గుండెకు బలం పెంచేందుకూ... టేస్టీ టేస్టీగానే తింటూ, గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పదార్థాలను తీసుకోవచ్చు. అవేంటో సవివరంగా తెలుసుకుందాం..!.
టొమాటోలలో ఉండే లైకోపిన్ అనే పోషకం గుండెకు చాలా మంచిది. ∙బచ్చలి, ΄ాలకూర లాంటి ఆకుకూరలన్నీ గుండెకు మంచి బలాన్నిస్తాయి.
విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల వంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్లీ పైనుంచి చక్కెర కలుపుకోకూడదు. దానిమ్మ గుండెకెంతో మేలు చేస్తుంది. యాపిల్ పండ్లు కూడా గుండెకు మంచివే.
బాదంపప్పు, అక్రోటు (వాల్‌నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినవచ్చు. వాటిలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది.
స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీల వంటి బెర్రీజాతి పండ్లు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి.
చేపల్లో గుండెకు మేలు చేసే ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ çసమృద్ధిగా ఉంటాయి. కాబట్టి అన్ని చేపలూ గుండె మేలు చేస్తాయి. అయితే సాల్మన్ ఫిష్ లాంటివి మరింత ఆరోగ్యకరం. వారానికి కనీసం రెండు సార్లయినా చేపలు... అందునా సాల్మన్‌ఫిష్ తింటే మేలు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేస్తోంది
పరిమితంగా తినే డార్క్ చాక్లెట్లతో గుండెకు మేలు జరుగుతుంది. వాటితో హైబీపీ, రక్తం గట్టకట్టుకు΄ోయే రిస్క్‌లు తగ్గుతాయి. అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీలతో గుండెకు మేలు చేకూరదు.
రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం గుండెకు మేలు చేస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment