మహిళలకే కాదు.. మగవాళ్లకు కూడా..
మహిళలకే కాదు.. మగవాళ్లకు కూడా..
Published Sat, Oct 19 2013 4:08 PM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
ఎముకలకు సంబంధించిన వ్యాధుల రావడం మహిళల్లో సర్వసాధారణం. ముఖ్యంగా ఎముకలు గుల్లగా మారే (ఆస్టియోపోరోసిస్) వ్యాధి మహిళలకంటే 60 సంవత్సరాలు దాటిన పురుషులనే ఎక్కువగా ఇబ్బందికి గురిచేస్తుందని వైద్యనిపుణులు వెల్లడించారు. గతంలో ఎక్కువ శాతం మంది మహిళలు ఈ వ్యాధికి గురవుతూ ఉండేవారని.. అయితే తాజా గణాంకాలను పరిశీలిస్తే పురుషుల్లో ఎక్కువ మంది ఈ వ్యాధి పడుతున్నట్టు తెలుస్తోంది.
ఈ వ్యాధితో బాధపడే వారిలో 60 సంవత్సరాలు దాటిన పురుషులే ఎక్కువ మంది ఉన్నారని షాలీమార్ భాగ్ లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి చెందిన హేమంత్ గోపాల్ తెలిపారు. సాధారణంగా ఈ వ్యాధి 15 నుంచి 25 సంవత్సరాల లోపే సోకుతుందని.. అయితే శారీరకంగా పటిష్టంగా ఉండటం కారణంగా ఎలాంటి ఇబ్బందులు కనిపించవు. అయితే వయస్సు మీద పడిన తర్వాత ఈ వ్యాధి స్పష్టమైన ప్రభావం చూపుతుందన్నారు.
ఎముకలు పలచగా కావడం, కాల్షియం లోపించడంతో నడుము, మోకాళ్లు, భుజాల్లో ఉండే ఎముకలు విరిగిపోవడం ఆస్టియోపోరోసిస్ లక్షణం అని వైద్యులు వెల్లడించారు. గుండెకు సంబంధించిన వ్యాధి తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది ఆస్టియోపోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు 3.6 కోట్ల మంది ఉన్నారని పరిశోధనలో తెలింది.
ఈ వ్యాధితో బాధపడుతున్న వారు స్టెరాయిడ్స్ వాడకాన్ని తగ్గించాలని వైద్యులు సూచించారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఎముకలు విరిగాయనే సంగతి ఖచ్చితంగా తెలియదు. అందుకోసం 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఎముకల వైద్యుడిన సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.
Advertisement