సోడాతో గుండె జబ్బుల రిస్క్ రెండింతలు
లండన్ : సోడా తాగితే అరుగుదల బాగుంటుందని భావిస్తే పొరపాటే అంటున్నారు నిపుణులు..రోజుకు రెండు సోడా క్యాన్‌లు సేవిస్తే గుండె జబ్బుతో మరణించే ముప్పు రెండింతలు అధికమవుతుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. అధిక చక్కెర కలిగిన పానీయాలు సేవించే వారు గుండె పోటు, గుండె వైఫల్యం వంటి హృదయ సంబంధిత వ్యాధులతో మరణించినట్టు పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా రెండు సోడా క్యాన్లతో సమానమైన 24 ఔన్సుల సోడాను రోజూ సేవించిన వారు వీటిని తీసుకోని వారితో పోలిస్తే రెండింతలు అధికంగా గుండె జబ్బుల బారిన పడి మరణించే రిస్క్ రెండింతలుగా ఉన్నట్టు తేలిందని పరిశోధకులు చెప్పారు.
తీపిపదార్ధాలు అధికంగా తీసుకునే వారిలో మరణాల ముప్పు పెరిగినట్టు తాము గుర్తించలేదని తెలిపారు. చక్కెర అధికంగా ఉన్న పానీయాలతోనే గుండెకు ముప్పు అధికమని చెప్పారు.వీటిలో ఇతర పోషకాలు లేని కారణంగా శరీరంలో చక్కెర స్ధాయిలు అనూహ్యంగా పెరగడంతో జీవక్రియలపై సత్వర ప్రభావం ఉంటుందని 45 ఏళ్ల పైబడిన 17,930 మందిపై ఆరేళ్ల పాటు జరిపిన అథ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు డాక్టర్ వెల్ష్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment