
బీజింగ్: రోజు రోజుకు సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక గుండె జబ్బు నిర్ధారణ మరింత సులభతరం కాబోతుంది. సెల్ఫీలతో గుండె నిర్ధారణ ప్రక్రియను కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) ద్వారా కనుగొన్నట్లు యూరోపియన్ హర్ట్ జర్నల్‌లో కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. జర్నల్‌లోని వివరాల్లోకి వెళ్తె.. ఒకసారి గుండె జబ్బు నిర్దారణ అయ్యాక, ప్రతిసారి డాక్టర్ల దగ్గర చెకప్ చేసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం డాక్టర్లకు పేషెంట్ సెల్పీ పంపిస్తే చాలు, గుండె పనితీరును తెలుసుకోవచ్చు. కంప్యూటర్ ఆల్గరిథమ్ ద్వారా పేషేంట్ల ఫోటోలను, సెల్పీ ద్వారా విశ్లేషించి గుండె పనితీరును తెలుసుకోవచ్చని అధ్యయనకర్తలు తెలిపారు.
అయితే పేషేంట్లు సొంత స్క్రీనింగ్ కోసం, గుండె జబ్బుల పనితీరును అంచనా వేయడానికి ఈ అధ్యయనం తొలి అడుగని చైనాకు చెందిన వైద్య నిపుణుడు జీజీంగ్ అభిప్రాయపడ్డారు. కాగా ఈ అధ్యయనం చేసిన వారిలో జీజీంగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన స్పందిస్తు.. గుండె జబ్బుల ప్రమాదం అంచనా వేయడానికి, అధిక రిస్క్ ఉన్న పేషంట్ల చేకూర్చడమే అప్లికేషన్ ముఖ్య లక్ష్యమని తెలిపారు.ఈ అధ్యయనంలో జింగ్ 8 చైనా ఆస్పత్రుల నుంచి 5,796 పేషెంట్ల గుండె పనితీరును అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు.
చదవండి: సెల్ఫీ సోకు.. ప్రాణం మీదకు తెచ్చుకోకు..
Comments
Please login to add a commentAdd a comment