేకపోతే ఇంట్లోనే అనేక రకాల వ్యాయామాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో వ్యాయామానికి సంబంధించిన పనిముట్లు ఇప్పుడు తక్కువ ఖర్చుతో కూడా దొరుకుతున్నాయి. అసలు ఏ విధమైన పనిముట్లు అవసరం లేకుండా కూడా అనేకమైన వ్యాయామాలు ఇంట్లో చేసుకోవచ్చు. వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు పెరగకుండా ఉండవచ్చు. బరువు ఎక్కువ ఉన్న వాళ్లకి కరోనా వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు బలమైన ఆహారం తీసుకుంటే కోవిడ్ వచ్చే అవకాశం తక్కువగా ఉండకపోవచ్చు కానీ కోవిడ్ ని ఎదుర్కొనే అవకాశం మెరుగ్గా ఉంటుంది. ఇది నిజమే. కానీ బలమైన ఆహారం అంటే ఆహారం చాలా ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలని కాదు. మాంసకృత్తులు, విటమిన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదే కానీ అదే సమయంలో నూనె వస్తువులు, కొవ్వు పదార్థాలు, రెడీమేడ్ ఆహారాలు, జంక్‌ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం ప్రమాదం అనే విషయం మర్చిపోకూడదు. పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు రెండూ అధికంగా ఉండే ఆహారం వల్ల మధుమేహంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు అన్ని రకాల తాజా పండ్లు తీసుకోవచ్చు కానీ ఇవి భోజనంలో భాగంగా తీసుకోవాలి తప్ప భోజనం తర్వాత మరీ ఎక్కువగా తీసుకున్నట్లయితే కావలసిన కేలరీల కన్నా ఎక్కువ కేలరీలు శరీరంలో చేరే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది అని అనేక పరిశోధనల్లో తేలింది. మెడిటేషన్‌తో కూడా స్ట్రెస్ బాగా తగ్గుతుంది. స్నేహితులకు బంధువులకు ఫోన్ లో టచ్‌లో ఉండటం, నెగిటివ్ న్యూస్ కి దూరంగా ఉండటం కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడతాయి. ఆత్మీయతా, ఆధ్యాత్మికతా, స్థితప్రజ్ఞతా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మూడు ముఖ్యమైన మార్గాలు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవడం అనేక ఆసుపత్రుల్లో ఆన్లైన్ కన్సల్టేషన్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇంట్లోనే బీపీ, షుగర్ పరీక్ష చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా వైద్యుల్ని సంప్రదించి మందులు క్రమబద్ధంగా వాడినట్లయితే రక్తపోటు, మధుమేహం నియంత్రణలో ఉండే అవకాశం ఎక్కువ. అదేవిధంగా కొలెస్ట్రాల్ మోతాదును తెలుసుకోవడానికి రక్త పరీక్షలు ఇంటికి వచ్చి చేసే వాళ్ళు ఇప్పుడు నగరాల్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ తెలుసుకున్న తర్వాత వాటిని వైద్యుల సలహాతో నియంత్రించవచ్చు. ఈ ముప్పులను నివారించాలంటే ఏం చేయాలి? మధుమేహం, గుండె జబ్బులు పెద్దసంఖ్యలో రావడం తప్పనిసరిగా జరిగి తీరుతుందని కాదు. వీటిని నివారించుకోవడానికి సమయమింకా మించిపోలేదు. వీటిని ఎదుర్కోవాలంటే మన జీవన విధానంలో పూర్తిగా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. ఈ మార్పులను సరైన విధంగా తీసుకురాగలిగితే మనం అనేక ప్రాణాలను కాపాడగలుగుతాం. వ్యసనాలకు దూరంగా ఉండటం ఒత్తిడి అధికంగా ఉండటం ఉన్నప్పుడు వ్యసనాలకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. వ్యసనమేదైనా అది మానసిక ఒత్తిడిని పెంచుతుంది కానీ ఎప్పటికీ తగ్గించదు కాబట్టి ఈ పాండమిక్ తరుణంలో వ్యసనాలకు ఎంత దూరంగా ఉంటే అంతా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. పొగ తాగటం వల్ల గుండె జబ్బు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని మర్చిపోకూడదు. డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
ఏమైందమ్మా నాకు.. భయమేస్తోందమ్మా..
తెనాలి: ‘అమ్మా! ఇక నేను స్కూలుకు వెళ్లలేనా? ఏమైందమ్మా నాకు.. ఎందుకొస్తోందీ నొప్పి..? భయమేస్తోందమ్మా..’అంటూ బేలగా అడుగుతున్న పదేళ్ల కన్నబిడ్డకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆ తల్లి గుండె తల్లడిల్లుతోంది. ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువున ఆపుకొని.. ‘లేదు బుజ్జీ... నువ్వు కోలుకుంటావ్.. నీ ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటావు.. బడికి వెళ్తావు... సరేనా!’అంటూ ఊరడిస్తున్న ఆ తల్లి బిడ్డ ప్రాణాలకు ఊపిరిలూదేందుకు బతుకుపోరాటం చేస్తోంది. గుండె మార్పిడే చికిత్స తెనాలికి చెందిన పిన్నెల స్వర్ణకుమారి కుమార్తె పదేళ్ల అమృతవర్షిణి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. గత ఏడాది పాప అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల దగ్గర నెమ్ము చేరిందని, గుండెల్లో సమస్య ఉంది... నెమ్ము తగ్గాక గుండె డాక్టరుకు చూపించండి అని వైద్యులు సలహా ఇచ్చారు. డిశ్చార్జయి ఇంటికొచ్చాక, గుండె డాక్టరు దగ్గరికి తీసుకెళామనుకుకుంది స్వర్ణకుమారి. అంతలోనే కరోనా లాక్‌డౌన్‌తో బస్సులు నిలిచిపోవడం, బిడ్డకు ఆరోగ్యం బాగానే ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. మూడు నెలల క్రితం ఓ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న అమృతవర్షిణి, పెద్దగా కేకలు వేస్తూ మంచంపై నుంచి కింద పడిపోయింది. అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ బతుకు పోరాటం మళ్లీ మొదలైంది. గుంటూరు, విజయవాడ నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించారు. గుండె పెద్దదైందని, చుట్టూ కండ చేరిందని వైద్యులు చెప్పారు. దీనికి చికిత్స లేదని, జీవితాంతం మందులు వాడాల్సిందేనని పేర్కొన్నారు. చివరకు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేకు అమృతవర్షిణిని చూపించారు. ఆయన సూచనపై మరికొన్ని పరీక్షలు చేయించాక, గుండె మార్పిడే చికిత్సగా తేల్చారని స్వర్ణకుమారి కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తల్లికి జీవితమంతా కష్టాలే.. స్వర్ణకుమారి జీవితమంతా కష్టాలే. కార్మికులైన తల్లిదండ్రులు సంపాదన సరిపోక బిడ్డల్ని చదివించలేదు. 13 ఏళ్ల వయసులో వస్త్రదుకాణంలో చేరింది. ప్రేమించానంటూ ఓ యువకుడు వెంటబడటంతో నిజమేనని నిమ్మింది. కులాలు వేరైనా ఐదేళ్ల తర్వాత 2009లో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు స్వర్ణకుమారి ఎనిమిది నెలల గర్భంతో ఉండగా పెద్దాపరేషను చేసి బిడ్డను తీయాల్సి వచ్చింది. 15 రోజులకు పైగా ఆ బిడ్డను బాక్సులో పెట్టారు. ఆ బిడ్డకు అమృతవర్షిణిగా పేరుపెట్టుకుని మురిసిపోయారు. ప్రసవం తర్వాత స్వర్ణకుమారికి ఒంట్లో నీరు చేరింది. పనులు చేసుకోలేని స్థితిలో ఉండగా, భర్త ఆమెను ఆస్పత్రిలో చేర్చి ఎటో వెళ్లిపోయాడు. అప్పటికే స్వర్ణకుమారి తండ్రి చనిపోయాడు. స్టీలు కంపెనీలో పనికెళ్లే తల్లి పని మానుకుని, తనను కనిపెట్టుకుని ఉండిపోయింది. భర్తకు గతంలోనే మరొకామెతో వివాహమైందని తెలిశాక స్వర్ణకుమారి మౌనంగా ఉండిపోయింది. పాపకు నాలుగేళ్లు వచ్చాక, బిడ్డతో కలిసి తను బట్టల షాపునకు, తల్లి డాల్ మిల్లు పనికి వెళ్తూ పొట్టపోసుకుంటున్నారు. ఇటీవల బిడ్డ దుస్థితి తెలిస్తే తండ్రిగా ఆదుకుంటాడేమోనని స్వర్ణకుమారి భర్తకు ఫోన్ చేయగా ‘నువ్వెవరో నాకు తెలీదు.నాకేం సంబంధం లేదు’ అంటూ తేల్చేయడంతో చిన్నబుచ్చుకుంది. తాము రూ.32 లక్షలు చూసుకుంటే, గుండె దాతను, ఆపరేషన్‌ను తాను చూసుకుంటానని డాక్టర్ గోఖలే సార్ చెప్పారని పేర్కొంది. ఆ డబ్బుల కోసమే తెలిసిన దేవతలనే కాకుండా తెలియని దాతలను వేడుకుంటున్నానని గద్గద స్వరంతో చెబుతోంది. దాతలు తెనాలి గాందీచౌక్‌లోని సిండికేట్ బ్యాంక్‌లో ఉన్న ఖాతా నంబరు 32722010025070 (ఐఎఫ్ఎస్సీ కోడ్: ఎస్‌వైఎన్‌బీ0003272)లో సాయం జమచేసి ఆదుకోవాలని వేడుకుంటోంది. దాతలు సంప్రదించాల్సిన స్వర్ణకుమారి సెల్ నంబరు 79956 71750 చదవండి: నే గెలిచా... లేవండీ! లిఫ్ట్ అడిగి దాడి చేసి.. చివరికి.. -
వీడని భయం.. ఊబకాయం
మితివీురిన ఆహారం, జంక్ ఫుడ్ల వల్ల శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి హాని చేసే ఒక వ్యాధినే ఊబకాయంగా పిలుస్తారు. దీనినే స్థూలకాయం అని కూడా అంటారు. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, ధూమపాన వ్యసనం, ఒత్తిళ్లు, కొన్నిసార్లు వారసత్వం వల్ల కూడా దీనిబారిన పడొచ్చు. అంటే ఒక వ్యక్తి తన ఎత్తు, వయస్సుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుకు మించితే దీనిని అనారోగ్య సమస్యగా గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం (గురక), కీళ్లకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన కేన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు పనిభారం అధికం కావడంతో ఒత్తిడికి గురవుతుంటారు. ఊబకాయానికి తోడు ఆర్థిక సమస్యలు, నిద్రలేమి, సామర్థ్యానికి మించి పనిచేయడం వలన పలువురు రక్తపోటు బారిన పడుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు పెరగడం అంతిమంగా హృదయంపై ప్రభావం చూపనుంది. ఉదయం, సాయంత్రం వేళ కచ్చితంగా కొంత సమయం వ్యాయామం చేయాలని, చెమట పట్టేలా నడవడం, పరిగెత్తడం ద్వారా కొవ్వు కరిగించి బరువు తగ్గాలని వైద్యులు సూచిస్తున్నారు. జంక్ ఫుడ్ ప్రభావం అధిక కేలరీలు కలిగి ఉండే ఆహారంగా చెప్పుకునే జంక్‌ఫుడ్ ప్రభావం పిల్లలపై తీవ్రంగా పడుతోంది. పెద్దల పరిస్థితీ అంతే. సాచ్యురేటెడ్ కొవ్వులు, ఉప్పు, పంచదార పాళ్లు మోతాదుకు మించి ఉండే చిరుతిళ్లు తినడం ప్రమాదకరం. అంటే బర్గర్, పిజా, ఫ్రెంచి ఫ్రైస్, కేకులు, నూడిల్స్, చిప్స్, తీపి ఉండలు, పంచదార పెట్టిన సీరల్స్, ఫ్రైడ్, ఫాస్ట్ ఫుడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్, రెడిమేడ్ కూల్ డ్రింక్స్ లాంటివి జంక్ ఫుడ్‌గానే చెప్పొచ్చు. ఇంకా మసలా చాట్, పకోడీలు, బజ్జీలు, టమోటో కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్ డింగ్–డాంగ్స్ లాంటివి కూడా ఎక్కువ తీసుకోవద్దు. మోతాదుకు మించి తినొద్దు పిల్లలు టీవీ ముందు కూర్చొని చిరుతిళ్లు ఎక్కువగా తింటుంటారు. ఈ పద్ధతిని మాన్పించాలి. పెద్దలు వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలి. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, ఫైబర్ ఉన్న పదార్థాలు తినాలి. మాంసాహారం, ధూమపానం, మద్యపానం అలవాట్లు మానాలి. – డాక్టర్ భూక్యా నాగమణి, సుజాతనగర్ పీహెచ్సీ -
బెండతో అనేక వ్యాధుల నివారణ
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని మధుమేహం(డయాబెటిస్), గుండె జబ్బు తదితర దీర్ఘకాలిక వ్యాధులు గడగడలాడిస్తున్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన మధుమేహ బాధితులు ఇప్పుడు ప్రతి పల్లెలోనూ దర్శనమిస్తున్నారు. ముఖంగా పట్టణ ప్రాంత ఉద్యోగాల్లో విపరీతమైన ఒత్తిడి, ఆహార నియమాలు పాటించక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ దీర్ఘకాలిక వ్యాధులతో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇటీవల 30 ఏళ్ల వారు కూడా వ్యాధుల బారిన పడుతున్నారు. కాగా, దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూరగాయల రారాజు బెండకాయ(లేడీ ఫింగర్)అద్భుతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా బెండలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. బెండలో సీ,ఈ, కే, ఏ, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాగా, అధనంగా ఫైబర్, పోటాషియం, యాంటిఆక్సిడెంట్లతో మానవులకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. బెండ వల్ల కలిగే ప్రయోజనాలను విశ్లేషిద్దాం బరువు తగ్గడం బరువు తగ్గాలనుకునే వారికి బెండ సంజీవనిగా పనిచేస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల పోషకాలు లబించడంతో పాటు, బరువు తగ్గడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు డయాబెటిస్‌ను అదుపు చేయడం బెండలో గ్లైసెమిక్ ఇండెక్స్ (రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించేది) చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో మధుమేహాన్ని అదుపు చేసే మైరెసిటీన్ ఉంటుంది. కాగా ఇది కండరాల ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని అదుపు చేస్తుంది. గుండె వ్యాధుల నియంత్రణకు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాద ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వు (ఊబకాయం)తో బాధపడే వారికి బెండ మేలు మరువలేనిది. ముఖ్యంగా పెక్టిన్ అనే ఫైబర్ గుండె జబ్బులు కలగజేసే చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుందని అధ్యయానాల్లో తేలింది. మరోవైపు బెండలో ఉన్న పాలిఫినాల్స్ ఆర్టరీ బ్లాకులను నివారిస్తుంది. క్యాన్సర్ నివారణకు బెండలో ఉన్న లెక్టిన్ రొమ్ము క్యాన్సర్ రిస్క్‌ను 65శాతం మేర నివారిస్తుందని ఇటీవలే ఓ బయోటెక్నాలజీ నివేదిక తెలిపింది. మరోవైపు బెండతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంతో పాటు, కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి అందమైన చర్మం కోసం బెండలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, కెరటోనాయిడ్స్ పదార్థం లభించడం వల్ల వయస్సు తక్కువగా కనిపించడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు చెడు చర్మ గ్రంథులను తొలగించే శక్తి బెండలో ఉన్నాయి జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి బెండలో ఉన్న డయిటరీ ఫైబర్ వల్ల మలబద్దకం, అజీర్ణం లాంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణశక్తికి బెండ ఎంతో మేలు చేస్తున్నట్లు అధ్యయనాలున్నాయి బెండతో గర్భిణి స్త్రీలకు ఎంతో మేలు బెండకాయను గర్భిణి స్త్రీలు నిత్యం తినడం వల్ల గర్భిణిలకు అతిముఖ్యమైన ఫోలేట్(విటమిన్ 9) పోషకం లభిస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల కొత్తగా జన్మించే శిశువులకు జన్యుపరమైన నరాల జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుదల బెండను నిత్యం మన ఆహార అలవాట్లలో వాడడం వల్ల మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. బెండలో అత్యధికంగా లభించే విటమిన్ సీ వల్ల భయంకరమైన వైరస్(కరోనా వైరస్) లను ఎదుర్కొవచ్చు. రుచి కోసం చూసుకోకుండా బెండను నిత్యం వాడడంతో ఎన్నో భయంకరమైన రోగాలను నివారించవచ్చు -
సెల్ఫీలతో గుండెజబ్బు నిర్ధారణ..!
బీజింగ్: రోజు రోజుకు సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక గుండె జబ్బు నిర్ధారణ మరింత సులభతరం కాబోతుంది. సెల్ఫీలతో గుండె నిర్ధారణ ప్రక్రియను కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) ద్వారా కనుగొన్నట్లు యూరోపియన్ హర్ట్ జర్నల్‌లో కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. జర్నల్‌లోని వివరాల్లోకి వెళ్తె.. ఒకసారి గుండె జబ్బు నిర్దారణ అయ్యాక, ప్రతిసారి డాక్టర్ల దగ్గర చెకప్ చేసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం డాక్టర్లకు పేషెంట్ సెల్పీ పంపిస్తే చాలు, గుండె పనితీరును తెలుసుకోవచ్చు. కంప్యూటర్ ఆల్గరిథమ్ ద్వారా పేషేంట్ల ఫోటోలను, సెల్పీ ద్వారా విశ్లేషించి గుండె పనితీరును తెలుసుకోవచ్చని అధ్యయనకర్తలు తెలిపారు. అయితే పేషేంట్లు సొంత స్క్రీనింగ్ కోసం, గుండె జబ్బుల పనితీరును అంచనా వేయడానికి ఈ అధ్యయనం తొలి అడుగని చైనాకు చెందిన వైద్య నిపుణుడు జీజీంగ్ అభిప్రాయపడ్డారు. కాగా ఈ అధ్యయనం చేసిన వారిలో జీజీంగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన స్పందిస్తు.. గుండె జబ్బుల ప్రమాదం అంచనా వేయడానికి, అధిక రిస్క్ ఉన్న పేషంట్ల చేకూర్చడమే అప్లికేషన్ ముఖ్య లక్ష్యమని తెలిపారు.ఈ అధ్యయనంలో జింగ్ 8 చైనా ఆస్పత్రుల నుంచి 5,796 పేషెంట్ల గుండె పనితీరును అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: సెల్ఫీ సోకు.. ప్రాణం మీదకు తెచ్చుకోకు.. -
కన్నబిడ్డకు పాలిచ్చేందుకు వచ్చి..
ఖైరతాబాద్: కన్నబిడ్డకు పాలిచ్చేందుకు వచ్చిన తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడలో నివాసం ఉంటున్న రాజేష్, ఆర్తి (24)లకు 2017లో వివాహం జరిగింది. ఇటీవల గర్భం దాల్చిన ఆర్తిని డెలివరీ కోసం చింతల బస్తీలోని విజయమేరి హాస్పిటల్లో గత నెల 27న అడ్మిట్ చేశారు బంధువులు. 28న వైద్యులు శస్త్ర చికిత్స చేసి డెలివరీ చేయగా పాపకు జన్మనిచ్చింది. పుట్టిన పాప గ్రోత్ సరిగా లేదని హాస్పిటల్ని ఎన్ఐసీయూలో ఉంచారు. 31న తల్లి ఆర్తిని డిశ్చార్జి చేస్తున్నామని చెప్పారని.. అయితే పాపకు పాలు ఇవ్వాల్సి ఉండగా హాస్పిటల్లోనే ఉంటోంది. ఈ నెల 1వ తేదీ మధ్యాహ్నం ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రి వర్గాలకు బంధువులు తెలియజేశారు. డెలివరీ అయిన తర్వాత సాధారణంగా ఛాతీలో నొప్పి వస్తుందని, వాకింగ్ చేస్తే సరిపోతుందని చెప్పినట్లుగా బంధువులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఆర్తి పాపకు పాలు ఇచ్చేందుకు వెళ్లింది. పాలు రాకపోవడంతో పాపకు పాలు పట్టేందుకు నర్సు వేడి నీళ్లు తెచ్చేందుకు వెళ్లింది. నర్సు తిరిగి వచ్చే సరికి ఆర్తి బెడ్‌పై పడిపోయి ఉంది. నర్సు ఎంత లేపినా లేవలేదు. దీంతో డాక్టర్‌కు సమాచారమిచ్చారు. అక్కడికి వచ్చిన డాక్టర్లు ఆమెను పరీక్షించి చనిపోయినట్లు ధ్రువీకరించారు. విషయం తెలిసిన వెంటనే మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు ఆర్తి తనకు ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పినా పట్టించుకోకపోవడం వల్లే చనిపోయిందని ఆందోళనకు దిగారు. హాస్పిటల్ నుంచి తాము డిశ్చార్జి చేశామని, సాధారణంగా బాలింతల కాళ్లలో రక్త సరఫరా సరిగా లేకపోవడం (ఎంబోలిజం) అనే సమస్య వల్ల హార్ట్ ఫెయిల్యూర్ సమస్య వచ్చే అవకాశాలుంటాయని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. మృతురాలి భర్త రాజేష్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్న గుండెకు ఎంత కష్టమో..
గొల్లప్రోలు: మూడేళ్ల చిన్నారి గుండెకు గాయమైంది. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ముప్పు అని వైద్యులు నిర్ధారించారు. గొల్లప్రోలులోని ఈబీసీ కాలనీకి చెందిన ఉమ్మిడి చంద్రశేఖర్, నీరజల మూడేళ్ల కుమారుడు దేవీశ్రీప్రసాద్ రెండో సంతానం. 2016లో పుట్టిన చిన్నారికి గుండె కొట్టుకును శబ్ధంలో తేడాను గమనించిన వైద్యులు స్కానింగ్ చేయించడం ద్వారా ఏరోటిక్ వాల్వ్ మూసుకుపోయి బ్లాక్ అవ్వడం ద్వారా రక్తసరఫరా మూసుకుపోయినట్టు గుర్తించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో రూ.రెండులక్షలు వెచ్చించి గుండె వైద్యపరీక్షలు నిర్వహించి ప్రమాదకరమైన గుండె వ్యాధిగా నిర్ధారించారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్యులు సూచన మేరకు మందులు వాడుతున్నారు. ఇటీవల బెంగుళూరులోని ఆర్ఎక్స్ డీఎక్స్ ఆసుపత్రి, కొలంబియా ఆసియా ఆసుపత్రి వైద్యులు పరిక్షలు నిర్వహించగా వాల్వ్ లీకేజీ ఎక్కువగా ఉండడంతో పాటు ఎడమ వైపు గుండె పరిమాణం పెద్దదిగా ఉన్నట్టు గుర్తించారు. గుండె పంపింగ్ కూడా బాగా తగ్గినట్టు గుర్తించారు. జనవరిలో ఓపెన్ హార్ట్ ఆపరేషన్ నిర్వహించకపోతే ప్రాణానికి ప్రమాదం అని కొలంబియా ఆసియా వైద్యులు తెలిపారు. కొన్ని గంటలపాటు నిరంతరాయంగా నిర్వహించే ఆర్ఓఎస్ఎస్ ఆపరేషన్‌కు సుమారు రూ.ఎనిమిది లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పురుగు మందులు షాపులో గుమస్తాగా పని చేస్తూ నెలకు రూ.10వేలు సంపాదించుకునే చిన్నారి తండ్రి చంద్రశేఖర్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు తట్టుకునే ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లిపోతున్నాడు. గుండె చికిత్స కోసం ప్రభుత్వం, దాతలు సహాయం చేయాలని చంద్రశేఖర్ కోరుతున్నారు. -
పాతికేళ్లకే గుండెకి తూట్లు
పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. అయినా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. 25–40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో గుండెపోట్లు అధికంగా వస్తున్నాయని తాజా అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. 1990 నుంచి 2016 మధ్య కాలంలో భారత్‌లో గుండె జబ్బులు 50 శాతం పెరిగాయి. భారత్‌లో ఏటా సంభవించే మరణాల్లో 17 శాతం గుండె జబ్బుల కారణంగా జరిగేవే. దేశంలో 80 లక్షల నుంచి కోటి మంది గుండెపోటు రోగులున్నారు. ఇది ప్రపంచంలో 40 శాతానికి సమానం. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే 2000 సంవత్సరం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ గుండె జబ్బులు, గుండెపోట్లు ఎక్కువ అవుతూ ఉండటం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో పల్లెలకూ ఓ విధమైన పట్టణ సంస్కృతి పాకింది. నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో పొగరాయుళ్లు ఎక్కువ. అందుకే పల్లెల్లో గుండె జబ్బులు ఎక్కువైపోతున్నాయి. గ్రామీణ భారతంలో గుండె జబ్బులు పురుషుల్లో 40 శాతం, మహిళల్లో 56 శాతం వరకూ ఎక్కువైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులతో వచ్చే మరణాలు తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అధికంగా ఉంటే, గుండెపోట్లు వచ్చి మరణించేవారు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ. భారత్ ఇప్పటికే మధుమేహ వ్యాధిలో ప్రపంచ దేశాలకు రాజధానిగా మారింది. షుగర్ వ్యాధి హార్ట్ ఫెయిల్యూర్‌కి దారితీస్తూ భారత్‌లో గుండె వ్యాధిగ్రస్తుల సంఖ్యను పెంచేస్తోంది. -
హార్ట్ జబ్బులకు హాల్ట్ చెబుదాం
ప్రపంచంలో 1900 కి ముందు గుండెజబ్బులు అంటే పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. గుండెజబ్బులతో చనిపోవడం అన్నది కనిపించేదే కాదు. అయితే 1900 నుంచి 1960 వరకు ప్రపంచంలోని అన్ని దేశాలలో గుండెజబ్బులు విపరీతంగా పెరిగిపోయాయి. మిగతా అన్ని రకాల కారణాలతో వచ్చే మరణాలతో పోలిస్తే గుండెజబ్బు మరణాల సంఖ్య చాలా విపరీతంగా పెరిగిపోయింది. అయితే 1960ల తర్వాత అభివృద్ధి చెందిన దేశాల్లో గుండెజబ్బు మరణాలు బాగా తగ్గుముఖం పట్టాయి. గుండెజబ్బుకు గల కారణాలూ, దాని లక్షణాలు తెలియడంతో పాటు దాన్ని నివారణ గురించి అభివృద్ధి చెందిన దేశాల వారికి బాగా అవగాహన పెరగడం వల్ల అక్కడ గుండెజబ్బుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే భారతదేశంలో ఆ పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఈ నెల 29న ప్రపంచ గుండె దినోత్సవం (వరల్డ్ హార్ట్ డే) సందర్భంగా మన దేశంలో గుండెజబ్బుల పరిస్థితి గురించి, వాటిని నివారించే విషయంలో మనం తీసుకోగల జాగ్రత్తలు/నివారణ చర్యల గురించి కాస్తంత విపులంగా పరిశీలిద్దాం. అన్ని విషయాల్లోనూ ఉన్నట్లే... జబ్బులు వాటి నివారణ విషయాల్లోనూ ఒక పరిణామక్రమం ఉంటుంది. ఈ పరిణామక్రమంలోని దశలో అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కానీ దాదాపుగా అన్నిదేశాల్లోనూ మొదటో... తర్వాతో ఇవే దశలు కొనసాగుతాయి. మొదటి దశలో వచ్చే జబ్బులు ఉదాహరణకు ప్రతిదేశంలోనూ మొదట అంటురోగాలు (కమ్యూనికబుల్ డిసీజెస్), పౌష్టికాహార లోపాలతో వచ్చే జబ్బులు బాగా ఎక్కువగా ఉంటాయి. మన అవగాహనతోనూ... మందులను కనుగొనడంతోనూ, మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడం ద్వారా జీవన నాణ్యతను మరింతగా పెంచుకోవడం వల్ల ఈ జబ్బులు క్రమంగా తగ్గిపోతాయి. కమ్యూనికబుల్ డిసీజెస్‌కు కలరా, ప్లేగు వంటి వాటిని ఉదాహరణలుగా చెప్పవచ్చు. ఇక పోషకాహార లోపాల వల్ల వచ్చే వాటికి బెరీబెరీ వంటి జబ్బులు ఉదాహరణగా నిలుస్తాయి. మానవాళి యాంటీబ్యాక్టీరియా మందులు కనుకున్న తర్వాత కమ్యూనికబుల్ డిసీజెస్ వంటి కలరా, ప్లేగు వంటివి దాదాపుగా కనుమరుగయ్యాయి. దాదాపు అన్ని అభివృద్ధి చెందిన దేశల్లోనూ నాణ్యమైన నీటి సరఫరాతో నీరు కలుషితం కావడం వల్ల వచ్చే జబ్బులు తగ్గాయి. అలాగే మెరుగైన ఆహార పంపిణీ వల్ల పోషకాహార లోపంతో వచ్చే జబ్బులన్నీ బాగా అభివృద్ధి చెందిన పాశ్చాత్యదేశాల్లో పూర్తిగా మటుమాయమయ్యాయనే చెప్పవచ్చు. అయితే భారతదేశం ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో అంటురోగాలు ఇప్పటికీ అడపాదడపా ప్రబలుతూనే ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లాగా మనం వాటిని ఇంకా పూర్తిగా అరికట్టలేకపోయాం. రెండో దశలో వచ్చే జబ్బులు ఆ తర్వాతి వంతు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ది. అంటే ఇవి అంటురోగాలు కాని జబ్బులన్నమాట. ఈ తరహా జబ్బులకు ప్రధానమైన ఉదాహరణగా గుండెజబ్బులను చెప్పవచ్చు. హైబీపీ, డయాబెటిస్ వంటి జీవనశైలికి సంబంధించిన జబ్బులూ ఈ కోవకే చెందుతాయి. అవి మళ్లీ గుండెజబ్బులు మరింత పెరిగేందుకు దోహదం చేస్తాయి. వ్యాధులలో రెండో దశ అయిన ఈ గుండెజబ్బుల నివారణ విషయానికి వచ్చే సరికి... తమ దేశాల్లో మొదటిదశ జబ్బులు లేకపోవడం వల్ల ఆయాదేశాలు గుండెజబ్బుల వంటి రెండోదశ జబ్బులపై పూర్తిగా దృష్టిపెట్టగలిగాయి. కానీ మనం ఇంకా అంటురోగులతో పోరాడుతూనే ఉన్నాం. స్వచ్ఛమైన నీటి సరఫరా, దోమల నివారణ, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాల కల్పన్న అన్నది భారతదేశంలోని ఇంకా అన్ని ప్రాంతాల్లోనూ పూర్తిగా జరగనందువల్ల ఒకవైపు మొదటిదశ జబ్బులైన అంటువ్యాధులతో పోరాడుతూనే ఇంకా గుండెజబ్బుల వంటి రెండోదశ జబ్బులతోనూ పోరు చేయాల్సివస్తోంది. పైగా భారతదేశంలో పౌష్టికాహారం ఇంకా పూర్తిగా అందరికీ అందుబాటులోకి రాకపోవడంతో మొదటిదశలో వచ్చే పౌష్టికాహార లోపాల కారణంగా వచ్చే జబ్బులూ మనదేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. దాంతో పాశ్చాత్యదేశాల కంటే ఈ విషయంలోనూ కాస్తంత వెనకబడే ఉన్నాం. ఫలితంగా మనదేశంలో మొదటి దశ వ్యాధులు పూర్తిగా తగ్గకముందే రెండోదశ వ్యాధులతోనూ ద్విముఖ పోరాటం చేయాల్సి వస్తోంది. ఒకేసారి ఇద్దరు శత్రువులతో పోరాడుతున్నందున మన అడుగులు తడబడుతూనే సాగుతున్నాయని చెప్పవచ్చు. జన్యుపరమైన అంశాలూ కారణాలేనా? ఇవన్నీ బయటి పరిస్థితుల కారణంగా గుండెజబ్బులకు దోహదపడే అంశాలైతే మరికొన్ని జన్యుపరమైన కారణాలూ ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్న మిగతా జాతీయులతో పోలిస్తే... భారత జాతీయులకు అధికంగా గుండెజబ్బులు వస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. అలాగే ఇంగ్లాండ్ వంటి యూరోపియన్ దేశాల్లో స్థిరపడ్డ భారతీయుల్లోనే గుండెజబ్బులు ఎక్కువ. పాశ్చాత్యదేశాల్లో స్థిరపడ్డ భారతీయులలో అక్కడి జీవనశైలికి అలవాటు పడ్డవారిలో కూడా భారతీయుల్లో జబ్బులు మరింతగా ప్రబలాయి. ఈ అన్ని పరిశోధనలూ, పరిశీలనల కారణంగా భారతీయుల్లో జన్యుపరంగా గుండెజబ్బులు ఎక్కువగానే వస్తాయని, కాబట్టి భారతీయుల్లో వీటిని నివారణ అంతగా సాధ్యం కాకపోవచ్చని తొలుత అధ్యయనవేత్తలు భావించారు. ఇదీ ఒక ప్రధానమైన ఆశారేఖ కానీ గుండెజబ్బుల విషయంలో మనదేశంలో నిశితంగా పరిశీలిస్తే... పట్టణప్రాంతాల్లో ఉన్న భారతీయులకూ, పల్లెల్లో ఉన్నవారికీ మధ్య చాలా స్పష్టమైన వ్యత్యాసం కనబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వ్యాయామం ఉండటంతో పాటు ఒత్తిడి తక్కువగా ఉండే జీవనశైలి, ప్రాసెస్డ్ ఆహారం పట్టణాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండి, పల్లెల్లో లేకపోవడం వంటి కారణాలతో పట్టణవాసుల్లో గుండెజబ్బులు ఎక్కువగానూ, పల్లెల్లో అంతగా లేకపోవడం నిపుణల దృష్టికి వచ్చింది. ఇది ఒక ఆశారేఖ. దీనితో తేలుతున్న విషయం ఏమిటంటే... మన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మనం మనకున్న జన్యులోపాలను అధిగమించి గుండెజబ్బులను తగ్గించుకోవచ్చు! ముందుంది ఒక పెనుసవాలు అయితే ఇక్కడ మన ముందు ఒక పెనుసవాలు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పొగతాగే అలవాటు ఎక్కువగానే ఉంది. ఒకప్పుడు పట్టణాల్లో కనిపించే ప్రాసెస్డ్ ఆహారాలు, కూల్డ్రింకులు, జంక్ఫుడ్స్ వంటివి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ చేరుతున్నాయి. ఈ విషయంలో పట్టణప్రాంతాలకూ, పల్లెలకు ఉన్న తేడా చెరిగిపోవడానికి ఎక్కువ కాలం పట్టదు. అలాగే ఒకసారి శారీరక శ్రమ తగ్గించే వస్తువులు (గాడ్జెట్స్ ఉదాహరణకు మిక్సీ, గ్రైండర్, వాషింగ్ మెషిన్ వంటివి), యాంత్రీకరణ వల్ల పల్లెల్లోనూ ఇప్పుడు వ్యాయామం తగ్గిపోతోంది. అలాగే వినియోగదారులు పెరగడం, రవాణా సదుపాయాలు మెరుగుకావడం వంటి అంశాలతో ఇప్పుడు కన్సూ్యమరిజమ్ కారణంగా ప్రాసెస్డ్ ఆహారం లభ్యత కూడా ఇప్పుడు పల్లెల్లో బాగా పెరుగుతోంది. ఇది వేగంగా జరుగుతున్నందున గుండెజబ్బుల విషయంలో పట్టణాలకూ, పల్లెలకూ ఉన్న తేడా వేగంగా చెరిగిపోవడానికి చాలాకాలం పట్టదు. ఇప్పటికీ మనం మొదటిదశ జబ్బులతోనూ, రెండోదశ వ్యాధులతోనూ ఒకేసారి పోరాడుతున్న ప్రస్తుత నేపథ్యంలో పట్టణాలకూ, పల్లెలకూ ఉన్న వ్యత్యాసం తగ్గిపోతే మనకిప్పుడు ఉన్న ఆర్థిక వనరులతోగానీ, లేదా వైద్య సదుపాయాల వంటి వనరులుగానీ ఈ తేడా చెరిగిపోవడంతో పెరిగిపోయే వ్యాధిగ్రస్తుల చికిత్సను మనం ఒకేసారి ఎదుర్కోవడానికి మనకున్న సామర్థ్యం పూర్తిగా సరిపోకపోవచ్చు. మన ఆశారేఖను వినియోగించుకోవాలిలా... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గుండెజబ్బుల విస్తృతిలో ఉన్న తేడాలను బట్టి మనం ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా గుండెజబ్బులను అరికట్టుకోవచ్చని తేలింది. కాబట్టి... మనమీ ఆశారేఖను సమర్థంగా వినియోగించుకోవాలి. అందుకు ఈ కింది నివారణ చర్యలు/జాగ్రత్తలు తీసుకోండి. నివారణ పొగ తాగడం మానండి: పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. మీ ఇంట్లో ఎవరికైనా ఆ అలవాటు ఉన్నా, మాన్పించండి. ఒకసారి హార్ట్ ఎటాక్ కానీ, గుండె జబ్బు కానీ వస్తే, దీర్ఘకాలం ఇబ్బంది పెట్టే దానితో బాధపడడం కన్నా, పొగ తాగే అలవాటు మానేయడమే సుఖం. పౌష్టికాహారం తీసుకోండి: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే, పౌష్టికాహారం తీసుకోవాలి. మీరు తినే ఆహారాన్ని బట్టే – ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగడం, రక్తపోటు రావడం, షుగర్, అధిక బరువు రావడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ, విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం, ఇతర పోషకాలు ఉంటూనే, క్యాలరీలు మాత్రం తక్కువుగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు, చేపలు, కాయధాన్యాలు తినాలి. స్వీట్లు, కూల్‌డ్రింక్‌లు, వేటమాంసం (రెడ్ మీట్) తక్కువ తినాలి. కొలెస్ట్రాల్ తగ్గించుకోండి: గుండెకు రక్తం తీసుకువెళ్లే రక్తనాళాల్లో కొవ్వు చేరితే, గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి, వీలైనంత వరకు శ్యాచురేటెడ్ కొవ్వు పదార్థాల లాంటివి తినకూడదు. ఒంట్లో చెడ్డ (ఎల్.డి.ఎల్) కొలెస్ట్రాల్, మంచి (హెచ్.డి.ఎల్) కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ ఎంతెంత స్థాయిలో ఉన్నాయో, ఎప్పటికప్పుడు చెక్ చేయించుకొని, జాగ్రత్తపడాలి. రోజూ శారీరక శ్రమ చేయండి : రోజూ సగటున 45 నిమిషాల చొప్పున, వారానికి కనీసం అయిదారు రోజులు వ్యాయామం చేయాలి. దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. బరువు చూసుకోండి : స్థూలకాయం, అధిక బరువు వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్థూలకాయం అంటే హై కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, టైప్–2 డయాబెటిస్‌కు ముందు సూచన అయిన ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి వస్తాయి. ఇవన్నీ గుండె జబ్బులకు దారితీసేవే. కాబట్టి, సరైన ‘బాడీ మాస్ ఇండెక్స్’ (బీఎమ్ఐ) ఉండేలా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి (స్ట్రెస్) తగ్గించుకోండి: గుండె జబ్బులు రావడానికీ, ఆ వ్యక్తి మానసిక ఒత్తిడికీ స్పష్టమైన సంబంధం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. స్ట్రెస్‌లో ఉన్నవాళ్లు అతిగా తినడం, ఎక్కువగా పొగ తాగడం లాంటివి చేసే అవకాశం ఉంది. అలాగే, స్ట్రెస్ వల్ల యువతీ యువకుల్లో మధ్యవయసులోనే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. మద్యపానం మానేయండి : అతిగా మద్యం తాగడం కూడా రిస్కే. దాని వల్ల రక్తపోటు పెరుగుతుంది. కార్డియోమయోపతీ, గుండెనొప్పి, క్యాన్సర్, ఇతర వ్యాధులు వస్తాయి. గుండెజబ్బుల విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఒక్కటే. మనం నివారణకు పెట్టే ఖర్చుతో పోషకాహారాలు, వ్యాయామంతో పోలిస్తే... అది వచ్చాక చికిత్సకు అయ్యే ఖర్చు వందల రెట్లు ఎక్కువ. పైగా నివారణ చర్యలతో గుండెజబ్బులు రాకపోవడంతో పాటు మిగతా జబ్బులూ నివారితమవుతాయి. ఫిట్నెస్ బాగుంటుంది.గతేడాది, ఈ ఏడాది వరల్డ్ హార్ట్ డే థీమ్స్... ‘మై హార్ట్– యువర్ హార్ట్’తో పాటు ‘‘క్రియేట్ ఎ గ్లోబల్ కమ్యూనిటీ ఆఫ్ హార్ట్ హీరోస్’’. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే... నా గుండెను రక్షించుకోవడం ఎలా... ఎదుటివాళ్ల గుండె ఆరోగ్యానికీ మనం చేయగలిగేదేమిటి?’ అనే చర్యలతో పాటు గుండెను రక్షించే నాయకుల తయారీలో మన కుటుంబాలను భాగస్వామ్యం చేయడానికి... ఇంటిలో వండిన ఆరోగ్యకరమైన వంటలే తినేందుకూ (ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్ కారణంగా జంక్‌ఫుడ్ మన గుమ్మం ముందుకే వస్తున్నాయి. మన పిల్లలూ వాటికి దూరంగా ఉండేలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది).మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆరోగ్యంగా ఉండేందుకు తప్పక వ్యాయామం చేయడంతో పాటు పొగతాగడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లు మానేసేందుకు; పిల్లలను సైతం చిన్నవయసు నుంచే వ్యాయామం వైపుకు మళ్లించేందుకు; ఇక ఆరోగ్యరంగంలో కృషి చేసేవారు తమ పేషెంట్స్ పొగతాగడం వంటి అలవాట్లు మానుకునేలాగా, కొలెస్ట్రాల్ తక్కువ ఉండే ఆహారం తీసుకునేలా అవగాహన తేవడం; మన విధాన రూపకర్తలు ఆరోగ్యకరమైన వ్యవస్థలను రూపొందించేలా విధానాలు రూపొందించడం; ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం కోసం కృష్టి చేయడంతో పాటు... పైన పేర్కొన్న నివారణ చర్యలను అందరూ పాటించేలా చేయగలిగితే ఈ వరల్డ్ హార్ట్ డే థీమ్స్‌కు న్యాయం జరిగినట్లే. ఆహారపరమైన జాగ్రత్తలివి ►సాల్మన్ ఫిష్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే మంచిదంటూ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ►ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేస్తూ... కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే. ►స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, అవి రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. ►డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం ఉండదు. పైగా అవి కీడు చేస్తాయి కూడా. ►విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్లు లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. జామపండ్ల వంటి విటమిన్ సి ఎక్కువగా ఉండే వాటినీ తినాలి. అయితే వీటిని కొరికి తినాలి తప్ప జ్యూస్‌లుగా చేసుకొని తాగకూడదు. ఏవైనా కారణాలతో కొరికితినలేని వారు జ్యూస్‌లుగా చేసుకొని తాగాల్సివస్తే అందులో పంచదార కలుపుకోకుండా, తాజా జ్యూస్‌లు తాగాలి. ►టొమాటోలలకూ కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. వీటిల్లో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెజబ్బులను నివారిస్తుంది. ►బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ►బీన్స్, బఠానీల లాంటి కాయధాన్యాల్లో కూడా కొవ్వు చేరనివ్వని బోలెడంత ప్రొటీన్ ఉంటుంది. ►పాలకూర, బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి. ►అవిసె గింజలు (ఫ్లాక్స్ సీడ్స్)లో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. పీచు పదార్థం కూడా ఎక్కువే. కాబట్టి, అవి గుండెకు మంచిది. ►రోజూ నాలుగు కప్పుల గ్రీన్ టీ తాగడం కూడా గుండెజబ్బుల నివారణకు గణనీయంగా తోడ్పడుతుంది. గుండెజబ్బులు రావడానికి కారణాలు ఇప్పుడు గుండెజబ్బులు వచ్చేందుకు గల కారణాలను చూద్దాం. ఆహారంలో కొవ్వుపదార్థాలూ, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, హైబీపీ, షుగర్ వంటివి కొన్ని ప్రధాన కారణాలైతే... మనకు మనమే జబ్బులకు చేరువయ్యేలా చేసే మన చెడు అలవాట్లైన పొగతాగడం వంటివి ఇంకా గుండెజబ్బుల విషయంలో మనకు చేటు చేసే అంశాలు. ఇక వీటితో పాటు మారిన వృత్తుల నేపథ్యంలో మానసిక ఒత్తిడి బాగా పెరగడం, నిద్రలేమి వంటివి కూడా వచ్చి చేరాయి. డాక్టర్ ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్, హైదరాబాద్ -
తోడబుట్టారు.. తోడై వెళ్లారు
ప్రొద్దుటూరు క్రైం: వారిద్దరూ ఒక తల్లి గర్భాన జన్మించారు.. ఆ తల్లి ఒడిలోనే పెరిగారు.. తమ్ముడంటే అన్నకు ప్రాణం.. అన్నంటే తమ్ముడికి ఎనలేని ప్రేమ.. తమ్ముడికి చిన్న కష్టమొచ్చినా అన్నయ్య భరించలేడు.. దేహాలు వేరైనా వాళ్లిద్దరి గుండె చప్పుడు ఒక్కటే.. పుడుతూ అన్నదమ్ములు.. పెరుగుతూ దాయాదులు అన్న నానుడిని వారు విచ్ఛిన్నం చేస్తూ కలసి మెలసి జీవించారు.. చివరికి మరణంలోనూ ఒకరి వెంట మరొకరిగా ప్రయాణించి తోబుట్టువుల బలీయమైన రక్తసంబంధానికి నిలువెత్తు సాక్షీభూతంగా నిలిచారు. అన్నదమ్ముల అనుబంధం.. అన్యోన్యతను చూసి ఈర్ష్య పడిన భగవంతుడు వాళ్లిద్దరిని తన అక్కున చేర్చుకున్నాడు. చిన్న నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటూ మరణంలోనూ నిజమైన తోబుట్టువులు అనిపించుకున్న విషాద ఘటన ప్రొద్దుటూరు మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని గోపవరం పంచాయతీ, కాల్వకట్ట వీధిలో నివాసం ఉంటున్న ఆవుల చంద్రమోహన్ (35) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. తమ్ముడి మరణంతో తీవ్రంగా కలత చెందిన అన్న బాలరాజు (45) మంగళవారం ఉదయం గుండె పోటుతో చనిపోయాడు. ఇద్దరు కాల్వకట్టవీధిలో పక్క పక్క ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రికి.. ఆవుల చంద్రమోహన్ బేల్దార్ పనికి వెళ్లేవాడు. అతనికి భార్య మరియమ్మ, 11 ఏళ్ల ధరణి అనే కుమార్తె ఉన్నారు. కుమార్తె ఐదో తరగతి చదువుతోంది. కొంతకాలం నుంచి చంద్రమోహన్‌కు ఆరోగ్యం సరిగాలేదు. గుండె సంబంధిత వ్యాధితో పలుమార్లు ఆస్పత్రిలో చూపించుకొని మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉన్నట్టుండి పరిస్థితి విషమంగా మారడంతో ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతను ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని కాల్వకట్ట వీధిలోని అతని ఇంటికి తరలించారు. దూర ప్రాంతాల్లోని బంధువులు రావాల్సి ఉండటంతో మంగళవారం ఉదయం అంత్యక్రియలను నిర్వహించాలని భావించారు. చంద్రమోహన్ మరణాన్ని జీర్ణించుకోలేని అన్న బాలరాజు విలపించసాగాడు. రాత్రంతా తమ్ముడినే తలచుకుంటూ సొమ్మసిల్లాడు. కుటుంబ సభ్యులు ఎం త పిలిచినా లేవకుండా అలానే పడిపోయాడు. గుండె నొప్పిగా ఉందంటూ.. తమ్ముడి మరణంతో కలత చెందిన బాలరాజు మంగళవారం ఉదయం గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్ర ఆయాస పడిన అతను చికిత్స పొందుతూ కొన్ని నిమిషాల్లోనే మృతి చెందాడు. చంద్రమోహన్ అంత్యక్రియల కోసం బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున వచ్చారు. ఒకరి కోసం వచ్చిన బంధువులు ఇద్దరి అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది. బాలరాజు మృతితో భార్య సంజమ్మ విలపిస్తోంది. వారికి 14 ఏళ్ల అంజలి అనే కుమార్తె ఉంది. ప్రొద్దుటూరులోని వైవీఎస్ మున్సిపల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తండ్రి, చిన్నాన్న మరణంతో అంజలి రోదిస్తోంది. చిన్న వయసులో తండ్రులను పోగొట్టుకున్న అంజలి, ధరణిలను చూసి స్థానికులు, బంధువులు కంట తడిపెట్టారు. కూలి పని చేసుకొని జీవించే తమకు పెద్ద దిక్కు లేకుండా పోయారని, పిల్లల్ని ఎలా పోషించాలి దేవుడా అంటూ మృతుల భార్యలు విలపిస్తున్నారు. రెండు కుటుంబాల్లో విషాదం.. చంద్రమోహన్, బాలరాజు మృతితో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. చిన్న వయసులోనే అకాల మరణం చెందడం అందరినీ కలచివేసింది. అన్నదమ్ములిద్దరూ రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామంలో సొంత బంధువుల ఇళ్లల్లో పెళ్లి చేసుకున్నారు. వైఎఎస్సార్సీపీ నాయకులు దేవీప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ ఓబుళరెడ్డి, శనివారపు సుబ్బరాయుడు తదితరులు విచ్చేసి మృతదేహాలకు నివాళులు అర్పించారు. -
టీవీని ఎక్కువగా చూస్తున్నారా?
గంటలకొద్దీ టీవీ ముందు అతుక్కుపోతున్నారా? అయితే మీరు ఆ అలవాటును ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అవును రోజు రెండు గంటలకు పైగా టీవీ చూస్తే త్వరగా మరణం సంభవిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. గ్లాస్గో యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైనట్లు లాన్సెట్ పబ్లిక్ హెల్త్ జర్నల్ ప్రచురించింది. అతిగా టీవీ చూసే 40 నుంచి 69 ఏళ్ల వయసున్నవారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించింది. అలాగే ఏ వయసు వారు ఎక్కువగా నాలుగు గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తున్నారో గుర్తించింది. 39 ఏళ్ల వయసు వాళ్లే ఎక్కువగా టీవీలకు అతుక్కుపోతున్నారని, వీరు సుమారు రోజుకు 4 గంటలకు పైగా టీవీ చూస్తున్నారని తమ పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొంది. ఆరోగ్యవంతులు కేవలం రోజుకు 2 గంటల కన్నా తక్కువగా టీవీ చూస్తున్నారని తెలిపింది. అలాగే 7 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు.. 9 గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయేవారిపై కూడా పరిశోధనలు జరిపింది. ఇలా 2గంటల 12 నిమిషాల కన్నా ఎక్కువగా టీవీ చూసేవారిలో తక్కువగా, ఎక్కువగా నిద్రపోయే వారి ప్రాణాలకు ముప్పున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు పేర్కొంది. అలాగే టీవీ చూస్తూ సిగరెట్ తాగడం, మధ్యం సేవించడం వంటి పనులు చేసే వారికి గుండె జబ్బులు ఎక్కవగా వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. -
‘గుండె’ చేజారుతోంది
నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. కళ్లముందే చెట్టంత కొడుకు మృత్యువుకు చేరువవుతూ ఉంటే.. చూస్తూ మౌనంగా రోదిస్తోంది. ఆర్థిక సమస్యల భారంతో తామేమీ చేయలేని అసహా స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం, పామిడి :గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన సి.పోతన్న, సి.నాగరతమ్మ దంపతులకు శివభారత్ (ప్రస్తుతం అతని వయసు 18 సంవత్సరాలు) ఒక్కగానొక్క కుమారుడు. సీఎస్ఐ చర్చివీధిలో ఓ గుడిసెలో నివసిస్తున్న పోతన్న ఎద్దుల బండిలో సరుకులు తరలిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదాయం అంతంగా మాత్రంగానే ఉండడంతో భార్య కూలీ పనులతో సంసారాన్ని నెట్టుకొస్తోంది. మూడేళ్ల క్రితం పోతన్న అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స కోసం అప్పటి వరకూ కూడబెట్టిన సొమ్ముకు తోడు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ. లక్ష వరకు అప్పు చేయాల్సి వచ్చింది. ఐటీఐ మానేసి.. కూలీగా మారి తండ్రి అనారోగ్యం పాలవ్వడంతో కుటుంబ పోషణ భారాన్ని తల్లితో పాటు శివభారత్ పంచుకున్నాడు. ఐటీఐలో సాంకేతిక విద్యనభ్యసిస్తున్న అతను మధ్యలోనే చదువులకు స్వస్తి పలకాల్సి వచ్చింది. గార్లదిన్నె మండలం కల్లూరులోని భాస్కరరెడ్డి ఐరన్ మార్ట్‌లో నెలకు రూ. 6వేలు వేతనంతో కూలీగా చేరాడు. వెంటాడుతున్న మృత్యువు రెండు నెలల క్రితం శివభారత్ తీవ్ర ఆయాసంతో అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి తీసుకోవడం భారంగా మారింది. పామిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చూపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం శివభారత్ గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడని, శస్త్రచికిత్సతోనే అతని జబ్బు నయమవుతుందని తేల్చి చెప్పారు. అంతేకాక ఎన్టీఆర్ వైద్య సేవ కింద విజయవాడలోని ఉషా కార్డియాక్ సెంటర్‌కు సిఫారసు చేశారు. పది రోజులు విజయవాడలో చికిత్స చేయించుకున్నాడు. అయినా నయం కాలేదు. వైద్య పరీక్షల అనంతరం శివభారత్కు గుండె మార్పిడి అవసరమని వైద్య నిపుణుడు డాక్టర్ వై.వి.రావు గుర్తించారు. ఇదే విషయాన్ని బాధితుడి తల్లిదండ్రులకు ఆయన వివరించి, అరుదైన ఈ చికిత్స గుంటూరులోని ప్రభుత్వాస్పత్రిలో చేస్తారంటూ అక్కడకు సిఫారసు చేశారు. గండం గట్టెక్కానా? అనారోగ్యంతో బాధపడుతున్న పోతన్న కొన్ని నెలలుగా బండి తోలడం మానేశాడు. దీంతో అతని రోజు వారి సంపాదన రూ. 200 కొండెక్కింది. కుటుంబ పోషణ కోసం కూలీ పనుల ద్వారా రోజుకు రూ. 100 సంపాదించుకుని వస్తున్న నాగరత్నమ్మ కూడా ఇటీవల కొన్ని రోజులుగా కుమారుడి బాగోగులు చూసుకుంటూ ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్న ఇలాంటి తరుణంలో కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు రూ. 30 లక్షలు సమకూర్చుకోవడంలో వారికి తలకు మించిన భారంగా మారింది. కళ్ల ముందే మృత్యువుకు చేరవవుతున్న కుమారుడిని చూస్తూ రోదించని రోజంటూ లేదు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం నిరుపేద కుటుంబం ఎదురు చూస్తోంది. గుండె మార్పిడి తప్పనిసరి తమ కుమారుడికి గుండె మార్పిడి అత్యవసరమన్న విషయం తెలుసుకోగానే నిరుపేద తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలైపోయారు. అయినా ఎక్కడో ఒక ఆశ. ప్రభుత్వాస్పత్రి కాబట్టి ఉచితంగా చేస్తారన్న కొండంత ఆశ. పైగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ఎలాగూ ఉంది అనే ధైర్యంతో ఈ నెల 19న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి కుమారుడిని పిలుచుకెళ్లారు. గతంలో శివభారత్కి అందించిన వైద్య సేవలకు సంబంధించిన రిపోర్టులు, విజయవాడలోని వైద్యులు అందజేసిన నివేదికను పరిశీలించిన అనంతరం గుండె మార్పిడి అత్యవసరమని గుర్తించారు. అయితే అంతకు ముందు గుండెకు సంబంధించిన సమగ్ర పరీక్షల కోసం రూ. లక్ష వరకు, అనంతరం గుండె మార్పికి రూ. 30 లక్షల వరకు ఖర్చు వస్తుందని తేల్చి చెప్పారు. విషయం విన్న నిరుపేద తల్లిదండ్రులకు దిక్కు తోచలేదు. పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో ప్రాణాపాయం నుంచి కుమారుడిని ఎలా గట్టెక్కించాలో అర్థం కాక బరువెక్కిన హృదయాలతో బస్‌కు ఎక్కి శనివారం పామిడికి చేరుకున్నారు. సాయం చేయదలిస్తే.. పేరు : సి.నాగరత్నమ్మ బ్యాంక్ ఖాతా : 0422 1010 015 3521 ఐఎఫ్ఎస్ కోడ్ : ఏఎన్‌డీబీ0000422 బ్యాంక్ పేరు : ఆంధ్రాబ్యాంకు, పామిడి శాఖ అదనపు సమాచారానికి సంప్రదించండి : 73864 79722 -
చిన్నారికి చేయూత
‘దైవం మానుష రూపేణ’ అనంటారు. అలా ఉంటేనే జన్మకు సార్థకత. కళ్లెదుట బిడ్డ మృత్యువుకు దగ్గరవుతూ పంటిబిగువున ఆవేదన అణుచుకున్న దంపతులకు జిల్లాకలెక్టర్ బి.లక్ష్మీకాంతం ప్రాణదాతగా నిలిచారు. ప్రభుత్వ వైద్యులు డీల్ చేయలేని కేసు కేవలం ఒక్క ఫోన్‌కాల్‌తో పరిష్కరింప చేశారు. కలెక్టర్ కోరిక మేరకు సదరు డాక్టరు చెంతకు వెనువెంటనే చిన్నారిని అంబులెన్స్‌లో తరలింప చేశారు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ల్లేవు. కన్నీటితో జిల్లాపరిపాలనాధికారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వివరాల్లోకి వెళితే... లబ్బీపేట (విజయవాడ తూర్పు): గుంటూరు జిల్లా పేరేచర్ల మండలం దోసపాలెంకు చెందిన సంధ్యారాణికి పుట్టుకతో ఎలాంటి గుండెజబ్బు లేదు. మూడేళ్ల వయస్సులో వచ్చిన రుమాటిక్ ఫీవర్ కారణంగా అరుదైన గుండెజబ్బుకు గురైంది. నిరుపేద కుటుంబం కావడంతో చిన్నారికి వచ్చిన జబ్బును గుర్తించలేక పోయారు. వయస్సు పెరిగినా ఎదుగుదల లేక పోవడం, కాళ్లు చేతులు సన్నగా అయిపోవడంతో గతంలో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. బాలిక అరుదైన గుండెజబ్బుతో బాధపడుతోందని, తమ వద్ద వైద్యం లేదని చేతులెత్తేసారు. అనంతరం ప్రవేటు ఆస్పత్రిలో పిడియాట్రిక్ కార్డియాలజీ వైద్యుడికి చూపించగా, ప్రస్తుతం ఆపరేషన్ చేయడం కుదరదని తేల్చి చెప్పారు. చేసేది లేక ఇక్కడి ప్రభుత్వాస్పత్రికి తీసుకు రాగా, పిడియాట్రిక్ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయ్యా.. మీరేదిక్కు! ఈ తరుణంలో శుక్రవారం కలెక్టర్ ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రాగా, బాలిక తండ్రి సరోజ్‌కుమార్ తమ కుమార్తె దీనస్థితిని ఆయనకు వివరించారు. తమకు మీరే దిక్కంటూ వేడుకున్నారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లాల్‌ను కలెక్టర్ వివరణ కోరగా, పిడియాట్రిక్ కార్డియాలజి తమ వద్ద లేదని చెప్పారు. దీంతో వెంటనే కార్డియాలజిస్ట్ రమేష్‌తో మాట్లాడి బాలికకు అవసరమైన వైద్యం అందించాలని స్వయంగా కోరడంతో పాటు, తక్షణమే బాలికలను అక్కడకు తీసుకెళ్లాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వాస్పత్రి అంబులెన్స్‌లోనే బాలికను రమేష్ హాస్పటల్‌కు తరలించారు. బాలిక వైద్యం పట్ల తక్షణమే స్పందించిన కలెక్టర్ ఔదార్యాన్ని అక్కడున్న వారంతా ప్రశంసించారు. గతంలో ఈ కేసులు ఎక్కువ! కాగా రుమాటిక్ ఫీవర్ కేసుల్లో ఈ రకమైన గుండె జబ్బులు ఒకప్పుడు ఎక్కువుగా చూసే వాళ్లమని, ఇటీవల కాలంలో చాలా అరుదుగా వస్తున్నట్లు బాలికకు చికిత్స చేస్తున్న ప్రభుత్వాస్పత్రి పిల్లల వైద్య విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ఎస్ విఠల్‌రావు తెలిపారు. పాపకు చికిత్స అందించడంలో ఇప్పటికే జాప్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. -
మల్టీవిటమిన్లను నమ్ముకుంటే..
లండన్ : రోజూ మల్టీవిటమిన్స్ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలూ దరిచేరవనే ధీమా పనికిరాదని తాజా అధ్యయనం హెచ్చరించింది. మల్టీవిటమిన్స్‌తో గుండె జబ్బులు, స్ర్టోక్‌లు నివారించవచ్చనే ప్రచారంపై దృష్టి సారించిన ఈ అథ్యయనం ఇవన్నీ అపోహలేనని తేల్చింది. బర్మింగ్‌హామ్‌లోని అలబామా యూనివర్సిటీ పరిశోధకులు 12 ఏళ్ల పాటు 2000 మందిని పరిశీలించిన అనంతరం సమర్పించిన పత్రంలో సప్లిమెంట్స్ వాడకం గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని నిర్ధారణకు వచ్చారు. మల్టీవిటమిన్లు గుండెకు మేలు చేయకపోగా, వీటి వాడకంతో తమ ఆరోగ్యం మెరుగుపడుతుందనే ధీమాతో ప్రజలు పొగతాగడం, జంక్ ఫుడ్ తినడాన్ని కొనసాగిస్తారని అథ్యయన రచయిత డాక్టర్ జూన్సెక్ కిమ్ హెచ్చరించారు.మల్టీవిటమిన్స్, మినరల్ సప్లిమెంట్లు కార్డియోవాస్కులర్ జబ్బులను నివారించలేవని ఆయన స్పష్టం చేశారు. తమ అథ్యయన వివరాలతో మల్టీవిటమిన్లు, మినరల్ సప్లిమెంట్లపై అపోహలు తొలిగి, గుండె జబ్బుల నివారణకు మెరుగైన పద్ధతులకు ప్రజలు మొగ్గుచూపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. గుండె జబ్బులకు దూరంగా ఉంటాలంటే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయడంతో పాటు, ధూమపానానికి స్వస్తిపలకడం వంటి అలవాట్లను అలవరుచుకోవాలని సూచించారు. ఈ అథ్యయనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్లో ప్రచురితమైంది. -
మిల్క్‌షేక్‌తో గుండెకు షాక్
లండన్ : మిల్క్ షేక్‌లతో గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉందని తాజా అథ్యయనం హెచ్చరించింది. స్నేహితులు, బంధువులు ఇచ్చే విందుల్లో మునిగి తేలిన అనంతరం వారిలో గుండె వైఫల్యానికి దారితీసే అధిక రక్తపోటు ముప్పు పెరుగుతున్నట్టు తాజా అథ్యయనం వెల్లడించింది. పాల ఉత్పత్తులతో రూపొందిన ఈ తరహా ఆహారంతో రక్తంలో కొవ్వు, కొలెస్ర్టాల్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయని తాజా అథ్యయనంలో గుర్తించారు. అధిక కొవ్వుతో కూడిన ఆహారం తీసుకున్న కొందరు వెంటనే మరణించిన ఉదంతాలను ఈ సందర్భంగా పరిశోధకులు ప్రస్తావిస్తున్నారు. అధిక కొవ్వు కలిగిన డైరీ ఉత్పత్తులు ప్రమాదకరమని అథ్యయనానికి నేతృత్వం వహించిన మెడికల్ కాలేజ్ ఆఫ్ జార్జియాకు చెందిన డాక్టర్ నీల్ వీన్‌ట్రాబ్ చెప్పారు. పెద్దలు తాము తీసుకునే రోజువారీ ఆహారంలో కొవ్వు శాతం 20 నుంచి 35 శాతం మించకుండా చూసుకోవాలని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచించింది. -
సోడాతో గుండెకు ముప్పు
లండన్ : సోడా తాగితే అరుగుదల బాగుంటుందని భావిస్తే పొరపాటే అంటున్నారు నిపుణులు..రోజుకు రెండు సోడా క్యాన్లు సేవిస్తే గుండె జబ్బుతో మరణించే ముప్పు రెండింతలు అధికమవుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. అధిక చక్కెర కలిగిన పానీయాలు సేవించే వారు గుండె పోటు, గుండె వైఫల్యం వంటి హృదయ సంబంధిత వ్యాధులతో మరణించినట్టు పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా రెండు సోడా క్యాన్లతో సమానమైన 24 ఔన్సుల సోడాను రోజూ సేవించిన వారు వీటిని తీసుకోని వారితో పోలిస్తే రెండింతలు అధికంగా గుండె జబ్బుల బారిన పడి మరణించే రిస్క్ రెండింతలుగా ఉన్నట్టు తేలిందని పరిశోధకులు చెప్పారు. తీపిపదార్ధాలు అధికంగా తీసుకునే వారిలో మరణాల ముప్పు పెరిగినట్టు తాము గుర్తించలేదని తెలిపారు. చక్కెర అధికంగా ఉన్న పానీయాలతోనే గుండెకు ముప్పు అధికమని చెప్పారు.వీటిలో ఇతర పోషకాలు లేని కారణంగా శరీరంలో చక్కెర స్ధాయిలు అనూహ్యంగా పెరగడంతో జీవక్రియలపై సత్వర ప్రభావం ఉంటుందని 45 ఏళ్ల పైబడిన 17,930 మందిపై ఆరేళ్ల పాటు జరిపిన అథ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు డాక్టర్ వెల్ష్ వెల్లడించారు. -
చిన్నిగుండెకు పెద్ద కష్టమొచ్చింది
చిన్ని గుండెకు పెద్ద కష్టమొచ్చింది.. తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడే కష్టాలు మొదలయ్యాయి..జన్మించిన తర్వాత మరీ ఎక్కువయ్యాయి.. 11 నెలల చిన్నారి గుండెకు చిల్లులు పడ్డాయి...దీంతో తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతోంది.. తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు... వారు నిరుపేదలు.. ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి... ఎవరైనా దాతలు ఆర్థికసాయం చేస్తే తమ బిడ్డను బతికించుకుంటామని వారు వేడుకుంటున్నారు. ప్రొద్దుటూరు క్రైం : రాజుపాళెం మండలం పొట్టిపాడుకు చెందిన లక్షి, రాజయ్య దంపతులకు కీర్తన (3), చిన్ని కీర్తన (11 నెలలు) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజయ్య వ్యవసాయ కూలీ. అతను రోజూ పనికి వెళ్తే గానీ.. సంసారం జరగడం కష్టం. ఉన్నంతలోనే ఆ కుటుంబం సంతోషంగా ఉండేది. సాఫీగా ముందుకు సాగుతున్న తరుణంలో రెండో పాప గుండెకు రంధ్రాలు పడ్డాయని డాక్టర్ చెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. తల్లి గర్భంలోనే కష్టాలు: రెండో సారి గర్భం ధరించిన లక్ష్మీ తరచూ ఆస్పత్రికి వెళ్లేది. స్కానింగ్ చేయగా.. లోపల బిడ్డ పెరుగుదల లేదు. పరిశీలించిన వైద్యురాలు గుండెకు సమస్య ఉన్నట్టు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆమె ఆడ పిల్లను ప్రసవించింది. పరిశీలించిన డాక్టర్ ఐదు నెలల తర్వాత పరీక్షలు చేస్తామని చెప్పారు. ఐదు నెలల తర్వాత డాక్టర్ వద్దకు వెళ్లగా గుండెకు రంధ్రాలు ఉన్నాయని.. చెడు రక్తం, మంచి రక్తం కలిసి గుండెలో ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డ పెరగదన్నారు. ఎప్పుడూ పడుకునే ఉంటుంది: చిన్ని కీర్తనకు 11 నెలలు వచ్చినా కూర్చోలేదు. పాలు మాత్రమే తాగుతుంది. ఆహార పదార్థాలు తినిపిస్తే ఏడుస్తుందని తల్లి లక్ష్మీ తెలిపింది. హైదరాబాద్‌లో మంచి ఆస్పత్రులు ఉన్నాయని.. అక్కడికి వెళ్తేనే పాపకు నయం అవుతుందని వైద్యులు, పలువురు తెలిసిన వారు వారికి సూచిస్తున్నారు. విజయవాడ, తిరుపతిలో ఆస్పత్రులు ఉన్నా టెట్రాలజి ఆఫ్ ఫ్యాల్లెట్ వ్యాధిని నయం చేసే ఆస్పత్రులు అక్కడ లేవని చెప్పినట్లు లక్ష్మీ దంపతులు చెబుతున్నారు. గుండెకు రెండు, లేదా అంతకంటే ఎక్కువ రంధ్రాలు ఉన్నట్లు తెలుస్తోం దని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. రెండు, మూడు ఆపరేషన్లు చేయాల్సి వస్తుంద ని చెప్పారని తెలిపారు. అయితే ఇపుడు హైదరాబాద్‌కు వెళ్లడానికి తమ వద్ద చిల్లి గవ్వ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్‌కు రూ.2–3 లక్షలు అవసరం అవుతాయ ని వైద్యులు తెలిపారు. చేతిలో రూపాయి కూడా లేని ఆ దంపతులు తమ కుమార్తెను ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించుకుంటున్నారు. ఎలాగైనా తమ బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే చిన్నారి కీర్తనను బతికించుకుంటామని వారు వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన వారు 7680053675 అనే సెల్ నంబర్‌కు ఫోన్ చేయాలని వారు కోరుతున్నారు. ఆంధ్రా వాళ్లకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు వైద్యుల సూచన మేరకు లక్ష్మీ దంపతులు చిన్ని కీర్తనను హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించారు. తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పడంతో ఈ ఏడాది జనవరిలో వెళ్లారు. ఆంధ్రా వాళ్లకు ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేయబోమని, ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొనడంతో వారికి ఏం చేయాలో పాలుపోలేదు. నాలుగైదు సార్లు హైదరాబాద్‌కు తిరగడంతో రూ. 2 లక్షల దాకా ఖర్చు అయినట్లు వారు చెబుతున్నారు. కుమార్తెను బతికించుకునేందుకు గ్రామంలో తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకొని ఆస్పత్రుల చుట్టూ తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు. -
పరి పరిశోధన
స్టాటిన్ మందుల వాడకంపై కొత్త ఆలోచన... గుండె జబ్బు చేస్తే... శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించే మందులు జీవితాంతం వాడాలని డాక్టర్లు చెబుతూంటారు. స్టాటిన్లు అని పిలిచే ఈ మందులతో దుష్ప్రభావాలు చాలా ఎక్కువ. అయితే చిన్న రక్త పరీక్ష ద్వారా గుండె జబ్బు చేసిన వారికి నిజంగానే స్టాటిన్ల అవసరం ఉందా? లేదా? అన్నది తేల్చవచ్చునని అంటున్నారు ఓ విలేకరి. ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆస్ట్రేలియన్ సైన్స్ రిపోర్టర్ మేరియానే దిమాసీ అంచనా ప్రకారం... కొలెస్ట్రాల్ మోతాదును అంచనా వేసేందుకు చేస్తున్న పరీక్షల్లో తప్పులున్నాయి. శరీరానికి చెడు చేస్తుందని భావిస్తున్న ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ మోతాదును కాకుండా... ప్రతి ఎల్డీఎల్ కణానికి అతుక్కుని ఉండే అపోలిపోప్రోటీన్ బీ100 (అపోబ్ బీ)ను లెక్కపెట్టడం మంచిదంటున్నారు దిమాసీ. దీనివల్ల శరీరంలో ఎల్డీఎల్ కణాలు ఎన్ని ఉన్నాయో స్పష్టంగా తెలుస్తుందని, తదనుగుణంగా స్టాటిన్ల వాడకంపై ఒక నిర్ణయానికి రావచ్చునని దిమాసీ అంచనా. అపోబ్ బీ ప్రొటీన్ కూడా గుండె జబ్బులను గుర్తించేందుకు మెరుగ్గా ఉపయోగపడుతుందని సైన్స్ చెబుతోంది. అయితే ఈ పరీక్ష కొంచెం ఖరీదైంది కాబట్టి.. చౌకగా చేయగల ఎల్డీఎల్, నాన్ హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పరీక్షలు చేస్తున్నారని.. ఫలితంగా అవసరం లేని వారు కూడా స్టాటిన్లు వాడుతూ దుష్ప్రభావాల బారిన పడుతున్నారని అంటున్నారు. చక్కెరలు తక్కువ, క్యాల్షియం ఎక్కువ చేస్తే కేన్సర్‌కు చెక్? చక్కెరలు తక్కువగా అందేలా చేస్తే కేన్సర్‌ను జయించవచ్చునని చాలామంది చెబుతూంటారు. అయితే ఈ పద్ధతి అన్ని కేన్సర్ల విషయంలో ఉపయోగపడకపోవచ్చునని అంటున్నారు సింగపూర్ శాస్త్రవేత్తలు. కొన్ని రకాల కేన్సర్లు చక్కెరలు తగ్గినా సాధారణంగా విస్తరించాయని.. ఇంకొన్నింటి విస్తరణ వేగం మందగించిందని తాము ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నామని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డాక్టర్ ఈగన్ ఓగ్రీస్ తెలిపారు. అయితే ఈ ప్రయోగాల సందర్భంగా తాము ఒక కొత్త విషయాన్ని గుర్తించామని.. చక్కెరలు బాగా తగ్గిన సందర్భాల్లో కేన్సర్ కణాలు తమ మనుగడ కోసం కాల్షియంపై ఆధారపడటం మొదలుపెట్టాయని ఆయన చెప్పారు. అతితక్కువ మోతాదులో ఉండే చక్కెరలు.. కేన్సర్ కణాల పై పొరలపై వోల్టేజీ మార్పులకు కారణమై క్యాల్షియం అయాన్లు లోనికి ప్రవేశించేలా చేస్తున్నట్లు తెలిసిందని అన్నారు. ఈ అంశం ఆధారంగా కేన్సర్ వ్యాధికి సరికొత్త చికిత్స అందించే అవకాశముందని ఆయన అంచనా వేస్తున్నారు. చక్కెరలను గణనీయంగా తగ్గిస్తూనే, క్యాల్షియం మోతాదును గణనీయంగా పెంచడం ద్వారా కేన్సర్ కణాలను నాశనం చేయవచ్చునని వీరు సూచిస్తున్నారు. వ్యోమగాములకు వ్యర్థాలతోనే ఆహారం? వినేందుకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించే విషయమిది. భవిష్యత్తులో సుదూర గ్రహాలకు పయనమయ్యే వ్యోమగాములకు వారి వ్యర్థాలతోనే ఆహారాన్ని సిద్ధం చేయవచ్చునని అంటున్నారు పెన్‌స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. మూత్రాన్ని శుద్ధి చేసుకుని మంచినీరుగా మార్చుకుని వాడుకోవచ్చునని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారుగానీ.. ఇలా వ్యర్థాలను ఆహారంగా మార్చుకునే ఆలోచన మాత్రం ఇదే తొలిసారి. అంతరిక్ష ప్రయోగాలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ కాబట్టి.. వ్యోమగాములకు తగినంత ఆహారం నిల్వ చేయడమూ ఆర్థికంగా భారమవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో అతితక్కువ ఖర్చుతో వారికి ఆహారం అందించడం ఎలా అన్నది ఓ సవాలుగా మారింది. అయితే కొన్ని రకాల బ్యాక్టీరియాను ఉపయోగించుకుని మానవ వ్యర్థాలనే ఆహారంగా మార్చవచ్చునని పెన్‌స్టేట్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూమి మీద వ్యర్థాలు ఎరువుగా మారుతున్నట్లే కొన్ని బ్యాక్టీరియా మానవ వ్యర్థాల ద్వారా ప్రొటీన్లు, కొవ్వులను ఉత్పత్తి చేయగలవని వీరు గుర్తించారు. అంతేకాకుండా కేవలం 13 గంటల్లోనే సగం వరకూ వ్యర్థాలను ఆహారంగా మార్చడం వీలైందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ క్రిస్టోఫర్ హౌస్ తెలిపారు. అయితే తాము మానవ వ్యర్థాలను కాకుండా... కృత్రిమంగా తయారు చేసిన, ద్రవ, ఘన వ్యర్థాలను ప్రయోగాల్లో ఉపయోగించామని చెప్పారు. -
ఎక్కువసేపు నిద్రతో ఆరోగ్యకరమైన డైట్
లండన్ : కంటినిండా కునుకు ఉంటే రోజంతా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండొచ్చని అంటుంటారు. అయితే రాత్రిపూట ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం తగ్గి...ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అబ్బుతాయని యూకేలోని కింగ్స్ కాలేజీ లండన్ పరిశోధకులు చెబుతున్నారు. దీని ద్వారా ఊబకాయం, హృద్రోగాలు వచ్చే ప్రమాదం తగ్గుతుందంటున్నారు. 42మంది నిద్ర సమయాల్లో మార్పులు చేసి పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. -
పెళ్లి కాని వారికే ప్రమాదం ఎక్కువ
న్యూయార్క్ : పెళ్లంటే నూరేళ్ళ మంట అని కొందరు సమర్ధించడం, మనం వినే ఉంటాం. అయితే ఇది ముమ్మాటికీ తప్పేనని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. పెళ్లి అయిన వారి కంటే పెళ్లి కాని వారికే గుండె సంబంధిత వ్యాధుల్లో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని కొత్త అధ్యయనం వెల్లడించింది. గుండె సంబంధిత వ్యాధులతో మరణించడం, వైవాహిక స్థితికి ఉన్న సంబంధాన్ని తెలుపుతూ పరిశోధకులు మొదటిసారి అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. గుండె సంబంధిత పేషెంట్లపై వివాహ ప్రభావం చూసి తాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాయని అమెరికాలోని అట్లాంటాలో ఉన్న ఎమోరి యూనివర్సిటీలో పనిచేసే మెడిసిన్ ప్రొఫెసర్, లీడ్ రీసెర్చర్ అర్షద్ క్వియుమి చెప్పారు. వివాహంతో కేవలం సోషల్ సపోర్టు మాత్రమే కాక, ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నారు. గుండె సంబంధిత వ్యాధుల వారికి వివాహం చాలా ముఖ్యమని చెప్పారు. కాగా, పరిశోధకులు అంతకముందు జరిపిన అధ్యయనాల్లో విడాకులు తీసుకున్న వారు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిసింది. అదేవిధంగా గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల్లో పెళ్లి కాని వారే ఎక్కువగా మరణం బారిన పడుతున్నారని కూడా తాజా అధ్యయనం పేర్కొంది. కరొనరీ అర్టరీ వ్యాధికి కార్డియాక్ కాథెటరైజేషన్ చికిత్స తీసుకుంటున్న 6,051 మంది పేషెంట్లపై జరిపిన అధ్యయనంలో విడాకులు తీసుకున్న, అవివాహిత, వితంతువుల ఫలితాలు చాలా ప్రతికూల ఫలితాలు వచ్చాయని పరిశోధకులు తెలిపారు. వివాహం చేసుకున్న పేషెంట్లకు, అవివాహిత షేషెంట్లకు మధ్య జరిపిన ఈ అధ్యయనంలో, ఏ వ్యాధి కారణం చేతనైనా మరణించే వారిలో 24 శాతం మంది అవివాహిత పేషెంట్లు ఉంటారని, అదేవిధంగా హృదయ సంబంధ వ్యాధి నుంచి అయితే 45 శాతం మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని వెల్లడించారు. పెళ్లి కాని వారికే 40 శాతం ఎక్కువగా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. పేషెంట్లపై నాలుగేళ్లుగా జరిపిన అధ్యయనం అనంతరమే పరిశోధకులు ఈ ఫలితాలను వెలువరించారు. జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. -
చిన్న వయసులో బట్టతల.. ముప్పే
కోల్‌కతా: చిన్న వయస్సులోనే బట్టతల వచ్చినా, తల వెంట్రుకలు నెరిసినా అది గుండె జబ్బుల ప్రమాదానికి సంకేతమని ఓ అధ్యయనంలో తేలింది. మగవారిలో 40 ఏళ్ల కంటే ముందుగానే బట్టతల వచ్చినా, తల వెంట్రుకలు నెరిసినా గుండె జబ్బులు వచ్చే అవకాశం.. ఊబకాయం ఉన్న వారిలో కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని రుజువైంది. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, కుటుంబంలోని వ్యక్తికి పిన్న వయస్సులోనే గుండెజబ్బులు వచ్చినా, ఒబెసిటీ, బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నా, పొగతాగే అలవాటున్న వారికి గుండెరక్తనాళాల్లో సమస్య తలెత్తే అవకాశాలున్నాయని.. కానీ, బట్టతల, జుట్టు నెరవటం, ఒబెసిటీ లక్షణాలను బట్టి గుండె రక్తనాళాల్లో సమస్యలను తేలిగ్గా గుర్తించే వీలుంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముందుగానే తల వెంట్రుకలు నెరిసిన వారిలో మిగతా వారితో పోలిస్తే 50 శాతం అధికంగా రక్తనాళాల్లో సమస్యలు ఎక్కువగా రావచ్చని, అదే బట్టతల వచ్చిన వారిలో మిగతా వారితో పోలిస్తే 49 శాతం ఎక్కువగా ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయని చెబుతున్నారు గుజరాత్‌లోని యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చి సెంటర్‌కు చెందిన సచిన్ పాటిల్. చిన్న వయసు లోనే తలవెంట్రుకలు నెరిసినా బట్టతల వచ్చినా ఆమేరకు రక్తనాళాల వయస్సులో కూడా మార్పులు సంభవిస్తాయని ఆయన తెలిపారు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన కార్డియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సదస్సులో ఈ అధ్యయన ఫలితాలను ప్రకటించారు. అధ్యయనంలో భాగంగా 40 ఏళ్ల లోపు 790 మంది పురుషుల్లో గుండెరక్తనాళాల్లో సమస్యలను అధ్యయనం చేశారు. ఈ ఫలితాలను అదే వయస్సు కేటగిరీకి చెందిన 1,270 ఆరోగ్య వంతులైన పురుషులతో పోల్చి చూశారు. మిగతా వారితో పోలిస్తే ఒబెసిటీ ఉన్న వారిలో 4.1 రెట్లు ఎక్కువగా రక్తనాళాల్లో సమస్యలు వస్తుండగా ముందుగానే జట్టు నెరవటం, బట్టతల కారణంగా ఆ ముప్పు 5.6 రెట్లు ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలోనే చిన్న వయస్సులోనే జట్టు తెల్లబడుతున్న లేదా బట్టతల వస్తున్న వారికి ఎలాంటి ముందు జాగ్రత్తలు, చికిత్స అవసరమో నిర్ణయించటం మరింత సులువు కానుందని కార్డియాలజిస్ట్ ధమ్దీప్ హుమానే అన్నారు. -
పిల్లల్లో ఐక్యూ ఎక్కువైతే ఆయుర్దాయమూ ఎక్కువే!
పరిపరిశోధన స్మార్ట్‌గా ఎక్కువ ఐక్యూతో ఉండే పిల్లల ఆయుర్దాయం ఎక్కువ అంటున్నారు స్కాట్లాండ్ సైంటిస్టులు. ఇలాంటి పిల్లలకు గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్లు, శ్వాసకోశసమస్యలు వచ్చే అవకాశాలు బాగా తక్కువట. స్కాట్‌ల్యాండ్‌లో 1936లో పుట్టిన 33,536 మంది పురుషులు, 32,229 మంది మహిళల పై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా నిపుణులు ఈ నిర్ణయానికి వచ్చారు. మంచి ఐక్యూతో ఉన్న ఆ పిల్లలను పదకొండో సంవత్సరం నుంచి మొదలుకొని... వాళ్లకు 79వ ఏడు వచ్చే వరకు సుదీర్ఘకాలం పాటు అంచెలంచెలుగా ఈ అధ్యయనం సాగించారు. అందులో తేలిన విషయం ఇది. మిగతావాళ్లతో పోలిస్తే ఐక్యూలో మంచి స్కోర్లు సాధించే పిల్లల్లో – శ్వాసకోశవ్యాధుల వల్ల వచ్చే ముప్పు 28 శాతం తక్కువనీ, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 25 శాతం తక్కువనీ, పక్షవాతం వచ్చే రిస్క్ 24 శాతం తక్కువని చెబుతోంది ఈ స్కాటిష్ అధ్యయనం. ఈ విషయాలన్నీ ప్రతిష్ఠాత్మకమైన మెడికల్ జర్నల్ బీఎమ్జేలోనూ ప్రచురిత మయ్యాయి. ‘‘అయితే ఇలా జరడానికి కారణాలు ఏమిటన్నది మాత్రం ఇంకా పూర్తిగా తెలియరావడం లేదు. బహుశా ఇలాంటి వారికి ఉండే మంచి విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం, సామాజిక వివక్ష లేకపోవడం లేదా తక్కువగా ఉండటం వంటి అంశాలు వాళ్ల సుదీర్ఘ ఆయుర్దాయానికి తోడ్పడుతుండ వచ్చు’’ అంటున్నారు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న నిపుణులు. -
కడుపును క్లీన్ చేసే కాలీఫ్లవర్...
గుడ్‌ఫుడ్ ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో కాలిఫ్లవర్‌ది అగ్రస్థానం అని చాలామంది న్యూట్రిషనిస్ట్‌లు అంటారు. గోబి పువ్వు అని కూడా పిలిచే కాలిఫ్లవర్ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని... కాలిఫ్లవర్‌లో కొలెస్ట్రాల్ దాదాపుగా ఉండదు కాబట్టి గుండె జబ్బులు ఉన్న వాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. ఇది గాయాల/దెబ్బల వల్ల కలిగే వాపు, మంట, నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గాలనుకున్న వారికి దీన్ని సిఫార్సు చేయవచ్చు. డయాబెటిస్, పక్షవాతం, మెదడుకు సంబంధించిన అలై్జమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులను ఇది నివారిస్తుంది. అలర్జీలతో పాటు జలుబును సమర్థంగా తగ్గించే సామర్థ్యం కాలిఫ్లవర్‌కు ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే అనేకరకాల పోషకాలు కాలిఫ్లవర్‌లో ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్‌తోనూ సమర్థంగా పోరాడతాయి. అందుకే క్యాన్సర్ నివారిణిగా కాలిఫ్లవర్‌కు మంచి పేరుంది. శరీరంలో పేరుకునే విషాలనూ, వ్యర్థాలను సమర్థంగా శుభ్రం చేస్తుంది. అందుకే దురలవాట్లు ఉన్నవారూ లేదా వాటిని మానేసిన వారు... వంట్లోని విషపదార్థాలను దూరం చేసుకునేందుకు దీన్ని వాడటం మంచిది. స్థూలకాయులు బరువు తగ్గడానికి వంటల్లో కాలిఫ్లవర్‌ను వాడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. హార్మోన్ల సమతౌల్యతకు కాలిఫ్లవర్ బాగా దోహదపడుతుంది. మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి జబ్బులను నివారిస్తుంది. -
గుండె జబ్బులకూ ఓజోన్ కారణం!
వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే ఓజోన్ వాయువు గుండె జబ్బులతో పాటు అనేక ఇతర వ్యాధులకు కారణమవుతున్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. చైనా ప్రజలపై జరిపిన పరిశోధన ద్వారా డ్యూక్, షింగువా, డ్యూక్ కున్షాన్, పెకింగ్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధన వివరాలు జామా ఇంటర్నేషనల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఓజోన్ వాయువు ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గతంలోనే తెలిసినా గుండె జబ్బులకు కారణమవుతుందన్న విషయం గుర్తించడం ఇదే తొలిసారి. చైనాలోని ఛాంగ్సా నగరంలో కొందరిపై ఏడాది పాటు ఈ ప్రయోగం జరిపారు. ఇళ్లల్లో, బయట ఉన్న ఓజోన్, తదితర కాలుష్య కారక వాయువుల మోతాదులను గుర్తించడంతో పాటు నాలుగు విడతల్లో వీరి రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించారు. వీటితో పాటు స్పైరోమెట్రీ పరీక్షతో వారి ఊపిరిలో గుండె, శ్వాస సంబంధిత సమస్యలకు కారణమయ్యే కారకాలను గుర్తించారు. కొంత కాలం తర్వాత వీరిలో రక్తంలోని ప్లేట్లెట్లు క్రియాశీలకంగా మారడంతో పాటు రక్తపోటు కూడా ఎక్కువైనట్లు తెలిసింది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపగల మోతాదు కంటే తక్కువ మోతాదు కూడా గుండెజబ్బులకు దారితీస్తున్నట్లు వెల్లడైంది. -
ముందే చెప్పేస్తాయి
వర్షమొచ్చినా... ‘వాన రాకడ..ప్రాణం పోకడ’ చెప్పలేమని పాత నానుడి. కానీ ఇప్పుడు కొంచెం అటూఇటుగా రెండింటి అంచనాలు పెద్ద కష్టమేమీ కాదు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి వాన ఎప్పుడు వస్తుందో పది నిమి షాల ముందే చెప్పేయగల కొత్త టెక్నిక్‌ను సిద్ధం చేసింది. ‘త్రీడీ నౌ కాస్టింగ్’ అనే ఈ కొత్త పద్ధతి ఫేజ్డ్ అరే రాడార్ల సాయంతో పని చేస్తుంది. ఇది దాదాపు 60 కి.మీ విస్తీర్ణంలోని ఆకాశాన్ని వంద కోణాల్లో పరిశీలించి చినుకులు ఎప్పుడు కురుస్తాయో చెప్పేయగలదు. ఇందుకు ఈ రాడార్ తీసుకు నే సమయం కేవలం పది నుంచి 15 సెకన్లు మాత్రమే. దీన్ని మరింత సమర్థంగా పని చేయించేందుకు ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన అల్గారిథమ్‌ను సిద్ధం చేశారు. ఫలితంగా అతితక్కువ సమయంలో వర్షాలు ఎప్పుడు వస్తాయో కచ్చి తంగా అంచనా కట్టవచ్చని వారు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త రాడార్ వ్యవస్థను రైకెన్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ కంప్యూటేషనల్ సైన్సెస్‌లో ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో టోక్యో మెట్రోపాలిటన్ వర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ తదితరాలు పాల్గొన్నాయి. గుండె జబ్బు వచ్చినా.. గుండె జబ్బులను సాధారణ వైద్యులు కూడా ప్రాథమిక స్థాయిలోనే గుర్తించేందుకు వీలుగా యూరోపియన్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న పరికరాన్ని తయారు చేశారు. సూపర్ మార్కెట్లలో బార్‌కోడ్‌లను చదివేందుకు వాడే పరికరాన్ని పోలిన ఈ సరికొత్త గాడ్జెట్ గుండె తాలూకు అతిసూక్ష్మ సంకేతాలను కూడా గుర్తించగలదు. తద్వారా లక్షణాలు కనిపించకముందే గుండె జబ్బులు వచ్చే అవకాశాలను కచ్చితంగా గుర్తించే వీలు ఏర్పడుతుంది. గుండె జబ్బులను గుర్తించేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులు సంక్లిష్టమైనవి కావడం, ప్రమాదం ముంచుకొచ్చిన తర్వా త గానీ గుర్తించలేకపోవడం వల్ల ఏటా మరణాలు పెరుగుతున్నాయి. దీంతో యూరప్ శాస్త్రవేత్తలు హొరైజన్ 2020 కొలాబరేషన్ ‘కార్డిస్’ పేరుతో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది లేజర్ డాప్లర్ వైబ్రోమెట్రీ పద్ధతి ఆధారంగా పని చేస్తుంది. ఇది కాంతిని ఉపయోగించి చాతీ, గుండె కంపనాల మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది. దీంతో ధమనులు పెళసుగా మారడాన్ని, లోపలి భాగాల్లో గార లాంటిది పేరుకుపోవడాన్ని గుర్తిం చవచ్చు. వినియోగం తేలిక కాబట్టి దీనిని సాధారణ వైద్యులూ వాడవచ్చు. -
కాబోయే మాతృమూర్తులూ... బరువు పెరగకండి!
పరిపరిశోధన తల్లి కావాలనుకునే మహిళలు తమ బరువు పెరగకుండా చూసుకోవడం మేలని సూచిస్తున్నారు స్వీడన్‌కు చెందిన పరిశోధకులు. మాతృమూర్తులు కావాలనుకునే వారు తాము ఉండాల్సినంత బరువే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.ఎందుకంటే.. ఉండాల్సిన దానికంటే ఎక్కువగా బరువు ఉండే మహిళలకు పుట్టే పిల్లల్లో 3.5 శాతం మందికి కొన్ని రకాలైన పుట్టుకతో వచ్చే సమస్యలు రావచ్చని వారు హెచ్చరిస్తున్నారు. బీఎమ్ఐ ఉండాల్సిన దాని కంటే ఎక్కువగా ఉండే మహిళలకు పుట్టే పిల్లల్లో పుట్టుకతోనే గుండెజబ్బులతో పాటు కాళ్లు చేతుల్లో అవకరాలు, జీర్ణవ్యవస్థ పూర్తిగా రూపొందకపోవడంతోపాటు కొన్ని రకాల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు. దాదాపు 12 లక్షల మంది మహిళలను అధ్యయనం చేసిన స్వీడన్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ అధ్యయన ఫలితాలు బీఎంజే అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
ద్రాక్ష... గుండెకు రక్ష!
గుడ్ ఫుడ్ పండ్లలో మామిడిని ‘రారాజు’గా చెబుతారు. ‘ద్రాక్ష పండు’ను రాణిగా అభివర్ణిస్తారు. ద్రాక్ష రుచిలోనే కాదు... ఆరోగ్యాన్నివ్వడంలో తనకు తానే సాటి. గుండె జబ్బులను అరికట్టడంలో మేటి. 100 గ్రాముల ద్రాక్షపండ్లలో 69 క్యాలరీల శక్తి ఉంటుంది. 191 మైక్రోగ్రాముల పొటాషియమ్ దొరుకుతుంది. సూక్ష్మపోషకాలైన కాపర్, ఐరన్, మ్యాంగనీస్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉండదు. ద్రాక్షలోని ‘రెస్వెరట్రాల్’ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్. రక్తనాళాల్లో పూడికను నివారించి గుండెజబ్బులను అరికట్టగలదు. అలై్జమర్స్ డిసీజ్, డయాబెటిస్, క్యాన్సర్లనూ నివారిస్తుంది. రక్తనాళాలను సన్నబర్చే యాంజియోటెన్సిన్ అనే హార్మన్ ఉత్పత్తిని తగ్గించి... గుండెజబ్బులను నివారిస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్‌ను వెలువరచి రక్తనాళాలను విప్పార్చి ఉండేలా చేస్తుంది. రక్త ప్రవాహం సాఫీగా జరపడం ద్వారా గుండెజబ్బులను దరిచేరకుండా చూస్తుంది. అందుకే ద్రాక్ష అంటే గుండెకు మేలు చేసేదన్న విషయం గుర్తుంచుకోవాలి. -
స్టెంట్ వేయించుకున్న తర్వాత గుండెజబ్బు మళ్లీ వస్తుందా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 56 ఏళ్లు. ఇదివరకు ఒకసారి గుండె రక్తనాళాల్లో ఒకచోట పూడిక ఏర్పడిందని నాకు స్టెంట్ వేశారు. ఇటీవల నాకు మళ్లీ అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి వస్తోంది. ‘ఇదివరకే స్టెంట్ వేయించుకున్నాను కదా, గుండెపోటు రాదులే’ అనుకొని కొంతకాలంపాటు ఛాతీనొప్పిని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ సందేహం వస్తోంది. ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి. – రామ్మోహన్, కోదాడ ఒకసారి స్టెంట్ వేయించుకున్న తర్వాత మళ్లీ రక్తనాళాల్లో పూడికలు రావని చాలామంది మీలాగే అపోహ పడుతుంటారు. కానీ అది నిజం కాదు. స్టెంట్ సహాయంతో అప్పటికి ఉన్న అవరోధాన్ని మాత్రమే తొలగిస్తారు. కానీ కొత్తగా, మరోచోట పూడికలు రాకుండా ఆ స్టెంట్ అడ్డుకోలేదు. ఒకసారి గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి స్టెంట్ పెట్టిన తర్వాత... మళ్లీ పూడికలు రాకుండా ఉండాలంటే... వైద్యుల పర్యవేక్షణలో పూర్తిస్థాయి చికిత్స, జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీరు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు ఎలాంటి చికిత్స అందించాలో వైద్యులు నిర్ణయిస్తారు. ఒకవేళ బైపాస్ అవసరం అని చెప్పినా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అత్యాధునిక వైద్యవిధానాలతో చిన్న కోతతోనే బైపాస్ చేయడమూ సాధ్యమే. మీరు మీ ఛాతీనొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. మందులతోనే నయం అయ్యే పరిస్థితి ఉంటే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. ఇక సాధ్యమైనంతవరకు మీరు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. – డాక్టర్ సుఖేష్ కుమార్ రెడ్డి, సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్, యశోద హాస్పిల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
రుయా గుండె ఆగింది
తిరుపతి మెడికల్ : రుయా ఆస్పత్రికి రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలతోపాటు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల నుంచి నిత్యం 1,300 నుంచి 2 వేల మంది వరకు రోగులు వస్తుంటారు. ఇందులో బీపీతోపాటు గుండె జబ్బులతో బాధపడేవారు వంద మందికిపైనే ఉంటారు. వీరికోసం ఇక్కడ ఏర్పాటు చేసిన గుండె జబ్బుల విభాగానికి ప్రస్తుతం డాక్టర్లు కరువయ్యారు. ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉండాల్సి ఉంది. కానీ ఒక్క డాక్టరూ లేరు. వైద్యం కోసం వచ్చే రోగులు నరకయాతన పడుతున్నారు. ప్రత్యేక డాక్టర్ లేకపోయినా ఒకే ఒక చిన్న పిల్లల డాక్టర్‌తో మమ అనిపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు గుండెపోటుకు గురై అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులు పక్కనే ఉన్న స్విమ్స్ ఆస్పత్రికి పరుగులు తీయాల్సి వస్తోంది. భవనం చూస్తే గుండె జారిపోవాల్సిందే! రుయాలో గుండె జబ్బుల విభాగం 1986లో ప్రారంభమైంది. నాటి నుంచి ఈ విభాగాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం భవనం మొత్తం శిథిలావస్థకు చేరింది. కొన్ని గదులు నిర్మానుష్యంగా మారాయి. ఐసీయూ విభాగంలో తరచూ పైకప్పు ఊడిపడుతోంది. స్లాబు నుంచి మట్టి, రాళ్లు పడుతున్నాయి. భవనం కూలిపోతుందేమోనని రోగులు, వైద్యులు, సిబ్బంది బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విలువైన వైద్య పరికరాలు మూలనపడ్డాయి. కొత్త భవనం నిర్మించాలని చెప్పినా..! గత ఏడాది ఐఐటీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన బృందంతో కలిసి గుండె జబ్బుల విభాగంలో సీలింగ్, గోడలను పరిశీలించారు. నిపుణుల సాయంతో సీలింగ్ పటిష్టంగా ఉందా లేదా, వాటి ఆయుష్షు ఎంత ఉందో స్వయంగా చూశారు. మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు తీసుకెళ్లారు. భవనం శిథిలావస్థకు చేరిందని తేల్చారు. ఉన్నదాన్ని పడగొట్టి కొత్త భవనం నిర్మిచాలని చెప్పారు. ఏడాది కావస్తున్నా ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేరు. ఏపీఎంఎస్ఐడీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ విభాగానికి మోక్షం కలగడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీటీ సర్జన్ సేవలు నిరుపయోగం రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై అత్యవసర వైద్య సేవల కోసం పలువురు రోగులు వస్తుంటారు. ఇందులో పాలిట్రామా కేసుల్లో భాగంగా పక్కెటెముకలు విరగడం, తలకు గాయాలు, కాళ్లు, చేతులు విరిగి రక్తనాళాలు దెబ్బతినడం వంటి కేసులు అధికంగా ఉంటాయి. కార్డియాలజీ కేసులు, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆపరేషన్ చేయాలంటే ముందుగా కార్డియోథొరాసిక్ సర్జన్ (సీటీ సర్జన్) విభాగంలోని సేవలు చాలా కీలకం. రోగిని పరీక్షించి ఆపరేషన్‌కు రెఫర్ చేస్తుంటారు. దీనికోసం రుయాకు ఉస్మానియా నుంచి ఓ ప్రొఫెసర్ స్థాయి కార్డియా థొరా సిక్ సర్జన్ నియమించారు. కానీ ఆ విభాగమే లేకపోవడంతో కనీసం ఓపీ కూడా నిర్వహించలేని పరిస్థితి. -
గుండె జబ్బుల నివారణ ఇలా...
ఫ్యామిలీ డాక్టర్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. ఇటీవల మా బంధువుల్లో ఇద్దరుముగ్గురు గుండెజబ్బుతో చనిపోయారు. దాంతో నాకు గుండె జబ్బుల పట్ల ఆందోళన పెరిగింది. గుండెజబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయగలరు. – సంతోష్‌కుమార్, సత్తెనపల్లి గుండెజబ్బులు ఉన్న కుటుంబ చరిత్ర గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ప్రధాన సూచనలివి... ⇒మీలా చిన్న వయసు వారైనప్పటికీ ఇప్పట్నుంచే తరచూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ ఉండటం మేలు. ⇒డాక్టర్ సలహాల మేరకు కొన్ని మందులు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుంటూ ఉండాలి. ⇒గుండెపోటు రావడానికి డయాబెటిస్ ఒక ప్రధాన కారణం. అందుకే ఆ సమస్య ఉన్నవారు రక్తంలోని చక్కెరను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ సూచన మేరకు వారు సూచించిన వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తంలోని చక్కెరలను పరీక్షించుకుంటూ ఉండాలి. ⇒కొవ్వు పదార్థాలు ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. ⇒పొగ తాగే అలవాటును పూర్తిగా వదిలేయాలి. అలాగే పొగాకుకు సంబంధించిన ఉత్పాదనలు, వస్తువులను పూర్తిగా మానేయాలి. ⇒గుండెజబ్బుల నివారణలో ఇది చాలా ప్రధానం ⇒డాక్టర్ సూచనల మేరకు శరీరానికి మరీ శ్రమ కలిగించకుండా చేసే వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి ⇒మన ఒంటి బరువును పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ⇒రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి ⇒మనం తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఒంటికి అందేలా సమతులాహారం తీసుకోవాలి n ఆరోగ్యకరమైన జీవనశైలిని తప్పనిసరిగా పాటించాలి. ⇒ఈ కొన్ని జాగ్రత్తలతోనే చాలావరకు గుండెజబ్బులను నియంత్రించవచ్చు. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు తమ డాక్టర్లు సూచించిన మందులను తప్పక వాడుతుండాలి. ఆరోగ్యంలో ఏమాత్రం తేడా ఉన్నట్లు అనిపించినా డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం చాలావరకు నివారించవచ్చు. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియో థొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్ బంజారాహిల్స్, హైదరాబాద్. రక్తప్రసరణ లోపం వల్లనే వేరికోస్ వెయిన్స్! వాస్క్యులార్ కౌన్సెలింగ్ నా వయసు 43 ఏళ్లు. ఒక కార్పొరేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాను. మద్యం అలవాటు లేదు. కానీ రోజూ ఏడెనిమిది సిగరెట్లు మాత్రం కాలుస్తుంటాను. గడచిన ఏడాది కాలంగా కాళ్లపైన పుండ్లు వస్తున్నాయి. ఎన్ని ఆయింట్మెంట్లు వాడినా తగ్గకపోవడంతో డాక్టర్‌ను కలిస్తే వేరికోస్ వెయిన్స్ వ్యాధి ఉందని చెప్పి, చికిత్స అందిస్తున్నారు. సర్జరీ చేయాల్సి రావచ్చునని కూడా చెప్పారు. పరిశుభ్రతకు ప్రాణం ఇచ్చే నాకు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. ఇది ఒకరి నుంచి మరొకిరికి అంటుకుంటుందా? అసలు వేరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుది? ట్రీట్మెంట్ ఇది పూర్తిగా తగ్గిపోతుందా? దయచేసి తెలపండి. – కె.ఆర్. శ్రీనివాస్, నిజామాబాద్ వేరికోస్ వెయిన్స్ అనేది అంటువ్యాధి ఎంతమాత్రమూ కాదు. ఎంతకీ మానని అల్సర్లు వచ్చే ఈ వ్యాధి... సాధారణంగా నిల్చుని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంటే పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, సెక్యూరిటీ సంస్థల్లో పనిచేసేవారు, హమాలీలు, రిక్షా పుల్లర్ల వంటి వారిలో ఎక్కువగా వేరికోస్ వెయిన్స్ ఏర్పడతాయి. ఎక్కువసార్లు గర్భం ధరించినవారు, అదుపులేని షుగర్, అధిక బీపీ వ్యాధిగ్రస్తులతో పాటు అతిగా మద్యం తాగేవారు, పొగతాగేవారూ ఈ వ్యాధికి గురవుతుంటారు. యుక్తవయసు మొదలుకొని, ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసుల వారూ దీని బారిన పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం మనదేశంలో దాదాపు 15 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడంతో సరైన చికిత్స అందక చాలామంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. వేరికోస్ వెయిన్స్ సమస్య మొదట కాళ్లు, చేతులపై సాధారణ పుండ్లు ఏర్పడటంతో మొదలవుతుంది. ఒకటి రెండు వారాలు గడిచేసరికి తీవ్రమైన నొప్పి ప్రారంభమై క్రమంగా పెరుగుతుంది. పుండ్లు మానడానికి వాడే మందులు వాడినా ప్రయోజనం కనిపించదు. ఈ విధంగా కొన్ని నెలలు గడిచేసరికి పుండ్లు పెద్దవై... చీము, రక్తం స్రవించడంతో పాటు దుర్వాసన ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితి వ్యక్తి శారీరకంగానే కాదు... మానసికంగానూ కుంగదీస్తుంది. హఠాత్తుగా మొదలైన పుండ్లు ఇంతటి దుర్భర స్థితికి ఎందుకు దారితీస్తున్నాయన్న మీ సందేహం సమంజసమే. మీరు అపరిశుభ్రంగా ఉండటం వల్లనో, ఇతరుల నుంచి అంటువ్యాధిగానో ఇవి వచ్చినవి కాదు. ఇవి ప్రధానంగా రక్తప్రసరణలోని లోపాల వల్ల వచ్చిన సమస్య. గుండె పంప్ చేసిన శుద్ధమైన (ఆక్సిజన్ కలిగిన) రక్తాన్ని ధమనులు శరీరంలోని అన్ని భాగాలకు తీసుకెళ్తాయి. అదేవిధంగా శరీర భాగాల నుంచి కార్బన్ డై ఆక్సైడ్ కలిగిన రక్తాన్ని సిరలు గుండెకు తీసుకెళ్తుంటాయి. కొందరిలో ఈ సిరలు బలహీనపడటం వల్ల లేదా వాటిలో అడ్డంకులు ఏర్పడటం వల్ల వాటి రక్తప్రసరణ సామర్థ్యం తగ్గిపోతుంది. కాళ్లు, చేతులలో సిరలు ఇలా రక్తాన్ని సక్రమంగా ప్రసరించలేనప్పుడు భూమి ఆకర్షణకు వ్యతిరేక దిశలో పైకి వెళ్లాల్సిన రక్తం... అలా వెళ్లేందుకు బదులు వెనకకు వస్తుంటుంది. ఇది వేరికోస్ వెయిన్స్ వ్యాధికి కారణమవుతుంది. మీరు తగిన చికిత్సను కొనసాగించండి. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడండి. పరిస్థితి మెరుగుపడి సాధారణ జీవితం గడపగలుగుతారు. వేరికోస్ వెయిన్స్ వ్యాధికి సంబంధించి నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో కాళ్లలో వాపులు వస్తాయి. రెండో దశలో రాత్రిళ్లు కాలి పిక్కలు, కండరాలు పట్టేస్తుంటాయి. మూడో దశలో కాలి చర్మం రంగు మారుతుంది. నాలుగో దశలో కాళ్లలో దురదలు రావడం, పండ్లు ఏర్పడటం, రక్తం గడ్డకట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి దశను బట్టి చికిత్స చేస్తారు. నాలుగో దశ అత్యంత ప్రమాదకరమైనది. సమస్య తీవ్రం కావడంతో పుండ్ల నుంచి చీము కారడం మొదలువుతంది. ఈ వ్యాధికి సంబంధించిన అత్యాధునిక చికిత్స ప్రక్రియలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వేరికోస్ వెయిన్స్ వ్యాధి మొదటి, రెండో దశల్లో చికిత్స ప్రారంభిస్తే, మందులు, జీవనశైలిలోమార్పులతోనే వ్యాధిని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇక వ్యాధి మూడు, నాలుగు దశల్లో వాçస్క్యులార్ సర్జరీ అవసరమవుతుంది. దాదాపు 30 శాతం వ్యాధిగ్రస్తులకు సర్జరీతోనే పూర్తి ఉపశమనం లభిస్తుంది. ఏ దశలో అయినా డాక్టర్ సూచనలను యథాతథంగా పాటిస్తూ జీవనశైలిని మార్చుకోవడం అన్న అంశానికి ఏ దశలో చికిత్స సమయంలోనైనా అధిక ప్రాధాన్యం ఉంటుంది. చాలా సందర్భాల్లో కొంత ఉపశమనం కనిపించగానే మందులు మానేయడం, కోర్సు పూర్తయిన తర్వాత ఇక మళ్లీ డాక్టరు దగ్గరికి వెళ్లకుండా ఉండటం వల్ల వ్యాధి ముదిరిపోయిన కేసులు ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా చేయడం ప్రమాదకరమైనందు వల్ల ఈ వ్యాధి వచ్చిన వారు తప్పనిసరిగా సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు డాక్టర్‌ను క్రమం తప్పకుండా సంప్రదిస్తూ, వారి సూచించిన చికిత్స ప్రక్రియలను, జాగ్రత్తలను తప్పక పాటించాలి. డా‘‘దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులార్ అండ్ ఎండో వాస్క్యులార్ సర్జన్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
తెల్లజుట్టు ఉంటే హృద్రోగ ముప్పు!
లండన్: తెల్లజుట్టు ఉన్న పురు షులకు గుండె వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. అథెరోస్లె్క రోసిస్(రక్తనాళాలు బిరుసెక్క డం), జుట్టు తెల్లబడటంల మధ్య కొన్ని పోలికలు ఉన్నట్లు ఈజిప్టు లోని కైరో వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. 545 మంది పురుషులపై వీరు పరిశోధన సాగించి ఈ విషయం తేల్చారు. వయసుతో సంబంధం లేకుండా, తెల్లజుట్టు ఎక్కు వగా ఉన్నవారికి హృద్రోగాలు వచ్చే అవకాశం ఎక్కువనీ, తెల్లజుట్టు తక్కు వ ఉంటే ముప్పు తక్కువని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ‘అథెరోస్లె్కరోసిస్, జుట్టు తెల్లబడటం.. ఇవి వచ్చినప్పుడు శరీరంలో ఒకేరకమైన మార్పులు కలుగుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ వీటి సమస్యా అధికమవుతుంది’ అనే శామ్యూల్ అనే వైద్యుడు చెప్పారు. -
థైరాయిడ్ ‘తేడా’తో గుండె జబ్బులు
న్యూయార్క్: థైరాయిడ్ గ్రంధి పనితీరులో చిన్నపాటి తేడా ఏర్పడినా తీవ్రమైన హృద్రోగ సమస్యలు తలెత్తవచ్చని పరిశోధకులు కనుగొన్నారు. ఈ తాజా పరిశోధన మేరకు తీవ్రమైన గుండె జబ్బులు ఉన్నవారిలో థైరాయిడ్ హార్మోన్లుగా పిలిచే టీఎస్‌హెచ్(థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్), టీ4ల స్థాయి ఎక్కువగా, టీ3 స్థాయి తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పరిశోధకులు గుర్తించారు. టీ4 స్థాయి ఎక్కువైతే గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయని నిర్ధారించారు. ఇందు కోసం మొత్తం 1,382 మంది హృద్రోగ బాధితులపై పరిశోధన చేశారు. టీఎస్‌హెచ్ స్థాయి 7 ఎంఐయు/లీ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ప్రాణాపాయం సంభవించే అవకాశాలున్నాయని పరిశోధకుల్లో ఒకరైన భారతీయ శాస్త్రవేత్త లక్ష్మీ కణ్ణన్ చెప్పారు. థైరాయిడ్ పనితీరు మందగించడంతో ఏర్పడే హైపోథైరాయిడిజం వల్ల గుండెకు కృత్రిమ యంత్రాల సాయం అవసరమవచ్చని కొన్ని సందర్భాల్లో మరణం సంభవిస్తుందన్నారు. -
డెస్క్ ఉద్యోగాలతో గుండె, నడుముకు చేటు
లండన్: అధిక సమయం కూర్చొని పనిచేసే డెస్క్ ఆధారిత ఉద్యోగాలతో గుండె జబ్బులతో పాటు, నడుము చుట్టుకొలత పెరిగే ముప్పు ఉందని మరోసారి వెల్లడైంది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. రోజులో ఐదు పనిగంటల తరువాత కూర్చొని పనిచేసే ప్రతి అదనపు గంట వల్ల నడుము చుట్టుకొలత రెండు సెంటిమీటర్లు, గుండె జబ్బులు వచ్చే అవకాశం 0.2 శాతం పెరుగుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అలాగే రోజుకు ఐదు పనిగంటల తరువాత ప్రతి అదనపు గంట పనివల్ల చెడు కొవ్వు పెరిగి, మంచి కొవ్వు తగ్గుతోందని వెల్లడించారు. రోజుకు ఏడు గంటలు నిల్చోవడం, ఏడు మైళ్లు నడవడం ద్వారా గుండె జబ్బులను దూరం చేయొచ్చని సూచించారు. 'మానవ జాతిగా ఎదిగే క్రమంలో మనం రోజంతా కూర్చొని ఉండేలా మన శరీర నిర్మాణం జరగలేదు. వేటగాళ్లు, చెత్తసేకరణ కార్మికుల మాదిరిగా రోజుకు 7-8 గంటలు కాళ్లకు పనిచెబితేనే ఆరోగ్యంగా ఉంటామనే ఆలోచన సరళికి అలవాటు పడ్డాం' అని ప్రొఫెసర్ మైక్ లీన్ అన్నారు. -
ఒక గ్లాస్ వైన్‌తోనూ గుండెజబ్బులు!
పరిమిత మోతాదులో వైన్ తీసుకుంటే గుండెజబ్బులు తగ్గుతాయనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు శాస్త్రవేత్తలు. కేవలం ఒక గ్లాసు వైన్ తీసుకున్నా అది గుండె జబ్బుల లయ (రిథమ్)ను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మామూలు వ్యక్తులతో పోలిస్తే ఒక గ్లాసు వైన్ తీసుకునేవారిలో హార్ట్ రిథమ్ దెబ్బతినే ముప్పు ఎనిమిది శాతం ఎక్కువ. ఇక మామూలుగా తాగేవారితో పోలిస్తే ఎప్పుడో ఒకసారి తాగితే వచ్చే గుండె లయలో సమస్య వచ్చే అవకాశాలు మరీ ఎక్కువ. ఇలా ఎప్పుడో ఒకసారి తాగితే వచ్చే సమస్యను ‘హాలీడే హార్ట్ సిండ్రోమ్’గా చెబుతుంటారు. ఎప్పుడో ఒకసారి మద్యం తాగుతామని లేదా చాలా అరుదుగా తీసుకుంటామని చెబుతూ మద్యం తీసుకునే వారిలో గుండె లయకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయంటూ హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలా ఎప్పుడో ఒకసారి తాగుతామని చెప్పే 65 ఏళ్లు పైబడిన ప్రతి 100 మంది లోనూ ఏడుగురు గుండె లయకు సంబంధించిన సమస్యల బారిన పడుతుంటారనే ఆ అధ్యయన ఫలితాలను అమెరియన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి సంబంధించిన ఒక జర్నల్‌లో ప్రచురించారు. -
గుండెజబ్బులు చిన్న వయసులోనే ...
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ఈమధ్య గుండెజబ్బులు చిన్న వయసులోనే వస్తున్నాయని చదివాక ఆందోళనగా ఎక్కువైంది. దయచేసి నివారణకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయండి. - రవి, నల్లగొండ గుండెజబ్బుల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... కుటుంబ చరిత్రలో కొలెస్ట్రాల్ ఉన్నవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకంటూ ఉండాలి. అలాగే శాకాహారం (గ్రీన్‌లీఫీ వెజిటబుల్స్) తీసుకోవడం, కొవ్వులను పూర్తిగా తగ్గించడం వంటి ఆహార నియమాలు పాటిస్తూ, అవసరాన్ని బట్టి కొలెస్ట్రాల్ నియంత్రణకు మందులు తీసుకుంటూ గుండెజబ్బులను నివారించుకోవచ్చు గుండెపోటుకు ప్రధాన కారణం డయాబెటిస్. అందుకే ఆ సమస్య ఉన్నవారు డయాబెటిస్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం తప్పనిసరి. రోజూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ కనీసం మూడు నెలలకొకసారి డాక్టర్‌ను సంప్రదిస్తూ, వారు సూచించిన విధంగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అయితే ఈ వ్యాయామాలు గుండెకు భారంగా పరిణమించకుండా చూసుకోవాలి పొగాకు, దాని సంబంధించిన వస్తువులను పూర్తిగా మానేయాలి. ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 62. నాకు రాత్రిపూట మూత్రం ఎక్కువసార్లు వస్తుంటుంది. డాక్టర్లు పరీక్ష చేసి షుగరు వ్యాధి లేదన్నారు. కానీ ప్రోస్టేట్ గ్రంధి వాచడం వల్ల ఈ సమస్య కలిగిందన్నారు. ఇది తగ్గడానికి మందులు తెలియజేయ ప్రార్థన. - కె. వీరభద్రరావు, విశాఖపట్నం ప్రోస్టేట్ గ్లాండ్‌ను ఆయుర్వేద పరిభాషలో ‘పౌరుషగ్రంధి’ అంటారు. ఇది కేవలం పురుషుల్లో మాత్రమే ఉంటుంది. వయసు పైబడిన వారిలో ఇది కొద్దిగా పరిమాణం పెరగడం సహజం. దానివల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి మూత్రం మాటిమాటికీ వస్తుంటుంది. ఒక్కొక్కప్పుడు ఈ గ్రంధికి ఇన్ఫెక్షనూ సోకవచ్చు. కొందరిలో ఈ వాపు క్యాన్సరుగా పరిణమించవచ్చు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ దిగువ సూచించిన మందుల్ని రెండు నెలల పాటు వాడి పరిస్థితిని సమీక్షించుకోండి. సప్తవింశతి గుగ్గులు (మాత్రలు) ఉదయం 2, రాత్రి 2 చంద్రప్రభావటి (మాత్రలు) ఉదయం 2, రాత్రి 2 చందనాసవ (ద్రావకం): నాలుగు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి రెండు పూటలా తాగాలి. నా వయసు 23. తరచూ తలలో పేలు బాధిస్తున్నాయి. దీనికి మందు చెప్పండి. - రాధాబాయి, నకిరేకల్లు శిరోజాలలో మాలిన్యం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకుంటే తలకు పేలుపట్టే పరిస్థితి రాదు. ప్రతి రాత్రి ‘నింబతైలం’ (వేపనూనె) తలకు రాసుకుని, మరుసటిదినం కుంకుడుకాయ చూర్ణంతో తలస్నానం చేయండి. సీతాఫలాల్లోని గింజల్ని ఎండబెట్టి, పొడిచేసి, ఆ చూర్ణాన్ని నీళ్లలో ముద్దగా చేసి రోజు విడిచి రోజు శిరోజాలకు పట్టించండి. పది రోజుల్లో ఫలితం కనిపిస్తుంది. ‘కుమార్యాసవ’ ద్రావకాన్ని ఉదయం, రాత్రి నాలుగేసి చెంచాలు... సమానంగా నీళ్లు కలిపి ఒక నెలపాటు తాగితే మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్ నగర్, హైదరాబాద్ -
ఉప్పుతో భారతీయులకు పెనుముప్పే!
శరీరానికి ఉప్పు చేసే మేలు గొప్పదే. కానీ ఉప్పు మోతాదుకు మించి తింటే ముప్పు తప్పదు అంటున్నాయి పరిశోధనలు. మరీముఖ్యంగా ఉప్పు విషయంలో భారతీయులు పెద్ద తప్పు చేస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచించిన దాని కన్నా రెట్టింపు మొత్తంలో భారతీయులు తమ ఆహారంలో ఉప్పు తీసుకుంటున్నారని, దీనివల్ల గుండె సంబంధిత జబ్బుల ముప్పు పెరగడమే కాకుండా.. హఠాన్మరణాలు కూడా సంభవిస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ప్రతిరోజు ఐదుగ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలని సిఫారసు చేయగా.. 19 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు కలిగిన భారతీయులు ప్రతిరోజూ 10.98 గ్రాముల మేర ఉప్పు తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ఉప్పును మరీ అధికంగా తీసుకుంటున్నారని తెలిపింది. ఉప్పును తీసుకునే విషయంలో త్రిపుర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని, ఇక్కడ రోజుకు ఏకంగా 14గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్నారని, ఇది డబ్ల్యూహెచ్‌వో సిఫారసు చేసిన దానికన్నా మూడు రెట్లు అధికమని తెలిపింది. ‘గత 30 ఏళ్లలో భారతీయుల సగటు ఆహార అలవాట్లు మారిపోయాయి. వారు పప్పులు, కూరగాయలు, పండ్లు తీసుకోవడం తగ్గిపోయి.. ప్రాసెస్ చేసిన ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారు. దీనివల్ల వారి ఆహారంలో పూర్తిస్థాయిలో ఉప్పు, చక్కెర, హానిచేసే కొవ్వు పదార్థాలు ఉంటున్నాయి. దీనివల్ల అధిక రక్తపోటు, స్థూలకాయం, గుండె సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్‌లు ఎక్కువగా సంభవిస్తున్నాయి’ అని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన క్లైర్ జాన్సన్ తెలిపారు. ఉప్పు అధికంగా తీసుకోవడం అధిక రక్తపోటు (హై బ్లడ్‌ప్రెషర్)కు దారితీస్తున్నదని, ఇది గుండె జబ్బులకు కారణంగా మారుతున్నదని అధ్యయనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఉప్పు తీసుకోవడం తగ్గించడానికి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఉప్పును తీసుకొనే విషయంలో పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎలాంటి తేడా లేదని, అయితే, పట్టణప్రాంత ప్రజలు తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నప్పటికీ పచ్చళ్లరూపంలో అధికమొత్తం ఉప్పును స్వీకర్తిస్తున్నారని అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు గుండెజబ్బులే కారణంగా నిలుస్తున్నాయి. ప్రతి ఏడాది గుండెజబ్బుల కారణంగా 23 లక్షలమంది ప్రాణాలు విడుస్తున్నారు. 2030నాటికి ఏకంగా అధిక రక్తపోటు బారిన పడే వారి సంఖ్య రెట్టింపు అయి.. దేశ జనాభాలో 21.3 కోట్లమందికి చేరుకుంటుందని ఈ అధ్యయనం ఆందోళనపరిచే విషయాలు తెలిపింది. ‘భారత్ ఎదుర్కొంటున్న ఈ పెను సంక్షోభం గురించి ఆలోచిస్తేనే కష్టంగా ఉంది. అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా లక్షలాది మంది ప్రతి ఏడాది ప్రాణాలు విడుస్తున్నారు’ అని జాన్సన్ పేర్కొన్నారు. జాతీయంగా ఉప్పు తినడం తగ్గించేందుకు సెంటర్ ఫర్ క్రోనిక్ డిసీజ్ కంట్రోల్ (సీసీడీసీ)తో జార్జ్ ఇన్స్టిట్యూ్ట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పనిచేస్తోంది. 2025నాటికైనా డబ్ల్యూహెచ్‌వో లక్ష్యం మేరకు దేశవ్యాప్తంగా ఉప్పు తీసుకోవడాన్ని 30శాతం మేర తగ్గించడానికి భారత్ ఇప్పటినుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరముందని జార్జ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ ఝా తెలిపారు. -
నొప్పి నివారణ మందులతో గుండెజబ్బులూ వస్తాయి!
నొప్పి నివారణ మందులను ఎక్కువగా ఉపయోగిస్తే మూత్రపిండాలు పాడవడం వంటి అనర్థాలు తలెత్తుతాయన్నది తెలిసిందే. దానికి తోడు గుండెజబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇప్పుడు తాజా పరిశోధనల్లో తేలింది. నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఏఐడీ) అనే మందుల వాడకం గుండెజబ్బుల రిస్క్‌ను 20 శాతం పెంచుతుందని ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ మిలానో-బికోక్సాలో జరిగిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అక్కడ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఆండ్రియా ఆర్ఫే అనే పీహెచ్డీ స్కాలర్ దాదాపు పది లక్షల మందికి పైగా రోగుల రికార్డులను పరిశీలించిన ఆండ్రియా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఎన్ఎస్ఏఐడీలకు హార్ట్ ఫెయిల్యుర్‌కు నేరుగా ఉన్న సంబంధంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. -
గింజధాన్యాలతో గుండె జబ్బులు దూరం
ఆహారంలో గింజధాన్యాలు సమృద్ధిగా తీసుకునే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తేల్చారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, నెస్లేలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో రక్తపోటును సమర్థంగా నియంత్రించేందుకు గింజధాన్యాలు ఉపయోగపడతాయని, తద్వారా గుండెజబ్బులతో వచ్చే మరణాలను నివారించవచ్చునని తేలింది. యాభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి... ఊబకాయంతో ఉన్న వారిపై ఈ అధ్యయనం జరిగింది. కొందరికి గింజధాన్యాలు, మరికొందరికి శుద్ధి చేసిన ధాన్యాలను ఆహారంగా అందించారు. అధ్యయనం మొదట్లో, చివరలోనూ వారి జీవక్రియలపై క్షుణ్నంగా పరీక్షలు నిర్వహించారు. బీపీ కోసం మందులు తీసుకుంటున్న వారికి వాటిని కొనసాగించాల్సిందిగా సూచించారు. 8 వారాల తరువాత జరిపిన పరిశీలనలో గింజధాన్యాలు తిన్న వారిలో డయాస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్ (రెండు లబ్డబ్లకు మధ్యలో గుండె రిలాక్స్ అవుతున్నప్పుడు ఉండే అతితక్కువ పీడనం) మూడు రెట్లు ఎక్కువైనట్లు గుర్తించారు. ఇది గుండెపోటు వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందనేందుకు సూచన. -
గుండెజబ్బుల నివారణకోసం...
ఆయుర్వేద కౌన్సెలింగ్ ఆయుర్వేద మార్గంలో గుండె జబ్బుల నివారణ ఎలాగో సూచించగలరు. - సంకా పవన్‌కుమార్, తెనాలి ఆయుర్వేద శాస్త్ర ప్రాథమిక సిద్ధాంతాలలో శరీర నిర్మాణం, శరీర క్రియ అత్యంత ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. వివిధ అంగప్రత్యంగాలను విశదీకరించడంలో సుశ్రుతాచార్యులు అగ్రగామి. హృదయం ఆకారాన్ని ‘అధోముఖపుండరీకం’ (తామరపువ్వుని తలకిందులుగా చేస్తే కనపడే రూపం)తో పోల్చిచెప్పాడు. సంస్కృత శబ్ద నిరుక్తుల విశిష్టత ప్రకారం ‘హృ’ అంటే పుచ్చుకునేది (రక్తాన్ని) ‘ద’ అంటే ఇచ్చేది (రక్తాసరఫరా), ‘య’ అంటే నిలిపేది (రక్తాగారం). ఆ విధంగా ఆ భాగం క్రియావిశేషం ద్యోతకమవుతోంది. ఆయుర్వేద పరిభాషలో ‘మర్మ’ అంటే అత్యంత కీలకమైన ప్రాంతం అని అర్థం. చరకాచార్యులవారు ‘త్రిమర్మలు’ వివరించారు. అవి ‘శిరస్సు, హృదయం, వస్తి’ (మూత్రాశయం). ఆ విధంగా గుండెకు ఎంతో ప్రాధాన్యముంది. గుండెకండరం పోషణ కోసం రక్తం కావాలి. అది, గుండె సంకోచించినప్పుడు, మొదటి శాఖ అయిన ‘కరొనరీ’ ధమని ద్వారా చేరవలసిందే. గుండె పొరలు, కవాటాలు, నాడులు, సిరాధమనుల కార్యక్రమం చక్కగా ఉండటానికి ‘రస’ధాతువు ఉపకరిస్తుంది. దీని ద్వారా పోషకాలు, అంబరపీయూషం (ఆక్సిజన్) అందుతాయి. అలాంటి సరధాతువు ‘సారం’ మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. గుండెజబ్బుల నివారణకు ఈ కింద సూచించిన ఆహార, విహారాలు, ఔషధాలు అత్యంత ప్రధానమైనవి. ఆహారం : సాత్వికాహారమైన శాకాహారం మంచిది. ఉప్పు, పులుపు, కారాలు చాలా మితంగా తినాలి. తగినంత ద్రవాహారం (కొబ్బరినీళ్లు, చెరకురసం, బార్లీ జావ మొదలైనవి) సేవించాలి. మొలకలు, ఆకుకూరలు, ఇతర కందమూలాలు, తాజాపండ్లు, శుష్కఫలాలు అనునిత్యం తగుప్రమాణంలో తినాలి. అప్పుడే సమీకృత పోషకాలు లభిస్తాయి. పెరుగు, పాలు, వెన్న, నెయ్యి, మజ్జిగలు ‘ఆవు’ నుంచి లభించేవి చాలా బలకరం. పిండిపదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే బయటి పదార్థాల జోలికి వెళ్లకండి. విహారం : రాత్రి నిద్ర కనీసం ఎనిమిది గంటలుండాలి. వయసు, వృత్తిని బట్టి తగురీతిని వ్యాయామం చేయాలి. పొగతాగడం, మద్యపానాల వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. మానసిక ఉల్లాసం, ప్రశాంతత, సానుకూల ఆశావహ దృక్పథం చాలా అవసరం. శోక చింతా భయ రాగ ద్వేషాలకు దూరంగా ఉండాలి. ఔషధాలు : నిత్య దైనందిన కార్యక్రమాలలో భాగంగా సూర్యదర్శనం చేసుకోవాలి. లేత సూర్యకిరణాల వల్ల మనకెంతో ఆరోగ్యమని శాస్త్రం చెప్పింది. రోజూ ఐదు తులసి ఆకులు నమిలి మింగాలి. దీనికి రక్తం గడ్డకట్టకుండా ఉంచే శక్తి ఉంది. క్రిమిహరం, కఫహరం కూడా. సూర్యనమస్కార యోగ క్రియల వల్ల, వ్యాయామం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. అల్లం, వెల్లుల్లి కషాయం : 5 చెంచాలు రోజు విడిచి రోజు తాగితే కొలెస్త్రాల్, ఇతర కొవ్వులు రక్తాన్ని పాడుచేయవు. బీపీ ఎక్కువ కాకుండా నివారితమవుతుంది. త్రిఫలా చూర్ణం : ఒక చెంచా ప్రతి రాత్రి నీటితో సేవిస్తే సప్త ధాతువులకు బలం. మహాకోష్ఠం శుద్ధి అవుతుంది. రోజూ విరేచనం సాఫీగా అవుతుంది. అర్జున (తెల్లమద్ది) వృక్షపు కాండం మీది పట్టను (బెరడు) ఎండబెట్టి, చూర్ణం చేసి, ఒక చెంచా చూర్ణాన్ని ఆవుపాలలో మరిగించి, వడగట్టి ప్రతిరోజూ తాగితే గుండె ధమనుల్లో రక్తప్రసరణ బహుచక్కగా ఉండి, గుండె కండరానికి బలం పెంపొంది గుండెజబ్బులు దరిచేరవు. దీన్ని ‘అర్జున క్షీరపాకం’ అంటారు. అత్యవసర పరిస్థితి లేనప్పుడు స్టెంట్స్ వేయించుకున్న వారు దీన్ని ఆరుమాసాలు సేవించి, పరిస్థితిని సమీక్షించుకుంటే చక్కటి మార్పు కనిపిస్తుంది. పుష్కర మూల చూర్ణాన్ని (ఒక చెంచా) నీళ్లతో సేవిస్తే దాదాపు పైన చెప్పిన ఫలితం కనిపిస్తుంది. ఇతర ఔషధాలు : హృదయార్ణవరస (మాత్రలు) నాగార్జునాభ్రరస (మాత్రలు) ప్రభాకరవటి (మాత్రలు) గమనిక : ఈ మందుల గురించి ఆయుర్వేద వైద్యుని సంప్రదించాకే వాడాలి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
హృద్రోగాలను తెలుసుకునేందుకు కొత్త పరికరం
లండన్: జన్యు సంబంధ హృద్రోగ వ్యాధులపై అంచనా వేసేందుకు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తతో కూడిన పరిశోధకుల బృందం ఓ పరికరాన్ని కనిపెట్టింది. దీంతో ముందుగానే గుర్తించి, రాకుండా చూడొచ్చని లేదా సకాలంలో సరైన చికిత్స అందించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని లీసెస్టర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. గుండె సంబంధ వ్యాధులు రావడంలో పలు జన్యు కారకాలు దోహదపడుతాయని చాలా కాలంగా తెలిసిన విషయమే. డీఎన్ఏలో అతి తక్కువ తేడా ఉండటాన్ని సింగిల్ న్యూక్లియోటైడ్ పాలీమార్ఫిజం (ఎస్ఎన్పీ) అంటారు. ఇది వ్యక్తికి వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. ఇలాంటి దాదాపు 49 వేల ఎస్ఎన్పీలను పరిశోధకులు గుర్తించి ఓ స్కోర్‌ను రూపొందించారు. దీన్ని జీనోమిక్ రిస్క్ స్కోర్ (జీఆర్ఎస్) అంటారు. ఈ జీఆర్ఎస్ స్కోర్ ఎక్కువ ఉన్నవారికి ఎక్కువ శాతం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు గుర్తించారు. -
చేటు చెక్కర
♦ రోజూ కనీసం అరగంట... లేదా వారానికి కనీసం ♦ రెండున్నర గంటలు వ్యాయామం చేస్తే ♦ డయాబెటిస్ అదుపులో ఉంటుంది నేనొక ఇష్టం లేని అతిథిని. క్రమశిక్షణ గలవారి వంక కన్నెత్తి చూడలేను. ఆరోగ్య నియమాలు పాటించని వారితో స్నేహం చేయాలని చూస్తుంటాను. చెడు అలవాట్లతో దోస్తీ కట్టే ఆ స్నేహమూర్తులూ నన్ను ఇష్టపడరెందుకో. కానీ వాళ్లంటే నాకు ఇష్టం. ఏం చేద్దాం... ఆతిథ్యం స్వీకరించకపోతే నాకు గడవదు కదా. అందుకే నియమితమైన లైఫ్‌స్టైల్ లేనివారితో లైఫ్‌టైమ్ ఫ్రెండ్షిప్ కోసం వెళ్తుంటాను. నేను డయాబెటిస్ వ్యాధిని. ⇒ తీపి అంటేప్రాణం అనేవాళ్లు తమ ప్రాణం కోసం తీపి వదులుకునేంతగా భయపెడుతుంటాన్నేను. నేనొక టై స్టోరీ. నాదొక హారర్ స్టోరీ. ఆరోగ్యంపై గుడ్డిదనంతో వ్యవహరిస్తుంటే... నిజంగానే గుడ్డిదనం తెచ్చేలా వ్యవహరిస్తుంటా. నా గురించి నేనే (డయాబెటిస్) చెప్పుకునే కొన్ని విషయాలివి... ⇒ నేనూ, గుండెజబ్బులూ, పక్షవాతం క్లోజ్‌ఫ్రెండ్స్. నేను వచ్చిన చోటికి నా ఫ్రెండ్స్ రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ల భయం కూడా నా పట్ల భయంగా పరిణమిస్తుంటుంది. ⇒ నన్నే నిర్లక్షం చేస్తూ కళ్లతో పాటు కాళ్లూ పోవచ్చు. నేను వస్తే కాళ్లలో రక్తనాళాలు మూసుకుపోవచ్చు. నా విషయంలో కళ్లూ, కాళ్లు జాగ్రత్త అన్న మాట కేవలం ప్రాసకోసం వాడటం కాదు... నిజంగానే అది నిజం కావచ్చు. ⇒ ఇప్పుడేదో ప్రజలంతా లైఫ్‌స్టైల్స్ తప్పడంతో నా విస్తృతి ఎక్కువైంది గానీ... మానవ నాగరికతకు చాలా ముందుగానే నా ఉనికి ఉంది. నా లక్షణాలను బట్టి నన్ను మొదట క్రీ.పూ. 1500లోనే రికార్డు చేశారు. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో క్యాపడోసియాకు చెందిన ఆరేటియస్ అనే గ్రీకు ఫిజీషియన్ కూడా నా లక్షణాల వల్ల నన్ను గుర్తించాడు గానీ... గుర్తు తెలియని పాము ఏదో కాటేయడం వల్ల డయాబెటిస్ వస్తుందని అపోహ పడ్డాడు. ⇒ నేను ప్రధానంగా మూడు రకాలు అనుకుంటారు. టైప్-1, టైప్-2, గర్భవతులకు వచ్చే జస్టేషనల్ డయాబెటిస్ అని నాలో రకాలను వర్గీకరిస్తుంటారు. కానీ నేను ప్రధానంగా ఈ మూడు రూపాల్లోనే కనిపించినా... లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ (లాడా) అనీ, మెచ్యురిటీ ఆన్సెట్ ఆఫ్ ద యంగ్ (మోడీ) అనీ నాలో ఎన్నో రకాలు ఉన్నాయి. కాకపోతే ప్రధానంగా మూడు రకాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. టైప్-1 డయాబెటిస్ ఎక్కువగా చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఇది జన్యులోపం వల్ల వస్తుంది. పిల్లల్లోని రోగనిరోధక వ్యవస్థే వారికి శాపంగా మారుతుంది. పాంక్రియాస్‌లోని బీటా సెల్స్‌ను వారి రోగనిరోధక వ్యవస్థ పరాయికణాలుగా ఎంచి, వాటిని నాశనం చేస్తుంది. ఫలితంగా పాంక్రియాస్ పనిచేయని స్థితికి చేరుకుని, ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దీనినే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ అని అంటారు. పాంక్రియాస్ మందగించగానే నేను యాక్టివ్ అయిపోతాను. పాంక్రియాస్ ఉత్పత్తి చేసే ఇన్సులిన్‌కు శరీరంలోని జీవకణాలు తగిన రీతిలో స్పందించడం మానేసినా తలెత్తే మధుమేహాన్ని టైప్-2 డయాబెటిస్ అంటారు. ఇదే పరిస్థితి దీర్ఘకాలికంగా కొనసాగితే శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి దానంతట అదే నిలిచిపోయే పరిస్థితి కూడా తలెత్తుతుంది. దీనిని నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ లేదా అడల్డ్ ఆన్సెట్ డయాబెటిస్ అంటారు. కొంతమంది మహిళల్లో గర్భం దరించగానే నేను అతిథిగా వస్తుంటాను. దాన్నే జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇలాంటి వారిలో మళ్లీ నేను పర్మనెంట్‌గా వచ్చేసే అవకాశాలూ ఉన్నాయి. ప్రేమలో ఆకలీ దాహం ఉండవు. కానీ నేను ప్రేమనూ కాదు... ప్రేమగా చూసుకునే అవకాశమూ నా విషయంలో ఉండదు. అందుకే నేను కనిపిస్తే ప్రేమకు వ్యతిరేకమైన గుణాలు ఆకలి పెరగడం, దాహం వేయడం కనిపిస్తాయి. తరచు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం వంటి లక్షణాలు చాలామందిలో కనిపిస్తాయి. అసలు ఈ లక్షణం నుంచే డయాబెటిస్ అనే పేరు నాకు వచ్చిందట. డయాబెటిస్ అంటే మూత్రపు ఫౌంటేన్ అనే అర్థం కూడా ఉందట. ⇒ నేను ఒంటిని సందర్శించాక కూడా చాలామందిలో లక్షణాలేవీ కనిపించవు. అందుకే 40 ఏళ్లు దాటాక ఏడాదికి ఒకసారైనా రక్తపరీక్షలు చేయించుకోవాలి. ⇒ నేను ఒంట్లో ఉంటే గాయాలు మానవు. ఎందుకంటే అవి తియ్యగా అయిపోతాయి కదా... దాంతో హాని చేసే బ్యాక్టీరియాకు ఆ గాయాలూ తియ్యగా అనిపిస్తాయి. దాంతో గాయలు తగ్గవు. అందుకే నేను ఒంట్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే గాయమైన అవయవానికే ముప్పు. జీవనశైలిని మార్చేయాలి ⇒ నేను (డయాబెటిస్) ఉన్నట్లుగా వైద్య పరీక్షల్లో తేలితే వెంటనే జీవనశైలిని మార్చేసుకోవాలి. హైరానా పడకుండా సమస్యపై అవగాహన పెంచుకోవాలి. ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం వంటివి చేయాలి. ⇒ రక్తంలో చక్కెరస్థాయి సాధారణ స్థితిలో ఉంచుకునేందుకు వైద్యుల సలహాపై క్రమం తప్పకుండా తగిన మందులు వాడుతూ ఉండాలి. ⇒ అదనపు బరువు ఉంటే అదుపులోకి తెచ్చుకోవాలి. ప్రశాంతంగా కంటినిండా నిద్రపోవాలి. ⇒ అరుదైన పరిస్థితుల్లో తప్ప సాధారణంగా వచ్చే డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. డయాబెటిస్ వచ్చాక ఆరోగ్యకరమైన అలవాట్లతో దీనిని నియంత్రించుకోవడం తప్ప మార్గం లేదు. ⇒ అయితే, దీని గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ, వైద్యుల సలహాలపై మందులు వాడుతూ ఉంటే పూర్తి ఆరోగ్యంతో నిండు నూరేళ్లూ బతకవచ్చు. నన్ను గుర్తించడానికి కొన్ని పరీక్షలు చక్కెర వ్యాధిని గుర్తించడానికి కొన్ని రకాల రక్తపరీక్షలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి: ఫాస్టింగ్ సుగర్ టెస్ట్... కనీసం ఎనిమిది గంటల సేపు ఏమీ తినకుండా చేయించుకునే పరీక్ష ఇది. పోస్ట్ ఫుడ్ సుగర్ టెస్ట్: ఆహారం తీసుకున్న గంటన్నర లోగా పరీక్ష చేయించుకోవాలి. ర్యాండమ్ షుగర్ టెస్ట్ తిన్నా, తినకున్నా ఏదో ఒకవేళ ఈ పరీక్ష చేస్తారు. ఇవి కాకుండా, బ్లడ్ సుగర్ పరిస్థితి తీవ్రంగా ఉన్న వారికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా చేస్తారు. అయితే డయాబెటిస్ తీవ్రంగా ఉన్నవారికి ఇది అంతగా ఉపకరించదు. ఎందుకంటే అప్పటికీ షుగర్ ఎక్కువ పాళ్లు ఉంటుంది. కాబట్టి బయటి నుంచి మళ్లీ షుగర్ ఇవ్వడం సరికాదు. నా తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే మూత్ర పరీక్ష కూడా చేస్తారు. డయాబెటిస్‌ను తెలుసుకోవడం కోసం హెబీఏ1సీ అనే పరీక్షను సైతం చేస్తారు. ఇది 8 నుంచి 10 వారాల వ్యవధిలో చెక్కెర పాళ్లను సగటును తెలిపే పరీక్ష. దీన్ని పరగడుపున చేయాల్సిన అవసరం ఉండదు. ఇది చక్కెర వ్యాధిని నిర్ధారణ చేయడంతోపాటు మందులు వాడుతున్నప్పుడు చికిత్స వల్ల చక్కెర అదుపులోనే ఉంటోందా లేదా అన్న విషయం కూడా తెలుస్తుంది. ఈ జాగ్రత్తలు పాటించండి టైప్-1 డయాబెటిస్‌కు వైద్యుల సూచనపై ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే ఏకైక మార్గం ఎక్కువ మందిలో కనిపించే టైప్-2 డయాబెటిస్‌ను కొద్దిపాటి జాగ్రత్తలతో నియంత్రించుకోవచ్చు పీచు పదార్థాలు, మేలుచేసే కొవ్వులతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, శరీరం బరువు సాధారణ స్థాయికి మించి పెరగకుండా చూసుకోవడం వంటి తేలికపాటి జాగ్రత్తలతో దీని బారిన పడకుండా చూసుకోవచ్చు చేపలు, అవిసెగింజలు, వాల్నట్స్, శాకాహార నూనెల్లో మంచి కొవ్వులు ఎక్కువ వేటమాంసం (రెడ్ మీట్), వెన్న, నెయ్యి వంటి జంతు సంబంధిత కొవ్వులను చెడు కొవ్వుపదార్థాలుగా పరిగణిస్తారు. డయాబెటిస్ బారిన పడినవారు వీటికి దూరంగా ఉండటం మంచిది. చక్కెరలు మోతాదుకు మించి ఉండే కూల్‌డ్రింక్స్, స్వీట్స్, చాక్లెట్లు వంటి వాటికి దూరంగా ఉండటంతో పాటు పొగతాగడాన్ని మానేయడం ద్వారా కూడా రక్తంలో చక్కెరల స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. -
మెనోపాజ్ దాటాక గుండె జబ్బులు ఎక్కువా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 43 ఏళ్లు. మెనోపాజ్ దాటిన మహిళలకు గుండెజబ్బులు ఎక్కువని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఇది వాస్తవమేనా? - శ్రీలేఖ, కాకినాడ గతంలో పురుషులతో పోలిస్తే... మహిళల్లో గుండెజబ్బులు తక్కువగానే ఉండేవి. కానీ ఇప్పుడు స్త్రీలలోనూ గుండెజబ్బుల ముప్పు పెరుగుతోంది. ఎప్పటికప్పుడు మారిపోతున్న జీవనశైలి, క్రమపద్ధతిలో లేని నిద్ర, ఆహార నియమాలు, పనుల ఒత్తిళ్లు... లాంటి పరిస్థితులన్నీ మహిళల్లోనూ ఇప్పుడు గుండెజబ్బులను పెంచుతున్నాయి. గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాలు సన్నబారడం లేదా మూసుకుపోవడం వల్ల గుండెజబ్బులు వస్తాయి. కరొనరీ ఆర్టరీ డిసీజ్ అని పిలిచే ఈ జబ్బు గుండెపోటుకు దారితీస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళలపై ఈ ప్రమాదం పదేళ్లు ఆలస్యమవుతుంది. మెనోపాజ్ తర్వాత ఈ ముప్పు మరింత పెరిగే మాట వాస్తవమే. మెనోపాజ్ తర్వాత శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్ తగ్గి, చెడు (బ్యాడ్) కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ పెరుగుతాయి. పెరిగే వయసుతో అధిక రక్తపోటు కూడా మొదలవుతుంది. ఇవన్నీ గుండెజబ్బుల ముప్పును పెంచే అంశాలే. నడక వంటి వ్యాయామంతో పాటు ముందు నుంచీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వయసుతో నిమిత్తం లేకుండా గుండెజబ్బులను చాలావరకు అదుపులో ఉంచవచ్చు ప్రతిరోజూ కనీసం అరగంట నడక లేదా పరుగు లేదా ఏరోబిక్ వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. వారంలో కనీసం ఐదురోజులైనా ఈ వ్యాయామాలు చేయాలి ఆహారంలో ఉప్పును చాలా పరిమితంగా తీసుకోవాలి. పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయల మోతాదును పెంచాలి. అలాగే శాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి మీ మానసిక ఒత్తిడిని సాధ్యమైనంతగా తగ్గించాలి. రోజూ కనీసం ఓ పది నిమిషాలు ధ్యానం చేయాలి నూనెలను చాలా పరిమితంగా తీసుకోవాలి. వయసును బట్టి కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. ఇందుకోసం క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి గుండెజబ్బులకు దారితీసే అంశాలపై (రిస్క్ ఫ్యాక్టర్లపై) దృష్టి సారించాలి. ఉదాహరణకు అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, డయాబెటిస్ లాంటివి ఉంటే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ గుండెజబ్బులను నివారించుకుంటే వాటి వల్ల కలిగే ప్రమాదాన్నీ నివారించుకున్నట్లేనని తెలుసుకోండి. - డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. గర్భాశయంలో కణుతులు... తగ్గుతాయా? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నాకు కొంతకాలంగా రుతుస్రావం ఎక్కువరోజులు కొనసాగటం, అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడడంతో గైనకాలజిస్టును సంప్రదించాను. వారు స్కాన్ చేయించి నా గర్భాశయంలో కణితులు ఏర్పడ్డాయని, వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినా మళ్లీ ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. హోమియోతో ఈ వ్యాధి నయం అయ్యే అవకాశం ఉందా? - పి.పి.జె, మచిలీపట్నం చాలామంది స్త్రీలలో ఈ గర్భాశయ కణితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడడంతోపాటు వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడం వంటి చర్యలకు దారితీస్తుంది. తద్వారా వారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురికావడం జరుగుతుంది కానీ హోమియో చికిత్స ద్వారా ఈ వ్యాధికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండా పూర్తిగా నయం అయే అవకాశం ఉంది. సాధారణంగా గర్భాశయంలో ఏర్పడే కణితులను యుటిరైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయపు కండర కణజాలంతో ఏర్పడతాయి. 16-50 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలు ఈ వ్యాధి బారిన పడే అవకాశ ఉంది. నెలసరి ఆగిపోయిన మహిళలలో వీటి ప్రభావం తక్కువగా ఉంటుంది. సంతానోత్పత్తి వయస్సు గల వారినే ఇది ఎక్కువగా ప్రభావితం చేయడం వల్ల ఇది సంతానలేమికి కూడా దారితీస్తోంది. ఈ కణితులు ఒకటిగా లేదా చిన్న చిన్న కణితులు మిల్లీమీటరు మొదలుకొని కొన్ని సెంటీమీటర్ల పరిమాణం వరకు పెరుగుతాయి. గర్భాశయంలో ఇవి ఏర్పడే ప్రాంతపు ఉనికి, పరిమాణం రీత్యా వీటిని మూడు రకాలుగా విభజించడం జరిగింది. ఇన్ట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్: గర్భాశయం లోపలి గోడల మధ్యలో ఏర్పడే ఇవి చాలా సాధారణంగా కనిపిస్తాయి. సబ్ సీరోజల్: గర్భాశయం వెలుపలి గోడలపై ఏర్పడే ఈ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్ద పరిమాణంలో పెరిగే అవకాశం ఉంది. సబ్‌మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్: ఇవి గర్భాశయంలో ఉండే మ్యూకోజల్ పొరలో ఏర్పడి గర్భాశయపు కుహరంలోకి పెరుగుతాయి. కారణాలు: హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్యత వంటి అంశాల వల్ల ఇవి ఏర్పడే అవకాశ ఉంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల ఇవి ఏర్పడే అవకాశ ఉంటుంది. నెలసరి ఆగిపోయిన మహిళలలో ఈ హార్మోన్ ఉత్పాదన తక్కువగా ఉండటం వల్ల అవి కుచించుకుపోతాయి. స్థూలకాయం, మద్యపానం, కెఫీన్ వాడకం వంటి అంశాలు ఈ కణితులు ఏర్పడటాన్ని ప్రేరేపిస్తాయి. లక్షణాలు: రుతుస్రావం ఎక్కువ రోజులపాటు కొనసాగడం, అధిక రక్తస్రావం కావడం, రెండు రుతుచక్రాల మధ్యలో రక్తస్రావం అవడం, నడుమునొప్పి, కడుపులోనొప్పి, కాళ్లలో నొప్పి. అధిక రక్తస్రావం మూలంగా రక్తహీనత ఏర్పడటం. తరచు మూత్రానికి వెళ్లాల్సి రావడం, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటివి. చికిత్స: హోమియోలో అందించే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సావిధానం ద్వారా ఈ గర్భాశయ కణితులను పూర్తిగా కరిగించడమే కాకుండా, హార్మోన్ల అసమతుల్యతను, రుతుచక్రాన్ని సరిచేయడం ద్వారా వ్యాధి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మళ్లీ వ్యాధి తిరగబెట్టకుండా సంపూర్ణంగా నయం అవుతంది. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
కుర్చీలకు అతుక్కుపోతే... ఖల్లాస్!
టెన్ టు ఫైవ్ జాబ్! ఉదయం 10 గంటలకు వెళితే, సాయంత్రం అయిదింటికల్లా ఎంచక్కా ఇంటి ముఖం పట్టేయడానికి వీలుండే ఉద్యోగం! సినిమాకెళ్ళాలన్నా, షికారుకెళ్ళాలన్నా... సాయంత్రం సమయమంతా మన చేతుల్లోనే! జీవిత భాగస్వామితో తీరికగా గడపడానికీ, పిల్లల్ని దగ్గరుండి చదివించుకోవడానికీ ఇంతకు మించి వీలున్న టైమ్ ఇంకేం ఉంటుంది. నిజమే! కానీ, టెన్ టు ఫైవ్ జాబ్ అంటూ... ఆఫీసులో పూర్తిగా కుర్చీలకే అతుక్కుపోయి కదలకుండా గడిపేస్తున్నారా? కాగితాల దగ్గర నుంచి కాఫీ దాకా ప్రతీదీ ఆఫీస్ బాయ్ తీసుకువస్తుంటే, కూర్చొన్నచోట నుంచి కదలడం లేదా? పోనీ ఎంతసేపూ పని... పని... అంటూ కంప్యూటర్‌కే కళ్ళప్పగించి, కుర్చీలో నుంచి లేవడం లేదా? అయితే, మీరు వెంటనే మీ పని తీరు మార్చుకోవాల్సిందే! ఇలా ఒళ్ళు కదలకుండా ఒకే చోట ఉండిపోయే జీవనశైలి ఇటీవల పెరిగిపోతున్నట్లు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రకమైన జీవనశైలి వల్ల ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నాయి. అటూ ఇటూ తిరుగుతూ చురుకుగా పని చేయకుండా, సుద్దపప్పులా ఒకే చోట కూర్చొండిపోతే, సగటు ఆయుః ప్రమాణం కన్నా ముందుగానే కన్నుమూసే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నాయి. బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో దాదాపు పది లక్షల మంది వయోజనులపై, ఏకంగా 16 అధ్యయనాలు జరపగా తేలిన సారాంశం ఇది. ఇలా కుర్చీలకే అతుక్కుపోవడమనేది ఇప్పుడు ‘విశ్వవ్యాప్తమైన మహమ్మారి’ అని అధ్యయనవేత్తలు ప్రకటించారు. శారీరకంగా శ్రమ చేయకపోవడమనేది ‘ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సమస్య’ అని స్పష్టం చేశారు. ఇవి వస్తాయ్! ఇలా చేస్తే పోతాయ్! కదలకుండా ఒకేచోట కూర్చొని పని చేసే శైలి వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, టైప్ 2 డయాబెటిస్, మతిమరుపు, చివరకు క్యాన్సర్ కూడా రావచ్చని తేలింది. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం లేని ఈ రోగాలు రావడానికి ప్రధాన కారణం - శారీరక శ్రమ చేయకపోవడమే అని బ్రెజిల్‌కు చెందిన ఒక పరిశోధక డాక్టర్ గారు ప్రకటించారు. అందరూ చెప్పుకొనే స్థూలకాయ సమస్యలాగా ఇది పైకి కనిపించదు కానీ, నిజానికి అంత కన్నా పెద్ద సమస్య. మన దేశంలో ఏటా దాదాపు 90 వేల మంది చురుకుదనం లేని జీవనశైలి వల్ల ఇలాంటి రోగాలు వచ్చి, చనిపోతున్నారట! అదే గనక ప్రపంచవ్యాప్తంగా చూస్తే, 53 లక్షల మంది మరణిస్తున్నారట! ఇది దాదాపుగా ధూమపాన వ్యసన బాధితులై, మరణిస్తున్నవారి సంఖ్యకు సమానం. గట్టిగా మాట్లాడితే, ఇవన్నీ నివారించదగిన రోగాలే! వీటి ముప్పు తప్పించుకోవడానికి కూడా ఒక చిట్కా ఉంది. రోజూ కనీసం ఎనిమిది గంటల పాటు ఇలా కూర్చొని పనిచేస్తుంటే, తద్వారా వచ్చే ముప్పు తప్పించుకోవడానికి కనీసం రోజూ ఒక గంట పాటు శారీరక వ్యాయామం చేయాలి. ఆ మాట కూడా అధ్యయనవేత్తలు చెబుతున్నారు. అలాగని శారీరక వ్యాయామం అంటే, మరీ బెంబేలెత్తాల్సిన అవసరం ఏమీ లేదు. వేగంగా నడవడం, కాసేపు బైక్ రైడింగ్ చేయడం, సైక్లింగ్ లాంటి సింపుల్ పనులు చేసినా చాలట! ఇలా శారీరక వ్యాయామం చేయడం వల్ల వయసు మీద పడకుండానే రకరకాల వ్యాధులతో చనిపోయే ప్రమాదం కనీసం 60 శాతం మేర తగ్గుతుంది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం వారు తమ తాజా అధ్యయనంలో తేల్చిన విషయం ఇది. చురుకుగా పని చేయకుండా అలా కూర్చొండిపోవడం అలవాటు అయితే, 20 ఏళ్ళ కాలవ్యవధిలో మరణానికి దగ్గర అవుతారట! అదే గనక రోజూ కనీసం 60 నుంచి 75 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. రోజూ రెండు గంటలు వ్యాయామం చేయగలిగితే, మరీ బెస్టు! మొన్న మొన్నటి దాకా అయితే, రోజుకు కనీసం 30 నిమిషాల వంతున వారానికి అయిదు రోజుల పాటు వేగంగా నడవడంతో సహా ఎక్సర్సైజ్ చేస్తే మేలని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యు.హెచ్.ఒ) సిఫార్సులు పేర్కొన్నాయి. అయితే, ఒళ్ళు అలవని పని శైలి అన్నది ప్రపంచవ్యాప్త మహమ్మారి అయిందని కొత్త అధ్యయనాలు వెల్లడించడంతో, సిఫార్సులు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రోజూ అరగంట బదులు, అంతకు రెట్టింపు సమయం ఎక్సర్సైజ్ చేయమనాల్సి వచ్చింది. కూర్చొనే ఉంటే ఏమవుతుందట? ఒంటికి శ్రమ ఇవ్వకుండా కదలకుండా కూర్చోవడం, దానికి తోడు వ్యాయామం కూడా చేయకపోతే - బరువు పెరగడం ఖాయం. దాంతో, స్థూలకాయం వస్తుంది. పైగా, చురుకుగా, హుషారుగా పనిచేయకపోవడం వల్ల శరీరానికి శ్రమించే అలవాటు తప్పుతుంది. మన శారీరక వ్యవస్థ కూడా బద్ధకంగా తయారవుతుంది. రోజూ చేయాల్సిన జీవక్రియల్లో కూడా సత్తా తగ్గుతుంది. ఊపిరితిత్తులతో గాలి పీల్చుకొనే సామర్థ్యం తగ్గుతుంది. మనం ఊపిరితిత్తుల ద్వారా పీల్చే గాలిని బట్టే ఆక్సిజన్‌తో కూడిన రక్తం మన శరీర అవయవాలకు అందుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. అలాగే, మన జీర్ణక్రియ, గ్లూకోజ్ - ఫ్రక్టోజ్‌లుగా చక్కెర విడిపోవడం లాంటివన్నీ కూడా ఇబ్బందుల పాలవుతాయి. ఈ క్రియారాహిత్యం వల్ల దీర్ఘకాలంలో ఇంకా సమస్యలు వస్తాయి. కీళ్ళనొప్పుల లాంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. తీరిక లేదా? ఇలా చేయండి! నిజం చెప్పాలంటే - ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలనీ, మరొకటనీ... డెస్క్ జాబ్ చేసేవాళ్ళు పెరిగిపోయారు. ఎక్సర్సైజ్ చేయడానికి రోజుకు ఒక గంట విడిగా తీరిక దొరకడం లేదని కొందరు వాపోతుంటారు. వాళ్ళకీ ఒక ఉపాయం ఉంది. ఇలా డెస్క్ జాబ్ చేసేవాళ్ళందరూ రోజూ ఉదయం పూట కాసేపు రన్నింగ్ చేయాలి. లేదంటే, సైకిల్ తొక్కడమో, ఆఫీసు దగ్గరైతే సైకిల్ మీద వెళ్ళి రావడమో చేయాలి. అందరూ ఆచరించదగిన మరో చిట్కా ఏమిటంటే - ఆఫీసులో ఉన్నప్పుడు కుర్చీకే పరిమితం కాకుండా, ప్రింట్ తీసుకోవడం కోసం ప్రింటర్ దాకా స్వయంగా వెళ్ళి, రావడం అలవాటు చేసుకోవాలి. ప్రతి గంటసేపటికీ ఒక అయిదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. అప్పుడు కంప్యూటర్ ముందు నుంచి, కుర్చీలో నుంచి లేచి, సెక్షన్లో కాస్త అటూ ఇటూ పచార్లు చేసి, కాళ్ళు సాగదీయాలి. కప్పు కాఫీ తాగే మిష మీద అయినా లేచి, కాఫీ మిషన్ దిశగానో, ఆఫీసు బయట కాఫీ షాపు వైపో నాలుగు అడుగులు వేయాలి. మధ్యాహ్న భోజన సమయంలోనైనా అన్నం తిన్న తరువాత కాసేపు లేచి, అటూ ఇటూ తిరిగి రావాలి. అలా రోజూ కనీసం ఒక గంటసేపైనా శారీరక శ్రమ చేయాలి. దానివల్ల అనారోగ్యం బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మధ్యవయసు దాటినవారు, వృద్ధులు సర్వసాధారణంగా పెద్దగా శారీరక శ్రమ చేయరు. పైగా, ఎక్కువగా టీవీకే కళ్ళు అప్పగించేస్తుంటారు. అది కూడా రిస్కే! సో... తాజా ట్రెండ్‌ను గుర్తించి, శారీరక వ్యాయామానికి ఓటేయడం ఎంతైనా బెటర్! ముఖ్యంగా, డెస్క్ జాబ్‌కే పరిమితమైనవారు ఈ లేటెస్ట్ వరల్డ్‌వైడ్ ట్రెండ్‌ను గమనించడం ఆరోగ్యకరం! బమ్చిక్... బమ్చిక్... చెయ్యి బాగా! * తాజా పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే - మధ్యవయస్కులు శారీరకంగా ఫిట్‌గా ఉండడం మరీ అవసరం. ధూమపానం తరువాత వాళ్ళకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించేది - శారీరకంగా ఫిట్‌గా లేకపోవడమే! * రోజూ వ్యాయామం చేయాలి. ధూమపానం తరువాత అతి ఎక్కువ ప్రాణాంతకం - వ్యాయామం, శారీరక శ్రమ లేకపోవడమే! అలాగే, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ కన్నా దీనివల్లే ఎక్కువ మంది త్వరగా మరణించే ప్రమాదం ఉంది. * ఎక్కువ సేపు కదలకుండా కుర్చీకే అతుక్కుపోవడం తగ్గించాలి. అలాగే, వీలైనంత మేర శారీరక శ్రమ చేయాలి. * గాలి పీల్చుకొనే సామర్థ్యం పెరిగేలా ఊపిరితిత్తులతో వ్యాయామం చేయాలి. లేదంటే, వృద్ధాప్యం రావడాని కన్నా ముందే కన్ను మూసే ప్రమాదం ఎక్కువట! టీవీతోనూ తిప్పలు! ఆఫీసులో కదలకుండా కూర్చొని చేసే పని పద్ధతికి తోడు ఇటీవల ఇళ్ళల్లో చాలామంది అదే పనిగా టీవీ చూస్తూ, కూర్చుంటున్నారు. ఆడవారైనా, మగవారైనా రోజూ సగటున 3 గంటలు టీవీకి కళ్ళప్పగించి, కదలకుండా కూర్చుంటున్నారని ఒక లెక్క. పొగ తాగడం వల్ల ఎంతమంది అనారోగ్యం పాలవుతున్నారో, దాదాపు అంత మంది ఇలా క్రియారహితంగా, చలనం లేకుండా ఒకే చోట కూర్చోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే, స్థూలకాయం కన్నా ఇలా కదలక, మెదలక కూర్చోవడమే మరీ డేంజర్ అని అధ్యయనవేత్తలు కదలని కుర్చీ మీద ఒట్టేసి మరీ చెబుతున్నారు. రోజు మొత్తం మీద నాలుగేసి గంటల వంతున కదలకుండా కూర్చొనేవారితో పోలిస్తే, ఎనిమిదేసి గంటలు కుర్చీకే అతుక్కుపోయేవారికి ప్రమాదం 59 శాతం ఎక్కువట! -
ఆన్లైన్ బూతు వీడియోలతో ఆరోగ్య సమస్యలు!
హెల్త్ ల్యాబ్ విచ్చలవిడిగా బూతు వీడియోలు లభ్యం అవుతూ ఉండటం, టీన్స్ వయసులో ఉండే పిల్లలు వాటిని విపరీతంగా చూస్తూ ఉండటం వారికి కొన్ని రకాల శారీరక, మానసిక ఇబ్బందులు తెచ్చిపెడుతోందంటున్నారు డాక్టర్ యాంజెలా గ్రెగరీ. పైగా ఇప్పుడు సెల్ఫోన్లోనే వీటి లభ్యత పెరగడంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని యువత చూడగలుగుతోంది. వీటి కారణంగా కొత్తగా పెళ్లయిన యువకుల్లో పురుషాంగ స్తంభనలు కలగాల్సినంతగా కలగడం లేదని చెబుతున్నారు డాక్టర్ యాంజెలా. పదహారేళ్ల క్రితం నుంచి మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత ఐదేళ్ల నుంచి అంగస్తంభన సమస్యలతో మానసిక చికిత్సకు వస్తున్న పురుషులు సంఖ్య విపరీతంగా పెరిగింది. గతంలో డయాబెటిస్, గుండెజబ్బులు వంటి సమస్యల కారణంగా అంగస్తంభన వైఫల్యాలతో పురుషులు మానసిక నిపుణులను సంప్రదించేవారు. కానీ విచ్చలవిడిగా లభ్యమయ్యే పోర్న్ కారణంగా ఇప్పుడు యువతలో థ్రిల్ తగ్గిపోయి, అంతగా కోరికలు చెలరేగకపోవడంతో మానసిక నిపుణులను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు డాక్టర్ యాంజెలా. ఉదయం వేళల్లో వైరస్ సోకితే... ఫ్లూను కలిగించే ఇన్ఫ్లుయెంజా గానీ లేదా హెర్పిస్గానీ ఉదయం వేళలో సోకినట్లయితే, ఆ వైరస్ తీవ్రత సాధారణం కంటే ఎక్కువని పరిశోధనల్లో తేలింది. ఎలుకల విషయంలో జరిగిన పరిశోధనల్లో ఈ కొత్త విషయం తెలిసింది. ఉదయం వేళల్లో వైరల్ ఇన్ఫెక్షన్ శరీరాన్ని సోకితే, అప్పుడా వ్యాధి తీవ్రత మిగిలిన సమయాల్లో సోకినదాని కంటే 10 రెట్లు ఎక్కువని చెబుతున్నారు ప్రొఫెసర్ అఖిలేశ్ రెడ్డి. మన శరీరాల్లో నిర్ణీత వేళకు నిద్ర వచ్చేలా చేసే జీవగడియారం (సర్కాడియన్ రిథమ్) దెబ్బతిన్నవారిలో వైరస్ ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని తేలింది. -
కాలు కదిపినా గుండె జబ్బులు దూరం
గంటల కొద్ది ఒకేచోట కూర్చుంటే ఏమవుతుంది..? కాళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశమూ లేకపోలేదు. అందుకే కనీసం గంటకోసారైనా లేచి అటూ ఇటూ తిరగాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే తాజా పరిశోధనల ప్రకారం కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం, లేదా విమాన ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు కనీసం కాళ్లను కదిపినా చాలని, దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ శాస్త్రవేత్తలు. కొంతమంది యువకులపై చేసిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైందని చెబుతున్నారు. కాళ్లు కదిలించడం వల్ల కాళ్లలో రక్తప్రసరణ పెరుగుతుందని ముందుగానే ఊహించినప్పటికీ రక్తనాళాల సమస్యలను నివారించే స్థాయిలో ఉంటుందని మాత్రం అనుకోలేదని జామే పాడిల్లా అనే పరిశోధకుడు పేర్కొన్నారు. రోజుకు 3 గంటల పాటు కూర్చునే వారిలో కొందరిని ఒక కాలును కదిలిస్తూ ఉండాలని చెప్పగా, మరికొందరికి నిమిషం పాటు కదిలించి, ఆ తర్వాత నాలుగు నిమిషాలు కదల్చకుండా ఉండాలని చెప్పినట్లు వివరించారు. కాలు దిగువ భాగంలో ఉండే రక్తనాళాల్లోని రక్తప్రసరణ పరిశీలించగా ఎక్కువ సేపు కదిలించిన వారిలో ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. -
పాదం కదిపినా గుండె జబ్బులు దూరం
గంటల కొద్ది ఒకేచోట కూర్చుంటే ఏమవుతుంది..? కాళ్లకు రక్తప్రసరణ తగ్గుతుంది. దీంతో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశమూ లేకపోలేదు. అందుకే కనీసం గంటకోసారైనా లేచి అటూ ఇటూ తిరగాలని డాక్టర్లు సలహా ఇస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే తాజా పరిశోధనల ప్రకారం కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం, లేదా విమాన ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు కనీసం కాళ్లను కదిపినా చాలని, దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి రక్షించుకోవచ్చంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ శాస్త్రవేత్తలు. కొంతమంది యువకులపై చేసిన ప్రయోగాల ద్వారా ఈ విషయం స్పష్టమైందని చెబుతున్నారు. కాళ్లు కదిలించడం వల్ల కాళ్లలో రక్తప్రసరణ పెరుగుతుందని ముందుగానే ఊహించినప్పటికీ రక్తనాళాల సమస్యలను నివారించే స్థాయిలో ఉంటుందని మాత్రం అనుకోలేదని జామే పాడిల్లా అనే పరిశోధకుడు పేర్కొన్నారు. రోజుకు 3 గంటల పాటు కూర్చునే వారిలో కొందరిని ఒక కాలును కదిలిస్తూ ఉండాలని చెప్పగా, మరికొందరికి నిమిషం పాటు కదిలించి, ఆ తర్వాత నాలుగు నిమిషాలు కదల్చకుండా ఉండాలని చెప్పినట్లు వివరించారు. కాలు దిగువ భాగంలో ఉండే రక్తనాళాల్లోని రక్తప్రసరణ పరిశీలించగా ఎక్కువ సేపు కదిలించిన వారిలో ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. -
చంద్రుడి మీదకు వెళ్లిన వారికి హార్ట్ ఎటాక్!
వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాలలో మానవాళి దూసుకుపోతోంది. భూ ఉపగ్రహం చంద్రుడితో పాటు సౌరకుటుంబంలోని గ్రహాలు, ఇతర నక్షత్ర మండలాలపై సైతం మానవుడి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. విశ్వంలో భూమితో పాటు జీవులకు ఇంకేమైనా నివాసయోగ్య స్థలాలు ఉన్నాయా అని శాస్త్రవేత్తలు నిరంతర అన్వేషణ చేస్తున్నారు. అయితే.. అంతరిక్ష యాత్రికులకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. జేమ్స్ ఇర్విన్ అనే అంతరిక్ష యాత్రికుడు చంద్రుడిపై అడుగుపెట్టిన రెండేళ్ల తరువాత మొదటిసారి హార్ట్ ఎటాక్ బారిన పడ్డాడు. అయితే అప్పుడు నాసా డాక్టర్లు అతడి అంతరిక్ష యాత్రకు, హార్ట్ ఎటాక్‌కు ఎలాంటి సంబంధం లేదని.. ప్రీ ఫ్లైట్ టెస్టింగ్‌లో సైతం ఇర్విన్ హార్ట్ బీట్‌లో చిన్న చిన్న తేడాలు గుర్తించామని కొట్టిపారేశారు. తరువాత 61 ఏళ్ల వయసులో ఇర్విన్ హార్ట్ ఎటాక్తోనే మరణించాడు. అపోలో యాత్రలో ఇర్విన్ సహచరుడు రాన్ ఇవాన్స్ సైతం.. ఇర్విన్ మరణానికి ఏడాది ముందుగా, నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చి తన 56 ఏళ్ల వయసులోనే మృతి చెందాడు. చంద్రుడిపై మొదటిసారి కాలు మోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ సైతం 2012లో హార్ట్ ఎటాక్తోనే మరణించాడు. అమెరికాలో ప్రతియేటా సుమారు 6 లక్షల మంది హృదయ సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్నారు. ఆస్ట్రోనాట్లు సైతం గుండె, రక్తనాళాల సంబంధిత సమస్యలకు అతీతులు కారు. అయినప్పటికీ సాధారణ పౌరులలో గుండె జబ్బులతో మరణించే వారితో పోల్చినప్పుడు ఆస్ల్రోనాట్లలో ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ విషయంపై పరిశోధన జరిపిన ఫ్లోరిడా స్టేట్ యూనిర్సిటీ డాక్టర్ మైఖెల్ డెల్ప్ మాట్లాడుతూ.. శాంపిల్ పరిమాణం చిన్నదిగా ఉన్నందున దీనిని ఇప్పుడే నిర్ధారించలేమని, అయితే ఆస్ట్రోనాట్లకు.. గుండె సంబంధ వ్యాధులకు ఉన్న సంబంధాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించారు. -
కేన్సర్ కబళిస్తోంది..
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కేన్సర్‌తో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కేన్సర్ మరణాల్లో 34% మంది రొమ్ము, గర్భాశయ, నోటి క్యాన్సర్ల కారణంగానే సంభవిస్తున్నాయి. కేన్సర్‌తో మరణించే మహిళల్లో 26.4% మంది రొమ్ము, గర్భాశయ కేన్సర్ల కారణంగానే చనిపోతున్నారని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి.. రాష్ట్రాలకు పంపించింది. దీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రధానంగా కేన్సర్, గుండె జబ్బులు, మధుమేహం, హైబీపీ, వంటివి ఉన్నాయి. 2012లో దేశవ్యాప్తంగా 1.45 లక్షల మంది మహిళలు రొమ్ము కేన్సర్ బారినపడగా.. వారిలో 70,218 మంది చనిపోయారు. అలాగే ఏటా సగటున సుమారు 1.23 లక్షల మంది మహిళలు గర్భాశయ కేన్సర్ బారిన పడుతుండగా.. అందులో 67,500 మంది మరణిస్తున్నారు. ఇక 2012లో 77,033 మంది నోటి కేన్సర్ బారినపడగా.. 52,067 మంది చనిపోయారని గ్లోబోకెన్ నివేదికను కేంద్రం ప్రస్తావించింది. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 60% మరణాలు ఇటీవల యువకులు, మధ్య వయస్కులు కూడా మధుమేహం బారిన పడుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఐసీఎంఆర్-ఇండియాబీ (2014) అధ్యయనం ప్రకారం 6.24 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. అంతేకాదు మరో 7.7 కోట్ల మంది ప్రీ-డయాబెటిక్ స్థాయిలో ఉన్నారని స్పష్టం చేసింది. మరోవైపు 2008 లెక్కల ప్రకారం దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 26 శాతం గుండె సంబంధిత కారణాలతోనే చనిపోయారు. గుండె జబ్బుల కు ప్రధానంగా అధిక రక్తపోటు కారణంగా ఉంటోంది. పెద్ద వయసు వారిలో 32.5 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నట్లు అంచనా వేసింది. మొత్తంగా దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 60 శాతానికిపైగా దీర్ఘకాలిక రోగాలతోనేనని కేంద్రం వెల్లడించింది. ఇందులో 52 శాతం మందిని ప్రాథమిక స్థాయి జాగ్రత్తలతో కాపాడుకోవచ్చని స్పష్టం చేసింది. అనారోగ్యకర ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, పొగాకు ఉత్పత్తుల వినియో గం, ఆల్కహాల్, కాలుష్యం, ఒత్తిడి, పేదరికం, ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం వంటివి దీర్ఘకాలిక రోగాలకు ప్రధాన కారణాలుగా కేంద్రం పేర్కొంది. గ్రామస్థాయి వరకు ఆరోగ్య సేవల బలోపేతం ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా మూడు రకాల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. ఒకటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అందుకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం. రెండోది దీర్ఘకాలిక వ్యాధులను ముందే గుర్తించడం. మూడోది దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి చికిత్స చేయడం. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యాధులకు గురైన వారికి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆరోగ్యంపై అవగాహన, వ్యాధులను ముందే గుర్తించే కార్యక్రమాలు అమలుకావడం లేదని కేంద్రం పేర్కొంది. అందువల్ల రోగాల బారిన పడకుండా చూసేందుకు గ్రామస్థాయి వరకు ‘వెల్నెస్ కేంద్రాల’ను నెలకొల్పాలని సూచించింది.